14, జులై 2017, శుక్రవారం

సమస్య - 2410 (సీతాపతి యన్న నెవఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ"
(లేదా...)
"సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా శ్రీకంఠుఁడే శంభుఁడే"

93 కామెంట్‌లు:

  1. త్రేతా యుగమున వెలసెను
    సీతా పతిరా ముడనగ శీఘ్రము దెలియున్
    ఈతా వున జూడంగను
    "సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ"
    (సీత=సురగంగ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      సీత శబ్దానికి ఉన్న అర్థాంతరంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. శీతల కైలాసమ్మున
    శీతలుడుగ "శివుడు" "శుభము" జేశెడి వాడే;
    సీతా మాతకు విభుడై
    సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ

    శివ = శుభము (శబ్ద రత్నాకరము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      శివు డంటే శుభంకరుడన్న వ్యుత్పత్త్యర్థాన్ని స్వీకరించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  3. తాతల రాతల మార్చగ
    శీతనగంబున దుముకుచు చిందులు వేయన్
    మాతను శిఖలను జుట్టిన
    సీతాపతి యన్ననెవడు శివుడే సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      సీత శబ్దానికి గంగ అన్న అర్థాన్ని స్వీకరించి చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. వాతాత్మజు దైవంబెది?
    గీతామృతమిచ్చెనాడు- కృష్ణుండేగా?
    ప్రేతాత్మల దిక్కెవ్వడు?
    సీతాపతి యన్ననెవడు శివుడేసుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      క్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని రెండవ ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అంతగా పొసగినట్లు లేదు.

      తొలగించండి
    2. చేతోహరుడెన్టియారు సినిమా హీరో.
      NTRగారిని అందఱూ అన్న అనేవారుగదా.
      అన్న నెవరు అన్న ప్రశ్నకు పై సమాధానం సరిపోతుందా?
      క్రమాలంకారంలో సమస్య పూరించేటప్పుడు పూరణలో అన్నీ ప్రశ్నలే ఉంటాయిగదా మధ్యలో ఒక సమాధానం ఉండవచ్చా? దయచేసి చెప్పండి

      తొలగించండి
  5. ఏతావాతా గాంచిన
    సీతాపతి యన్న నెవడు శివుఁడే సుమ్మీ
    పాతది పార్వతి సగమట
    భూతముల నడుమ నుండి బూదిని పూయన్

    రిప్లయితొలగించండి
  6. కొందరు తాగుబోతులు వైష్ణవ గురువు తాతాచార్యులతో
    వీతాచారులు కొందరు
    తాతాచార్యుల యెదుటను తాగిన నాల్కన్
    భూతావేశమున ననిరి
    "సీతాపతి యన్న నెవడు? శివుడే సుమ్మీ."

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      తాగుబోతుల పరిహాస వాక్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  7. భూతలమున నిర్భాగ్యుల
    కూతంబును లేనివారి కురురుగ్మతతో
    కాతరు లగు వారలకును
    సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ.

    హ.వేం.స.నా.మూర్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      విరుపుతో సంబోధనను సాధించి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  8. డా.పిట్టా
    సీతను1యాం(ఆం).ప్ర.2ను జీల్చన్
    చేతనతన3 శివుని శరపు ఛేదన గనుటా
    చేతకు నధినాయకుడౌ
    "సీతాపతి" యన్ననెవరు? శివుడే 4సుమ్మీ!
    (1నాగలిచాలుతో,2ఆం.ప్ర..ఆంధ్రప్రదేశ్,3 చైతన్యమనగా,4చంద్రశేఖరుడు,కే.సీ.యార్)

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    ఏతావాతగ రామునే గొలుతురే యీనాటి భార్యామణుల్
    మాతా ,గర్భిణి సీతనే యడవికిన్ మార్పించడే,యీతనిన్
    చూతామన్న సగంబు దేహమిడడే సోకుల్ గనండీ శివున్
    'సీతా'! నాథుడనంగ, నీవెరుగవా, శ్రీకంఠుడే, శంభుడే!!
    (భార్యతో నొకానొక భర్త ముచ్చటించుట)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణకు మీరు వివరణ ఇవ్వడం సుగమ మయింది.
      రెండవ పూరణలో 'చూతామన్న' అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.
      (అన్నట్టు... మీ పుస్తక ప్రచురణ ఎంత వరకు వచ్చింది? నేను ప్రస్తుతం హైదరాబాదులోని వృద్ధాశ్రమంలో ఉన్నాను).

