ఇంతకాలం 'చార్ ధామ్ యాత్ర' నాకొక తీరని కల! నా ఆర్థిక పరిస్థితుల కారణంగా జీవితంలో ఈ యాత్ర చేస్తానని కలలో కూడా ఊహించలేదు. కాని ఆ కోరిక తీరుతున్నది.
మన బ్లాగు మిత్రులు చంద్రమౌళి సూర్యనారాయణ గారి సౌజన్యంతో యాత్రకు బయలుదేరుతున్నాను. వారు ఆ 'టూర్స్ అండ్ ట్రావెల్స్' వారితో ఏం మాట్లాడారో, ఎంత ఇచ్చారో తెలియదు. (ఈ యాత్ర పాకేజీ ₹24000). నాతో మాత్రం "వాళ్ళు నాకు తెలిసినవాళ్ళు. ప్రతి ట్రిప్పులో ఒకరిని ఫ్రీగా తీసుకువెళ్తుంటారు. ఈసారి మిమ్మల్ని తీసుకువెళ్ళమని సూచించాను" అన్నారు.
గతంలో మేం దంపతులం కాశీ, రామేశ్వర యాత్రలు కూడా వారి సౌహార్దం వల్లనే సాధ్యమయ్యాయి. భగంతుడు వారికి ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించు గాక!
రేపే నా ప్రయాణం. ఆ ఏర్పాట్లలో ఉన్నాను. 18వ తేదీన తిరిగి నా నెలవు చేరుకుంటాను. నిరంతర ప్రయాణం వల్ల బ్లాగుకు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పటిదాకా రోజుకొక సమస్య వచ్చే విధంగా షెడ్యూల్ చేశాను. మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.
23 కామెంట్లు:
మీ యాత్ర సుఖవంంతము ఫలవంంతంం కావలెనని భగవంంతున్ని ప్రార్థిస్తున్నాను గురువుగారు.
మీ యాత్ర సుఖవంంతము ఫలవంంతంం కావలెనని భగవంంతున్ని ప్రార్థిస్తున్నాను గురువుగారు.
నమస్కారములు
మా తమ్ముడూ మరదలు చార్ ధాం యాత్రకు వెడుతున్నందుకు చాలా అనందం గాఉంది. మీ యాత్రదిగ్విజయంగా కొనసాగాలని హృదయపూర్వకంగా ఆశీర్వదించి అక్క
మన సోదరులు శ్రీ చంద్రమౌళిగారికి ధన్య వాదములు + శుభాశీస్సులు
గురువు గారికి శుభకాంక్షలు.చార్ దాం యాత్ర దిగ్విజయంగా పూ ర్తీ చేయాలని మనసారా భగవo తున్ని ప్రార్థిస్తున్నాను.
గురువర్యులకునమస్సులు. యాత్రదిగ్విజయంగా పూర్తికావాలని కోరుకుంటున్నాను.
అక్కయ్యా,
నేనొక్కడనే వెళ్తున్నాను.
చంద్రమౌళి సూర్యనారాయణ గారు సౌ హా రద్ర త కు
మరియు వారి వదాన్యత కు ధన్య వాదములు.
చారుధామ యాత్ర సఫలమగుటకును
సేమముగనుగృహము చేరుటకును
వలయు శక్తియుక్తు లలవోకగామీకు
కలుగు గాత! శివుని కరుణ వలన
మీ ప్రయాణం నిరాటంకంగా ఆనందంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు
మీ ప్రయాణం నిరాటంకంగా ఆనందంగా సాగాలని కోరుతూ శుభాకాంక్షలు
పరస్పర గుణదోష అంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.మీరే ఒకరిని సూచించండి
ఇంకొకసారి ఎప్పడూ ఒక్కరే వెళ్శకండి.అమ్మగారిని తీసుకుని వెళ్ళండి. మేమందరం సహకరిస్తాం.
ఇంకొకసారి ఎప్పడూ ఒక్కరే వెళ్శకండి.అమ్మగారిని తీసుకుని వెళ్ళండి. మేమందరం సహకరిస్తాం.
మాస్టరుగారూ! మీ తీర్థ యాత్ర సుఖంగా సాగి భగత్కృప తోడుగా దిగ్విజయంగా తిరిగిరావాలని మనసారా కోరుకొనుచున్నాను. సూర్యనారాయణ గారికి అభినందనలు.
భక్తుల సేవ భగవత్సేవ కన్నమిన్న! మీ యాత్ర ఘటింప జేయుచున్న సూర్యనారాయణమూర్తి గారికి భగవంతుడు ఆయురారోగ్యైశ్వర్యాల నొసగాలని ప్రార్ధిస్తున్నాము!🙏🙏🙏🙏🙏🙏
మీ చార్ధామ్ యాత్ర ఆనందదాయకంగా, మనోఽభీష్టసిద్ధిదాయకంగా, ఆయురారోగ్యఫలదాయకంగా నెరవేరాలని ఆ భగవంతుడిని మనఃపూర్వకంగా వేడుకొంటున్నాను. విజయోఽస్తు! శుభాభినందనలతో...
మీ మిత్రుఁడు...
గుండు మధుసూదన్
గురుదేవులకు యాత్ర సమస్తము నిర్విఘ్నమై శుభకరమై సుఖప్రదమై దైవ సుదర్శన సంప్రాప్తంబై మనోరంజకమై సత్ఫలప్రదమై సంపూర్ణంబై వర్తిల్ల శ్రీమన్నారాయణుం డనుగ్రహించు గాక!!!
మీ యాత్ర సుఖప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను!
అన్యాయం
గురువుగారూ నమస్సులు. మీరు సంపూర్ణ యాత్రా ఫలాన్ని పొంది సుఖసంతోషాలతో మీ ప్రణాళిక ననుసరించి సత్వరమే తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాము.
చారుధామ యాత్ర చక్కగా నొనరించి
మరలి రండు తమరు మానుగాను
స్వామి యాశిసులను వాసిగా నందుచు
కన్నులార యన్ని కాంచి రండు.
గురుదేవులక యాత్ర సునాయాసంగా సాగాలని శుభాకాంక్షలు. చంద్రమౌళి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు
గురుదేవులక యాత్ర సునాయాసంగా సాగాలని శుభాకాంక్షలు. చంద్రమౌళి సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి