13, జులై 2017, గురువారం

సమస్య - 2409 (కానరు కాకులను...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కానరు కాకులను నేఁడు గానలలోనన్"
(లేదా...)
"కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్"
ఈ సమస్యను పంపిన పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

70 కామెంట్‌లు:

  1. పర్యావరణ కాలుష్యం :


    కోనేరులు, జీవనదులు,
    కాననలే, లేవు నేడు కామేశ్వర సార్!
    దీనులు భారత వాసులు
    కానరు కాకులను నేఁడు గానలలోనన్

    ...కాన, కానన, కాననము = అడవి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కాననముల్ లేవు..." అనండి.

      తొలగించండి
  2. వానర మూకలు మెండుగ
    కాననములు పైన పైన కట్టుట యందున్
    మీనములు లేవునదమున
    కానరు కాకులను నేఁడు గానల లోనన్
    ------------------------------------
    కాననము = యిల్లు

    రిప్లయితొలగించండి
  3. "కానలఁ గూల్చెడు పనులవి
    హీనము" సరి 'కావు' 'కావు' హెచ్చరికనుచున్
    మానవ చెవినిడఁ బోవఁగ
    కానరు కాకులను నేఁడు గానలలోనన్!

    రిప్లయితొలగించండి
  4. పూనికతోడ వృక్షముల మూర్ఖతఁగూల్చెడు వారలెందఱో
    కానరు మానవాళికి విఘాతముఁగూర్చు విపత్తులక్కటా
    కానలు మాయమయ్యెనిక కాకులమాటలు చెప్పనేటికిన్.
    కానరు కానలందునను కాకులనాకుల చాటునందునన్

    రిప్లయితొలగించండి
  5. కానల లోపలి కాకులు
    వైనముగా నగరులందు పలుగాకులుగా
    మానవరూపము నందుట
    కానరు కాకులను నేడు గానలలోనన్.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    అలరించ నున్నవి !

    పర్యావరణ పరిరక్షణ సేయకున్నచో :

    01)
    _________________________________

    హీనము గాదొకో మహిని - హీనపు చర్య లొనర్ప మానవుల్ 1
    మ్రానుల పీకుచుండు టదె - మానవ తప్పిదమై చెలంగుటన్
    వానదె డుంకుచున్నయది ! - బావులు నేఱులు డొంకుచుండుటన్
    కానల ప్రాణులే సమయు ! - కావున మ్రానుల బెంచగా వలెన్ !
    ప్రాణులు యింకు చుండె నిల - వానిని రక్షణ సేయగా వలెన్ !
    మానుట మావవుల్ భువిని - మ్రానుల బీకుట మంచి యెంచగన్ !
    కానము యూర పిచ్చుకల - గానము సేయు పికంబు ! భావిలో
    కానరు కానలందునను - గాకుల నాకుల చాటు నందునన్ !
    _________________________________
    డుంకు = తగ్గు
    డొంకు = ఎండు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వసంత కిశోర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్‍ సమూహంలోని సూచనలను గమనించండి.

      తొలగించండి
  7. మానరు మానవాధములు మ్రానుల గూల్చకుడంచుచెప్పినన్
    వానలు రావు వృక్షముల స్పందనముండదు క్షామమేర్పడున్
    మానవ జాతి జంతుతతి మాయము జెందు మహీతలంబునన్
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్.

    రిప్లయితొలగించండి
  8. మానవతను మరిచి జనులు
    కానరు కాకులను , నేడు గానల లోనన్
    జ్ఞానుల మని మురియు నరులు
    కాననముల గట్టెడు పలుగాకులు గారే.

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    కానమె పద్యముల్ ఖిలము కానన రీతిని గాగ వ్రాతలన్
    మానగ కావ్య సత్ప్రభలు, మాయము,మాయముచెన్ను1వాక్యముల్
    పూనెను గుళ్ళు చెర్వులును బుణ్య భగీరథ2యత్నమందు పే
    రూనెను తెల్లకాకి3యెట?రూకల పట్టణ జాగృతిన్ యిటన్?
    కానరు కానలందునను గాకుల నాకుల చాటునందునన్
    1గువ్వలచెన్నుని వాక్యాలు:గుడి పడును, బావి పూడును, వడినీళ్ళకు చెరువు తెగును ,వనములు ఖిలమౌ, చడనిది పద్యము సుమ్మా, కుడియెడమలు చూడకన్నా,గువ్వలచెన్నా

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    2.భగీరథ ప్రోగ్రాం3పద్యకవి(కాకి కావుమని ఉదయమే ప్రజల మేల్కొలిపేది)

    రిప్లయితొలగించండి
  11. డా.పిట్టా
    కానన మెచ్చట నగరాల్
    కోనలనున్ గూల్చి నిలుప కొందలమందన్?
    మానని వలసల్ నిజమై
    కానరు కాకులను నేడు గానల లోనన్!

