23, జులై 2019, మంగళవారం

సమస్య - 3084 (అప్పు లేని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద"
(లేదా...)
"అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్"

86 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  గొప్పగు కోతలన్ పలికి కోరిక మీరగ పెండ్లియాడగా
  చప్పుడు లేని జేబులను చక్కని భార్యను మేపజాలకే
  దప్పిక తోడ నాకలికి దారుణ రీతిని కుందుచుండగా
  నప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
  2. గొప్ప కొఱకు మెండు గోతులు త్రవ్వుచు
   చిక్కు లందు బడును మిక్కు టముగ
   కలియు గంబు జూడ కాసుల కెరవంట
   యప్పు లేని నరుడు వ్యర్ధుఁ డుగద

   తొలగించండి
 3. బ్యాంకు ఋణము మిమ్ము బాధింప పోబోదు
  ఋణము మాఫి చేతు మనుచు చెప్ప
  నప్పు లున్న వాడదృష్ట వంతుడగుచు
  నప్పు లేని నరుడు వ్యర్థుడు గద.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో యతి తప్పింది. సవరించండి.

   తొలగించండి
 4. గొప్ప కొఱకు మెండు గోతులు త్రవ్వుచు
  చిక్కు లందు బడును మిక్కు టముగ
  కలియు గంబు జూడ కాసుల కెరవంట
  యప్పు లేని నరుడు వ్యర్ధుఁ డుగద

  రిప్లయితొలగించండి
 5. గొప్ప జెప్పుకొనగ గుప్పెడు అప్పులే
  అప్పు జేయ నేడు ముప్పు గాదు
  అప్పు జేసి వారె అందలమెక్కిరి
  అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద!!

  రిప్లయితొలగించండి
 6. అప్పులుఁ దీర్చఁ బుట్టియు తదాదినిరంతరుణప్రవృద్ధమై
  యప్పులుఁ తీర్చలేని విధమై తదనంతరజన్మమెత్త, నే
  యప్పును దీర్చఁ జాలెదవొ అమ్మకు, నాన్నకు జన్మదాతకున్?
  అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్.

  కంజర్ల రామాచార్య
  వనస్థలిపురము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామాచార్య గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'దురంత ఋణప్రవృద్ధమై' అంటే బాగుంటుందని నా సూచన.

   తొలగించండి
  2. అప్పులుఁ దీర్చఁ బుట్టియు తదాదిదురంతరుణప్రవృద్ధమై
   యప్పులుఁ తీర్చలేని విధమై తదనంతరజన్మమెత్త, నే
   యప్పును దీర్చఁ జాలెదవొ అమ్మకు, నాన్నకు జన్మదాతకున్?
   అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్.

   కంజర్ల రామాచార్య
   వనస్థలిపురము.

   తొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  అప్పది తీసివేత నపుడప్పుడు తప్పదు భామలందరున్
  పప్పులనప్పుదెత్తురిల బంధువులెల్లరు వచ్చినంత , ఈ..
  తిప్పలుతప్పవప్పుల , మదిన్ మరి కుందకుడిట్టివైనవౌ
  అప్పులు లేని మానవుని వ్యర్థునిగా గణియింత్రు సజ్జనుల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ గురుభ్యోన్నమః,🙏
  పంచభూత రాశి ప్రాణికోటికినెల్ల
  దిక్కుమొక్కు గాదె దీన బంధు!
  అప్పన జలమౌట నవధరింపగ రాదె
  అప్పు లేని నరుడు వ్యర్థుడు గద!

  రిప్లయితొలగించండి
 10. సమస్య :-
  "అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద"

  *ఆ.వె**

  రాజ్య మేల నేడు రాజకీయాగ్రణి
  ఎన్ని కలన గెలవ ఋణము మాఫి
  హామి యమలు పరచె నక్కటా బ్యాంకలో
  అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ఎన్నికలను... బ్యాంకులో' అనండి.

   తొలగించండి
 11. అప్పులు వడ్డికాసులును యాపదమొక్కుల పేరనెప్పుడున్
  కుప్పలు తెప్పలై ధనముఁ గూర్చెడు వేంకట స్వామి సాక్షిగా
  నప్పులు గొప్పవయ్యెనిల నాస్తులు గూడగ మార్గమయ్యదై
  యప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'వడ్డికాసులును నాపద మ్రొక్కుల... వేంకటనాథు సాక్షిగా...' అనండి.

   తొలగించండి
 12. విజయమాల్యమీకు విజయుడైతోచెనో
  యప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద"
  కొండనెక్కెనుహరి గొల్చెచండాలుని
  నృపుడునప్పుదీర్చ దపనులౌచు

  రిప్లయితొలగించండి
 13. బ్యాంకులందు రుణము బాగుగా పొందుచు
  కోట్ల కోట్ల ధనము కొల్ల గొట్టు
  జాణ ధనుల జూచి జనులనుకొందురు
  అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద

  రిప్లయితొలగించండి
 14. చింతలేక గడుపు జీవితము నిలను
  అప్పులేని నరుడు; వ్యర్ధుడు గద
  పరుల మెప్పు కొరకు పరిమితి లేకుండ
  నప్పు లెన్నొ చేసి తిప్పలందు

  రిప్లయితొలగించండి
 15. అప్పు తోటి నీడ యప్పుతోటియె గూడు
  నప్పు తోటి కడకు పప్పు కూడు
  నప్పు చేయు వారు చెప్పు మాట
  "అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద"

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. నప్పు చేయు వారుఁ జెప్పెడు మాటలు
   అని మార్చవచ్చు అదే భావం వచ్చేలా.

   తొలగించండి
 16. అప్పలు జెప్పగా తెలిసె బాల్యము నందున యప్పులేకనే
  జొప్పుగ జీవనంబిలను చొప్పమటంచటు బల్కిరే, మరీ
  పప్పునుయన్నమైననిక పత్నిని గాచని మందసానమా?
  అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  చొప్పుగ-అందముగా, చొప్పము-దారి, మందసానము-జీవితం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో యతి తప్పింది. 'మరీ' అనడం వ్యావహారికం. 'పప్పును + అన్నము' అన్నపుడు యడాగమం రాదు.

   తొలగించండి
 17. సౌఖ్య జీవనంబు సాగించు భువిలోన
  అప్పు లేని నరుడు... వ్యర్థుడు గద
  భోగ మను భవించి మోదము పొందంగ
  నప్పు లందు మునుగనవని లోన

  రిప్లయితొలగించండి
 18. క్రొవ్విడి వెంకట రాజారావు:

  రాజ్యమేలు చుండు రాజులందరు నేడు
  అప్పు జేసి తిరుగు నన్యుల నిల
  కాయుచుండి సతము కడగించు చుండగ
  అప్పులేని నరుడు వ్యర్థుడు గద!?

  రిప్లయితొలగించండి
 19. గృహము కొఱకు నప్పు, కృతియచ్చునకు నప్పు,
  వాహనమునకప్పు, వసతికప్పు
  వర్తకమునకప్పు, వ్యవసాయమునకప్పు,
  వ్యక్తిగతపుటప్పు బ్యాంకు లిడగ

  అప్పుఁ జేసి కొనుమ యంగడిలో నన్ని
  అపుడె ఋణపు సూచి హాయినొసగు
  క్రెడిటు కార్డు వలన కీడేమి? నేడు నే
  *"యప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద"*

  ఋణపు సూచి = క్రెడిట్ స్కోర్.

  రిప్లయితొలగించండి


 20. కొంప కట్టి చూచు కొనుటకు, అమ్మాయి
  చదువు కున్ జిలేబి చక్క నమ్మ
  పెళ్ళి కిన్ వరుసని పేరు కొనగ ఖర్చు,
  అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 21. మిస్సన్న గారి బ్యాంకు మినహాయించి :)


  గప్పున బ్యాంకు లో వ్యయపు కార్డును సేంక్షను చేసి బాపురే
  చప్పున నింటి కై ఋణము సాంక్షను చేతుము రండి యంచు పి
  ల్చప్పటి కప్పు డే మనుజులన్ ధన వంతుల చేయ జూతురే!
  అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 22. అప్పు గాను నీటి నంది సంద్రము నుండి
  తిరిగి యిచ్చి కరువు దీర్చు మబ్బు
  ఒకరి కొకరు తోడు నుపయోగమై యొప్పు
  అప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  అప్పుల తోడ సంపదల నార్జన పర్చుచు వాటి నెప్పుడు
  న్నొప్పన జేయకున్ వదలి నాడెడి వారిని రాజులందరున్
  గొప్పగు రీతి నారయుచు కూర్మిని బంచు చుండగా
  అప్పులు లేని మానవుని వ్యర్థునిగా గణియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కొంత అన్వయక్లిష్టత ఉన్నట్టుంది. మూడవ పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
 24. ఉప్పులేని పప్పు ఉదరము నింపునా
  పప్పు నుప్పు కయిన నప్పుజేయ
  తప్పు గాదటయ్య నప్పుడప్పుడిలను
  అప్పులేని నరుడు వ్యర్థుడు గద!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పప్పు + ఉదరము' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు.

