1, జులై 2017, శనివారం

సమస్య - 2399 (ఇతఁ డితఁడే యితఁడె...)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే"
(లేదా...)
"ఇతఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే"

74 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. కతలను జెప్పగ నాతడు
      వెతలను పోగొట్టు నంట వేయి విధమ్ముల్
      గతులను మార్చగ నిరతము
      ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

      తొలగించండి
    2. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఇతడే రాముడు కృష్ణుం
    డితండె కల్కియు నృసింహు డితడే బుద్ధుం
    డితడే వరాహు డాహా!
    "ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే"

    ...మొత్తం ఆరవతారాలు (ఇతడులు)...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      సమస్యకు అనుగుణంగా ఆరు అవతారాలను ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. గత కాలము కంటెను భా
    రత దేశపు దశను మార్చ రావలె నెవడో
    ధృతిగల వాడన మోడీ
    ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  4. పోలీసు స్టేషన్లో ఐక నేరస్తుడిని గుర్తిచి,గృహయజమాని తనవారితో పల్కిన పల్కులు

    గతులను తప్పెనేమొ కనగా ననుఁద్ద్రిప్పు గ్రహంబు లన్నియు
    న్నితడిటు చోరవృత్తి మనయింట సమస్తము దొంగిలింనగా!
    యితరులుఁగాదు దొంగతనమివ్విధిఁజేయగ,రూఢినీతడే!!
    యితడె యితండెయీతడిదె యీతడెయీతడెయీతడీతడే




    రిప్లయితొలగించండి
  5. వెతలను దీర్చెడి బందుగు
    డితడే యిహమున పరమున కితడేవరమై
    సతముగ మనదరి నిలచున
    దితడితడే యితడె యితడె యితడీతండే!

    రిప్లయితొలగించండి
  6. ఇతడే శ్రీహరి రాఘవు
    డితడే నారాయణుండు నిలలో జూడన్
    నితడే లక్ష్మీపతియౌ
    ఇతఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే.

    అతిగతి యెవ్వడు జనులకు
    పతియైనదెవరు ముదమున వసుధను చెపుమా
    సతతము నుండును మదిలో
    నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే"

    ఇతడే గురుదక్షిణగా
    గతప్రాణుండైన సుతుని కష్టము లేకన్
    బ్రతికించి యొసగిన హరియు
    నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే"

    ఇతడా యసురుల చంపెను
    యితడా వనితల మనముల నేలిన చోరుం
    డితడామిగమా తీతుం
    డితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే"


    ఇతడా భారత రణమున
    సతతము వెన్నంటి కిరీటి సంగడికాడై
    వెతలను బాపిన దైవం
    బితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే


    సుతుడెవరాకౌసల్యకు
    పతియెవరా మిథిలజకును వాసిగ వసుధన్
    రతికిని మామయు నెవడన
    నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

    స్తుతియించిన వరమొసగుచు
    వెతలందున కాచుచుండు విశ్వమునందున్
    సతతము బ్రోచెడి నాథుం
    డితడితడే యితడె యితడె యితండీతండే.

    రిప్లయితొలగించండి
  7. ఋతుడితడే,భానుడితడె ,
    పితువితడే,పూషుడితడె,పీయువుడితడే,
    ఖతిలకుడునితడె నభమున,
    ఇతడితడే,యితడె యితడె యితడీతండే

    రిప్లయితొలగించండి
  8. సుతపుడితండె,తాపసుడు,సూర్యుడు,మిత్రుడు,బ్రద్నుడున్,ప్రభా
    పతియు నితండె,సావిత్రుడు,భానుడు, విన్నువెలుంగు,కాకరా,
    కుతపు డితండె,దేవమణి,గోపతి,ధత్రుడు, ద్వాదశాత్ముడు
    న్నితడె యితండె యీతఁడిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్యకుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    వితరణ సొమ్ముల మ్రింగియు
    వెతలను బాపంగలేరు, వే బట్టగబోన్
    జతనము వ్యర్థము ;నాయకు
    డితడితడే యితడె యితడె యితడీతండే!
    (అందరు సమానులే!ఏమని గుర్తించేది? అన్న నిస్పృహ!)

    రిప్లయితొలగించండి
  10. డా.పిట్టా
    సతతము నొక్కరూపు తమ సామిని బట్టగ లేని రీతినిన్
    వెతలను బెట్టు దుండగులు వేలకు వేలు గడంగ విభ్రమాం
    కితమగు వేటలో మనిరికేమది చంపితి మన్న "లాడెనే"(ఒసామాబెన్ లాడెన్,Terrorist)
    యితడె యితండె యీతడిదె యీతడె యీతడె యీతడీతడే!
    (అమెరికనులు చంపినామన్నా యింకను టెర్రరిస్టుల బెడద పోలేదు కనుక యింకా ఉన్నాడేమో అన్న సందేహం,బెడదలున్నూ!)

    రిప్లయితొలగించండి
  11. అతులిత నృసింహ రూపమ
    వతరించ హిరణ్యకశిపు డంతట సుతుని
    న్నతడా నీహరి యన ననె
    నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే!

    రిప్లయితొలగించండి
  12. గతమున భువి ముష్కరు లై
    వెతలను గూర్చెడి యసురుల వెస కడతేర్చన్
    క్షితికే తెంచిన యచ్యుతు
    డితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

    రిప్లయితొలగించండి
  13. సతతము వైరి దళమ్ముల
    సతమతమును జేయువాడు సరగున భువిలో
    నతడొకడె ఫల్గునుండగు
    నితనితడే యీతడితడె యీతండితడే
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  14. అతడె యనంతుడంతటవిహారము జేసెడు మాధవుండనన్
    సుతనుతుఁ జూడనెంచ గద సూటిగ కంబముఁ దాకినంతట
    న్నతులితమౌ నృసింహుఁగని యా హరియా యన? నా సుతుండనె
    న్నితఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే

    రిప్లయితొలగించండి
  15. నత తనుఁడు సతత వచనుఁ డు
    గతచేతనుఁ డసిత భీమ కాయ వికారా
    తత కటుఁడే ముమ్మాటికి
    నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే


    మతిసెడఁ బెట్టి రందరిని మానస రోగుల వైద్యశాల లో
    నతులయి పాఱ నందరు ఘనమ్మని యెంచుచు సప్త రోగులే
    గతి తెలియంగ వారిది యొకండటఁ జూపుచు వారిఁ బల్కె ని
    ట్లితఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే

    రిప్లయితొలగించండి
  16. అతివీరుల్ మనరాక్షసుల్ వధను తానారీతి చేయన్ భువిన్
    వెతుకన్ లేరు మరొక్కరెల్లయెడలన్ విన్నాణమొప్పంగ శ్రీ
    పతి కృష్ణుండె వధించె వారినచటన్ పాల్గారు బాలుండుగన్
    యితడె యితండె యీతడిదె యీతడె యీతడె యీతడీతడె
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. "బాలుండుగ। న్నితడె..." అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి
    2. సమస్యా పాదము చంపకమాల యని విస్మరించారు.

      తొలగించండి

  17. పితరుని కోర్కెను దీర్చగ
    సతిచేకొనని వ్రతమ్ము సాహసరీతిన్
    ప్రతినబూనిన భీష్ముం
    డితడితడే యితడె యితడె యితడీతండే!

    రిప్లయితొలగించండి
  18. ఇతడే విశ్వము విష్ణువు
    యితడే విశ్వంభరుడగు నీతడె కాలము
    న్నీతడె నంతర్యామియు
    యితడితడే యితడె యితడె యితడీతండే!

