28, అక్టోబర్ 2017, శనివారం

సమస్య - 2505 (నాగపూజ సేయ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"నాగపూజ సేయ నరకమబ్బు"
(లేదా...)
"నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ"
ఈ సమస్యను పంపిన వీటూరి భాస్కరమ్మ గారికి ధన్యవాదాలు.

83 కామెంట్‌లు:

  1. క్షేమ కరము గాదె క్షితిజతలమ్మునన్
    నాగపూజసేయ, నరక మబ్బు
    విషపు జీవులంచు భీతినే కలిగియున్
    సర్పములగుపడిన చంపినంత

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'క్షితితలము' అనాలి కదా! మీరు 'క్షితిజతలము' అన్నారు. క్షితిజ మంటే చెట్టు. అక్కడ "క్షితితలమందునన్" అందామా?

      తొలగించండి
  2. దైవ చింత నెపుడు ధన్యత గూర్చును
    పూజ సేయు నెడల పుణ్య మబ్బు
    చిత్త శుద్ధి తోడ చింతింప నేరీతి
    "నాగపూజ సేయ నరకమబ్బు?"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      సమస్య పాదాన్ని ప్రశ్నార్థకంగా మార్చి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

      తొలగించండి
  3. పాము త్రాగదెపుడు పాలును తేనియ;
    పుట్టలోన పాలు పోసినంత
    ముక్కు నోరు కనులు మూతబడుట చేత
    నాగపూజ సేయ నరకమబ్బు!

    "Snakes are reptiles, not mammals to drink milk. Milk cannot be digested by reptiles and they eventually die!"

    http://www.arpfindia.org/blog/truth-behind-nag-panchami

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      శాస్త్రీయ విషయాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "మూతబడి గతించుః" అంటే ఇంకా బాగుంటుందేమో?

      తొలగించండి
  4. (జనమేజయుడు సభాసదులతో తనతండ్రి పరీక్షిత్తు మరణాన్ని పురస్కరించుకొని)
    పాండువీరులకును పసమించు మనుమని;
    నడత తప్పనట్టి నాదు జనకు
    గరచి చంపె దక్షకదుష్టుండు;
    నాగపూజ సేయ నరక మబ్బు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాపూజీ గారూ,
      జనమేజయుని ప్రస్తావనతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. "జనకు। దరిసి కరచి చంపె దక్షక దుష్టుండు" అందామా?

      తొలగించండి
  5. రేగిన వాంఛతో మగని రేయి బవల్ సమగూడి స్నానమున్
    సాగక పస్తులుండక నిశాచర భావము నిద్ర లేవ తా
    ద్రాగిన క్షీరశేషమును తప్పుగ పుట్టన బోసి బిఱ్ఱుతో
    నాగుల పూజ సేయ నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ గారూ,
      మడి గట్టక, అశుచిగా చేసే పూజను గురించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  6. జీవుల యెడ కరుణ శివుని కి ప్రీతి యౌ
    కనుక హార మ యె ను గళ ము నందు
    నాగ పూజ సేయ నరక మబ్బు నను ట
    క ల్లగాదె జగతి డొల్ల యగుచు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      సమస్యను మూడవ పాదంలో ఉంచి, ఆ మాట కల్ల అంటూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  7. రాగిణి! సుఖమయము రమ్యమగు బతుకు
    నాగపూజ సేయ! నరక మబ్బు
    భోగ విలసితమగు భోక్తృత్వపు పుటము
    ల గవగవ మనిన మెలకువ లేక !

    జిలేబి

    రిప్లయితొలగించండి


  8. రాగిణి! జీవనమ్ము తవరాజము మేల్పడు నోయి రమ్యమై
    నాగుల పూజ సేయు నెలనాగలకున్, నరకంబు ప్రాప్తమౌ
    భోగము లెల్ల గాంచి మజ భోక్తము జేయ! జిలేబి మేలుకో
    వే! గవనమ్ము తోడ తిరు వేంకట నాధుని మేలు గొల్వుమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      తవరాజము, మజ శబ్దార్థాలకోసం ఆంధ్రభారతిని ఆశ్రయించవలసి వచ్చింది సుమా!

      తొలగించండి


    2. కందివారు నమో నమః !


      ఒకచెంత ఆంధ్ర భారతి
      మకరందపు కైపదములు మరియొక వైపున్
      సకి ఛందసు సాఫ్ట్వేరై
      వికసించితివే జిలేబి విదురుల సభలో :)

      జిలేబి

      తొలగించండి
  9. పాలు పోసి నంత పాముకు ప్రియమంచు
    బ్రమను వీడి నిలను బ్రతుక వలయు
    మనిషి నిండ విషము మత్తెక్కి యుండగ
    నాగ పూజ సేయ నరక మబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      చక్కని పూరణ. అభినందనలు.
      "వీడి యిలను" అనండి.