      తొలగించండి
    2. డా.పిట్టా
      ఆర్యా,ధన్యవాదాలు.కాలేజీలోInspection జరుగుతున్నందున నేనుpress కు వెళ్ళలేదు.సై యంటే వారంలో పుస్తకం సిద్ధమౌతుంది.ఆపైన పోతన వి.పీఠంలో రిలీజ్ తేది న.బా.రె చేతిలో.మీకు తేదీ యిదియని తరువాత తెలుపగలను.Finalization అయింది.18౦ పేజీలు.

      తొలగించండి
  10. గీతను బోధించె శివుడు
    కోతిని కూల్చెనకులుడని కోతలు కోసెన్
    వాతూలుడు,తెల్పెనిటుల
    సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      ఉన్మత్తుని వాక్యంగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  11. *శీతల నగరాజ సుతకు*
    *భూతలమునజీవతతికి*
    *భూతాత్మలకున్*
    *చేతననిడుసురగంగకు*
    *సీతా!పతియన్న నెవడు*
    *శివుడే సుమ్మీ!*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ్ గారూ,
      సంబోధనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  12. ప్రీతిగ మేనున సగమున
    చూతుముగా యుమను భవుని సోయగమొప్పన్
    రీతిగ సతియన నామెయె
    సీతా! పతి యన్న నెవడు శివుడే సుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హనుమచ్ఛాస్త్రి గారూ,
      సంబోధనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. సీతా!మనలనువనమున
    ప్రీతినకాపాడువాడుప్రేమాస్పదుడౌ
    భూతదయాళువె నెరుగుము
    సీతా!పతియన్ననెవడుశివుడేసుమ్మీ!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దయాళువె యెరుగుము" అనండి. సీతా అన్న సంబోధన రెండుసార్లు వచ్చింది. పద్యాన్ని "నాతీ!" అని ప్రారంభిస్తే పునరుక్తి తొలగిపోతుంది.

      తొలగించండి
  14. మాతా భవాని గంగల
    తో '' తా ''పతిగా తిరుగక దూరి శ్మశానం
    బే తన తావన నెరుగ వి
    సీ ''తా'' పతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణారావు గారూ,
      విలక్షణమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. 9493846984  డా.బల్లూరి ఉమాదేవి


    త్రేతాయుగమున రాముడు

    త్రేతాగ్నులు నేత్రములుగ తిరిగెడి వాడీ

    భూతలముననరయంగా

    సీతాపతి యన్ననెవడు శివుడే సుమ్మీ.


    వాతాత్మజుండు నుడివెను

    సీతాపతి యన్న నెవడు శివుడేసుమ్మీ

    తా తాపసివలె నున్నను

    చేతము నలరించుచుండె సీతమ్మ నటన్.

    రిప్లయితొలగించండి
  16. చేతల భగీరథుండట
    తాతలు పుణ్యగతులంద తపమొనరించన్
    ప్రీతిగ శిరమున దాల్చఁగ
    సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ!

    రిప్లయితొలగించండి


  17. గీతను దెలిపిన దెవ్వడు
    కోతుల సాయమును పొంది కువలయమందున్
    దూతకు నుంగురమిచ్చిన
    సీతాపతి యన్న నెవడు శివుడేసుమ్మీ

    భీతావహుడై యడిగెను
    సీతాపతి యన్న నెవడు శివుడేసుమ్మీ
    నీ తామసబుద్ధినణచి
    సీతామాతను గొనియెడు శ్రీరాముండే.