   తొలగించండి
 25. ఎప్పటికిని నరయ గొప్పవాడె భువిని
  నప్పులేనినరుడు,వ్యర్ధుడుగద
  యప్పుజేసిమిగుల పప్పుగూడుదినెడు
  మనుజుడిలకుమఱియు మరణ సముడు

  రిప్లయితొలగించండి
 26. సరదాగా..

  కప్పుము తెల్ల వెండ్రుకల గాటపు నల్లని రంగు మాటునన్,
  పిప్పిగ మారు పళ్ళ కిక పెట్టుము కట్టుడు పళ్ళు, కళ్ళకు
  న్నప్పిన చల్వటద్దముల నాడెపు ఫ్రేమున బెట్టు చూడు మే
  కప్పులు లేనిమానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 27. ఆర్థిక స్థితిగతు లచ్చరానియెడల
  నప్పు జేయకున్న నదియె తప్పు
  అప్పు యనునది యొక యభివృద్ధి మార్గము
  యప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద

  రిప్లయితొలగించండి
 28. అప్పది లేనివాడెవడటంట జగత్తున గాంచినంత నా
  యప్పది తీర్చలేవుగద యమ్మకు నాన్నకునెంత జేసినన్
  చెప్పిన యప్పులేదనుచు సేవలు సేయుట వ్యర్థమన్న నా
  యప్పులు లేని మానవుని వ్యర్థుడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 29. భక్ష్య రాశు లున్న కక్ష్యాంతరమ్మునఁ
  ద్రాగ నీరు లేక వేఁగ వలదె
  జగమున మనఁడు సుఖముగ మధుర వినిర్మ
  లాప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద


  కప్పము నందుఁ గల్గును సుఖమ్ముగ నించుక మేలు మిత్రమా
  గొప్పకు కాదు నీకు నిలు కూర్మి వసించుటకే తలంచుమా
  తప్పదు వేశ్మ మెల్లరకు ధాత్రినిఁ, గట్ట గృహమ్ము తప్ప వీ
  యప్పులు, లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 30. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  అప్పులు చేసి మల్లయుడు హాయిగ లండనునందు కుల్కగా
  నప్పులు చేసి నీరవుడు హైరన లేకయెనుండ లండనున్
  చిప్పను చేతబట్టుటను ఛీయని రోయుచు పస్తులుండి వే
  లప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'లేకయె యుండ' అనండి.

   తొలగించండి
 31. అప్పులులేని మానవునివ్యర్ధుడుగాగణియింత్రుసజ్జనుల్
  నప్పులులేనివారలనువ్యర్ధులుగాగణియించభావ్యమే
  యప్పులులేకయుండగనునందినసొమ్మునుమంచిజేయుచో
  నప్పర మేశ్వరుండిడునునాయువుసంపద భోగభాగ్యముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సజ్జనుల్ + అప్పులు = సజ్జను లప్పులు' అవుతుంది.

   తొలగించండి
 32. అప్పుచేయుకొరకు అవనిలోపుట్టితి
  అప్పుచేసిబతుకగొప్పగాను
  అప్పుతీర్చినంత ఆయువుమూడును
  అప్పులేని నరుఁడు వ్యర్థుఁడుగద!


  (బాపు-రమణీయం స్ఫూర్తితో)

  రిప్లయితొలగించండి
 33. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గురువుగారు నమస్కారములు. పద్యం మార్చి వ్రాసాను. పరిశీలించ గలరు.

