25, ఆగస్టు 2018, శనివారం

సమస్య - 2771 (శవమున శశిలోని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"
(లేదా...)
"శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్"

85 కామెంట్‌లు:

  1. భువనముల నోటఁ జూపఁగ
    నవలోకించి తెలివిఁ గని యా యమ్మ యశో
    ద వెఱఁగుపడి కృష్ణుని శై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్.

    రిప్లయితొలగించండి
  2. బలరాముడు మిత్రులకు బాలకృష్ణుని ఘనకార్యం
    చెప్పినట్లుగా మీరు చేసిన భావన కమనీయం.

    రిప్లయితొలగించండి
  3. శవమైన ముసలి మగనిని
    చివరకు మంచిని దలపక చేసెను నిందల్
    నవయౌవన దినముల నీ
    శవమున శశి లోని షోడశకళల గాంచెన్
    (శవం అనే పదాన్ని యథాతథార్థం లో పూరించాను)

    రిప్లయితొలగించండి
  4. (చంద్రుడు కావాలంటున్న బాలరామునికి అద్దంలో చంద్రుని చూపిన దశరథుడు )

    ధవుడగు దశరథు డంతట
    జవముగ నద్దము నమరిచి చకచక చూపన్
    రవముల రాముడు తన శై
    శవమున శశిలోని షోడశకళల గాంచెన్ .
    ( ధవుడు - ప్రభువు )

    రిప్లయితొలగించండి


  5. అవలీలగ బాలుడొకం
    డవధానమ్ము సభలోన డంగగు రీతిన్
    సవరింప మెచ్చిరౌ "శై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. స్తవనీయుడు,చరితార్థుడు,
    కవి తన దేహంబు వీడ క్రమ్మిన వారల్
    నివురునఁగప్పిన నిప్పన
    శవమున శశిలోని షోడశ కళలఁగాంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రసాద రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వారల్' అని కర్తృపదం బహువచనం. 'కాంచెన్' అని క్రియాపదం ఏకవచనమయింది.

      తొలగించండి
    2. పచన సంబంధాన్ని తెలుసుకున్నాను కృతఙ్ఞతలు

      తొలగించండి
    3. కవి తన దేహంబు వీడె కన్న సుతుండే అనవచ్చునౌ తెలుప ప్రార్ధన

      తొలగించండి


  7. అవధానంబును బాలుడొక్కడట తా నాశ్చర్య మున్గొల్పుచున్
    సవరింపన్ సభలో వరేణ్యు లనిరే "సాధించెనీతండు, శై
    శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ముల్గనెన్,
    భవనీయంబగు మంచి పేరు గనునీ బాలుండు తథ్యంబుగా"


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'భవనీయము' అర్థం కొరకు ఆంధ్రభారతి తలుపు తట్టాను!

      తొలగించండి

    2. గురువుల కే పనికలిగిం
      చు రయము గా వచ్చి యివముసూడుని జతగా :)

      ఇవ్వాళ ఇవముసూడులవారు పెందరాళే రాలేదేమిటి ?


      జిలేబి

      తొలగించండి
    3. పరుగిడి జిలేబి వచ్చితి
      మురళీ కృష్ణులు మరిమరి మురిపించితిరే!

      తొలగించండి
    4. మాకేమో బెడ్ కాఫీ...మీకేమో బ్రేక్ ఫాస్టు 😊

      తొలగించండి
  8. రిప్లయిలు

    1. నవనీతాంచితదుగ్ధపానవిలసన్నవ్యత్వచౌర్యాప్తిసం

      స్తవనీయాన్వితదివ్యలక్ష్షణధృతున్ , సన్నద్ధభక్తావనున్ ,

      శ్రవణీయోక్తిసుకీర్తనీయఘనసంశ్లిష్టావతారాత్తకై

      శవమం దాశశిలోని షోడశకళాసల్లక్షణమ్ముల్ గనెన్.

      కంజర్ల రామాచార్య

      తొలగించండి
    2. కైశవమందు స్తవనీయకేశవసంబంధావతారమందు.

      తొలగించండి
    3. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కైశవము'...?

      తొలగించండి
    4. కేశవస్య ఇదం కేశవం అని వ్యుత్పత్తి
      కేశవసంబంధావతారము నందు అని భావన

      తొలగించండి
  9. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2771
    సమస్య :: శవ మందా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ముల్ గనెన్.
    శవం ముఖంలో చంద్ర కళలు పదహారూ కనిపించినాయి అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: అందఱికీ జన్మరాహిత్యాన్ని ప్రసాదించే శ్రీ మహావిష్ణువు భూభారాన్ని తగ్గించేందుకోసం దివి నుండి భువికి అవతరించి దశరథమహారాజునకు కుమారుడుగా రామభద్రుడుగా జన్మించాడు. శైశవ దశలో ఉన్న రఘురాముని అతని తల్లి కౌసల్య రామా! సుగుణధామా! అని పిలుస్తూ తన దగ్గఱకు వచ్చిన ఆ అయోధ్యరాముని ముఖాన్ని ప్రేమగా చూస్తూ సంతోషంతో వెలిగిపోతున్న ఆ రామచంద్రుని ముఖంలో చంద్రుని యొక్క పదహారు కళలను చూచింది అని ఊహించి చెప్పే సందర్భం.

    భవమున్ బాపెడి విష్ణుమూర్తి భువిఁ గావన్ రామభద్రుండుగా
    నవనిన్ సంభవ మంద, రామ! గుణధామా! యంచు కౌసల్య మా
    ధవునిన్ బిల్చుచు రామచంద్రు ముఖమున్ దర్శించుచున్ వాని శై
    శవ మందా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ముల్ గనెన్.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (25-8-2018)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. కోట వారు

      మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.


      తొలగించండి
    2. సహృదయులు
      జిలేబి గారికి హృదయపూర్వక ప్రణామాలు.

      తొలగించండి
    3. రాజశేఖర్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి


  10. వైద్యునిగా మారిన కవిరాట్ విప్రుడు :)


    శివశివ యనవలసిన వా
    డు,విప్రుడు చదివెను, వైద్యుడుగ మారె, కవీ
    శ, విడువ జాలక నైజము
    శవమున శశిలోని షోడశకళల గాంచెన్ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =====================
    శవమం దా శశిలోని షోడశ
    కళా సల్లక్షణమ్ముల్గనెన్
    ======================
    చంద్రుడిలో కానవచ్చు పదహారు
    కళలను లక్షణయుతంగా శవంలో
    చూసినాడని చెప్పడంలో గల
    అసంబద్దమే సమస్య
    ======================
    సమస్యా పూరణము - 239
    ====================

    పాంచభౌతికమ్ నా ఈ దేహమ్
    మట్టిగ సమసును దీని అహమ్
    శోధన కిచ్చిన తరించు ఇహమ్
    ధన్యత తోడనె నాకు స్నేహమ్
    కళేబరము కాంచనమనుచున్
    అనాటమి డీను తానుగ మురిసెన్
    శవమం దా శశిలోని షోడశ కళా
    సల్లక్షణమ్ముల్గనెన్

    ====##$##====

    పంచభూతముల పంచీకరణముగా
    ఏర్పడిన నా ఈ శరీరము మరణముతో
    మట్టిలో మట్టిగా కలియును, అట్లు గాక
    వైద్యపర శోధనలకు దానమిచ్చినచో ఈ
    లోకము తరించును, నాకును ధన్యత
    చేకూరునని ఒక సహృదయుడు తలచి
    తన శరీరమును దానమొసంగెను.

    మృత కళేబరమును బంగారము కన్నా
    మిన్నగా చూసే శరీర నిర్మాణ శాఖాధిపతికి
    ( Anatomy Department Dean ) ఆ
    శవములో చంద్రుడిలో కాననగు పదహారు
    కళలు కనిపించినాయని భావము.