    రిప్లయితొలగించండి
  18. భార్యతో భర్త మాటలు
    భ్రాతన్గూడి యరణ్యమందు సతితో బాధలన్ పొందెనే యా
    సీతానాథుఁ డనంగ నీవెఱుఁగవా, శ్రీకంఠుఁడే, శంభుఁడే"
    భూతేసుండును, శూలపాణి , మ్రుడుడున్,భూరి, జోటింగుడున్,
    మాతంగీ భవుడై న నొక్క డుగదా మౌలిలో కోర్కెతీర్చన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది.
      సమస్య పాదం తప్ప మిగతా మూడు పాదాలలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  19. 14.07.2017.శంకరాభరణము.
    సమస్య: సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ.
    పూరణ: ప్రాతః స్మరణీయులు కద
    సీతాపతి, యన్న, నెవడు? శివుడే సుమ్మీ,
    త్రాతయు,భ్రాత,విధాతయు,
    నేతీరున బిల్వనేమి,యీశుండతడే.

    రిప్లయితొలగించండి
  20. సీతాపతి నడిగె నొకడు
    “చేతోభవ సంహరణము చేసెనెవండ్రో?”
    “భూతంబుల నాథుడు” యనె
    సీతాపతి, “యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రఘురామ్ గారూ,
      మీ ప్రశ్నోత్తరాల పూరణ చాలా బాగుంది. అభినందనలు.
      'నాథుడు+అనె' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "నాథుం" డనె... అనండి. అలాగే "చేసె నెవండో" అనండి.

      తొలగించండి
  21. రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్కృష్టంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణలో "లోకాతీతముగ నర్ధతనువున" అంటే ఎలా ఉంటుంది? ఎందుకో 'సగతనువునన్' అన్నది కర్ణపేయంగా లేదు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణ చాలా బాగుంది. ధన్యవాదములు. సవరించితిని.
      అఖండ యతి విసర్జనార్థము వృత్తములోని నాల్గవ పాదమును సవరించితిని. పరిశీలించ గోర్తాను.

      నాతి నొకర్తిని నెత్తినఁ
      బ్రీతి మరియొక తరలాక్షిఁ బెట్టెను లోకా
      తీతముగ నర్ధ తనువున
      సీతా! పతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ

      ధాతౄక్థంపు బలుండు రావణుని బాధం బార్వతీ నాథుడే,
      సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా, శ్రీకంఠుఁడే శంభుఁడే
      ప్రీతిం దీర్చును భక్తవత్సలుఁడు సంవేదమ్ము పౌలస్త్యు ద
      ర్పాతిప్రాభవ కారణం బిదియ సత్యంబయ్య విశ్వమ్మునన్

      [ఋక్థము = పితృధనము; త్రిమూర్తుల ప్రస్తావన వచ్చినది యాదృచ్ఛికముగా!]

      తొలగించండి
    3. కామేశ్వరరావు గారూ,
      నా సవరణను ఆమోదించినందుకు సంతోషం, ధన్యవాదాలు.
      సవరించిన మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  22. ప్రాత: కాలము నిత్యము
    ప్రీతిన్ బార్థించు హరిని విమలాత్మతతో
    నాతడె గలడందరిలో
    సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ.

    రిప్లయితొలగించండి
  23. సీతా వెడ్సు మహేశని
    భూతలమున ఫ్లెక్సి జూచి ముదమున కవితా
    రీతిని చమత్కరింపగ
    సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ !!


    శివస్య హృదయం విష్ణుః
    విష్ణోశ్చ హృదయం శివః !!


    భూతావాసుడు వాసుదేవుడు స్వయంభూశ్శంభురాదిత్యులున్
    భూతాత్ముండును శర్వుడున్ శివుడు విష్ణుండే యనెన్ నామముల్ !
    ప్రీతింగాంచిన శైవకేశవులకున్ భేదమ్ము గన్పింపదే !
    సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా శ్రీకంఠుఁడే శంభుఁడే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతను, నా సోదరిని,
      న్నాతడు పెండ్లాడె బావ నాగేశ్వరుడే
      కోతలు కావివి మురళీ!
      సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ

      ...శంకరాభరణ బ్లాగు రచయిత్రి "డాక్టర్ గుఱ్ఱం సీతా దేవి" నా చెల్లెలు...బావగారి పేరు: "ఓరుగంటి నాగేశ్వర శర్మ"

      తొలగించండి
    2. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      ******
      ప్రభాకర శాస్త్రి గారూ,
      పరిచయాత్మకమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  24. గురువు గారు క్షమించండి త గణము బదులు ర గణము వ్రాసాను శార్దూలము నెదుర్కొనుట ఇదీ మొదటి సారి. తిరిగి ప్రయత్త్నము చేశాను పరిశీలించండి

