30, సెప్టెంబర్ 2017, శనివారం

సమస్య - 2479 (విజయదశమి వచ్చు...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"విజయదశమి వచ్చు విదియనాడు"

73 కామెంట్‌లు:

 1. గురువు గారికి కవి మిత్రులకు నమస్కరములు
  మొదటి పాదములో మొదటి అక్షరము రెండవ పాదములో రెండవ అక్షరము మూడవ పాదములో మూడవ అక్షరము వరుసగా కలిపి చదువకోవలెను
  కరివ దనుడు ఎల్లప్పుడు కాచు చుండు ,
  శివుడు నిత్యము మేలును చేయు చుండు,
  కమల నాభుడు సతతము గరుణ చూపు,
  ఆ పలుకు ముద్దరాలు ను అభయ మిచ్చి
  నిరతము విజయమునిడుచు శరణు చూపు,
  మాత జలధిజ సర్వదా చెంత నుండు,
  తల్లి నగజాత యమునమ్మ దయను చూపు,
  సర్వ కాలము లందు దశ రధ సుతుడు
  శక్తినిచ్చుచు కాచును శరము తోడ,
  మిహిరు డెప్పుడు మీకు కా మితము దీర్చు,
  సుందరుడు కలువలదొర శుభము నిడు, అ
  భయము నిడుచు యవిరతము భాధ తీర్చు
  ఘనముగ హనుమంతుండు , పాకారి కాంతి
  నిడుచు సతతము ఘనతతో నీకు క్షమనొ
  సగును, జరుపు నేడు దసరా సంబరాలు


  వచ్చు సందేశము “ కవులకు విజయ దశమి శుభా కాంక్షలు”


  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
   బాగుంది. ధన్యవాదాలు.
   'మాత జలధిజ...' పాదంలో యతి తప్పింది.

   తొలగించండి
  2. కృష్ణ సూర్య కుమార్ గారు గంగాప్రవాహ సదృశము మీ కవితావాహిని ధార. సుమధుర గాత్రమునకు సంగీత జ్ఞాన మబ్బు నట్లు మీకు తప్పక వ్యాకరణ పరిపూర్ణత నబ్బ గలదు. కృషితో నాస్తి దుర్భిక్షము.
   మీకు మనఃపూర్వకాభినందనలు మరియు ధన్యవాదములు.

   తొలగించండి
 2. పదులు,వంద,వేలు,-బహుళమై కన్పట్టు
  నొక్క సూర్యబింబ ముదకమునను-
  విదియ తదియలన్ని వేరుగాఁదలపకు
  విజయదశమి వచ్చు విదియనాడు

  రిప్లయితొలగించండి
 3. దుర్గమునుని ద్రుంప దుర్గరూపంబున
  సర్వజగజ్జనని శ్యామలాంబ
  యవతరించ నార్య యష్టమీ తిధియందు
  విజయ దశమి వచ్చు విదియ నాడు!

  అష్టమికి రెండవ రోజు దశమి గదా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సీతాదేవి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   "దుర్గముని వధింప..." అనండి.

   తొలగించండి
  2. గురుదేవులక నమస్సులు! సవరించిన పూరణ!

   తొలగించండి
  3. దుర్గముని వధింప దుర్గరూపంబున
   సర్వలోకజనని శ్యామలాంబ
   యవతరించ నార్య యష్టమీ తిధియందు
   విజయ దశమి వచ్చు విదియ నాడు!

   అష్టమికి రెండవ రోజు దశమి గదా!

   తొలగించండి
 4. అన్ని కోట్లు పెట్టి యద్భుతమ్ముగ తీసి
  నారట గద!చిత్రనామమేమి?
  ఎపుడు విడుదలౌను? ఇందిరా! చెప్పవే?
  విజయదశమి;వచ్చు విదియ యందు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బాపూజీ గారూ,
   'విజయదశమి' అనే సినిమా విదియనాడు విడుదల... చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
  2. బాపూజీ గారిది మనోహర కల్పన.అభినందనలు!