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ----- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  12. మైలవరపు వారి పూరణ

    అవలోకించెను తల్లి ముద్దులిడి యాప్యాయమ్ముగా బుగ్గలం...,
    దవలోకించెను ముద్దలన్ గుడుపుచున్ హాసంపు నెమ్మోమునన్ ,
    రవివంశాంకురమై ప్రజానుగుణ కమ్రంబైన శ్రీరామశై....
    శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. మైలవరపు వారు

      మీ పూరణ మనోహరముగా ఉన్నది. అభినందనలు.


      తొలగించండి
  13. అవనిని గల మృత్తిక కే
    శవుడు తినెననగ యశోద శంకించగన్
    భువనములను జూపగ శై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్

    రిప్లయితొలగించండి
  14. ద్యువునన్ గల వింతల
    నవలో కించుచు నొకడతి యద్భుత రీతిన్
    భవనమెదుట కాసారపు
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్.
    ***)()(***
    ద్యువు = ఆకాశము ; శవము = జలము.
    (ప్రతిబింబింపగ చూచినాడని భావము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "వింతల తా। నవలోకించుచు..." అనండి. 'అతి + అద్భుత = అత్యద్భుత' అవుతుంది. యడాగమం రాదు. "..నొక డట నద్భుత..." అందామా?

      తొలగించండి
    2. సరరణతో :


      ద్యువునన్ గల వింతల తా
      నవలో కించుచు నొకడట నద్భుత రీతిన్
      భవనమెదుట కాసారపు
      శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్.

      తొలగించండి
  15. బావగారూ బాగున్నారా చిత్రంలో బ్రహ్మానందం శవ శేషంలో అనేక హావభావాలను చూపించిన సందర్భంలో
    అవమానమ్ముగనెంచకుండ మన బ్రహ్మానందమే వేసి తా
    శవరూపమ్మొక చిత్రమందు నటనా సామర్ధ్యమున్ జూప, స్థా
    ణువులైపోయిరి వీక్షకుల్, నటడు ధన్యుండే కదా ప్రేక్షకుల్
    *"శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్"*

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. చంద్రమౌళి గారు

      మీ పూరణ సమకాలీనాంశముపై ప్రశస్తముగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. సూర్యనారాయణ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  16. భువనంబులతోబాటుగ
    నవలోకించెనుయశోద యద్భుతమొదవ
    న్నిరవుగ నోరుదెరువ,శై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్"

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    హవి యా హోమాగ్నిని బడి
    ఠవఠవ లేకుండగాలుటైనను గనుచున్
    కవి, శివ హర మాధవ కే
    శవమున శశిలోని షోడశ కళల గాంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కేశవమున'...?

      తొలగించండి
    2. డా. పిట్టా నుండి,ఆర్యా,
      శివము,హరము, మాధవము, కేశవము లు భగవత్ తత్త్వములకు పేర్లు.హవనంలో, మానవుల అవసరాలను తీర్చు వస్తు, ఫల, వస్త్ర సముదాయమును మంటలలోనికి త్రోస్తూ ఉంటే జాలి పడక భగవత్ కళను చూడమన్నది సంప్రదాయము.కవికియిది తగునా? అన్న ధ్వనితో...

      తొలగించండి
  18. నవలా శిరోమణి యశో
    ద వాసిగను గాంచె తనదు తనయుడు భువనై
    క విభుని లీలలతని శై
    శవమున శశిలోని షోడశ కళల గాంచెన్

    రిప్లయితొలగించండి
  19. భువనమ్మేలగ విష్ణువే యిలను తా బుట్టెన్ గదా కృష్ణుడై
    నవనీతమ్మును దొంగిలించెనని శ్రీనాథున్ మహాలీలలన్
    కవనమ్మందున వ్రాయనొక్కకవి సత్కావ్యమ్ముగా, వానిశై
    శవమందాశశి లోని షోడశ కళాసల్లక్షణమ్ముల్గనెన్

