28, ఆగస్టు 2018, మంగళవారం

సమస్య - 2773 (పోతన కావ్యమున...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పోతన కావ్యమ్మున రసపోషణ లేదే"
(లేదా...)
"పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో"

71 కామెంట్‌లు:


  1. ఓ తరుణి జిలేబీ ! యా
    పోతన కావ్యమ్మున రసపోషణ, లేదే
    మీ తరహా పద్యంబుల
    లో? తరమై వ్రాయరాదె లోకము మెచ్చన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి



  2. పోతన కావ్యమందు రస పోషణ, సుంతయుఁ గానరా దయో
    మీతర హా పదమ్ముల సుమీ! విను మమ్మ జి లేబి పద్యముల్
    కోతలు కావు నీదు పలుకుల్ మది తాకవలెన్ జనాళి హా
    హా! తమ కమ్ము చెంద వలె హాసిక పొందవ లెన్ సదా సఖీ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. శీతల పానీ యమువలె
    నూతన ముగనుండు నంట నోటికి రుచిగన్
    చేతనము లేక చదివిన
    పోతన కావ్యమ్మున రసపోషణ లేదే

    రిప్లయితొలగించండి
  4. జాతికి మార్గము జూపుచు
    ఖ్యాతిఁ గలిగినట్టి మేటి గ్రంథమ్మదియే
    యేతీరుగ పొగడ వశము
    పోతన కావ్యమ్మున రస పోషణ లేదే.

    రిప్లయితొలగించండి
  5. కోతలు కోయువా రలట కోరిన రీతిగ వ్రాసుకొం దురే
    ప్రీతిగ మార్పు జేయుచును భేషని పించుచు మభ్య బెట్టగా
    పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో
    హేతువు జూపుచున్ మిగుల హేళన జేయుదు రాత్మవం చనన్

    రిప్లయితొలగించండి


  6. ఖాతరు జేయ నేల ములు గర్రన ద్రోలెద వారి నెల్లరిన్ !
    కీతపు మాట లాడు బుచికీలకు గౌరవ మీయ నేలన
    బ్బా!తవణించుచున్, శ్రమము పాటిగ చేయగ, రేపు లేక మా
    పో,తన కావ్యమందు రస పోషణ సుంతయుఁ గానరా దయో ?

    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. చూతము తీసుక రమ్మని
    యాతనితో బల్కి చదివి యాపయి జనకుం
    డాతనయు జూచి యిట్లనె
    పోతన! కావ్యమ్మున రసపోషణ లేదే!

    రిప్లయితొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    చేతకు యూ(నూ)తము భక్తియ
    భూతలమున వేరు రసముపుణ్యప్రదమే?
    కూతల గూయకుమో సఖ
    "పోతన కావ్యమ్మున రస పోషణ లేదే"

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    చేతన కొంతగా మనగ జేయగవచ్చును కావ్య సంచయం
    బే తన యత్నమై జెలగ బిట్టుగ:కొంచెము పూర్వ పుణ్యమై
    వ్రాత ఫలించగావలయు,వచ్చియురానటువంటి యూహకౌ
    పోత న కావ్యమందు రసపోషణ సుంతయు గానరాదయో!

    రిప్లయితొలగించండి
  10. కోతలు కోయు భంగి మదిఁ గోరిన యట్లుగఁ' గారుకూత'లౌ

    వ్రాతల సంగతమ్ము లవి వ్రాసె నొకండు కవిత్వమంచు , నా

    రీతుల లంకృతధ్వనివరిష్ఠము గానివ వెట్లు సొంపొ? యిం

    పో? తనకావ్యమందు రసపోషణ సుంతయు కానరాదయో!.

    కంజర్ల రామాచార్య.







