5, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2483 (సోమరితనమ్మె జనులకు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సోమరితనమ్మె జనులకు సొబగుఁ గూర్చు"
ఈ సమస్యను పంపిన మిట్టపెల్లి సాంబయ్య గారికి ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. అభ్యుదయమును దరచుగ నడ్డు నేది?
    సతత మెవ్వరికి ప్రభుత హితము గూర్చు?
    మంచి నడతయె జగతిని మనుజులకును
    "సోమరితనమ్మె; జనులకు; సొబగుఁ గూర్చు"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలార్యా ! హరిద్వార్ లో ఉన్నారనుకుంటాను. శుభయాత్ర!

      తొలగించండి


  2. బతుకు లను పాడు జేయును పరిధి మీర
    సోమరితనమ్మె; జనులకు సొబగుఁ గూర్చు
    చురుకు దనము జిలేబి వచోగ్రహముల
    నొగ్గి వినవమ్మ మేలగు నోయి బోటి !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. ఎట్టి దేశమైనను నభివృద్ధి నంద
    కుంటకు గతంబు పౌరుల కునికిపాటు,
    సోమరితనమ్మె ;జనులకు సొబగు గూర్చు
    దేహశక్తి,నిరంతరధీరయుక్తి.

    రిప్లయితొలగించండి

  4. జనార్ధనరావు గారికి జన్మ దిన శుభాకాంక్షలు !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. ముదిమి నాపదలన్నియు ముసురువేళ
    లేచి కూర్చుని ధ్యానము చేయలేక.
    కాలుసేతులు జడములై కూలువేళ.
    సోమరితనమ్మె జనులకు సొబగుఁగూర్చు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 2వపాదంలో.
      లేచి కూర్చుని ధ్యానము ల్చేయలేక.
      అని చదువ ప్రార్ధన

      తొలగించండి
    2. ప్రసాదరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. ప్రసాదరావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. గమనమది లేని గ్రహరాశిఁ గనఁగ దరమె?
    చలనమాగిన జీవమ్ము శవమె చూడ!
    కర్మ శూన్యత నందునే ఘనత? విడువ
    సోమరితనమ్మె, జనులకు సొబగుఁ గూర్చు

    రిప్లయితొలగించండి
  7. కనగ వెనుకబాటున కేమి కారణమ్ము?
    ప్రభుత యెవ్వారలకు కూర్చు రక్షణంబు?
    ఇంతులకు నలంకరణమ్ము లేమి గూర్చు?
    సోమరితనమ్మె, జనులకు, సొబగుఁ గూర్చు

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    పద్య విద్యను గాపాడు ప్రతిభ లేక
    వచన గేయాల వెంబడి పరుగు దీయ
    వలయె లేనట్టి "టెన్నిసు" వంటి యాట
    సోమరితనమ్మె జనులకు సొబగు గూర్చు
    A rendering without prosody is like playing tennis without a net...Robert Frost.American poet.కందము వ్రాయని కవులకే పురస్కారాలు వస్తాయి.

    రిప్లయితొలగించండి
  9. శ్రమయె జీవన సౌందర్య సాధనంబు
    శ్రమయె నారోగ్య నైశ్వర్య చారు పథము
    వరము లిచ్చును విజయమే, వదులుకున్న
    సోమరి తనమ్మె, జనులకు సొబగు గూర్చు

    రిప్లయితొలగించండి
  10. శ్రమయె జీవన సౌందర్య సాధనంబు
    శ్రమయె నారోగ్య నైశ్వర్య చారు పథము
    వరము లిచ్చును విజయమే, వదులుకున్న
    సోమరి తనమ్మె, జనులకు సొబగు గూర్చు

    రిప్లయితొలగించండి
  11. ప్రగతి కా ట oకమది యేది జగతి యందు ?
    నేత లేరి కి మొక్కు ను ప్రీ తి తోడ
    చురుకు దనమది యేమిచ్చు నర వరు ల కు
    సోమరి తనమ్మే జనుల కు సోబగు గూర్చు

    రిప్లయితొలగించండి
  12. చేయుపనులను వాయిదా వేయువారి
    సోమరితనమ్మె జనులకు”సొబగు గూర్చు
    శక్తి యుక్తిగ పనులను రక్తియందు
    విద్య సమకూర్చజేయ వివేకమందు”.

    రిప్లయితొలగించండి
  13. అధిక మైన జబ్బులు దెచ్చు అవని లోన
    సోమరి తనమ్మె జనులకు, సొబగు నిడును
    తెల్ల వారక ముందుగ ఎల్ల జనులు
    నిదుర లేచి ఎండపొడను నేరు గాను
    అవయవములకు దాకించి ఆసనములు
    వేసి పొంద నారోగ్యము వేగముగను

    రిప్లయితొలగించండి
  14. కటిక దారిద్ర్యమొనగూర్చికఠినుజేయు
    సోమరితనమ్మె.జనులకుసొబగుగూర్చు
    ప్రేమతోడన పరులకుబ్రీతిజేయు
    నట్టి మంచితనమెయిలనుట్టిపడుచు




    రిప్లయితొలగించండి
  15. చీమ పెట్టిన పుట్టలు పాములవగు
    పామరుని ధనధాన్యము స్వాములవగు
    రైతు పాడిపంటలు తిండి పోతులవగు
    సోమరితనమ్మె జనులకు సొబగుఁ గూర్చు ;)

    రిప్లయితొలగించండి
  16. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,

    త్రా గు బో తు హి తో ప దే శ ము
    -----------------------------------

    భావిభారత దేశపు పౌరులార !