    రిప్లయితొలగించండి
  20. డా.పిట్టా సత్యనారాయణ
    నా35వ యేటయోగాభ్యాస వేళ నా శవమును ప్రక్కన నిలిచి చూచినట్లును పై పైకి యెగయుటకు సిద్ధముగానుంటిని. ఆయానందంలో కూర్చున్న స్థలము, యిల్లు జ్ఞాపకంరాగా క్రిందకు రావడానికి సిద్ధ పడినానట.అలాగే పైకి తేలిక నుభవింతిని.ఈ క్రింది ఉదాహరణములో నొకకవి, కవనముపై గల ప్రీతితో వెనుకకు మరలుట యను యూహ చెప్పబడినది .
    భవముం దాటుటకైన యోగమలరన్ భాసించగ దా పీన్గుగా
    కవనంబే పొడగాంచగా భవమునే కాంక్షించె భక్తిన్ హరీ,
    భువనంబే యన నాకమంచు దలపన్ బో దాను గన్నట్టిదౌ
    శవమందాశశిలోని షోడశకళా సల్లక్షణమ్ముల్గనెన్

    రిప్లయితొలగించండి
  21. అవిరళముగఁ జిత్తమ్మున
    వివశుం డగుచుం గరమ్ము వివిధపు టయ్యై
    యవసరములఁ దా నాశై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్


    అవనీ చక్ర నివాస మానవ సమూహానంద సంధాత దే
    వ వరేణ్యవ్రజ భాజనీయ గగన ప్రాప్తేద్ధ రత్నమ్మునున్
    భవ సాన్నిధ్య తటిం దమిన్ నిసి నిసిన్ స్వచ్ఛంపు గంగానదీ
    శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్

    [శవము = జలము]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      అన్యాదేశమున మీ వాక్స్వాతంత్ర్యము గోల్పోయి నట్లున్నారు!
      సమస్యా పూరకుల పూరణముల మీ సద్యస్సహజ హృదయ స్పందన మవ్యక్తమౌట దురదృష్టకరము.

      తొలగించండి

    3. కామేశ్వర రావు గారు డైరెక్ట్ గా పాయింట్ చెప్పేసారు.



      జిలేబి

      తొలగించండి
  22. భువిపైనను పుట్టిన ప
    చ్చవలువ ధారి యజితుండు జననికి ముఖపున్
    వివరముఁ జూప తన శై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి వారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణదోషం. "వివరమ్ముఁ జూపఁ దన శై..." అనండి.

      తొలగించండి
  23. కవనంబందునమేటియాసుమతిశ్రీకారంబుచుట్టెన్సుమా
    యవనిన్బుట్టినగొందరాధములుసాహంకారులైబల్కెశై
    శవమం దా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్"
    శవమందాశశికాంతులన్గనుటయాషామాషియేసామిలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'అధములు... బల్కె' వచనాంతర మున్నది. సా(స్వా)మి + ఇలన్ = సా(స్వా)మి యిలన్ అని యడాగమం వస్తుంది.

      తొలగించండి
  24. శివమయ మందున బెరిగిన?
    అవమానములందు నలసి నాయువుదరుగన్
    వివరణ లాలోచన”శై
    శవమున శశిలోనిషోడశ కళలగాంచెన్|

    రిప్లయితొలగించండి
  25. భువిపై చక్రి జనింపగ
    చవిగొనె ముదమునగురువగు సాందీపుడిల
    న్నవిరళముగ వెన్నుని శై
    శవమున శశిలోని షోడశ కళల గాంచెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇలన్ + అవిరళముగ' అన్నపుడు ద్విత్వ నకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. "సాందీపుడు తా। నవిరళముగ" అనవచ్చు.

