22, జూన్ 2019, శనివారం

సమస్య - 3055 (కలముం గని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కలముం   గని   కవివరుండు   కలవరమందెన్"
(లేదా...)
"కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో"
(ఈరోజు పూరణలు ప్రసారమయ్యే ఆకాశవాణి వారి సమస్య)

82 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పలుకుట రాక నాంధ్రమున పండుగ జేయుచు హైద్రబాదునన్
    బలుపుగ శంకరాభరణ ప్రాంగణమందున శాస్త్రివర్యుడే
    విలవిల తన్నుకొంచునిట వేలను జేసియు పూరణమ్ములన్
    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.
      వేల పూరణలు చేసిన మీకు కలతయా?

      తొలగించండి
    2. నిజానికి మూడు పాదాలే వ్రాయగలను...నాల్గవది మీరిస్తే..

      తొలగించండి


  2. అలుకయె తనకందమ్మగు
    చిలిపి పలుకుల నెలతుక వచించుచు పొగడం
    డి! లిఖించండని యిచ్చిన
    కలముం గని కవివరుండు కలవరమందెన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి


  3. అలిగిన ప్రియురాలె కరము
    న లెస్సగ తన పయి వ్రాయన కలము నివ్వన్,
    వలపు తెలుప తక్కువయిన
    కలముంగని కవివరుండు కలవరమందెన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వ్రాయను' అనడం సాధువు. అలా అంటే యతి తప్పుతుంది మరి!

      తొలగించండి
  4. కులముల కోరల జిక్కియు
    కలతల కాపురముల గని కవితల గూర్చన్
    నెలతల అభిమతముల కల
    కలముం గని కవివరుండు కలవరమందెన్!!

    రిప్లయితొలగించండి
  5. తలపున విషసంస్కారము
    చెలరేగగ రాక్షసంపు చేష్టలతోడన్
    సలిపెడు పలుహింసల కల
    కలమున్గనికవివరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    అల కాళేశ్వర సాగరు
    తెలగాణపు సాగు మీద తెగ వ్రాయుడనన్
    తెలియని స్తవములదౌ కల
    కలముంగని కవి వరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
  7. జలజాంతస్తిత వాణిన్
    దలపులలో నిలిపికొలుచు తరుణము నందున్
    చెలరేగిన లలనల కల
    కలముం గని కవివరుండు కలవర మందెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'జలజాంతఃస్థిత' టైపాటు.

      తొలగించండి
  8. డా.పిట్టా సత్యనారాయణ
    జలజల జారు జాన్తెనుగు జాడలె లేని సమాసపుంజపున్
    *ఝలకు*ల రువ్వగా జదువ జాలరు నేటి తెలుంగు పాఠకుల్
    కులుకులు లేక నచ్చముగ గూర్చగ జాలగలండు; ప్రౌఢపుం
    కలమును గాంచినంత గలగంబడె సత్కవి వర్యు డయ్యయో!

    రిప్లయితొలగించండి
  9. చంపక మాల
    కలమును చేతబట్ట చిరుగాలులు వీచెడు సంధ్య వేళలో
    జలజల రాలు కావ్యరస సారము చల్లగ వాణి తోడునన్
    దలచిన యవ్వనుండడవి దారిని బట్టగ చెట్లనీడ నే
    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో

    (ఏకలము= అడవిపంది)

    రిప్లయితొలగించండి
  10. కలకూజితసన్నిభమౌ
    గళమును సవరించి మధురకవితలుచదువన్
    చెలఁగినయభిమానుల కల
    కలముంగని కవివరుండు కలవరమొందెన్

    సలలితముగనవకవితలఁ
    నలవోకగ వ్రాయనెంచి యద్భుత రీతిన్
    చెలువముచెడి విరిగిన తన
    కలముంగని కవివరుండు కలవరమొందెన్

    కలమునుకాగితమునుగొని
    చెలువఁపు కవితారచనము చేబట్టుతరిన్
    కలఁతబడె మనసు పగిలిన
    కలముంగని, కవివరుండు కలవరమొందెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్ర గారూ,
      మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి


  11. అలుకయె లేక పద్యముల హాయిగ వ్రాయుచు పొద్దుపుచ్చె! ప
    ద్మలతను పెండ్లియాడె! వనితామణి లౌకికురాలు! చేతి గ
    జ్జలను చలాకిగా దులిపి జబ్బల బల్మిని చూపి ఘాటు చెం
    పలకొక ముద్దు లివ్వగ గభాల్మని తేలుచు మత్తులోనరే
    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మనోహరమైన పూరణ. అభినందనలు.
      'గజ్జలను/గజ్జెలను'?

      తొలగించండి

    2. గజ్జలని తెలంగాణలో అంటారని ఆంధ్ర భారతి ఉవాచ :)



      జిలేబి

      తొలగించండి
  12. తెలుగును మలినము సేసెడి
    కలబోతల పలుకులిపుడు కనగా పెరిగెన్
    దలచుచు విలపించి నిలచు
    కలముంగని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  13. కులమును జూడక గుణముల
    వలనం బ్రఖ్యాతిఁ బొందవలెనను గురువై,
    కులము కులము యను శిష్యుని
    "కలముం   గని   కవివరుండు   కలవరమందెన్"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విట్టుబాబు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కులము + అను' అన్నపుడు యడాగమం రాదు. "కులంబను శిష్యుని" అనండి.

      తొలగించండి
    2. మత్తున చిత్తైతినయ్య మన్నింపుడయా!
      ధన్యవాదాలు గురువుగారూ..
      🙏🏻🙏🏻

      తొలగించండి
    3. శనివారం పొద్దుటే మత్తు? ఓహో!రాత్రి పుచ్చుకున్నదా? ( శత మర్కటంతో సరదాకు )

      తొలగించండి
  14. మైలవరపు వారి పూరణ

    బలపములంతరించె , చరవాణినిబోలెడి నోటుబుక్కులే
    పలకలునయ్యె , నందమగు వ్రాత నశించెను , హస్తభూషలీ
    కలియుగమందు జూడ కొఱగానివిగా గనిపించుచుండగా
    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో" !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  15. బలమును జూపంగ జనులు
    కులములు, మతములనుచు కడు క్రోధము తోడన్
    కలహించగ బుట్టిన కల
    కలమున్ గని కవివరుండు కలవర మొందెన్!

    రిప్లయితొలగించండి

  16. లలిత కళా తోరణమం
    దలి కవిసమ్మేళనమున దండిగఁ బద్య
    మ్ములఁ జదువఁ బ్రేక్షకుల కల
    కలముం గని కవివరుండు కలవరమందెన్.

    రిప్లయితొలగించండి
  17. సూలభమ్ముగ వ్రాయ కవిత
    సెలుఫోనున నభ్యసించి చేతిని కలమున్
    నెలకొన మరచిన వేళన్
    కలముంగని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    [కలరవ కూజితములఁ బోలు నాహ్లాదకరమైన చక్కని కైతలను సెప్పి యనేక బహుమానములను గెలుచుకొని మరలివచ్చు నొక కవివర్యుఁ డడవి దారి నడుమ నొక యడవిపంది యెదురురాఁగాఁ గలవరపడిన సందర్భము]

    కలరవకూజితాంచితసుగంధయుతామ్రకిసాలఖాదనన్
    బెలుౘనయైనరాగరుచిపెంపునుఁ బోలిన కైత సెప్పి తాఁ
    బలు బహుమానముల్ గొని నివర్తిలి వౘ్చుౘుఁ గాన నొక్క యే

    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!

