27, జులై 2019, శనివారం

దత్తపది -159

కవిమిత్రులారా,
"తట్ట - గుట్ట - చుట్ట - పుట్ట"
పై పదాలను ప్రయోగిస్తూ
'స్వచ్ఛభారత్' లక్ష్యాల గురించి
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యం వ్రాయండి. 

27 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    అభినవ గిరీశమునకు:

    తట్టల్ పట్టుచు గాంధితాత సబబౌ ధర్మమ్ము బోధింప,...పల్
    గుట్టల్ జౌరెడు పేదరాండ్ర సొగసుల్ ఘోరమ్ముగా చెల్లగా...
    చుట్టల్ కాల్చుచు వీధులన్నిటను నీ శూరత్వమున్ చాటితే!...
    పుట్టంగా ఘన భారతావనికికన్ పొంకమ్ము జోడింపుమా!

    రిప్లయితొలగించండి
  2. తట్టసముగ నడుము బిగించి
    గుట్టలు గుట్టలు పెరిగిన గోవ్యా ఘ్రములన్
    పుట్టల పుట్టలు మెండన
    చుట్టలు చుట్టలు గచుట్టి సోద్దెంబొందన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం॥
      తట్టల నిండుగ జెత్తను
      గుట్టలుగా పారబోయ గుళ్ళిన యెడలన్
      పుట్టలుగ జబ్బులెన్నియొ
      చుట్టములుగ దరికి జేరి చోదను
      కూర్చున్

      తొలగించండి
  3. 1.తట్టలేదు నాకు చెట్టుబెట్టాలని
    పుట్టకుండె మనసు చెట్టు బెంచ
    గుట్టవోలె బెరుగ గుర్తించ కుంటిని
    చుట్టమోలె చెత్త చుట్టుజేర
    స్వచ్చభారతమ్ము సారమెరుగకున్న
    రోగ కారకమ్ము రూఢిగనుము!!


    2.చెట్టు గూల్చి మనము చెట్లు బెంచగనేల
    పుట్టవోలె చెత్తగుట్టలేల
    చట్టమనిన నదియె చుట్టమ్ముగాదయా
    తట్ట బోద చినుకు దారి గనవు!!

    రిప్లయితొలగించండి
  4. తట్టల కొద్ది తుక్కుడు పదార్థములన్ బుర వీధులందునన్
    గుట్టలు గాను పోసినను కుప్పలు క్రుళ్ళుచు మెండుగా నటన్
    పుట్టవె తీక్షతుండములు, భూరిగ వ్యాధులు జేరవచ్చు నీ
    చుట్టవి మానవా! శుచిని శుభ్రతఁ బెంచుము స్వచ్ఛ భారతిన్.

    రిప్లయితొలగించండి


  5. తట్టంచు నందుకొని తిరు
    కట్టెను, బుట్టను, బిగించి గట్టిగ నడుమున్
    గుట్టల చెత్తను కరువలి
    చుట్టంబున కాహుతిమ్మ శుచితయు పుట్టన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి

  6. ఆకాశవాణికి పంపినది


    నిజమైన స్వచ్ఛ భారత్ అడుగున దాగిన దో నంబరీ‌ దస్కాల్ బయటకు రావడమే !


    గుట్టల త్రవ్వగ దేశం
    బట్టడుగున దాగినట్టి స్వచ్ఛత రావా
    ల్తట్టంచు చుట్టను విడిచి
    పుట్టలకొలది జనులెల్ల పొందగ వృద్ధిన్!