    రిప్లయితొలగించండి
  11. (ఆత్మస్తుతిపరాయణుడైన ఒక కవిబ్రువుని గురించి)

    వాతలు పెట్టువార లెట వానికి గన్పడకుంట ,నెవ్వరో
    నేతల నాశ్రయించి నుడినేర్పున పోతన యంతవానిగా
    గోతల గోయుచున్ దనను గొప్పగ దల్చెడి యాయసత్యపుం
    బోతన కావ్యమందు రసపోషణ సుంతయు గానరరాదయో!

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    ఘన యోగంబన నకటా
    గనడే నా వాజపేయి గదిలో దాగెన్
    మనసిచ్చిన నది యగునా?
    "హనుమంతునిపెండ్లి," "యాడి రార్గురు కాంతల్"(".."ల లోనివి ఊహా జనకమైన సామ్యములు.)

    రిప్లయితొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    ఘనయుద్ధంబన కార్గిలున్ గడచిరాన్ గాంచంగ వే దౌడకున్
    మనె నా గుండున నైన గాయము బలే మచ్చై విశేషంబునై
    జన నా యోధుని పెళ్ళిచూపులనగా,"సౌభాగ్యమే నా"దనన్
    వినరే యూహల "నెంచు న"న్ననుచు వే నిత్యంపు మోహమ్మునన్
    "హనుమంతుం"దగ బెండ్లియాడిరట తామయ్యార్గురౌ కాంతలే!

    రిప్లయితొలగించండి
  14. గీతను సత్యము లేదే?
    చేతము నలరించు శక్తి శ్రీహరి కాదే?
    యీతను వాతని దేగా!
    పోతన కావ్యమ్మున రసపోషణ లేదే?

    రిప్లయితొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2773
    సమస్య :: పోతన కావ్య మందు రసపోషణ సుంతయుఁ గానరాదయో.
    పోతన మహాకవి యొక్క భాగవతంలో రసపోషణ అనేది కొద్దిగా కూడా కనిపించదు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
    సందర్భం :: ‘’పోతన కవిని నేనే’’ అని ఆత్మస్తుతి చేసికొంటూ పరనింద చేస్తూ ఒక కుకవి ఈ తరంలోని వాడు ఒక పుస్తకాన్ని వ్రాసి ఆహా నా కావ్యం ఎంత మధురంగా ఉంది. ఇది మందార మకరందం లాగా ఎంత తీపో ఎంత సొంపో అని తన కవిత్వాన్ని గుఱించి పొగడుకొంటూ ఉన్నాడు. ఐతే అది రసహీనమైన కావ్యమని తన కావ్యంలో రసపోషణ కొద్దిగా కూడా కనిపించదు అని అతడు తెలిసికొనలేక పోతున్నాడు అని విశదీకరించే సందర్భం.

    పోతన నేనె యన్ కుకవి పుస్తక మొక్కటి వ్రాసె గర్వియై,
    యీ తర మందు నెంచ రసహీన మదే, నుతియించు నిట్టు లా
    కైతను కాకి పిల్ల యన కాకికి ముద్దగు నట్టు ‘’లెంత సొం
    పో’’ - తన కావ్య మందు రసపోషణ సుంతయుఁ గానరాదయో.
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (28-8-2018)

    రిప్లయితొలగించండి
  16. రోతను కాంచము వెదికిన
    పోతన కావ్యమ్మున, రసపోషణ లేదే
    చేతమునను స్వార్థమెదిగి
    నీతినివిడనాడి వ్రాయు నీచ కవితలన్

    రిప్లయితొలగించండి
  17. కోతలు కోయుచు కవినని
    కైతలు వ్రాయగ రుచిపచి గానని సరళిన్
    నూతన ధోరణులందున
    పోతన కావ్యమ్మున రసపోషణ లేదే?!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. “కోతలు కోయుచు కవులని “ గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
    2. చేతన మార్ద్రతన్ గరుగ జేయును సొంపలరంగ వ్రాయగా
      పోతన కావ్యమందు రసపోషణ; యెంతయు గానరాదకో
      చేత నసంగతమ్ము; కృతి సేయగ నర్పణ రామచంద్రుకే
      జోతలు జేయగా జనులు జూపెను చక్కని భక్తిమార్గమున్!

      తొలగించండి
  18. డా.పిట్టా సత్యనారాయణ
    కట్టు ను గట్టియన్నలను గావుమటంటిమి లేమలెల్ల మీ
    పట్టుననుండు కన్నియల భావము దెల్యక మధ్య వీథినిన్
    గుట్టుగ హేయమున్ బొలయ గూడియు చంపగనేల?నాడు యే
    గట్టుకు కట్టమే యభయ కంకణమున్నబలన్ శ పింతువే?!
    ఇట్టగు నీదు చెల్లెలికి నేమది శాపమటంచు నెంచవే
    వెట్టిదె ఒ(యొ)ట్టుబెట్టుకొన భీషణ దీక్షకు లెండు నిండుగాన్!!

    రిప్లయితొలగించండి
  19. వ్రాతు ప్రబంధమంచు, తను పండితపుత్రుడనంచు తాతము
    త్తాతలు పండితోత్తములు తానొక గొప్పకవీశ్వరుండనిన్
    కోతలుకోసివ్రాసినది కుత్సిత కావ్యమె యొట్టి వ్యర్థమే
    పో! తన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో
    (చిరు ప్రయత్నం)

    రిప్లయితొలగించండి
  20. మైలవరపు వారి పూరణ

    సమస్యాపూరణం...

    "పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరాదయో" !!

    ప్రీతికరమ్ము యాదవవరిష్ఠుని కృష్ణుని దివ్యగాధ , యీ
    జాతికి జీవనౌషధము , శాశ్వతమార్గనిదేశకమ్ము ., ని...
    ర్హేతుకవాదనాలఘిమనిట్టులు పల్కగ సత్యదూరమౌ !
    "పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరాదయో" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవపాదంలో... 🙏🙏

      ని...
      ర్హేతుకవాదనాలఘుతనిట్టులు పల్కగ సత్యదూరమౌ !

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. పూత పురాణమ్మౌనది
      పాతకహరణమ్మునైన భాగవత కథా
      రీతిని బరికించినచో
      పోతన కావ్యమ్మున రసపోషణ లేదే ????

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
  21. నూతన కావ్యము నాదిది
    ప్రీతిగ పరిశీలన మున వివరించు మనన్
    కైతలు చదివి యు పలికెను
    పో ; తన కావ్యము న రస పోషణ లేదే !
    ____:__కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  22. నూతన కావ్యము నాదిది
    ప్రీతిగ పరిశీలన మున వివరించు మనన్
    కైతలు చదివి యు పలికెను
    పో ; తన కావ్యము న రస పోషణ లేదే !
    ____:__కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  23. ఒక వర్ధమాన కవి ఆలోచన,ఆవేదన

    ఖ్యాతిని పొందుటెట్లు?పలు కాన్కల,మెప్పుల గెల్చుటెట్లు?సం
    ప్రీతిని గొప్ప శాలువలు,వేలకు వేలుగ డబ్బు ,సంపదల్,
    శ్రోతల మెప్పులెట్లు? సరిఁజూచితి తప్పుల లెక్క లేని టై
    పో,-తన కావ్య మందు రస పౌషణ సుంతయు కానరాదయో,?!!!

    రిప్లయితొలగించండి
  24. చేతగు నాకని యొక్కడు
    ప్రీతిగ నొక గాధ పద్య ప్రేరణ తోడన్
    రీతిగ గణముల గూర్చెను
    పో,తన కావ్యమ్మున రసపోషణ లేదే!

    రిప్లయితొలగించండి
  25. ఖ్యాతీ! నాకేల? వలదు
    "పో,తన కావ్యమ్మున రసపోషణ లేదే
    నా తప్పు సైపవమ్మ స
    నాతని యనుచున్ విముఖత న బలికె నొకడున్

    తన కావ్యములలో లయ, రస పోషణ లేవని పండితులచే అవమానము పొంది నొకడు విరక్తి తో సరస్వతి దేవితో పలికిన మాటలు



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. సీసమొస్తుందను కున్నా కందంతో సర్దేసారు :)


      జిలేబి

      తొలగించండి
    2. కంద రసము సీసా లో పోయటానికి కుదరలేదు తల్లి

      తొలగించండి
  26. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ద్యోతించును భక్తి రసము
    పోతన కావ్యమ్మున; రసపోషణ లేదే
    రీతిగ భావము చాటని
    కైతలు పల్కు నవకవుల కావ్యములందున్?

    రిప్లయితొలగించండి
  27. చూత ఫలమ్ము లోని రుచి జుర్రిన యట్లుగ తోచు నాకు మా
    *పోతన కావ్యమందు రసపోషణ!* సుంతయుఁ గానరా దయో
    ఈతర మందు కావ్యముల *హే!హరి!నిన్ నుతియించు వ్రాతలే*
    *వ్రాతలు;* వ్రాతలే హరిని వ్రాయని వ్రాతలు పిచ్చి గీతలౌ!

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  28. కాతరములేకపలుకకు
    పోతనకావ్యమ్మునరసపోషణలేదే
    పోతనకావ్యముజదువుము
    నూతనమగురసముతోడనోరూరించున్

    రిప్లయితొలగించండి
  29. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    ======================
    పోతన కావ్యమందు రసపోషణ
    సుంతయు గానరాదయో
    ======================
    సహజకవి, రామభక్తి
    పరాయణుడు, భాగవతమును
    ఆంధ్రీకరించి మనకందించిన
    మహానుభావుడు అయిన పోతన
    కవిత్వంలో రసపోషణ ఎంత
    మాత్రం లేదనుటలో అసంబద్దతె
    సమస్య
    =======================
    సమస్యా పూరణము - 241
    =======================

    అప్పకవి ఒప్పని ప్రామాణికత
    రామభక్తిగ పరాయణత
    భూషణమె కవన పాండిత్యత
    రసమున ముంచి తేల్చు చతురత
    ఏరులై పారినది భక్తి
    సహజకవి పోతన కావ్యమందు
    రసపోషణ సుంతయు గానరాదయో
    వెతుకగ నేటి కపులందు

    ====##$##====

    పెద్దగా చదవని సహజకవి పోతన, ఇతని
    పద్యములందు అక్కడక్కడా దొర్లిన కొన్ని
    ఛందోబద్ద తప్పుల రీత్యా అప్పకవి లాంటి
    లాక్షణికులు ఇతని కవిత్వమునకు ప్రామాణి
    కతను ఇవ్వక పోయిననేమి, ప్రజల నాల్కల
    పై పోతన పద్యములు నర్తించినంత కాలం
    పోతన మనపాలిట సహజకవి, మహాకవి.

    పోతన తన భాగవతంలో పోషించినంతగా
    రసపోషణ కవులుగా చలామణి అయ్యే
    నేటి కపుల(కోతుల)యందు ఎంత మాత్రం
    కనిపించదని భావము.

    యజుర్వేద అంతర్గత ఈశావ్యాసోపనిషత్తు
    లోని 5/18 వ మంత్రమునకు సరిపోలు
    పోతన గారి అమృత రస గుళిక

    " ఇందుగలడందు లేడని
    సందేహము వలదు చక్రి సర్వోపగతుం
    డెందెందు వెదకి జూచిన
    నందందే గలడు దానవాగ్రణి వింటే "

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  30. రోత కలిగించు రీతుల
    పోతన కావ్యమ్మున రసపోషణ లేదే!
    ప్రీతిగ భాగవతమిలను
    చైతన్య మిడుచు బ్రతుకున సందడి చేయున్!




    రిప్లయితొలగించండి
  31. డా.పిట్టా సత్యనారాయణ
    *వరమన నేమిచేయనిదె వచ్చనకమ్మ వరాల లక్ష్మి మీ
    తరఫున చేర*మైమరచి దండిగ పూజల నాచరించగా
    వరలు ప్రభుత్వ సాయముల వాల*కమే; నిజ స్వావలంబన
    మ్మిరవుగ కర్మపూజగనుమీదటి లక్ష్మియె లక్ష్మి*యీ క్షితిన్!

    రిప్లయితొలగించండి
  32. పోతనకావ్యమందురసపోషణసుంతయుగానరాదయో
    యీతరహావచింపగనునేమయెశారద!చెప్పుమాయీటన్
    బోతనకావ్యమున్జదువభూరిగగల్గునుభక్తిభావముల్
    జోతలువేలుగానిడుదుసూమనబమ్మెరపోతనాఖ్యుకున్

    రిప్లయితొలగించండి
  33. నీతిని వీడినవాడనె
    జాతికి జాగృతినిమాన్పు జడతత్వమునన్
    వ్రాతలు జదివియు తనలో
    పోతనకావ్యమ్ము రసపోషణలేదే? (అవినీతిపోషణ)

    రిప్లయితొలగించండి
  34. ఆతతభక్తిభావసముదంచితనిత్యనవత్వవర్ణనీ

    యాతిశయస్రవద్రసవదర్థసమర్థపదాన్వితమ్మునౌ

    పోతనకావ్యమందు రసపోషణ ; సుంతయు కానరాదయో

    చేతము రంజిలం, దగిన శ్రేష్ఠకవిత్వములీ దినమ్ములన్.

    కంజర్ల రామాచార్య.



    రిప్లయితొలగించండి
  35. ఖ్యాతిని గల్గినట్టి పలు కావ్యము లెన్నియొ వ్రాసినట్టి నే
    పోతన కంటె మేటినని మూర్ఖుడు చెప్పగ ప్రాజ్ఞుడే యనె
    న్నాతడు వ్రాసినట్టి కృతు లన్నియు గాంచుచు, నెంతజెప్పినన్
    పో! తన కావ్యమందు రస పోషణ సుంతయు గానరాదయో....

    రిప్లయితొలగించండి
  36. వీత భయావేశ యుత మ
    హాతత దర్పవిలసిత మహాకవి యౌనా
    యీతఁడు విద్యలయం దెను
    పో తన కావ్యమ్మున రసపోషణ లేదే!

    [ఎనుపోతు+ అన = ఎనుపోతన]


    చేతల యందు టెక్కు విలసిల్లఁగ ఠీవిగ నిల్చి సంశయా
    పేతము సేయఁ దాన యొక పెద్ద కవీశ్వరుఁ డంచుఁ బల్కగం
    జూత మటంచు నే వెదకి చూచిన సాంతము వింత యిస్సిరో
    పో! తన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. .తేనె లొలికె గురువర్యా నమస్కారం

      తొలగించండి
    2. సూర్య కుమార్ గారు నమస్సులు. ధన్యవాదములు. నేటి సమస్య కష్ట తరముగానే యున్నది.

      తొలగించండి
  37. రెండవపాదం చివరన
    చెప్పుమా యిటన్
    అనిచదువప్రార్ధన

    రిప్లయితొలగించండి
  38. ...............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య🤷‍♀....................
    పోతన కావ్యమందు రస
    పోషణ సుంతయుఁ గానరా దయో

