26, ఆగస్టు 2018, ఆదివారం

నిషిద్ధాక్షరి - 45


కవిమిత్రులారా,
అంశము - రక్షాబంధనోత్సవముపై పద్యము
నిషిద్ధము - 'ర'కారము (రకార సంయుక్తము కూడ)
ఛందస్సు - మీ ఇష్టము.

98 కామెంట్‌లు:

  1. పగలనుమాన్పెడిపండుగ!
    తగువిధననుబంధ మన్న దలచెడిమలపున్
    నగుపడు చేతికిగట్టిన
    మగువల కంకణమెజూడ?మహిమాన్వితమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "తగు విధి ... మలపే। యగుపడు.." ఆనండి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మైలవరపు వారి పూరణ

      కవిమిత్రులారా,
      అంశము - రక్షాబంధనోత్సవముపై పద్యము
      నిషిద్ధము - 'ర'కారము (రకార సంయుక్తము కూడ)
      ఛందస్సు - మీ ఇష్టము.

      "సకలభాగ్యదమిది శుభసాధకమ్ము
      మమతలను పెంచు , గలతల మాన్చి కాచు ,
      పట్టుమా చెయ్యి కట్టెద బంధనమ్ము
      నన్న ! "యన కానుకలనిడెనన్న మెచ్చి !!

      మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

      తొలగించండి
    2. మురళీకృష్ణ గారి పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  3. అక్క - తమ్ముడు ; అన్నయు ననుగుచెల్లి ;
    చెప్పలేనంత మక్కువ జేసికొనెడి
    పండుగ కనగ కన్నులపండుగౌను ;
    బంధనమ్మిది మమతానుబంధమిద్ది.

    రిప్లయితొలగించండి
  4. మిత్రులందఱకు రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు!

    [ఒక సోదరి తన సోదరునకు రక్ష కట్టెదనని తెలుపు సందర్భము]

    "ఎట్టి కష్టాలు నీ పట్టు నెసఁగకుండఁ
    గావ వలెనంచుఁ గట్టెదఁ గాన చేయిఁ
    బట్టు తోఁబుట్టు సుమ్నంపు బంధ మిపుడు,
    యుగ యుగములుగ మన బంధ మొలయుటకయి!"
    [సుమ్నంపు బంధము = రక్షాబంధము]

    రిప్లయితొలగించండి
  5. తోడుగ బుట్టిన తమతమ
    యాడుపడుచులను జగతిని యాదుకొనుటకై
    వేడుక గావచ్చెనుగా
    నేడే యీ పండుగ మది నిండగ నహహా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జగతిని నాదుకొనుటకై' అనండి.

      తొలగించండి
  6. తే: చెల్లికట్టునన్నయ్యకు చేయమేలు
    బంధనము చేతి మణికట్టు పైన నెమ్మి
    కాంచు జీవితాంతము తగు కాపు గడను
    సహజుల లలిఁ జూపు నిదియె చక్కగాను

    రిప్లయితొలగించండి


  7. కట్టెద చేతికి యంశువు
    తట్టపు సమయముల తోలి తంకములన్ తో
    బుట్టువు గాచేయూతను
    చట్టని కలిపెద జిలేబి సహము గొనకొనన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చేతికి నంశువు' అని ఉండాలనుకుంటాను!

      తొలగించండి
  8. బంధ ము ల బెంచి నింపు ను వలపు తలపు
    లన్న దమ్ములు చెల్లెళ్ళ కండ దండ
    నిలిచి కాపాడ దృఢమైన నిశ్చయం పు
    పండుగ గ నేడు దేశంపు భాగ్య మయ్యె
    ____:___కరణం రాజేశ్వర రావు

    రిప్లయితొలగించండి
  9. అన్నదమ్ముల క్షేమమ్ము లెదను దల్చి

    ఎలమిఁ దోబుట్టు వొడికమ్ము లెసగఁ బుడమి

    " నవనబంధన " మీపూట లతివ లట్లు

    కట్ట నొప్పెను దోడును గట్టి పడగ
    ( అవనబంధనము రక్షాబంధనము )

    కంజర్ల రామాచార్య.



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రామాచార్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పాదంలో యతి తప్పింది.
      "అన్నదమ్ముల క్షేమమ్ము నాత్మఁ దలఁచి" అంటే సరి!
      (యతిదోషాన్ని తెలియజేసిన గుండు వారికి ధన్యవాదాలతో...)

      తొలగించండి
    3. అన్నదమ్ముల క్షేమమ్ము లాత్మఁ దల్చి

      ఎలమిఁ దోబుట్టు వొడికమ్ము లెసగఁ బుడమి

      " నవనబంధన " మీపూట లతివ లట్లు

      కట్ట నొప్పెను దోడును గట్టి పడగ
      ( అవనబంధనము రక్షాబంధనము )

      కంజర్ల రామాచార్య.



      తొలగించండి
  10. మమత బెంచును బంద్ధమ్ము మాయ నీక
    అక్క చెల్లెళ్ళ కలయిక హాయి నిడగ
    అన్న దమ్ముల కానుక లందు కొనుచు
    బంధ మునునిల్పు నెదకుసు గంధ మిదియె

    రిప్లయితొలగించండి
  11. కవి పండితులు
    శ్రీ కంది శంకరయ్య గారి సమస్య
    =======================
    "ర" కారము అక్షరముగా గాని
    సంయుక్తాక్షరముగా గాని రాకుండు
    నటుల రక్షాబంధనోత్సవ వర్ణన
    చేయవలెను
    ========================
    నిషిద్దాక్షరి - 4
    ===========

    చెట్టుకు కట్టు పుట్టకు కట్టు
    గుట్టకు కట్టు మట్టికి కట్టు
    చేనుకు కట్టు చెల్కకు కట్టు
    చెఱువుకు కట్టు కుంటకు కట్టు
    ఆకుకు కట్టు అలముకు కట్టు
    నీటికి కట్టు నింగికి కట్టు
    కాపాడుటకు ఒట్టది పెట్టు
    అభయ దానపు తాడది చుట్టు

    ====##$##====

    నిన్నటి అబల కాదు మహిళ నేడామె
    సబల, చదువుకుని ఉద్యోగం చేస్తూ తనని
    తాను పోషించుకోవటమే కాదు, ఇతరులను
    కూడా పోషిస్తున్నది. అయినను రక్షణగ తల్లి
    దండ్రులు,అన్నా తమ్ముళ్ళే కాదు పటిష్టమైన
    ఈ క్రింది చట్టాలున్నాయి

    ఈవ్ టీజింగ్ (2011), నిర్భయ(2013),
    వరకట్న నిరోధక(1961),గృహహింస(2005)
    Human trafficking Act(2014), Child
    Marriage Act (2006),Indian Divorce
    Act (1969), Sexual Harassment Act
    (2013), National Commission for
    Women(1990 ),Equal Remuneration
    Act (1976 )

    ఐనను సాంప్రదాయికతను కాదనక
    మనుషులుగా మనమధ్య రక్షాబంధనోత్సవ
    మును జరుపుకుంటూనే ప్రకృతి రక్షణకై
    పునరంకితమౌతు మన చుట్టూ ఉన్న చెట్టు
    గుట్టలకు రక్షా రేకులను తొడగాలని భావము

    ( మాత్రా గణనము - అంత్య ప్రాస )
    ---- ఇట్టె రమేష్
    ( శుభోదయం )

    రిప్లయితొలగించండి
  12. తోబుట్టువు చేతికి మమ
    తాబంధపు కంకణమ్ము దాల్చెడు దినమై
    వైభవ మొలికెడు పండుగ
    గా భువి లో వాసిగాంచె కాదన గలమా?

    రిప్లయితొలగించండి
  13. నిన్నుకాపాడునిదియన్న నిత్యమనుచు
    కంకణమునుఁ జేతికి చెల్లి కట్ట, నీకు
    కష్టమేది కలుగకుండ కాతుననుచు
    నన్న పలికెడి యద్భుతమైనదినము

    రిప్లయితొలగించండి
  14. గట్టిగ బంధము బలపడ
    గట్టగ కంకణము చెల్లి గాఢపు చెలిమిన్
    గట్టిన చేతిని నెపుడున్
    వట్టిగ బోనీక యన్న బంచును కాన్కల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిన్నటి పూరణ:
      నవనీత చోరు డక్కజ
      మవగా రక్కసుల దునుమ మాతయె ప్రేమన్
      స్తవనీయంబగు దన శై
      శవమున శశిలోని షోడశ కళల గాంచెన్!

      తొలగించండి
    2. సీతాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'అవగా' అన్న ప్రయోగం సాధువు కాదనుకుంటాను.

      తొలగించండి
    3. ధన్యవాదములు గురుదేవా! సవరిస్తాను!🙏🙏🙏

      తొలగించండి
    4. నవనీత చోరు డసురుల
      నవలీలగ జంప దల్లి యానందముగన్
      స్తవనీయంబగు దన శై
      శవమున శశిలోని షోడశ కళల గాంచెన్

      తొలగించండి
    5. దల్లి నాశ్చర్యమునన్ గా చదువ ప్రార్ధన!

      తొలగించండి
  15. గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
    నేటి అంశము :: నిషిద్ధాక్షరి
    విషయము :: రక్షాబంధనోత్సవము
    నిషిద్ధము :: ‘ర’ కారము
    (రకార సంయుక్తము కూడా)
    ఛందస్సు :: ఏ ఛందస్సు ఐనా సరే
    సందర్భం :: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి అంటారు. జంద్యాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. రాఖీ పండుగను ప్రస్తుత కాలంలో అన్నాచెల్లెళ్లు అనురాగంతో జరుపుకోవడం విశేషం.
    జనశ్రుతి ని గమనిస్తే పురాణ కాలంలో ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఇంద్రుని భార్య శచీదేవి హరిహరులను పూజించి తన భర్తకు రక్షగా ఒక సూత్రాన్ని కట్టిందని ఆ రక్ష కారణంగా ఇంద్రుడు రాక్షసులపై విజయాన్ని సాధించాడని అంటారు.
    లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్ష కట్టి రసాతలంలో బలికి రక్షగా ఉండిన విష్ణుమూర్తిని విడిపించుకొని వెళ్లింది అని కూడా చెబుతారు.
    యేన బద్ధో బలీ రాజా
    దానవేంద్రో మహాబలః ।
    తేన త్వా మభిబధ్నామి
    రక్షే! మా చల మా చల ।। అనే శ్లోకాన్ని మనం ఈ సందర్భంలో వింటున్నాము కదండీ.
    కాబట్టి మనం రక్షాబంధనాన్ని ఆత్మాయుల చేతికి కట్టుదాం. మనము కూడా కట్టించుకొందాం. అలా చేసి మన మందఱమూ యోగాన్ని క్షేమాన్ని పొందుదాం అని భావిస్తూ రక్షాబంధనోత్సవాన్ని జరుపుకొందాం అని విశదీకరించే సందర్భం.

    బలము జయమ్ము నిచ్చు గుణబంధము చేతికిఁ గట్టగా, శచీ
    లలనయె గట్టె నాథునికి, లాభమునందెను; లక్ష్మి కట్టె నా
    బలికిని, విష్ణువున్ గొనియె భాగ్యము నందెను; నేడు కట్టుడీ
    యిల మన కెల్ల యోగమగు, నీ గుణబంధన మిచ్చు క్షేమమున్.
    (రక్షాబంధన్ కి సంబంధించిన ఈ పద్యంలో ‘’ర’’ అనే అక్షరం లేకపోవడాన్ని గమనించవచ్చు)
    కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (26-8-2018)

    రిప్లయితొలగించండి


  16. ముంబై మే మస్తీ :)


    ముంబై వచ్చితి నిన్ను చూడ ననుజా మోపాదులన్తోలగన్
    జంబాలమ్మిది కాలపక్వతన సాజాత్యంబులన్ తెచ్చెగా
    కంబాలాటల కాలమున్ మది యనీకస్థంబు గావించెనే!
    తంబీ గైకొను నంశువున్ సహమిదే తంకమ్ము బోవన్ సుమా!

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మోహాదులం ద్రోలగన్... అనండి.

      తొలగించండి

    2. ర ‌(సంయుక్తాక్షరము కూడా నిషిద్ధమంటేనూ :)


      ధన్యవాదమ్స్ :)

      జిలేబి

      తొలగించండి
    3. నిజమే. మర్చిపోయాను. మన్నించండి.

      తొలగించండి
  17. ఇల తోబుట్టువు చేతికి
    కలికియె ముదమందు గట్టు కంకణమిదియే
    లలనల కండగ సతతము
    నిలిచెదనని యభయమొసగు నెలతకు తానే.

    రిప్లయితొలగించండి
  18. మాన్యులు శంకరయ్య గారికి నమస్సులు! మీ నిష్పక్షపాత ధోరణి మొదటినుండియు నేనెఱిగినదే! ఎన్నడును పక్షపాతమును ప్రదర్శించని మీరు, ఎవరో ఫోన్‍లో ఏదో అడిగారని మీ దృక్పథాన్ని మార్చుకోనవసరం లేదని నా కనిపిస్తున్నది. "లోకోబిన్న రుచిః" అన్నారు పెద్దలు. ఒకరికి పప్పు రుచిగా అనిపిస్తే, ఇంకొకరికి వంకాయ కూర రుచిగా అనిపించవచ్చును. మరొకరికి మాంసాహారం రుచిగా అనిపించవచ్చును. అంతమాత్రమున అందరికీ ఇవన్నీ రుచిగా నన్నట్లు తోపకపోవచ్చును. ఎవరి రుచి వారిది. మీకు బాగా అనిపించిన భావాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. మీ కద్భుతంగా తోచిన పద్యం మరొకరికి బాగా అనిపించకపోవచ్చును. అది వారి వారి దృక్కోణమును బట్టి, సంస్కారమును బట్టి ఉంటుంది. కాబట్టి మీరు మీ సహజ సిద్ధమైన అభిప్రాయ ప్రకటనను మార్చుకోవలసిన అవసరం లేదని నా కనిపిస్తున్నది. మునుపటి వలెనే అందరి పద్యాలను మీ మనస్సుతో తూకము వేస్తూ మీ అభినందన వాక్యములను తెలుపగలరని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      ధన్యవాదాలు! మిగిలిన కవిమిత్రుల స్పందనను కూడా చూసి నిర్ణయం తీసుకుంటాను.

      తొలగించండి
    2. గురువు గారి పాదపద్మములకు నమస్కారం
      పిల్లిని ష్ అంటే పారిపోతుంది
      పాముకు కర్ర అవసరము
      గుర్రమునకు చెర్నాకోల అవసరము
      ఏనుగుకు అంకుశము అవసరము అన్న విషయములు సర్వ లోక విసిదమే

      మన బ్లాగు లో నా బోటి చిరు కవుల వద్దనుంచి అష్ట దిగ్గజములు లాంటి వారున్నారు

      చిరుకవులకు చిన్న ప్రోత్సాహము చాలు
      దిగ్గజములకు అది చాలదు వారి యొక్క నైపుణ్యం నకు సముచిత రీతిలో మీ వద్దనుంచి స్పందన వాఛనీయము గుర్రమును గాడిదను ఒక గాడిలో కట్ట రాదు వారికిచ్చిన ప్రశంసలు మేము కూడా ఎప్పుడన్నా అందుకోగలమని మా బోటి చిరుతల ఆశ. వారి సాహిత్య మధువును పూర్తి గా ఆస్వాదించాలంటే వారికి సముచితమైన ఉన్నత పీఠము కచ్చితంగా ఇవ్వవలసినదే ఎవరో అన్నారనుకొనుచు మీ నిష్కల్మషమైన నిష్పక్షపాత ధోరణికి తెర వేయ వలదు బ్లాగు మీది మీ నిష్పక్షపాత ధోరణియే బ్లాగుకు ఊపిరి దాని నాప వద్దు శంకరార్య

