28, జులై 2017, శుక్రవారం

సమస్య - 2422 (మునిఁ గన్గొన ముదిత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్"
శ్రీరాం వీరబ్రహ్మ కవి పూరణ....
అనఘాత్ము విప్రవరుఁ బ్రవ
రునిఁ గని మోహాంధయై వరూధిని వలద
న్నను వీడక యా గుణధా
మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్"
('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథమునుండి)

85 కామెంట్‌లు:

  1. వనవాసమ్మున వెలయుచు
    మనసులు దోచుచు మురిసెడి మన్మోహనుని
    న్ననఘుండా దశరథ రా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. *"శూర్పణఖ"
      పదాన్ని కిట్టించడం కష్టముగా నున్నది...

      తొలగించండి
    2. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. అనఘుడు కుంతికి కొమరుడు
    ననిలుని యంశను జననము నందిన ఘనుడౌ
    జననుతపరాక్రముడు భీ
    ముని గన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్.

    రిప్లయితొలగించండి

  3. కవితాలోకమునకు గరుడ పంచమి శుభాకాంక్షలతో

    మనువాడెదమ్ము శూర్పణ
    ఖను! రా రా! రమ్మనుచు సుఖమ్ముల దేల
    న్ననఘా ! వనమున యా రా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్!

    సావేజిత
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ...ఎన్నాళ్ళకెన్నాళ్ళకి!!!

      శుభోదయం!!!

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం! (మీకు శంకరాభరణం బ్లాగుమీద కోప మేమైనా వచ్చిందేమో అని సందేహించి మీ 'వరూధిని' బ్లాగు చూశాను. మే 25 తరువాత ఆ బ్లాగులోను పోస్టులు లేకపోవడంతో మీరు వేరే పనుల్లో వ్యస్తులై ఉన్నారను కొన్నాను).
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. "వనమున నా రాముని" అనండి. అక్కడ యడాగమం రాదు.

      తొలగించండి


    3. ధన్య వాదాలండీ కంది వారు !

      అబ్బే ! ఖ యాతా యాతంబంతే :)

      చీర్స్
      జిలేబి

      తొలగించండి

    4. ధన్య వాదాలండి జీపీయెస్ వారు ! కుశలమే నా !

      జిలేబి

      తొలగించండి
    5. జిలేబి గారూ, మీ అదృశ్యం నాలాంటి నిద్రాణమైన వారికి కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది.
      పునః స్వాగతం

      తొలగించండి
    6. అనయము నూతనరీతుల
      యొనరించుచు పూరణముల నుత్సాహమునన్
      దనరెడు జిలేబి బ్లాగున
      కనుగొన దినమును మనమున కాహ్లాదంబే!

      జిలేబి లేనిబ్లాగు చీకటి నైటే! హ్యూమరులేని హ్యామరుపోటే!
      స్వీటులేని ఘాటు సాపాటే! వెరైటీలేని వెడ్డింగ్ కోటే!

      జిలేబిగారూ! సంతోషంతో పునఃస్వాగతమ్!
      💐💐💐💐💐💐

      తొలగించండి

    7. సీతాదేవి గారికి

      నమో నమః !

      మీ పద బంధములకు ప్రొత్సాహములకు ధన్యవాదములతో

      జిలేబి

      తొలగించండి
  4. అనుపమ సుందర దేహుని
    ననఘుని సారంగ ధరుని నాసమయమునం
    దనుచిత గతి సద్గుణ ధా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్.

    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారూ,
      చిత్రాంగి ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  5. తనకై హనుమన్ బంపుచుఁ
    గొనిపోవఁగ వత్తుననుచుఁ! గుశలమ్మనెడున్
    కనకాంగులీయమున రా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. అనుపమ సుందర రూపు ని
    ఘన భుజ శాలి ని తరు ణుల కై జనియి oచేన్
    అనుకొoచుశూర్ప ణఖరా
    ము ని గన్ గొనము ది త వ ల పుముమ్మరమయ్యే న్

    రిప్లయితొలగించండి
  7. ధనువును విరిచిన వీరుని
    జనకుడు గని సంతసించి జానకి నివ్వన్
    మునిగణ వందితుడగు రా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మనమున హంస పలుకులను
      మననము జేయుచు వివాహ మందున నిషధే
      శుని తెలివిగ సద్గుణ ధా
      మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

      తొలగించండి
    2. ఫణికుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.

      తొలగించండి
  8. దనుజాగ్రణి సోదరి యగు
    వనితయె శూర్పణఖ కాంచె వనమున యనఘు
    న్నినకుల తిలకుని శ్రీరా
    ముని, గన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్.

    అనుజుని తోడుగ మిథిలకు
    మునివెంటను కదలివచ్చు మోహన రూపున్
    జనవంద్యుండగు శ్రీరా
    ముని, గన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్.

    రిప్లయితొలగించండి
  9. యాగమందు లవకుశులు అశ్వమును బంధించగా శ్రీ రాముడేతెంచిన సందర్భమున:

    వనిలో ముని యాశ్రమమున
    తనతనయులు రామమూర్తి దర్పముద్రుంచన్
    జనుదెంచిన నా రఘురా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్!

    రిప్లయితొలగించండి
  10. ………………………………………………

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    కన , నా వాచస్పతి కిన్

    " వనితామణి " యైన తార వ౦చి౦చె పతిన్ ||

    మనసిజశర హత యై >> సో

    ముని గన్గొన , ముదిత వలపు

    ముమ్మరమయ్యెన్


    { వనితా మణి యై = " భార్యామణియై " అని

    అ వ హే ళ న గా చెప్పుట }
    ''''''''''''''''''''''''

    రిప్లయితొలగించండి
  11. ముని యాగము గావగ తన
    యనుజుని తో నేగి కాన నడుగిడి నంతన్
    పనిగొని రక్కసి రఘురా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
  12. తన కాటుక గోటన్ 'విష
    మ' నుమాట 'విషయ' గ చంద్రహాసుని లేఖన్
    గొని దిద్ది, వదనమున సో
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్!

    రిప్లయితొలగించండి
  13. ప్రబంధాల్లో ప్రాసయతి ప్రయోగాలు అని ఒక పరిశీలన చేస్తున్నాను. తొలివిడత టపా లింకు: http://syamaliyam.blogspot.in/2017/07/blog-post_27.html

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చదివి, తప్పకుండా స్పందిస్తాను. ధన్యవాదాలు.
      బ్లాగు మిత్రులను కూడ చదవమని సూచిస్తున్నాను.

      తొలగించండి
  14. మనమున సీతకు ద్రోహము
    తన యగ్రజు రావ ణాజ్ఞ తలపెట్టియు తా
    జనుదెంచి శూర్పనక రా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
  15. అనయము నురమున స్ధిరముగ
    ననపాయని పద్మనయని యలమేల్మంగే
    వనజముఖుని వేంకటరా
    మునిగన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్!

    రిప్లయితొలగించండి
  16. మనసును దోచిన దేవకి
    తనయుడు నగవుచు నిలబడి తనకై కరమున్
    యనువుగ జాప, పరంధా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్"
    రుక్మిణి ని కొనిపోవగ రధము పైకి రమ్మని కృష్ణుడు చేయి జాపగా ఆమె భావన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య కుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కరమున్+అనువుగ అన్నపుడు యడాగమం రాదు. "తనకై హస్తం।బును చాచగా పరంధా..." అనండి.

      తొలగించండి
  17. వనమునను సంచరించుచు మనసును హరియించికరము మగటిమి తోడన్ ఘనభుజబలము వెలయు భీ ముని గన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్ Asnreddy

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. అన్నట్టు.. ఈమధ్య మీ పద్యాలలో పాదవిభజన ఉండడం లేదు. కారణం?

      తొలగించండి
    3. మాగ్రామములో(మంగళగిరి) ఉన్నాను. సెల్ ఫోన్ లో వాట్సాప్ లో డైరెక్టుగా టైపు జేసి దానిని శంకరాభరణంలో పోష్టుచేసినప్పుడు తేడావస్తుంది.రేపు హైదరాబాద్ వస్తున్నాను. 31.07 నుండి లాప్ టాప్ లోచేస్తాను. మన్నించండి.

      తొలగించండి
  18. గురువుగారికి నమస్కారములు. మొన్నటి, నిన్నటి పురాణాలను గూడా పంపుతున్నాను. దయతో పరిశీలించా గలరు.

    26-07-2017:

    రయమున విలు నెత్తగబోయి లావు లేక
    తలను వంచు రాజుల జూచి దాశరధియె
    కార్ముకమ్ము నొంచగ సీత కట్టి వడిని
    నయము జయమును భయము విస్మయము గలిగె

    27-07-2018:

    నేమము నించెడి వానిని,
    కామారికి గల శకటము, గౌరికి సుతుడున్,
    రాముని బంటును, పేర్కొన
    కాముండెనుబోతు విఘ్ననాథుడు కపియౌ

    28-07-2017(నేడు):

    వనిలో చరించు నా భీ
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్
    వినయమ్మున కుంతి నడిగి
    మనువాడెను హిడింబి మారుతి నపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు,
      మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ చివరి పాదం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి
      "ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లుమనె, గు
      భిల్లుమనె గుండె నృపులకు, జల్లుమనియె
      జానకీదేహ మొక నిమేషమ్మునందె
      నయము జయమును భయము విస్మయము గదుర" అన్న పద్యాన్ని గుర్తుకు తెచ్చింది. సంతోషం...
      ఈనాటి సమస్యకు పూరణలో చివరిపాదంలో గణదోషం. "మనువాడెను తా హిడింబి..." అనండి.

      తొలగించండి
  19. క్రొవ్విడి వెంకట రాజారావు:

    క్షమించండి. పూరణలు. పురాణములు కాదు.

    రిప్లయితొలగించండి
  20. అనిఁ జేరఁ బోవు నభిమ
    న్యుని వీర తిలకము దిద్ది యుత్తర, తపనల్
    పెనుకొన నంపుచు రణ భీ
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
  21. ఘనబాహుఁడు హరివక్షపు
    వనజాక్షుఁడు సుప్రియాస్య భాసిత తేజు
    న్నన విలుకాని సముని రా
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సింహోరస్కం మహాబాహుం పద్మపత్రనిభేక్షణమ్.
      ఆజానుబాహుం దీప్తాస్యమతీవ ప్రియదర్శనమ్৷৷3.17.7৷৷

      గజవిక్రాన్తగమనం జటామణ్డలధారిణమ్.
      సుకుమారం మహాసత్త్వం పార్థివవ్యఞ్జనాన్వితమ్৷৷3.17.8৷৷

      రామమిన్దీవరశ్యామం కన్దర్పసదృశప్రభమ్.
      బభూవేన్ద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహితా৷৷3.17.9৷৷

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి ప్రణామోత్తర ధన్యవాదములు.

      తొలగించండి
  22. ఘనముగ పాశుపతమ్మును
    గొని జనకుని సభకునేగ గూరిమితోడన్
    చనవున జేరుచు రణభీ
    మునిగన్గొన ముదితవలపు ముమ్మరమయ్యెన్!

    రిప్లయితొలగించండి
  23. వనమున సామీరిని గని
    యనురాగముతో హిడింబి యలరుచు,జనని
    న్ననుజుల గాచెడు రణ భీ
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్!!!

    రిప్లయితొలగించండి
  24. కని విని యెరుగనిదీ తప
    మని ముని గమనముల నాపుమను యింద్రాజ్ఞన్
    మననము గొన పుష్కరమున
    మునిఁ గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (మేనక విశ్వామిత్రుని తపస్సు భగ్నం చేయుట)

      తొలగించండి
    2. రఘురామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      (మీ పూరణ ఎందుకో అప్పుడు నా దృష్టిపథం నుండి తప్పిపోయింది. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఆలస్యానికి మన్నించండి).

      తొలగించండి
  25. అనితరసాధ్యంబగు శివ
    ధనువున్నవలీల విరచు దనుజాంతకుడౌ
    యినకుల సోముడు శ్రీరా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్ !!!

    రిప్లయితొలగించండి
  26. మునివరు తపమును జెరుపగ
    పనుపగ దేవేంద్రుడంత బాయని వేడ్కన్
    జనినది మేనక యచ్చట
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్
    వీటూరి భాస్కరమ్మ

    రిప్లయితొలగించండి
  27. ననవిలుతునలుగునకు శూ
    ర్పణఖవిమోహమును జెంది ప్రా వృన్మేఘ
    మ్మునుబోలెడి దశరథ రా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్ !!!

    రిప్లయితొలగించండి
  28. మధ్యాక్కర
    కనులయందున సొగసంత-కామితంబునునింప ?మనసు
    తనువునందలి తత్వ వింత దాచబోకనుకోర్కెలెల్ల
    మునిగన్గొని ముదితవలపు ముమ్మర మయ్యెన్|విధివర
    మె|”నరుల వోలె మేనకట మెచ్చమౌనిని తుచ్చమేగ?

    రిప్లయితొలగించండి
  29. వినయపు నతులను నిత్తును
    ముని గన్గొన, ముదిత వలపు ముమ్మర మయ్యెన్
    గని నంతనె తన భర్తను
    వనజా ! విను సహజ మదియ వనితల కెల్లన్

    రిప్లయితొలగించండి
  30. వనమున వెలసిన కలువకు
    మనమున విరహము రగులగ మైకము నందన్
    మునిమాపు వేళలో సో
    ముని గనుగొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్!

    రిప్లయితొలగించండి
  31. వనమున వెలసిన కలువాం
    గన యెద విరహమున జారి గమనము తప్పన్
    మునిమాపు వేళలో సో
    ముని గనుగొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      సవరించిన మీ యీ పూరణ కూడా బాగున్నది. అభినందనలు.

      తొలగించండి

  32. పిన్నక నాగేశ్వరరావు.

    మునితో సభ కేతెంచియు

    ధనువు న్నెక్కిడగ సఫలతన్ బొందిన

    య్యినకుల వంశజుడౌ రా

    ముని గన్గొన ముదిత వలపు ముమ్మర
    మయ్యెన్.
    *****************************

    రిప్లయితొలగించండి
  33. ననవిలుతునలుగునకు శూ
    ర్పణఖవిమోహమును జెంది ప్రావృణ్మేఘ
    మ్మునుబోలెడి దశరథ రా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్ !!!

    రిప్లయితొలగించండి
  34. దనుజాంగన సౌమిత్రిని
    గని మరులుగొనంగ జూపె కాకుత్సునటన్
    మనమున తమిపెరుగగ రా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్

    మునిగా వచ్చిన యతియే
    తన బావ యటంచు నెరిగి తా తోషముతో
    మనమున నాధర్మజుత
    మ్ముని గన్గొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్.

    దనుజుండచ్చట నరవా
    సన యని యరయంగ బంప సైదోడు నటన్
    వనిలో హిడింబ యా భీ
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్.
    సైదోడు=సోదరి.


    ఘనమగు విలువిరిచిన రా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మరమయ్యెన్
    వినయముతోతల వాల్చుచు
    నినకుల సోముని గళమున నిడె పూమాలన్

    వనమున పిల్లన గ్రోవిని
    మనమలరగ నూదు చున్న మాధవ దేవున్
    గనులారగమే ఘశ్యా
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్.

    వనిలో తపమును చేసెడి
    యనలాంబకునకు మదనుడు నస్త్రము లేయన్
    కనలుచు విషధరుడగు సో
    ముని గన్గొన ముదిత వలపు ముమ్మర మయ్యెన్.

    రిప్లయితొలగించండి

  35. పిన్నక నాగేశ్వరరావు.
    ( నా రెండవ పూరణము.)

    ( సోముడను భర్త కలిగిన యువతి.)
    తనను తన పతిని విడదీ

    సిన యాషాఢమ్ము సెలవు జెప్పగ,
    ముదము
    న్ననుదినమున్ జూచుచు సో

    ముని గన్గొన ముదిత వలపు ముమ్మర
    మయ్యెన్.

    రిప్లయితొలగించండి