    జిలేబి

    రిప్లయితొలగించండి
  7. మైలవరపు వారి పూరణ

    తట్టగఁదప్పు రోగముల ద్వారము స్వచ్ఛత నిండి యున్నచో .,
    గుట్టలుగాగ చెత్త మనకున్ మరి నచ్చునె యింటియందు ? మీ
    చుట్టములున్ వ
    హితుల్ కలసి సుందరభారతమెంచకున్నచో
    పుట్టగనేమి ? సేవనిడ పుట్టిన పుట్టుక సార్థకంబగున్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  8. ఉత్పలమాల||
    చట్టమునన్ దశాబ్దముల సాధ్యముగాని దలంపు తట్టగన్,
    చుట్టగ చెత్త, దేశమును, శుభ్రముజేసెడి గుట్టదేమనన్,
    చుట్టములన్ వలెన్ ప్రజలు, చొప్పుల, దీక్షగ బాగుజేసె, పై
    మెట్టును గాంచు మోడికిని, మేటగు రాజ్యము పుట్టగోరుచున్.

    రిప్లయితొలగించండి
  9. ఆకాశవాణికి పంపిన పూరణ:

    నెట్టన నెల్ల పౌరులకు నెమ్మిని గూర్చ, తొలంగ తట్టముల్,
    గుట్టలు మెట్టమెట్టులుగ కుళ్ళుపదార్ధములున్నతావులన్
    'చుట్టలుగుం'బలెన్ మశకసూడులయుద్ధతినుత్తరించ చే
    బట్టిరి స్వచ్ఛభారతిని పచ్చని పుట్టముగట్టి, పెంపుగా.

    నెట్టన = అనివార్యంగా
    తట్టము-కష్టము
    మెట్టమెట్టు- కొండ
    చుట్టలుగు - చక్రాయుధము

    రిప్లయితొలగించండి
  10. తట్టలు చేతబూని శ్రమదానము జేయుడు,స్వచ్ఛ భారతిన్
    జట్టుగ కొల్వరండి కలుషమ్ములు పేరుకుపోయె గుట్టలై
    చుట్టగలెండి భారతికి సుందరమౌ పలు పచ్చహారముల్
    పుట్టగ లాభగమేమి ధర,పూని చరించుడు గాంధి బాటలో

    తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష

    రిప్లయితొలగించండి
  11. తట్టగఁ "స్వచ్ఛభారత" స్వ
    ధర్మపు భావన డెందమందునన్
    గుట్టల చెత్త మాయమగుఁ
    గూర్చును స్వాస్థ్యము,రోగమేదియున్
    చుట్టపుఁ జూపుగా మనలఁ
    జూడగఁ రాదిక లెమ్ము సోదరా!
    పుట్టవు రోగకారకపు
    పుర్వులు,రమ్మిక "బాపు" త్రోవకున్!!

    రిప్లయితొలగించండి
  12. గుట్టలచాటునన్ మిగులగోప్యపు రీతివిసర్జనక్రియన్
    మట్టునుబెట్టుచున్ సతుల మానపురక్షణ ముఖ్యలక్ష్యమై
    తట్టలనిండుగన్ దొరలు దారులవెంబడి చెత్తచుట్టలన్
    పుట్టగ కొత్తవస్తువులు పూర్తిగ రూపముమార్చివేయుచున్
    కట్టగ స్వచ్ఛపుం భరతఖండము మోదిది స్వప్నమీయదే!

    రిప్లయితొలగించండి
  13. తట్టగ మోదీ చేసెను
    చట్టంబును భారతంపు స్వచ్ఛత కొఱకై
    చుట్టున శుభ్రత కలిగిన
    పుట్టవు కద రోగంబులు భువిలో యెపుడున్

    రిప్లయితొలగించండి
  14. తట్టదు నీ మది కేలా
    గుట్టలుగా చెత్త పేర్చి గూర్చుండినచో
    చుట్టక మానవు గద నిను
    పుట్టల కొలదిగ క్రిములవి పుట్టుకు వచ్చున్

    రిప్లయితొలగించండి
  15. తట్టదు నీ మది కేలా
    గుట్టలుగా చెత్త పేర్చి గూర్చుండక నా
    చుట్టల నెరువుగ మార్చిన
    పుట్టవు గద రోగములిక పురమందిటులన్

