24, జూన్ 2019, సోమవారం

సమస్య - 3057 (శిశుపాలుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్"
(లేదా...)
"వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే"

65 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    జ్వరమది హెచ్చుచున్నదిక జాప్యము చేయను బావరో భళా
    తరమును గాదు నాకిచట తప్పదు వీడగ దేశమంచు తాన్
    కరములు మోడ్చి భాజపను కష్టము మీరగ జంపుజేయగా
    వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే

    రిప్లయితొలగించండి
  2. ప్రభాకర శాస్త్రి గారూ,
    మీ పూరణ నిజంగానే సరదాగా ఉంది. ఇంతకీ ఇక్కడ శిశుపాల కృష్ణు లెవరు?

    రిప్లయితొలగించండి
  3. మైలవరపు వారి పూరణ

    ధర జనియించె దా పరమదైవము యాదవుడౌచు , సత్కృపా...
    వరగుణవంతు ., డైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పు ., నే
    దురితుల ద్రుంపగన్ , సుజనతోషము నింపగ ధర్మదీక్ష స...
    త్వరము సముద్భవింతునను వాక్యము సత్యము జేయ సత్కవీ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  4. (శతాపరాధాధముడైన శిశుపాలుని వధానంతరం దుర్యోధనుడు భీష్మాచార్యునితో)
    అరుదగు పూజ్యులుండిన మ
    హాసభ నంచితబాహువిక్రమున్;
    గరము పరాక్రమున్;మిగుల
    గణ్యుని;బావను;నాటి రుక్మిణీ
    వరుడగువాని;చైద్యునిటు
    వంచన బూనుచు చేదిభూపతిన్;
    వరగుణవంతుడైన శిశు
    పాలుని;గృష్ణుడు సంపుటొప్పునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      నిజమే... దుర్యోధనుని దృష్టిలో శిశుపాలుడు సద్గుణవంతుడే. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
    2. ధన్యవాదాలండీ!దుష్టునికి మరొక దుష్టుడు మిత్రుడు,శిష్టుడు అవుతాడు కదా!

      తొలగించండి


  5. పశుపాలకుని వలె నడచ
    క శలభము పయి కసిబిసియు కార్పణ్యమకో
    కుశలత కొంతయు లేదే?
    శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్?


    జిలేబి

    రిప్లయితొలగించండి


  6. మరిమరి వచ్చి గోపికలు మక్కువ మీరగ ప్రేమ లోన దే
    ల రసమయమ్ము గా వరములన్ తను కూర్చెన ప్రీతితోడుతన్?
    మరి తన నంటు బంధువును మార్చగ లేడయితండు? హేవిటో!
    వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే?



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. పశుపాలకుండు,ప్రేమా
    తిశయమున వరమొ, శాపమొ దీటుగ నొసగెన్
    శిశుదశ విషయము దెల్యని
    శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గంగాప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదం మూడవ గణంగా భగణం వేసారు.

      తొలగించండి
  8. దురుసుగ మాటలాడ దుష్టుడు పెద్దలు పల్వురుండగా
    కరమున చక్రమున్నదని గమ్మున కంఠము కోయనెంచుటే
    పరువను తీసినంచు వ్యాజ్యము వేయక కోర్టులందున్
    వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకర ప్రసాద్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణదోషం. సవరించండి.

      తొలగించండి
    2. చం. దురుసుగ మాటలాడెనని దుష్టుడు పెద్దలు పల్వురుండగా
      కరమున చక్రమున్నదని గమ్మున కంఠము కోయనెంచుటే
      పరువును తీసినంచు తొలి వ్యాజ్యము వేయక కోర్టులందునన్
      వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే!

      తొలగించండి
    3. సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తీసెనంచు' టైపాటు.

      తొలగించండి
  9. హరియని బావగారనియు
    నందరికన్నను మిన్న సేసె నా
    నరపతి ధర్మనందనుడు
    నమ్మిక తోడ శుభమ్ముగూర్ప న
    ధ్వరమునఁ,లీల యేమదియొ
    "దక్షుని యజ్ఞముఁ" జేసె, విజ్ఞుడై
    వరగుణవంతుఁడైన..., శిశు
    పాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      భావంలో కొంత అస్పష్టత ఉన్నట్టు సందేహం.

      తొలగించండి
    2. 🙏...

