22, జులై 2019, సోమవారం

సమస్య - 3083 (మీసంబులు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా"
(లేదా...)
"మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్" 

66 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  వేసం వేయుచు రౌడి రాజుగ కడున్ విభ్రాంతితో కావలిన్
  సాసర్ నందున పోయకుండగను తా సంబ్రమ్ముతో పాలనున్
  ధ్యాసన్ బెట్టక గిన్నెనెత్తుచును భల్ ధైర్యమ్ముతో త్రాగగన్
  మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వేసం' అనడం వ్యావహారికం. "వేసం బేయుచు" అనండి.

   తొలగించండి
 3. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  ( గురుభ్యోన్నమః నిన్నటి పూరణ స్వీకరింప మ న వి )  [ " పాడుతా తీయగా " programme లో judge గా

  వ్యవహరించు S.P. బాలసుబ్రమణ్యం గారు ]
  ........................................................................


  ముప్పది వేల పాటలను ముద్దుగ పాడిన యస్.పి. బాలు , గా

  రొప్ప రపశ్రుతిన్ బలుక | నోరిమితో సవరించి , సంగతుల్

  గుప్పును | బాలగాయకులకున్ దగు శిక్షణ నిచ్చు చిట్లనున్ :-

  " తప్పులజూప నా కెపుడు దక్కుచునుండును సంతసం బిట ,

  న్నొప్పును గానసత్కళ మహోన్నతమై భువిలో నజస్రమున్ "  { సంగతి = రాగాలాపన లోని గమకము }


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 4. భేషని పొగుడుచు తల్లియె
  పోసేను పాలను తనయకు, ముదమున త్రాగన్
  వాసిగ పెదవుల కంటగ
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహో.

  రిప్లయితొలగించండి
 5. మైలవరపు వారి పూరణ

  ఆసన్ పాలను జిల్కు వేళ గని యేకాంతమ్ముగా కన్నులన్
  మూసెన్ వెన్కగ వచ్చి భర్త , సతి సమ్మోదమ్మునన్ మూతికిన్
  రాసెన్ వెన్న , నతండు ముద్దులిడ , ముద్రన్ వేయ జెక్కిళ్లపై
  మీసంబుల్ , గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఆసన్ దా దధిఁ జిల్కు వేళ గని యేకాంతమ్ముగా కన్నులన్
   మూసెన్ వెన్కగ వచ్చి భర్త , సతి సమ్మోదమ్మునన్ మూతికిన్
   రాసెన్ వెన్న , నతండు ముద్దులిడ , ముద్రన్ వేయ జెక్కిళ్లపై
   మీసంబుల్ , గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్ !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
 6. వేసము వేయగ పురుషుని
  మోసము జేయుచు నురంగు ముదముగ పూసెన్
  హాసము జేసిరి జనులట
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  రిప్లయితొలగించండి
 7. రాశుల లింగంబులపై
  దోసిలితో బూది పూసి తోయముఁ జిలికెన్,
  దోసము లెంచకు పూజసు
  మీ! "సంబులు" దెల్లనయ్యె మీనాక్షి కహా..
  (సంబుడు=శివుడు)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని భావం కొంచెం సందిగ్ధంగా ఉంది.

   తొలగించండి
 8. ఏసంబుకట్టినారట
  మాసాంతమునన్ మహిళలు మగవేషములే
  వేసిరి వారలె మొలిచిన
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా!!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ గురుభ్యోన్నమః🙏

  దేసముల నేలు దల్లిని
  నా సుందరమూర్తి జేరి నధరము గ్రోలన్
  నా సిగరి నంట ముఖమున
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  సిగరి-విభూతి,భస్మం

  రిప్లయితొలగించండి
 10. చేసెనొక మగడు హాస్యము
  పూసెను సుద్దను ముఖముకు పొలతికి నిద్రన్
  చూసియు నచ్చెరు వందెను
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షికహో

  రిప్లయితొలగించండి
 11. మీసము పలుచగ నుండెడి
  వేసమె యా ముదితది మరి వీక్షించుడహో!
  కాసిన వృద్ధాప్యమునను
  *"మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా"*

  రిప్లయితొలగించండి
 12. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వాసుకు వయసది మించగ
  మీసంబులు దెల్లనయ్యె; మీనాక్షి కహా
  వ్యాసమయ్యె నొడలు మరి
  వాసిగ నుండెడి కురులవి వదులై రాలెన్.

  రిప్లయితొలగించండి
 13. దోసం బేమి ముదుసలికి
  వేసంబే గద సరి యనె వెంకడు గానిన్
  రోసంబం చటులుంచిన
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  రిప్లయితొలగించండి
 14. గ్లాసుడు పాలను గుటగుట
  లేసము వదలకనుమింగు లేమకు భళిరే
  వాసిగ పలుచగ మొలచిన
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  రిప్లయితొలగించండి
 15. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హాసముతో నుప్పొంగుచు
  వాసిగ నెలమిని కెరలుచు పతి నొసగినవౌ
  పోసన మదవద త్రాగిన
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు
   పతి యొసగినవౌ.. అని ఉండాలి కదా?

   తొలగించండి
 16. సీసాలోనొక క్యాట్ఫిషుండెను క్షమాశీలుండు రక్షించగన్
  వాసంబిద్దియె దానికిన్ బ్రతుకగన్ వార్ధక్యమవ్వన్ గనెన్
  సీసా బింబమునందు చేప దలచెన్ ఛీ! యందమేదీ యనన్!
  మీసంబుల్ కడు తెల్లనయ్యెను కదా మీనాక్షికిన్ వింతగన్

  చమత్కారంగా పూరించు ప్రయత్నం. ఒక ఉదాత్తుడు ఒక క్యాట్ ఫిష్ని రక్షించి ఒక సీసాలో పెట్టాడు. అది కాలం గడిపి వృద్ధాప్యమొచ్చిందని ఆ సీసా బింబంలో తనను తాను చూసుకుని అనుకుంది. నా అందమెమైంది? మీనాక్షికి మీసలు తెల్లబడ్డాయని.. catfish కి మీసాకుంటాయ్ కదా
  Rohit

  రిప్లయితొలగించండి
 17. కందం
  మూసిన తలుపులఁ దీయుచు
  దోసిట గొని వెన్నదినుచు తుంటరివాడై
  హాసమున పులుమ వెన్నుడు
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా!

  రిప్లయితొలగించండి
 18. దోసెడు భస్మము జేకొని
  వాసిగ నొడలంతపూయు వసుధారథుకున్
  నాశగ బుగ్గన ముద్దిడ
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

  రిప్లయితొలగించండి
 19. శార్దూలవిక్రీడితము
  దోసంబుల్ గనుమా యశోద! తగ ప్రత్యూషంపు వేళన్ సుమా!
  త్రోసెన్ మెక్కుచు వెన్నమీగడలనే దొంగాటగా వెన్నుడే
  పూసెన్ వాటిని మీసమేర్పడునటుల్ మూతిన్గనన్ తుంటరై
  మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్

  రిప్లయితొలగించండి


 20. కూసింతగ సహవాసము
  మీసంబులు దెల్లనయ్యె! మీనాక్షి "కహా"
  నీ, సంపంగియ తైలము
  కూసింతగ తెమ్మ రాసుకొనెద జిలేబీ :)


  జిలేబి

  రిప్లయితొలగించండి
 21. మీసంబుల్ రజితమ్ములౌట భవుడున్న్మేల్రీతి భాసింపగా
  కాసింతైన మెరుంగు బెట్టుటకునై కంసాలినింబిల్వగా
  నాసాంతమ్ముగజేసి యాతడతికెన్ హైమాముఖాబ్జమ్మునన్
  మీసంబుల్ కడు దెల్లనయ్యెనుగదా మీనాక్షికిన్ వింతగన్

  రిప్లయితొలగించండి
 22. దోసంబు లేమి యక్కట
  చేసెనొ యీతం డనుచు నశేషంబు మదిన్
  రోసంబు గల్గ, భర్తకు
  మీసంబులు దెల్లనయ్యె, మీనాక్షి కహా


  ఆ సాంబుండు దయారసార్ద్రహృది నిత్యారాధ్య దేవుండు కై
  లాసోర్వీధర మందు న్యస్తములు భద్రప్రౌఢిఁ గల్మాషమే
  యాసాంతంబును హర్షదమ్మగుచు, నీహారాద్రి లింగాకృతుల్
  మీ సంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా, మీనాక్షికిన్ వింతగన్

  [సంబులు = శివ ప్రతిమలు; సంబుఁడు = శివుఁడు]

