కసవు మేసి వచ్చె పసుల మందలు వాటిలేగ లాశ దీర దాగె పాలుఓరి వేగ మింక తేర పో! పొదుగులందున్న పాలు బిండ దుత్త దెమ్ము!
శిష్ట్లా శర్మ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పార్వతమ్మ వినవె పాలకొఱతతీరెబాధ యుండబోదు పాప కికనుతరిపి గేదె యీనె దానికి పుట్టెనుదున్న , పాలు పిండ దుత్త దెమ్ము
విరించి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిచ్చి ముదిరె నాకు ప్రేమించితిని గాని తాళి చుట్టి నంత కేళి యనగ వెన్న తినగ పాము మన్నుతిన్న టులుండె దున్న పాలు పిండ దుత్తఁ దెమ్ము.
అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దుగుమ్మ రమ్ము! ముచ్చట్లు చాలింక!పచ్చ గడ్డి తేవె పండ్లు తోమి, ప్రొద్దు పోయె చాల, పోవలె వరిచేను దున్న, పాలు పిండ దుత్తఁ దెమ్ము!
ప్రభాకర శాస్త్రి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దన్నుగ భీష్మ కర్ణకృప ధన్వులు నాకడ గూడి యుండగాన్మిన్నగ పాండు సైన్యములు మేటిగ గెల్తురు నిక్కమంచునోకన్నయ చాలు కల్లలని గర్వి సుయోధను డాల మాడె,నీ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్
తిమ్మాజీ రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్నగ చోద్యమంట నిది నెన్నడు గాంచని వింతయే యనన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మికన్ మిన్నున మేఘముల్ విరిసె మేలగు వర్షము కుంభ వృష్టియై వెన్నయు క్షీరమున్ కుడువ వెన్నుని కేతగు ప్రీతి జెందగన్
చదువు సంధ్య మాని చవటయై తిరుగగాడుతనయు జూచి పలికె జనకు డిట్లువినుము రోరి శుంఠ! విజ్ఞాన హీనుడౌదున్న! పాలు పిండ దుత్తఁ దెమ్ముఅన్నయ! గాంచ వేల మన యావును గట్టున నున్నదానినిన్ మన్నన లంద యోగ్య యయి మానక పాల నొసంగు వానిలోమిన్నను, జాగదేల? యిక మిక్కిలి దూరము క్షేత్ర మిప్పుడున్ దున్నకు, దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్"హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా1 చూడబోడు దొరయె చుక్కల రేడాయె2 ఆజ్ఞలిచ్చువేడ్క యగును గొప్ప3 "దొర దొ దున్న యీనె" (పాలేరు) "దూడనా, పెయ్యరా!" (దొర)4 "దున్న!" (పాలేరు) "పాలు పిండ దుత్త దెమ్ము!!" (దొర)
డా.పిట్టాసున్నను జుట్టి వే బడుల జూడగ విద్దెల నమ్ముకోరె యెన్నన్నను నేడు వాసి గననేర్చునె యాశ్రమ పాఠశాలలేఅన్నియు బుట్టమున్గ గని యారడి జేయు విధాన మిద్దియే:"దున్నకు దూడ పుట్టినది""దుగ్ధము బిండగ దుత్త దెమ్మికన్"!
డా. పిట్టా వారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొగము వాచియుంటి మూడేండ్లు జున్నుకై ;ఎఱ్ఱ దూడ నీనె కర్రి బఱ్ఱె ;పడతి ! వేగరమ్ము ; కడవంటి పొదుగు నం దున్న పాలు పిండ దుత్త దెమ్ము .
బాపూజీ గారూ, శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
అన్నను జూచి పల్కినది యమ్మ ఒరే యిటు రమ్ము నీవు కూర్చున్నను సాగు టెట్లు పని జూడుము నీరును బెట్టి గేదెకున్కన్నె బిగించు జున్నిడెద కమ్మగ ముందుగ వేసి గడ్డి నా దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
మిస్సన్న గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రొద్దు పోయె నాకు పోవలెను పొలముదున్న, పాలు పిండ దుత్త దెమ్ము,రెండు జాము లపుడు మెండాకలిగనుండు సద్ది మూట దెమ్ము సమయ మరసి.
లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
.”ముయ్యి గలదు నేడు-మోహనపొలమునుదున్న”పాలుపిండ దుత్తదెమ్ముగంతులేయుచుండె|ముంతనుజూచియులేగదూడ దెలిపె|మూగభాష|| { ముయ్యి=ఒకరికొకరిసహాయము}
ఈశ్వరప్ప గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏరువాకసాగె ఏకాదశియెవచ్చెమేఘమాల వర్షరాగ మిడగవేళయైనదిపుడువెళ్ళగ పొలమునుదున్న, పాలు పిండ దుత్తతెమ్ము
శ్రీరామ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాడిపంట గల్గు పండితుడొక్కండుచదువు సంధ్య రాని ఛాత్రుబిల్చిపాఠమెటుల రాదు పనికైన తగుదువోదున్న! పాలుపిండ దుత్తదెమ్ము!
సీతాదేవి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వన్నెల లేగదూడలొకవైపున,జూడగ నాలమందలన్కన్నెలుగోపికాతతియె కౌస్తుభ ధారుని రెండువైపులన్కన్నుల విందుగాకనగ, గడ్డిని వేయుము గోపబాలుడాదున్నకు, దూడపుట్టినది దుగ్దము బిండగ దుత్తతెమ్మికన్వెన్నలదొంగకృష్ణునికి,వేగమె క్షీరపు విందునివ్వగా
ఆటలేన నీకు నన్నివేళలయందు చెవిని బెట్టవేళ చెప్పుమాట వేచియుంటినేను వినుమురా గాడిద! దున్న! పాలుపిండ దుత్తదెమ్ము.
హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జున్నుయె యిష్టముండదను చోద్యపు మాటల మానుమంటినేయన్నులమిన్న, నా సుత సుహాసిని కోరగ కొంటి గాదె యోకిన్నెర ! నేటి వేకువన గేదెయె యీనుచు జన్మమిచ్చెనేదున్నకు , దూడపుట్టినది దుగ్ధము బిండగ దుత్తతెమ్మికన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తరిపి పడ్డయీనె ధామమందునిపుడెపొదుగుచేపెఁ గనుము పోడిగానుచూచుచుంటివేల చోద్యముగ నడవిదున్న! పాలు పిండ దుత్తఁ దెమ్ము
సత్యనారాయణ రెడ్డి, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెల్లవారి పోయె తెలిమంచు విడిపోయెకూటి కొరకు గువ్వ గూటి నొదలెరేయి గడచి వెలుగురే డుదయించ ప్రొద్దున్న పాలు పిండ దుత్తఁ దెమ్ము
రఘురామ్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిన్నక నాగేశ్వరరావు.పసుల బయట గట్టి కసవునంతయు నూడ్చిౘద్ది యన్నము దిని ౘల్ల త్రాగివెళ్ళవలయునమ్మ వేగ మెట్ట పొలముదున్న ; పాలు పిండ దుత్త దెమ్ము.*****************************
నాగేశ్వరరావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉన్న గిన్నె నిండ నున్నది వేగమ్ముమారు ప్రశ్న లేల మగఁడ! మొదటియావు పాలె యింక యపరంపు గోవు కాదున్నపాలు పిండ దుత్తఁ దెమ్ము[కాదు+ఉన్న =కాదున్న]వెన్నును జూప నేరని సుభీమ పరాక్రమ భీమ పార్థులన్సన్ననఁ జేసి కౌరవుఁడు సంధికి నొప్పఁడు యుద్ధ భూమినింగ్రన్నన గెల్తు రంట యిక కాలుని యింటికిఁ బంపు వారఁ టేదున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
కామేశ్వరరావు గారూ, మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
విన్నువెలుంగు తీక్ష్ణమగు వీక్షణముల్ పచరించె, క్షేత్రమున్దున్నకు, దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్తిన్నగ గొడ్లపాకకును, తీయగ చిక్కటి ముర్రుఁ బాలు, చేపున్నది నిండుకుండవలె నుత్తమజాతి సవిత్రిగావుటన్(చేపు+ ఉన్నదిః చేపున్నది, సంధి సరియైనదో లేదో తెలియదు)
