6, అక్టోబర్ 2017, శుక్రవారం

సమస్య - 2484 (సత్పుత్రుఁ డొకఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ"
ఈ సమస్యను పంపిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.

45 కామెంట్‌లు:

  1. ఉత్పాతము దొలగించును
    "మత్పితరులు మాన్యు లను"చు మన్నించు సదా
    సత్పథమున జను ;నెవ్విధి
    "సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ?"

    రిప్లయితొలగించండి
  2. సత్పథమున చరియించుచు
    సత్పాత్రత చేత చేయ సత్కార్యములన్
    సత్పథము వదలి చెడిన య
    సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ
    (అసత్+పుత్రుడు= దుష్టుడైన కుమారుడు)

    రిప్లయితొలగించండి
  3. హృత్పరితోషము రాదా!
    సత్పుత్రుడొకడు జనింప;సద్గతి కరువౌ
    తత్పథ విరుథ్ధ గతులకు.
    నుత్పాతము లెదురురాగ నుధృతి తోడన్

    రిప్లయితొలగించండి
  4. ఉత్పత్తౌ శంకరభగ
    వత్పాదులు నందరి కిహ పరములు దీర్చన్?
    ఉత్పల మొక్కటి కవితౌ?
    సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రీ గారు జ్వరము తగ్గినదా?

      తొలగించండి
    2. వైరల్ జ్వరం తగ్గినది కానీ విపరీతమైన నీరసంగానున్నది. వయోవృద్ధుడను కదా! ఉత్సాహం మాత్రం తగ్గలేదు.

      ధన్యవాదములు మహాశయా!!!

      తొలగించండి
  5. తత్పుర మెల్లన్ వెలుగును
    సత్పుత్రు డొకడు జనింప;సద్గతి కరువౌ
    యత్పుర మందు మదమున న
    సత్పథవిహారి మెలగును శాత్రవగతితో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గర్తు పురపు కవీశ్వరా నమస్కారము బాగుంది

      తొలగించండి
    2. బాపూజీగారూ!నమస్కారం చక్కని పూరణ అభినందనలు మనం శ్రీ బుయ్యనప్రగడ శ్రీనివాస్ గారింట్లో కలిశాము ఇర్వింగ్ లో

      తొలగించండి
    3. ధన్యవాదాలు సూర్యకుమార్ గారూ!
      ధన్యవాదాలు ప్రసాదరావు గారూ!

      తొలగించండి


  6. తత్పరమాత్ముని దీవెన
    సత్పుత్రుఁ డొకఁడు జనింప ; సద్గతి కరువౌ
    సత్పథము, హృదయ దార్ఢ్యము
    చిత్పరమును విడువ, నరుడ చిత్రంబిదియే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి వారు చిత్పరము అర్ధము కాలేదు

      తొలగించండి
    2. పూసపాటి వారికి

      చిత్ - జ్ఞానము
      పరము - శ్రేష్టము

      శ్రేష్టమైన జ్ఞానము విడువ

      సరియే నా?


      సన్మార్గము, హృదయ దార్ఢ్యము, శ్రేష్టమైన జ్ఞాణము విడువ, సద్గతి కరువౌ.

      జిలేబి

      తొలగించండి

    3. ನಮೊ ನಮ್ಃ !
      ಇವ್ವಾಳ ಮಳ್ಳೇ "ನಮೊ" ನಮಃ ?

      ಜಿಲೇಬಿ

      తొలగించండి
  7. డా.పిట్టా
    ఉత్పాదక శక్తి యనన్
    మత్పుత్రుం డదియె పనిగ మన ధృత రాష్ట్రుం
    డుత్పథము సాకలేడిక
    సత్పుత్రు డొకడు జనింప సద్గతి॥కరువౌ(కరువు,ఔ)కరువుమాత్రమే, పోషింపజాలడు.ఉత్పథము॥కాని త్రోవ.

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా
    ఆర్యా,
    ఇది సవరణ:
    ఉత్పాదక శక్తినిగన
    మత్పుత్రుం డదియె పనిగ మన ధృతరాష్ట్రుం
    డుత్పథము, సాక లేడిక
    సత్పుత్రుడొకడు జనింప సద్గతి,కరు(వు,ఔ)వౌ!
    పైనుదహరించిన వివరణను చేర్చండి

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా
    2వపాదం "మత్పుత్రుండాఘమేఘ మన ధ్రృతరాష్ట్రుం" గా స్వీకరించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  10. మైలవరపు వారి పూరణ:


    హిరణ్యకశిపుని ఆవేదన.....