   తొలగించండి
 5. కృష్ణసూర్యకుమార్ గారూ సందేశం చాలా బాగుందండీ

  రిప్లయితొలగించండి


 6. ద్వాదశి మునుపమ్మ ధవళాక్షి పబ్బము
  విజయదశమి వచ్చు; విదియనాడు
  పండుగలకు రెండవ దినము ; నవరాత్రు
  లందు రమ్మ దేవి లక్షణముగ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. డా.పిట్టా
  సప్త వర్ష యుద్ధ సమయము వలె బ్రశ్న
  గ్రుడ్లు వెళ్ళబెట్ట కోయి కొడుక
  దసర దశమి నాడె, దద్దమ్మ తప్పురా!
  "విజయదశమి వచ్చు విదియనాడు"
  (తండ్రి కొడుకుల సంవాదము)
  How long was the "Seven Years War" fought? Ans. 7 years.విజయ దశమి శుభాకాంక్షలతో!

  రిప్లయితొలగించండి
 8. గణములు యతి ప్రాసలు నేర్పు కత్తి పీరు
  సాయిబు తెలుగు మాస్టరు(పంతులు) చక్క జెప్పె
  తిట్లు దిట్టి “వి” కి “వి” యతి ఇట్లు చూడు
  “వి”జయదశమి వచ్చు “వి”దియనాడు!
  మనవి: మాకు ఒక కిరస్తానీ తెలుగు మాష్టారు ఉండేవాడు. “అరిశ్చంద్రుడు” అని వ్రాసి మా అందరి చేత అదే కాపీ వ్రాయించాడు. మాష్టారు! అది “హరిశ్చంద్రుడు” అని చెప్పినవాడిని బెత్తంతో కొట్టాడు. ఆ దెబ్బలు తిన్నవాడిలో నేనూ ఒకడిని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చంద్రశేఖర్ గారూ,
   బహుకాల దర్శనం! దసరా నాడు పునర్దర్శనం సంతోషదాయకం!
   'వి-వి'లకు యతిమైత్రి చెప్పడానికి చక్కని ఉదాహరణ చెప్పాడు ఆ మాస్టారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   ముస్లిమైన పీరు సాహెబు బాప్తిజం తీసుకున్నాడన్నమాట!

   తొలగించండి
 9. ఆశ్వియజము నందు నందరిష్టపడెడి
  విజయదశమి వచ్చు, విదియ నాడు
  వత్తు రింటి కెల్ల బంధుజనంబులు
  హాయిగాను గడుప నవని యందు.

  రిప్లయితొలగించండి
 10. శమీ శమయతే పాపం
  శమీ శతృ వినాశినీ
  అర్జునస్య ధనుర్థారి
  రామస్య ప్రియదర్శిని

  శ్రీ దుర్గా మాత ఆశీస్సులతో సకల శుభాలు మీకు మీ కుటుంబీకులకు కలగాలని ఆశిస్తూ విజయదశమి శుభాకాంక్షలు..

  రిప్లయితొలగించండి
 11. మాస్టరుగారికి, కవిమితులు, వీక్షకులు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

  కం:
  మహిషుని దునిమితివనుచును
  మహిజనులిట దలతురుగద మహిమల తల్లీ!
  మహిళల నబలల జెర'చెడు'
  మహిషుని సుతులెటుల గలిగె మరి మహిజెపుమా?

  కం:
  పంచుము నీ శక్తులనే
  మంచిగ నీ యవనిలోని మహిళలకిపుడే
  దించగ దుష్టుల మదమును
  దంచగ మానమ్ముదోచు దనుజాధములన్.

  రిప్లయితొలగించండి
 12. అందరి మనసులకు నాహ్లదమిచ్చెడి
  శ్రియమగు దశరాకు చిట్టచివర ;
  ఎప్పు డరుగు దెంచు నేటేట రంజాను?
  విజయ దశమి వచ్చు ; విదియ నాడు.

  రిప్లయితొలగించండి
 13. శెలవులిచ్చినారు చిన్నవానికి పాఠ
  శాలయందు వాడు వీలుజూచి
  బయలుదేరు గాద పండుగే మనకిక
  విజయ దశమి, వచ్చు విదియ నాడు.

  రిప్లయితొలగించండి
 14. ఆశ్వయుజపుదశమియనబడుదినమున
  విజయదశమివచ్చు,విదియనాడు
  దుర్గమాతనెపుడు దుహితముల్ బరిమార్చ
  పూజసేతురయ్య! పుడమిజనులు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సుబ్బారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దుహితముల్'..? అది 'దురితముల్' కదా!