      భావం:- రాజైన ధర్మజుడు కృష్ణుడు రాజసూయ యాగంలో శుభం చేకూరుస్తాడనే విశ్వాసంతో పెద్దపీటవేసి గౌరవించాడు.కాని ఆ కృష్ణుని లీల ఏమిటో..? తెలిసినవాడును,గుణవంతుడు అయితే..ఇలా దక్షయజ్ఞం వీరభద్రునిచే ఆటంకానికి గురైన రీతి శిశుపాలుని చంపడమనే అసందర్భకార్యంచే.. యాగాన్ని ఆటంక పరచడం సరైనదా..

      తొలగించండి
    3. కృష్ణుడు... వరగుణవండయితే.. అని

      తొలగించండి
  10. నిన్నటి పూరణ
    ఉల్లము లందు పుష్పశరు డూష్మము పెంచుచు నుండె చెచ్చెరన్
    నల్లని వాడు సంతతము నాట్యము చేయ మనస్సు లందునన్
    చల్లని వేళలోన కడు చక్కని యూహల తేలుచుండగా
    ఫుల్ల సరోజ నేత్రలకు పూర్తిగఁ జీకటు లయ్యె వెన్నెలల్

    రిప్లయితొలగించండి


  11. అరయగ చంప నెవ్వరికి యర్హత లేదు! విధాత రాతగా
    వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పు; నే
    పరమదయాళు నంచు మరి పల్కిన వాడతడాయె! శ్యామసుం
    దరుడతడాయె కోరుచు విదారణ చేయున స్నేహశీలియే?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. డా.పిట్టా సత్యనారాయణ
    వశుడగునట నిందలకును
    పశువైనను మోక్ష మొందు భయమెందుకనన్
    శిశువులమై శోధన బడ
    శిశుపాలుని జంప దగునె శ్రీ కృష్ణునకున్

    రిప్లయితొలగించండి
  13. పశుపాలకుండు,ప్రేమా
    తిశయమున వరమొ, మరేదొ దీటుగ నొసగెన్
    శిశుదశ విషయము తెలియని
    శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్!!

    *** మీ సూచన తో నాసవరణ. ధన్యవాదములతో..!

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    వరుసను హైందవంబును నవారిత భా .జ.ప.నూదిపట్టినన్
    బరువగు వాజపేయి నల భద్రముగా నొదిగింప జూచినన్
    గురి గని వారసుండనడు కూర్మిని లాల్ కిషనున్ గణింపడే?!
    వర గుణవంతుడైన శిశు పాలుని గృష్ణుడు సంపు టొప్పునే?

    రిప్లయితొలగించండి
  15. ముసిముసి గా నవ్వుచు పర
    వశమందుచు దుష్టునకట భళిగొట్టిన వా
    డి సఖులను విడిచి యొకడినె
    శశుపాలునిఁ జంపఁ దగునె శ్రీ కృష్ణునకున్.

    రిప్లయితొలగించండి
  16. పరమదయాళు వైవెలసి భక్తుల పాలిట కల్పవృక్షమై
    తరుణము జూచిదుష్టుల వితండపు వాదుల రూపు మాప గా
    వర గుణవంతుడైన శిశు పాలునిగృష్ణుడుసంప నొప్పు నే
    కరుణను జూపరాదు కద గర్వ మదాంధుల పాలిటెన్నడున్

    రిప్లయితొలగించండి
  17. శ్రీ గురుభ్యోన్నమః🙏
    సభలోని నారదుని ధర్మరాజు అడిగినట్లు నాకు దోచిన పూరణము.

    నిశితమున ధర్మజు డడిగె
    విశదముగా దెలుపవయ్య విధినందనుడా!
    కుశలత నర్జును కొదలక
    శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్?

    విధినందనుడు-నారదుడు.

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందఱకు నమస్సులు!

    [శ్రీకృష్ణుఁడు శిశుపాల వధ మొనర్చుటను జీర్ణించుకొనలేక కౌరవ దుష్టచతుష్టయమైన దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణాదులు తమలో తాము వితర్కించుకొను సందర్భము]

    "స్థిరతఁ గురూపి రూపసిగఁ జేసిన మాత్రనఁ దాను రుక్మిణీ
    తరుణిని లేవఁదీసికొని ధర్మువు వీడి చనంగ న్యాయమే?
    సరవిని నూఱు తప్పులివి చంపెద నంచును దుర్మదంబునన్

    వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే?"

