22, అక్టోబర్ 2017, ఆదివారం

సమస్య - 2500 (పంచవింశతిశత...)

కవిమిత్రులారా,
నేటితో 'శంకరాభరణం' బ్లాగులో ప్రకటించిన సమస్యల సంఖ్య
2500 అయింది. 
ఇది మీ అందరి సహకారం వల్లనే సాధ్యమయింది.
అందరికీ ధన్యవాదాలు!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పంచవింశతిశత సమస్యాంచిత మిది"

66 కామెంట్‌లు:

  1. హృదయపూర్వక శుభాభినందనలు! 🙏🙏🙏💐💐💐💐💐

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండితులకిది ఘనమైన పసిడి గిన్నె ,
      చదువరల కిది నిత్యము సరస సదము,
      వింత నిడు సమస్యల సమావేశ మిదియె,.
      శక్తి నిచ్చెడు ప్రాజ్ఞుల సంస్థ యిదియె,
      తియ్య నైన తేనె లిడెడు దిమ్మ యిదియె,
      శలుని సతి కులుకులిడెడి శాల యిదియె,
      తమ్మిచూలి స్త్రీ యిచట నృత్తమ్ము జేయు,
      సత్కవు లిచట జేయగ సస్యము బహు
      మధురమైన కావ్య ఫలముల్ మనకుదొరుకు,
      అనవరతము లాస్యాంగముల్ యతిశయించు,
      చిత్ర గర్భ కవిత్వము చిగురు దొడుగు
      తడగ మిదియె, విజరపు లతలకు హస్త
      మిడుచు శంకరా ర్యుని బ్లాగు మిసిమి తోడ
      దినదినము పెరిగి పెరిగి దీప్తి నిడును

      మొదటి అక్షరములు కలిపి చదువు కోవాలి అనవరతము అను పాదములో మాత్రము 8 వ అక్షరము కలిపి చదువు కోవాలి

      తొలగించండి
  2. గురువర్యా ఇదంతయూ మీ అకుంఠిత దీక్షా దక్షతలకు నిదర్శనం. అందరూ చాల ఆనందించదగిన శుభదినమిది. మీకు మన మిత్రులందరకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. పెంచెను కవి శంకరుడు, విపంచి నెంచు
    మంచి పలుకురాణిఁ గొలవాలంచు తలచి
    పంచవింశతిశత సమస్యాంచిత మిది
    పంచు కవితామృతము చూడఁ గాంచ రండు!

    రిప్లయితొలగించండి
  4. సంచితంబైన పుణ్యమదెంచి చూడ
    మంచి మనసుతో కవులకు పంచినట్టి
    పంచ భక్ష్యాల విందును మించినట్టి
    పంచ వింశతి శత సమస్యాంచిత మిది

    రిప్లయితొలగించండి
  5. కంచె లన్నియు దాటుచు మించ హద్దు
    అంచె లన్నియు తీరుచు మించ మిన్ను
    చింత లన్నియు దీర్చెడి వింత మధువు
    పంచవింశతిశత సమస్యాంచిత మిది

    రిప్లయితొలగించండి
  6. శంకరాభరణము 'బ్లాగు 'వంక లేక
    నిర్వహించెడి వారిదౌ నేర్పు తోడ
    కోరి పాల్గొను చున్నట్టి వారి వలన
    విజయ వంతమై చనుచుండె విసుగు లేక
    పంచ వింశతి శత సమస్యాంచితమిది.

    రిప్లయితొలగించండి
  7. “పంచవింశతి శతసమ స్యాంచితమిది”
    అంచిత కవితా నాట్యవి న్యాస సొగసు
    లంద జేసిన ఘనతల నందు కొనుడు
    “శంకరాభరణ” పు “కంది శంకరయ్య”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవితానాట్యవిన్యాస సొగసు అని వైరి సమాసం అయినది దాన్ని మార్చుచూ

      “పంచవింశతి శతసమ స్యాంచితమిది”
      అంచిత కవితానాట్యవి న్యాస శోభ
      లంద జేసిన ఘనతల నందు కొనుడు
      “శంకరాభరణ” పు “కంది శంకరయ్య”

      తొలగించండి
  8. కవిశేఖరులు, నిరాడంబరులు, సౌజన్యమూర్తి.... శ్రీ కంది శంకరయ్య గారి సేవా తత్పరతకు, అకుంఠిత దీక్షకు.... నమస్సులు....ఇంతదూరం నిరాటంకంగా ప్రయాణించటం జీవితంలో గొప్ప సన్నివేశం....నాలాంటి వాడికిది వరం..... అభినందనలతో.....!

