19, అక్టోబర్ 2017, గురువారం

సమస్య - 2497 (ధనలక్ష్మీవ్రత మొసంగు...)

కవిమిత్రులారా!

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే"
(లేదా...)
"ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా"

94 కామెంట్‌లు:

  1. శ్రీ వినాయక
    మొదటి అక్షములు కలిపి చదువు కోవలెను. (మౌళి మరియు మేలు పాదములలో రెండవ అక్షరము) వచ్చు సందేశము
    శంకరా భరణము కవి వరులకు దీపావళి శుభాకాంక్షలు



    శంఖపాణి వల్లభ ,లక్ష్మి,సర్వ శక్తి,
    కమల,దేవిక ,భార్గవి, గౌరి, గంగ ,
    రామ,నాదిని,భైరవి,శ్యామ, దేవి,
    భద్ర కాళిక,నందిని, భాగ్యదాత ,
    రమ జాహ్నవి ,సౌరి,హీర ధరణి,కరు
    ణ,మహి, బ్రాహ్మణి,కళ్యాణి,నందిని,శ్రియ,
    ముక్త ధారిణి,యక్షిణి,మోహనాంగి,
    కలిమి గుబ్బెత,యోగిని,జలదిజ,
    విశ్వ రూపిణి,రాగిణి,విష్ణు పత్ని,
    వసుధ, సాగర పుత్రికా ,వాక్ప్రదాత ,
    రుక్మిణీ,మాధవీ, కామరూపిణి, అమ
    ల, హరి గామిని,వసురూప, లాక్షణి, సిరి,
    కుబ్జికా , చంద్రిక,భవాని, కోమలాంగి,
    దీప్తి దాత, కీలిక, మహా దేవి , లంబ,
    పాల మున్నీటి రాకన్య, పైడి నెలత,
    వజ్రి పత్ని, మరుని యంబ,వరద ,ఇందు
    మౌళి భగిని, పంచవదన ,మరుని జనని,
    శుభ్ర వస్త్ర ధారిణి, సోమ సోదరి, చల,
    భారతీ, లిబ్బి గుబ్బెత, పద్మ హస్త,
    కాంతి దాత ,నారాయణి, కనక వర్ణి,
    క్షణిక,వాసవి, కరుణ వీక్షణములనిడి,
    మేలు జేయుము కవులకు మిసిమి నిడుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      పాదాద్యక్షర గ్రస్త దీపావళీ శుభాకాంక్షలను అందించిన మీ చిత్రకవితా ప్రావీణ్యానికి నమస్సులు! ధన్యవాదాలు.
      4వ, 7వ పాదాలలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. మన్నించండి... కేవలం 5వ పాదంలో గణదోషం.

      తొలగించండి
    3. క్షమించండి గురువు గారు సవరించిన పాదము రమ సనాతని సౌరి హీర ధరణి కరు అని మార్చాను

      తొలగించండి
  2. కవి మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు దీపావళి సందర్భములో నేను వ్రాసిన దీప బంధము అవీ ఇవీ శేర్సికలో
    గురువు గారు ఇప్పుడే పెట్ట్టారు పరిశీలించి మీ అమూల్యమైన అభిప్రాయములు తెలుప గలరు పూసపాటి

    రిప్లయితొలగించండి
  3. అను దినమును గడు కష్టిం
    చిననే దక్కును జనులకు సిరిసంపదలున్
    పని మానియు చేసినచో
    "ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే"

    రిప్లయితొలగించండి
  4. పనియే దేవుని పాదపూజ యనుచున్ బాటించి కష్టించినన్
    జనులన్ దప్పక లక్ష్మిదేవి వలచున్ జాగేమి లేకుండగ
    న్నను నిత్యమ్మును నున్న సొమ్ములను యాగాలకే పోయుచున్
    "ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      సమాసంలో 'లక్ష్మీదేవి' అనడం సాధువు. మీరు 'లక్ష్మిదేవి' అన్నారు. అక్కడ "విష్ణుపత్ని" అందామా?

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      “కుంతి దేవి, గౌరి దేవి, పుణ్య నది తీరమున, విగత దయ హృదయులకున్” ఇత్యాది సాధ్య సమాసములు నన్నయ భట్టారక తిక్కన సోమయాజుల ప్రయోగములలో కన్పించు చున్నవి.

      తొలగించండి
  5. ధనకన కవస్తు సంపద
    ధనలక్ష్మీవ్రత మొసంగు, దారిద్ర్యమునే
    కననేరవు మరి ధరణిన్
    గన జూతువు మిగుల భోగ కార్యము లెపుడున్.

    రిప్లయితొలగించండి
  6. వినుడో సహృదయులారా!
    ఘనమగు దాతృత్వగుణము గలుగక జనులన్
    నెనరున గాననివానికి
    వరలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే.

    చారుధాముయాత్ర చక్కగా ముగియించి
    మరలివచ్చినట్టి మధురకవికి
    మనసు పలుకుచుండె మంగళాహ్వానంబు
    దివ్యదీపపర్వదినమునండు.

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ పద్యాహ్వానానికి ధన్యవాదాలు!

      తొలగించండి
  8. ఘనశీలంబును సాగుచేయక యశక్కారంబునేకోరుచూ
    అనుకూలంబుగ తర్కమాడుచు సునాయాసంబదే మేలనీ
    ధనమే చాలని ధర్మమొద్దని మనోధామమ్ము నన్ తల్చి యా
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భరద్వాజ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యశక్కారంబు'...? 'కోరుచూ, మేలనీ, ఒద్దని' అనడం వ్యావహారికాలు. "యశఃకాయంబునే కోరుచు। న్ననుకూలంబుగ... మేలుగా... ధర్మమున్ విడి..." అనండి.

      తొలగించండి
    2. అయ్యా! ధన్యవాదాలు.
      మీ సూచనలను ఇకమీది పూరణలలో తప్పక పాటిస్తాను.

      తొలగించండి
  9. ఘనముగ లక్ష్మిని కొలిచిన
    మనమున కలుషితము వీడి మానవ సేవన్
    వినయము గమమత పంచిన
    ధనలక్ష్మీ వ్రత మొసంగు దారిద్ర్యమునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మమత పంచక..." అంటే అన్వయం కుదురుతుందేమో?!

      తొలగించండి
    2. ఘనముగ లక్ష్మిని కొలిచిన
      మనమున కలుషితము వీడి మానవ సేవన్
      వినయము నమమత పంచక
      ధనలక్ష్మీ వ్రత మొసంగు దారిద్ర్యమునే

      తొలగించండి

  10. దీపావళి శుభకామనలతో

    మనుగడకు వలయు సంపద
    ధనలక్ష్మీవ్రత మొసంగు ; దారిద్ర్యము నే
    మనిచెప్పుదు,సంపత్తిన్
    మనుజులు కష్టపడకన్ సమధికము గనుటే !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. అనయము సోమరితనమున
    పని జేయక తిండిఁ దినెడువ్రతమెట్లబ్బెన్? 
    యొన గూర్చునె పేరు సిరులు? 
    ధనలక్ష్మీ! వ్రతమొసంగు దారిద్ర్యమునే.

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా
    ధనమింత గడించితినని
    మనమున మురియంగ నహము మరి మరి హెచ్చన్
    ఘన భక్తిన్ మరచెడి ని
    ర్ధన లక్ష్మీ వ్రత మొసంగు దారిద్ర్యమునే!(విపద్విస్మరణం విష్ణోః!సంపన్నారాయణ స్మృతిః...ఆర్యోక్తి)
    వ్యాపారులు కోటికి పడగలెత్తి ధన రాశులకు జేసే పూజ యని శ్రామికలేదా వృత్తి పనుల వారు ధనలక్ష్మీ వ్రతము పూర్వము చేసేవారు కారు.

