పుర'హరి'వి నీ వు'మాధవ'! పూజ్యపాద!సర్వలో'కేశ! వ'రద! యో చంద్రచూడ!'అచ్యుత' ప్రభావుఁడవని యనవరతమునిన్నుఁ గొలిచెద శంకరా! సన్నుతింతు.
శంకరయ్యగారూ! మీ పూరణ మత్యంతాద్భుతముగ నున్నది! శుభాభినందనలు!
మైలవరపు వారి పూరణ కామహ ! రిపుగర్వాపహ !వామార్ధతనూ ! ఉమాధవా ! శివ ! భద్రా !వ్యోమామలకేశ ! వదాన్యా ! మము రక్షించుమయ్య ! అచ్యుతకరుణా !! మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.
హే యుమాధవా! పురహరివీవె గాదెయచ్యుతడవని తలతునో యగ్గికంటిహేమకేశవా శితికంఠ యిందుమౌళిశరణు శరణంటి వృషపతి శమనరిపుడ.
విరించి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.'హేమకేశవా, శమనరిపుడ'?
హరిశయ నంబున పూజలు పరిపరి విధముల జేసి పరవశ మొందన్ వరదుడ మాధవ కేశవ నిరతము నినుకొలుతు నంచు నిక్కమ చ్యుతా
అక్కయ్యా,'హరిశయనంబు'? ఇది శివస్తుతిలా లేదు. 'నిక్క మచ్యుతా' అన్నచోట గణదోషం.
(నీలగ్రీవుని స్తుతిస్తున్న దశగ్రీవుడు)ఈశ!హరిణాంకమౌళి!మహేశ!గిరిశ!శ్రీయుమాధవ!శంకర!చిన్మయాంగ!వ్యోమకేశ!వరద!హర!కామవైరి!గగనసీమాచ్యుతామరగాంగధారి!
జంధ్యాల వారూ,మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
ప్రహరించినట్టి దోహరివి! హరుడ! లోకేశ! వామ! విజయేశుడ! యీశ! హిరణ్యకవచ! మా ధవ!అహర్నిశలుకొలుతుమయ్య యచ్యుతయనుచున్జిలేబి
జిలేబి గారూ,మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!వామదేవ! పరీణా[హ! రి]పువినాశ!పురహ! రో[మాధవ]! గిరీశ! భూతనాథ!వ్యోమ[కేశ! వ]ర్ధన! శంభు! కామహంత!లేలిహా! [సాచ్యుత]శరీర! ఫాలనయన!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'హరి'మిత్ర! యో యు'మాధవ'!పరమేశా! వ్యోమ'కేశ! వ'ర్ధన! రుద్రా!వరదా! 'యచ్యుత'రూపా!సురపూజిత! ఫాలనేత్ర! శూలధర! హరా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొలిచెద పురహరి నినునేపిలుతు నుమాధవ యనుచును పేదనుగనుమాతెలియము లోకేశ వరద బలు నచ్యుతమగు మహిమలు పన్నగధారీ యజ్ఞమూర్తి ద్వారకా నాథ్
నీలకంఠ యుమాధవ ఫాలనేత్రనాగభూషణ పురహరి నవ్యతేజసర్వలోకేశ వరదాయి సన్నుతాంగఅచ్యుతుడవౌచు మమ్మేలు మార్ద్రహృదయ
దో(హరి) పొడతో వరాహము కొరకు పోరాడి కరుణతోడ నాడు పాశుపతమునొసగినట్టి పరమేశ , ఊరి(కే ,శవ)రుడ నీపైన జలము పోసి హరహర యనినంత పరుగున యేతెంచికాపాడు నీ మది ఘనము కాదె, (మాధవ) మడుగిడ మదనుడు నీపైన శరములు గుప్పించ కరుణ లేక కాల్చితివి గదా మూడవ కన్నుతోడ, (నచ్యుత) మగు దీక్షకలిగి యన్ని వేళలందు పూజలు చేతును యిందు మౌళి,కాచు మయ్య సదాశివా కరుణ తోడ మాధవము = వసంత ఋతువు , దోహరి = నీచ జాతివాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'ఊరకే... పరుగున నేతెంచి... చేసెద నిందుమౌళి' అనండి.
శ్రీ గురుభ్యోన్నమః🙏హరి - మాధవ - కేశవ - అచ్యుతదత్తపది - శివస్తుతిఅహం,మొహం,సాహసం,అల్లరి మని నందిపై దిరిగే, గంగను మానవాళికి వదిలిన శివుని ఎప్పుడూ స్తుతించుము.-అని ఊహ ఈ పూరణము.ఓహరి^ రానీకు దరికి,మోహము విడుమా ధవళము* మోపున శూలిన్సాహస, కేశవ° మువదలిపాహీ గంగాచ్యుత+ యనిఁ బాడుము నిరతమ్!^అహంపూరితం; *ఆబోతు,నంది;°వేళాకోళము; +గంగను వదలినవాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నిరతమ్' అని హలంతంగా వ్రాయరాదు. "...బాడుము సతమున్" అనండి.
హరియించును పాతకములపురాంతకు డుమాధవుండు భువనేశ్వరుడాహర వ్యోమకేశ వర సద్గురు డచ్యుత జ్ఞానమూర్తి ధ్రువముగ నెపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'జ్ఞానమూర్తి'కు ముందున్న 'త' గురువై గణదోషం. సవరించండి.
హరియించును పాతకములపురాంతకు డుమాధవుండు భువనేశ్వరుడాహర వ్యోమకేశ వర సద్గురు డచ్యుత భవకరుండు ధ్రువముగ నెపుడున్ 🙏
హరియింతువు పాపములనుమరువకు నను పాపుడను సుమా ధవళాంగా హరిపదకేశ వదల నీచరణము లచ్యుతములైన సద్గతు లిమ్మా.
మనోహరమైన పూరణ. అభినందనలు.
ధన్యవాదాలండీ.
ఏదయ్యా శివ యచ్యుతా! అచలుడా! యేదయ్య నీరూపమౌ?వేదాధ్యాయియె జూచి దోహరిగ నన్వేషించె నద్వైతమున్ కాదా శంకరుడేను మా ధవ! కృపన్ ఖట్వాంగి లోకేశ! వామా! దాంతమ్మును చేర్చుమయ్య విధుడా! మల్లారి!భృంగీశుడా!జిలేబి
హరి భూషణ చంద్రకళావిరాజి తోమాధవ! పరివేష్టిత వసుధాధర తన యాసిత కేశ వర రమణ్యచ్యుత నిరంతర నుతా ప్రణతుల్
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పురహరివియోయుమాధవ!వరమగులోకేశ!వరద!పావనచరితా!నిరతమునచ్యుతదేహుడ!పరమునునాకిమ్ముదయనుబశుపతినాధా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'నిరతాచ్యుతదేహా! స। త్పరమును...' అనండి బాగుంటుంది.
హరుని నామ మహిమ హరియించు పాపా లుఁమాధవుండ నిశము మనకు రక్ష వ్యోమకేశ !వరద! కామనఁ దీర్పరా!ఆర్తితోడఁగొల్తు నచ్యుతుండ!
హరియించుమయ్య నిలమాదురితముల నుమాధవనవి దోసంబనకన్కరుణించు మచ్యుతమవనిహరి కేశవులదయ మాకు హర్షము తోడన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'హరియించుమయ్య యిల...' అనండి.
..............🌻శంకరాభరణం🌻.................................🤷🏻♂దత్తపది 🤷♀.................... *హరి - మాధవ - కేశవ - అచ్యుత* పై పదాలతో అన్యార్థంలో శివ స్తుతి నచ్చిన ఛందంలో పద్యం సందర్భము: ఒక భక్తుని శివ ప్రార్థన.~~~~~~~~~~~~~~~~~~~~~~~ వెత లెల్లన్ హరియింపగా.. ననఘమౌ విజ్ఞాన మందింపగా సతమున్ బ్రీతి నుమాధవ స్మరణమే సర్వోత్తమం బౌట.. "నా శ్రితపోషా! హర! వ్యోమకేశ! వరదా! జీవేశ! దేవేశ! అ చ్యుత తత్వైక ప్రకాశ!" యంచుఁ నిను నే స్తోత్రంబుఁ గావించెదన్.. ✒~డా.వెలుదండ సత్యనారాయణ 1.7.19-----------------------------------------------------------
అద్భుతమైన పూరణ. అభినందనలు.