    విశ్వం విష్ణుం వషట్కారం భూతభవ్య భవత్ ప్రభుః!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. "ప్రతినను బూనిన" అనండి.
      రెండవ పూరణలో 'విష్ణువు+ఇతడే' అన్నపుడు యడాగమం రాదు. "విష్ణుం।డితడే" అనండి. అలాగే "కాలం।బీతడె యంతర్యామియు। నీతడె..." అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు! తప్పక సవరిస్తాను!

      తొలగించండి
    3. ఇతడే విశ్వము విష్ణుం
      డితడే విశ్వంభరుడగు నీతడె కాలం
      బీతడె యంతర్యామియు
      నితడితడే యితడె యితడె యితడీతండే!

      తొలగించండి
  19. వెతలనుబడుమానవులను
    సతతము రక్షించ నెంచి సంతోషముతో
    గతితానైవచ్చు నజయు
    డితఁడితఁడే,యితఁడె యితఁడె యితఁడీతండే

    రిప్లయితొలగించండి
  20. మితభాషియు హితవరుడును
    సతతము సాహిత్య సీమ చరియించి మదిన్
    చతురత నిలిపిన శంకరు
    డితడితడే యితడె యితడె యితడీతండే!

    రిప్లయితొలగించండి
  21. కృతయుగ రాముండైన
    న్నతివల వలువలను దోచిననఘుండైనన్
    శితికంఠుండని పిలిచెడి
    యితడితడే యితడె యితడె యితడీతండే

    సతిపతి యెవ్వడో తెలుపు చక్రి యెవండు? ధరీత్రి బ్రోచుబా
    ధ్యతెవని దోయి? శ్రీకరుడు తానయి శిష్ఠుల నెల్ల వేళలన్
    యతిజన రక్షకుండయిన యాశ్రిత పోషకుడైన నేమివా
    డితడె యితండె యీతడిదె యీతడె యీతడె యీతడీతడే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'వాట్సప్'లో నా సూచనలను గమనించండి.

      తొలగించండి
  22. మతములుయెన్నియున్న?పరమాత్ముడునొక్కడె|లోకమంతటన్
    హితమును బెంచబూని బలహీనత మాన్పగ అల్ల,ఏసు,సా
    యి,తలచువిష్ణు,బ్రహ్మయు మహేశునివేడిననందరొక్కటే
    ఇతడె యితండెయీతడదె యీతడె యాతడెయీతడీతడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మతములు+ఎన్ని' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు. "మతము లవెన్ని యున్న..." అనండి.

      తొలగించండి
  23. మితముగ మాటలు బలుకుచు
    సతతము నర్చించి శివుని సవిమల భక్తిన్
    వితరణమును గలుగు నతడు
    ని తడితడే యితడె యితడె యితడీ తండే

    రిప్లయితొలగించండి
  24. (నిన్న గురువు శ్రీ శంకరయ్యగారు fb లో ధ్వనికిి సంబంధించి పెట్టిన పోస్టు లోని పదాలను కొన్ని పూరణలో ఉపయోగించాను.)

    చతికిలపర్చికంసుడిని జంపిన కృష్ణుని గాంచి యెల్లరున్,
    కితకితబెట్టిపూతనను కీకిరిజేసిన కుర్రడీతడే,
    పుతపుటజేసిచంపెనటపో,శకటాసురు పర్రుపర్రునన్,
    కతుకు కసుక్కుబుస్సుమను కాళియుగర్వమడంచు బాలకుం
    డితడె యితండె యీతడిదె యీతడె యీతడె యీతడీతడే !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీతాంబర్ గారూ,
      ధ్వన్యనుకరణ పదాలను అద్భుతంగా పద్యంలో ఇమిడ్చారు. బాగుంది. అభినందనలు.

