12, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2490 (కారము నయనముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

45 కామెంట్‌లు:

BVVHBPrasadarao చెప్పారు...

సారసనాభుని మది నిం
పారగ భజియించి పూజ భక్తి నొనర్పన్
కూరిమి భాసించెడు నా
కారము నయనములఁజల్లగన్ హితమబ్బున్

Zilebi చెప్పారు...



భారమ్మైనహృదయముల
కైరవలోచన, జిలేబి , కన్నఱ దీరన్
గారము గా సున్నిత చెలి
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్!

జిలేబి

gurram.jana@gmail.com చెప్పారు...

పేరిమి చేయని దేదది?
ఓరిమితో నసాధ్య మేది యొడుపుగ జేయన్?
కూరిమితో ననునయ మమ
"కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

gurram.jana@gmail.com చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
gurram.jana@gmail.com చెప్పారు...

చేరగ వచ్చిన యాశ్రితు
లేరైనను మేలు జేయు మెన్నటి కైనన్
గారాబముతో మరి మమ
"కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"
(ఏరైనను = ఎవరైనను)

Zilebi చెప్పారు...



ధీరత్వముగనుచున్, వెట
కారము జేయన్ మనుజులు, కరభము సాగన్
కారగ్గివలెన్ ధుమధుమ
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్!

జిలేబి

gurram.jana@gmail.com చెప్పారు...

భారమయిన హృదయముతో
కోరగ చెలికాడు ప్రాపు గొంకక మదిలో
ధీరత్వముతో దగు యుప
"కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్"

seethadevi gurram చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
seethadevi gurram చెప్పారు...

నేరములెన్నియొ జేయుచు
కారాగారమున గడుపు ఖైదీలైన
న్గూరిమి నందింపగ మమ
కారము, నయనముల జల్లగన్ హితమబ్బున్!

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

వీరలు నాకున్ మిత్రులు;
వారలు శత్రులు;ననియెడి భావము త్వరగా
దూరము జేయుచు ధృతి నోం
కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్.

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
బీరముగల నరు మృగపు వి
కారము స్త్రీ మానభంగ కారణ మవగన్
పోరగ కొడవలి రోకలి;
కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!(Self help is the best help!)

Kr rajeshwar rao చెప్పారు...

కోరికలు దీర్చు వేలుపు
మేరు గభీరు డు గ విషము మింగి న శ oభున్
గౌరీ పతి యౌహరునా
కారము నయనము ల జల్లగ న్ హిత మబ్బు న్

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
మారెను చైనా ప్రగతిన్
గూరునటుల్ వ్యక్తి వ్యక్తి గురుతర విధినిన్
పోరగ నసూయ వలదే?
కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!(స్పర్ధయా వర్ధతే సిద్ధి!)

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
బేరముకన్న నుపాయమె
పారము నందించలేదె పరగ శివాజీ
చేరగ మిఠాయి బుట్టన్?!
"కారము నయనములజల్లగన్ హితమబ్బున్"

gurram.jana@gmail.com చెప్పారు...

నా పూరణలలలో మొదటిది క్రమాలంకార పూరణ కాదు.సమాస పద చమత్కారమే.(సమస్యా పూరణకు 15 రరకముల చమత్కారములున్నవి.-"అవధాన విద్య"గ్రంథంలో శతావధాని డా. C.V.సుబ్బన్న శతావధాని)
-గుర్రం జనార్దన రావు)

gurram.jana@gmail.com చెప్పారు...

పూరణ నడిగిన గురువుకు
గౌరవముగ మంచి పద్య కవనము తోడన్
కోరిన విధముగ దగుచమ
త్కారము నయనముల జల్లగన్ హితమబ్బున్.

gurram.jana@gmail.com చెప్పారు...

సవరణ:"కోరిన రీతి దగు చమ"

seethadevi gurram చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
seethadevi gurram చెప్పారు...

సారసనేత్రుడు కరుణా
పారావారుండు నవ్వుబారెడు మోవిన్
జేరెడు వంశీధరు నా
కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!

seethadevi gurram చెప్పారు...

చక్కని పూరణ! అభినందనలు!

gurram.jana@gmail.com చెప్పారు...

పూరణ చక్కగ నున్నది !

gurram.jana@gmail.com చెప్పారు...

పూరణ చక్కగ నున్నది !

gurram.jana@gmail.com చెప్పారు...

పూరణ చక్కగ నున్నది !

gurram.jana@gmail.com చెప్పారు...

పూరణ చక్కగ నున్నది !

gurram.jana@gmail.com చెప్పారు...

ధన్యవాదాలు !

Sistla Sharma చెప్పారు...

కూరిమి నెలకొని మది సహ
కారం బందించి బ్రతుకు కాలం బందున్
తీరున స్పందన నిడి మమ
కారమె నయనాల జల్లగా హితమబ్బున్!

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు!

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...