      తొలగించండి
  26. ఎవరి కి సాయము జేయ క
    నవి వేకి యు లోభియు నగు న క్రమ పరుడై
    యవనిని జావ గ నెటులా
    శవము న శశి లోని షోడశ కళ లు గాంచె న్
    _:_____కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  27. నూతన దేవాలయము లోనికి వెళ్లి జనులు ఆహ్లాదముగా రాళ్ళపైన చెక్కిన శిల్పములను చెక్కలపైన చెక్క బడిన
    భారత కధలను ఇనుప రేకుల తలుపులపై న చంద్ర షోడశ కళలు , అ వృతి వారు ఘనముగా మలచగ గుడి ముందర వేసిన రంగ వల్లులను మొదలగునవి చూచుటకు భక్తుల వేయి కళ్ళు కుడా చాలవని భావన

    హరి దశ రూపము ల్నాహ్లాదముగ రాళ్ళపై నొక్కడు నిలుప పరవ శించె
    గ జనులు , నొక్కండు ఘనముగ భారత కధలను చెక్కెను క్ష్మాజ ఖండ
    ములపైన, చతురత న్సులువుగ లోహపు వాకిళ్ళ పై పలు వరుసల మల
    చగ పారశవమున శశిలోని షోడశ కళల గాంచెన్ జనుల్ కన్ను లందు


    తేజు వెలుగంగ , వాకిట మోజు పడుచు
    రంగ వల్లులు వేసెను రమణు లెల్ల ,
    వేయి కనులైన చాలవు వేల్పు గుడి
    ప్రాంగణము గాంచ జనులకు పరవశమున




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రూపముల్ + ఆహ్లాదముగ' అన్నపుడు నకార మెందుకు వచ్చింది? అక్కడ "దశరూపము లాహ్లాదముగ" అనవచ్చు కదా!
      'పారశవము' అంటే? 'వేల్పులగుడి' అనండి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
  28. మత్తేభవిక్రీడితము
    వివరించన్ బలరాముడంత వినుచున్వేవేగ వెన్నున్ యశో
    ద విచారించుచు నేలతింటివి మనున్దప్పించుకో జూతువే
    నవలోకించెద నోరువిప్పమనగన్నాశ్చర్యమై వాని శై
    శవమం దా శశిలోని షోడశ కళాసల్లక్షణమ్ముల్గనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జూతువే యవలోకించెద' అనండి. అనగన్ + ఆశ్చర్యమై = అనగ నాశ్చర్యమై... అవుతుంది. అక్కడ ద్విత్వ నకార ప్రయోగాన్ని సాధ్యమైనంత వరకు ప్రయోగించకండి. (పోతన ప్రయోగాలున్నాయని ఇంతకాలం ఉపేక్షించాను. కాని కొందరు పెద్దలు వద్దన్నారు).

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన

      మత్తేభవిక్రీడితము
      వివరించన్ బలరాముడంత వినుచున్వేవేగ వెన్నున్ యశో
      ద విచారించుచు నేలతింటివి మనున్దప్పించుకో జూతువే
      యవలోకించెద నోరువిప్పమని తానచ్చెర్వునన్ వాని శై
      శవమం దా శశిలోని షోడశ కళాసల్లక్షణమ్ముల్గనెన్

      తొలగించండి
  29. రవికుల తిలకుడు రాముం
    డవనిని దాకోరె శశిని నాడుట కొరకై
    యవలోకించుచు తా శై
    శవమున శశిలోని షోడశ కళల గాంచెన్


    2.నవనీతు చోరునోటను
    నవలారత్న మలనాడు నయముగ తానే
    యవలోకించెను తాశై
    శవమున శశిలోని షోడశ కళలన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'నవనీత చోరు' డనండి.

      తొలగించండి
  30. ఈరోజు ఆకాశవాణివారి సమస్య
    తెలుపవలసినది

    రిప్లయితొలగించండి
  31. కారము కన్నులం బడిన కల్గును మోదముమానవాళికిన్

    రిప్లయితొలగించండి
  32. శంకరాభరణం వారి సమస్య

    శవమున శశిలోని షోడశ కళల గాంచెన్!!

    పూరణ

    కం

    నవనీతంబు తినెడి మా
    ధవుని గని మురియు యశోద దర్శించెనులే
    యవలోకించుచు నా శై
    శవమున శశిలోని షోడశ కళల గాంచెన్!!