హరిపదకేశ వారిజభవార్చితపాద యుమాధవా చ్యుత స్ఫురణ మహేశ్వరా స్మరనిషూదన పర్వతరాజ పుత్రికా వర కరుణాకరా దివిజవందిత తారకవైరితాత శ్రీకర పరమేశ్వరా గరళకంఠ సదాశివ శంభు శంకరా.
హరిభూష!ఉమాధవ!శివ!కరిచర్మాంబరధర!సూరగంగాజూటా!పరమపురుషా!త్రిలోకేశ!వరదాచ్యుత!వామదేవ! పాలింపగదే!
కొద్ది సవరణతో ..............ఓ యుమాధవా! పురహరి యూర్ధ్వశాయి యచ్యుతుడవని తలతునో యగ్గికంటిహేమకేశ వాజసనుడ యిందుమౌళిశరణు శరణంటి వృషపతి కరుణ జూపు.
మదనుని సంహరించిన యుమాధవు డేగద యచ్యుతుండిలన్ వ్యధలను దీర్చుచున్ బుడమి బాలన సేసెడి వాడతండె, తాహృదయమునందు కేశవుడ నింపుగ నిల్పిన శక్తి శాలినిన్ యెద గుడి చేసి నిల్పితిని యీశ్వరు నేనుగు తోలు తాల్పునిన్.
డా.పిట్టా సత్యనారాయణహరితా హారము ,మంచు పర్వతము నా హ్లాదంపు గంగమ్మతోదరి జేరం గదె మా ధవుండవు కదా! దాక్షిణ్యతన్ మాకిదేసరి నీ పాదము నంటకే శవముకౌ సాక్షాత్తు నీ బోధలన్బరి తృప్తిం బొనరించ వచ్యుత గతిన్ బాటించ నీవే శివా!!
హరిహర రూపా శూలీవరములనొసగే యుమాధవా గిరిజేశావరకేశవా సతత మీసిరినచ్యుతమవకజూడు శ్రితజనపాలా.
పుర'హరి'వి నీ వు'మాధవ'! పూజ్యపాద!
రిప్లయితొలగించండిసర్వలో'కేశ! వ'రద! యో చంద్రచూడ!
'అచ్యుత' ప్రభావుఁడవని యనవరతము
నిన్నుఁ గొలిచెద శంకరా! సన్నుతింతు.
శంకరయ్యగారూ! మీ పూరణ మత్యంతాద్భుతముగ నున్నది! శుభాభినందనలు!
తొలగించండిమైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండికామహ ! రిపుగర్వాపహ !
వామార్ధతనూ ! ఉమాధవా ! శివ ! భద్రా !
వ్యోమామలకేశ ! వదా
న్యా ! మము రక్షించుమయ్య ! అచ్యుతకరుణా !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. వారికి అభినందనలు.
తొలగించండిహే యుమాధవా! పురహరివీవె గాదె
రిప్లయితొలగించండియచ్యుతడవని తలతునో యగ్గికంటి
హేమకేశవా శితికంఠ యిందుమౌళి
శరణు శరణంటి వృషపతి శమనరిపుడ.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'హేమకేశవా, శమనరిపుడ'?
హరిశయ నంబున పూజలు
రిప్లయితొలగించండిపరిపరి విధముల జేసి పరవశ మొందన్
వరదుడ మాధవ కేశవ
నిరతము నినుకొలుతు నంచు నిక్కమ చ్యుతా
అక్కయ్యా,
తొలగించండి'హరిశయనంబు'? ఇది శివస్తుతిలా లేదు. 'నిక్క మచ్యుతా' అన్నచోట గణదోషం.
(నీలగ్రీవుని స్తుతిస్తున్న దశగ్రీవుడు)
రిప్లయితొలగించండిఈశ!హరిణాంకమౌళి!మహేశ!గిరిశ!
శ్రీయుమాధవ!శంకర!చిన్మయాంగ!
వ్యోమకేశ!వరద!హర!కామవైరి!
గగనసీమాచ్యుతామరగాంగధారి!
జంధ్యాల వారూ,
తొలగించండిమనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిప్రహరించినట్టి దోహరి
వి! హరుడ! లోకేశ! వామ! విజయేశుడ! యీ
శ! హిరణ్యకవచ! మా ధవ!
అహర్నిశలుకొలుతుమయ్య యచ్యుతయనుచున్
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండివామదేవ! పరీణా[హ! రి]పువినాశ!
పురహ! రో[మాధవ]! గిరీశ! భూతనాథ!