   తొలగించండి
 15. ………………………………
  గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  " ఇటలి ను౦డి వత్తు - ఇ౦డియాకు గడుప

  విజయదశమి | వచ్చు విదియ నాడు

  మీ వివాహము గని పోవలెను తిరిగి "

  యను విజయకు > సరిత థ్యా౦క్సు చెప్పె

  రిప్లయితొలగించండి
 16. సత్యభామ నరర సంహారము నుజేయ
  విజయదశమి వచ్చు, విదియ నాడు
  మంచిజరుగు ననెడు మనసున భావన
  కార్యసిద్ది నొసగు కర్మ ఫలము

  రిప్లయితొలగించండి
 17. కృష్ణ సూర్య కుమార్ గారు!మీ ప్రతిభకు,కృషికి జోహార్లు, జేజేలు, అభినందనలు !

  రిప్లయితొలగించండి
 18. సకల దేవత లిచ్చు సకలసంపదలను
  ననుచు వ్రాసి నట్టి యార్య! నీదు
  రచన యద్భుతంబు పూసపాటివరేణ్య!
  సాటి గలరె?నీకు సములలోన

  రిప్లయితొలగించండి
 19. సప్తమి దినమునను జనుదెంచు మనుచును
  దాను ముందు నేఁగఁ దనివి తీర
  పుత్రి భర్త వేడి పుట్టింటను గడుప
  విజయదశమి, వచ్చు విదియనాడు

  రిప్లయితొలగించండి
 20. గురువు గారికి మరియు ఇతర కవులకు విజయదశమి శుభాకాంక్షలు. నా పూరణ లోని లోపాలను ఎత్తి చూపుడు.
  క్రీడి ఏ ది నమున క్లిష్ట మ గురణమున్
  విజ యు డ య్యె? కాల విశ్వ
  గమన మందు నాడు ఙ్ఞానం ద లహరిగా
  విజయ దశమి వచ్చు విదియ నాడు.
  వందనములు

  రిప్లయితొలగించండి
 21. వెంకట నారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  'జ్ఞానంద లహరి'...?

  రిప్లయితొలగించండి
 22. శుభము నొసగి పర్వ శోభల నందించ
  విజయదశమి వచ్చు; విదియ నాడు
  భక్త గణము జేరె బ్రహ్మోత్సవములకు
  తిరుమలేశు గొలిచి కరుణ బడయ!


  రిప్లయితొలగించండి
 23. సుకవి గణమునకు విజయదశమి శుభాకాంక్షలు!

  రిప్లయితొలగించండి
 24. కిరీటి విజయ దశమి రోజున జయమును పొందినాడు.
  ఒక విదియ నాడు ఙ్ఞానముతో కూడిన ఆనo ద ము పొందినాడ ని నా భావం భా వము కు తగ్గ పూరణ చేయాలని ప్రయత్నం.ఇ క తమ దీవెనలు.కొన్ని పదము లు టైప్ చేయడం నా వల్ల కాలేదు.
  నమస్సులు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జ్ఞానముతో కూడిన ఆనందం... జ్ఞానానందం అవుతుంది. కాని మీరు 'జ్ఞానందము' అని టైప్ చేశారు. పొరపాట్లు, దోషాలు సహజం. ముందు ముందు చక్కని భావ వ్యక్తీకరణతో నిర్దోషంగా పద్యాలు వ్రాయగలరు.కొనసాగించండి. స్వస్తి!

   తొలగించండి
 25. శుక్ల పక్ష మందు శుభ ఆస్విజమునందు
  విజయ దశమి వచ్చు , విదియ నాడు
  కార్తికమున భగిని కరభోజనము రాగ
  చెల్లి యింట విందు చేయు చుండు

  రిప్లయితొలగించండి
 26. మెచ్చు కొందు మిమ్ము మిత్రమా! యీనాడు
  విజయదశమి! వచ్చు విదియనాడు
  నందు కొనెద ఋణము తొందరేల? దినముఁ
  దప్పరనియు దెలియు నప్పుఁ దీర్చ

  రిప్లయితొలగించండి
 27. .”విజయ మొసగె శక్తి నాడు విజయు డెంచభక్తితో
  రజతమనుసు బంచె దుర్గ రక్తియందు పోరునన్”
  “విజయ”విజయ దశిమి వచ్చు|”విదియ నాడు గొప్పగా
  ప్రజల కొరకు మోహరంబు పండుగపుడె మొదలులే|”

  రిప్లయితొలగించండి
 28. గురువుగారికి కవిమిత్రులకు విజయదశమీ శుభాకాంక్షలు:

