జిలేబీ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'తవిషము' క్రొత్త పదం తెలుసుకున్నాను. 'భార్య+ఔ' అన్నపుడు యడాగమం వస్తుంది. 'కవి గొను భార్యగ ప్రాసను' అంటే ఎలా ఉంటుంది?
"గగనాంగన నిజంగానే గొప్ప కవయిత్రి. రాత్రి వేళ ఆరుబయట మంచం వేసుకొని పడుకొని ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల పదాలతో, మేఘాల భావాలతో ఎంత గొప్ప కవితలు వినిపిస్తుందో... అద్భుతమైన కల్పనా చాతుర్యం మీది! నమస్సులు!"
భవితకు రెండవ పెళ్ళిని కవి యాశించంగ జైలు కటకటలను తా నవిరళ రచనల ఘనుడౌ కవికిద్దరు భార్యలున్న గను సుఖ కీర్తుల్ (కష్టపడి, మాయ మాటలతో రెండవ పెళ్ళి జేసికొన్నచో జైలువారే కవి పోషణను నిర్వహిస్తారు.ఏంచక్కా కవితలల్లుకోవచ్చు.After me the deluge.భార్యలేమైతేనేమి,తనకు ప్రాధాన్యత నిచ్చుకునే తత్త్వము ఉండనే ఉన్నది.హాస్యంకొరకే సుమండీ!)
హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'కవితలు + అవిరళముగ' అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు. అక్కడ "కావ్యము। లవిరళముగ..." అనవచ్చు కదా!
అవనీపతి ప్రోత్సాహము
రిప్లయితొలగించండిచవిగొను విజ్ఞుల ప్రశంస చల్లగ నుండన్
సవతులు వీరిరువురయిన
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
అవనీపతి ప్రోత్సాహము = గవర్నమెంటు ఉద్యోగము
తొలగించండిచవిగొను విజ్ఞుల ప్రశంస = శంకరాభరణము
గవర్నమెంటు పింఛను😄😄😄
తొలగించండి👏👏👏👏👏
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రవిమల సతితో సౌఖ్యము
రిప్లయితొలగించండికవితా సతితోడ కీర్తి కలుగును కవకిన్
భువినిది సూనృతమగుటన్
కవికిద్దరు భార్యలున్న గను సుఖ కీర్తుల్
కవికిన్- అనాలి. టైప్ పొరపాటు.
తొలగించండివిజయకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సవతుల కలహముల సతము
రిప్లయితొలగించండినవిరళముగ దెగ యశాంతి యనిపించునుగా;
భువిలో వివేకురాలే
కవికిద్దరు భార్యలున్న ; గను సుఖ శాంతుల్ !
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..దెగ నశాంతి...' అనండి.
చవినిచ్చు నొక్క సఖియును;
రిప్లయితొలగించండిఛవినిచ్చును గద మరియొక సఖియును జూడన్
సవిధాంగన,కవితాంగన
కవి కిద్దరు భార్యలున్న గను సుఖకీర్తుల్.
బాపూజీ గారూ,
తొలగించండిమనోహరమైన పూరణ. అభినందనలు.
కవితలనే సతులుగ గొని
రిప్లయితొలగించండినవిరళముగ గవన రచన కంకిత మగుచు
న్నవివాహితుడై చెలగెడు
"కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్"
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'..గొని యవిరళముగ...' అనండి.
శివునకు గంగ గిరిజ, కే
రిప్లయితొలగించండిశవునకు లక్ష్మియును ధరణి సతులై యుండన్
భవునికుమారుడు కవులకు
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
"కవింకవీనాం" బాగుంది
తొలగించండిచాల బాగున్నది నేమానివారు!
తొలగించండిసోమయాజులు గారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ
తొలగించండి
రిప్లయితొలగించండితవిషము ఛందము నీదెన్
సువిశా లముగ యతి యింతి సుందరి గూడన్
కవిగొను భార్యౌ ప్రాసయు !
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'తవిషము' క్రొత్త పదం తెలుసుకున్నాను.
'భార్య+ఔ' అన్నపుడు యడాగమం వస్తుంది. 'కవి గొను భార్యగ ప్రాసను' అంటే ఎలా ఉంటుంది?
జిలేబీ గారూ:
తొలగించండిఈనాటి సమస్యలో "కవి”, "భార్యలు" అని ఉన్నది. మరి కవయిత్రుల మాట?
శాస్త్రి గారూ,
తొలగించండి"కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో"
ఎవరా యిద్దరు?
కవయిత్రికిఁ బెండ్లాయెను,
తొలగించండిస్తవనీయుఁడు మగఁడు గాగ సగము మగండౌ
నెవ రాడపడుచు గాదా?