    రిప్లయితొలగించండి

  13. మనసారన్ హృదయమ్ము నందు తరుణీ మాన్యంబుగా వేడుచున్
    మనకై యెంత ధనమ్ము కావలెననన్ మాలక్ష్మి యిచ్చున్ సదా
    ధనలక్ష్మీవ్రత మాచరించిన; మహాదారిద్ర్యమే దక్కు రా
    ధనమున్ వీడి జిలేబి మైకముగనన్ తధ్యంబు గానన్ సుమీ !

    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    ధనమౌ నాణెపు గలగల
    ధనమే నిర్ధనమయా ప్రధానియె మెచ్చెన్(cashless transaction is the best one!)
    మన పత్రపు1 గణనల ని
    ర్ధన లక్ష్మీ వ్రతమొసంగు దారిద్ర్యమునే!(ఆకులు, కమ్మలు,transactions on paper from a computer)
    సాధారణ ధ.ల. వ్రతంలో నాణేల పూజ నిర్దిష్టంగా ఉండేది.

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా
    ధనమన్నన్ స్వయమైన పోషణ1"నిటన్ దండించుకొండందరీ
    ఘనమౌ భారత రత్న గర్భ నుదుటన్ గట్టండి వే సంస్థలన్"
    మన "మే క్నిండియ"(The very India of our make is॥"Make in India"slogan)
    దాన ధర్మములకే మాయంబయే నేమొ ని
    ర్ధన లక్ష్మీ వ్రత మాచరించిన మహా దారిద్ర్యమే దక్కురా!!(స్వయం పోషకత్వము)
    "స్వావలంబ్ కీ ఏక్ ఝలక్ పర్ న్యౌఛావర్ హై కుబేర్ కా కోష్"మనపై మనము ఆధార పడడమే మహా సంపద)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. ఆర్యా,తమకు హేవళంబి దీపావళి శుభాకాంక్షలు,శంకరాభరణుని ఆశీస్సుల నపేక్షిస్తూ
      మీ డా.పిట్టాసత్యనారాయణ.మీ మెప్పునకైన కృతజ్ఞతలు

      తొలగించండి
  16. గురువు గారి కి నమస్సులు.మీకు మరియు కవులంద ర కి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.
    కనిపించు బాధలన్నియు
    ధనము వ లనతీ రునే?న ధర్మపు పనులే
    మనిషికి నఘమౌ! జ్ఞాతుల
    ధనలక్ష్మి వ్రతమోసంగు దారిద్ర్యము నే.
    వందనములు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వెంకట నారాయణ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తీరునే యధర్మపు..." అనండి.

      తొలగించండి
  17. జనుల కు సౌభాగ్యం బు ల
    ధనలక్ష్మి వ్రత మొ స oగు;; దారిద్ర్య ము నే
    మనసుల నుండి యు తరు ము ను
    ధనలక్ష్మి మహిమల నె న్న తరమే మనకు న్

    రిప్లయితొలగించండి
  18. మనమున భక్తియు శ్రద్దయు
    అనువుగ నిసుమంతలేక ఆచరణమునన్
    అణుమాత్ర పరహిత రహిత
    ధనలక్ష్మీ వ్రత మొసంగు దారిద్ర్యమునే

    రిప్లయితొలగించండి
  19. అనుదిన పాపాచారుల
    కనుపమమగు స్వార్థభావ మానందంబై
    కనుగానని దుర్జనులకు
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే.

    రిప్లయితొలగించండి
  20. అనయము జ్ఞానము సంపద
    ధనలక్ష్మీ వ్రతమొసంగు; దారిద్ర్యమునే
    గొను నలసత్వము క్రోధమ
    వినయ మధైర్యము నిరాశ వీడని జనమున్!

    రిప్లయితొలగించండి
  21. తలచి నేడాచరించిన ధన ధాన్యములను
    ధనలక్ష్మీవ్రత మొసంగు, దారిద్ర్యమునే
    పారద్రోలు దీపంబుల పార కాంతి
    పుంజములవేగ వెలువరింపు కతనమున!
    బ్లాగు మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రశేఖర్ గారూ,
      కంద సమస్యకు తేటగీతిని వ్రాశారు. అయినా మొదటిపాదంలో గణదోషం.