      తొలగించండి
    3. శంకరకవులకు నమస్కృతులు,

      సహృదయులు మధుసూదన్ గారి అభిప్రాయము
      శతప్రతిశతం బహుజనామోదయోగ్యమైనది కావున
      యథాపూర్వం కొనసాగించమని మనవి.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి

    4. కంది వారు

      దారిని పోయే దానయ్యలు( వాళ్ళెంత ఉస్తాద్ బడేమియాఖాన్లైనా సరే, సూరేకారాలైనా సరే Don't care) చెప్పేదంతా విని మీదైన పంథాలో పద్యాలకు వ్యాఖ్య వేయడం మానకండి.

      మీరు కొన్ని మార్లు అద్భుత మన్నప్పుడు అదే కవివరుల మరో పద్యానికి మనోహరమన్నప్పుడు వ్యత్యాసమున్నదన్న విషయాన్ని సునిశితంగా పరిశీలించి నప్పుడు ఔరా ఇదన్న మాట మనోహరాని‌కి అద్భుతానికి ప్రశస్తానికి వ్యత్యాసం అని‌ దాంతో తలీ ఉంగలీ దబాయీ :)

      కొన్ని సార్లు ( ఒకటో రెండో మార్లు ) నా పేర్పులకు ( తెలుగు బ్లాగర్ల ప్రకారం పైకూలు :)) మీరు మనోహరంగా అన్నప్పుడు వావ్ అని‌ జోష్ పొందిన సందర్భాలు వున్నాయి

      కాబట్టి మీ పంథా మార్చరాదని జిలేబి‌ స్టైల్ లో‌ నో విన్నపం బట్ కట్టడి :)


      చీర్స్
      జిలేబి

      తొలగించండి
    5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  19. శుభముగలిగించునెప్పుడుజూడుమన్న!
    బంధమియ్యదియెప్పుడుబలముగాను
    నుండమనలనుగట్టుదునొండునీకు
    నీదుహస్తమునాకిమ్మునెమ్మితోడ

    రిప్లయితొలగించండి

  20. అన్న చెల్లికిలను నందముగాకట్టు
    బంధమిదియె గనుడు వసుధ యందు
    హస్తమునకు శోభ ననయమ్ము నొసగుచు
    బాసటగుదునంచు బాస చేయు.

    2.తోడబుట్టువు నకు తోషముతో గట్ట
    కానుకొసగు నతడు కాసులెన్నొ
    నందుకొనుచు పంచు నాత్మీయతనెపుడు
    సంతసాన భగిని జగతి యందు.

    3: డా.బల్లూరి ఉమాదేవి.

    ఆ.వె: అన్న దమ్ము లన్న అభిమాన ముండని
    ఆడపడచుజాడ లవనియందు
    నుండవనుట నిజము,నొద్దిక తోతాము
    కలసి యుండు టెపుడు కానవచ్చు.


    4ఆ.వె:నీకు నెపుడు తోడు నేనె యనును చెల్లి
    హస్తమునకు తాను నందముగను
    గొప్ప బంధమనుచు కోమలముగ కట్ట
    సంతసించు నన్న జగతియందు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. ఉమాదేవి గారూ,
      మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కాసులెన్నొ యందుకొనుచు' అనండి.

