6, ఆగస్టు 2018, సోమవారం

సమస్య - 2754 (టంటంటం...)

కవి మిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"టంటంటం టంట టంట టమ్మనె భేరుల్"
(లేదా...)
"టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే"

108 కామెంట్‌లు:

  1. పంటలు విరివిగ పండగ
    నంటె జనోత్సాహమచట యంబరమున్ నే
    వింటిన్ గేరింతలనే
    టంటం టంటం టటంట టమ్మనె భేరుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని టంటంటం అనేవి గంటలు. భేరులు కావు కదా?

      తొలగించండి
  2. ఇంటన్ కాసులపేరులేదు,సతితా నిమ్మంచు కోరన్ పతిన్
    తంటాలన్ పడుచుంటి కాసులసలే తానివ్వగా లేననన్
    కంటన్ బెట్టుచు నీరు పత్ని వడిగా కారాలు నూరన్ కటా
    వంటింటన్ పలు పాత్రలన్ గజిబిజిన్ బంతాట లాడన్ హరీ!
    "టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే"

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీహర్ష గారూ,
      వంటపాత్రలు కొన్ని గంటలవలె, కొన్ని భేరుల వలె శబ్దం చేసాయంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి


  3. సందర్భము - మేడసాని వారి అవధానమ్ము తరువాయి కంది వారు
    తిరుపతి కేగి అచ్చట నుండి పెందరాళే తిరుమల వెళ్లి వెంకన్న వారిని దర్శించు కొనుట !
    సీనియర్ సిటిజన్ కనుక స్వామి వారు వెంటనే శంకరార్యులకు దర్శన మొసగుట !



    ఘంటా నాదం బదిగో !
    టంటంటం టంట టంట టమ్మనె భేరుల్
    వింటిని విడిచిన బాణము
    కంటెన్ వేగముగ వెళ్లి కంటిని స్వామిన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. పంటలకై వానలుబడ
    వెంటనె స్వాతంత్ర్యదినము వేడుకరాగా?
    కంటన్బడ సంబరముల
    టంటంటంటంటటంట టమ్మనెబేరుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని భేరులు టంటంటం అనండం?

      తొలగించండి
  5. కంటే కురు పక్షంబున
    మింటం జేరగను రాలి మేటి యతిరథుల్
    వెంటన్వెంటను రణమున
    టంటంటం టంట టంట టమ్మనె భేరుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      కాని భేరులు టంటంటం అనండం?

      తొలగించండి
    2. ఢంఢంఢఢఢం అనాల్సిన భేరులు టంటంటం అన్నాయి కదండీ నీరసంగా.

      తొలగించండి
  6. మైలవరపు వారి పూరణ

    సంజయుడు....ధృతరాష్ట్రునితో..

    మింటిన్ దిక్కులనావరించె కురురాణ్మృత్యుధ్వనుల్ మాడ్కి , ము...
    క్కంటింగెల్చిన క్రీడి విల్లుగొన టంకారప్రతిధ్వానముల్
    టంటంటమ్మని ., వింత జూడు ! ధృతరాష్ట్రా ! వైరిపక్షమ్మునన్
    టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మైలవరపు వారూ,
      శత్రుపక్షంలోని భేరులు తమ సహజత్వాన్ని కోల్పోయాన్న మాట! బాగున్నది పూరణ. అభినందనలు.