అన్నపరెడ్డి వారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెల్లవారి పోయె తిమిరారి యేతెంచెబంధుజనములంత పనుల బోయెపశుల మేపవలయు బడుకుంటి వేమిరాదున్న ! పాలు పిండ దుత్తఁ తెమ్ము!!!మొగము గడుగు కొంటి ముందుగా టీగాచుఅరచు చుండె నపుడె యావుదూడఇల్లుటాల! వినుము వెళ్ళెద పొలమునుదున్న, పాలుపిండ దుత్తఁ దెమ్ము!!!పక్క దులుపు కొనుచు పరుగుదీసె రజనితొవలసూడునిగన తూరుపింటతల్లి కొరకు దూడ నల్లాడి పోవు పొద్దున్న, పాలు పిండ దుత్త దెమ్ము!!!
శైలజ గారూ, మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు. 'పొద్దున్న' అనడం వ్యావహారికం.
ఓ సతి రైతుతో :పాలఁ బితుక నేడు నాలస్యమైనదికుడితి బెట్టి దాని కొమ్ము నిమురతన్నదసలు గేదె నన్ను మీరంటు ముందున్న, పాలు పిండ దుత్త తెమ్ము
సహదేవుడు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతి కర్ర తెమ్ము నేగెద పొలమునుదున్న పాలు పిండ దుత్త తెమ్మునటులె వచ్చునపుడు నావు పాలను పిండిదెచ్చెదనుగృహమునకు తీరు బడిగ.ఎదురుచూచు చుంటి నిన్ని నాళ్ళుగ నేనుగోవుతెచ్చి యింట కూర్మితోడపెంచు చూలు నయ్యె పెయ్యగాకిట పుట్టెదున్న,పాలు పిండ దుత్త తెమ్ము
ఉమాదేవి గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో 'గృహమునకు' అన్నచోట గణదోషం.
కఱ్ఱి యావు పొదుగు కడ వేచి యుంటి, యం దున్న పాలు పిండ దుత్త దెమ్ముయనుచు సేవకు గని యాన తివ్వ పరుగుపరుగు నతడు దెచ్చె పాత్ర యొకటి!
శ్రీధర రావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.'...దెమ్ము+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. '...దెమ్మ।టంచు...' అనండి.
అలాగే సవరిస్తానండి. ధన్యవాదములు.
దున్నపోతు పుట్టిందని చింత చేస్తూ పాలు పిండ డానికి దుత్తను తెచ్చుటకు ఇష్టపడని భర్తతో అతని ఇల్లాలు :అన్నువ కెప్పుడున్ సుతులె, యట్టులె గేదెకు పెయ్యదూడలన్నెన్నిన సాధ్యమే కలుగ? నింతటి స్వార్థము కూడదెన్నడున్నన్నియు సృష్టికిన్ వలయు, నంతరమేల మనింట పుట్టినన్దున్నకు? దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
సహదేవుడు గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
యజమాని నౌకరుతో..... గేదెఁ గడగలేదు , క్రింద నూడ్వగ లేదు , పేడ దీసి , తెలకపిండి గడ్డి తినగ నీయలేదు , తిట్టినా వినవురా ! దున్న ! పాలు పిండ దుత్తఁదెమ్ము !! " దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్క్రన్నన " యంచు పృచ్చకుడనంగ , వధానియు చింతఁజేయ , ముం... దున్న యొకండు చేతఁగొని నుత్సుకతన్ చరవాణి ,"యేది యెందున్నదటంచు" *సెల్ఫి* గొన నొక్కటి వేదికఁజేరె నవ్వగన్ !! ఎన్ని దినమ్ములిట్లు గమనింతువు నింగిని ? వాన రాదు ! నీ కన్నుల నీరు దక్క ! పలు కష్టములన్ బడి బీడు భూమిలో దున్నకు ! దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్నిన్ననె కొన్న గేదెకు .., *ననిశ్చితికంటెఫలమ్ము మేలు*! సం... పన్నత గల్గునమ్ముకొన పాలను ! నమ్ముము నాదు మాటలన్ !! శ్రీ కృష్ణుని సంధి వచనములను వినిన తరువాత దుర్యోధనుడు... అన్ని భయమ్ములున్ ముసిరినట్టులు , యుద్ధమనంగనేమొ నే.. ర్పన్నను కూనగా దలచి పల్కుట చెల్లునె యాదవాగ్రణీ! దున్నకు దూడ పుట్టినది "దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్ క్రన్నన" యన్న చందమిది! గాన రణమ్మొకటే శరణ్యమౌ !!
ఎన్నగ నేడు సైన్సు గననెంతయువృధ్ధినిచెందు వేళలన్పన్నుగ శాస్త్రవేత్త లటు బాగుగ శోధన చేయుచుండగానెన్నియొ వింతలేర్పడగనీ పరిణామక్రమమ్మునందునన్దున్నకు దూడబుట్టినది దుగ్ధము పిండగ దుత్తదెమ్మికన్వీటూరి భాస్కరమ్మ
ఆరయనొక్క పిచ్చియాసుపత్రినగల్గురోగులందునొకడు వాగెనిట్లుచూడుచూడుమచటచొప్పడెచోద్యమ్ముదున్నపాలుబిండ దుత్తదెమ్ము..వీటూరి భాస్కరమ్మ
డా}.పిట్టానుండిఆర్యా, ధన్యవాదములు, సమస్య ఒక సామెతను సూచించింది:
ధన్యవాదాలండీ.సవరించాను.ఇంతి కర్ర తెమ్ము నేగెద పొలమునుదున్న పాలు పిండ దుత్త తెమ్మునటులె వచ్చునపుడు నావు పాలను పిండిదెచ్చెద నుగృహమునకేను తీరు బడిగ.
అన్నకు కోర్కె తీరినది హాయిగ భామకు కాన్పుజేయగా మన్నన మీరగన్ పతికి మానిని కూర్చెను జంటకూతులన్ పన్నుగ నిండగన్ నెలలు పండుగ పూటను తెల్ల గేదెకున్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
పన్నుగ కాంగ్రెసీ తడవ పారగ ద్రోలెను చంద్రశేఖరున్!చెన్నుగ రామరావిటను చేతులు కాలగ పారిపోయెరా!కన్నియలార మీ కవిత కాంగ్రెసు జేరెను హారతియ్యరో!దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్!
కసవు మేసి వచ్చె పసుల మందలు వాటి
రిప్లయితొలగించండిలేగ లాశ దీర దాగె పాలు
ఓరి వేగ మింక తేర పో! పొదుగులం
దున్న పాలు బిండ దుత్త దెమ్ము!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పార్వతమ్మ వినవె పాలకొఱతతీరె
రిప్లయితొలగించండిబాధ యుండబోదు పాప కికను
తరిపి గేదె యీనె దానికి పుట్టెను
దున్న , పాలు పిండ దుత్త దెమ్ము
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పిచ్చి ముదిరె నాకు ప్రేమించితిని గాని
రిప్లయితొలగించండితాళి చుట్టి నంత కేళి యనగ
వెన్న తినగ పాము మన్నుతిన్న టులుండె
దున్న పాలు పిండ దుత్తఁ దెమ్ము.
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముద్దుగుమ్మ రమ్ము! ముచ్చట్లు చాలింక!
రిప్లయితొలగించండిపచ్చ గడ్డి తేవె పండ్లు తోమి,
ప్రొద్దు పోయె చాల, పోవలె వరిచేను
దున్న, పాలు పిండ దుత్తఁ దెమ్ము!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దన్నుగ భీష్మ కర్ణకృప ధన్వులు నాకడ గూడి యుండగాన్
రిప్లయితొలగించండిమిన్నగ పాండు సైన్యములు మేటిగ గెల్తురు నిక్కమంచునో
కన్నయ చాలు కల్లలని గర్వి సుయోధను డాల మాడె,నీ
దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగ దుత్త తెమ్మికన్
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఎన్నగ చోద్యమంట నిది నెన్నడు గాంచని వింతయే యనన్
రిప్లయితొలగించండిదున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండగ దుత్తఁ దెమ్మికన్
మిన్నున మేఘముల్ విరిసె మేలగు వర్షము కుంభ వృష్టియై
వెన్నయు క్షీరమున్ కుడువ వెన్నుని కేతగు ప్రీతి జెందగన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చదువు సంధ్య మాని చవటయై తిరుగగాడు
రిప్లయితొలగించండితనయు జూచి పలికె జనకు డిట్లు
వినుము రోరి శుంఠ! విజ్ఞాన హీనుడౌ
దున్న! పాలు పిండ దుత్తఁ దెమ్ము
అన్నయ! గాంచ వేల మన యావును గట్టున నున్నదానినిన్
మన్నన లంద యోగ్య యయి మానక పాల నొసంగు వానిలో
మిన్నను, జాగదేల? యిక మిక్కిలి దూరము క్షేత్ర మిప్పుడున్
దున్నకు, దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్"
హ.వేం.స.నా.మూర్తి.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండి1 చూడబోడు దొరయె చుక్కల రేడాయె
2 ఆజ్ఞలిచ్చువేడ్క యగును గొప్ప
3 "దొర దొ దున్న యీనె" (పాలేరు)
"దూడనా, పెయ్యరా!" (దొర)
4 "దున్న!" (పాలేరు)
"పాలు పిండ దుత్త దెమ్ము!!" (దొర)
డా.పిట్టా
రిప్లయితొలగించండిసున్నను జుట్టి వే బడుల జూడగ విద్దెల నమ్ముకోరె యె
న్నన్నను నేడు వాసి గననేర్చునె యాశ్రమ పాఠశాలలే
అన్నియు బుట్టమున్గ గని యారడి జేయు విధాన మిద్దియే:
"దున్నకు దూడ పుట్టినది""దుగ్ధము బిండగ దుత్త దెమ్మికన్"!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొగము వాచియుంటి మూడేండ్లు జున్నుకై ;
రిప్లయితొలగించండిఎఱ్ఱ దూడ నీనె కర్రి బఱ్ఱె ;
పడతి ! వేగరమ్ము ; కడవంటి పొదుగు నం
దున్న పాలు పిండ దుత్త దెమ్ము .
బాపూజీ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండిఅన్నను జూచి పల్కినది యమ్మ ఒరే యిటు రమ్ము నీవు కూ
రిప్లయితొలగించండిర్చున్నను సాగు టెట్లు పని జూడుము నీరును బెట్టి గేదెకున్
కన్నె బిగించు జున్నిడెద కమ్మగ ముందుగ వేసి గడ్డి నా
దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
మిస్సన్న గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రొద్దు పోయె నాకు పోవలెను పొలము
రిప్లయితొలగించండిదున్న, పాలు పిండ దుత్త దెమ్ము,
రెండు జాము లపుడు మెండాకలిగనుండు
సద్ది మూట దెమ్ము సమయ మరసి.