    సందర్భము: కొందరు కవిత్వమంటే అల్లాటప్పా వ్యవహార మనుకుంటారు. అతి సులభంగా పురమాయిస్తారు.
    నాలాంటి మహాకవి యొకడు కొత్తగా ఒక కావ్యాన్ని వ్రాసి తీసుకొని వెళ్ళి పోతనకు చూపించి ఇలా అంటున్నాడు..
    "వచ్చీ రాక వ్రాశాను నాకు తోచిం దేదో!అలంకారాలూ అవీ లే వనబోకు. (ఇవాళ నీకు తీరకున్నా) రేపైనా కొంచెం ఓపిక తెచ్చుకొని దిద్దిపెట్టు. అట్లే అవేవో చేరిస్తే సరి! ఎలా చేరుస్తావో నాకైతే తెలీదు.
    అన్నట్టు పోతన్నా! కావ్యంలో రసం కూడ లేనట్టే వుంది. (అది కూడ చేరిస్తే సరి! లే దనకుండా..)"
    (నాకు తోచిం దేదో నేను వ్రాశాను. నీకు వచ్చిం దేదో నీవు అందులో చేరిస్తే సరి! అనే బాబతు కవు లున్నారు జాగ్రత్త!)
    ==============================
    "నూతన కావ్య మి ద్దెటులనో
    రచియించితి వచ్చిరాక నే
    ప్రీతిగ నాకుఁ దోచినది..
    లే వనబోకు మలంకృతుల్ మ రే
    రీతిగఁ జేర్తువో యెఱుగ...
    రే పిక నోపిక దిద్దిపెట్టుమా!
    పోతన! కావ్యమందు రస
    పోషణ సుంతయుఁ గానరా దయో!"

    ✒~ డా. వెలుదండ సత్య నారాయణ
    28-8-18
    """""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

    రిప్లయితొలగించండి


  39. ఏతంబెత్తు వివిధముల
    పోతన కావ్యమ్మున రసపోషణ, లేదే
    మోతాదు మించు పదములు
    జాతము తో వచ్చినట్టి సాంకవముగదా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  40. కందం
    వ్రాతన్ జదువగ లేకను
    యాతన పడి చదువనైన నర్థముఁ దెలియన్
    చేతనె గాక యిటులనరె
    "పోతన కావ్యమ్మున రసపోషణ లేదే"

    ఉత్పలమాల
    పూత చరిత్రు గాథలను పోతన భాగవతమ్ము జేయఁగన్
    జాతికి కావ్యమై నవరసమ్ములఁ జిందఁగ నాలకించినన్
    బ్రీతికరమ్ముగన్ జదువ విందగు, మూర్ఖజనాళి దృక్కులన్
    "పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో"

    రిప్లయితొలగించండి
  41. 28, ఆగస్టు 2018, మంగళవారం శంకరాభరణం వారి
    సమస్య .

    *"పోతన కావ్యమ్మున రసపోషణ లేదే"*

    పూరణ

    చేతన లేకయె మొదలిడ
    నూతన కావ్యము పదములు నోట పలుకునా
    చూత ఫల రసము త్రాగిన
    *"పో తన కావ్యమ్మున రసపోషణ లేదే"*

    హంసగీతి
    28.8.18

    రిప్లయితొలగించండి
  42. కోతలు కోయుచు నొక్కడు
    నూతనముగ వ్రాసెదననినోటితొ యనుచున్
    వ్రాతల లో నెటు చూడను
    పో,తనకావ్యమ్మున రసపోషణ లేదే.

    రిప్లయితొలగించండి
  43. నూతన పాండితి ప్రియుడై

    కోతలు కోయుచు విరిసెడి కోలాటమునన్

    వేతన కోవిదుడనియెను:

    "పోతన కావ్యమున రసపోషణ లేదే!"

    రిప్లయితొలగించండి
  44. వేతన భత్యమందునను వేడుక సుంతయు కానరాదయో

    నేతల చేతలందునను నేరము సుంతయు కానరాదయో

    జాతక చక్రమందునను చంద్రుడు సుంతయు కానరాడయో...

    పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరాదయో!

    రిప్లయితొలగించండి
  45. నీతులు జెప్పుచున్ విరివి నిందలు మోపుచు సాంప్రదాయతన్
    కోతలు కోయుచున్ మిగుల గొప్పలు జెప్పుచు నాధునీకతన్
    యాతన ఛందసంచు చిరు యత్నము జేయని డింభకుండనెన్:👇
    "పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరా దయో"

    రిప్లయితొలగించండి