"కృష్ణ! కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే కృష్ణ !" పాట పాడి పాడి పంకజాక్షి కృష్ణ జన్మ తిథిని క్రీడించి కంపించి ప్రేమ పొంగిపొరలె వీథులందు!
'...Chant and be happy is the catchphrase of the "..International Society for Krishna Consciousness (ISKCON)". We often see the monks at ISKCON dancing to the Hare Krishna tunes every day in the temple. Sometimes, they do go out on the streets to encourage others also to chant and dance, in what is called sankirtan party..'
ప్రేమ వీథుల్లో పొంగి పొర్లడ మన్నది నా జీవితంలో ఒక్కసారే చూసాను ! అది 1983 లో ఆంధ్రమాతకు అనుంగు ముద్దుబిడ్డ సకలాంధ్రుల మది దోచిన అందగాడు అఖిలాంధ్రులకూ అన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడు
రాజకీయ రణరంగ ప్రవేశం చేసి విసుగు విశ్రాంతి లేకుండా అలసట బడలిక అనకుండా రాత్రి పగలూ మరచి సర్వ సౌఖ్యములూ త్యజించి భయమూ భీతీ వదలి నిశ్చింతగ నిస్వార్థంగా స్నానాధికములు,అన్నపానాదులూ రోడ్డు ప్రక్కనే చేస్తూ నిర్విరామంగా 3 నెలలలో 35(?) వేల కిలోమీటర్లు చైతన్యరథముపై ప్రచారం చేసిన సమయం !
అబ్బో ! ఏమి జనం ఏమి జనం రోడ్ల కిరువైపులా బారులు దీరి రాత్రనక పగలనక ఎండనక వాననక ఆకలి దప్పులు మరచి పిల్లా మేకా ముసలీ ముతకా మొత్తం ఊళ్ళన్నీ రోడ్లమీది కొచ్చి రోజుల తరబడి నిరంతర నిరీక్షణే నిరీక్షణ యెంటీవోడి దర్శనం కోసం !
అందరికీ వందనములు ! అందరి పూరణలూ అలరించు చున్నవి ! అలరించ నున్నవి !
అపూర్వ స్వాగతం :
01) ________________
తామరతంపరై జనులు - తారను జూడగ బార్లు దీరుచున్ తామస మెంత యైనను ని - దానము, నోర్పు వహించి శ్రద్ధగా తామదె సత్కరించి పలు - దండలు వేయగ హారతివ్వగన్ తామదె నిల్చినారు తమ - దారలు, పిల్లల తోడ కూడియున్
రాముడు నేలినట్టి విమలంబగు వైదిక పుణ్యభూమిలో కామము పెచ్చుమీఱినది కాలము లోపల దేశమందునన్ సామము లేక నీచ విష సంస్కృతి హెచ్చె కలి ప్రభావమున్ ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
ప్రభాకర శాస్త్రి గారూ, మీరు శంకరాభరణం మీద రిసెర్చ్ చేస్తున్నారన్నమాట రూఢి అయింది. ఎప్పటి చంద్రశేఖర్ గారు పరిచయం చేసిన 'చంద్రభాసురం'! దాన్ని మళ్ళీ మూన్ లైట్ లోకి తీసుకొచ్చారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
వేంకటేశ్వరుండు వేగమె బ్రోవగ
రిప్లయితొలగించండివేడు కొనుచు సాగ వేల జనుల
ప్రబల భక్తి తోడ బ్రహ్మోత్సవంబున
ప్రేమ పొంగి పొరలె వీథులందు
బాలసుబ్రహ్మణ్య శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కృష్ణ! కృష్ణ! కృష్ణ! కృష్ణ! హరే కృష్ణ !"
రిప్లయితొలగించండిపాట పాడి పాడి పంకజాక్షి
కృష్ణ జన్మ తిథిని క్రీడించి కంపించి
ప్రేమ పొంగిపొరలె వీథులందు!
