15, ఆగస్టు 2018, బుధవారం

సమస్య - 2763 (స్వేచ్ఛ లభించె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు"
(లేదా...)
"స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్"

74 కామెంట్‌లు:

  1. డెబ్బదొక్కేండ్లు గడచెలే యబ్బురముగ ;
    నాంగ్లభాషపై గల మోజు లధికమయ్యె;
    త్రికరణముల వారలచుట్టు తిరుగు మనసు .

    రిప్లయితొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    దయనీయస్థితిలో భారతభారతి ! ఇలా.. 👇🙏

    తుచ్ఛతరాంగ్లపాలనను దూఱుచు , పోరున నిల్చి గెల్వగా
    స్వచ్ఛములౌ స్వదేశ ఘనభాషలు వెల్గునటంచునెంచితిన్ !
    మ్లేచ్ఛుల భాషయే మిగిలి , మ్రింగుచునుండెను కాలసర్పమై !
    స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. అర్జంటుగా కొంత జోష్ కలిగించే పూరణకై కంది వారు శీర్షిక మార్చ వలె !


      జిలేబి

      తొలగించండి
    2. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  3. కష్టమును చేయు నొక్కడు, ఘనతరముగ
    సుఖములను గాంచు నన్యుండు చూడ తరమె?
    భారతీయత నీరీతి పలుక దగును
    స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు

    రిప్లయితొలగించండి


  4. చదువు లెల్ల నేర్వ మనిరి చక్క గాను
    నేర్చి నాము కూటికొరకు, నేడు చేతి
    విద్య లెల్ల విడిచినాము వీధు లెల్ల
    తిరుగు చుంటిమి నిటునటు తిరము లేక!
    స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు!


    జిలేబి
    పంద్రా ఆగస్టునాడు అయ్యవారు ఇట్లా నైరాస్యానికి వెళ్ళిపోయేరేమిటి !

    కదం కదం బడాయి యే !
    ఇక్కీస్వీ సదీ భారత్ కా హై
    మేరా భారత్ మహాన్
    సబ్ కే సాత్ సబ్ కా వికాస్
    బెల్ ఫ్యాక్టరీ మే బనాయేంగే హమ్ మొబైల్
    స్వచ్ఛ భారత్
    జీ యెస్ టీ మే హై స్వాద్ భరీ చాయ్ !
    జండా వూంఛా హమారా !


    శుభాకాంక్షలతో
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      స్వేచ్చను సంపాదించుకున్నా పరాయి భాష, సంస్కృతుల సంకెళ్ళు మరింత బిగుసుకొనడం చూసాక నైరాశ్యం కాక ఇంకేం వస్తుంది?

      తొలగించండి
  5. రాజ కీయము నందున రచ్చ రచ్చ
    లేదు మహిళకు రక్షణ రేయి బవలు
    ప్రజల బాధలు తీరవు బరువు బ్రతుకు
    స్వేచ్చ వచ్చెఁ దెగవు దాస్య శృంఖ లములు

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టాసత్యనారాయణ
    సప్తతిని మించి నొకయేటి సాములోన
    వోటు పేర సమాన ప్రబుద్ధులంత
    రండి మా సాజ సంపద దండుకొనగ
    ననియు దేశాల బిలిచెడి నైజ ముడుగ
    లేదు పులివాతలనుబొందు లీల దప్ప
    ఏది తమ కాళ్ళపై నిల్చు యింగితంబు?
    స్వేచ్ఛ వచ్చె దెగవు దాస్య శృంఖలములు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సాజ సంపద' దుష్టసమాసం అనుకుంటాను.

      తొలగించండి
  7. మ్లేచ్ఛ పాలన నిరసించి స్వేచ్ఛగొనగ
    సాగె పలువత్సరము లవి శాంతిగాను
    స్వేచ్ఛపేరిట చెలగగ మ్లేచ్ఛవృత్తి
    స్వేచ్ఛవచ్చె దెగవు దాస్య శృంఖలాలు!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    పృచ్ఛక! లచ్చి బంచగను బేలలునై యడుగంగ జూతురీ
    స్వచ్ఛ విశాల దేశమున చావులు దప్పవు డొక్కమాడ యా
    దృచ్ఛికలీల పాలనము దేల్చిన నాయకు కైదు యేండ్లకౌ
    స్వేచ్ఛ లభించె;దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్?!