    భ్రాతన్గూడి యరణ్యమందు విఖురుల్ ప్రాణాo తకుండైన యా
    సీతానాథుఁ డనంగ నీవెఱుఁగవా , శ్రీకంఠుఁడే, శంభుఁడే
    భూతేసుండును,శూలపాణి,మ్రుడుడున్,బుద్నుండు, ఖట్వాంగుడున్
    మాతంగీ భవుడైన నొక్కడు గదా మౌలిన్శుభంబుల్ నిడన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య కుమార్ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. "శుభాలివ్వగన్" అనండి.

      తొలగించండి
  25. భూతలనాథుడు రాముడు
    సీతాపతి యన్న, నెవడు?శివుడేసుమ్మీ
    పీతాంబరధారి యనిన
    చేతోంశువు నేత తాత చిన్మయుడతడే!!!

    రిప్లయితొలగించండి
  26. శీతాచలసుత! ముమ్మా
    రా తారకనామమనిన నగువేమార్లున్!!
    పాతకములు తొలగించును
    సీతాపతి! యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ!!

    రిప్లయితొలగించండి
  27. ఆ తాపమ్మును బాపి యెల్లరకు తానానందమున్ గూర్పుచున్
    పాతాళమ్మున భూతలమ్మున దివిన్ పాపాలవో నాడుచున్
    చేతమ్మయ్యది పుల్కరింప భువిలో చెన్నారె నా పుణ్య కా
    సీ తానాధుడనంగ నీ వెఱగవా శ్రీకంఠుడే శంభుడే
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  28. ఆ తాపసులైనను జన
    వ్రాతమ్ములుయైన వాసిగా విష్ణుండే
    చేతమ్మున శివుడందురు
    సీతా పతి యన్ననెవరు శివుడే సుమ్మీ
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  29. భూతల నాధుడు రాముడు
    భూతములబ్రియుడు శివుండు భోగము గూర్చన్
    చేతల నిరువురు నొకటే
    సీతాపతి యన్ననెవడు శివుడే సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  30. సీతాపతి సఖి గంగను
    చేతుల ముడిని బెన వేసి జేయన్ సతిగా
    ప్రీతిన్ గనుచు జనులనిరి
    సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    భూతల మందున్నొరిగెడి
    సీతను థమ్మిల్లమందు చేకొని నంతన్
    ప్రీతిని నామెను జుట్టిన
    సీతాపతి యన్న నెవరు శివుడే సుమ్మీ!

    రిప్లయితొలగించండి
  32. ఆర్యా
    నేను తెలుగు పద్యాల ను వ్రాస్తున్నాను
    సమస్యా పూరణ ల ను నేర్చుకొనుచున్నాను.దయచేసి త ప్పులను సవరిoచదరని మనవి.
    నేటి సామస్యా పూరణ
    ప్రేతాత్మలకు శంభుడు
    భూత దయన్ జూపును గద,భూత యుగమున్
    వాతాత్మజుoడ ననెరా
    సీతా పతి యన్న నెవడు శివుడే సుమీ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రావు గారూ,
      శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
      మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. నిరుత్సాహ పడకుండా పద్యరచన కొనసాగించండి. తొందరలోనే మిగిలిన కవిమిత్రులతో సమానంగా నిర్దోషంగా, ధారాశుద్ధితో వ్రాయగలరు. ఉత్సాహం, అభ్యాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు. స్వస్తి!
      మీ పద్యంలో మొదటి రెండు పాదాలలో గణదోషం ఉంది. "ప్రేతాత్మలకున్... యుగమునన్/యుగమ్మున్" అంటే గణదోషం తొలగిపోతుంది.
      మీరు వ్ర్రాయగలరు.

      తొలగించండి
  33. శ్రోతల్ మెచ్చెడి రీతి భాగవతమున్ శ్రోత్రీయ సత్కృత్యుడై
    పోతన్నచ్యుతుఁ గూర్చి వ్రాసె తను శంభున్ భక్తియున్ గొల్చుచున్
    ధాతన్నొప్పెడి రీతి పోల్చి పలికెన్ దా భేదమున్ జూడకన్
    సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా శ్రీకంఠుఁడే శంభుఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణికుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పోతన్న యచ్యుతు గూర్చి...' అవుతుంది. అక్కడ సంధి లేదు.

      తొలగించండి
    2. శ్రోతల్ మెచ్చెడి రీతి భాగవతమున్ శ్రోత్రీయ సత్కృత్యుడై
      భాతింబొందుచు పోతరాజు హరియున్ భస్మాంగునిన్ గొల్చుచున్
      ధాతన్నొప్పెడి రీతి పోల్చి పలికెన్ దా భేదమున్ జూడకన్
      సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా శ్రీకంఠుఁడే శంభుఁడే

      గురువుగారూ నమస్సులు. మీ సూచనకు ధన్యవాదములు. సవరించాను.

      అప్పుడప్పుడు మీ చేత మొట్టికాయలు తినకపోతే మాకు ఆనందంగా ఉండదు.

      తొలగించండి
    3. ఫణికుమార్ గారూ,
      సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  34. భీతిన్రేపఁగ కాలకూట విషమే పీయూష పూర్వమ్ముగ
    న్నే తావున్ గన లేని దేవతలటన్నీశున్ని ప్రార్థించగన్
    మాతా పార్వతి స్వీకరించమనగన్ మన్నించె లోకాలకున్
    సీతా! నాథుఁ డనంగ నీ వెఱుఁగవా శ్రీకంఠుఁడే శంభుఁడే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "దేవతలు తా మీశాను బ్రార్థించినన్" అనండి. బాగుంటుంది.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      భీతిన్రేపఁగ కాలకూట విషమే పీయూష పూర్వమ్ముగ
      న్నే తావున్ గన లేని దేవతలు తా మీశాను బ్రార్థించినన్
      మాతా పార్వతి స్వీకరించమనగన్మన్నించె లోకాలకున్
      సీతా! నాథుఁ డనంగ నీ వెఱుఁగవాశ్రీకంఠుఁడే శంభుఁడే!

      తొలగించండి


  35. కూతురగు సీతకు దెలిపె

    సీతా!పతియన్న నెవడు?శివుడే సుమ్మీ

    మాతాన్నపూర్ణ పతియున్

    భూతాధిపతియైన నాగభూషణు డమ్మా!


    జోతలిడుచు నడిగె నొకడు

    సీతాపతియన్న నెవడు?శివుడే సుమ్మీ

    పాతాళ గంగఁదాల్చిన

    భూతపతియు దాశరథియును భువిలో నొకరే.

    రిప్లయితొలగించండి
  36. భూతలమందున రాముడు
    సీతాపతియై వెలిగెను స్థిరమగు ప్రేమన్
    శీతనగముపై వర్తిలు(మసలెడు)
    సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ

    రిప్లయితొలగించండి
  37. అయ్యా పెద్దలకు వందనం. నా వయసు 35. నాకు తెలిసినంతవరకు ఈ వాఖ్యాన్ని పూరించే ప్రయత్నం చేస్తాను.

    'శివ ధనస్సు త్రుంచగలిగే వాడు ఒక్క రాముడే. అంటే ఇక్కడ రాముడు శివుడితో సమానం. రాముడే శివుడు, శివుడే రాముడు. "సీతాపతి యన్న నెవడు శివుడే సుమ్మీ"'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆతడె ధనుస్సు ద్రుంచెను;
      భూతల నాథుడు; శివునిది భూలోకమున
      న్నాతడె శివుని సమానుడు
      సీతాపతి యన్న నెవఁడు శివుఁడే సుమ్మీ

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      జి.నాథ్ గారి భావానికి చక్కని పద్యరూపాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు.

      తొలగించండి
  38. మాతాసీతను పెండ్లియాడు ఘనుడా మర్యాద రామన్నయే
    సీతానాథుఁ డనంగ నీ వెఱుఁగవా;...శ్రీకంఠుఁడే శంభుఁడే
    వ్రాతన్ జూడగ కానరాడు భడవా ప్రాణేశుడై సీతకున్!
    చేతన్గాకను నేను విర్చితిని నీ చీకాకు పాదమ్మహా!

    రిప్లయితొలగించండి