20, జూన్ 2019, గురువారం

సమస్య - 3053 (స్తనములు నాలుగు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్"
(లేదా...)
"స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా"
(ఈ సమస్యను పంపిన పి. మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు)

87 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పనిగొని ప్రొద్దుటందునను పాపడి ఖేదము తాళలేక నే
    కనుగొని పాల కోసమొక గట్టిది చెంబును చేతపట్టుచున్
    చనగను కొట్టమందునను చక్కని కొమ్ములు కల్గినట్టి భల్
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!

    రిప్లయితొలగించండి
  2. వనమున తెగిపడు నలలను
    ఘనమగు చిత్రమును గాంచె కన్నుల విందౌ
    వనితయె సొంపులు విసరుచు
    స్తమములు నాల్గున్న తరుణిఁ గాంచితిని సఖా

    రిప్లయితొలగించండి


  3. మనువాడమనుచు కలలో
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్
    పెనుభూతమే జిలేబియె!
    ననువిడు మని తోసి దబ్బున పడితి నేలన్ !



    జిలేబి

    రిప్లయితొలగించండి


  4. అనుములు తింటి! జోగితి నుయాలని జోరుగ నిద్రలోనరే
    ననుమను వాడమంచు మెయి నాట్యము చేయు జిలేబి భంగిమల్
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!
    కనులను వెంటనే తెరచి కాదని దొర్లితి దబ్బు నేలపై!


    విట్టుబాబు గారి కల యేమో :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    పనిగొని దూరదర్శినిని పాటలు చూడగ , నంతరాయసం....
    జనిత విచిత్రచిత్రమున చారలునేర్పడి బొమ్మ రెండుగా
    కనబడుచుండెనా యవనికన్ ! గనులున్ గన నోష్ఠకర్ణముల్
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. (బాగా పొడవుగా,బలంగా ఉన్న హైదరాబాద్ అనాబ్ షాహి ద్రాక్షపండ్లగుత్తి పట్టుకున్న అమ్మాయిని
    చూచిన మోహనరావు స్నేహితునితో)
    ఘనమగు నెర్వులెన్నొ యిడి
    కన్నులపండుగ జేయు ద్రాక్షతో
    టను శ్రమ మీరగా జలము
    డంబగు కుండల బోసి పెంచె నా
    వినుతవినమ్రశీలవతి;
    వింతను గొల్పగ జేతులందు గో
    స్తనములు నాల్గు గల్గు నొక
    చానను కాంచితినయ్య!మిత్రమా!!
    (గోస్తనములు -ద్రాక్షపండ్లు;డంబగు కుండలు-పెద్దకుండలు)

    రిప్లయితొలగించండి
  7. వినయము,విజ్ఞత,అణకువ,
    అనయము పనిపాటలందు అలుపే లేమిన్--
    కనరాని శోభ గూర్చెడు
    స్తనములు నాలుగు గలిగిన చానను కంటిన్

    బొగ్గరం ప్రసాదరావు డల్లాస్ అమెరికా/గుంటూరు

    రిప్లయితొలగించండి
  8. మనసున నూహలుజేయుచు
    మనసెప్పుడుఫోను మీద,మరిమరిజూడన్!
    కనుచూపుచెదరి పోవగ
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్!!

    రిప్లయితొలగించండి


  9. అనమయ! యేమయ్యుండును
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్?
    చినమయ ! భోగిని దండక
    మును చదివిన మహిమయే సముచితమ్మేరా!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. ఘనమగు వేశము తోడను
    మనమున దేవుని దలచుచు మగువను జూడన్
    తనవా రితోడ నట గో
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్

    గోస్తనము-ముత్యాలహారం

    రిప్లయితొలగించండి
  11. పనిబడి పల్లెటూరునకు పట్నపు వాసిని వెళ్ళినాడ నే
    కనుగొన నెందునన్ హరితకాంతుల చేలును చెట్ల ముచ్చటే
    మనవడ!చూడుమన్న మునిమాపున పాలను పిండు చేతినన్
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందఱకు నమస్సులు!

    [ఒకఁడు తన మిత్రునితో నొక సుందరినిఁ జూచితినని వచించిన సందర్భము]

    "ఘనతర నాట్యభంగిమము కమ్రవిలాస సువర్ణహాస వ
    ర్తనము స్వరూపమో వినుత రమ్య విశిష్ట ప్రహృష్ట దీప్త మా
    మనమున సంతసమ్ము విసుమానము కన్నులఁ గంఠమందు గో

    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!"

    (గోస్తనము=నలువది పేటలు గల ముత్యాల హారము)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధుసూదన్ గారూ,
      మీ పూరణ మనోహరంగా, ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. ధనహీనునింట గంటిని
      కనకాంగి తిరుగుట బోసి. కంఠము తోడన్
      ధనవంతుని గృహమున గో
      స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్"

      గోస్తనము= నలువది పూసల సరము.(ఆం,భా)

      తొలగించండి
    3. సీతారామయ్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  13. గు రు మూ ర్తి ఆ చా రి

    """""""""""""""""""""""""""""""""""""""

    గు రు భ్యో నమః ( నిన్నటి పూరణ స్వీకరింప మనవి )


    { గోపికల మధ్య చర్చ = కృష్ణుని అధరము మధురముగా నుండుటకు కారణ మే మై యుండును ? మధురరాగముల పలికించు మురళి మోవిపై నున్నందుకా ? పదునారువేల గోపికలు ఆతనిని తియ్యగా చుంబించు చున్నందుకా ? }


    ' మధులత ' యను గోపబాల , ' మధుమతి ' నడిగె :-- " ముకుందు

    నధరము మధురం బెటులగు నంబుజవదనా " యటంచు |

    మధుమతి యుత్తర మిడెను మందహాసమ్మున నిటుల =

    మధురరాగమ్ముల మురళి - మరులొలుకు మురళి , యతని

    యధరాన నున్నందుకొ ? పదునారు వేల గోపికల

    సుధలూరు పెదవు లాతనిని చుంబించి నందుకొ ? కనుము
    గు రు మూ ర్తి ఆ చా రి

    """""""""""""""""""""""""""""""""""""""

    గు రు భ్యో నమః ( నిన్నటి పూరణ స్వీకరింప మనవి )


    { గోపికల మధ్య చర్చ = కృష్ణుని అధరము మధురముగా నుండుటకు కారణ మే మై యుండును ? మధురరాగముల పలికించు మురళి మోవిపై నున్నందుకా ? పదునారువేల గోపికలు ఆతనిని తియ్యగా చుంబించు చున్నందుకా ? }


    ' మధులత ' యను గోపబాల , ' మధుమతి ' నడిగె :- ముకుందు

    నధరము మధురం బెటులగు నంబుజవదనా " యటంచు |

    మధుమతి యుత్తర మిడెను మందహాసమ్మున నిటుల =

    మధురరాగమ్ముల మురళి - మరులొలుకు మురళి , యతని

    యధరాన నున్నందుకొ ? పదునారు వేల గోపికల

    సుధలూరు పెదవు లాతనిని చుంబించి నందుకొ ? కనుము


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  14. అనువున గోడ కొక్కెముల నద్దము నుంచిరి చూడచక్కగా
    మనుమని బంతి తాకగనె మధ్యకు రెండుగ ముక్కలవ్వగన్
    కినుకున పోయిచూడగనె గెంతితి చిత్రము చూసినంతనే
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
      మంచి ఊహ, చక్కని పూరణ. అభినందనలు.

      తొలగించండి
  15. ఘనుడగు విఠలా చార్యుని
    సినిమా వొచ్చెనుగ నొకటి స్నిగ్దుడ! కూడెన్
    తనువుల దోయి, సరసముగ.
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ సూర్యకుమార్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'సినిమా వచ్చెనుగ యొకటి...' అనండి.

      తొలగించండి
  16. నిన్నటి సమస్యకు పూరణ.. తరచి గమనింప ప్రార్థన..

    విధమది చిత్రముఁ జూడగ
    సుధయే యిచ్చిన వడసిన 'చుంబన'మన్నన్!
    వ్యధితమ్మని తలచినచో
    నధరము మధురం బెటులగు నంబుజ వదనా?

    రిప్లయితొలగించండి
  17. చెనటి యొకడు వ్యంగ్యముగన్
    జనముల నవ్వింపగీచెఛకచక బొమ్మన్
    కనుగొని మిత్రునితో ననె
    స్తనములు నాలుగుగలిగిన చానను గంటిన్

    రిప్లయితొలగించండి
  18. కనులకు వ్యాధి గలిగెనని
    మనమున వ్యాకులత పెరిగి మందుల కొరకై
    వినుమని వైద్యునికి జెప్పె
    'స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్'

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఘనముగ వెల్గులీనెడి దుకాణములందు దుకూల ధారులై
      ధనమునకేమి లోటనుచు దండుగ ఖర్చుల లెక్క సేయకన్
      మణులను భూషణమ్ములను మక్కువ జూపెడు వారలందు గో
      స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా

      తొలగించండి
    2. (గోస్తనము అంటే ముత్యాల హారము అనే భావంలో)

      తొలగించండి
    3. సూర్య గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  19. డా. పిట్టా సత్యనారాయణ
    గనమిక హార్మోనుల జత
    గనమా చక్రంపు ఛవిని గనిపించనివౌ
    చనుగవ కొక తొడుగిడగా
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్

    రిప్లయితొలగించండి


  20. మనువాడెద తప్పక! గో
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్!
    తనఖా బెట్టెద వాటిని
    మన సేటు దుకాణమందు మస్తుగ బతుకన్ :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      ఈ విషయాన్ని పెండ్లి కాని విట్టుబాబుకు చెప్పండి.

      తొలగించండి
  21. సమస్య :-
    "స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్"

    *కందం**

    మనసు పడిన వస్తువులను
    కొనక కొనక నేడును కొనుగోలును చేయన్
    కొనువేళ చేతిలో బ
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్
    .....................✍చక్రి

    బస్తనీ : సంచి (ఉర్దూ)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్రపాణి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బస్తనీ'ని బస్తనములు అనవచ్చునా అని సందేహం!

      తొలగించండి
  22. డా.పిట్టా సత్యనారాయణ
    తనకగు బిడ్డకున్ దనువుదాల్చిన మాతృవిహీన గ్రుడ్డుకున్
    దనరగ స్తన్యమిచ్చిన వదాన్యతమై స్తవనీయ మూర్తియై
    పెనగొను పాలచేపులను ప్రీతిగ దా గుడిపించె సృష్టిలో
    స్తనములు నాల్గు గల్గు నొక చానను గాంచితినయ్య మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. పిట్టా వారూ,
      మనోహరమైన భావంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  23. అనుపమశోభల వెల్గెడు
    మణిమయ సింహాసనమున మాతను దేవిన్
    కనువిందుగ గళమున గో
    స్తనములు నాలుగుగలిగిన చాననుగంటిన్

    రిప్లయితొలగించండి
  24. కనులవిబైరులుగ్రమ్మ
    స్తనములునాలుగుగలిగినచాననుగంటిన్
    గనుగొనపిమ్మటరెండే
    కనిపించెనుదేఱిచూడగంటికినపుడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'బైరులు గ్రమ్మగ...' అనండి.

      తొలగించండి
  25. జటాయువు

    వినుమో రామా నే గో
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటిన్
    వనచరి సీతను వాడది
    గొనిపోవ బలమున అవని గొల్లుమనె నదే

    రిప్లయితొలగించండి
  26. వనితారత్నము సుందరి
    వనజాక్షిఁ గర కమలముల ఫల రాజములే,
    మునుముం దిది నీ విట కా
    స్త నములు, నాలుగు గలిగిన చానను గంటిన్


    గొనకొని పెండ్లి చావడినిఁ గుల్కుచు గెంతుచుఁ దిర్గుచుండగన్
    మినుకులు జల్లు చెల్లెడల మింటినిఁ గూడ వెలుంగఁ జేయుచుం
    గనక మయమ్ము లయ్య యవి కాసుల పేర్లు వరాంగ భా దధ
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా

    [భాత్ + అధస్తనములు = భా దధస్తనములు;
    అధస్తనములు = క్రింది భాగమున నున్నవి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామేశ్వర రావు గారూ,
      షరా మామూలే అన్నట్టు మీ రెండు పూరణలు వైవిధ్యంగా, అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    Lady Doctor (on strike):

    చనుచును వంగభూమినట జంకుచు వేడ్కొన
    ముఖ్యమంత్రినిన్
    మనమున చింతజేయుచును మాటలు రాకయె మూగబోవగా
    ఘనమగు నీర్ష్య మోహమును గాఢపు క్రోధము లోభమన్బడిన్
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  28. స్తనములునాల్గుగల్గునొకచాననుగాంచితినయ్యమిత్రమా!
    స్తనములునాల్లుగల్లుటనుషండునిలక్షణమందురే
    పనిగొనునట్లువారలిలభామలవోలెను,బుంస్త్వరూపులై
    కనబడుచుంద్రునెప్పుడునుగాసులగోరుచునెల్లవారలన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణదోషం.

      తొలగించండి
    2. 2వపాదం చివర
      గదా
      చేర్చడమైనది

      తొలగించండి
  29. వనితకు కలవిట రెండే
    స్తనములు! "నాలుగు కలిగిన చానను కంటిన్"
    యనదగునా గురువర్యా!
    వినిపింపు డసలు విషయము వివరణ తోడన్!

    రిప్లయితొలగించండి
  30. అనయము గాంచెద నావుకు
    స్తనములు నాలుగు గలిగిన,చానకుగంటిన్
    స్తనములు రెండే గలవవి
    తనయుల యాకలిని తీర్చు తావది గనుమా

    రిప్లయితొలగించండి
  31. అనుపమ శోభలన్ వెలుగు నంచిత రత్నపు పీఠమందునన్
    ఘనమగు నాల్గుచేతులను కామునివిల్లును పుష్పబాణముల్
    వెనుకను పాశమంకుశము వేడ్కగ కంకణమంగుళీయ గో
    స్తనములు నాల్గుగల్గు నొకచానను గాంచితినయ్య మిత్రమా!

    చేతులకు కూడ ముత్యపుసరులు చుట్టుకొనవచ్చునేమో!
    గుడిలో దేవతామూర్తిగా!

    రిప్లయితొలగించండి
  32. చంపకమాల
    ఘనముగ నొక్కకాన్పునను గల్గఁగ నల్గురు చాలు చాలనన్
    పెనుచఁగ కష్టమౌచు గన వేదన యింతని చెప్పఁ జాలమే
    చనుగుడుపంగ నొక్కటిగ చాలగ వేరుగ బుడ్లు రెంటితో
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా!

    రిప్లయితొలగించండి
  33. మనుషులరూపము గదిలో
    తనువులురెండుగ గనబడు! దర్పణమందున్
    వనితయునొక్కటిరాగా?
    స్తనములు నాలుగు గలిగినచానను గంటిన్

    రిప్లయితొలగించండి
  34. శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారి పూరణము:

    ఘన జఘనంపు భారమున , కాళ్ళు వడంక నొకింత , గొంతు కూ
    ర్చుని , యొక చేత గోవు నలు రొమ్ములపై జలధార చల్లి , పా
    లను ఘనపాత్రలో పితుకు లాఘవ మొప్పెడు నాతి చేతిలో
    స్తనములు నాల్గు గల్గు నొక చానను గాంచితినయ్య మిత్రమా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మాన్యులు శ్రీ శంకరయ్యగారికి నమస్సులు!
      మాన్యులు లక్కాకులవారి పూరణలోది అద్భుతమైన భావన! అందులో ఏ సందేహమూ లేదు! కాని, చేత గోవు నలు రొమ్ములు, చేతిలో స్తనములు నాల్గు...అను పదములు పునరావృత్తి కావచ్చునా అని

      తొలగించండి
  35. జనమది నమ్మగ లేరుర
    స్తనములు నాలుగు గలిగిన చానను గంటి
    న్ననుచు పలుకు నీ మాటలె
    యనృతమటంచును తెలియని యధములు గలరే.

    రిప్లయితొలగించండి
  36. మునుపొక కండ్లు మూడుగల ముగ్దను గంటిని కర్ణముల్ గనన్
    యెనిమిది చేతులేమొ పదిహేడును ముక్కులు మూడు నామెకే
    స్తనములు నాల్గు గల్గునొక చానకు గాంచితి నయ్య మిత్రమా
    యనుచును చెప్పె కల్లలవి యద్భుత మంచును మూర్ఖుడొక్కడున్

    రిప్లయితొలగించండి
  37. అనయము సాధువర్తనము ఆర్తజనావనదీక్ష ఎల్లెడన్
    వినయముఁగల్గియుంటయువివేకముగా చరియించుటన్నయీ
    గుణములెభూషణమ్ములుగఁగూడె నెలంతకునివ్విధంపుగో
    స్తనములు నాల్గు గల్గు నొక చాననుఁ గాంచితి నయ్య మిత్రమా"

    రిప్లయితొలగించండి
  38. కందం
    కనులకొకటి రెండుగనే
    కనబడు దర్పణమునందు గాంచుచు బోవన్
    గనులును కాళ్లును చేతుల్
    స్తనములు నాలుగు గలిగిన చాననుఁ గంటిన్

    రిప్లయితొలగించండి