'...Chant and be happy is the catchphrase of the "..International Society for Krishna Consciousness (ISKCON)". We often see the monks at ISKCON dancing to the Hare Krishna tunes every day in the temple. Sometimes, they do go out on the streets to encourage others also to chant and dance, in what is called sankirtan party..'
https://www.iskconbangalore.org/hare-krishna-kirtan-flash-mob/
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పశ్చిమంబుగాలి పగ్గాలులేకుండ
రిప్లయితొలగించండివిచ్చలవిడిగాను వీచుచుండ
ప్రేమికులదినమున రేయింబవలులేక
ప్రేమపొంగి పొరలె వీధులందు!
సీతాదేవి గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
భాగ్యనగర మందు బంజార హిల్సులో
రిప్లయితొలగించండిచార్మినారు క్రింద కూర్మి తోడ
మురికి నీరు పార మునిసిపాలిటి వారి
ప్రేమ పొంగిపొరలె వీథులందు
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
(రాజకవి-కవిరాజు)
రిప్లయితొలగించండివిజయనగరమందు గజరాజుపై నెక్కి
కదలు కృష్ణరాయకవి ఎదురగు
పెద్దనార్యు జూచి ప్రియమున గేల్సాచ
ప్రేమ పొంగిపొరలె వీథులందు.
బాపూజీ గారూ,
తొలగించండిమంచి పూరణ. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిసక జనుల సమ్మె సాగించె కేసియార్
నాడు రాష్ట్ర ప్రగతి నరయ బ్రజకు
భూమి పుత్రులమన్న భూరి భావన తోడ
ప్రేమ పొంగి పొరలె వీథులందు
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. "భూమి పుత్రులమను..." అనండి.
సన్నుతించు రీతి చిన్నారి లవకుశుల్
రిప్లయితొలగించండిరామ కథను బాడ నీమ మూని
యచట నావరించె హర్షంబు, వారిపై
ప్రేమ పొంగిపొరలె వీథులందు.
ఆమహనీయ డచ్యుతు డహర్నిశమున్ యదువంశ మందునన్
క్షేమము గూర్చుచుండగను కేవల మాతని దర్శనంబె స
న్మానముగా దలంచెదరు మాన్యవరేణ్యుని రాకచే నటన్
బ్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్.
హ.వేం.స.నా.మూర్తి
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు మనోహరంగా ఉన్నవి. అభినందనలు.
తనను మెచ్చు కొనెడు తరుణి యనిత పైన
రిప్లయితొలగించండిప్రేమ పొంగి పొరలె, వీధు లందు
తిరిగి వివిధ వంట దినుసుల నమ్మెడు
మామ కొడుకు మధుకు మనసు నిండ.
విరించి గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కైక కోరినంత కానల కేగగన్
రిప్లయితొలగించండిలక్ష్మణుండు మరియు లలన సీత
తనను వెంబడింప తరలిరి పురజనుల్
ప్రేమ పొంగె పొరలె వీధులందు
విరించి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండినీమము నిష్ఠ భక్తియను నిర్మల భావ విచారధారలా
రామము లందెగాక పుర రాజసువీథుల జెల్లె నాడు ను(యు)
ద్దామ గురోర్వి భారత విధానమె కృష్ణుని గాంచనెంచె సు
త్రాముడు "సూరదాసు "పద"ధ్యాయాసయె యేరయి పారనంతటన్
ప్రేమయె పొంగిపొర్లె నడి వీథులలో జనులెల్ల జూడగన్
(సూరదాసు కృష్ణ భక్తిని తన "భ్రమర గీత సారమను దోహాల ద్వార ప్రచారము చేసినాడు."పద"॥దోహే)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ధ్యాసయె..' టైపాటు...
'పద ధ్యాసయె' అన్నపుడు 'ద' గురువై గణదోషం. "సూరదాసుని పదంబుల ధ్యాసయె నిండనంతటన్" అంటే ఎలా ఉంటుంది?
తొలగించండిశ్వేత జాతి జనుల స్వేచ్ఛలు మితిమీరి
రిప్లయితొలగించండిపశ్చిమాన బయట పట్ట పగలె
సీమ శునక మోలె సిగ్గులజ్జలు లేక
ప్రేమ పొంగిపొరలె వీథులందు..కోట శర్మ
శర్మ గారూ,
తొలగించండిశంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఓలె' అనడం గ్రామ్యం. అక్కడ "శునకుము వలె" అనండి.
