11, జూన్ 2019, మంగళవారం

సమస్య - 3044 (కుపిత రాముఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె"
(లేదా...)
"కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై"
(మద్దూరి రామమూర్తి గారి వరంగల్ శతావధానంలో 
ఎన్.సిహెచ్. శ్రీనివాస రంగాచార్యులు గారి సమస్య)

36 కామెంట్‌లు:

  1. గు రు మూ ర్తి ఆ చా రి

    """""""""""""""""" """"""""""""""


    గు రు భ్యో న మః ( నిన్నటి పూరణ స్వీకరించ. మ న ని )


    { పరోపకారము చోసినచో చాలు దైవచింతనము చేసినంత
    ..................................................................................

    ఫలితము లభిస్తుంది }
    .....................................



    " చింత హృదంతరాళమున జేర్చకు | కర్తవు కాదు నీవు | దు

    శ్చింతను వీడు , చన్యులకు శ్రేయము గూర్చు | మదే పరాత్పరున్

    చింతన జేసి నంత ఫలశీలనమౌ " నను > వేమనార్యుడే

    చింతన సుంతలేని యతి | సిధ్ధిని బొందె జనుల్ నుతింపగా


    ( చింత = వగపు , ఆలోచన , ఆశ ; ఫలశీలనము =

    ఫలసాధనము ,‌‌ ఫలితము సాధించుట )


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    వీధి భాగవతం:

    వీపు నొప్పిని సైచ లేకట వేరు మార్గము లేకయే
    బాపురేయని మూల్గి తూలుచు భండనమ్మున జేరుచున్
    చాపమెత్తుట చేత గాకయె సంకటమ్మున నవ్వగా
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై :)

    రిప్లయితొలగించండి
  3. చూడ చక్కని జంటపై చోద్యముగను
    నింద వేయుట సరిగాదు నీరజాక్ష
    యేల వచియించితివి చెప్పు మెప్పుడంట
    కుపిత రాముఁడు సీతపైఁ గోలనేసె

    రిప్లయితొలగించండి
  4. జనుల పలుకులు వినినంత సంచ లించ
    లోక మందున యపవాదు లోటు గాదె
    తల్ల డిల్లిన ప్రభువట ధరను మనుట
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె

    రిప్లయితొలగించండి
  5. మత్తకోకిల
    రూపు దాల్చిన జింక వైపుకు రొప్పి బోయెను ప్రేమతో
    శాప ముక్తికి రక్కసుండను చావ గొట్టగ వేగమే
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను ,సీతపై
    దీపి యుండగ కోతినైనను తెచ్చి యిచ్చును రాముడూ !!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    అతివ ప్రాతివత్యమ్ము నీవనగ సరియె?
    పరుల పరుషోక్తి నెంచగ వలెను గాదె
    సుగుణ గుణశీల కిడెనొక చురక మదిని
    కుపిత రాముడు సీతపై కోల నేసె

    రిప్లయితొలగించండి
  7. పాపమెం చకదార నంపగ బాధ నొందుచు కానలన్
    శాపమో యిదిమున్ను జేసిన చాపల త్వపు చేష్టయో
    కాపుకా యగనీకు తోడుగ కానరారు మరెవ్వరూ
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై

    రిప్లయితొలగించండి
  8. ఆ దినముల 'తెలుగుదేశ' మవతరింప
    జేసి యెన్నికలందున జేను బొంది
    మద్యపానమున ననేక మృతుల గాంచి
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె

    రిప్లయితొలగించండి
  9. డా.పిట్టా సత్యనారాయణ
    రూపమదిరా వణుని బోలిన రొక్కమైన పటంబునున్
    శాపమాయెను గీయబోయిన శైలి గాంచినవైనమున్
    జూపు నిసువు విభిన్న రూపము చూలు కగు నష్టంబనన్
    ఏపు గోరి నరణ్యమంపగ నెట్లు జెప్పగ వీలగున్,
    *కోపగించెను రాముడప్పుడు కోల నేసెను సీతపై*
    (ఆధ్యాత్మ రామాయణము,Bhavan's Journal .Article, 1962)

    రిప్లయితొలగించండి
  10. 🙏
    ఇంద్ర సూనుడు కాకాసు రేంద్ర రూప
    మందు తినగను భూసుత మాంస మింత
    కుపిత రాముఁడు కాకిపైఁ గోల, తీపి
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె

    కోల- పత్రం

    రిప్లయితొలగించండి
  11. మైలవరపు వారి పూరణ

    అసంభవం హేమమృగస్య జన్మ
    తథాపి రామో లులుభే మృగాయ !
    ప్రాయస్సమాపన్నవిపత్తి కాలే
    ధియోऽపి పుంసాం మలినా భవన్తి !!