    రిప్లయితొలగించండి
  12. వానలు లేవటంచు నిల వాకొను టేలనొ యజ్ఞయా గముల్
    మానగ,పాడిపంట లిటు మౌనపు రోదన జేయుచుం డగన్
    పానము జేయగా జలము వాగులు వంకలు యింకిపో యినన్
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వంకలు + ఇంకు' అన్నపుడు యడాగమం రాదు. "వంకలె యింకిపోయినన్" అనండి.

      తొలగించండి
  13. వానలు లేవటంచు నిల వాకొను టేలనొ యజ్ఞయా గముల్
    మానగ,పాడిపంట లిటు మౌనపు రోదన జేయుచుం డగన్
    పానము జేయగా జలము వాగులు వంకలె యింకిపో యినన్
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్

    రిప్లయితొలగించండి
  14. ఆ నగరంబులందున నివాసము నుండెడి దీనులెన్నడుం
    గానరు సూర్యబింబమును గానరు చంద్రుని సోయగంబులన్
    గానరు వృక్ష సంపదల గానరు కోకిల గానమెన్నడున్
    గానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్

    రిప్లయితొలగించండి
  15. 🌴🌴🌲🌳🌴🌱🌵🌴🌴
    మానవులకు మనుగడలన
    కాననములు గిరులు తరులు గావొకొ ! నీవే
    దానవుడవౌచు గూల్చగ
    కానరు కాకులను నేఁడు గానలోలనన్ !!


    కంకుభట్టు... వలలునితో....

    దానగుణాన్వితమ్ములగు ధారుణిజమ్ముల మానవుల్ పరా..
    ధీనులు , వంటఁజేయగ వధింపగ నొప్పునె పాచకా ! నరుం..
    డానక బాధలంబడు , నిరాశ్రయుడై , యిటులే యొనర్చుచో..
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్ !!

    రిప్లయితొలగించండి
  16. కానలలో వాయసములు
    పూనిక తో చేరెమనుజ పురముల చెంతన్
    మానవులు కాకు లవ్వగ
    కానరు కాకులను నేఁడు గానలలోనన్"
    (లోకులు పలుకాకులు గదా )

    రిప్లయితొలగించండి
  17. కానము కోయిల గానము
    కానము మృగగణముల ఘనకాసారములన్
    కాననములె నన్నియెడల
    కానరు కాకులను నేడు కాననలోనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "కాననములె యన్ని..." అనండి.

      తొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వనముల నుండెడి చెట్లను
    మనసును జూపక చెలగుచు మానుషు లుండ
    న్ననువగు నీకము సడలగ
    కానరు కాకులను నేడు కాననల లోనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజరావు గారూ,
      మొదటి మూడు పాదాలను గురువుతో ప్రారంభించండి.

      తొలగించండి
  19. ఫోను టవర్లతో చటక పోకడ లెల్లయు దూరమవ్వగా,
    తేనెను గ్రోలు టీగలును దేశము గానక అంతమవ్వగా,
    దీనపు మోముతో యడవి దిక్కుల నెల్లను వేడుచున్ననూ
    హానిని చేయుచూ జనులు అంఘ్రిపముల్ దయలేక కూల్చగన్,
    "కానరు కానలం దునను గాకుల నాకుల చాటు నందునన్"

    దేశము = తావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      '..గ్రోలు+ఈగలు = గ్రోలు నీగలు' అవుతుంది.

      తొలగించండి
  20. పూని చరించుచు గుంపుల
    మానుగ మృగ విహగ కాయ మాంసాహారుల్
    కానన నివాసులే పలు
    కానరు కాకులను నేఁడు గానలలోనన్

    [పలుకు = ముక్క; ఆను = తిను]


    వానలు రక్త ధారలగుఁ బమ్మఁగ నెల్లెడ దోష వాయువుల్
    వీనులఁ జించు జీవముల పేల్చును నింగిని ఘోర శబ్దముల్
    మానవు కాల్చఁ బక్షులఁ బ్రమాదపుఁ గాంత తరంగ జాలముల్
    కానరు కాన లందునను గాకుల నాకుల చాటు నందునన్

    [కాంతము = ఱాయి/ అయస్కాంతము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    సానువు లందలి చెట్లను
    పూనిక గూడుచు మనుజులు పుడుకుచు నుండన్
    జానగు వీకము సడలగ
    కానరు కాకులను నేడు కానల లోనన్

    రిప్లయితొలగించండి
  22. వానలుపలుగురిపించెడు
    కానలతెగనరికిధరనుకాలుష్యపుమై
    దానమ్ముగజేయజనులు
    కానరుకాకులనునేడుగానలలోనన్!

    రిప్లయితొలగించండి
  23. వానలు కఱవాయె భువిని
    దానవులై మనుజులు వెసఁ ద్రచ్చ వనములన్
    స్థానము లభించని కతనఁ
    గానరు కాకులను నేడు గానల లోనన్

    రిప్లయితొలగించండి
  24. దానవులైన మానవులు త్రచ్చుచు నుండగ పాదపమ్ములన్
    వానలు తగ్గిపోయెనిల పంట పొలమ్ములు బీడులాయె చూ
    స్థానములేనికారణము సాగక చక్కని జీవితమ్మటన్
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  25. జ్ఞానము నశియుంచి యిలను
    మానవులు దళించు చుండ మ్రానులలెల్లన్
    చోనము లేనందువలన
    కానరు కాకులను నేడు కానలలోనన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      టైపు దోషాలున్నవి.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారు..
      జ్ఞానము నశియించి యిలను
      మానవులు దళించు చుండ మ్రానులనెల్లన్
      చోనము లేనందువలన
      కానరు కాకులను నేడు కానలలోనన్!!!

      తొలగించండి
  26. పూనిక తోడ కాకులవి పొల్పుగ కానల వీడి పట్టణం
    బేననువంచు చేరికొనె పెల్లుగ చెట్లను సంహరింపగన్
    స్థానము లేదు నిల్వనని తల్చెనొ దుర్భిణి వేసి జూచినన్
    కానరు కానలందునను గాకుల నాకుల చాటునందునన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  27. పూనిక కాకుల మూకలు
    కానల విడి జనపదంపు గమ్యము చేరెన్
    మానుగ లోకుల రీతిని
    కానరు కాకులను నేడు కానలలోనన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "పట్టణంబే యనువంచు" అనాలి కదా! కాని అలా అంటే ప్రాస తప్పుతుంది.

      తొలగించండి
  28. మ్రానుల కాకులట్లు నిల మానవతే చిగురించినన్ గదా
    మానవు లందురీ నరుని మాన్యులు, లేనిది యల్పులందురే
    కానల లో చరించెడు మృగమ్ములె మేలని చెప్పుపెద్దలే
    కానరు కానలందునను గాకుల నాకుల చాటునందునన్

    కాకులు= అల్పులు

    రిప్లయితొలగించండి
  29. మానవుడెక్కడున్న తమ మాధ్యమమౌ చరవాణి సంజ్ఞలన్
    పూనికతోడ గోపుర సమూహములేర్పడ నందజేయగన్
    హానివియౌ తరంగముల నాయువు వీడఁగ పక్షిజాతులున్
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్!

    రిప్లయితొలగించండి
  30. పూనకము వచ్చి నట్టుల
    నీనాడా కోన కాన నేతలు కూయన్
    మౌన వ్రతమును బూనఁగ
    కానరు కాకులను నేఁడు గానలలోనన్

    రిప్లయితొలగించండి
  31. ఆ నగరంబులందున నివాసము నుండెడి దీనులెన్నడుం
    గానరు సూర్యబింబమును గానరు చంద్రుని సోయగంబులన్
    గానరు వృక్ష సంపదల గానరు కోకిల గానమెన్నడున్
    గానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్

    రిప్లయితొలగించండి
  32. మానిసి వీడుచు విజ్ఞత
    తానే గూల్చగ తరువుల దానవ చర్యన్
    కోనల కొండల కనగా,
    కానరు కాకులను నేఁడు గానల లోనన్

    2.ఏనుగు దంతముల్ వలచి యేనుగులన్ గడ దేర్చు మానవుల్
    పీనుఁగులమ్ము హంతకులు వేనకు వేలుగనుండ ధారుణిన్
    మా"నవ" జీవనంబునను మ్రానులు మ్రాకులు వన్యప్రాణులన్
    గానరు కానలందునను గాకుల నాకుల చాటుమాటునన్

    రిప్లయితొలగించండి




  33. వానలు వేళకు కురియక

    దీనముగావాలినట్టి దేవెలగనగన్

    మానసమదిక్రుంగు,నెవరు

    గానరు కాకులను నేడు కానల లోలన్.


    వానరములు వసియించెడి

    కాననములు కాల్చి యిండ్లు కట్టుదురిలలో

    మానవు లెల్లరు వెతికిన

    గానరు కాకులను నేడు కానలలోనన్.


    హీనపు బుద్ధిని చూపుచు

    మానవులడవులు నుగాల్చి మహిలో గృహముల్

    మానుగ గట్టుచు నుండగ

    గానరు కాకులను నేడు కానల లోనన్.

    రిప్లయితొలగించండి
  34. దానవ రావణు నాపుచు
    జానకి రక్షణకు పోరి చచ్చిన పిదపన్
    మానఁగ నడవుల నుండగఁ
    గానరు కాకులను నేఁడు గానలలోనన్

    రిప్లయితొలగించండి
  35. వానల నెండలన్ గనరె వాయస యోధుల శ్రేణులన్ మహా
    వీనుల విందుగన్నరచి వేసిన మెత్కుల పోరి గత్కుచున్;...
    మే నెల శ్రాద్ధమందునను మేపగ వాయస పిండమున్నహో
    కానరు కానలందునను గాకుల నాకుల చాటు నందునన్ :)

    రిప్లయితొలగించండి