      తొలగించండి


  7. కంటిన్ మోహన మేడ సాని వరులన్, కాంక్షించి వెంకన్నకై
    వింటిన్వీడిన మిట్టకోలవలె నే వేగమ్ము గాబోవగా
    ఘంటానాదము!శేషశైలమదిగో ! కార్మేఘముల్దాటుచున్,
    టంటంటం టట టంట టంట టటటం టంటమ్మనెన్ భేరులే!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కార్మేఘమ్ములను దాటుచు సన్నబడి డమ డమ టం టం అయిపోయేయి :)


      జిలేబి

      తొలగించండి
    2. జిలేబీ గారూ,
      బాగుంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  8. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =========================
    టంటంటం టట టంట టంట టటటం
    టంట మ్మనెన్ భేరులే
    =========================
    టంటం అనుచు యుద్దమునకు సంకేతం
    గా మ్రోగించెడి భేరులు లేదా దుందుభిలు
    మ్రోగినాయని చెప్పటంలో ధ్వనించు
    విశేషమునే సమస్యగా పరిగణించ
    ==========================
    సమస్యా పూరణము - 218
    ====================

    ట్రంపు కిమ్ చేతుల చెలిమి
    సింగపూరు ఖర్చు కోట్ల డాలర్లు
    ఐనను మానరు గోతుల బలిమి
    ఎవనికి వాడెగరేయు కాలర్లు
    జంజంజం జజ జంజ జంజ
    జజజం జంజ ఇద్దరు జారులే
    టంటంటం టట టంట టంట
    టటటం టంట మ్మనెన్ భేరులే

    ====##$##====

    మూడవ ప్రపంచ యుద్దమును రానీయ
    కూడదు, అణ్వస్త్రముల ప్రయోగములు
    జరుగరాదు, మానవాళికి ముప్పు వాటిల్ల
    రాదని సింగపూరు దేశము కోట్ల డాలర్లు
    ఖర్చు పెట్టి ట్రంపు, కిమ్ మధ్య స్నేహపు
    వేదికను ఏర్పరచి మూన్నాళ్ళు కాలేదు,
    అప్పుడే కిమ్ వెనుకటి మాదిరిగానే తోక
    ఊపుతున్నాడని ఐక్యరాజ్య సమితి రిపోర్ట్

    ఈ రీతిగా ఆ ఇద్దరు నేనంటే నేనని
    ఢీ యంటె ఢీ మొండికేసిన టంటం మని
    యుద్దభేరీలు మ్రోగును కదా యని భావం.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    --- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2754
    సమస్య :: టంటం టంట టటంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే.
    ఢం ఢం ఢం అని శబ్దం చేయవలసిన భేరులు టం టం టం అని శబ్దం చేశాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: రెడ్డిరాజులలో ఒకడైన వీరభద్రారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండిన శ్రీనాథ మహాకవి ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో ఉండిన గౌడ డిండిమ భట్టును తన వాద పటిమతో ఓడించి అతని కంచు ఢక్కను పగులగొట్టించి కనకాభిషేక సన్మానముతో పాటు కవిసార్వభౌమ బిరుదాన్ని అందుకొన్నాడు. ఆ సమయంలో పగిలిపోయిన భేరీలు ఢం ఢం అని శబ్దం చేయలేక (కనకాభిషేక మప్పుడు క్రింద పడుతున్న బంగారు నాణెముల శబ్దాన్ని అనుకరిస్తూ) టం టం అని శబ్దం చేసినవి అని విశదీకరించే సందర్భం.

    కంటిన్ డిండిమభట్టు వాదపటిమన్, ఖండించి శ్రీనాథుడన్
    గొంటిన్ నేన్ కవిసార్వభౌమ పదవిన్, కొంగ్రొత్త శబ్దమ్ములన్
    వింటిన్ మత్కనకాభిషేక సభలో, వేవేగ భగ్నమ్ములై
    ‘’టంటం టంట టటంట టంట టటటం టంట’’ మ్మనెన్ భేరులే.
    కోట రాజశేఖర్ పడుగుపాడు. (6-8-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజశేఖర్ గారూ,
      కంచుఢక్కాతో పాటు మరికొన్ని భేరులు పగిలాయన్నమాట! కంచుది కనుక పగిలితే టంటం శబ్దమే చేస్తుంది. ప్రశస్తంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  10. మిత్రులందఱకు నమస్సులు!