తొలగించండిశ్వేత జాతి జనుల స్వేచ్ఛలు మితిమీరి
పశ్చిమాన బయట పట్ట పగలె
సీమ శునకము వలె సిగ్గులజ్జలు లేక
ప్రేమ పొంగిపొరలె వీథులందు
🙏🙏🙏🙏
శంకరయ్య గారూ
రిప్లయితొలగించండినమస్కారములు. దోషములు తెలియజేయగలరు.
🙏🙏
కోట శర్మ
విజయకేతనముల సుజనులందరు మోయ
రిప్లయితొలగించండిమందు, విత్తమైదు వందలీయ
దశదిశలదరంగ దరువులు మ్రోగగన్
ప్రేమ పొంగి పొరలె వీధులందు !
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏🙏🙏🙏
తొలగించండిప్రేమ వీథుల్లో పొంగి పొర్లడ మన్నది
రిప్లయితొలగించండినా జీవితంలో ఒక్కసారే చూసాను !
అది 1983 లో
ఆంధ్రమాతకు అనుంగు ముద్దుబిడ్డ
సకలాంధ్రుల మది దోచిన అందగాడు
అఖిలాంధ్రులకూ అన్నగారు
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు
నందమూరి తారక రాముడు
రాజకీయ రణరంగ ప్రవేశం చేసి
విసుగు విశ్రాంతి లేకుండా
అలసట బడలిక అనకుండా
రాత్రి పగలూ మరచి
సర్వ సౌఖ్యములూ త్యజించి
భయమూ భీతీ వదలి
నిశ్చింతగ నిస్వార్థంగా
స్నానాధికములు,అన్నపానాదులూ
రోడ్డు ప్రక్కనే చేస్తూ నిర్విరామంగా
3 నెలలలో 35(?) వేల కిలోమీటర్లు
చైతన్యరథముపై ప్రచారం చేసిన సమయం !
అబ్బో ! ఏమి జనం ఏమి జనం
రోడ్ల కిరువైపులా బారులు దీరి
రాత్రనక పగలనక
ఎండనక వాననక
ఆకలి దప్పులు మరచి
పిల్లా మేకా ముసలీ ముతకా మొత్తం
ఊళ్ళన్నీ రోడ్లమీది కొచ్చి
రోజుల తరబడి
నిరంతర నిరీక్షణే నిరీక్షణ
యెంటీవోడి దర్శనం కోసం !
అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరించ నున్నవి !
అపూర్వ స్వాగతం :
01)
________________
తామరతంపరై జనులు - తారను జూడగ బార్లు దీరుచున్
తామస మెంత యైనను ని - దానము, నోర్పు వహించి శ్రద్ధగా
తామదె సత్కరించి పలు - దండలు వేయగ హారతివ్వగన్
తామదె నిల్చినారు తమ - దారలు, పిల్లల తోడ కూడియున్
గాములఱేని తీవ్రతను - కాళ్ళదె కాలిన లెక్కసేయకన్
కామన హెచ్చగా నిలువు - గాళ్ళనె భీకర వానలందునన్
కౌముది లేకయున్న పెను - గాలులు వీచిన నంధకారమున్
గ్రామము గ్రామ మంతయును - కన్నులు కాయలు కాయ వేసటన్ !
రామలె మెచ్చు సుందరుడు - రమ్యశరీరుడె యంచు నెంచుచున్
రాముని జూచి మ్రొక్క మది - రంజన మౌనని దల్చి యెందరో
రాముడు కృష్ణుడున్ శివుడు - రక్షియు తారక రాముడంచు, మున్
ప్రేమయె పొంగిపొర్లె నడి - వీథులలో జనులెల్లఁ జూడఁగన్ !
________________
తామసము = ఆలస్యము
వసంత కిశోర్ గారూ,
తొలగించండిమీ పూరణ, గద్య పద్యాలలో దాని నేపథ్యాన్ని వివరించడం బాగున్నవి. అభినందనలు.