    రిప్లయితొలగించండి
  16. స్వచ్ఛ భారత మునకునై సాదరముగ
    తట్ట జేబూని గుట్టలుపుట్ట గమిని
    చట్ట పరముగ జేసిరి చదునుగాను
    భక్తి శ్రద్ధలుగలుగుమా బడిపిడుగులు
    దేశ సంపద నభి వృద్ధి దెచ్చుకొఱకు

    రిప్లయితొలగించండి
  17. ఉత్పలమాల

    తట్టల కెత్తి కల్మషము దారుల వీధుల శుభ్రమెంచుచున్
    గుట్టలు పోసి వేటికవి కూర్చఁ బునర్వినియోగ దృష్టితో
    చుట్టము 'స్వచ్ఛభారత' ను సూనృత కార్యము భారతంబునన్
    పుట్టదె నక్రమార్కులకు ప్రోథము వారలకన్వయించగన్

    (ప్రోథము = భీతి)

    రిప్లయితొలగించండి
  18. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    (అ)స్వచ్ఛ భారత్:

    పుల్లాకుల పుల్లమ్మ (1953) ముత్తుకూరు:👇

    "చుట్టాల్ వచ్చిరి పుట్టపుట్టలుగ మా చుక్కక్కకౌ పెళ్ళికిన్
    బట్టల్ పట్టువి కట్టి చుట్టుచునహో బంగారు వడ్డాణముల్
    గుట్టల్ పోసిరి తట్టతట్ట కబళాల్ గుండ్రమ్ముగా దిబ్బపై
    జుట్టుల్ పట్టుచు నీడ్చ గోరెదను మా చుక్కక్క చుట్టాలనున్"

    రిప్లయితొలగించండి
  19. తట్టలు చేకొని మనమే
    గుట్టలు గుట్టలుగ పేరుకొనగా చెత్తన్
    చుట్టలుగ చుట్టి చెత్తల
    బుట్టల లోన విసిరేయఁ భువి శుద్ధియగున్

    రిప్లయితొలగించండి
  20. గుట్టల పుట్టల ప్రక్కన
    తట్టల చుట్టలు భుజాన తగిలించుకొనీ
    గుట్టుగ ఫొటోలకెక్కుట
    పట్టణ ప్రాంతాల స్వచ్ఛ భారతు కనరే!

    రిప్లయితొలగించండి
  21. తట్టదు మట్టి బుర్రలకు దారుల వెంబడి చెత్త పోయుచున్
    గుట్టలు గాగ వ్యర్ధములు గోలను సేయుట దప్పి కేమియున్;
    చుట్టగు నన్ని చిక్కులును చోద్యము జూడక చేయి కల్పినన్
    పుట్టవి కంటు రోగములు పొందుదురందరు స్వచ్ఛ భారతిన్

    రిప్లయితొలగించండి
  22. వచ్చే వారానికి ఆకాశవాణి వారి సమస్య.....
    *కవి నాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుఁడై*
    మీ పూరణలను గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి...
    Padyamairhyd@gmail.com

    రిప్లయితొలగించండి
  23. పుట్టవు పుర్వులు జనులం
    గుట్టవు లోతట్టవటలు గాంచక పాఱుం
    జెట్టులఁ బెంచుచు నట్టిలు
    పట్టీ చుట్టడరి తుడువ వార్తం బలరున్

    రిప్లయితొలగించండి
  24. గుట్టలుగ కుళ్ళిన మనంబులు అవనిలో
    పుట్టలగు పెరిగెను కల్మష విష సర్పంబులు
    చుట్టలుగ చీడపురుగులీన స్వేచ్చా భారతిన
    తట్టలుగ ఇట్టులే నిర్మూలింప ఆలోచన తట్టెన్

    రిప్లయితొలగించండి
  25. స్వేచ్చా భారతావనిలో కల్మషమె గుట్టగ
    స్వచ్ఛమైన అవిరళ భావముతో నే తట్ట చేపట్టెన్
    మెచ్చిన సత్కార్యముకు శ్రీకారము చుట్టగ
    అచ్చెరువుతో పుట్టెన్ పట్టుదల ఉర్విజనుల

    రిప్లయితొలగించండి