    "సాహితీ సుధలందించు శారద కృప
    భావనాబల పూరణోద్భాస మగుచు
    శంకరాభరణార్చితా లంకరణను
    పంచవింశతి సమస్యాంచితమిది!"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చివరిపాదంలో టైపాటు మన్నించగలరు...."పంచవింశతిశత సమస్యాంచిత మిది" గా చదువగలరు.

      తొలగించండి
  9. డా.పిట్టా
    శంకరాభరణమ్మది సాగునెట్లు?(ప్రశ్న)
    (ఉత్తర్వు):పంచయే లేని శుకయోగి పంచినట్టి
    దివ్య కథలెన్నొ మొలిపించి దీప్తి మించి
    మొదట కనిపించి కరిగెడు;ముత్యమల్లె
    పడియు వడగల్ల వానగా పరిఢవిల్లు
    పంచ వింశతి శత సమస్యాంచితమిది!
    ఈ సత్కృతి కర్తకు అక్షర లక్షల అభినందలతో-డా.పిట్టా సత్యనారాయణ

    రిప్లయితొలగించండి
  10. కొంచెమాగినదియు లేదు, మంచు కొండ
    కరిగి గంగాప్రవాహము కలుగు రీతి
    పంచదారను పంచెడి పంౘకునిక
    పంచవింశతిశత సమస్యాంచిత మిది!!

    రిప్లయితొలగించండి


  11. అందరికీ శుభాకాంక్షలతో


    పంచదశ లోకమందున పంచిరి మన
    కవివరులు మధురంబగు కైపదముల
    పూరణల నిదియె జిలేబి పూర్తి గాను
    పంచవింశతిశత సమస్యాంచిత మిది!

    జిలేబి

    పంచదశ లోకము - అంతర్జాలము :)

    రిప్లయితొలగించండి
  12. కవుల కల ములు ఝlళిపించి కవిత ల ల్లి
    వీలు కల్పిoచి మె ద డు కు వే డు కొస గి
    కంది శంకరయ్య సహన కార్య దీక్ష
    కి ది మచ్చు తునక యౌచు నిలుచుగాక
    పంచ వి oశతి శత సమస్యా oచిత మి ది

    రిప్లయితొలగించండి
  13. గురుదేవా! ఇదంతయూ మీ అకుంఠిత దీక్షా దక్షతలకు నిదర్శనం. బ్లాగు వీక్షకులు చాల ఆనందించదగిన శుభదినమిది. మీకు మన మిత్రులందరకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. గురువు గారికి నమస్కారములు.శంకరాభరణం బ్లాగ్ నెందరో ఔత్సాహిక కవులకు మార్గదర్శిగా నిలుస్తోoది.
    తెలుగు భాష పరిమళాలు ఈ బ్లాగ్ ద్వారా వేదము వలె విశ ద పరచడమే కాకుండా భాషాభివృద్ధి కి సహకరిస్తూంది. సమర్థవంతంగా ఈ బ్లాగ్ ను నిర్వహిస్తున్న o దులకు మీకు శత సహస్ర వందనములు. నా పూరణ లోని దోషములు తెల్పుడు.
    పంచరత్నాలు వ్రాసిస మంచితముగ
    పేరు గొన్నారు మావారు పెంపు మీర
    తగిన రీతిన పూరణ ధర్మ మగును
    పంచవిo శతి శత సమస్యాంచితమిది.

    రిప్లయితొలగించండి
  15. శంకరాభరణం బకళంక మెన్న
    వరపరిష్కారములు గాంచి యరుస మెపుడు
    గనెడి చిక్కుల జూపించు క్రమములోన
    పంచవింశతిశత సమస్యాంచిత మిది.

    రిప్లయితొలగించండి
  16. శంకర గురుదేవులు కడు సానబెట్టి
    పలువురు శిశువులకు నేర్పి మెలుకువలను
    పలుసమస్యల నిత్యము వెలువరించి
    పద్యవిద్యను తెలిపె ప్రపంచమునకు
    పంచ వింశతి శత సమస్యాంచిత మిది
    వంద నమ్ముల గురువున కందజేతు

    రిప్లయితొలగించండి
  17. శంకరాభరణమ్మందె శారద కృప
    కంది శంకరార్యు వర సంకల్ప బలము
    దీవెనల్గొన! చెలఁగు దేదీప్యమాన
    పంచవింశతిశత సమస్యాంచిత మిది!

    రిప్లయితొలగించండి
  18. మైలవరపు వారి పూరణ:

    *జయహో ! శంకరాభరణమా ! జయహో* !!

    అందరికీ శుభాకాంక్షలతో...

    చినుకు చినుకు రాలి చిరుజల్లులై సాగి
    ప్రవహించి నదులుగా బరగినట్లు !
    కొన్ని విత్తులు నాట , కోటి పంటలు పండి ,
    యిల్లు జేరగ బండినెక్కి నట్లు ,
    నానంద బిందువులబ్ధిగా రూపాంత
    రమ్ములై ధరణిని క్రమ్మినట్లు !
    పూవు బూవును గ్రుచ్చి పూమాలగా మార్చి
    తల్లి భారతి మెడ దాల్పినట్లు !

    నవ్య కార్తిక వనభోజనంపు రీతి
    పంచవింశతిశత సమస్యాంచితమిది!శంకరాభరణము కంది శంకరయ్య
    మానసాత్మజ ! శాశ్వతమై రహించు!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  19. *జయహో ! శంకరార్య!*జయహో !

    “పంచవింశతి శతసమ స్యాంచితమిది”
    పంచ కవితామ్రుతమ్మును బాధలంద
    శంకరాభరణ బ్లాగున శంకరుండు
    మించచెను గగనమ్మును నేడు కంచెలేక

    రిప్లయితొలగించండి
  20. క్లిష్టమైన సమస్యల నిష్ఠ నిడి , కు
    కవుల మేధకు కంపన కలుగ జేసి
    పద్య రచనకు పురికొల్పు వ్రతమనంగ
    పంచవింశతిశత సమస్యాంచిత మిది

    రిప్లయితొలగించండి
  21. వెతల బొందియు నటవిన సతిని వీడి
    పాక శాలను జేరియు వంట జేసి
    రయమున రథము నడిపించి రాజు గొనియు
    వలచి దమయంతి జేరిన నలుని గాధ
    పంచవింశతిశత సమస్యాంచిత మిది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువుగారూ నమస్సులు. మీ దీక్షా దక్షతకు నిదర్శనమే ఈ శంకరాభరణం. ఈ వేదిక ఎందరో కవులకు పద్యరచనాభ్యాసం చేయుటకు ఆలవాలమై ఇంకెందరో కవుల ప్రతిభా పాటవాలు వర్ధిలునట్లు చేసి నిరంతరాయముగా సాగు దివ్య గంగా ప్రవాహమే.

      తొలగించండి
  22. కవుల బృంద మొక్కటిగను కలసి సాగు
    భళిర ! సాహిత్య విలువలు బాగు బాగు!
    అరయ సాహితీ వనము నుయ్యాలలూగు
    కులుకు నేర్చిన దీబ్లాగు కొండ వాగు
    కుకవు లందరి పాలిట కోడె నాగు
    కూయు పికములు చెలరేగు గొప్ప బ్లాగు
    చూడ రసికు లందఱు జేరి చుట్టు మూగు
    పగడములు వేలు దీని గర్భాన దాగు
    రమ్య మైన కవన రాగ రవము మ్రోగు
    చక్కగ పఠితులు పరవశమున తూగు
    పంచ వింశతి శత సమస్యాంచితమిది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వారె వా| పైది చదువంగ వలదు జాగు
      సుకవి తేరుపై నెగిరెను శుభపు ఫ్లాగు
      వారికి సమర్పించెద నొక వలువ పోగు
      లేని యెడల కలమును దాల్చి చెలరేగు
      (గుర్రం వారూ సరదాకు మాత్రమే సుమీ)

      తొలగించండి
  23. అంచెలంచలెదిగి శంకరార్యుబ్లాగు
    మంచిమంచిపూరణలనందించునట్లు
    పంచెసాహితీ జ్ఞానమ్ము పదుగురికిని
    పంచ వింశతి శత సమస్యాంచిత మిది

    రిప్లయితొలగించండి
  24. నేఁటి వఱకు పంచవింశతిశతతమ సమస్యల నకుంఠిత దీక్షతో నందించి, యెందఱో కవులకు మార్గదర్శనము చేసిన సుకవి పండిత మిత్రులు మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి శుభాభినందనలు!

    సుకవి మిత్రులందఱకు నమస్సులు!

    శంకరాభరణము పేర సకల కవుల
    కందుబాటున నుండెడి, హర్షమెసఁగ
    మేధకుం బదునుం బెట్టు శోధననిడు
    పంచవింశతిశతసమస్యాంచితమిది!