శంకరార్యా ధన్యవాదములు
తొలగించండి………………………………………………
రిప్లయితొలగించండిగు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ప్రేమికులు బిడియము వీడుచు , నుద్యాన
వనము ల౦దు మరియు వాహనముల
దొర్లు చు౦ద్రు , ముద్దిడుకొనుచు౦ద్రు
ప్రేమ పొ౦గి పొరలె వీధు ల౦దు
ఉద్యానవనముల౦దు = పార్కుల లో ;
వాహనముల = బస్సులలో ;
దొర్లు చు౦ద్రు = ఒకరిపై ఒకరు పడి దొర్లుచు౦ద్రు
మూడవ పాదములో " డ " కు " ద " కు
………………………………………………………
యతి చేయబడినది
…………………………………
ి
గురుమూర్తి ఆచారి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రాముడు నేలినట్టి విమలంబగు వైదిక పుణ్యభూమిలో
రిప్లయితొలగించండికామము పెచ్చుమీఱినది కాలము లోపల దేశమందునన్
సామము లేక నీచ విష సంస్కృతి హెచ్చె కలి ప్రభావమున్
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
కామమోహిత రాక్షసాధముఁ గారణంబున లంకయున్
రిప్లయితొలగించండినామమాత్రము చేత కోతియు నగ్నికీలల గాల్చెగా
రామరావణ యుద్ధమందున రామచంద్రుడు గెల్వగన్
ప్రేమలే గద పొంగిపొర్లెను వీధులందున జూడగన్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
సమస్యపాదాన్ని మార్చి మత్తకోకిలలో మీ పూరణ మనోహరంగా ఉంది.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిగోకులమ్మునందు గోవిందుడేగుచు
రిప్లయితొలగించండిమురళినూదగాను ముదముతోడ
గోపకాంతలెల్ల గుమిగూడి జనవెంట
ప్రేమపొంగి పొరలె వీధులందు!
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'గుమిగూడి చన..' అనండి.
చిట్టి పొట్టి చిన్ని చిరు లేత బాలలు
రిప్లయితొలగించండిచేరి యాడ నచట చెలిమి పూచి
కోరి చేయి వట్టి గుంపుగా పరుగిడన్
ప్రేమ పొంగి పొరలె వీథులందు!
శిష్ట్లా శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రైతుబాంధవుడని ఖ్యాతిని గొన్నట్టి
రిప్లయితొలగించండినేత యరుగుదెంచి నీటుగాను
గ్రామసీమలందు కలయఁదిరుగుచుండ
ప్రేమ పొంగి పొరలె వీథులందు
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉత్స వి గ్ర హమ్ము లూరేగు చుండగ
రిప్లయితొలగించండిభక్తి రసము లచట రక్తి గొలుప
ప్రేమ పొంగి పొరలె వీధులందు నిజము
కనగ లేవు వేయి కన్ను లైన
సుబ్బారావు గారు,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని 'ఉత్సవ విగ్రహాన్ని' ఉత్స విగ్రహమన్నారు.
రాముని రాజ్య పాలనము శ్రామిక వర్గము పొందునంచు తా
రిప్లయితొలగించండిప్రేముడి తోడుతన్ తెలిపి పిమ్మట చక్కగ నాచరించి సం
క్షేమమొసంగ రైతులకుఁ జెన్నగు నేతను గాంచి యూరిలో
బ్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
అన్నపరెడ్డి వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చిత్తమందు భక్తి చిందులు వేయంగ
రిప్లయితొలగించండిభక్త తుకారాము పాడి యాడె
పాండురంగ విభుడు పరవశమొందంగ
ప్రేమ పొంగి పొరలె వీధులందు
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. కాని 'తుకారాము' అన్నచోట గణదోషం.
గళము విప్పె నా'తుకా'వినుతుడు.
తొలగించండిఈ2వ పాదం సరిపోయిందా దయచేసిచూడండి
రావణాసుర కృత రణభూమి యందు నా
రిప్లయితొలగించండిరాక్షసవరు లంత రామ బాణ
హతులు రక్త యుత భటాంబుధి సక్షుర
ప్రేమ పొంగి పొరలె వీథు లందు
[స క్షురప్ర + ఈమ = స క్షురప్రేమ; క్షురప్రము = అర్ధచంద్రబాణము; ఈమ = పుండు; అర్ధచంద్రబాణముల తో నేర్పడిన వ్రణములతో కూడి]
ఏమని చెప్ప నేర్తు నిక నీ విష యోద్ధతి దేశ పౌరులే
తామట మూడు రంగుల పతాకము నూపుచు సంతసింపగా
నామని వోలె తోచె నట నాడగఁ బాడగ దేశ గీతముల్
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
కామేశ్వర రావు గారు,
తొలగించండిమీ భాషావైదగ్ధ్యానికి నమోవాకాలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. 'క్షురప్రేమ' ప్రయోగం అనన్యసామాన్యం. అభినందనలు.
ఇటువంటి ప్రయోగములలో పూజ్యులు కామేశ్వరరావు గారికి సాటి రాగలవారు గరికపాటిగారి లాంటి వారు ఏ కొద్దిమందో ఉంటారేమో. నమశ్శతములు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.
తొలగించండిశ్రీ వాల్మీకి ముని ప్రణీత రామాయ ణాకుంఠిత పఠన భాగ్య మహిమయని నా యనుమానము.
ఇప్పుడు “శ్రీమదాంధ్ర సుందర కాండ” ఏకవింశతి సర్గమున కలను.
తృతీయ పారాయణములో నరణ్య కాండ చతుర్వింశతి సర్గ.
ఫణి కుమార్ గారు ధన్యవాదములు. నమస్సులు.
తొలగించండినిశ్చయముగ! దైవోపాసన, దైవానుగ్రహము లేనిదే సత్కవులు కాలేరు!
తొలగించండికవీశ్వరులు కామేశ్వరరావుగారికి శతకోటి ప్రణామాలు!🙏🙏🙏🙏🙏🙏
డా. సీతా దేవి గారు నమస్సులు, ధన్యవాదములు.
తొలగించండిరసనను నాట్యమాడును సరస్వతి నిత్యము రావుగారికిన్.....కామేశ్వరరూపవాగ్దేవికి కైమోడ్పులు.
తొలగించండిమిస్సన్న గారు నమస్సులు మఱియు ధన్యవాదములు.
తొలగించండిలవకుశులను చూడ లక్షణుని మనసు
రిప్లయితొలగించండికేమి గలిగె, ఎచట కీర్తనలను
వారు మొదట పాడి నారు నయోధ్యలో,
"ప్రేమ పొంగిపొరలె, వీథులందు",
సూర్యకుమార్ గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"పాడినా రా యయోధ్యలో" అనండి.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆమిక తోడుతన్నరకుడాయెడ లోకము నందలి ప్రాణులెల్లరన్
ప్రేమయె లేక డీల్పఱచ వెన్నుడు నాతని గూల్చి వచ్చునౌ
నేమమునందు నెల్లరట నెయ్యము నొందుచు సంతసించగా
ప్రేమయె పొంగిపొర్లె నడివీధులలో జనులెల్ల చూడగన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిజనత నతకరించి సాగిన నరకుని
సంహరించి వచ్చు శైలధరుని
పథములోన నున్న ప్రజల మనములందు
ప్రేమ పొంగి పొర్లె వీధులందు
రాజారావు గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషాన్ని సవరించండి.
తొలగించండిఏమని చెప్పబోదునిటులెంత తెగించిరి కుర్రకారు శ్రీ
రిప్లయితొలగించండిరామ వచింపలేను పలు రంగుల స్వప్నములందు తేలుచున్
కామము హద్దు మీరగను క్లబ్బుల యందును పబ్బులందునన్
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్ల జూడగన్
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేమయె పొంగి పొర్లినది వీధులలో జనులెల్ల జూడఁగన్
రిప్లయితొలగించండిగామము హెచ్చుగా గలుగ కామిని మానస మందునన్భళా
రాముని మందిరంబు గని రాముని వేడిరి సామి ! మమ్ముల
న్నేమిగ జేతురో యికను నిట్లుగ మేమిట కల్సుకొందుకై
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అకట భారతమున నమెరికా కల్చరు
రిప్లయితొలగించండిపెరగ ముద్దులకును మరుగు లేదు
కుర్రకారునకును వెర్రి పెంపొందంగ
ప్రేమ పొంగిపొరలె వీధులందు
వీటూరి భాస్కరమ్మ
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీమతి జి సందిత బెంగుళూరు
రిప్లయితొలగించండిరాముడయోధ్యవీడి నగరంబునుదాటగసాగుచుండగా
భామినిభూమిజాతయును ప్రక్కన లక్ష్మణుడుండతోడుగాన్
గోముగనూరువారలటుగోలగనడ్డుపడన్గనుంగొనన్
ప్రేమయె పొంగి పొర్లె నడివీధులలో జనులెల్ల చూడగన్ !!"
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కామిని కోర రాఘవుడు కానల కేగెడు వేళయందునన్
రిప్లయితొలగించండిభామిని, భ్రాతలక్ష్మణుడు వచ్చిరి రాముని వీడలేక, నా
గ్రామణి వెంటలోకులును రాజ్యమె శోకము తోడ సాగగన్
ప్రేమయె పొంగిపొర్లె నడి వీధులలో జనులెల్ల జూడగన్
కామిని కోర రాఘవుడు కానల కేగెడు వేళయందునన్
రిప్లయితొలగించండిభామిని, భ్రాతలక్ష్మణుడు వచ్చిరి రాముని వీడలేక, నా
గ్రామణి వెంటలోకులును రాజ్యమె శోకము తోడ సాగగన్
ప్రేమయె పొంగిపొర్లె నడి వీధులలో జనులెల్ల జూడగన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పేరు:శ్రీమతి జి సందిత బెంగుళూరు
రిప్లయితొలగించండిఅంశం:
క్రొత్త పెళ్ళికూతు రత్తవారింటికై
బయలుదేరతల్లి సయట నిలిచె
చెల్లితమ్ముడన్నచేరె కార్లుకదలె
ప్రేమ పొంగిపొర్లె వీధులందు!
పేరు:శ్రీమతి జి సందిత బెంగుళూరు
సందిత గారూ,
తొలగించండిమీ అంపకాల పూరణ బాగున్నది. అభినందనలు.
'బయట నిలిచె'..
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిIIT Kharagpur (1965):
తొలగించండిహోలి రాత్రి పగలు డోలకుల్ వాయించి
రంగు రంగులద్ది భంగు త్రాగి
చందమామ తోడ చంద్ర భాసురమున
ప్రేమ పొంగిపొరలె వీథులందు
చంద్రభాసురము = moonshine liquor
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీరు శంకరాభరణం మీద రిసెర్చ్ చేస్తున్నారన్నమాట రూఢి అయింది.
ఎప్పటి చంద్రశేఖర్ గారు పరిచయం చేసిన 'చంద్రభాసురం'! దాన్ని మళ్ళీ మూన్ లైట్ లోకి తీసుకొచ్చారు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
శంకరాభరణం నాకొక అద్భుత వ్యసనమైనది. ప్రస్తుతం సమస్యాపూరణం - 802 లో నున్నాను. రోజంతా అదే పని.
తొలగించండిత్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.. August 22 వ తేదీన.
నమస్సులు.
రాముఁడు మానసమ్మున పరాక్రమమీయఁగ తెల్లవారలన్
రిప్లయితొలగించండిహోమమునందు రాల్చెడు మహోన్నత సాధన స్వేచ్ఛలూదగన్
గ్రామములాదిగా భరతఖండము జాతిపితా! యనంగనే
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్!!