      తొలగించండి
  22. ఘనమగు సిరిసంపదలను
    ధనలక్ష్మీ వ్రత మొసంగు! దారిద్ర్యమునే
    కనబడనీయదు! సుఖముల
    గొని తెచ్చుచు ముదముల నొన గూర్చును గాదే!

    రిప్లయితొలగించండి
  23. ఘనముగ పగలును రాత్రియు
    మనమున షేరులును స్టాకు మార్కెటులందున్
    మునుగుచు తేలుచు జేసెడి
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే


    ధనత్రయోదశి ధమాకా:

    "షేరు బజారులో కోట్ల కోట్ల నష్టాలతో ఐదుగురు కుటుంబ సభ్యుల ఆత్మహత్య"

    రిప్లయితొలగించండి
  24. గురువుగారికి మరియునితర కవిమిత్రులకు దీపావళీ పర్వదిన శుభాకాంక్షలు.

    ఘన వైశిష్ఠ్యము గల్గు పండుగల నిక్కంబైన యర్థంబులన్
    గొనకన్ ధర్మవిదూర పద్ధతిని మీకున్ మాకు నష్టంబులౌ
    పనులన్ జేయుచు శబ్ద తీవ్రతల పెంపన్ జేతురయ్యా ! "ధనా
    ధన "లక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా

    ధనాధన మని శబ్దకాలుష్యమును పెంచే లక్ష్మి పటాసులని అర్థము - పరోక్షముగా ద్రవ్యమును తగులబెట్టుదురని - అంతరార్థము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  25. సమస్య కందపద్య పాదం; నా పూరణ పాదములు తేటగీతిలో ఉన్నాయు తప్పుదొర్లినందుకు చింతిస్తూ...

    రిప్లయితొలగించండి



  26. అనయము చేయన్ ధనమును

    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే

    కనిపించనీక ముదం

    బనవరతము నొసగు భువిని వాసిగ మనకున్.


    ధనమును బలమును సతతము

    ధనలక్ష్మీవ్రత మొసంగు; దారిద్ర్యమునే

    గొనకొని రానీకముదము

    మనకొసగి జయమును కూర్చు మహిలో నెపుడున్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  27. అందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.
    సీ:
    చీకుచింతయనెడు సీమటపాకాయ
    వత్తినే ముట్టించి వదలునాడు
    పరుల వృద్ధినిజూచి పడునట్టి ఈర్ష్యనే
    చిచ్చుబుడ్డిగ గాల్చి చెలగునాడు
    తలదిరిగెడు చెడు తలపులన్నియు గూడ
    భూచక్రముగ కాలి పోవునాడు
    పరుష వాక్యమ్ముల పరుల హింసించెడి
    పాముబిళ్ళలు మాడి పడిననాడు
    తే.గీ:
    అహపు తారజువ్వను నింగి కంపునాడు
    శాంతి మత్తాబులే వెల్గు జల్లునాడు
    ముదపు ప్రమిదలకాంతియే ముసురునాడు
    నిత్య దీపావళియెయౌను నిజము నాడు.

    రిప్లయితొలగించండి
  28. ధనమునుగనకమువస్తుల
    ధనలక్ష్శీవ్రతమొసంగు.దారిద్ర్యమునే
    వినుతొలగించకవచ్చును
    ననయముమదినుంచునెడలనభవునిసుమ్మా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వస్తుల'...? "వస్తువుల" అన్నది సాధువు.

      తొలగించండి
  29. మనమున భక్తియె లేకను
    ఘనముగనాడంబరముకు కడు ప్రాధన్య
    మ్మొనరగ జరిపించెడి యా
    ధనలక్ష్మివ్రత మొసంగు దారిద్ర్యమునే


    రిప్లయితొలగించండి
  30. మనసా రంగ ను విష్ణు పత్ని పదము ల్ మందార పుష్పాలతో
    వినుతు ల్ చేయుచు మంత్ర పుష్ప ము ల తో వే ద్కోన్న రా దె య్యే డ న్
    ధనలక్ష్మి వ్రత మాచరిన్చి న మహా దారిద్ర్య మే ;దక్కురా
    ఘన మౌ సౌఖ్యము లె ల్లవా రి కిల లో క మ్రoపు మోదoబులు న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి.