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!
🙏🙏🙏
తొలగించండిబద్ధకముతో:
అవనీపతి ప్రోత్సాహము
చవిగొను విజ్ఞుల ప్రశంస చల్లగ నుండన్
కువలయ నేత్రి సుదతియగు
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!
తొలగించండిభువనైక మోహనుండు స
హవాసి పెనిమిటి, కృతి పతియై యెకిమీడున్
కవివర! గను లోకమునన్
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!
జిలేబి
మైలవరపు వారి పూరణ:
తొలగించండికువలయపతి నిశి వెలుగగ
దివాకరుడు పగలు నింగి దీప్తినొసగగన్
కవివర ! గగనాంగన యను
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
నవరసముల సాహిత్య
తొలగించండిమ్మవిరళ సంగీత సిద్ధి మహనీయమ్మౌ
నివిరెండును మిళితమ్మగు
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో
మైలవరపు వారి పూరణకు కంది వారి స్పందన:
తొలగించండి"గగనాంగన నిజంగానే గొప్ప కవయిత్రి. రాత్రి వేళ ఆరుబయట మంచం వేసుకొని పడుకొని ఆకాశంలోకి చూస్తే నక్షత్రాల పదాలతో, మేఘాల భావాలతో ఎంత గొప్ప కవితలు వినిపిస్తుందో... అద్భుతమైన కల్పనా చాతుర్యం మీది! నమస్సులు!"
మురళీ కృష్ణ గారిది అద్భుతమైన పూరణ!
తొలగించండిఅన్నట్లు;
తొలగించండి"కవయిత్రి" ఆంధ్రభారతిలో లేదు.
తొలగించండివెంఠనే ఈ విషయాన్ని మహిళాభ్యుదయ సంఘాలకు తెలిపి కవుల మీద యుద్ధం ప్రకటించ మంటా :)
రచయిత్రి అన్న పదం వుంది :)
కావున మహిళ లో కవనము చెేసే వారు లేరని ఖరారై పోయారేమో :)
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికవిరామలింగడు శివను
తొలగించండితివిరెను భగవతి, రమలను, తెలివిగ దనతో
నివసించన్, నేడవనిన
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్"
(కాళిదాసు వాణి నా రాణి అన్నాడు. రామలింగడు లక్ష్మి సరస్వతులను తనతో నుండాలని కాళిని వరమడిగాడు)
సూర్యకుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సువిశాలపు హృదయ ముగల
రిప్లయితొలగించండికవి కిద్దరు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
కవనము లల్లగ వేడుక
సవతుల కలహము లపైన సతమత మౌచున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా
రిప్లయితొలగించండిఅవిరళ గృహపుటరణ్యము
చవి జూడగస్వచ్ఛమైన సన్యాసంబున్
ప్రవిమల ముక్తిని గొన బ్రతి
కవి కిద్దరు భార్యలున్న గను సుఖ1శాంతుల్2
1.స్వాంతస్సుఖాయ,2.సాహిత్య ప్రకీర్తి బహురచనలతో,
భవితకు రెండవ పెళ్ళిని
కవి యాశించంగ జైలు కటకటలను తా
నవిరళ రచనల ఘనుడౌ
కవికిద్దరు భార్యలున్న గను సుఖ కీర్తుల్
(కష్టపడి, మాయ మాటలతో రెండవ పెళ్ళి జేసికొన్నచో జైలువారే కవి పోషణను నిర్వహిస్తారు.ఏంచక్కా కవితలల్లుకోవచ్చు.After me the deluge.భార్యలేమైతేనేమి,తనకు ప్రాధాన్యత నిచ్చుకునే తత్త్వము ఉండనే ఉన్నది.హాస్యంకొరకే సుమండీ!)
డా.పిట్టా
రిప్లయితొలగించండిఆర్యా,నిన్నటి పూరణ
సరళత యన్న వ్యాకరణ సాధన గాదను గద్య గేయపుం
రరరరలంత్య ప్రాసలను వ్రాయు కవిత్వము దానికింతగా
స్వరముల గూర్చ పాటలగు సాగునటన్నదె యాశయంబుగా
తిరముగ కేంద్ర సాహితికి దివ్వె వలెన్ గనిపించె వాణిరో!
(కేంద్ర సాహిత్య అకాడమీవారు పద్యకృతికి అవార్డు ప్రకటించిన దాఖలాలు ఈమధ్య మృగ్యమైనవి.)
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కవనము లల్లెడు ప్రతిభయె
రిప్లయితొలగించండియవిరళమగు కృషినిగూడి యానందింప
న్నావిర్భవించ కావ్యము
కవికిద్దరు భార్యలున్న గను సుఖకీర్తుల్!