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రేమికులదినమున వీరంగ మొనరించి
రిప్లయితొలగించండిహోలినాడు రంగ హేల లమర
భరత మాత దాస్యబంధ విముక్తికై
ప్రేమ పొంగి పొరలె వీథు లందు
తిమ్మాజీ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అక్కినేని నటుని యాంధ్రులందరు గూడి
రిప్లయితొలగించండిరాయపూరు చూడ రమ్మని యట
కోట్ల పూల వాన గుప్పించ రోడ్ల పై
ప్రేమ పొంగిపొరలె వీథులందు
కృష్ణారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ముచ్చటగను సాగె భోనాల పండుగ
రిప్లయితొలగించండిపల్లె పట్టణముల బ్రమద మొప్ప
అమ్మవారిపైన ననుపమ భక్తియు
ప్రేమ పొంగి పొరలె వీథులందు
ముచ్చటగను సాగె భోనాల పండుగ
రిప్లయితొలగించండిపల్లె పట్టణముల బ్రమద మొప్ప
అమ్మవారిపైన ననుపమ భక్తియు
ప్రేమ పొంగి పొరలె వీథులందు
లక్ష్మినారాయణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికదలి యాడు చుండ కాళీయు తలపైన
రిప్లయితొలగించండిచిన్న తనము నందె వెన్న దొంగ
విస్మయముగ గనిన వ్రేపల్లె వాసుల
ప్రేమ పొంగి పొరలె వీధులందు
శైలజ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ వసంత కిషోర్ గారు చెప్పినట్లు అందరి పూరణలు అలరించు చున్నవి .గురుదేవులకు, కవీశ్వరులకు నా దన్యవాదములు
రిప్లయితొలగించండిరాఖి పండుగ యిది రహియు కల్గె మదిలో
రిప్లయితొలగించండితోడబుట్టువులకు తోషమయ్యె
చెల్లి ప్రేమతోడ చేతికిడగ భ్రాతృ
ప్రేమ పొంగి పొరలె వీధులందు.
రాఖి పండుగనగ రయమున తామేగి
సోదరీమణులిల సోదరులకు
చక్కగాను కట్టి సాటిలేని విధాన
ప్రేమ పొంగి పొరలె వీధులందు.
అమ్మ దినమటంచు నవనిలో మేనెల
నాది వారమందు నాచరించ
అమ్మలమనమందు హర్షమొదవ మాతృ
ప్రేమ పొంగి పొరలె వీధులందు.
ప్రేమికుల దినమని పెనుసంబరాలతో
ప్రేమ పొంగిపొరలె వీధులందు
నెంత వింతయునిది యిలలో నొక దినమె
ప్రేమదినమటంచు ప్రీతి చూప.
రామనవమి నాడు రామ విగ్రహమును
వీధులందు దిప్ప వేల జనులు
రామభజన తోడ రయమున సాగంగ
ప్రేమ పొంగి పొరలె వీధులందు.
కపట జూదమాడి కానలకంపంగ
పాండు సుతులు చనగ ,బాధ పడుచు
వెంట నడచి రెల్ల వేవేగ పురజనుల్
ప్రేమ పొంగి పొరలె వీధులందు.
స్వచ్చ భారతమని స్వచ్చపరచ నూరు
నాయకులట రాగ నయము తోడ
నేను సైత మనుచు నెల్ల రటకు రాగ
ప్రేమ పొంగి పొరలె వీధులందు.
ఉమాదేవి గారూ,
రిప్లయితొలగించండిఏడు వైవిధ్యమైన పూరణలతో సప్తవర్ణాల ఇంద్రధనుస్సును చూపించారు. చక్కని పూరణ. అభినందనలు.
ధన్యవాదాలన్నయ్యగారూ.
రిప్లయితొలగించండిభీమునిపట్నమందునను భీమవరమ్మున కాకినాడలో
రిప్లయితొలగించండిపాములపాళెమందునను బంజరహిల్సున చార్మినారులో
దోమలగూడయందునను త్రోవల కాల్వల మున్సిపాలిటీ
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
రిప్లయితొలగించండిమామనసున్ చెలీ సఖియ మార్చితివే జవ రాల ! నీదుపై
ప్రేమయె పొంగిపొర్లె; నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్
కాముకుడా జిలేబి కయిగట్టిగ బట్టుచు ముద్దు లిమ్మనన్
లేమయు లెంపకాయనిడ లెక్కకు లెక్కయు దేలెబో భళీ!
జిలేబి
భామలు రైతుబిడ్డలును బారులు తీరుచు భాగ్యనగ్రినిన్
రిప్లయితొలగించండిదోమలు ముర్కి వాగులును తోడుగ నుండగ చెట్టపట్టగా
గోముగ చంద్రశేఖరుడు కొట్టగ బాబును చీదరించుచున్
ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్ :)