వ్యోమ[కేశ! వ]ర్ధన! శంభు! కామహంత!
లేలిహా! [సాచ్యుత]శరీర! ఫాలనయన!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'హరి'మిత్ర! యో యు'మాధవ'!
రిప్లయితొలగించండిపరమేశా! వ్యోమ'కేశ! వ'ర్ధన! రుద్రా!
వరదా! 'యచ్యుత'రూపా!
సురపూజిత! ఫాలనేత్ర! శూలధర! హరా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికొలిచెద పురహరి నినునే
రిప్లయితొలగించండిపిలుతు నుమాధవ యనుచును పేదనుగనుమా
తెలియము లోకేశ వరద
బలు నచ్యుతమగు మహిమలు పన్నగధారీ
యజ్ఞమూర్తి ద్వారకా నాథ్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీలకంఠ యుమాధవ ఫాలనేత్ర
రిప్లయితొలగించండినాగభూషణ పురహరి నవ్యతేజ
సర్వలోకేశ వరదాయి సన్నుతాంగ
అచ్యుతుడవౌచు మమ్మేలు మార్ద్రహృదయ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదో(హరి) పొడతో వరాహము కొరకు పోరాడి కరుణతోడ నాడు పాశు
రిప్లయితొలగించండిపతమునొసగినట్టి పరమేశ , ఊరి(కే ,శవ)రుడ నీపైన జలము పోసి
హరహర యనినంత పరుగున యేతెంచికాపాడు నీ మది ఘనము కాదె,
(మాధవ) మడుగిడ మదనుడు నీపైన శరములు గుప్పించ కరుణ లేక
కాల్చితివి గదా మూడవ కన్నుతోడ,
(నచ్యుత) మగు దీక్షకలిగి యన్ని వేళ
లందు పూజలు చేతును యిందు మౌళి,
కాచు మయ్య సదాశివా కరుణ తోడ
మాధవము = వసంత ఋతువు , దోహరి = నీచ జాతివాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఊరకే... పరుగున నేతెంచి... చేసెద నిందుమౌళి' అనండి.
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండిహరి - మాధవ - కేశవ - అచ్యుత
దత్తపది - శివస్తుతి
అహం,మొహం,సాహసం,అల్లరి మని నందిపై దిరిగే, గంగను మానవాళికి వదిలిన శివుని ఎప్పుడూ స్తుతించుము.-అని ఊహ ఈ పూరణము.
ఓహరి^ రానీకు దరికి,
మోహము విడుమా ధవళము* మోపున శూలిన్
సాహస, కేశవ° మువదలి
పాహీ గంగాచ్యుత+ యనిఁ బాడుము నిరతమ్!
^అహంపూరితం; *ఆబోతు,నంది;
°వేళాకోళము; +గంగను వదలినవాడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిరతమ్' అని హలంతంగా వ్రాయరాదు. "...బాడుము సతమున్" అనండి.
హరియించును పాతకముల
రిప్లయితొలగించండిపురాంతకు డుమాధవుండు భువనేశ్వరుడా
హర వ్యోమకేశ వర స
ద్గురు డచ్యుత జ్ఞానమూర్తి ధ్రువముగ నెపుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జ్ఞానమూర్తి'కు ముందున్న 'త' గురువై గణదోషం. సవరించండి.
హరియించును పాతకముల
తొలగించండిపురాంతకు డుమాధవుండు భువనేశ్వరుడా
హర వ్యోమకేశ వర స
ద్గురు డచ్యుత భవకరుండు ధ్రువముగ నెపుడున్ 🙏
హరియింతువు పాపములను
రిప్లయితొలగించండిమరువకు నను పాపుడను సుమా ధవళాంగా
హరిపదకేశ వదల నీ
చరణము లచ్యుతములైన సద్గతు లిమ్మా.
మనోహరమైన పూరణ. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలండీ.
తొలగించండి
రిప్లయితొలగించండిఏదయ్యా శివ యచ్యుతా! అచలుడా! యేదయ్య నీరూపమౌ?
వేదాధ్యాయియె జూచి దోహరిగ నన్వేషించె నద్వైతమున్
కాదా శంకరుడేను మా ధవ! కృపన్ ఖట్వాంగి లోకేశ! వా
మా! దాంతమ్మును చేర్చుమయ్య విధుడా! మల్లారి!భృంగీశుడా!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరి భూషణ చంద్రకళా
రిప్లయితొలగించండివిరాజి తోమాధవ! పరివేష్టిత వసుధా
ధర తన యాసిత కేశ వ
ర రమణ్యచ్యుత నిరంతర నుతా ప్రణతుల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిపురహరివియోయుమాధవ!
రిప్లయితొలగించండివరమగులోకేశ!వరద!పావనచరితా!
నిరతమునచ్యుతదేహుడ!
పరమునునాకిమ్ముదయనుబశుపతినాధా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'నిరతాచ్యుతదేహా! స। త్పరమును...' అనండి బాగుంటుంది.
హరుని నామ మహిమ హరియించు పాపా లుఁ
రిప్లయితొలగించండిమాధవుండ నిశము మనకు రక్ష
వ్యోమకేశ !వరద! కామనఁ దీర్పరా!
ఆర్తితోడఁగొల్తు నచ్యుతుండ!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిహరియించుమయ్య నిలమా
రిప్లయితొలగించండిదురితముల నుమాధవనవి దోసంబనకన్
కరుణించు మచ్యుతమవని
హరి కేశవులదయ మాకు హర్షము తోడన్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'హరియించుమయ్య యిల...' అనండి.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂దత్తపది 🤷♀....................
*హరి - మాధవ - కేశవ - అచ్యుత*
పై పదాలతో అన్యార్థంలో శివ స్తుతి
నచ్చిన ఛందంలో పద్యం
సందర్భము: ఒక భక్తుని శివ ప్రార్థన.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
వెత లెల్లన్ హరియింపగా.. ననఘమౌ
విజ్ఞాన మందింపగా
సతమున్ బ్రీతి నుమాధవ స్మరణమే
సర్వోత్తమం బౌట.. "నా
శ్రితపోషా! హర! వ్యోమకేశ! వరదా!
జీవేశ! దేవేశ! అ
చ్యుత తత్వైక ప్రకాశ!" యంచుఁ నిను నే
స్తోత్రంబుఁ గావించెదన్..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
1.7.19
-----------------------------------------------------------
అద్భుతమైన పూరణ. అభినందనలు.
తొలగించండిహరిపదకేశ వారిజభవార్చితపాద యుమాధవా చ్యుత
రిప్లయితొలగించండిస్ఫురణ మహేశ్వరా స్మరనిషూదన పర్వతరాజ పుత్రికా
వర కరుణాకరా దివిజవందిత తారకవైరితాత శ్రీ
కర పరమేశ్వరా గరళకంఠ సదాశివ శంభు శంకరా.
హరిభూష!ఉమాధవ!శివ!
రిప్లయితొలగించండికరిచర్మాంబరధర!సూరగంగాజూటా!
పరమపురుషా!త్రిలోకేశ!
వరదాచ్యుత!వామదేవ! పాలింపగదే!
కొద్ది సవరణతో ..............
రిప్లయితొలగించండిఓ యుమాధవా! పురహరి యూర్ధ్వశాయి
యచ్యుతుడవని తలతునో యగ్గికంటి
హేమకేశ వాజసనుడ యిందుమౌళి
శరణు శరణంటి వృషపతి కరుణ జూపు.
మదనుని సంహరించిన యుమాధవు డేగద యచ్యుతుండిలన్
రిప్లయితొలగించండివ్యధలను దీర్చుచున్ బుడమి బాలన సేసెడి వాడతండె, తా
హృదయమునందు కేశవుడ నింపుగ నిల్పిన శక్తి శాలినిన్
యెద గుడి చేసి నిల్పితిని యీశ్వరు నేనుగు తోలు తాల్పునిన్.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిహరితా హారము ,మంచు పర్వతము నా హ్లాదంపు గంగమ్మతో
దరి జేరం గదె మా ధవుండవు కదా! దాక్షిణ్యతన్ మాకిదే
సరి నీ పాదము నంటకే శవముకౌ సాక్షాత్తు నీ బోధలన్
బరి తృప్తిం బొనరించ వచ్యుత గతిన్ బాటించ నీవే శివా!!
హరిహర రూపా శూలీ
రిప్లయితొలగించండివరములనొసగే యుమాధవా గిరిజేశా
వరకేశవా సతత మీ
సిరినచ్యుతమవకజూడు శ్రితజనపాలా.