    రూపమే కనకమ్ముగా ధరలోన జింకలు పుట్టునే ?
    ఆపదలు ముంచెత్తువేళల నాశ గల్గును ! దానికై
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను ! సీతపై
    దీపితాతులరక్తి రాముని ధీన్ నశింపగ జేసెడిన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  12. ,రావణు ని జంపి రెవ్వరు రణ ము నందు ?
    నీచుడెవ రి పై మత్తున నింద వేసె ?
    వాలి దును మగ రాము డు వదిలెనె ద్ది ?
    కుపీత రాముడు ; సీత పై ; గోల నే సె

    రిప్లయితొలగించండి


  13. పాలెమున నివసించెను భార్య సీత
    తోడు భర్త సీతాపతి; దోసె వేయ
    రాని కారణముగ కొంత రభస చేయ
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె!


    కృష్ణాతీరము :)

    అన్నప్పా పాలెంలో కత యేమిషోయ్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. బదరి వనమున హాయిగా బవ్వళించి
    ఆట విడుపుగ ముచ్చట లాడు వేళ
    నతివ సరసోక్తులవె పరిహాసమంచు
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె
    (కోల అంటే రేగు పండు అనే భావముతో)

    రిప్లయితొలగించండి
  15. వంచనను మైథిలి నపహరించ ఱేడు
    సీత చిత్రంబు జిత్రించి చింత జేయు
    రావణునిదల్ప రామవిద్రావణమయె
    *"గుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె"*

    రిప్లయితొలగించండి
  16. తాపమోపక తాపసాంగుడు ధారుణీసుత లేమినిన్
    ఓపి మైథిలి చిత్రమేసి రఘూత్తముం డదిజూచుచున్
    బాపమార్ద్రత చిత్తవిభ్రమ బంక్తికంధరు డయ్యినన్
    *"గోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై"*

    రిప్లయితొలగించండి


  17. మాపటేళన తాగి వచ్చెను మాసిపోయిన రుచ్యుడే
    కాపురించన దోసెవేయగ కాస్తతప్పుగ సీతయే
    సాపుజేయన జుట్టుపట్టుచు చాచికొట్టుచు వేడిపై
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  18. (బావ రాము-మరదలు సీతల రాగాలు;సరాగాలు)
    "ఆపలేనిక అత్తకూతుర!
    అందె మ్రోగెను గుండెలో;
    రేపవండ్లవి యెన్ని యేం"డ్లని
    రెచ్చిపోయెడి బావనే
    "తేపతేప కిదేమి యల్లరి?
    తీర"దంచును మొట్టగా;
    కోపగించిన రాము డప్పుడు
    కోల వేసెను సీతపై.
    (రేపవండ్లు-రాత్రింబవండ్లు;తేపతేపకు-మాటిమాటికి;కోల-బెత్తము)

    రిప్లయితొలగించండి
  19. నటన నాట్యము రాదయ నవ్వలేదు
    నాటకంబునిట్లాడిన నాదరించు
    వారెవరు, పొమ్మికయనుచు వాడె పల్కె
    కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె

    రిప్లయితొలగించండి
  20. సంహరించెనురావణుసైన్యమునని
    కుపితరాముడు,సీతపైగోలసేసె
    దననుబెండ్లియాడుమనుచుననిశమాధ
    రణిసుతనురావణుడుభీకరపురవమున

    రిప్లయితొలగించండి
  21. రావణు తునిమె నెవ్వరు రణము నందు?
    కాకి యెవరిపై లంఘించి కాటువేసె?
    వాలిని తునుమ రాముడు వేసె నేమి?
    కుపిత రాముఁడు, సీతపైఁ, గోల నేసె

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. అగ్ని దూకి పునీతగ నంత రాఁగ
      నచట కేతెంచి నట్టి బ్రహ్మాదు లెల్ల
      నుగ్గడించ సత్యం బెల్ల నోర్మి శమిత
      కుపిత రాముఁడు సీతపైఁ గోల నేసె

      [కోల = కౌగిలి; ఏయు = ఉంచు]


      మాపు వెల్గిన చందురుం డటు మాటు సేరెడు మోముతో
      నేపు బల్మిని మించ సింగము నెందు వింటిని మేటియే
      చూపులం బెడ ముల్కి నెక్కిడి సూటి మాటల యాటలో
      కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై

      తొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఉత్త(ర) రామాయణం:

    చీపురీధిని చాకలోళ్ళగు సీత రాములు జంటగా
    కాపురమ్మును చేయుచుండగ ఘాటు ప్రేమను హాయిగా
    మాపటేళను కన్ను గొట్టగ మంగలోడట సీతకున్
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై

    రిప్లయితొలగించండి
  24. కాకి రూపాన నైన్ద్రుడు కాలిఁ దన్న
    రాగ ముప్పొంగ బాధను రమణి దెల్ప
    కుపిత రాముఁడు సీతపైఁ; గోల నేసె
    వాయసమ్మును వేగమే వాయ దరుమ

    రిప్లయితొలగించండి
  25. పాపచింతనలేశమైననుబాడిజేయకనుండుచో
    కోపగించినరాముడప్పుడుకోలసేసెనుసీతపై
    పాపపంకిలమౌజగమ్మునబాపపుణ్యములేవియున్
    గాపురమ్ములుసేయవెన్నడుకామితార్ధప్రదాయినీ!

    రిప్లయితొలగించండి
  26. ఉగ్రుడయ్యెను ఎవ్వరు ఉదధిపైన?
    రావణాసురుడెవరిపైరక్తుడయ్యె?
    రాముడేరీతిగూల్చెనురక్కసులను?
    కుపిత రాముఁడు, సీతపైఁ, గోల నేసె

    రిప్లయితొలగించండి
  27. సరభి నాటక మందున సొగసుగున్న
    సీతవేషాన "సీత" విశేషప్రతిభ
    జూప? మెచ్చనివాడట కోపమందు
    కుపితరాముడు సీతపై గోలనేసె

    రిప్లయితొలగించండి
  28. మిత్రులందఱకు నమస్సులు!

    దాఁపునం గని పైఁడి లేడిని, "దబ్బునం గొని తె" మ్మనన్,
    "నీ పయిం గల నాదు ప్రేమను నే నిరూపణ సేతు, నీ
    వోపుమా!" యని జింక వెంబడ, బుఱ్ఱి బుఱ్ఱునఁ బాఱఁగాఁ,
    గోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను, సీతపై
    నేపుగాఁ గల ప్రేమచే, మరణించు జింకనుఁ బట్టి తేన్!!

    రిప్లయితొలగించండి
  29. చేపకన్నుల సుందరానని సీతవక్షమె గాయమై
    యోపలేక పడంతి యేడ్వగ యోర్మియే నశియింపగా
    కోపగించిన రాముడప్పుడు కోలనేసెను, సీతపై
    పాపకార్యము చేయబూనిన వాయసమ్మును గూల్చగా

    రిప్లయితొలగించండి
  30. [2]

    [అధర్మపరురాలై పాపకృత్యములు చేయు భార్యపై కోల నేసిన యొక భర్తృకృత్యము]

    పాపకృత్యము లెన్నియెన్నియొ భార్య చేయుచు నుండఁగాఁ
    దాప మందియుఁ దిట్టుచున్ "మన ధర్మ మిద్దియ?" యంచుఁ దా
    నేఁపుగాఁ బలుకంగ, నట్టులె యేవపుం బని సేయఁ, దాఁ
    గోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై!

    రిప్లయితొలగించండి

  31. కుపిత రాముడు సీత పై గోలనేసె
    ననుట పాడియు గాదయ్య నవని యందు
    సీత కైవానరములతో చెలిమి చేసి
    నట్టి యేక పత్నీవ్రతు డావిభుండు.


    పాప కర్మము నాచరించిన పాపియౌయసురేంద్రు పై
    కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై"*
    తాపమొందుచు దొంగిలించిన దానవాధము జంటగా
    చాపమెత్తుచు కూల్చె నాతని జానకీపతి క్రుద్ధుడై

    రిప్లయితొలగించండి
  32. శ్రీ పరాత్పరుడైన రాముడు సీతతో కొలువుండగా
    వైపరీత్యము సీతపై నొక వాయసమ్మది వాంఛతో
    రూపమే గని మాంసమంచును రొమ్ము పై తను వ్రాలగా
    *కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను! సీతపై*

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  33. పాపి యొక్కడు రామరాజ్యము పాప పంకిల మంచుతాఁ
    నోపజాలను నాకు రాముని యోర్మి లేదని పల్కగా
    పాపి మాటన జానకమ్మను పంపె కానకు.. చూడగాఁ
    కోపగించిన రాము డప్పుడు కోల సేసెను సీతపై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనక మృగమని భ్రమిసిన కాంత సీత
      ఆశతో కోరి దూకెను యగ్నిలోనఁ
      వేసెఁ మారీచు పైగాని విధివశాన
      కుపితరాముడు సీతపై గోలనేసె

      తొలగించండి
  34. . *శ్రీ గురుభ్యో నమః*
    శంకరాభరణం సమస్యాపూరణం
    సమస్య :: కోపగించిన రాముఁ డప్పుడు కోల నేసెను సీతపై.
    విరుద్ధార్థము :: శ్రీ రాముడు కోపంతో సీతపై బాణం వేసినాడు అని అనడం సరికాదు.
    సందర్భం :: “కోపగించిన రాముడు నేతపై బాణం వేసినాడు”
    పై వాక్యంలోని పదాలను చెప్పి ఉపాధ్యాయుడు ఉక్తలేఖనంగా (డిక్టేషన్ గా) వ్రాయమనగా ఒక బాలకుడు *నేతపై* అనే పదాన్ని సరిగా వినకుండా *సీతపై* అని తప్పుగా వ్రాసిన సందర్భం.
    పూరణ ::
    “పాపి రావణనేత రాముని భామనే హరియింపగా
    కోపగించిన రాము డప్పుడు కోల నేసెను నేతపై”
    ఈ పదమ్ముల వ్రాయు డన్న లిఖించె బాలకు డీ విధిన్
    “కోపగించిన రాము డప్పుడు కోల నేసెను సీతపై”
    కోట రాజశేఖర్ కోవూరు నెల్లూరు.
    11-6-2019

    రిప్లయితొలగించండి