ప్రతిభ, వ్యుత్పత్తి యను నిద్దరు సతులు గల కవి!
“కవనము లల్లెడు ప్రతిభయు” యని చదువ ప్రార్ధన!
తొలగించండిసవరించిన పాఠము:
తొలగించండికవనము లల్లెడు ప్రతిభను
యవిరళమగు కృషినిగూడి యానందింపన్
నవజాత శిశువు కావ్యము
కవికిద్దరు భార్యలున్న గను సుఖకీర్తుల్
సీతాదేవి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రతిభను+అవిరళ'మన్నపుడు యడాగమం రాదు. అక్కడ "కవనముల నల్లెడు ప్రతిభ। నవిరళమగు...' అనండి.
ధన్యవాదములు గురుదేవా!
తొలగించండికవనముల నల్లెడు ప్రతిభ
నవిరళమగు కృషినిగూడి యానందింపన్
నవజాత శిశువు కావ్యము
కవికిద్దరు భార్యలున్న గను సుఖకీర్తుల్
కవికున్న సతి కి తోడుగ
రిప్లయితొలగించండికవిత యు తా భార్య య య్యే కాంక్ష ద లి ర్ప న్
కవితా రాజ్య ము నే లె డు
కవి కి ద్ద్దరు భార్య లు న్న గనుసుఖ కీర్తు ల్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆర్యా,మీసూచననుపాటించి తే.గీ మొదటి పాదాన్నిసవరించుకొన్నాను.కృతజ్ఞతలు
రిప్లయితొలగించండిడా.పిట్టా నుండి.
ఆర్యా,మీసూచననుపాటించి తే.గీ మొదటి పాదాన్నిసవరించుకొన్నాను.కృతజ్ఞతలు
రిప్లయితొలగించండిడా.పిట్టా నుండి.
వివరముగావిను భువిలో
రిప్లయితొలగించండికవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
నవనీ తలమున నెంచగ
కవితయు మరియొకరెవరన కరమందిన స్త్రీ.
సవతాలబాధ దప్పదు
కవికిద్దరు భార్యలున్న;! గను సుఖకీర్తుల్
రవి గాంచనిదాని గనుచు
కవితల నల్లగ సతతము కాశ్యపి నందున్.
ఉమాదేవి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'కీర్తుల్+అవనీ..' అన్నపుడు నుగాగమం రాదు. "కీర్తుల్। భువిలో తలంచి చూడగ..' అందామా?
శివ సూలూరి గారి పూరణ....
రిప్లయితొలగించండి"కవి"యను పే రా గణపతి
కెవ రుంచిరొ? సిద్ధి - బుద్ధు లెడమను కుడిలో!!;
"కవిఁ" గొలువ వాని నిచ్చును!!.....
కవి కిద్దరు భార్య లన్నఁ గను సుఖ - కీర్తుల్!!!
శివ గారూ,
తొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండిసహజీవనమున కొక్కతె
కవనమ్మను కాంత యొకతె ఘనత నిడుచు నీ
భువి స్వర్గముగనుఁ జేయఁగఁ
గవి కిద్దరు భార్య లున్నఁ గను సుఖ కీర్తుల్!
సవరణ:
తొలగించండిభువి జీవనమున కొక్కతె అని మొదటి పాదాన్ని పఠించగలరు.
మధుసూదన్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!
తొలగించండిఅవిరళ కవనపు సృజనకు
రిప్లయితొలగించండిఅవసరమగు నలువరాణి, నాహ్లాదతతో
భువి గడపగ లక్ష్మియు
కవికిద్దరు భార్యలుండ కను సుఖకీర్తుల్
సారీ మూడవ పాదం భువిపై
రిప్లయితొలగించండిశ్రీరామ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"నలువరాణి యాహ్లాదముతో" అనండి. మూడవ పాదంలో గణదోషం. "భువిలో గడుపగ లక్ష్మియు" అందామా?
కవనము,పఠనము రెంటిని
రిప్లయితొలగించండివివాహ మాడియు నిరతము వేడుక తోడన్
భువిలో చరించు చుండెడి
కవికిద్దరు భార్యలున్న గను సుఖశాంతుల్.
జనార్దన రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసవురుగ నొప్పెడి దారయు
నవరస భావములతోడ నాడికమెంతన్
సవరించెడి సాహితియున్
కవికిద్దఱు భార్యలున్న గను సుఖకీర్తుల్
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవనమ్ము వల్ల కవియౌ
రిప్లయితొలగించండిశ్రవణో పేయంపు గళము శ్రావ్యత పేరన్
యవిరళ ధారయు నొకతెగ
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్.
సహదేవుడు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పేరన్+అవిరళ' అన్నపుడు యడాగమం రాదు. "పేర। న్నవిరళ.." అనవచ్చు.
గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :
తొలగించండికవనమ్ము వల్ల కవియౌ
శ్రవణో పేయంపు గళము శ్రావ్యత పేర
న్నవిరళ ధారయు నొకతెగ
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్.
అవి ప్రతిభావ్యుత్పత్తులు
రిప్లయితొలగించండికవికిద్దఱు భార్యలున్నఁగను సుఖ కీర్తుల్
స్తవనీయంబౌ రచనలు.
అవిరళ యశమభ్యుదయములందింపంగన్
రచనల నవిరళ ...
తొలగించండిఅయ్యా నా పద్యాన్ని పరిశీలించ ప్రార్థన నన్ను వదిలేశారేమి
తొలగించండిప్రసాద రావు గారూ,
తొలగించండిక్షమించాలి... ఎందుకో తప్పిపోయింది.
మీ పూరణకేం? అద్భుతంగా ఉంది. అభినందనలు.
ధన్యవాదాలు
తొలగించండికవన మ్మెవనికి సాధ్యము?
రిప్లయితొలగించండిభువిపై మానవుఁడు నరకమును గను టెపుడో?
ప్రవిమల గుణ ఫల మెట్టిది?
కవి; కిద్దరు భార్యలున్నఁ; గను సుఖకీర్తుల్.
🙏🙏🙏🙏
తొలగించండిచక్కని భావన
తొలగించండిఅవిరళవాక్చాతుర్యము
రిప్లయితొలగించండిప్రవాహము వలె పయనించు పద్యపునడకల్
చవినొసగు కథనమునఁ బ్రతి
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
అన్నపరెడ్డి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నవనవమను స్త్రీ యొక్కతి
రిప్లయితొలగించండిచెవిచూప ముదము మదనుని చేష్టలతోడన్
కవనమునకు మరియొక్కతి
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
సత్యనారాయణ రెడ్డి గారూ,
తొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
చవిచూప ముదము మదనుని చరితము తోడన్ అంటే బాగుంటుందేమో.
తొలగించండినిజమే. నా దృష్టికి రాలేదు.
తొలగించండిభువిలో జీవనమలరగ
రిప్లయితొలగించండిభవితకు కరదీపిక యగు భార్యయె కాకన్
యువిద సృజనమరియొకర్తుక
కవికిద్దఱు భార్యలున్న గను సుఖ కీర్తుల్
భాస్కరమ్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాక' అన్నది కళ. ద్రుతాంతం కాదు.అక్కడ "కాకే" యువిద..." అనంది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసవన సఫలత కవసరం
తొలగించండిబవనిఁ జతుష్పండితులు మహా వేదజ్ఞుల్
కవనమున శుద్ధి బుద్ధులు
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
[బ్రహ్మహోత్రుద్గాతాధ్వర్యులు నల్గురు యజమానున కవసరము. శుద్ధి : వాక్శుద్ధి]
కామేశ్వర రావు గారూ,
తొలగించండిఅత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు.
పూజ్యులుశంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.
తొలగించండి
రిప్లయితొలగించండిభువనైక మోహనుండు స
హవాసి పెనిమిటి, కృతి పతియై యెకిమీడున్
కవివర! గను లోకమునన్
కవయిత్రికి భర్త లెన్నగా నిద్దఱె పో!
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ప్రవిమల మనమున సతియును
రిప్లయితొలగించండిఅవిరళముగ కమలుని సతి హార్దము జూపన్
కవనపు జవ్వని గూడగ
కవి కిద్దఱు భార్యలున్నఁగను సుఖ కీర్తుల్
శర్మ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సతియును+అవిరళముగ = సతియు నవిరళముగ' అవుతుంది. అక్కడ "భార్యయు। నవిరళముగ..." అనండి.
గు రు మూ ర్తి ఆ చా రి
రిప్లయితొలగించండి,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,
సువిశాలమైన భావ౦
బెవరికి గలుగు ? ప్రశా౦తి యెపుడు నశి౦చున్ ?
ప్రవరుని జీవన మెట్టిది ?
|కవి | కిద్దరుభార్యలున్న| గనుసుఖశా౦తుల్ |
( ప్రవరుడు = శ్రేష్ఠుడు)
గురుమూర్తి గారూ,
తొలగించండిక్రమాలంకారంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవితలవలనేకీర్తులు
రిప్లయితొలగించండికవులకునిలవచ్చుగానికాదుగపత్నుల్
కవులకుకారణభూతులు
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్"
అవిరల
తొలగించండిసుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు.