    రిప్లయితొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2763
    సమస్య :: స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్.
    1947 ఆగష్టు 15 వ తేది మన భారతదేశానికి స్వేచ్ఛ లభించింది. ఆంగ్లేయులు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించి ఇప్పటికి 70 ఏళ్లు గడచిపోయినా స్వేచ్ఛగా తిరగాలంటే దారి కనబడటం లేదు. స్వచ్ఛమైన మనస్సుతో ప్రవర్తిస్తూ ఉంటే అనేక కష్టాలు చుట్టుముట్టుతూ ఉన్నాయి. స్వార్థం కారణంగా మన పెద్దలే మనలను బానిసలుగా మారుస్తున్నారు. కాబట్టి స్వేచ్ఛ లభించినా దాస్యం అనే శృంఖలాలు మాత్రం ఇంకా తెగిపోలేదు. మన పరిస్థితిని ఏమని చెప్పాలి? అని విన్నవించుకొనే సందర్భం.

    స్వేచ్ఛగ సంచరింప కనిపించదు మార్గము నేటికిన్, సదా
    స్వచ్ఛమనమ్మునన్ మెలగ సంకటముల్ వెస చుట్టుముట్టు, మా
    యిచ్ఛ ఫలింప తెల్లదొర లీయగ డెబ్బదియేండ్ల పూర్వమే
    ‘’స్వేచ్ఛ లభించె, దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్.’’
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-8-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కోట వారూ,
      అద్భుతంగా ఉన్నది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. సవరణతో
      గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
      సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2763
      సమస్య :: స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్.
      1947 ఆగష్టు 15 వ తేది మన భారతదేశానికి స్వేచ్ఛ లభించింది. ఆంగ్లేయులు మనకు స్వాతంత్ర్యాన్ని ప్రకటించి ఇప్పటికి 70 ఏళ్లు గడచిపోయినా స్వేచ్ఛగా తిరగాలంటే దారి కనబడటం లేదు. స్వచ్ఛమైన మనస్సుతో ప్రవర్తిస్తూ ఉంటే అనేక కష్టాలు చుట్టుముట్టుతూ ఉన్నాయి. స్వార్థం కారణంగా మన పెద్దలే మనలను బానిసలుగా మారుస్తున్నారు. కాబట్టి స్వేచ్ఛ లభించినా దాస్యం అనే శృంఖలాలు మాత్రం ఇంకా తెగిపోలేదు. మన పరిస్థితిని ఏమని చెప్పాలి? అని విన్నవించుకొనే సందర్భం.

      స్వేచ్ఛగ సంచరింప కనిపించదు మార్గము నేటికిన్, హిమ
      స్వచ్ఛమనమ్మునన్ మెలగ సంకటముల్ వెస చుట్టుముట్టు, మా
      యిచ్ఛ ఫలింప తెల్లదొర లీయగ డెబ్బదియేండ్ల పూర్వమే
      ‘’స్వేచ్ఛ లభించె, దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్.’’
      కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (15-8-2018)

      తొలగించండి


  10. ఉత్పలమాల

    స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి? సెప్పుదున్,
    స్వేచ్ఛ జిలేబి పోలిక !కుసీదిక జీవులుగా జనాళి, వావ్!
    స్వేచ్ఛ భలే యటంచు నిల శీతకు లై తిరుగాడ రాదు సూ !
    స్వేచ్ఛ ధురంధరత్వముగ సింహపు ఠీవిగ కై గొనంగ నా
    స్వేచ్ఛ, ప్రతిష్ఠ జేర్చు సయి సేతువు గా కడతేర్చు దేశమున్ !


    శుభాకాంక్షల తో

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. ఇచ్ఛకు వచ్చినట్లు మన యింతులు బైట చరించలేరిటన్
    స్వచ్ఛమనమ్ముతో ప్రభుత పాలన తప్పులనెంచలేమిటన్
    మ్లేచ్ఛుల సంప్రదాయములు మిక్కిలి హెచ్ఛుటనాపలేమిటన్
    *"స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్"*

    రిప్లయితొలగించండి
  12. [15/08, 06:42] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    రాజకీయ,సామాజిక, ద్రవ్య ములను
    ప్రజలు పరిపూర్ణ స్వాతంత్ర్య రహిని గాంచి
    వెలుగు చుండిరె ?తెల్పుమోవీర! యెచట
    స్వేచ్ఛ వచ్చె? దెగవు దాస్య శృంఖ లములు
    [15/08, 06:50] Nvn Chary: డా.ఎన్.వి.ఎన్.చారి
    ఇతర దేశాలగుప్పిటనేడ్చు రూక
    విలువ మారెడు వేళలో వేడ్కలివియె
    ఆర్థికమ్మున పరతంత్ర మయ్యె!నెచట
    స్వేచ్ఛవచ్చె? దెగవు దాస్య శృంఖ లములు

    రిప్లయితొలగించండి
  13. పేర్లుఁజూడగ నాంగ్లమే వెక్కిరించు
    వేషభాషల నాంగ్లమే!విడిచి పోదు!
    భావ దాస్యము జాతిని పాడుఁజేసె!
    స్వేచ్ఛ వచ్ఛెఁదెగవు దాస్య శృంఖలములు


    కవి మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  14. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో -----
    గాంధి చూపిన మార్గమే ఘన మటంచు
    దేశ భక్తుల త్యాగాల దివ్య ఫలము
    స్వేచ్ఛ వచ్చె ; తెగవు దాస్య శృంఖలములు
    మూఢ విశ్వాస కులమత మొండి ముడులు
    ________కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజేశ్వర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మత మొండిముడులు' అన్నది దుష్టసమాసం. "మూఢ విశ్వాస మతముల మొండి ముడులు" అందామా?

      తొలగించండి
  15. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    స్వేచ్ఛ లభించె దాస్య ఘన
    శృంఖలముల్ దెగవేమి సెప్పుదున్
    ========================
    స్వాతంత్ర్యము సిద్దించినది, స్వేచ్ఛ
    లభించినది అయినను మన కాళ్ళకు
    చుట్టుకొనిన దాస్యపు గొలుసులు
    తెగడం లేదెందుకని బాధపడుటలో
    గల విశేషమే సమస్యగ పరిగణించ
    =========================
    సమస్యా పూరణము - 232
    ====================

    ఎనిమిదొందల తురుష్క పాలన
    రెండొందలుగ తెల్లోడి లాలన
    బానిస బతుకులె మనకు తీయన
    పౌరుష పూతలు నీకు పూయన
    నాటి అసురులె మన నాయకులు
    వీరి గబ్బు నేనెట్లు కప్పుదున్
    స్వేచ్ఛ లభించె దాస్య ఘన
    శృంఖలముల్ దెగవేమి సెప్పుదున్

    ====##$##====

    భారతీయ రాజుల అనైక్యత కారణంగా
    కొద్దిపాటి సైన్యంతో చేసిన తురుష్కుల దాడి
    800 సంవత్సరాల పాలనను స్థాపించినది.
    600 కు పైగా ఉన్న సంస్థానాదీశుల అనైక్యత
    కారణంగా జనాభా లోను , వైశాల్యంలోను
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతగా లేని
    బ్రిటీష్ వాడు మనలను 200 సంవత్సరాల
    పాటు తన ఏలుబడిలోకి తీసుకున్నాడు. ఈ
    విధంగా అధిక సంఖ్యాకులమై ఉండి కూడా
    అల్ప సంఖ్యాకుల పాలనలో బానిసలమై
    బ్రతకడానికి అలవాటు పడిన మన పిరికి
    తనములకై మనకు మనంగా ఎలాంటి
    పౌరుషపు లేపనములను పూసుకొనవలెనో
    కదా !!!
    ప్రజలను, ప్రభుత్వమును దోచుకునే
    విషయంలో నాటి రాక్షసులకు ఏ మాత్రం తీసి
    పోని మన నాయకులుండగ, స్వాతంత్ర్యము
    వచ్చి స్వేచ్ఛ లభించినను కాళ్ళకు తగులు
    కున్న సంకెళ్లు తొలగలేదనియే కదా భావము

    (మాత్రా గణనము - అంత్య ప్రాస)
    --- ఇట్టె రమేష్
    (శుభోదయం)

    రిప్లయితొలగించండి
  16. క్రొవ్విడి వెంకట రాజారావు:

    స్వైరము గలిగి వెలుగు రాజ్యమ్మునందు
    బానిసత్వ ఛాయ లంతము కాని వడిని
    పేదలు ధనికు లెల్లెడ పెరుగు చుండె;
    స్వేఛ్చ వచ్చె దెగవు దాస్య శృంఖలములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బానిసత్వ + ఛాయలు = బానిసత్వ చ్ఛాయలు' అవుతుంది. ధనికులు బహువచనం, పెరుగుచుండె అన్నది ఏకవచనం. "పేద ధనిక భేదమ్ములు పెరుగు చుండె" అందామా?

      తొలగించండి
  17. పృచ్ఛకు లెవ్వరుండరని పేర్కొన రాదుగ స్వేచ్ఛకర్థమున్
    స్వచ్ఛత గల్గినట్టి మది వర్తిల గావలె నెంచి జూడగా
    యిచ్ఛకు వచ్చినట్టునిల యెందఱొ భావన సేయుచుండిరే!
    "స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి
    సెప్పుదున్"
    ****)()(****
    {Liberty is not the absence of restraints,but the presence of a strong feeling of responsibility -Harold John Laski}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జూడగా నిచ్ఛకు... నిల నెందఱొ.." అనండి.

      తొలగించండి
  18. బలగ మున్న వాడికె గాని బడుగు కేది
    తఱచి జూడగ నేడు స్వతంత్ర్య ఫలమె?
    యంత కంతకున్ హెచ్చయ్యె నంతరాలు
    స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు
    ***)()(***
    (సాంఘికార్థికాంతరాలు కనిపించని సంకెళ్ళు)

    రిప్లయితొలగించండి
  19. మిత్రులందఱకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

    ["ఎందఱో దేశభక్తుల త్యాగఫలంవల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినా, నిజాం రాజుల అధీనంలో ఉన్న కారణంగా తెలంగాణకు స్వాతంత్ర్యం లభించలేదు! సంతోషంతో దేశమంతా ఉత్సవాలు జరుపుకొంటున్నా, తెలంగాణ ప్రజలకు నిజాం ప్రభువుల దాస్య శృంఖలాలు తెగనందువల్ల, ఉత్సవాలు జరుపుకొనే అవకాశమే రాలే" దని యిద్దఱు తెలంగాణులు సంభాషించుకొంటున్న సందర్భం]

    "స్వేచ్ఛనుఁ గోరి హిందువులు సిక్కులు జైనులు మహ్మదీయులున్
    దుచ్ఛుల నాంగ్లపాలకులఁ ద్రుంప, మహోద్యమముల్ ఘటింపఁగా,
    స్వచ్ఛపు స్వేచ్ఛ వచ్చెఁ! దలఁపన్ దెలగాణకు స్వేచ్ఛ నీక, యా
    స్వేచ్ఛ లభించె! దాస్య ఘన శృంఖలముల్ దెగ! వేమి సెప్పుదున్?"

    రిప్లయితొలగించండి


  20. నోటికేదివచ్చిననది నొక్కి పల్కు
    స్వేచ్ఛ వచ్చె ; తెగవు దాస్య శృంఖలములు
    మన తెలుగు టీవి యాంకరి మహిళలకు; జి
    లేబు లగుచు నెంగిలిపీసులె తెలుగయ్యె :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. దేశమునకుస్వతంత్రముదేగలిగిన
    బాలకార్మికకట్టడమారలేమి
    స్వేఛ్ఛవచ్చెదెగవుదాస్యశృంఖలములు
    భావిభారతపౌరులభవితజూడ
    ప్రధమకర్తవ్యముగదార్య!ప్రభుతకెపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కద + ఆర్య అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.

      తొలగించండి
  22. తుచ్ఛబలాత్కృతాద్యమితదుష్టనికృష్టుల శుల్కదాహముల్,

    తచ్ఛమనాంతహత్యలు, స్వతంత్రనివర్తితవర్తనమ్ములున్

    స్వచ్ఛవిహీనభావపురుషాధికతత్త్వసుతప్తయోషకున్

    స్వేచ్ఛ లభించె దాస్యఘనశృంఖలముల్ దెగవేమి సెప్పుదున్.

    రిప్లయితొలగించండి
  23. మ్లేచ్ఛుల పాలనన్ బ్రజల మేలును గోరుచు పోరుచేసి యా
    స్వేచ్ఛను బొంది మానినుల శీలము ద్రుంచెడు దుష్ప్రవర్తనల్
    పెచ్చులు మీరగా ఘనత పేలవ మవ్వగ విశ్వమందునన్
    స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగవేమి సెప్పుదున్?!

    మహిళలపై అత్యాచారాలలో భారతదేశం ప్రధమస్ధానంలో ఉండడం శోచనీయము!!😔😔😔

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సీతాదేవి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అవ్వగ' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. గురువుగారికి నమస్సులు! పేలవ మాయెగ యన వచ్చుననుకుంటాను! ధన్యవాదములు!

      తొలగించండి
  24. రిప్లయిలు
    1. వైద్యు లుండినఁ బెక్కురు పరఁగు రుజలు
      ప్రగతి గన్నను గల రిట బడుగు జనులు
      న్యాయ సభ లున్నఁ దగ్గ దన్యాయ మిచట
      స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు


      ఇచ్ఛలు మీఱ సంతతము నీసు నసూయలు పిక్కటిల్ల నీ
      యచ్ఛపు బీద సాదలకు నర్థ పదోద్ధతి నంధులౌ మన
      స్స్వచ్ఛత లేని పౌర తతి, భారత మాతకు నిక్కమెంచగన్
      స్వేచ్ఛ లభించె, దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్

      తొలగించండి
    2. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. స్వచ్ఛపువాడుగాదనరిసాదరమొప్పగదేశవాసుల
    న్స్వచ్ఛమనస్కుడైకనుచుసాంతముబాలనజేయుచుండిన
    న్హెచ్చుగబాలకార్మికులుహీనపుజీవనమొందుచుండుటన్
    స్వేచ్ఛలభించెదాస్యఘనశృంఖలముల్దెగవేమిసెప్పుదున్

    రిప్లయితొలగించండి
  26. పరులువదలిపోవ మనకు బాహ్య మందు
    స్వేచ్ఛ వచ్చె; దెగవు దాస్య శృంఖలములు
    మనసునందు
    మత్సరమును మానకున్న
    మానవత్వము పరులందు మనుపకున్న

    రిప్లయితొలగించండి
  27. ప్రాణములనొడ్డి పోరాట పటిమ జూపి
    తెల్ల దొరలను తరిమి సాధించుకున్న
    స్వేచ్ఛ వచ్చె, దెగవు దాస్య శృంఖలములు
    స్వార్థ పరులైన నేతల పాలనమున.

    రిప్లయితొలగించండి
  28. భ్రూణహత్యక?స్వార్థంబుబెంచుటంద?
    అత్తమామలక?యింటనల్లుడిక?వి
    వాహసుతక?ధరలక?యెవరికి కెపుడట
    స్వేచ్చవచ్చె? దెగవుదాస్యశృఖలములు!

    రిప్లయితొలగించండి
  29. కుచ్చిత బుద్ధితో సతము కుట్రల బన్నుచు దేశసంపదన్
    మ్రుచ్చిలినట్టి ద్రోహులను పోరిడి పంపగ నెట్టకేలకున్
    స్వేచ్ఛలభించె, దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్
    తుచ్చుల నాయకత్వమున దోపిడి దారులె నేతలవ్వగన్.

    రిప్లయితొలగించండి
  30. గగురుదేవుల మరియు కవిమిత్రులకందరకూ స్వాతంత్య్ర పర్వదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  31. కవి మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

    పావనమ్మగు భరత సౌభాగ్య సీమ
    జీవనమ్మిడ స్వాతంత్ర్య చేతనమున
    పరుల పాలన ద్రోలిన తరుణ మిదియె
    "స్వేచ్ఛ వచ్చె దెగవు దాస్య శృంఖలములు!"

    రిప్లయితొలగించండి
  32. ఉత్పలమాల
    హెచ్చులుఁ జూపబోకుముర యేలెడు పక్షపు వారమంచు మా
    యిచ్ఛను త్రాగి తిర్గెదము నింకెవడడ్డని, నాపజూడగన్
    కచ్చగ దాడిచేసి యధికారిని గొట్టరె? యౌర! పేరుకే
    స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్?

    రిప్లయితొలగించండి
  33. తేటగీతి
    గనుల దోచి పరిశ్రమల్ గలుఁగఁ బోగ
    జైలు పాలైతి, పాలన స్వంత మగుచు
    బెయిలు దొరికినఁ దప్పవు వాయిదాలు
    స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు

    రిప్లయితొలగించండి
  34. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు

    సందర్భము: ఇన్నేం డ్లయింది స్వాతంత్ర్యం వచ్చి.. దాస్య శృంఖలాలు తెగనే లేదు. దాస్య శృంఖలా లే వనగా "ఇతరుల దగ్గర పని చేస్తే బాగుపడుదా" మనుకోవడమే!
    చూడండి! మీ కెదురుగా ఎన్నో వస్తువులు కనిపిస్తాయి. కాగితం, పెన్ను, చొక్కా, గోడకు తగిలించబడిన వాల్ క్లాకు, ఫోటో ఫ్రేమ్ లేదా క్యాలెండర్ మొదలైన వెన్నో.
    ఉదయం మేల్కొన్నప్పుడే బ్రష్ పేస్టు, స్నానం చేసేప్పుడు సబ్బు షాంపో, చేశాక అద్దం దువ్వెన పౌడరు, తినేటప్పుడు చెంబు ప్లేటు చెంచా, టీ తాగేటప్పుడు టీ కప్పు, కూర్చునేటప్పుడు కుర్చీ.. ఇలా ఎన్నో చెప్పుకుంటూపోతే.
    అసలు లోకమే వస్తుమయం కదా! ప్రతి వస్తువును తయారుచేసే వా డున్నాడు. అమ్మే వా డున్నాడు. కొనే వా డున్నాడు. సప్లై చేసే వా డున్నాడు. ఇంకా ఎవ డెవడో వున్నాడు.
    అసలు ఏ వస్తువుమీదికీ నేటి విద్యార్థి దృష్టి పోదు. అది ఎలా రూపు దాల్చి లోకం లోకి వస్తున్నదీ స్ఫురణకు రాదు.
    ఎంతసేపూ పుస్తకం చదువడం పాసవడం.. మళ్ళీ పుస్తకాలు చదివి చెప్పే కొలువులు ఎవ డిస్తాడా అని కాచుక్కూర్చోవడం..
    దాస్య శృంఖలా లంటే ఇలాంటి భావాలే! ఈ భావాలు వదలినంతవరకు దేశానికి ప్రగతి లేదు.
    ==============================
    సుప్రభాతము సఖా! చూపు సారింపుమా!
    ఎదురుగా వస్తువు లెన్ని యేని
    కనిపించును; తయారిఁ గావించు నొక్కడు;
    నొక డమ్ము; కొను నొక్క; డొకడు ప్రజకు
    నందించుచుండెడి; నట్టిదౌ నొకదాని
    నెంచి విద్యార్థి పట్టించుకొనడు..
    పుస్తకాలు చదివి పుస్తకాలను జెప్ప
    కుస్తీలు పట్టుదుర్ కొలువుకొరకు..
    ఇన్ని యేండ్లాయె దేశాని కింపుమీర
    స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు;
    పరులకడ కొలువులు జేయ బాగుపడుదు
    మనెడు భావాలె సంకెల లనగదగును

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    15-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి


  35. శాంతియనుమాట వినరాదు జగతియందు
    నాటి నేతల యాశలు నీటి మూట
    లయ్యె,దేశద్రోహుల సంఖ్య యధికమయ్యె
    స్వేచ్ఛ వచ్చె దెగవృ దాస్య శృంఖలములు.

    రిప్లయితొలగించండి
  36. వేయి సంవత్సరమ్ములు వేచియుండి

    భారతీయుల కింపుగ పరులనుండి

    స్వేచ్ఛ వచ్చెఁ; ....దెగవు దాస్య శృంఖలములు

    బీదసాదల బాధల రోదనముల!


    రిప్లయితొలగించండి
  37. స్వచ్ఛపు భారతీయతకు చప్పుడు చేయుచు డప్పుకొట్టగా...

    తుచ్ఛపు వాసనల్ విడక తుంటరి చేష్టల రాజనీతికిన్

    స్వచ్ఛగ వీధిమధ్యమున చక్కని భామల వెక్కిరింతకున్

    స్వేచ్ఛ లభించె; దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్ :)

    రిప్లయితొలగించండి
  38. మ్లేచ్ఛులు నాంగ్ల రాక్షసులు మేదిని నంతయు కొల్లగొట్టి భల్
    పుచ్ఛము ముడ్చి పారగను ముద్దుల గుమ్మగు భారతమ్ముకున్
    స్వేచ్ఛ లభించె;...దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్
    మచ్ఛపు భోక్తయౌ మమత మైకము నుండియు రేబవళ్ళయో!

    రిప్లయితొలగించండి