    నా హితోపదేశమును విన౦డి మీరు :--

    ………………………………………………………


    పె౦డ్లి యేల ? కొ౦పేల ? ఛీ పిల్లలేల ?

    దొ౦గవేసాలతో పైస దోచుకొనుము |

    కాయకష్ట మొకి౦తయు చేయవలదు |

    సోమరితనమె జనులకు సొబగు గూర్చు


    ………………………………………………………

    భోజనము మాని , నీవు ముప్పూట ల౦దు >

    బ్రా౦ది బీరును సారాయి రమ్ము విస్కి

    పొట్ట ని౦డుగ త్రాగుము దిట్ట వగుచు |

    చక్రముఖి వలె దొర్లు బజారు ల౦దు |


    { చ క్ర ము ఖి = ప ౦ ది }

    ::::::::::::::::::::: :::::::::

    రిప్లయితొలగించండి
  17. దిట్టముగఁ బెంచు మనుజుల దేహమునది
    సోమరి తనమ్మె, జనులకు సొబగు గూర్చు
    నాసనమ్ములు వేయుచు నర్థితోడ
    సతత మాహార నియమముల్ సంస్కరించ

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కరణముల యందు మక్కువ గల్గ కుండు
    యక్రియుల కెల్లెడ నలవి నాఫుసేయు
    సోమరితనమ్మె; జనులకు సొబగు గూర్చు
    చేతనమ్మున వారెంచు చేష్ఠలన్ని

    రిప్లయితొలగించండి
  19. జాగుజేసిన ఫలితము జారిపోవు,
    పెంపు పెరుగుదలకు ముఖ్య విఘ్నమగును
    సోమరితనమ్మె, జనులకు సొబగు గూర్చు
    వేగిరము, గాన జాప్యంబు విడిచిపెట్టు

    రిప్లయితొలగించండి
  20. చూడ భాగ్యవంతుం డతి సుందరుండు
    మిత్రు లట లేరు జనులును జిత్రముగను
    దరికిఁ జేర రా రతని రిత్త మనసు బిరు
    సో మరి తనమ్మె జనులకు సొబగుఁ గూర్చు

    [బిరుసు = కఠినము; తనము = చిత్తము (మనస్సు)]

    రిప్లయితొలగించండి
  21. భాగీరథి తీరమ్మున
    బాగుగ నిలుచున్న మీకు భాగ్యము లొసగన్
    ఆ గంగే శుభములిడుత !
    వేగమె యా హరియు గూడ వేడుక మీరన్!

    రిప్లయితొలగించండి
  22. పొదగ నేర్వని కోయిల బుద్ధిశాలి
    కాకిగూటిలోనండము కప్పిపుచ్చ
    తెలివి తక్కువ కాకికి తెలియలేమి
    పొదిగి పోషించె నామని ప్రొద్దువరకు
    సోమరితనమ్మె జనులకు సొబగు గూర్చు!

    వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః
    అన్నయ్య పద్య స్ఫూర్తితో!🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  23. భంగ్యంతర పూరణ:(మూడవ పాదం మాత్రం)
    *****)()()(*****
    అభ్యుదయమును దరచుగ నడ్డు నేది?
    సతత మెవ్వరికి ప్రభుత హితము గూర్చు?
    నేమి జేయును గుణశీల మేరి కైన?
    "సోమరితనమ్మె; జనులకు; సొబగుఁ గూర్చు"

    రిప్లయితొలగించండి
  24. సోమరితనమ్మె జనులకు సొబగు గూర్చు
    పూరణ:

    ప్రజల సేమమ్ము కై బలవంతులైన
    వైరులన్ యెదిరించెడి పోరు కన్న
    సోమరి తనమ్మె జనులకు సొబగు గూర్చు
    అదను కనిపెట్టి శత్రుల నణచ వలయు

    రిప్లయితొలగించండి
  25. నీదు పయనము జరుగుత! మృదువు గాను
    నెట్టి యవరోధ ములులేక యిప్పు డార్య!
    దర్శ నీయంబు లైనట్టి యాలయాలు
    చూచి కళ్ళార రండిక సుఖము గాను

    రిప్లయితొలగించండి


  26. నాశ హేతువదేదన్న నరులకిలను

    సోమరితనమ్మె జనులకు సొబగు కూర్చు

    చక్కగాను పనులెపుడు జగతి యుందు

    చేయ ,కలుగును సతతము చిత్త శాంతి.

    రిప్లయితొలగించండి