రిప్లయితొలగించండినిన్నటి న్యస్తాక్షరికి చంపక మాలలో నా పూరణను పరిశీలించ ప్రార్థన.
ధన్యవాదములు.
సరసత నందు పల్కు లిల సాధన సేయక యుండ నెన్ననే
ర రిచటి పండితుల్ కవుల! రంజిలు నంతగ కావ్య రాజముల్
స్వరముల జక్కగా నమరు వాక్కుల గూర్చుచు వ్రాయు రీతులన్
తిరముగ నేర్వ నెంచి మది తెల్లని తల్లిని నే నుతించెదన్!
శ్రీధర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్య
రిప్లయితొలగించండి*కవికిద్దరు భార్యలున్న గను సుఖకీర్తుల్*
*కవినీచుడైజతైవా*
*స్తవోచ్ఛరవిసప్తమమున సమసప్తకమం*
*దవదృక్శనికుజులివ్వరు*
*కవికిద్దరు భార్యలున్న గను సుఖకీర్తుల్*
(కవి=శుక్రుడు)
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*
సందిత గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'జత+ఐ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది.
hai
రిప్లయితొలగించండిఅవిరళ కృషి తో
రిప్లయితొలగించండికవితయుపత్నియునిరువురు
రిప్లయితొలగించండికవికిద్దరుభార్యలు,న్నగనుసుఖకీర్తుల్
కవితయగీర్తినిబత్నియు
నవిరళమగుసుఖమునిచ్చునార్యాపుడమిన్
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ ప్రయత్నం ప్రశంసింపదగినదే కాని విరుపు సమర్థంగా లేదు.
కవనము వేగమె సాగదు
రిప్లయితొలగించండికవికిద్దఱు భార్యలున్న! గను సుఖ కీర్తుల్
భువి నొక్క పత్ని యేనియు
సవరణలనిడుచు మగనికి సాయము చేయన్
శ్రీధర రావు గారూ,
తొలగించండివిరుపుతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
స్వీయ అనుభవాన్ని కవిమిత్రుడు చక్కగా పద్యం లో పొందుపరచాడు. అభినందనలు మిత్రమా.
తొలగించండిగురువు గారికి, మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారికి నమస్సులు, ధన్యవాదములు.
తొలగించండికవితా శక్తియె కాంతగ
రిప్లయితొలగించండిసవతియె సమయోచితంపు చాతుర్యమవన్
ప్రవిమల కావ్యపు రచనకు
కవి కిద్దఱు భార్యలున్నఁ గను సుఖ కీర్తుల్
ఫణికుమార్ గారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
గురువుగారూ నమస్సులు. ధన్యవాదములు.
తొలగించండిరవికిద్దరు సతులు గలరు
రిప్లయితొలగించండిభువిలో గలమనుజులకును భూరిసు ఖమ్మే
సవతుల నెరజాణతనము.
కవికిద్దరు భార్యలున్న గను సుఖ కీర్తుల్.
నారాయణ రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అవిరళ కృషితో వ్రాయును
రిప్లయితొలగించండికవి|”కిద్దరు భార్యలున్న గనుశుఖ కీర్తుల్
నివురున గప్పిననిప్పుగ
కవిహృదయము కాలుచుండు కలలో నైనన్|”
ఈశ్వరప్ప గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కవికి అన్న్దదానికి అన్వయం?
భువి తిండి నిడున కవితలు
రిప్లయితొలగించండిఅవిరళముగ రచనజేయ హరిసతి పద్మో
ద్బవురాణి కలసి, వరమిడ
కవికిద్దరు భార్యలున్న గను సుఖశాంతుల్.
హనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కవితలు + అవిరళముగ' అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు. అక్కడ "కావ్యము। లవిరళముగ..." అనవచ్చు కదా!
ధనయవాదములండీ...సరిచేయుచున్నాను
తొలగించండిభువి తిండి నిడున కావ్యము
లవిరళముగ రచనజేయ హరిసతి పద్మో
ద్బవురాణి కలసి, వరమిడ
కవికిద్దరు భార్యలున్న గను సుఖశాంతుల్.
*పొందెసహాధ్యాయిగగో*
రిప్లయితొలగించండి*విందుఁగుచేలుండులేమివెతలన్ ధన్యం*
*బందెన్ పవిత్రమైత్రియు*
*పొందెన్సాయంబునట్లుపురుషోత్తముచేన్*
*శ్రీమతి జి సందిత బెంగుళూరు*