14, జులై 2019, ఆదివారం

సమస్య - 3075 (హంపి విడిచి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి"
(లేదా...)
"హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై"
(ఈరోజు నేను హంపీక్షేత్రాన్ని దర్శిస్తున్న సందర్భంగా)

27 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    పంపాదేవికి క్షేత్ర రూపమగునా బంగారు రాజ్యమ్మునన్
    కంపమ్మొందగ దండయాత్రలనునా కంగారు బేజారునన్
    చంపన్ జాలక యుద్ధమందు తురకన్ జంజాటమౌ తీరునన్
    హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై...:)

    రిప్లయితొలగించండి
  2. నింపాదిన్ ఘన కృష్ణరాయు డట మన్నింపంగ లేడయ్యె యే
    పెంపున్ మాయలు లేని మంత్రిని;కనుల్ పీకించె నిర్భాగ్యుడై
    కంపంబెత్తగ దేవదేవుడది సంఘాతంబుగా నెంచుచున్
    హంపీక్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముడై.

    రిప్లయితొలగించండి
  3. తపముఁ జేసి వరమ్ము బొందగనె వాడు
    శివుని భస్మమ్ము జేయగన్ జేయినెత్త
    దనుజుని దురాగతము గని తత్తర పడి
    హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి

    రిప్లయితొలగించండి
  4. (కొడాలి సుబ్బారావు గారి "హంపీక్షేత్రం"కావ్యం శిథిలమైన హంపీశిల్పాలను
    కనులముందు కదలించి కన్నీరు తెప్పిస్తుంది.ఆ కావ్యం చదువుతూ విచలితుడైన విరూపాక్షశర్మ)
    "హంపీక్షేత్రము" దివ్యకావ్యమది;యా
    హాహా!యనన్ బాఠకుల్
    సొంపారన్ రసరమ్యభాసితనుగా
    సుబ్రాయ డందింపగా;
    గంపం బందుచు శిల్పనాశమునకున్;
    గన్నుల్ జేమర్పన్ స్మృతిన్;
    హంపీక్షేత్రము వీడి పారెను విరూ
    పాక్షుండు భీతాత్ముడై.

    రిప్లయితొలగించండి
  5. డా.పిట్టా సత్యనారాయణ
    *అంతెవాసుల తోడుత హంపి యాత్ర*
    పొత్తమొక బహుమానమ్ము బొందినాట
    శంకరుని(కందివారి)భావముల నేడు చదువ బూన
    శిథిలముల బట్టుకొనని నిశీధి నెంచి
    హంపి విడిచి పారెను విరూపాక్షు డడలి!

    రిప్లయితొలగించండి
  6. డా.పిట్టా సత్యనారాయణ
    చంపే వాడని జాగరూకతమెయిన్ సౌశీల్యమున్నింపుచున్
    పెంపున్ గోరుచు ప్రార్థనల్ సలుపుచున్ ప్రీతిన్ గ్రథించెన్ సదా
    కొంపే మున్గెను సత్కవీంద్రు కలలన్ గూల్చంగ జాలున్ హరీ!
    హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముడై!

    రిప్లయితొలగించండి
  7. తళ్ళికోట జయించియు తరలి రాగ
    శత్రు సైన్యాలు హంపికి చకచకమని
    "హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి"
    యనెడు పెను పుకారులు వ్యాప్తి నందుకొనియె.

    రిప్లయితొలగించండి
  8. శంకరుని వరదశతక పొంకములను
    భావ భాష మాధుర్యము చేవలు గని
    కడు ముదమున నెదురెళ్ళి కవుగలింప
    హంపి విడిచి పారెను విరూపాక్షుడడలి

    రిప్లయితొలగించండి
  9. కందిశంకరురాకనుగనులగాంచి
    హంపివిడిచిపాఱెనువిరూపాక్షుడడలి
    తనదుశతకమ్ముదనకంకి తమిడునేమొ
    యనుచు,గలనుగంటినినేనునర్ధరాత్రి

    రిప్లయితొలగించండి
  10. హంపిలో నచ్యుతాశ్రమమరలె యోగ
    సాధకులుయోగమందుండ సాంబశివుడు
    కలి ప్రభావంబునన్స్ఫర్ధ గలుగకుండ
    *"హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి"*

    రిప్లయితొలగించండి
  11. హంపీక్షేత్రమునచ్యుతాశ్రమముతోనాధ్యాత్మధామంబునై
    సొంపౌబ్రహ్మముమార్గదర్శనమునేజూపింపగాసాధకుల్
    ఇంపారన్దరిసించబోయిరని నన్నెవ్వండు గాంచంచు నా
    *హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై"*

    రిప్లయితొలగించండి
  12. తెంపుదు భవ పాశములన దెంత గాని
    నింపగ జటిలంపు సమస్య నిచ్చు నంచు
    కంపమున కంది శంకరు కందకుండ
    హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. భస్మ హస్త దైత్యుఁ డడరి పడఁగ వెంట
      దాఁగ వేగ పరుగున నుదకము నందు
      నుండ నసురు కంటఁ బడఁగ నుదరి యంచు
      హంపి విడిచి పాఱెను విరూపాక్షుఁ డడలి