    [రామరావణ యుద్ధ సందర్భమున రావణుని యుద్ధభేరీలు, సాక్షాత్తూ శ్రీహరి యపరావతారమైన శ్రీరామునిఁ గాంచి, భక్తి పారవశ్యముతో "టంటంట"మ్మని ఘంటా నినదమ్ములఁ జేసినవను సందర్భము]

    మింటన్ వేలుపు లెల్లఁ జేరి కనఁగన్, మేల్మేలు జేజేలు మి
    న్నంటన్; రావణుఁ డెల్ల సైన్యములతో నా రామమూర్తిన్ హృదిన్
    మంటల్ వుట్టఁగఁ దాఁక, రాముఁ గనుచున్ మందస్మితోద్భక్తితో
    "టంటంటం టట టంట టంట టటటం టంట"మ్మనెన్ భేరులే!

    రిప్లయితొలగించండి
  11. గంటలు ఢo ఢo బనియెన్,
    "టంటంటం టంట టంట టమ్మనె భేరుల్,

    ఏంటీ యపశకు నమ్మని
    కంట రయినికార్చె రాణి కలనుకు వెళుచున్

    అర్జునునితో యుద్ధమునకు ప్రమీల వెడలుచు గుడిలో
    పూజ చేసి బయలు దేరు సమయమున గుడి గంటలు
    ఢo ఢo మనియును సైనికులు మ్రోగించు యుద్ధ భేరీలు "టంటంటం మని మ్రోగగా అపశకునమని తలచి బాధ పడు సందర్భము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణసూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఏంటీ' అన్నది వ్యావహారికం.

      తొలగించండి
  12. వింటిన్ దాల్చిన ధీరసత్య నరకున్ వేధింప బాణాలతో ;
    వెంటన్ నుండిన శ్యామసుందరుడు దుర్భేద్యంబు చక్రంబునన్
    "గంటే దేవి !మదీయశౌర్య "మనుచున్ ఖండింప దైతేయునిన్ ;
    టంటంటం టట టంట టంట టటటం టంటమ్మనెన్
    భేరులే !

    రిప్లయితొలగించండి
  13. అన్న చేసెడి పనులన్నితప్పని దెల్ప,
    లంక నుంచి పంపె లక్షణముగ
    దహరుని దశ ముఖుడు దయమరుగు నబడ
    ధర్మ వర్తనునకె దండనమ్ము

    రావణాసురుడు తమ్ముడు విబీషనుని దయలేక లంక నుంచి పంపిన సందర్భము

    నిన్నటి పూరణ ము చూడండి గురువు గారు

    రిప్లయితొలగించండి
  14. మొన్నటి పూరణము కూడా చూడండి గురువు గారు
    బాలచర్యుడు శక్తి కేలున దాల్చి యుద్ధము లోన కూల్చెను తారకాసు
    రుని, వలలుడు కీచకుని పట్టి చంపెను నర్తన శాలలోన, గహనమున
    సంచారమును జేయు సమయము లో రామ చంద్రుడు గురిచూసి చంపె నపుడు
    పత్రితో వాలిని , బార్థుండు గూల్చె బవరము నందున్ సైంధవ తలను తన
    శరము తోడ రవిని జూప చక్రి తనకు ,
    కందమును బట్టి చంపెను సుందరముగ
    పూసపాటి జిలేబి కై, సీసమందు
    చొనుపు నిడుచు సమస్యను ఘనత తోడ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      కందపాదాన్ని సీసపద్యంలో చొప్పించి చెప్పిన పూరణ బాగున్నది. సీసం నాలుగవ పాదం చివర గణదోషం. సవరించండి. 'సంధవ తల' అన్న సమాసం సాధువు కాదు. "సైంధవు తల తన" అంటే గణదోషం కూడా తొలగిపోతుంది.

      తొలగించండి
  15. గంటలు మొరయ చతురులగు
    బంటులు గలుగు చతురంగ బలగమ్మదియే
    వెంటగ నని కేగ నృపతి
    "టంటంటం టంట టంట టమ్మనె భేరుల్"

    రిప్లయితొలగించండి
  16. బంటులవిజయోత్సాహము
    లంటగవినువీధియందుహాహాయనుచున్
    మింటనువినబడెనిట్లుగ
    టంటంటంటంటటంటటమ్మనెభేరుల్

    రిప్లయితొలగించండి
  17. ఘంటానాదము మిన్నుముట్టె ననిలో గర్ణమ్ములన్ జీల్చుచున్
    బంటుల్లక్షలు గుంపు గట్టి రపుడున్ పౌషమ్మునే జేయ,మి
    న్నంటెంగా నట దుమ్ముధూళి కనగా; నందిఫ నుత్సాహమే
    "టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే"
    ****}{}{****
    (పౌషము = యుద్ధము)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తంటాలు పెట్టకుండగ
      గుంటడు గుడగుడ గగుడను గుడగుడ మ్రింగన్
      తుంటరి దబదబ వాచెను
      టంటం టంటం టటంట టమ్మనె భేరుల్

      తొలగించండి
    2. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కొన్ని టైపు దోషాలున్నవి.
      *****
      సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  18. కొంటె కనుల చిన్నది నా
    కంటబడిన చాలు గుండె గదిలో సడులే
    వింటిని తలపుల లోనన్
    టంటం టంటం టటంటటమ్మనె భేరుల్.

    రిప్లయితొలగించండి
  19. తుంటరి తనమ్ముతో సఖి
    వెంటన్ బడితిన్నదిగని బెదిరింపంగన్
    గంటల్ మ్రోగెను గుండెన
    టంటం టంటం టటంటటమ్మనె భేరుల్

    రిప్లయితొలగించండి
  20. గంటల్ గట్టిన తేరుపై కదిలె సంగ్రామమ్ము కై పార్థుడే
    గంటానాదము మిన్నుముట్టు తరి,తా గంభీరుడై కృష్ణుతో
    జంటై వచ్చెడు శ్వేతవాహను నటన్ సైన్యమ్ము గాంచంగనే
    టంటంటం టట టంటటం టటట టంటంటమ్మనే భేరుల్

    రిప్లయితొలగించండి
  21. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    తంటాకోరగు నరకుని

    వెంటబడుచు కూల్చె ' సత్య ' | పృథవిఁ బటాసుల్

    టాం టాం టా‌ మ్మనె | దివిపై

    టం టం టం టం టటంట టమ్మనె భేరుల్

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి


  22. జంటగ జేగంటలచట
    టం టం టం టం టటంట టమ్మనె, భేరుల్
    వెంటబడెన్ సూవె రమణి
    తంటాలుపడుచు డమడమ తధిగిణ థోంథోం !

    జిలేబి వారి జాంగ్రి :)

    రిప్లయితొలగించండి


  23. జీపీయెస్ వారి చెణుకులు ఆటవిడుపులు లేకుండా నిశ్శబ్ధము గా వున్నది శంకరాభరణము రెండ్రోజులు గా సర్వం కుశలంబే నా ?


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. సర్వజ్ఞులు...మీకు తెలియనిదేమున్నది?

      😊

      తొలగించండి
    3. రెండు మూడు రోజులుగా ప్రయాణంలో ఉండి వాట్సప్ సమూహంలో ఏం వాదోపవాదాలు, చర్చలు జరిగాయో గమనించలేదు. కొన్ని వ్యాఖ్యల వల్ల శాస్త్రి గారు కలత పడినట్లు తెలిసింది. ఆ వ్యాఖ్యలు పెట్టిన వారిలో కోట శ్రీరామచంద్ర మూర్తి ఒకరు. వారిని సమూహంనుండి తొలగించాను.
      అందరి పక్షాన క్షమించమని శాస్త్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.

      తొలగించండి

    4. బస్తీ మే సవాల్ విసురండి జీపీయెస్ వారు


      ఎవరే మన్నను శాస్త్రీ
      జి, విడువకండి యతనమ్ము జీభర్ లిఖియే
      భువిలో కవి, మనమోహన
      మవియేగద బతుకు బండి మస్తుగ బోవన్ !

      జీపీయెస్ వారు కినుక కలత వీడవలసినది గా విన్నపాలు.


      జిలేబి

      తొలగించండి
    5. సార్! నేనే మిమ్మల్ని చాలా ఇరుకులో పెట్టాను. మీరే నన్ను క్షమించాలి.

      వాదోపవాదాలు జరిగినది శ్రీ సూరం శ్రీనివాసులు గారితో. వారికి నా సరదా పూరణలో వారికి అత్యంత గౌరవనీయులైన మన్మోహన్ సింగ్ గారిని నేను ధృతరాష్ట్రునితో పోల్చడం నచ్చ లేదు.

      తరువాత మీరు సరియైన తీర్పు చెప్పారు:

      ******************************

      సూరం శ్రీనివాసులు గారు:

      "ప్రతిపాదించినది ఒక్కటే.మన్మోహన్ సింగ్ గారిని అధిక్షేపించగూడదని.వింటే వినండి.లేకపోతే మానండి మీ ఇష్టం."

      ******************************

      ప్రభాకర శాస్త్రి:

      "ఎవరెవరిని అధిక్షేపించవచ్చో ఒక జాబితా ఇవ్వండి..."

      *******************************

      కంది శంకరయ్య గారు ఉవాచ:

      దయచేసి మన సమూహంలో రాజకీయ నాయకుల ప్రసక్తి తేవద్దు. అది మన లక్ష్యాన్ని ప్రక్కదారి పట్టించి కొందరికి మనస్తాపం కలిగించవచ్చు.

      ******************************

      మీ తీర్పుతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ ఏమి చేయగలను? నాకా పురాణ జ్ఞానం లేదు. తెలుగు రాదు. సంస్కృతం రాదు. సంధులూ సమాసాలూ రావు. దైవ భక్తీ, గురుభక్తీ, దేశభక్తీ లేవు.

      అయినా కూడా మీరు నాపై ఎంతో అభిమానంతో ఇంత కాలం భరించి నాకు వృత్తాలు వ్రాయడం నేర్పించారు. ఇది కోతి చేతికి కత్తి ఇచ్చినట్లైనది.

      నిజానికి శంకరాభరణం వేదికలో నేను ఉండవలసిన వాడిని కాదు. చాలా సార్లు తప్పుకోడానికి ప్రయత్నించాను. అదీ చేత కాలేదు.

      దీనికి ముఖ్య కారణం నాకు మీపైన ఉన్న అత్యంత గౌరవం, అభిమానం, వాత్సల్యం (మీరు నాకన్న వయసులో చిన్నవారు). ఎప్పుడూ ఎవ్వరినీ కలవడానికి సిగ్గుతో నిరాకరించే నేను మిమ్మల్ని పని కట్టుకొని ఎన్నోసార్లు కలిసి ముచ్చట్లాడాను.

      నిజానికి రాజకీయ వ్యాఖ్యానాలు శంకరాభరణానికీ, దాని నిర్వాహకులుగా మీకూ, శ్రేయస్కరం కావు.

      నాకా రాజకీయ విమర్శలంటే చెడ్డ ఇష్టం. పదేళ్ళ క్రితం లోక్ సభ ఎన్నికల సమయంలో ఒక రెండు వందల లిమ్మరిక్కులను వ్రాసి ఆంగ్లంలో డెబ్బై పేజీల పుస్తకం కూడా ప్రచురించాను.

      "Limmericks and Light Verses"

      అనే title తో.