    (ఏకలము=అడవిపంది)

    రిప్లయితొలగించండి
  19. అలకలబాన్పునుజేరిన
    నలివేలునుముదముజేయహారముకొఱకై
    విలువనునడుగగ,వణిజుని
    కలముంగనికవివరుండుకలవరమందెన్

    రిప్లయితొలగించండి
  20. కుల మత జాతుల మరచుచు
    కలిసెదరని కన్న కలలు కల్లలు కాగా
    కుల వైషమ్యమ్ముల కల
    కలముం గని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  21. (పత్నీవియోగవిహ్వలహృదయుడైన మహాకవి సి.నా.రె)
    సలలితరీతులన్ దనదు
    సాహితి నెంతయు బెంపుజేయుచున్
    నలువురు ముద్దుకూతులను
    నమ్రత నిచ్చిన ధర్మపత్నియే
    కలగ సినారె జీవితపు
    కాంతుల సౌధము వీడిపోవగా
    కలమును గాంచినంత గల
    గంబడె సత్కవివర్యు డయ్యయో!

    రిప్లయితొలగించండి
  22. మలయజ మందమారుతపు మ్రానుల కానన సీమ చేరి యా
    స్థలి మధురోహలన్ విరులతావుల కమ్మని కావ్యరాజమున్
    వెలయగ వ్రాయఁజూడగను వ్రేటుగ నత్తరి రేగినట్టి పా
    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!

    రిప్లయితొలగించండి
  23. కలము నదుపునందుంచక
    కలకంఠుల బీరము పయి కవితలు జేయన్
    లలనలు సలుపెడి యా కల
    కలముం   గని   కవివరుండు   కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  24. పలుకగ నొక కవి సభలో,
    పలికిన పలుకుల నసభ్య పదములు దొరలన్
    చెలరేగిన భీకర కల
    కలముం గని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి

  25. ఈ వారపు ఆకాశవాణి విశేషములు తెలుపగలరు : సమస్య పై వారమున కేమిటి ?



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య....
      "మోసముఁ జేయు వారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్"
      మీ పూరణలను గురువారం సాయంత్రంలోగా padyamairhyd@gmail.comకు మెయిల్ చేయండి.

      తొలగించండి
    2. G P Sastry (gps1943@yahoo.com)జులై 01, 2018 8:51 PM

      దోసమెలేదు నీదిటను దోసెల పిండిదె దోసమంచునున్
      వాసన లేకపోయినను వన్నెగనున్నవి పూలటంచునున్
      వీసపు టెత్తుబంగరము వీసెడు కాంతియె నీకుగూర్చటన్
      మోసము చేయువారలకె పుణ్యఫలంబు లభించు నెల్లెడన్

      తొలగించండి
  26. కలతలుమానిపద్యములుగట్టిగవ్రాయుదలంపుగల్గెనా?
    కలమునుగాంచినంత,గలగంబడెసత్కవివర్యుడయ్యయో
    యలుసుగజూడనాతనినినందఱిముందటసిగ్గునొందుచున్
    గలతలుగల్గజేయుటదిగాదుగమంచిదియేరికైననున్

    రిప్లయితొలగించండి
  27. అల యియ్యవధానమ్మును
    వలదందుర యందఱు నని భయ మేపారం
    జెలఁగ నధికమ్ముగాఁ గల
    కలముం గని కవివరుండు కలవరమందెన్


    అల యొక యింత సేపు, మది హర్షము నబ్బురముల్ సెలంగినన్
    జలజల రాలు శుష్క దళ సంచయపున్ గతిఁ జేరుచుండగన్
    వలయ విరాజమాన పుర పామర పండిత రాజ వర్గ పు
    ష్కలమును గాంచినంతఁ, గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    తలపుకు వచ్చినంతటనె తాడును పేడును లేని పద్యముల్
    పిలచిన భామనున్ వినక పిచ్చిగ పర్విడి వ్రాయబూనుచున్
    బలుపుగ స్మార్టు ఫోనునను భారిగ నొక్కుచు వ్రేళ్ళతోడుతన్
    కలమును గాంచినంతఁ గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో!

    రిప్లయితొలగించండి
  29. విలువగు పద్యకావ్యముల పెన్నిధి యాంధ్ర కవిత్వమంజరిన్
    తులువలు ఙ్ఞానశూన్యతను దూషణసేయగ పాతవంచు నా
    పలుకుల నాలకించి మది భారముగాగను దిక్కుదోపకే
    కలమును గాంచినంత గలగంబడె సత్కవివర్యు డయ్యయో!

    కవిత్వం వ్రాయాలా వద్దా అని కలతబడ్డాడని భావన!

    రిప్లయితొలగించండి
  30. లక్కాకుల వెంకటరాజారావు గారి పూరణ:

    ఇలు సనినంత నొంటిపయి నింతికి చాలిన చీర లేదు, ఆ
    కలి పులి పిల్లలన్ దినెడు, కాళ్ళకు బల్పము గట్టి తిర్వినా,
    పలుకదు లచ్చి, శారదకు భద్రమె, యట్టి తరిన్, భలేగ, రూ
    కల, మును గాంచి, నంత, గలగంబడె, సత్కవి వర్యు డయ్యయో!

    రిప్లయితొలగించండి
  31. క్రొవ్విడి వెంకట రాజారావు:

    పొలుపగు కావ్యం బనుచును
    బులియుచు నిచ్చెడి బహుమతి పొందెడు నపుడున్
    చలమరులైన కవుల కల
    కలముంగని కవివరుండు కలవర మందెన్.

    రిప్లయితొలగించండి
  32. కలిమిన్ గూర్చు ననుచుఁ గూ
    ళలకున్ గావ్యమ్ము పోతరాజమ్మనెడున్
    దలపుల వాణి ముఖమున వి
    కలముం గని కవివరుండు కలవరమందెన్

    రిప్లయితొలగించండి
  33. జలవనరులుఅడుగంటగ
    కలహమ్ములుగలిగెనిచటకలికారణమై,
    కలిలో కలహమ్ముల కల
    కలమున్ గనికవివరుండుకలవరమందెన్
    కొరుప్రోలు రాధా కృష్ణా రావు, మీర్ పేట్,రంగారెడ్డి

    రిప్లయితొలగించండి
  34. విలువలు మానిన వార్తలు
    దలపోసెడి యాశదోష తత్వములెన్నో
    సలుపునధర్మము గల"కా
    కలముంగని కవివరుండు కలవరమందెన్!

    రిప్లయితొలగించండి
  35. కలికిని వెంటబెట్టుకుని కౌముదు లీనెడు రాత్రివేళలో
    జలనిధి పైవిహారమును సల్పుచు నుండగ బెజ్జమేర్పడన్
    జలమది నావలోకి కడి సవ్వడి సేయుచు జేరినంత నా
    కలమును గాంచినంత గలఁగంబడె సత్కవివర్యుఁ డయ్యయో.

    రిప్లయితొలగించండి


  36. దాసుల కేను దక్కునయ ధర్మపధంబిక నైతలంబగున్
    మోసముఁ జేయు వారలకె! పుణ్యఫలంబు లభించు నెల్లెడన్
    వేసము వేయకన్ విభుని వేడుచు కొల్వగ భక్తితో సదా
    కాసుల వెంబడింపక సుకర్మల చేయుచు బుద్ధితోడుతన్

    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. లలనలు కొళాయి చెంతన
    సలిలము కొరకై సతతము జగడము లాడన్
    కలముఁ గదిలించు తరి కల
    కలముంగని కవివరుండు కలవర మందెన్.

    రిప్లయితొలగించండి
  38. డా.పిట్టా సత్యనారాయణ
    వీసము చేత లేక తనువెల్ల గృశించగ పొట్ట దైవమై
    గ్రాసము విత్తమై జెలగ గౌరవ మిచ్చిన వారలేరి?జి
    జ్ఞాసయె నీతిగా మెలగ జన్నము జేయని దీను కన్న బల్
    మోసము జేయువారలకె పుణ్య ఫలంబు లభించు నెల్లెడన్

    రిప్లయితొలగించండి