      తొలగించండి
  31. ఎనలేని సంపదల్ దరి
    ధనలక్ష్మీ వ్రతమొసంగు; దారిద్ర్యమునే
    కననీయ దామె కృపతో
    ఘనముగ గొలువంగ లక్ష్మికై మన మెపుడున్!

    రిప్లయితొలగించండి
  32. కనవలె పుణ్యక్షేత్రము
    లు నుడువ వలె హరి కథలను లోల సునేత్రా
    విను మీ యపాత్ర వితరణ
    ధనలక్ష్మీ! వ్రత మొసంగు దారిద్ర్యమునే


    మన మందుండెడు ఘోర పాతకపు టా మాలిన్యమున్ వీడ కే
    ఘన దైవమ్ముల వేడినన్ ఫలితముం గానంగ శక్యంబె తా
    ననయమ్ముం బను లెల్ల మాని యనయుండై భక్తి హీనాత్ముఁడై
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. తను వెల్లన్ మలినమ్ముగా కురులపై తారాడు హస్తమ్ముతో
    తినుబండారము లెల్ల తాకుచు రుచిన్ తేల్చన్ నోటిలో వైచుచున్
    వనితల్ బండెడు పూలు తెచ్చి సిరులన్ వాంఛింపుచున్ ధారుణిన్
    ధనలక్ష్మి వ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భాస్కరమ్మ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  34. ఘనుడా దివ్వెల పండుగాయె వినవో కల్యాణమౌ చేసినన్
    మనమీ వత్సర మా వ్రతమ్మనిన భామన్ లోపలన్ దిట్టుచున్
    ధన మెల్లన్ తన దానధర్మములకే దౌర్భాగ్య మంచెంచుచున్
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా.

    రిప్లయితొలగించండి
  35. పనిగొని ధన త్రయోదశి
    ధన వృద్ధిని గూర్చు ననుచు దలచుచు ,లక్ష్మి
    న్నణు మాత్రము దలపనిచో
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే

    అనయము ధన సంపాదన
    కనువగు దుష్కార్యములకు కారణ మగుచున్
    తన పర భేదము జూపన్
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే

    రిప్లయితొలగించండి
  36. తన ప్రాణేశుడు భూమిపైనఁ కల ప్రత్యక్షంపుదైవమ్ముగా
    మనమందున్ సత మెంచకుండ నిల సమ్మానమ్ముచూపించ నే
    రని దుర్మార్గపుటాలు సొమ్ముఁ గొన ప్రారంభించి యుత్తుత్తగా
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా

    రిప్లయితొలగించండి
  37. కొనధనమమితముగా తన
    మనసునునిలుపక కరమ్ము మలినపు హృదితో
    యొనరించిన మూఢుల కా
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "హృదితో। నొనరించిన..." అనండి.

      తొలగించండి
    2. గురువర్యులకు నమస్సులు. సవరణకు ధన్యవాదములు.

      తొలగించండి
  38. గురుదేవులకు, బ్లాగు వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు.
    ధనయోగము సుఖశాంతులు
    ధనలక్ష్మీవ్రత మొసంగు , దారిద్ర్యమునే
    మన దరి జేర నివ్వక
    ధనలక్ష్మీదేవి నిల్చె తల్లిగ ధరణిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వరప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "దరి జేరగ నివ్వక" అనండి.

      తొలగించండి
  39. మనసున్ రాక్షసత్వమున్ నిలిపిసౌమ్యుండట్లుగన్పించుచున్
    ఘనుడే నేననుగర్వమున్ జరుప?సంకల్పంబు సిద్దించునా?
    తనలో నీతియు లేని లోపమున సద్దర్మంబుసాగించకన్
    ధనలక్ష్మీ వ్రత మాచరించిన మహా దారిద్య్రమేదక్కురా|
    ౨ అనుమానంబును సాకుచు
    తనవారిని నమ్మబోక ధర్మము లేకన్
    అనవరతంబీర్షలతో
    ధనలక్ష్మీ వ్రతమోసంగు దారిద్య్రమునే|


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మొదటి పూరణ మొదటి పాదంలో గణదోషం. "మనమున్ రాక్షస తత్త్వమున్ నిలిపి..." అని మీ భావన కావచ్చు. టైపు దోషం!