      [అంచు+ ఊహు+అంపి = అం చు హంపి; అంపి నీళ్ళు]


      చెంపల్ నల్లఁగ మార మో మడలఁ గాశీక్షేత్ర నిర్వాసుఁడై
      యంపన్ ధాత దయా విహీనుఁ డయి కాయం బందు దుర్వారపుం
      గంపం బారఁగఁ దొఱ్ఱఁ దూఱ శని శంకా చిత్త సంరంభియై
      హంపీ క్షేత్రము వీడి పాఱెను విరూపాక్షుండు భీతాత్ముఁడై

      తొలగించండి
  14. హంపీనామకపుణ్యధామమువిరూపాక్షుండుక్షేత్రంబుగా
    సొంపున్జెందుచుజూచువారలకుసూసౌందర్యమింపారగా
    గంపంబొందుచుశత్రుసైన్యమువడిన్ ఖండించరాగాదమిన్
    హంపీక్షేత్రమువీడిపారెనువిరూపాక్షుండుభీతాత్ముడై

    రిప్లయితొలగించండి
  15. కంపై పోయెను రాజకీయములటన్ కాంగ్రేసులో కొందరున్
    సంపాదించెడు మార్గమున్ వెదుకుచున్ సభ్యత్వమున్ వీడగన్
    కంపమ్మందిన పెద్దలే సలుపు దుష్కార్యమ్ము లన్ గాంచి తా
    హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై.

    రిప్లయితొలగించండి
  16. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    జంపున్ జేయుచు శంకరా భరణమున్ సంతోషమౌ తీరునన్
    సొంపౌ రీతిని బెంగుళూరు చనుచున్ శోధించగన్ కోవెలల్
    కొంపల్ మున్గగ కంది శంకరులటన్ కొండాడుటన్ జేరగా
    హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై..:)

    రిప్లయితొలగించండి



  17. సొంపౌ శిల్ప కళా విశేషముల కే చో టౌను? స్వర్గమ్ము కం
    పింపన్ దైత్యులధాటి కా సురవిభుండేమాయె?కొల్వుండె నా
    హంపిన్ దేవుడెవండు? యుద్ధమున నేలా భీరు డల్లాడెనో
    హంపీ క్షేత్రము, వీడిపారెను, విరూపాక్షుండు,భీతాత్ముఁడై.

    రిప్లయితొలగించండి
  18. రత్న రాశులేమయెనేడురాళ్లు మిగిలె
    చిన్నబోవగ తుంగమ్మ చెన్నుఁదరిగి
    హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి
    హిమకరుని, గంగనువెదక హిమనగముల

    రిప్లయితొలగించండి
  19. తేటగీతి:
    హంపి కుందేలు తరముగ హర్షమంది
    బేరుకు విజయనగరము బెన్నిధనగ
    చందనవు సువాసనల చాముండి బెట్ట
    బెంగళూరు ప్రజాపద్య వేడ్క గాంచి
    హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి

    రిప్లయితొలగించండి
  20. తేటగీతి
    కృష్ణ రాయల పాలనా కేతనములు
    గూలి, ప్రజలెన్ను నాయకుల్ గోల జేయ
    నస్థిరత్వపు పోకడలంకురించ
    హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి

    శార్దూలవిక్రీడితము
    సంపూర్ణమ్ముగ నమ్మి యెన్నఁ బ్రజకున్ సందేహముల్ గల్గగ
    న్నింపాదిన్ గనలేని యస్థిరతలన్ నేతల్ ప్రలోభమ్మునన్
    సంపాదించగ పార్టి మారుచు నవిశ్వాసానఁ బ్రార్థించగన్
    హంపీ క్షేత్రము వీడి పారెను విరూపాక్షుండు భీతాత్ముఁడై

    రిప్లయితొలగించండి
  21. రాయ లేలిన సీమట రత్న గర్భ
    లలిత కళలకు కాణాచి శిలల సొంపు
    శిధిల మైపోయె నేడిల ఖేద పడగ
    హంపి విడిచి పారెను విరూపాక్షుఁ డడలి

    రిప్లయితొలగించండి
  22. కృష్ణ రాయల యుగమందు కీర్తి నంది
    నట్టి పావన క్షేత్రము నవని యందు
    దాడి చేసి కూల్చెదరని దలచి మదిని
    హంపి విడిచి పారెను విరూపాక్ష డడలి.

    రిప్లయితొలగించండి

  23. చల్లని హిమగిరి శైలమె
    యిల్లయె పరమేశ్వరునకు యిందీవరుడున్
    యిల్లుగ చేకొనె కడలినె
    యిల్లరికమ్మేఁగ దోష మెట్లగు జగతిన్.

    రిప్లయితొలగించండి