  రిప్లయితొలగించండి
 23. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వాసిన్ జెందిన పుణ్యభూమి మదురన్ బ్రహ్మాండమౌ పండుగన్
  దాసుల్ వేయగ నిచ్చెనెక్కుచునటన్ దట్టంబుగా సున్నమున్
  కాసింతయ్యయొ గాలి గోపురమునన్ కంగారునన్ జారగా
  మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్

  రిప్లయితొలగించండి
 24. క్రొవ్విడి వెంకటరాజారావు:

  వ్యాసంబై వెలుగొందుచుండు నెలమిన్ ప్రాణేశుడారాత్రి దా
  వాసిన్ మీఱుచు నందమైన తళిగన్ పాలుంచి నర్పించగా
  హాసంబొంది నడావుడిన్ చవిగొన న్నాపీథ మామూతికిన్నంటినన్
  మీసంబుల్ గడు దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగా!

  రిప్లయితొలగించండి
 25. పూసెన్నల్లని రంగు జుట్టునకు సొంపుల్మీరగా పెళ్ళిలో,
  వేసెన్మీసములందుకూడ నదియే వెంకయ్య, పెళ్ళాయె, తా
  జేసెన్స్నానము బావియొద్ద పతికిన్ శీఘ్రమ్మె కేశంబులున్
  మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా! మీనాక్షికిన్ వింతగన్.

  రిప్లయితొలగించండి
 26. తా సారంగముఁ సంగడీల గొనుచున్ తక్త్రమ్ము నంకించుచున్
  దా సన్మిత్రుల గూడి చక్రి నవనీతమ్మంతయున్ బూయగా
  నా సాధ్విన్ గని యత్తమామలనిరే యయ్యయ్యొ వింతేగదా
  మీసంబుల్ గడుఁ దెల్లనయ్యెను గదా మీనాక్షికిన్ వింతగన్

  రిప్లయితొలగించండి
 27. వేసిన మగ వేషములో
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహో
  వాసిగ నున్నదనుచు సెహ
  బాసని మెచ్చిరి సఖులట వనితను గనుచున్.

  రిప్లయితొలగించండి
 28. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 29. వాసునకప్పుడెచూడుడు
  మీసంబులుదెల్లనయ్యె,మీనాక్షికహో
  రోసముమిక్కీలి యయ్యెను
  బాసలనెటుదీర్చునేమొ.భవ్యునికెఱుకే?

  రిప్లయితొలగించండి
 30. వేసెను భీష్ముని వేషము
  మీసంబులు బెట్టిరపుడు మీనాక్షికియు
  న్నా సన్నివేషమందున
  "మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా"

  రిప్లయితొలగించండి
 31. కాసింబెట్టక నాదుమాటవినుమాకాత్యాయనీమాతభో
  మీసంబుల్గడుదెల్లనయ్యెనుగదామీనాక్షికిన్వింతగన్
  వాసూ!నేకలగంటినిట్లుగసుమాప్రారబ్ధమున్వెంటరా
  మీసాలుండెడుభామలుండుటకటామేమెచ్చటన్ జూడలే

  రిప్లయితొలగించండి
 32. రోసముతో వ్యాయామము
  మాసంబున కొక్కసారి మానక బాలన్
  హాసము త్రాగిన నురుగుల
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా"

  రిప్లయితొలగించండి
 33. దాసుని వేషము వేసిన
  ఆ సమయమునందు తాత ఆశ్చర్య ముగా
  ఈ సుకుమారిని గనగా
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా!

  రిప్లయితొలగించండి
 34. శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.

  ఆ సుందరేశు శిరమున

  పోసిరి భక్తులు విభూతి పూర్ణహృదయులై

  కాసింతయదంటుకొనగ

  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  రిప్లయితొలగించండి


 35. అరరె! ఇరాని ! అమేథీ
  నరె మార్చెదనంచు చెప్పి నా తనయుడినే
  మరి ఓటాఱిచి నావే
  గరళము లభియించ దకట కత్తియు లేదే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 36. వేసవి యందున వేడికి
  గాసిలపడి దీర్ప త్వరితగతి దాహంబున్
  బోసిన మజ్జిగ నురుగుల
  మీసంబులు దెల్లనయ్యె మీనాక్షి కహా

  రిప్లయితొలగించండి