      తొలగించండి
  40. తినగన్ బుట్టితి నేనటంచుఁ దిని వర్ధిల్లంగ ముప్పొద్దులన్
    పనికిన్ ముందుకు రాక సోమరుల సావాసంబునన్ జిక్కుచున్
    ప్రణతుల్ జేయుచు లోకమెల్లరకు సద్భక్తుండుగా తోచెడున్
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా!

    రిప్లయితొలగించండి
  41. [10/19, 9:57 AM] Daddy: గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    దీ పా వ ళీ వ ర్ణ న

    ఢా మ్మని లక్ష్మిబా౦బుల పటాసులు

    జై యన ధైర్యలక్ష్మికిన్ ,


    జుమ్మని లేచు " రాకెటుసు " సూచన జేయ

    పురోగతిన్ , ప్రకా

    శమ్మగు వర్ణదీపములు - చాటగ

    స్వర్ణభవిష్య దీప్తి , వి

    శ్వ మ్మలరారె మ౦గళ నివాళిత మైన

    దివాళి కేలిలో ! !

    { రాకెటుసు = రాకెట్సు }

    =====================*================
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,


    అనిశ౦బున్ గ్రియ లాచరి౦పుమిక

    లాభాపేక్ష వా౦ఛి౦పక |

    న్నొనగూరున్ సుఖ శా౦తి భాగ్యములు

    నీ కో మిత్రమా , భక్తితో

    ధనలక్ష్మీవ్రత మాచరి౦చిన | మహా

    దారిద్ర్యమే దక్కురా

    చను వారన్ నిను కౌగిలి౦త నిడి

    జ్యేష్ఠాదేవి చు౦బి౦చగా

    { చనువారన్ = అనురాగ మారగా }

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ దీపావళి పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  42. సవరణతో
    అనయము చేయన్ ధనమును
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే
    కనిపించనీయక ముదము
    ననవరతము నొసగు భువిని నబ్ధిజ మనకున్.

    రిప్లయితొలగించండి
  43. గురు దేవులకు కవి మిత్రులకు దీపావళిశుభాకా౦క్షలు
    తనువును శుధ్ధియొనర్చక
    మనసున క్రోధమ్ముద్వేష మత్సరములతో
    నొనరించిన భక్తి లేని
    ధనలక్ష్మీవ్రత మొసంగు దారిద్ర్యమునే

    రిప్లయితొలగించండి
  44. వినకను నీమము నిష్టల
    గొనకొని చెప్పంగ బుధులు క్రొత్తగ వేడ్కన్
    గుణములనెంచక చేసిన
    ధనలక్ష్మీ!వ్రతమొసంగు దారిద్ర్యమునే.

    రిప్లయితొలగించండి
  45. మనమున్ వాచనమందునన్ సిరిని నేమాత్రమ్ముపేక్షించకన్
    కనకమ్మందున షేరుమార్కెటుల చీకాకుల్ సమాళించుచున్
    మునుగున్ దేలుచు దొంగదారులన మామూళ్లన్ వసూల్జేయుచున్
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా!

    రిప్లయితొలగించండి
  46. కనకమ్ముండును రేపు పోవు గదరా కాబూలివాలా యిటన్
    ధనలక్ష్మీవ్రత మాచరించిన మహాదారిద్ర్యమే దక్కురా!
    వినరా మూర్ఖుడ! గాంధి గారి వలెనే విశ్వమ్ము కీర్తించనున్
    ధనవంతుండ్రగు భక్తులన్ గెలవరా దట్టించి లంగోటినిన్!

    రిప్లయితొలగించండి