    రిప్లయితొలగించండి

  25. పంచవింశతిశత సమస్యాంచిత మిది"
    కరము తిరిగిన యాగొప్ప కవుల తోడ
    వర్ధమాన కవులకెల్ల బాట చూపు
    వేదికయ్యెను గనుడిల వేడ్క మీర
    పంచవింశతి సమస్యాంచితమిది.

    పంచవింశతి సమస్యాంచితమిది
    శంకరగురువర్యులమాన స సుత యనగ
    వాసికెక్కిన సుమధుర బ్లుగు నిదియె
    పంచు చుండు సతము పద్య పరిమళాలు.


    రిప్లయితొలగించండి
  26. నేఁటి వఱకు పంచవింశతిశతతమ సమస్యల నకుంఠిత దీక్షతో నందించి, యెందఱో కవులకు మార్గదర్శనము చేసిన సుకవి పండిత మిత్రులు మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  27. *పంచి పద్యసమస్యల పరిమళములు*
    *కొత్తనెత్తావి పూదండ గూర్చి నీవు*
    *శక్తినివ్వగ వాగ్దేవి సంతసమున*
    *పంచ వింశతి సమస్యాంచితమిది*

    రిప్లయితొలగించండి
  28. *పంచి పద్యసమస్యల పరిమళములు*
    *కొత్తనెత్తావి పూదండ గూర్చి నీవు*
    *శక్తినివ్వగ వాగ్దేవి సంతసమున*
    *పంచ వింశతి సమస్యాంచితమిది*

    రిప్లయితొలగించండి
  29. పంచవింశతిశతమునకు పంచపాది:

    బ్రహ్మ విష్ణు మహేశ్వర వర సమన్వి
    తావనీ సుర వర కల్పి తాబ్జభవ స
    తీ మణి కరుణా కలిత సుధామ శంక
    రాభరణ నామ వర విద్వదాలయమున
    పంచవింశతిశత సమస్యాంచిత మిది

    రిప్లయితొలగించండి
  30. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,

    పద్యప౦చామృతము చేత పద్మభవుని

    రాణి నభిషేక మొనరి౦చి ప్రణుతి జేయు

    శ౦కరాచార్య ! పదనమస్కారము లివె !

    ప౦చవి౦శతి శత సమస్యా౦చిత మగు

    శ౦కరాభరణమును పోషణమొనర్చు

    కవి వరుల పలుకులె , వాణి కరము న౦దు

    పలుకు నా విప౦చిక యొక్క స్వరము లగును

    రిప్లయితొలగించండి
  31. శంకరుల గంట మొలకించు చందనమ్ము
    కవిజనమ్ముల కుల్లాస కారకమ్ము
    తరుణి వాణికి నక్షర సరసిజమ్ము
    పంచవింశతి సమస్యాంచితమిది

    రిప్లయితొలగించండి
  32. బ్లాగు గగన సముద్భవ ప్రణవ నాద
    మాంధ్ర కవితాసరస్వతీ యమరగాన
    మతుల శంకరాభరణాఖ్య మైన స్వరము
    పంచవింశతిశత సమస్యాంచిత మిది.

    రిప్లయితొలగించండి
  33. నేటి దివసము దనుకను మేటి యైన
    శంకరాభరణ కవిత శాఖ పైన
    వివిధ కవివిహంగమ్ములు వినిచినట్టి
    పంచవింశతి సమస్యాంచితమిది

    రిప్లయితొలగించండి
  34. బాతుబంగారు గుడ్డుగా”నీతి నిలుపు
    పూరణలు బెంచికవులకు స్పూర్తినొసగు
    రోజురోజుకు మోజు యారోగ్య మొసగు|
    పంచ వింసతి శత సమస్వాంచితమిది
    పంచు పండితా| శంకరాభరణమందు|
    2.చెలిమి యూట| “సమస్యలు చెంతజేర్చి
    పంచ వింశతి శత సమ స్వాంచితమిది
    యనక? వేలు లక్షలగు ప్రయాస లేక
    భారతందించు శంకారా భరణమందు”|

    రిప్లయితొలగించండి
  35. పంచవింశతిశతసమస్యాంచితమిది
    యనకతప్పదండ్రునార్యులవని
    కందిశంకరయ్యగారిపట్టుదలకు
    బహుముఖతకునిదియవరలుచుండె