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
.”ముయ్యి గలదు నేడు-మోహనపొలమును
రిప్లయితొలగించండిదున్న”పాలుపిండ దుత్తదెమ్ము
గంతులేయుచుండె|ముంతనుజూచియు
లేగదూడ దెలిపె|మూగభాష|| { ముయ్యి=ఒకరికొకరిసహాయము}
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏరువాకసాగె ఏకాదశియెవచ్చె
రిప్లయితొలగించండిమేఘమాల వర్షరాగ మిడగ
వేళయైనదిపుడువెళ్ళగ పొలమును
దున్న, పాలు పిండ దుత్తతెమ్ము
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఏరువాకసాగె ఏకాదశియెవచ్చె
రిప్లయితొలగించండిమేఘమాల వర్షరాగ మిడగ
వేళయైనదిపుడువెళ్ళగ పొలమును
దున్న, పాలు పిండ దుత్తతెమ్ము
పాడిపంట గల్గు పండితుడొక్కండు
రిప్లయితొలగించండిచదువు సంధ్య రాని ఛాత్రుబిల్చి
పాఠమెటుల రాదు పనికైన తగుదువో
దున్న! పాలుపిండ దుత్తదెమ్ము!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వన్నెల లేగదూడలొకవైపున,జూడగ నాలమందలన్
రిప్లయితొలగించండికన్నెలుగోపికాతతియె కౌస్తుభ ధారుని రెండువైపులన్
కన్నుల విందుగాకనగ, గడ్డిని వేయుము గోపబాలుడా
దున్నకు, దూడపుట్టినది దుగ్దము బిండగ దుత్తతెమ్మికన్
వెన్నలదొంగకృష్ణునికి,వేగమె క్షీరపు విందునివ్వగా
శ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వన్నెల లేగదూడలొకవైపున,జూడగ నాలమందలన్
రిప్లయితొలగించండికన్నెలుగోపికాతతియె కౌస్తుభ ధారుని రెండువైపులన్
కన్నుల విందుగాకనగ, గడ్డిని వేయుము గోపబాలుడా
దున్నకు, దూడపుట్టినది దుగ్దము బిండగ దుత్తతెమ్మికన్
వెన్నలదొంగకృష్ణునికి,వేగమె క్షీరపు విందునివ్వగా
ఆటలేన నీకు నన్నివేళలయందు
రిప్లయితొలగించండిచెవిని బెట్టవేళ చెప్పుమాట
వేచియుంటినేను వినుమురా గాడిద!
దున్న! పాలుపిండ దుత్తదెమ్ము.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
జున్నుయె యిష్టముండదను చోద్యపు మాటల మానుమంటినే
రిప్లయితొలగించండియన్నులమిన్న, నా సుత సుహాసిని కోరగ కొంటి గాదె యో
కిన్నెర ! నేటి వేకువన గేదెయె యీనుచు జన్మమిచ్చెనే
దున్నకు , దూడపుట్టినది దుగ్ధము బిండగ దుత్తతెమ్మికన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితరిపి పడ్డయీనె ధామమందునిపుడె
రిప్లయితొలగించండిపొదుగుచేపెఁ గనుము పోడిగాను
చూచుచుంటివేల చోద్యముగ నడవి
దున్న! పాలు పిండ దుత్తఁ దెమ్ము
సత్యనారాయణ రెడ్డి,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెల్లవారి పోయె తెలిమంచు విడిపోయె
రిప్లయితొలగించండికూటి కొరకు గువ్వ గూటి నొదలె
రేయి గడచి వెలుగురే డుదయించ ప్రొ
ద్దున్న పాలు పిండ దుత్తఁ దెమ్ము
రఘురామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పసుల బయట గట్టి కసవునంతయు
నూడ్చి
ౘద్ది యన్నము దిని ౘల్ల త్రాగి
వెళ్ళవలయునమ్మ వేగ మెట్ట పొలము
దున్న ; పాలు పిండ దుత్త దెమ్ము.
