15, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2493 (తమ్ముల నిరసించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

41 కామెంట్‌లు:

కొండయ్య కవితలు చెప్పారు...

"రమ్మిటు యన్నా, రాజై
మమ్ముల పాలింపుమన్న, మాకెవ్వరుది
క్కిమ్మహి" యని వాపోయిన
తమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్!

seethadevi gurram చెప్పారు...


తమ్మిముఖ సీతగానక
కమ్మిన దుఃఖము, విరహము కలచగ హృది పం
తమ్మున చెంతను గల కెం
దమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్

కొండయ్య కవితలు చెప్పారు...

ఇంకొక పూరణ:
చూడగా, 'నిరసించ'డాన్ని, 'ని' తీసి, 'రసించ'డమనచ్చు కదా అని తట్టింది.

"ఇమ్మగు సుఖముల వీడెను!
సొమ్ముల భవనమ్ములన్న సొక్కవు యాహా!
కమ్మని ప్రేమకు గురుతులు!
తమ్ము"లని రసించె రామధరణీశు డొగిన్!

Zilebi చెప్పారు...


డొగిన్ అంటే ఏమిటండి ?

జిలేబి

BVVHBPrasadarao చెప్పారు...

నమ్మితి నా కోదండము
నిమ్ముగ తెగటార్తు వైరులెందఱినైనన్
పొమ్మని పిరికితనము,శాం
తమ్ముల నిరసించె రామ ధరణీశుడొగిన్

gurram.jana@gmail.com చెప్పారు...

కమ్మని తన పలుకులతో
తమ్ములనే యాదరించు ధర్మాత్ముడురా !
నమ్మను కలనైన యెపుడు
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్?"

gurram.jana@gmail.com చెప్పారు...

1. క్రమముగా.
2. శ్రద్ధగా.
3. చక్కఁగా.

Zilebi చెప్పారు...



అమ్ములు వేగమవన్ ఘా
తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగి
న్నమ్ముని వాటికన తన
న్నమ్మిన వారి తలగాచి నమతుండతడౌ !

జిలేబి

Zilebi చెప్పారు...


ధన్యవాదాలండి జనార్ధన రావు గారు

ధరణీశుడు + ఒగి

ఒగి - క్రమముగా etc

జిలేబి

seethadevi gurram చెప్పారు...

పొమ్మన నడవికి పితరుడు
కిమ్మనక వెడలె ససీత కినుకయె లేకన్
పిమ్మట గూడిన దుష్ఫలి
తమ్ముల నిరసించె రామ ధరణీశుడొగిన్

pks kumar చెప్పారు...

ఇమ్మహి నేలుము కాంతా
రమ్మున వాసమ్ము వలదు రామా రయమున్
రమ్ము నయోధ్యకు యనగా
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

కొండయ్య కవితలు చెప్పారు...

చాలా బాగుందమ్మా! :)

కంది శంకరయ్య చెప్పారు...

కవిమిత్రులారా,
నమస్కృతులు.
క్షేమంగా చార్ ధామ్ యాత్ర ముగించుకొని ఢిల్లీ చేరుకున్నాము.
సెంట్రల్ ఢిల్లీలో బిర్లా లక్ష్మీ నారాయణ దేవాలయం ధర్మశాలలో దిగాము.
రేపు మధ్యాహ్నం హైదరాబాదుకు ప్రయాణం.
ఢిల్లీ మిత్రులు ఎవరినైనా కలిసే అవకాశం ఉందా?

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
తమ్మి1య విశేష వృక్షము
తుమ్మ2గ సృజియింప దగునె?తోచదె, "విషమా3?!
కొమ్మవు ముప్పురి పాలవు4
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"?
1.పద్మము2.ముళ్ళచెట్టు,తుమ్మ3.విష వృక్షమా,రామాయణ విష వృక్షము4 పాలపిట్ట ,ము*పాల॥ముప్పాళ (మూడు పురుల,పాళుల-- ముప్పురి)రంగనాయకమ్మవు.

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
ఇమ్మహి పూర్ణ పూరుషుడు నేదిశ నుండడటన్న సూక్తి1మై
కొమ్మయె రంగ నాయిక2యె కోరి విపర్యయ గాథ3 నల్లగా
"అమ్మ!యిదేమి శాస్త్ర"మని యందరునున్ నిరసించి రందులో
తమ్ముల బ్రేమ లేమి సతతమ్ముకృశించగ జూచె రాముడే?!
1."Ideal is never real". 2. ముప్పాళ రంగనాయకమ్మ3.రామాయణ విష వృక్షము..ఆమెగారి గ్రంథము.

A.Satyanarayana Reddy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
pks kumar చెప్పారు...

గురువు గారి పాద పద్మములకు నమస్కారము. మీరు యాత్ర దిగ్విజయముగా ముగించుకొని వచ్చినందుకు చాలా సంతోషము. శంకరుడు లేని కైలాసము లాగా ఉన్నది శంకరాభరణము మీరు వచ్చి త్వరలో శంకరాభరణము కవులకు సంతోషము కలిగించాలని ఆ కపర్ధిని ప్రార్దిస్తున్నాము. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

తమ్ముడు లక్ష్మన్నయు సీ
తమ్మయు తనతోడురాగ తరలగ వనికిన్
రమ్మనరాజ్యమునకు చిన
తమ్ముల నిరసించె రామధరణీశు డొగిన్

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
ఆర్యా, నా పూరణకు మరో సాధారణ అధోజ్ఞాపిక
"Man is a bundle of inconsistent qualities" O.Henry.

Madhura karanam.blogspot.com చెప్పారు...

డా.పిట్టా
డు,ఒగిన్. ఒగిన్ ॥ఒకప్పుడు

Kr rajeshwar rao చెప్పారు...

కొమ్మ ధరణి జ ను లంకకు
దోమ్మిగ చేకొని యు పోయె దురితాత్ముoడై
అమ్మేయి ద శ కం ఠుని చే
తమ్ముల నిరసిం చె రామ ధరణీ శుడోగి న్

gurram.jana@gmail.com చెప్పారు...

దమ్మమునే గాపాడగ
ఉమ్మడిగా తన యనుజుల యూతము తోడ
న్నిమ్మహి లోగల యఘజా
"తమ్ముల నిరసించె రామ ధరణీశుడొగిన్"

gurram.jana@gmail.com చెప్పారు...

సవరణ : "నుమ్మడిగా"(2వ పాదము)

డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి. చెప్పారు...

(ఖరదూషణాది రాక్షసులను సంహరిస్తున్న శ్రీరామచంద్రుడు)
వమ్మవకుండగ వేవే
లమ్ముల గురిపించుచు గగనాంగణ మంతన్
గ్రమ్ముచు ఖరదూషణ ప్రో
తమ్ముల నిరసించె రామధరణీశుడొగిన్.

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

తమ్ములకు ప౦చెను మిగుల

కమ్మనిప్రేమ౦బుమరియుక్ష్మాసుతకై యు

ద్ధమ్మున దశముఖు నాతని

తమ్ముల నిరసి౦చె రామధరణీశు డొగిన్

gurram.jana@gmail.com చెప్పారు...

అమ్ముని కోరగ వేవే
గమ్మున జన్నము వనమున గాచెన్నాసాం
తమ్ముగనా రాక్షస పం
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ఇమ్మహిని ధర్మ నిరతి వి
ధమ్మును పెంపొందఁజేసె దాశరథుఁడు బా
ణమ్ములఁ దుర్మతి దితిజా
తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్

gurram.jana@gmail.com చెప్పారు...

సమ్మతి దెలుపగ దండ్రియె
నమ్మిన యామునుల యరుల నాశముము జేసెన్
గ్రమ్మర యజ్ణానపు ధ్వాం
"తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్"

subbarao చెప్పారు...

నమ్మగశక్యముకానిది
తమ్ములనిరసించెరామధరణీశుడొగి
న్నమ్మహితాత్మునినిరసన
తమ్ములపైయుండదెపుడుతమకముతప్పన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

అమ్ముని సత్తములకు ని
త్యమ్ము వెత లొసంగెడు నసహన దైత్య నికా
యమ్ముల దుర్భర దుష్ట కృ
తమ్ముల నిరసించె రామ ధరణీశుఁ డొగిన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ముమ్మోటు మడేలన్న వి
షమ్మును జిమ్మఁగ వనముల సాధ్విని బంపన్
దమ్మ విరుద్ధమన ననుచి
తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్

వీటూరి భాస్కరమ్మ చెప్పారు...

అమ్ముని రూపున నసురుడు
కొమ్మను గొనిపోవనకట కోమలి తోడన్
నెమ్మది విహరించిన ప్రాం
తమ్ముల నిరసించె ధరణీశు డొగిన్

gurumoorthy చెప్పారు...

గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


తమ్ములకు ప౦చెను మిగుల

కమ్మనిప్రేమను.మరియును క్ష్మాసుతకై యు

ధ్ధమ్మున దైతేయ వ్రా

తమ్ముల నిరసి౦చె రామధరణీశు డొగిన్

Unknown చెప్పారు...

. సార్ఇది నిన్నటిపూరణ
సీత మనసుజేర నేతగు దశరథ
తనయుడుపతియయ్యె|”తరుణి మురిసె
రాజులచట జూడ?మోజును బెంచె|స్వ
యం వరమునపెళ్లి యద్భుతంబు|
15.10.17. నమ్మిరి విశ్వామిత్రయా
గమ్మిక లక్షణముగ జరుగు గమనించంగన్
యమ్ముల పొదనందుకె|భూ
తమ్ముల నిరసించె రామ ధరణీశు డొగిన్|



gurram.jana@gmail.com చెప్పారు...

సవరణ : " ము " అదనంగా టైపైనది.(2వ పాదము)

seethadevi gurram చెప్పారు...

ధన్యవాదములు భరద్వాజగారూ!

వీటూరి భాస్కరమ్మ చెప్పారు...

మీ యాత్ర బాగాజరిగినందుకు చాలా సంతోషం
శ్యామల

పంచరత్నం వెంకట నారాయణ రావు చెప్పారు...

గురువు గారి కి నమస్సులు. యాత్ర దిగ్విజయంగా జరిగినందులకు సంతోషము.

Madhura karanam.blogspot.com చెప్పారు...

Dr.Pitta
Welcome back to the fortunate pilgrim,Sri Shnkaraiah garu!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


తమ్ముని మృగముగ పంపెను
తమ్మి కనులసీతఁబట్ట దశకంఠుండున్;
తమ్ముని తోచనుచులతాం
తమ్ముల నిరసించె రామధరణీశుడొగిన్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

అన్నయ్యగారూ నమస్సులు.యాత్ర చక్కగా ముగిసినందుకు శుభాభినందనలు.