      ఐదేళ్ళ క్రితం లోక్ సభ ఎన్నికల సమయంలో తెలుగు శతకం ఒకటి వ్రాసి

      "వేంకటాద్రి సుతుడ వినుర రంగ"

      అనే మకుటంతో మా బావ గారు శ్రీ గూడూరు రంగా రావు IAS గారికి అంకితం ఇచ్చాను (తప్పూ తడికల ఛందస్సుతో). ఆ శతకం పేరు:

      "రంగరాయ వాస్తవ శతకం"

      లోక్ సభ ఎన్నికలు మళ్ళీ వస్తున్నవి...నా మనసు ఉరకలు వేస్తున్నది.

      కానీ ఈ కోతి పనికి శంకరాభరణం సరియైన వేదిక కాదు.

      మీరు అనుమతిస్తే శంకరాభరణం లో రాబోతున్న వృత్త సమస్యలకు (మీకు ధన్యవాదాలు చెబుతూ) వాటిపై నా వ్యంగ్య పూరణలు నా వ్యక్తిగత బ్లాగులో ప్రకటించెదను (ఓపిక ఉంటే).

      ఇదీ సంగతి (నేదునూరి వారి ఊత పదం ఇది)

      🙏🙏🙏

      తొలగించండి

    6. ఈ బ్లాగులోనే రాయండి జీపీయెస్ వారు

      మన కాలపు కతల్ని మనం రాయాలి అప్పుడే కదా కొత్తదనం. ఛందం మేథమేటిక్స్. దానికి ఈ సబ్జెక్టే వుండాలన్న రూలు లేదు. కానైతే కొన్ని‌ ఇముడవు వచన కవితలా సూటిగా గిల్లలేవు. అంతే


      సో మీరు మీ యత్నాన్ని విడువకుండా ( తెనాలి రామలింగడు లేకుంటే అష్టదిగ్గజాలన్న పదమే వుండదు) ఈ బ్లాగులోనే రాయాల్సింది. మరీ ఘాటనిపిస్తే ఎట్లాగూ డెలీట్ ఆప్షన్‌ వుండనే వుంది.

      శ్రీశ్రీ తానమ్మింది రాసేడు కాబట్టే శ్రీశ్రీ అయ్యేడు. వేరే ఎవరికోసమో మనమెందుకు రాయాలి ? వేరే వారిలా మనమెందుకు రాయాలి

      We are the trend setters not followers

      All the vest

      Josh Zilebi :)

      తొలగించండి
    7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    8. @ G P S ,
      ఘంటం ఉంది కదా అని టం టం అని వ్రాసేయడమేనా ? మన్ మోహనుడిని దృతరాష్ట్రూడు అని వ్రాయడానికి మీకు చేతులెలా వచ్చాయి ? మన్ మోహన్ సింగ్ గారు దృతరాష్ట్రుడైతే మోదీ శిఖండా ?

      తొలగించండి
    9. Please read:

      "The Accidental Prime Minister"

      (The Making and Unmaking of MANMOHAN SINGH)

      by

      Sanjay Baru

      (The No. 1 Bestseller)

      Penguin Viking 2014

      ISBN 97806 7008640

      తొలగించండి
    10. "నీహారిక" గారి "బ్లాగు" లో "పోస్ట్లు" ఏమీ లేవు...ఆశ్చర్యం ఏమీ లేదు...జిలేబీయమే అనిపిస్తోంది..

      తొలగించండి

    11. మొన్న బుచికీని పట్టుకుని కంది వారు జిలేబీ అన్నారు

      ఇప్పుడు నీహారికను పట్టుకుని మీరు జిలేబీయం అంటున్నారు.

      ఇట్లా అందర్నీ జిలేబి అనేస్తే జిలేబి యేమగునండీ జీపీయెస్ వారు ?


      జిలేబి

      తొలగించండి

    12. Bye bye రేపటికి ఫ్రెష్ గా వచ్చేయండి‌ :)


      జిలేబి

      తొలగించండి
  24. డా.పిట్టా సత్యనారాయణ
    తొంటివె హక్కులు తెగలవి
    కంటిమయా కేసియారు కాన్కగ నేడీ
    మింటిని స్వరమును బెంచియు
    టంటంటం టంట టంట టమ్మనె భేరుల్!