1.కేరింతలుగొట్టుచు నిట

    నేరికి జంకక ముదమున నిలలో నాడన్

     గారాబముతో నిక మమ

      కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


2:నీరజనాభుని దలచుచు

   నేరుపు తోడన్ పరులకు నెమ్మది గూర్చన్

  నోరిమి తోడను తామమ

  కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


3.కారెవ్వరు శత్రువులును

గారెవ్వరు మిత్రులిలను గమనింపంగన్

కోరుచు  హరి పదమను మమ

కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


4.ధారుణి లో విడగ నహం

కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

కూరిమి తోడను ప్రజకుప

కారము సతతమ్ము జేయ ఘనతయు/కలిమియు పెరుగున్.


5.చోరుల గాంచిజవమ్మున

బారక ధీరతను జూపి వసుధా స్థలిలో

నారీమణులెల్ల గుప్పెడు

కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.


6..ఘోర దురితములు చేయుచు

కారడవుల యందు తిరుగు కపటుల కనగా

నేరుపు తోడను వారికి

కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

వీటూరి భాస్కరమ్మ చెప్పారు...

దారిని కాచి మనుష్యుల
నేరుపుతో దోచికోవ నిల్చిన వేళన్
చేరిన వారల నడ్డుచు
కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఘోరపు వేసవి యందున
నీరమ్ము లుదారముగఁ బని గొని వడిం బ్రా
కారమ్ములును దడిసెడి ప్ర
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

[ప్రకారమున్ + అయనముల = ప్రకారము నయనముల; అయనము = త్రోవ]

seethadevi gurram చెప్పారు...

అద్భుతమైన పూరణ!🙏🙏🙏🙏

Bhagavatula Krishna Rao చెప్పారు...

పారావారము దాటగ
గోరుచు హిమగిరిని యున్న గురువుల కొలువన్
జేరగ గిరి పైగల ప్రా
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

నిన్నటి సమస్యకు నా పూరణ

వడ్డాది వారి వంటలు
విడ్డూరముగాగ నుండు వివిధ రుచుల తో
వడ్డన మన వారిదె కద !
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్

వడ్డాది వారి వంటలె!
వడ్డించెడివాఁడు శత్రువా? తిననొప్పున్
బ్రెడ్డూ క్రీములు కావవి
జిడ్డెప్పుడు నంటబోదు చేతుల కెపుడున్

pks kumar చెప్పారు...

శూరత్వము గలిగి యున్నన్,
జేరె విభీషణుడు రిపుని చెంతకు రయమున్,
నేరము నోర్వని అనహం
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్
(రావణుని నేరము దెలిసి విభీషణుడు రాముని శరణు జొచ్చుట గౌరవము అని భావన)

Unknown చెప్పారు...

.నేరము జేయగ శిక్షలు
కారాగారమున బ్రతుకు ఖైదీజూడన్?
మారును యధికారుల సహ
కారము నయనముల జల్లగన్?హితమబ్బున్|
2.ప్రేరణ విద్యార్థులకున్
జేరగ సద్గురుల బోధ జీవనసరళే
మారును నుపయోగపు సం
స్కారము నయనముల జల్లగన్ హితమబ్బున్|

vsnmhari చెప్పారు...

ఊరూర నిల్లు గట్టిన
సారాభూతంబు జనుల జంపుచునుండన్
కోరక నద్దాని తిర
స్కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

subbarao చెప్పారు...

ఊరును బంధుగణంబుల
పోరును సహియించ లేక పోవగ నెటకో
సారీ యని వారలమమ
కారము నయనముల జల్లగన్ హితమబ్బున్

seethadevi gurram చెప్పారు...

కారణము లేకపెను కని
కారము జూపుచు పదుగురి కాపాడంగా
కోరకనే పొందు పుర
స్కారము నయనముల జల్లగన్ హితమబ్బున్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

పేరొందిన 'కంది' గురులు
తీరగు పద్యమ్ము వ్రాయు తీరును నేర్వన్
చేరుదునన దా నంగీ
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మారుని గాల్చిరి మిము నే
చేరెడు మార్గమ్ము వైచె చింతించుమనన్
గౌరియె! హరుండు నంగీ
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ప్రేరితుఁడై యజ్ఞంబుల
కూరిమి జరిపించఁ యజ్ఞగుండమునందున్
కోరిన భగవత్సాక్షా
త్కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్

Sreedhara Rao Machavolu చెప్పారు...

కోరినదె తడవు కోరిక
తీరగ భక్తి యలముకొన తిరుమల చేరన్
తీరగు వేంకటపతి యా
కారము నయనముల జల్లగన్ హిత మబ్బున్!

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

డా. సీతా దేవి గారు ధన్యవాదములు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


నారాయణ నరసింహా
రారా కావగ యనుచును రహితో పిలువన్
నారదవంద్యుని శుభయా
కారము నయనములఁ జల్లఁగన్ హిత మబ్బున్.

A.Satyanarayana Reddy చెప్పారు...

నేరుగ సేవలఁజేయుచు
ప్రేరణతోనహరహమ్ము పెంచుచు తాల్మిన్
ధారుణిలో ప్రజలకు మమ
కారము నయనములఁ జల్లగన్ హిత మబ్బున్