      తొలగించండి
  25. క్రొవ్విడి వెంకట రాజారావు:
    నిన్నటి పూరణ:

    తనయుడు పరితాపమ్మున తలకు నొందె
    తండ్రి మరణింప; ముదమొందె తనయ మిగుల
    దలచుచు తనకు యత్తింట తనకు నట్టి
    వలపు వాత్సల్యముల నన్ని వరుస దోడ

    రిప్లయితొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వితముగ పరిశీలింపుము
    ప్రతిసవ్యుండౌ రవిజుని బవరము నందున్
    మృతునిగ జేసిన కవ్వడి
    ఇతడితడే యితడె యితడె యితడీతండే

    రిప్లయితొలగించండి
  27. హితుడైన శంకరార్యులు
    ప్రతిరోజు సమస్యశంకరాభరణములో
    మతుల పరీక్షించెడి వా
    డితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే

    రిప్లయితొలగించండి
  28. చతురాననుడును దివిజులు
    బ్రతిమాలగ దానవులను భంజింపగ తా
    సుతుడుగ పుట్టిన విష్ణుం
    డిత డితడే యితడె యితడె యితడీతండే

    రిప్లయితొలగించండి
  29. గణేశుడు హిమగిరి
    సుతతో *"నను కుబ్జుడనెను జూడు" షడాస్యుం*
    *డితడని* జూపెను *ముఖముల*
    నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే!!



    జయహో... GST...
    జయహో.... మోదీ...
    జయహో.... భారత్...

    ప్రతి వినియోగదారునకు వస్తువులన్నియు దేశమంతటన్
    చతురత నొక్కటే ధరకు జక్కగ జిక్కగ , క్రొత్త పన్ను ప...
    ద్ధతిని ప్రవేశపెట్టిన యుదాత్తుడు మాదు నరేంద్రమోది నా....
    నితఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతడే !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదం 'వాట్సప్ సమూహం'లో సరిగానే ఉంది. ఇక్కడేదో తప్పింది.

      తొలగించండి
    2. మన్నించండి...

      సుతుడు గణేశుడు హిమగిరి
      సుతతో "నను కుబ్జుడనెను జూడు" షడాస్యుం
      డితడని జూపెను ముఖముల
      నితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే!.

      ...... అని ఉండాలండీ... టైపాటు..

      తొలగించండి
  30. ఇతడే కలియుగ రాముడు,
    హితులను గాచెడి హితుండు,హిమగిరి వలనే
    సుతులకు నీడగ నిలచిన
    దితఁ డితఁడే యితఁడె యితఁడె యితఁ డీతండే!!

    రిప్లయితొలగించండి
  31. పతి మీకెవ్వరటంచని
    సతి సత్యాదుల నడిగిన సారసనేత్రున్
    ధృతిగని చూపుచు పలికిరి
    యితడీతడె యితడె యితడె యితడీతండే
    అరాశ

    రిప్లయితొలగించండి

  32. పిన్నక నాగేశ్వరరావు.

    చతురత, సమయస్ఫూర్తియు

    నతులితమౌ కార్యదీక్ష యాతని సొత్తే

    స్థిత ప్రజ్ఞుడు చంద్రుడితడె

    యితడితడే యితడె యితడె యిత
    డీతండే !
    ( చంద్రుడు=చంద్రబాబు.)
    *****************************

    రిప్లయితొలగించండి
  33. ఇతడె యితండె రాముడుగ యీ తడితండెగ కృష్ణుడీతడే
    యితడె యితండె వామనుగ యీతడితండెగ కల్కి బుద్ధుడై
    యితడె నృసింహు డీతడెగ యీతడితండె దశావతారముల్
    యితఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే

    రిప్లయితొలగించండి
  34. పితుకుచు నావు పాలనిట పీల్చుచు పైకము బడ్జెటందునన్
    గతుకుచు నావు గ్రాసమును గమ్మున దోచుచు బ్యాంకులన్నిటిన్
    కితకిత బెట్టి రబ్రినహ కించుక రోజులు జైలునుండెడి
    న్నితఁడె యితండె యీతఁ డిదె యీతఁడె యీతఁడె యీతఁ డీతఁడే!

    రిప్లయితొలగించండి