    మత్పాదమ్ములఁ బట్టడు !
    సత్పథమన హరిని జూపు ! చావడు ! వీడా
    సత్పుత్రుం ? డీదృశుడౌ
    సత్పుత్రుడొకడు జనింప సద్గతి కరవౌ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  11. సత్ఫల మందుకుటుంబము
    సత్పుత్రుడొకడు జనింప, సద్గతి కరవౌ
    సత్పథనిర్జిత గమనము
    నుత్పాతము దెచ్చుపుత్రు డుదయించంగన్

    రిప్లయితొలగించండి
  12. సత్ఫల మందుకుటుంబము
    సత్పుత్రుడొకడు జనింప, సద్గతి కరవౌ
    సత్పథనిర్జిత గమనము
    నుత్పాతము దెచ్చుపుత్రు డుదయించంగన్

    రిప్లయితొలగించండి
  13. తత్పదముల భావించుచు
    నుత్పలముల బూజసేయ నుత్సాహితుడౌ
    సత్పథ గాముండగునటు
    సత్పుత్రుడొకడు జనింప సద్గతి కరవౌ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. తత్పదముల గురిగొనుచు
      న్నుత్పలముల బూజసేయ నుత్సాహితుడౌ
      సత్పథ గాముండగునటు
      సత్పుత్రుడొకడు జనింప సద్గతి కరవౌ?

      తొలగించండి
  14. సత్పధములందవచ్చును
    సత్పుత్రుడొకడుజనింప.సద్గతికరువౌ
    తత్పరతయెలేకుండగ
    మత్పితరునిగొల్వునెడలమమతలులేకన్

    రిప్లయితొలగించండి
  15. సత్పుత్రు డి oటివేలుగై
    సత్పుత్రు డో క డు జనించే; సద్గతి కరువౌ
    సత్పరినామము కాద ది
    సత్పుత్రు న్దోక్క రున్దు జనన ము లే క న్

    రిప్లయితొలగించండి
  16. ఉత్పుటము బడయు సంస్కృతి
    సత్పుత్రుఁ డొకఁడు జనింప, సద్గతి కరువౌ"
    తత్పరుడు బుట్టి అంభో
    భ్రుత్పదమున్నైనబట్టి బోనము గోరన్

    రిప్లయితొలగించండి
  17. తత్పరుఁడై విద్యఁ బడసి
    మత్పుత్రుడు కొలువుఁ జేయ మాండ్రిడ్ కరిగెన్
    తత్పుత్ర వియోగ వెతన్
    సత్పుత్రుఁ 'డొకఁడు' జనింప సద్గతి కరువౌ!

    రిప్లయితొలగించండి
  18. తత్పరుడైనిత్యమును ప
    రాత్పరుని భజించుచు కడు రాగముతోడన్
    సత్పథమునచనువాని క
    సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ

    రిప్లయితొలగించండి
  19. సత్పథ చరి తావ్యయ పా
    దోత్పల రత మానస కమ లోద్ధిత పూజా
    తత్పర వంశమున బృహద
    సత్పుత్రుఁ డొకఁడు జనింప సద్గతి కరువౌ

    [బృహత్ + అసత్పుత్రుఁడు = బృహ దసత్పుత్రుఁడు]

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఉత్పాదిల్లును మెఱవడి
    సత్పుత్రుడొకడు జనింప; సద్గతి కరువౌ
    సత్పథములనెల్ల వదలి
    యుత్పాతమ్ములు నిలిపెడి నుద్వహుడుండన్

    రిప్లయితొలగించండి
  21. సత్పతి సహవాసంబున
    సత్పుత్రుడొకడుజనింప?సద్గతి కరువౌ|
    ఉత్పాదకు డుత్సాహము
    ఉత్పధముగ మారిపోవ యూహలు దొలగున్|{బీదకుటుంబాన చదివించుటకష్టమై}

    రిప్లయితొలగించండి
  22. తత్పితరులు ధన్యాత్ములు
    సత్పుత్రుడొకడు జనింప; సద్గతి కరువౌ
    సత్పథము నాతడు వదలి
    ఉత్పాదంబు కలిగింప లోకము నందున్.

    రిప్లయితొలగించండి
  23. డా.పిట్టా
    2వపాదం "మత్పుత్రుండాఘమేఘ మన ధ్రృతరాష్ట్రుం" గా స్వీకరించ ప్రార్థన

    రిప్లయితొలగించండి
  24. తత్పురుషుని తలచ డెపుడు,
    సత్పురుషుల కెగ్గుసేయు శక్తుల తోడన్
    ఉత్పాతము కలిగించు య
    సత్పుత్రుడొకడుజనింప సద్గతి కరువౌ

    రిప్లయితొలగించండి
  25. డా.బల్లూరి ఉమాదేవి.6/10/17

    సత్పథమొందగ వలయును

    సత్పుత్రుఁ డొకఁడు, జనింప సద్గతి కరువౌ"

    సత్పుత్రుడుకానిసుతుడు

    నుత్పాతములు కల్గునండ్రు నొప్పుగ సుజనుల్.

    రిప్లయితొలగించండి