      తొలగించండి
    2. పాలు పోసి నంత పాముకు ప్రియమంచు
      బ్రమను వీడి యిలను బ్రతుక వలయు
      మనిషి నిండ విషము మత్తెక్కి యుండగ
      నాగ పూజ సేయ నరక మబ్బు

      తొలగించండి
  10. వాగుల వంక లందునను పాముల పుట్టలు పుట్టలే యనన్
    సాగుచు పాలుపో యుచును సాగిల మ్రొక్కుచు పూజచే యగా
    భోగము లందుకో గలుగు భూరిగ యాశల మైకమం దునన్
    నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ వృత్త పూరణ బాగున్నది. అభినందనలు.
      "భూరిగ నాశల..." అనండి.

      తొలగించండి
    2. వాగుల వంక లందునను పాముల పుట్టలు పుట్టలే యనన్
      సాగుచు పాలుపో యుచును సాగిల మ్రొక్కుచు పూజచే యగా
      భోగము లందుకో గలుగు భూరిగ నాశల మైకమం దునన్
      నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ

      తొలగించండి
  11. నాస్తి కాగ్రగుండు నాగేంద్రు డనువాడు
    పలుకుచుండు నిట్లు ప్రజల తోడ
    కాలకంఠు గొలువ కష్ట కాలము వచ్చు
    నాగపూజ సేయ నరకమబ్బు.

    కారణంబు లేక చేరి పుట్టలలోన
    దాగి యున్న వాని లాగి లాగి
    చంపుచుండి సతము సాకుము మమ్మంచు
    నాగపూజ సేయ నరకమబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరింప జేసాయి. అభినందనలు.

      తొలగించండి
  12. కనుల ముందు పాము కనిపించుచో చాలు
    మొరకుడగుచు తలన మోది చంపు
    నయము మరియు భూత దయలేని ఖలునకు
    నాగ పూజ చేయ నరకమబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విజయకుమార్ గారూ,
      చక్కని పూరణ. అభినందనలు.
      (నవంబర్ 11న బొంబాయి వస్తున్నారా?)

      తొలగించండి
  13. అందమైన భార్య యనుకూలవతి యిల్లుఁ
    జక్క దిద్దునట్టి సాధ్వి విడిచి
    హానిఁ గూర్చెడి వెలయాలినిఁ జేరి పు
    న్నాగపూజ సేయ నరక మబ్బు.

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా
    కూడబెట్టినట్టి కోట్ల గ్రుమ్మరించి
    వోట్లు దండుకొనెదవోయి, సేవ
    చేయ(జేయ)కెన్నొరెట్లు జే(చే)పట్టు క్రూర ప
    న్నాగ పూజ సేయ నరకమబ్బు!

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా
    బాగగు కీడగున్నదియ భాగ్యవిధాత యెరుంగు తత్త్వమున్
    సాగగనీక దోషమని శాంతుల తత్శమనార్థ కర్మలన్
    ప్రోగులువెట్టి పాపములు బోవును ప్రక్కకటన్న మౌఢ్యపు
    న్నాగుల పూజ సేయ నెలనాగులకున్ నరకంబు ప్రాప్తమౌ!
    (పున్నాగము=ఇంద్రుని యేనుగు,తెల్లగలువ. *మౌఢ్యపున్ ,నాగుల సేవ*)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా ఉన్నాయి. బాగున్నవి. అభినందనలు.
      'పన్నాగ పూజ' అనడం దుష్టసమాసం.

      తొలగించండి
  16. వంశ వృద్ధి యగును వావిరి పెంపగు
    నాగ పూజ సేయ ,నరక మబ్బు
    తల్లి తండ్రి సేవ తనదిగా బాసాడ
    ని బుడత ల సరసత నిడుచు వాrki
    తెలుగు లో చివరి పద ము చివరి పదము ను ఆంగ్లంలో టైప్ చేయడమైనది.

    రిప్లయితొలగించండి
  17. నాగుబాము యన్న నరుని దేహమునందు
    వెన్నుబాము గాదె వివర మరయ
    నాత్మవిద్య మరచి యాశల జేగొని
    నాగపూజ సేయ నరకమబ్బు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాణ్యమైన యిల్లు నమ్రతగల భార్య
      గలిగినట్టి నరుడు కల్లుద్రాగి
      కామమోహితుడయి కనిపించు ప్రతియెల
      నాగపూజ సేయ నరకమబ్బు!(బడితె పూజ)

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'పాము+అన్న = పామన్న' అవుతుంది. యడాగమం రాదు. అక్కడ "నాగుబా మటన్న" అనండి.

      తొలగించండి
  18. "అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం"
    ****)()(****
    ఏగతి నెంచి జూచినను నీభువి లోగల సత్య మొక్కటే!
    రాగల పుణ్య పాపముల లాభము,నష్టము రాక తప్పునే?
    దాగుడు మూతలాడుచును దారుణ పాపము లన్ని జేయుచున్
    "నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ"

    రిప్లయితొలగించండి
  19. క్షుద్ర పూజలొప్పు సుందరి దరిఁజేర.
    మనసు చెదరిపోవు మాయలందు.
    నిమ్మకాయ,పుఱ్ఱె,నిలఁబెట్టు నా యెల
    నాగపూజసేయ నరకమబ్బు

    రిప్లయితొలగించండి
  20. మంచి సంతు గలిగి మహానీయుడగునట
    నాగపూజసేయ ,నరకమబ్బు
    నాగుపాముజంపు నరునకెవనికైన
    తధ్య మిది య వినుడు తమ్ములార !

    రిప్లయితొలగించండి


  21. పాములకిల పాలు పదిలముగా పోసి

    నాగ పూజ చేయ నరక మబ్బు

    ననెడి మాటలేల ?నాగు లెపుడు మంచి

    సంతు నొసగి కాచు జగతి యందు.


    భారతీయు లెల్ల భక్తితో కొలువంగ

    నాగ పూజ చేయ నరక మబ్బు

    ననుట పాడికాదు నాస్తికులకు నిట

    పాలు పోయ నాగు మేలు సేయు.


    మంచి సంతు కల్గు మహిని దేనివలన?

    చెడు పనులు చేయ ఫలమ

    దేమి కలుగు  నిపుడె జంకక తెలుపుమా

    నాగ పూజ చేయ నరక మబ్బు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉమాదేవి గారూ,
      మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      మూడవ పూరణ రెండవ పాదంలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
  22. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,

    నాగప౦చమీ దినమున నుపేక్షి౦ప

    నాగపూజ సేయ , నరక మబ్బు

    నను టసత్య మగును | హరుని బూజి౦చిన

    శ౦కరాభరణము స౦తసిలదె ? ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'శంకరాభరణము' సంతసిల్లినదండీ!

      తొలగించండి
  23. నాగ దోష వార ణమ్ము, కన్యలపెండ్లి,
    సంతు పొంద, చెప్ప శాస్త్ర మందు
    ఆచరింప మనగ నామార్గ మెట్టుల
    “నాగపూజ సేయ నరకమబ్బు”?

    రిప్లయితొలగించండి
  24. అక్రమమ్ముగ నొక నతివతో కూడంగ
    సతి వలదని పర వనితను జేరి
    దురితుడై విభవము దోచి పెట్టుచు నెల
    నాగ పూజ సేయ నరక మబ్బు!

    గురువర్యులకు నమస్సులు. నిన్నటి నా పూరణను పరిశీలించ ప్రార్థన.
    ధన్యవాదములు.

    మెడద, యఙ్ఙాత వాసము గడచి పోయె!
    ఒక్కడొకడు పుడమి నేల నొలయు చుండ్రి!
    వెన్నుడను, సంధి కుదుర నేవీ పుడమి దొ
    ర! దెలుపవె నీదు తలపులు విదుడ వగుచు!
    (మెడద = అడవి; ఒలయు = కోరు;)

    రిప్లయితొలగించండి
  25. మానవత్వ మెల్ల మంటఁ గలిపి తోటి
    వారి సొత్తు నెల్లఁ దేర దోఁచు
    కొనఁగఁ బంత మూని దనుజారి విష్ణు వి
    నాగ పూజ సేయ నరకమబ్బు


    రాగము మానవాళి నిడి లాలన నార్తుల నాదరించి యే
    భాగము వారిఁ గోరని యపార కృపాళులె పుణ్యు లిద్ధరన్
    భాగవ తోత్త మోత్తములు స్వాము లటంచును నమ్మి ధాత్రి మ
    ర్నాగుల పూజ సేయు నెలనాఁగలకున్ నరకంబు ప్రాప్తమౌ

    [మర్నాగి = మోసగాఁడు]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  26. పాము కానుపించ భయమున పరుగెత్తి
    పాములేని పుట్ట పాలు పోసి
    దుష్ట జీవి యనుచు దునుమాడ యత్నించి
    నాగపూజ సేయ నరకమబ్బు

    నిన్నటి దత్తపది కి నా పూరణ

    తలచి పార్థుడ నేనని దౌడు తీయ
    నస్త్ర మెడ బాయు శత్రుల హడల జేతు
    రధము తోలుము నీవీపురమ్ము వీడి
    నేడు కడుపుణ్యదిన మగు చూడుమయ్య !

    రిప్లయితొలగించండి
  27. .”మోక్ష నరక మన్న?సాక్ష్యము లేనట్టి
    మంచి,చెడ్డకొరకు మానవతకు”
    నాగపూజ సేయ నరక మబ్బుయనుట
    మూఢ నమ్మకాన ముందు మాట|
    2.నాగరికాన నాగుల?”సనాతన ధర్మములెక్కజేయకే
    ఆగక జీవితాశయ విహారము నందు ప్రయాణ మాశచే
    తూగెడి వారికే చవితి తోచదు గాన ప్రయాశ మార్చగన్
    నాగుల పూజసేయ నెలనాగులకున్ నరకంబు ప్రాప్త మౌ| {ఈనాడంటున్నారు}



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "నరక మబ్బు ననుట..' అనండి.

      తొలగించండి
  28. సాగును జీవితమ్మవని చక్కని మార్గమునందుఁ బోవుచున్,
    రాగముతోడుతన్ కడఁ బురాతన పద్ధతు లాచరించుచున్,
    నాగుల పూజ సేయు నెలనాగలకున్, నరకంబు ప్రాప్తమౌ
    భోగములందు తేలుచును భోగుల పండుగ విస్మరించినన్

    రిప్లయితొలగించండి
  29. భువిఁ బవిత్రభావముతోడ పుణ్యవతులు
    కోరుకోర్కెలన్నియు వెస తీరుసుమ్ము
    నాగ పూజ చేయ, నరకమబ్బు
    నాగుపామును జంపిన నరుల కెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెడ్డి గారూ,
      పూరణ బాగుంది. కాని ఆటవెలది సమస్యకు తేటగీతి వ్రాశారు. నా సవరణ.....
      భువిఁ బవిత్ర భావమున బుణ్యసతు లెల్ల
      కోరు కోర్మె లన్ని తీరుసుమ్ము
      నాగపూజ చేయ; నరక మబ్బును గాదె
      నాగుపాము జంపు నరుల కెపుడు.

      తొలగించండి
    2. గురువర్యుల సవరణకు ధన్యవాదములు. నమస్సులు.

      తొలగించండి
  30. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పావనుడవగుదువు భక్తిగూడి గుడిలోన
    నాగపూజ చేయ, నరక మబ్బు
    నిమ్ము జూపకుండి నిరతమ్ము పరమాత్మ
    నింద జేయుచుండి నెగడు నపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'గుడిలో' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  31. నాగులపూజసేయునెలనాగలకున్నరకంబుప్రాప్తమౌ
    వేగముచింతజేయకుడువేమరుపాటునగాదునెయ్యెడన్
    నాగులపూజసేయునెడనాకముకల్గునునెల్లవారికిన్
    నాగుడెరక్షసేయునటనాగునిపిల్లలగంటికింపుగాన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యాల మధ్య వ్యవధానం ఉంచండి.

      తొలగించండి
  32. భక్తి తోడ గుడికి పరమాత్ముఁ భజియించు
    భావనల వెడలిన స్వర్గ మబ్బు
    పట్టు చీరలందు బంగారమందు క
    న్నాగ ! పూజ సేయ నరకమబ్బు!!

    రిప్లయితొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పావనుడవగుదువు భక్తితో గుడిలోన
    నాగపూజ చేయ, నరక మబ్బు
    నిమ్ము జూపకుండి నిరతమ్ము పరమాత్మ
    నింద జేయుచుండి నెగడు నపుడు

    రిప్లయితొలగించండి
  34. సాగెద మాలయమ్మునకు షణ్ముఖు మ్రొక్కనటంచుఁ బల్కుచున్
    మూగుచు చీరలన్,పసిడి పోకడ లెంచుచు దూరదర్శిని
    న్నాగక సాగు నాటికల నంతము నూహల ముచ్చటించుచున్
    నాగుల పూజ సేయు నెలనాగలకున్ నరకంబు ప్రాప్తమౌ!

    రిప్లయితొలగించండి
  35. ధన్యవాదాలన్నయ్యగారూ
    సవరించిన పద్యము

    మంచి సంతు కల్గు మహిని దేనివలన?

    చెడు పనులు సతము చేయ ఫలమ

    దేమి కలుగు నండ్రు తెలుపుమా నిజముగ

    నాగ పూజ చేయ నరక మబ్బు

    రిప్లయితొలగించండి