    రిప్లయితొలగించండి
  36. ఎంత సుదిన మిది?
    ఉదయం నుండి ప్రశంసల జల్లులో తడిసి ముద్దయినాను. బ్లాగులో, వాట్సప్ సమూహంలో, ఫేసుబుక్కులో, ఫోను ద్వారా నాకు శుభాకాంక్షలు, అభినందనలు గద్య పద్యాల రూపంలో తెలుపుతూనే ఉన్నారు.
    గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారు, వారి సోదరి గుఱ్ఱం ఉమాదేవి గారు తమ కుటుంబ సభ్యులతో ఇంకా అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, మాచవోలు శ్రీధర రావు గారు వ్యక్తిగతంగా మా వృద్ధాశ్రమానికి వచ్చి నాకు సన్మానం చేసి వెళ్ళారు.
    ఈరోజు నేను పొందిన ఆనందాన్ని, తృప్తిని, (కించిత్తు గర్వాన్ని) మాటల్లో వివరించలేను.
    మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
    నిజానికి 2500 సమస్యలు అయ్యాక బ్లాగును ఆపివేయడమో, ఎవరికైనా అప్పగించడమో చేద్దామనుకున్నాను. కాని మీ అందరి సహకారం, ప్రోత్సాహం, ప్రశంసలు నూతనోత్సాహాన్ని నింపాయి. నా ఓపినంత బ్లాగును నిర్వహిస్తూనే ఉంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ రోజు నిజంగా యెంతో సుదినము! ఈ ప్రత్యేకమైన రోజు నేను హైదరాబాదులో ఉండడం, గురువుగారిని కలిసి చిరు సత్కారము చేయగలగడం , కవి మిత్రులను కలవగలగడం చాల అదృష్టంగా భావిస్తున్నాను!
      గురువుగారు నా పేరును పొరపాటుగా ఉమాదేవిగా వ్రాశారు!

      తొలగించండి


    2. కంది వారికి కవులందరికి జేజేలు


      ఎంత సుదినమిది ! పద్యము
      లెంతటి తృప్తిని మనసుకు లెస్సగ జేర్చె
      న్నింతై పూరణ లంతై
      వింతల గొల్పుచు జిలేబి విరివిగ విరిసెన్ !

      జిలేబి

      తొలగించండి
    3. డా. బల్లూరి ఉమాదేవి గారి పద్యాన్ని చదివి ఆ వెంటనే ఈ వ్యాఖ్యను పెట్టాను. ఆ ప్రభావంతో సీతాదేవి బదులు ఉమాదేవి అని టైప్ చేశాను. మన్నించండి!

      తొలగించండి
    4. మన్నించడమనేది పెద్దమాట! మీరనరాదు! కేవలము బ్లాగులోని వారికి తెలియజేయుటకు వ్రాసితిని.🙏🙏🙏🙏

      తొలగించండి

  37. పండితులకిది ఘనమైన పసిడి గిన్నె ,
    చదువరల కిది నిత్యము సరస సదము,
    వింత నిడు సమస్యల సమావేశ మిదియె,.
    శక్తి నిచ్చెడు ప్రాజ్ఞుల సంస్థ యిదియె,
    తియ్య నైన తేనె లిడెడు దిమ్మ యిదియె,
    శలుని సతి కులుకులిడెడి శాల యిదియె,
    తమ్మిచూలి స్త్రీ యిచట నృత్తమ్ము జేయు,
    సత్కవు లిచట జేయగ సస్యము బహు
    మధురమైన కావ్య ఫలముల్ మనకుదొరుకు,
    అనవరతము లాస్యాంగముల్ యతిశయించు,
    చిత్ర గర్భ కవిత్వము చిగురు దొడుగు
    తడగ మిదియె, విజరపు లతలకు హస్త
    మిడుచు శంకరా ర్యుని బ్లాగు మిసిమి తోడ
    దినదినము పెరిగి పెరిగి దీప్తి నిడును

    మొదటి అక్షరములు కలిపి చదువు కోవాలి అనవరతము అను పాదములో మాత్రము 8 వ అక్షరము కలిపి చదువు కోవాలి

    రిప్లయితొలగించండి
  38. డా}.పిట్టా నుండి
    ఆర్యా,ఈ అనుబంధం కంటె తీయనైనది ఉండదు.నేటి మీ సన్మానపు ఫొటోలను save చేసీbiog లో పెట్టండి.