      తొలగించండి
  21. కపిలుడు బలి మిది నడచిన పిదప బలి
    మనసు పడి నడుగ పొదలె తన సతిని వ
    దలి బలి సదనమున, పతి తనను విడిచి
    నచట మసలగ వెత బడిన జలధిజ వె
    డలెను బలి నిగమమునకు, బలి భుజ దళ
    మున కొక ష్టథుమపు కడియమును పెనచగ
    బలి ముదము బడసి సహజ తలపు నిలుప
    దలచి విడచెనట విధిని , ఫలము బడసె
    బలికి మనుపు ష్టథుమమును కలిమి లలన
    పెనచి, శచి మగడు బలభితునకు నొసగె
    కలిమి ధవుడు జగడమున గెలుపు వలచ,
    శత ముఖుని కది పెనచగ జయము బడసె
    విమతుల సదమదము నిడి సమితమున,ఘ
    నముగ సహజ సహజునకు మమత మదిని
    కలిగి వలన నిడగ మని కయికి మనుపు
    నిడెడు ష్టథుమము పెనచెడు గడుపు దినము
    గదయిది, సతతము శుభముగ మెలగవల
    యు పుడమిని జనులు ముదము నెపుడు బడసి

    రిప్లయితొలగించండి
  22. నా రెండవ పూరణ

    అవనితలమ్మునం దెలమి నాప్యతఁ బెంపున దోడఁబుఁట్టువై

    యవనముఁ దాను జేయునని యాత్మఁ దలంచుచు నక్కజెల్లెలై

    నవలలు , మేలుగల్గునని నమ్మి , యనుంగుల జేయిఁ గట్టగన్

    వ్యవహృతమయ్యె నా " యవనబంధననామము నొప్పి వాడుకన్.

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  23. కవిమిత్రులకు నమస్కృతులు.
    చిత్తూరుకు వెళ్తున్నాను. రేపు మధ్యాహ్నం అక్కడ 'అపర్ణ' గారి అష్టావధానం ఉంది. అది కాగేనే రాత్రికి తిరుపతి చేరుకుంటాను. ఎల్లుండి దైవదర్శనం చేసికొని సాయంత్రం వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుగు ప్రయాణం. బుధవారం నెలవు చేరుకుంటాను. అప్పటి వరకు మీ పూరణలపై స్పందించక పోవచ్చు. దయచేసి పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుభము రేపు ఎదురు కోండి కఠిన ప్రాస సమస్య. రెండు రోజులు నేను డుమ్మా

      తొలగించండి
    2. భయపడకండి. రేపు 'న' అక్షరంతో సుకరప్రాస.

      తొలగించండి

    3. వాద్యారుక్కు నల్లదా సుడసుడ రెండిడ్లీ ఒరు బకెట్
      సాంబార్ ఎడ్తుండు వాంగో - :)


      జిలేబి

      తొలగించండి


    4. రేపు అపర్ణ గారిని రెండిడ్లీ ఒరు బకెట్ సాంబార్ పైన ఆశువు గా పద్యం చెప్ప మనండి కంది వారు :)


      జిలేబి

      తొలగించండి
  24. *ఆ.వె**

    అన్న చెల్లిబంధమానంద మిచ్చేను
    పసిడి చెల్లి కట్టు బంధనమ్ము
    సతము శుభము గల్గి సౌభాగ్యమొసగేను
    సమత మమత లెదిగి సఖ్యతిచ్చు
    ....................✍చక్రి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఇచ్చేను, ఒసగేను అన్నవి వ్యావహారికాలు. ఇచ్చును, ఒసగును అనండి. సఖ్యత + ఇచ్చు అన్నప్పుడు సంధి లేదు. సఖ్యత నిడు.... అనండి.

      తొలగించండి
  25. ఆడపడచుల కాపాడ యన్న దమ్ము
    లవనిలో నేడె గద, తగ నభయ మిచ్చి,
    హ్లాదము నొసంగుచు సతత మాదుకొనగ
    కంకణమ్మిడు పండుగ! శంక యేల?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కాపాడ నన్న దమ్ములు" అనండి.

      తొలగించండి
  26. సహజుని శుభము వేడుచు సహజ యతని
    కయికి పూజచేసిన తాడు కట్ట, నామె
    కష్ట సమయములందున కాపుగాయ
    బాస చేసెడి సహజుల పండుగయిది

    రిప్లయితొలగించండి
  27. గురువర్యులకు నమస్సులు. ఎవఱోఏదో అన్నారని పద్యాల సమీక్ష విషయంలో దయచేసి మీరు మీ మునుపటి పంథాను మార్చుకోకండి.
    ఈ విషయంలో కవిమిత్రులు గుండు మధుసూదన్ గారి కృష్ణ కుమార్ పూసపాటి గారి జిలేబి గారి రామాచార్య కంజర్ల గారల అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  28. బ్లాగుయజమానిమీరలుపరమపురుష!
    సర్వహక్కులుమీకుండుసత్కవివర!
    మీకుతోచినవ్యాఖ్యలుమాకుజేయ
    గోరుచుంటినిమిమ్ములగూర్మితోడ

    రిప్లయితొలగించండి
  29. 4:27 PM
    వారి పద్యాలను పొగిడితే పాదాభివందనం అంటూ, లోపాలను ఎత్తి చూపితే సహించలేని ధూర్తులు కొంత మంది ఉంటారు. వాళ్ళ మాటలను పెడచెవిని పెట్టండి. నిష్కల్మషంగా పవిత్రమైన మనసుతో మీరు సూచించే సవరణలు మాకందరికీ అమోదయోగ్యములు. మీ సూచన సరియైనది కాదు అనితలచినప్పుడు మీరు కవిమిత్రులను మన్నించండి అని చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. జిహ్వకొక రుచి పుర్రెకొక బుద్ధి అంటారు. మీరు కూడా మానవమాత్రులు. ఆసమయంలో మీ మనస్సు లో కలిగిన స్పందన అకవి పద్యం మిద వ్యక్తం అవుతుంది. ఆదుర్తి సుబ్బారావు లాంటి దర్శకుడు హేమమానిని నువ్వు హీరోయిన్ గా పనికిరావంటే హిందీ సినిమాలలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. పై విషయమును బట్టి దర్శకుని ప్రతిభను బేరీజు వేయలేము కదా. మీ నిష్పక్షపాత వైఖరి శంకరాభరణం బ్లాగులో వ్రాస్తున్న కవి మిత్రులందరికి తెలుసు. మీరు మీ వైఖరి మర్చుకోవద్దు. మీ అంతరాత్మ ప్రబోధమును బట్టి పయనించండి. మేమందరమూ ఎల్లప్పుడూ మీకు వెన్నుదన్నుగా ఉంటాము. యధావిధంగా మిఅభిప్రాయాలను వ్యక్తపరచండి. మీ వైఖరి నచ్చని వాళ్ళను వైదొలగి పొమ్మని సవినయంగా ప్రార్థిస్తున్నాను. నెట్ లో చాలా బ్లాగులు వున్నవి. వెళ్లి అక్కడ వ్రాసుకోవచ్చు. లేకపోతే వాళ్ళే క్రొత్త బ్లాగు పెట్టి నడుపుకోవచ్చు. నిచ్చలంగా కదిలే నీటిపై రాళ్ళను వేయవద్దని మనవి చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  30. కందం
    పున్నమియై తోబుట్టువు
    యన్నా తమ్ముళ్లఁ గాచి యాదుకొనన్ నే
    నున్నా నటంచుఁ జేతికిఁ
    బెన్నిధి వలెఁ గంకణంబు వేడుకఁ గట్టున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తోబుట్టువు + అన్నా అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. "తోబుట్టువె యన్నా" అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు.సవరించిన పూరణ:

      కందం
      పున్నమియై తోబుట్టువె
      యన్నా తమ్ముళ్లఁ గాచి యాదుకొనన్ నే
      నున్నా నటంచుఁ జేతికిఁ
      బెన్నిధి వలెఁ గంకణంబు వేడుకఁ గట్టున్

      తొలగించండి
  31. కాపుకట్టు కట్టి గడుసు చెల్లాయికి
    బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టె
    నన్న చెల్లి కూడ నానందపడి పోయి
    కట్టె నన్న చేత గట్టి గాను.

    రిప్లయితొలగించండి
  32. లెక్కించుచు పద్యమ్ముల
    చక్కటి వాఖ్యానమొసఁగు సరళిని వీడన్
    కిక్కుండదు పండితులకు
    దిక్కగునదె సాధకులకుఁ దీరులు మారన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ముక్కుకు సూటిగ జెప్పుడు
      చక్కగ మీ మదిని మాట శంకరవర్యా!
      ఎక్కువ తక్కువ నైనను
      మక్కువతో బ్రహ్మ వలచు... మశకము కరినిన్ :)

      తొలగించండి
  33. గణనీయంబగు స్నేహ భావము సదా కల్యాణ సంపత్తి స
    ద్గుణ సంహత్వపు బెంపు, వీడిన మహా దోషంపు పాపంబు వీ
    క్షణ యోగంబున సత్యమై నిలచు నెక్కాలంబు నందైన నీ
    గుణబంధంబిది యిచ్చు లోకమున నీకున్ శాశ్వతానందముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
      మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
  34. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు మీరందరు మీ సాంత్వన వాక్యాలతో నాకు ధైర్యాన్ని, నైతిక బలాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. ఇక నుండి పూర్వం వలెనే స్పందిస్తూ ఉంటాను.

    రిప్లయితొలగించండి
  35. కవిమిత్రులారా,
    నమస్కృతులు.
    ఈరోజు మీరందరు మీ సాంత్వన వాక్యాలతో నాకు ధైర్యాన్ని, నైతిక బలాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. ఇక నుండి పూర్వం వలెనే స్పందిస్తూ ఉంటాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. పలికిరి సాంత్వనముల మీ
      రు లసితమును గాంచె మది, యురుకుల‌ పరుగులన్
      పలికెద నాదగు రీతిన్
      పలంకగ కవివరులార పద్యములిచటన్


      జేజేలు కందివరులకు

      మిగిలిన కవివరులకు- మనదైన వేదిక మనదిగాన అని కలసికట్టుగ తమ అభిప్రాయముల కరాకండిగ తెలిపినందులకు అభినందనలు




      జిలేబి

      తొలగించండి
  36. అన్నా !కంకణ మిదియే
    నన్నెప్పుడు వీడకుండ నాతోడుగనే
    చెన్నుగ నీవుండవలయు
    కన్నుల వెన్నెలలు నింపి గావగ చెల్లిన్!!!

    రిప్లయితొలగించండి
  37. కాపాడ కల్గిన కవచమై తను వెల్ల వ్యాపించి దీపించ భవ్యముగను
    మన మందు నిల్పఁగ మమతల బంధము భగినీమణుల యందవనపు బుద్ధి
    గృహ మెల్ల నింపఁగ ధృతితోడ ముదమును జ్ఞప్తిగొనఁ గుటుంబ జనులు సతము
    పిల్లలు పెద్దలు భేదమ్ము దలఁపక యాడుచుఁ బాడుచు నవని వెలుఁగ

    నాది కాలము నుండియుఁ బాదుకొనఁగఁ
    జలుపు చుండఁగ నీ పృథ్వి జనులు తమిని
    హస్త పాశము పదిలమ్ము ననయ మీయ
    మనమునఁ దలంచి కట్టుమ మానితముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వరరావు గారూ,
      రేఫ రహితంగా చిన్న కందపద్యం వ్రాయడానికి యత్నించి విఫలుడ నయ్యాను. మీరేమో సీసపద్యమే వ్రాసారు.
      అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
      మా మీదున్న మీ యభిమానము మీచే నట్లు పలికించుచున్నది కాని గురువరేణ్యుల కసాధ్యమా నిషిద్ధ సంగ్రహములు!!!

      తొలగించండి
  38. వచ్చెను జందియ పున్నమి

    తెచ్చెను నా చెల్లినుండి తేకువ నిడుచున్

    ముచ్చట కొలిపెడు సుష్మము

    పుచ్చుకొనుచు కానుకలను పొంకము మించన్!

    రిప్లయితొలగించండి