*****************************
నాగేశ్వరరావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉన్న గిన్నె నిండ నున్నది వేగమ్ము
రిప్లయితొలగించండిమారు ప్రశ్న లేల మగఁడ! మొదటి
యావు పాలె యింక యపరంపు గోవు కా
దున్నపాలు పిండ దుత్తఁ దెమ్ము
[కాదు+ఉన్న =కాదున్న]
వెన్నును జూప నేరని సుభీమ పరాక్రమ భీమ పార్థులన్
సన్ననఁ జేసి కౌరవుఁడు సంధికి నొప్పఁడు యుద్ధ భూమినిం
గ్రన్నన గెల్తు రంట యిక కాలుని యింటికిఁ బంపు వారఁ టే
దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
కామేశ్వరరావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండివిన్నువెలుంగు తీక్ష్ణమగు వీక్షణముల్ పచరించె, క్షేత్రమున్
రిప్లయితొలగించండిదున్నకు, దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
తిన్నగ గొడ్లపాకకును, తీయగ చిక్కటి ముర్రుఁ బాలు, చే
పున్నది నిండుకుండవలె నుత్తమజాతి సవిత్రిగావుటన్
(చేపు+ ఉన్నదిః చేపున్నది, సంధి సరియైనదో లేదో తెలియదు)
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తెల్లవారి పోయె తిమిరారి యేతెంచె
రిప్లయితొలగించండిబంధుజనములంత పనుల బోయె
పశుల మేపవలయు బడుకుంటి వేమిరా
దున్న ! పాలు పిండ దుత్తఁ తెమ్ము!!!
మొగము గడుగు కొంటి ముందుగా టీగాచు
అరచు చుండె నపుడె యావుదూడ
ఇల్లుటాల! వినుము వెళ్ళెద పొలమును
దున్న, పాలుపిండ దుత్తఁ దెమ్ము!!!
పక్క దులుపు కొనుచు పరుగుదీసె రజని
తొవలసూడునిగన తూరుపింట
తల్లి కొరకు దూడ నల్లాడి పోవు పొ
ద్దున్న, పాలు పిండ దుత్త దెమ్ము!!!
శైలజ గారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'పొద్దున్న' అనడం వ్యావహారికం.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఓ సతి రైతుతో :
రిప్లయితొలగించండిపాలఁ బితుక నేడు నాలస్యమైనది
కుడితి బెట్టి దాని కొమ్ము నిముర
తన్నదసలు గేదె నన్ను మీరంటు ముం
దున్న, పాలు పిండ దుత్త తెమ్ము
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఇంతి కర్ర తెమ్ము నేగెద పొలమును
దున్న పాలు పిండ దుత్త తెమ్ము
నటులె వచ్చునపుడు నావు పాలను పిండి
దెచ్చెదనుగృహమునకు తీరు బడిగ.
ఎదురుచూచు చుంటి నిన్ని నాళ్ళుగ నేను
గోవుతెచ్చి యింట కూర్మితోడ
పెంచు చూలు నయ్యె పెయ్యగాకిట పుట్టె
దున్న,పాలు పిండ దుత్త తెమ్ము
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో 'గృహమునకు' అన్నచోట గణదోషం.
కఱ్ఱి యావు పొదుగు కడ వేచి యుంటి, యం
రిప్లయితొలగించండిదున్న పాలు పిండ దుత్త దెమ్ము
యనుచు సేవకు గని యాన తివ్వ పరుగు
పరుగు నతడు దెచ్చె పాత్ర యొకటి!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...దెమ్ము+అనుచు' అన్నపుడు యడాగమం రాదు. '...దెమ్మ।టంచు...' అనండి.
అలాగే సవరిస్తానండి. ధన్యవాదములు.
తొలగించండిదున్నపోతు పుట్టిందని చింత చేస్తూ పాలు పిండ డానికి దుత్తను తెచ్చుటకు ఇష్టపడని భర్తతో అతని ఇల్లాలు
రిప్లయితొలగించండి:
అన్నువ కెప్పుడున్ సుతులె, యట్టులె గేదెకు పెయ్యదూడల
న్నెన్నిన సాధ్యమే కలుగ? నింతటి స్వార్థము కూడదెన్నడు
న్నన్నియు సృష్టికిన్ వలయు, నంతరమేల మనింట పుట్టినన్
దున్నకు? దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
యజమాని నౌకరుతో.....
రిప్లయితొలగించండిగేదెఁ గడగలేదు , క్రింద నూడ్వగ లేదు ,
పేడ దీసి , తెలకపిండి గడ్డి
తినగ నీయలేదు , తిట్టినా వినవురా !
దున్న ! పాలు పిండ దుత్తఁదెమ్ము !!
" దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
క్రన్నన " యంచు పృచ్చకుడనంగ , వధానియు చింతఁజేయ , ముం...
దున్న యొకండు చేతఁగొని నుత్సుకతన్ చరవాణి ,"యేది యెం
దున్నదటంచు" *సెల్ఫి* గొన నొక్కటి వేదికఁజేరె నవ్వగన్ !!
ఎన్ని దినమ్ములిట్లు గమనింతువు నింగిని ? వాన రాదు ! నీ
కన్నుల నీరు దక్క ! పలు కష్టములన్ బడి బీడు భూమిలో
దున్నకు ! దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
నిన్ననె కొన్న గేదెకు .., *ననిశ్చితికంటెఫలమ్ము మేలు*! సం...
పన్నత గల్గునమ్ముకొన పాలను ! నమ్ముము నాదు మాటలన్ !!
శ్రీ కృష్ణుని సంధి వచనములను వినిన తరువాత దుర్యోధనుడు...
అన్ని భయమ్ములున్ ముసిరినట్టులు , యుద్ధమనంగనేమొ నే..
ర్పన్నను కూనగా దలచి పల్కుట చెల్లునె యాదవాగ్రణీ!
దున్నకు దూడ పుట్టినది "దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
క్రన్నన" యన్న చందమిది! గాన రణమ్మొకటే శరణ్యమౌ !!
ఎన్నగ నేడు సైన్సు గననెంతయువృధ్ధినిచెందు వేళలన్
రిప్లయితొలగించండిపన్నుగ శాస్త్రవేత్త లటు బాగుగ శోధన చేయుచుండగా
నెన్నియొ వింతలేర్పడగనీ పరిణామక్రమమ్మునందునన్
దున్నకు దూడబుట్టినది దుగ్ధము పిండగ దుత్తదెమ్మికన్
వీటూరి భాస్కరమ్మ
ఆరయనొక్క పిచ్చియాసుపత్రినగల్గు
రిప్లయితొలగించండిరోగులందునొకడు వాగెనిట్లు
చూడుచూడుమచటచొప్పడెచోద్యమ్ము
దున్నపాలుబిండ దుత్తదెమ్ము
..వీటూరి భాస్కరమ్మ
డా}.పిట్టానుండి
రిప్లయితొలగించండిఆర్యా, ధన్యవాదములు, సమస్య ఒక సామెతను సూచించింది:
ధన్యవాదాలండీ.సవరించాను.
రిప్లయితొలగించండిఇంతి కర్ర తెమ్ము నేగెద పొలమును
దున్న పాలు పిండ దుత్త తెమ్ము
నటులె వచ్చునపుడు నావు పాలను పిండి
దెచ్చెద నుగృహమునకేను తీరు బడిగ.
అన్నకు కోర్కె తీరినది హాయిగ భామకు కాన్పుజేయగా
రిప్లయితొలగించండిమన్నన మీరగన్ పతికి మానిని కూర్చెను జంటకూతులన్
పన్నుగ నిండగన్ నెలలు పండుగ పూటను తెల్ల గేదెకున్
దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్
పన్నుగ కాంగ్రెసీ తడవ పారగ ద్రోలెను చంద్రశేఖరున్!
రిప్లయితొలగించండిచెన్నుగ రామరావిటను చేతులు కాలగ పారిపోయెరా!
కన్నియలార మీ కవిత కాంగ్రెసు జేరెను హారతియ్యరో!
దున్నకు దూడ పుట్టినది దుగ్ధముఁ బిండఁగ దుత్తఁ దెమ్మిఁకన్!