    హంసగీతి
    25.8.18

    రిప్లయితొలగించండి
  33. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్

    సందర్భము: చంద్రుడు తనలోనే పదహారు కళలుంటా యని లోకంలో మరెక్కడా వుండ వనుకున్నాడు. కృష్ణుడు అవతరించినాడు. భూమికి దిగి వచ్చి చంద్రుడు శిశువుగా వున్న కృష్ణుని చూసి ఆశ్చర్యపోయినాడు. షోడశ కళలూ ఆ పసివానియం దున్నవి మరి!
    ==============================
    నవక మొలుకు షోడశ కళ
    లవి తనయందే వెలుంగు నని శశి దిగినా
    డవనికిఁ ; గనె.. కృష్ణుని శై
    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    25-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి
  34. శివ యంచున్ మదిలోన నా శశిధరున్ చిన్మూర్తినిన్ శంభునిన్
    బవలున్ రేయి స్మరించుచున్ గడపుచున్ వార్ణాసిలో పౌర్ణమి
    న్నవలోకించుచు చంద్రునిన్ మునుగ గంగన్ వింతగా నంత నా
    శవమం దా శశిలోని షోడశ కళాసల్లక్షణమ్ముల్గనెన్.

    రిప్లయితొలగించండి
  35. వారి పద్యాలను పొగిడితే పాదాభివందనం అంటూ, లోపాలను ఎత్తి చూపితే సహించలేని ధూర్తులు కొంత మంది ఉంటారు. వాళ్ళ మాటలను పెడచెవిని పెట్టండి. నిష్కల్మషంగా పవిత్రమైన మనసుతో మీరు సూచించే సవరణలు మాకందరికీ అమోదయోగ్యములు. మీ సూచన సరియైనది కాదు అనితలచినప్పుడు మీరు కవిమిత్రులను మన్నించండి అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. జిహ్వకొక రుచి పుర్రెకొక బుద్ధి అంటారు. మీరు కూడా మానవమాత్రులు. ఆసమయంలో మీ మనస్సు లో కలిగిన స్పందన అకవి పద్యం మీద వ్యక్తం అవుతుంది. ఆదుర్తి సుబ్బారావు లాంటి దర్శకుడు హేమమానిని నువ్వు హీరోయిన్ గా పనికిరావంటే హిందీ సినిమాలలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. పై విషయమును బట్టి దర్శకుని ప్రతిభను బేరీజు వేయలేము కదా. మీ నిష్పక్షపాత వైఖరి శంకరాభరణం బ్లాగులో వ్రాస్తున్న కవి మిత్రులందరికి తెలుసు. మీరు మీ వైఖరి మర్చుకోవద్దు. మీ అంతరాత్మ ప్రబోధమును బట్టి పయనించండి. మేమందరమూ ఎల్లప్పుడూ మీకు వెన్నుదన్నుగా ఉంటాము. యధావిధంగా మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. మీ వైఖరి నచ్చని వాళ్ళను వైదొలగి పొమ్మని సవినయంగా ప్రార్థిస్తున్నాను. నెట్ లో చాలా బ్లాగులు వున్నవి. వెళ్లి అక్కడ వ్రాసుకోవచ్చు. లేకపోతే వాళ్ళే క్రొత్త బ్లాగు పెట్టి నడుపుకోవచ్చు. నిచ్చలంగా కదిలే నీటిపై రాళ్ళను వేయవద్దని మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  36. శివమును వగపును పాపడి

    నవనీతపు మోము నందు నాట్యమ్మాడన్

    నవనవలాడెడి యా శై

    శవమున శశిలోని షోడశ కళలఁ గాంచెన్


    రిప్లయితొలగించండి
  37. మధురవాణి: 👇

    భవరోగమ్మును గాంచలేక బహుధా భాసిల్లు కామాగ్నినిన్
    పవమానమ్మగు యౌవనమ్ము కనులన్ వ్యాప్తమ్ము గావించగా
    శవమౌ కాయము నిందులోన విటుడా సాంగత్యమున్ కోరగా
    శవమందా శశిలోని షోడశ కళా సల్లక్షణమ్ము ల్గనెన్ :)

    రిప్లయితొలగించండి