  మా చిన్న నాటి దసరా గిలకల పాట

  ఏదయా మీ దయా మామీద లేదు
  ఇంత సేపుంచుట ఇది మీకు తగదు
  దసరాకు వస్తిమని విసవిసలు పడక
  చేతిలో లేదనక చెప్ప లేమనక
  రేపు రా మాపు రా మళ్ళి రమ్మనక
  ఇప్పుడే లేదనక ఇవ్వలే మనక
  పావలా ఇస్తేను పట్టేది లేదు
  అర్థ రూపాయిస్తె అంటేది లేదు
  రూపాయి ఇస్తేను చెల్లుబడి కాదు
  వాటముగ మా కొక్క వరహాయె చాలు
  జయాభి జయభవ దిగ్విజయీభవ.

  రిప్లయితొలగించండి
 29. గురువర్యులకు మఱియు కవి మిత్రులందరికి విజయదశమి శుభాకాంక్షలు.
  సిరుల మోసు కొచ్చె స్థిర వాసరమునందు
  విజయ దశమి! వచ్చు విదియ నాడు
  వారమిదియె యగును, పరిహాసమనబోకు!
  మరల నాది వారమందె తదియ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శ్రీధర రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   వచ్చె - 'ఒచ్చె' అన్నారు. "సిరుల తాను తెచ్చె" అందామా?

   తొలగించండి
  2. గురువర్యులుకు నమస్సులు. మీ సూచన మేరకు సవరించాను, ధన్యవాదాలు.
   సిరుల తాను తెచ్చె స్థిర వాసరమునందు
   విజయ దశమి! వచ్చు విదియ నాడు
   వారమిదియె యగును, పరిహాసమనబోకు!
   మరల నాది వారమందె తదియ!

   తొలగించండి
 30. మరలు నేమొ దీపావళి తరలినంత
  కాక సంక్రాంతి పండువ గడచు పిదప
  వర పురుషుఁ డల్లుడు మనతోన్ జరుపుకొనగ
  విజయ దశమి, వచ్చు విదియ నాడు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఊకదంపుడు గారూ,
   ఆశ్చర్యం! మీరు పొరబడ్డారంటే ఆశ్చర్యంగా ఉంది. సమస్య ఆటవెలది... మీరు తేటగీతి వ్రాశారు.

   తొలగించండి
  2. గురువు గారు,
   మన్నించండి.
   అభ్యాసము తప్పటము వలన జరిగిన తప్పిదము.
   సవరించిన పద్యము సరిచూడవలసినది.

   తిరిగి వెళ్ళునేమొ దీపావళి పిదప
   కాక సంక్రమణము గడచి నంత
   యల్లుడు మన తోడ నాచరింపఁదలచి
   విజయ దశమి, వచ్చు విదియ నాడు


   భవదీయుడు
   ఊకదంపుడు

   తొలగించండి
  3. బాగుంది మీ పూరణ. అభినందనలు.
   వెనుకటి ఒక అల్లుడు అత్తారింటికి వచ్చి "ఏదీ.. రెండు రాత్రులుండి పోతా"నన్నాడట! శివరాత్రికి వచ్చి సంకురాత్రికి పోతానన్నాడు మరి!

   తొలగించండి
 31. ఆటవెలదిలోని యర్క పంచక మెట్టు
  లుండునోయి ఛాత్ర యుదహరించు
  మనిన గురున కాత డాడె నీరీతిగా
  విజయదశమి వచ్చు విదియనాడు.

  రిప్లయితొలగించండి
 32. మనువయినది మొదలు తనయనే రమ్మన్న
  కొలువు పేర రాను కుదరదనుచు
  పర్వదిన మటంచు భక్తితో జేయంగ
  విజయదశమి, వచ్చు విదియనాడు.

  రిప్లయితొలగించండి
 33. క్రొత్తగా పెండ్లి అయిన అతను తన భార్యతో ఇలా అంటున్నాడు-
  విజయ! మనపెండ్లి యైనది విజయవాడ
  యందు కనుక కనకదుర్గ నందు జూడ
  వేడుక మనకు నారోజు “విజయదశమి,
  వచ్చువిదియనాడు” శుభము పయనమవ్వ.

  రిప్లయితొలగించండి
 34. మనువయినది మొదలు తనయనే రమ్మన్న
  కొలువు పేర రాను కుదరదనుచు
  పర్వదిన మటంచు భక్తితో జేయంగ
  విజయదశమి, వచ్చు విదియనాడు.

  రిప్లయితొలగించండి