    రిప్లయితొలగించండి
  39. ఎంత సుదినము మదినిండ వింత వెలుగు
    పంచ వింశతిశత సమస్యాంచిత మిది
    బరువు బ్రతుకున వెలుగొందు తెరువు జూపి
    పద్య కవనము లల్లించె పండితుండు
    -----------------------------------
    గురువులకు [హృదయ పూర్వక కృతజ్ఞతాభి నందనలు సోదరా ]

    రిప్లయితొలగించండి
  40. శబ్దసంస్కారసముచిత సంపదయును
    అర్థసౌందర్యఘన చరితార్ధతయును
    గలుగు శంకరసంకల్ప కావ్యనదము
    పంచవింశతిశత సమస్యాంచిత మిది.

    రిప్లయితొలగించండి
  41. కంది శంకరార్యుల కివె వందనములు!
    నాణ్యముగ వ్రాయ నేర్పించె నవకవులకు,
    రాటు దేలిన వారల ప్రతిభ పెంచి
    రాచ బాట నడిపె శంకరాభరణము
    “పంచ వింశతి శత సమస్యాంచితమిది!”

    రిప్లయితొలగించండి
  42. గురువు గారికి నమస్సులు,ఈ శుభ దినమందు మిమ్ముల వ్యక్తిగతంగా కలుసు కోగలగడం మా అదృష్టం. మీ సహృదయత విలువ కట్ట లేనిది. మాతృ ప్రేమ కేమాత్రము తీసిపోని గురు వాత్సల్యమన నెట్టిదో మఱియొక సారి చవిచూడ గల్గితిమి.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  43. అనితర సాధ్యమ్మిదియే
    యని జెప్పుదు నేను, శంకరార్యుల శక్తిన్
    కన రారే,సంకల్పము
    ఘనమైనది వారికిడుదు కైమోడ్పులివే.

    రిప్లయితొలగించండి
  44. ఈనాటి సమస్యకు పూరణ రూపంలోను, సందేశం రూపంలోను అభినందనలు, ప్రశంసలు తెలిపి నన్ను ప్రోత్సహించిన కవిమిత్రులు....
    గుఱ్ఱం సీతాదేవి గారికి,
    పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి,
    తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    బంకుపల్లి భరద్వాజ గారికి,
    గుఱ్ఱం ప్రభాకర శాస్త్రి గారికి,
    గుఱ్ఱం జనార్దన రావు గారికి,
    శిష్ట్లా శర్మ గారికి,
    డా. పిట్టా సత్యనారాయణ గారికి,
    జిగురు సత్యనారాయణ గారికి,
    జిలేబీ గారికి,
    కె.ఆర్. రాజేశ్వర రావు గారికి,
    కందుల వరప్రసాద్ గారికి,
    పంచరత్నం వెంకట నారాయణ రావు గారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారికి,
    మైలవరపు మురళీకృష్ణ గారికి,
    భాగవతుల కృష్ణారావు గారికి,
    ఫణికుమార్ తాతా గారికి,
    చంద్రమౌళి సూర్యనారాయణ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    డా. బల్లూరి ఉమాదేవి గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    చేపూరి శ్రీరామారావు గారికి,
    పోచిరాజు కామేశ్వర రావు గారికి,
    గురుమూర్తి ఆచారి గారికి,
    వీటూరి భాస్కరమ్మ గారికి,
    మిస్సన్న గారికి,
    కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
    కె. ఈశ్వరప్ప గారికి,
    పోచిరాజు సుబ్బారావు గారికి,
    నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
    జె.జె.కె. బాపూజీ గారికి,
    మాచవోలు శ్రీధర రావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    .................................. ధన్యవాదాలు!
    ఈరోజు అందరి పూరణలను, పద్యాలను, వ్యాఖ్యలను చదివి మహదానందం పొందాను. నా స్పందనను విడివిడిగా వ్యక్తం చేయడానికి మాటలు కొరవడ్డాయి. అందువల్ల అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను.
    ఈరోజు ఎవరి పద్యాలలోను రంధ్రాన్వేషణ చేయదలచుకోలేదు.

    రిప్లయితొలగించండి
  45. గురువు గారూ..... ఒక్కో సమస్యకు 50 పూరణలు సగటున తీసుకున్నా ....2500*50=1,25,000 పద్యం పూరణలు మీద్వారా తెలుగు సాహిత్య లోకాని కందటం ఓ మహత్తర సందర్భం. 'శంకరాభరణం' ఆ శారదా దేవి కంఠాభరణంగా వెలుగొంది మున్ముందు మీరనుకున్న సంకలనం త్వరలో వెలువడాలని ఆకాంక్షతో..... నమస్సులు!

    రిప్లయితొలగించండి