  అప్పులతోడ సంపదల నార్జన జేయుచు వాటి నంతయున్
  చప్పున తీర్చుటల్ వదలి జాలముతో నెగవైచి దోరుచున్
  గొప్పగ రక్షణన్ గలిగి కూర్చొను వారిట ప్రజ్వరిల్లగా
  అప్పులు లేని మానవుని వ్యర్థునిగా గణియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 34. నీరుమానవాళి నిత్యకృత్యమునందు
  ,అన్నపానియాన నవసరంబు!
  యేశరీరమైన నాశగ జీవించ
  అప్పులేనినరుడు వ్యర్థుడుగద!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది అభినందనలు.
   పానీయమును... పానియము అన్నారు.

   తొలగించండి
 35. గొప్పగ జెప్పుకొంద్రుగద గోప్యపు జీవనమార్గమందు నే
  యప్పులులేని మానవుని,వ్యర్ధునిగా గణియింత్రు సజ్జనుల్
  మెప్పులుగోరుచున్ జనుల మెండుగజేయుచు నప్పులెన్నియో
  చప్పున కుప్పగూలగను జాలినిజూపరు తప్పులెంచుచున్

  రిప్లయితొలగించండి
 36. శంకరయ్య బొడ్డుమంగళవారం, జులై 23, 2019 5:01:00 PM

  అప్పులలోన గూరుకొని యల్ప గుణంబున లోకులెల్లరన్
  జప్పున మోసగించుచును సంపద దోచుచు మంచివానిగా
  దప్పక నప్పుదేర్చియును దర్పముగా దిరుగాడు చున్న నా
  యప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్!

  రిప్లయితొలగించండి
 37. మరో రెండు పూరణలు

  బ్యాంకులొసగుచుండె వాసిగా ఋణములు
  ఇల్లు పొలము కొనుట కిలను నేడు
  వాని కొనక యున్న బ్రతుకున సుఖమేది
  అప్పులేని నరుడు వ్యర్థుడు కద

  అప్పు లధికమవగ నన్నదాతెప్పుడు
  మాఫి యగును ఋణము మనల కనుచు
  పలుకు చుండు తాను పరులతో నీరీతి
  అప్పులేని నరుడు; వ్యర్ధుడు గద

  రిప్లయితొలగించండి
 38. అప్పుగనీరముంగొనునుయంబుదమంబుధినుండి, మారుగా
  గొప్పగ వానరూపమునకొండలయందునగుమ్మరించుచున్
  అప్పునుతీర్చునంబుధికియంబుదమీవిధినీజగంబునన్
  అప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్.

  రిప్లయితొలగించండి
 39. అమ్మ రుణముఁ గాని యవని రుణముఁ గాని
  నింగి నిప్పు గాలి నీటి రుణముఁ
  గాని తీర్పఁ లేము. కాని తీర్పగఁ జూచు
  నప్పు లేని నరుఁడు వ్యర్థుఁడు గద

  రిప్లయితొలగించండి
 40. ఆటవెలది
  పుట్టుకొసగె తీర్చ మూడగు ఋషి, దేవ
  పితృ ఋణమ్ములిలను వేద విధిత
  మైన వివియె భావమందు పై దెలిపిన
  యప్పు లేని నరుడు వ్యర్థుఁడు గద

  ఉత్పలమాల(పంచపాది)

  తప్పదు భూమిపై నరుడుఁ దాల్చఁగ జన్మము వీనిఁ దీర్చగన్
  చొప్పడ శాస్త్రముల్ ఋషుల శోధన మూల తపాన నొక్కటై
  గొప్పగ దేవతల్ మనకు గూర్చెడు సాయము నొంద నొక్కటై
  తప్పక పెంచి నట్టి పితృ ధర్మ ఋణాలన మూడు లోన నీ
  యప్పులు లేని మానవుని వ్యర్థుఁడుగా గణియింత్రు సజ్జనుల్

  రిప్లయితొలగించండి
 41. ఋణపు భారముగని రేఁబవలును నేడ్వ
  పుణ్యుడతడు మంచి ధనుడు ఘనుడు
  అప్పులేని నరుడు;వ్యర్థుడుఁగద
  అప్పు చేసి తప్పటడుగు వేయ.

  రిప్లయితొలగించండి
 42. అప్పు పేర జనుల కెప్పటికప్పుడు
  డాబుసరికి తగిన డబ్బు నిచ్చు
  ఋణరేకు సంస్థకృపకు పాత్రుడు గాని
  అప్పు లేని నరుడు వ్యర్థుడు కద

  రిప్లయితొలగించండి