    రిప్లయితొలగించండి
  25. కంటి నిట వెంట వెంటన
    మింటిని నంటెడి మృదంగ మిశ్రిత రవముల్
    టంటం టంటం టంటం
    టంటంటం టంట టంట టమ్మనె భేరుల్


    టంటంటం టట టంట టంట టటటం టంటం ట టంటంటటం
    టంటంటం టట టంట టంట టటటం టంటం ట టంటంటటం
    టంటంటం టట టంట టంట టటటం టంటం ట టంటంటటం
    టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. கலக்கிட்டீம்ண்க ப்பொண்க ராவ் சாப் :)

      ஜிலேபி

      తొలగించండి
    2. శంకరయ్య గారు ఒక తమిళ అనువాదకుని పెట్టిన మంచిదేమో బ్లాగులో

      తొలగించండి

    3. అరవంలో టంటం డండం రాస్తే ఒకేలా వుంటాయి. :) కాంటెక్స్ట్ బట్టి ట లేక డ అర్థం చేసుకోవాలి :) సో పోచిరాజు రాసిన ట ట లో‌ ఏది ట ఏది డ వేసుకోవాలి అని అరవం లో దాంతో తలీ వుంగలీ దబాయి :)


      జిలేబి

      తొలగించండి

    4. * సో పోచిరాజు వారు వ్రాసిన ట ట ల లో

      తొలగించండి
    5. కామేశ్వర రావు గారూ,
      మీ చమత్కార పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    6. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
    7. கலக்கிட்டீம்ண்க ப்பொண்க ராவ் சாப் :)

      ஜிலேபி

      రౌండ్ పగిలిన స్టఫ్ :)

      జిలేబి

      తొలగించండి
  26. డా.పిట్టా సత్యనారాయ
    ఇంటన్ దోపిడి జేయజాలరె మగల్ యింకెందుకీ భార్యలున్
    జంటం గూడి జనాళి దోచగవలెన్ సాక్ష్య మ్మదే లేక మీ
    ఒంటం బుట్టు నిజాయితీ సగమయెన్ యొక్కర్కె యుద్యోగ మౌ
    టంటంటంటటటంట టంట టటటం టంటమ్మనెన్ భేరులే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అయెన్' అన్న ప్రయోగం సాధువు కాదు. అయినా 'అయెన్ + ఒక్కరికె' అన్నపుడు యడాగమం రాదు. 'ఒక్కరికె' అన్నదానిని 'ఒక్కర్కె' అనరాదు.

      తొలగించండి
  27. ఘంటారావము తోడుగ
    వంటను నైవేద్యమిడెడు వైనము నందున్
    జంటగ ఢమ్మను రావము
    టంటంటం టంటటంట టమ్మనె భేరుల్!

    గుడిలో నైవేద్యపు వేళ యాంత్రిక ఘంటారావము భేరీనినాదములు కలసి వినిపిస్తాయి!

    రిప్లయితొలగించండి
  28. ద్వ్యక్ష రాది త్యారాధనము :

    నీ నామ మేను మనమున
    నూని మనో మననమున నిను నమః నా నే
    నేని మననీ న నన నను
    మాన మిన! మనమున మాని మననీ నన్నున్

    రిప్లయితొలగించండి
  29. కంటకులైన నిశాటులు
    వెంటబడి తరుముచుండ విచ్చల విడిగా
    బంటులు కదలగ హరితో
    టంటంటం టంట టంట టమ్మనె భేరుల్

    రిప్లయితొలగించండి
  30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  31. గంటలు మ్రోగగ గుడిలో
    వెంటనె బడిలోనిగంట పెద్దగ మ్రోగన్
    చంటియె వాయించ, పగిలి
    టంటంటం టంటటంట టమ్మనె భేరుల్!!!

    రిప్లయితొలగించండి
  32. నిన్నటి స్వగతం:
    వంటింటనన్నిప్రాతలు
    టంటంటం టంటటంట టమ్మనె, భేరుల్
    వంటివవి పోరునకుఁ దొలి
    యింటన్ నేడుమనుటెట్లొ? యేల సెలవులో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కంటి "జతపరచుట" నిటుల
      తుంటరి శిష్యుండొకండు తొందర గూర్చన్
      గంటలు పీప్పీ యనె నిక
      టంటంటం టంటటంట టమ్మనె, భేరుల్

      తొలగించండి
    2. రామకృష్ణ గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ రెండు పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  33. వంటకు సామగ్రి కొఱకు
    తంటాల్పడుచుండ నొకని దార యలుగుచున్
    కంటెలు గొలుసులు లేవన
    టంటంటం టంట టంట టమ్మనె భేరుల్

    రిప్లయితొలగించండి
  34. కంటన్ బడ్డ వధూటినిన్ గనుచు నాకాంక్షింప నెంచన్నహో
    పంటై పండెను గాదె ప్రేమ యన సోపానమ్ములన్ దాటగన్
    వెంటన్ దెచ్చిన చెంబునే విడువగా వేగమ్ముతో నయ్యెడన్
    టంటంటం టట టంట టంట టటటం టంటమ్మనెన్ భేరులే!


    రిప్లయితొలగించండి
  35. కందం
    మంటన్ గలుపఁగ రావణు
    వెంటాడును రాముఁడనెడు విశ్వాసముతో
    నింటన్ విన మండోదరి
    టంటం టంటం టటంట టమ్మనె భేరుల్

    శార్దూలవిక్రీడితము

    మంటన్ గల్పును రామచంద్రుడని సంభాషించ, లంకేశుడున్
    మంటల్ మండుచు వైరమున్ విడక యామండోదరిన్ గాదనన్
    బంటుల్ వారధి గట్ట జానకిని గాపాడంగ రాగన్ వినెన్
    టంటంటం టటటం టటంట టటటం టంటమ్మనెన్ భేరులే

    రిప్లయితొలగించండి
  36. డా.పిట్టా నుండి
    ఆర్యా,కృతజ్ఞతలు.మునుపటివలె రాత్రి 12 గం.లతరువాత సమస్య ఉంటే వేకువనే లేచి సాధించుటకు వీలుంటుంది. ఉదయపు పనులకు ఆటంకమౌతున్నది.వీలుంటే టంటం అని పడవేయ మనవి.

    రిప్లయితొలగించండి
  37. శంకరాభరణం వారి సమస్య

    *టంటంటం టట టంట టంట టటటం టంటమ్మనెన్ భేరులే*!!

    పూరణ

    *శార్దూలము*

    వంటన్ చేయుచు వేదనొందె మగడే భక్ష్యంబు రాలేదనీ
    తంటాలన్ పడుచుండె తీయ గరిటెన్ తాళింపు వేయన్ భళీ
    గంటల్ మ్రోగిన శబ్ధమయ్యె ‌వడిగా గంగాళమే దొర్లగన్
    *టంటంటం టట టంట టంట టటటం టంటమ్మనెన్ భేరులే*!!


    హంసగీతి
    6.8.18

    రిప్లయితొలగించండి
  38. మింటను మెరిసెడి తారక
    కంటికి యగుపించె నంత కలవర పడగన్
    జంటగ నిలచిన చాలును
    టంటంటం టంటం టంట టమ్మనె భేరుల్

    రిప్లయితొలగించండి
  39. గంటల్ గొట్టుచు పాకి వీరులు మహా గర్వించి కవ్వించగా
    పంటల్ పండుచు భారతీయుల కలల్ పాకీయ భీభత్సతన్
    తుంటల్ జేయగ వారి భేరులనటన్ తోషించి బాంబర్లతో
    టంటంటం టట టంట టంట టటటం టంట మ్మనెన్ భేరులే

    రిప్లయితొలగించండి