    రిప్లయితొలగించండి
  19. శిశువుల పశువుల నైనను
    వశమొనరించుగ దన ప్రియ వంశీ సుధయే
    పశువైనను మది మార్చక
    శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి
  20. నిన్నటి సమస్యకు నా పూరణ పరిశీలింప మనవి 🙏

    కంతు ప్రేరణ మది ప్రియ కాంతు దలచి
    చెంత లేడని విరహార్త చిత్తులగుచు
    చింత వంతల మనసులు జిక్కినట్టి
    ఇంతులకుఁ జీకటులుగ రేయెండ లయ్యె

    రిప్లయితొలగించండి
  21. పశుపాలకు డైనయతడు
    కుశలంబును గూర్చుజగతి గోవిదుడగుచున్
    వశమే తీరుపుసేయగ
    శిశుపాలుని జంపదగునె శ్రీకృష్ణునకున్ ?

    రిప్లయితొలగించండి
  22. వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే
    అరయగ పాప కర్మమిది యాదవ వీరుని సంహరింతు మం
    దురట మదోద్ధరార్భటుల ధూర్తులు కౌరవ గ్రామ సింహముల్
    కరి వరదుం డమేయ బల గర్వితుడీ మొఱ లెక్క సేయునే

    రిప్లయితొలగించండి
  23. పశుపాశ విమోచకుడగు
    వసుదేవసుతుండు శౌరి వాసవునకిలన్
    యశమెట్లగు భృత్యుండౌ
    శిశుపాలునిఁ జంపఁ, దగునె శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి
  24. వశ మౌనె యెవ్వరి కయిన
    ను శివుని యాజ్ఞ యది లేక నుఱుమఁగ నిలలోఁ
    బశుపతి చంపె నిజ మరయ
    శిశుపాలునిఁ, జంపఁదగునె శ్రీకృష్ణునకున్


    పరులను జేరి కొల్చినను భద్రమ భారత నామ ఘోర సం
    గరమున నక్కటా బ్రతికెఁ గారణ మెంచఁగఁ దాను ఘోష పా
    లుర కుల మందుఁ బుట్టిన నరుండు కదా కృతవర్మ శౌరియే
    వరగుణవంతుఁడైన, శిశుపాలునిఁ, గృష్ణుఁడు సంపుటొప్పునే

    [శిశుపాలుఁడు = దూడలను పాలించు వాఁడు (గొల్లవాఁడు)]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఘోషపాలురకులము = శ్రీకృష్ణపరమాత్ముల కులము. గౌరవాన్విత బహు వచనము.

      తొలగించండి
    2. మీ రెండు పూరణ అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    3. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.

      తొలగించండి
  25. శిశుపాలుగుఱిచిపలికిరి
    శిశుపాలునిజంపదగునెశ్రీకృష్ణునకున్
    శిశుపాలుజంపసబబే
    నిశితపుశతదూషణంపునేరముజేతన్

    రిప్లయితొలగించండి
  26. వశుడే హరి భక్తులకన
    శిశువుల మానమును దోచ శిక్షింపకనే
    వశుడై శతదప్పు వరము
    శిశుపాలునిఁ జంపఁదగునె శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి
  27. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    పరువది పోదె యుద్ధమున పంతము మీరగ చక్రమెత్తకే...
    బరువుగ నాల్గు దుష్టులును భారత మందున వీరి తోడుతన్
    ధరణిని వేలు వేలుగను తప్పులు చేసిన వారి బోల్చగా
    వరగుణవంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే?

    రిప్లయితొలగించండి
  28. వరగుణవంతుడైనశిశుపాలునిగృష్ణుడుసంపుటొప్పునే
    వరగుణవంతుడాయతడుపాపపుపుట్టయగృష్ణునిందనున్
    నిరతముజేయుచుండుటనునిక్కముసంపనొప్పగున్
    గరమునుహింసజేయదగుఖచ్చితమియ్యదిలోకరక్షకున్

    రిప్లయితొలగించండి
  29. పరుషపు మాటలాడి బకవైరిని నీచుడు తూలునత్తరిన్
    జిరుదర హాసమున్ విడక జేయనుచున్నట ప్రోత్సహించిరే
    దురితము లెన్నియో సలుపు దుర్మతు లన్ విడి యాయొకండనే
    వరగుణ వంతుఁడైన శిశుపాలునిఁ గృష్ణుఁడు సంపుటొప్పునే.

    రిప్లయితొలగించండి
  30. పశుపాలుండనుచు సతము
    పిశునముగా మాటలాడ వేగిరపడుచున్
    వశుడగుచును క్రోధమునకు
    శిశుపాలుని జంపదగునె శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి
  31. విశదముగ వంద మారులు
    పశుపాలకుడనుచు చేరి పరిహించుచునే
    నిశితముగ జపము జేసిన
    శిశుపాలుని జంపదగునె శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి