17, జులై 2019, బుధవారం

సమస్య - 3078 (పుట్టిన దినమంచు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో"
(లేదా...)
"పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో"
(ఈరోజు నా జన్మదినం!)

69 కామెంట్‌లు:

  1. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,

    గురుభ్యోన్నమః ( నిన్నటి పూరణ స్వీకరింప మనవి )


    { నీలమేఘశ్యాముని , రాముని జూచి మేఘములు సిగ్గుతో

    దిక్కుల అంచులలో దాగినవి • రామకృపామృతధార

    పాపాగ్నిపర్వతములపై వర్షింపసాగెను • ఔరా ! ఏ మేఘము

    లేకయే వర్షము కురిసెను • }



    ఆ ఘన నీలనీరద సమంచిత దేహిని - రామునిన్ గనన్ ,

    మేఘము లెల్ల సిగ్గువడి నెక్కొన సాగె దిశాంచలమ్ములన్ |

    శ్లాఘ మొనర్ప భక్తతతి > రామకృపామృత దివ్యధార , ఘో

    రాఘ హవావనీధర చయమ్మున వర్షిలు చుండె | ‌నౌర ! యే

    మేఘము లేక వర్షము లమేయముగా గురిసెన్ విచిత్రమే ! ! !


    { నెక్కొను = విస్తరించు , దాగుకొను ;

    దిశాంచలమ్ములన్ = దిక్ములయొక్క అంచులలో ;

    హవము = హవనము = అగ్ని ; . . . .

    ఘోర + అఘ + హవ + అవనీధర చయము =

    ఘోరమైన పాపము లనెడు అగ్ని పర్వత సమూహము }


    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములు
    గురువులకు జన్మదిన శుభాకాంక్షలు .ఇలాగే శతకములు రచిస్తూ నిండు నూరేళ్ళూ సుఖంగా ఉండాలని దీవించి అక్కయ్య.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా, ధన్యవాదాలు! వ్రాయడానికేం? ఎన్నైనా వ్రాయవచ్చు. ప్రచురించడానికి ద్రవ్యసహాయం చేసేవారుండాలి కాని!

      తొలగించండి


  3. ఎట్టెట్టా ! కవి రాట్ మీ
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో?
    గిట్టని వాళ్ళయ్యుంటా
    రట్టాంటి మడుసుల గోల రాభస గోలే !


    శుభాకాంక్షలతో

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పద్యంలో మాండలికాలున్నాయి. పాత్రోచిత భాష అని సరిపెట్టుకుందాం!

      తొలగించండి
  4. ప్రాతః కాలపు సరదా పూరణ:

    మరచుచు ప్రాస సూత్రములు మానక వ్రాయుచు తప్పులెన్నియో
    గురువుల మాట లొల్లకయె గుట్టుగ నేర్వక శబ్దశాస్త్రమున్
    కరచుచు శాస్త్రివర్యునిట కమ్మగ పొమ్మని సైగచేయుచున్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      పొమ్మని సైగ చేయడానికి లోకులకేం పొయ్యేకాలం?

      తొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    కంది శంకరులకు వందనములు 🙏జన్మదినోత్సవ శుభకామనలు...💐💐

    హరుని దయోదయుండితనికల్పమె యాయువటంచు బాలశం...
    కరునికి వర్షవర్షమున కన్పడు పుట్టినరోజు వేడుకన్
    భరముగనెంచ తల్లి , గని పౌరులు మిత్తినెరింగి చెంతనే .,
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యులకు పాదాభివందనం జన్మ దిన శుభాకాంక్షలు

    గట్టిగ పూజ లొనర్పుము
    మట్టుగ నరఘోష ఘాత మర్మము తొలగన్
    ఇట్టిటె శతకము కూర్పగ--
    పుట్టినదినమంచును బొరిబొరి యేడ్చిరయో

    రిప్లయితొలగించండి
  7. పుట్టింట పేరు బలికిన
    పుట్టెడు సంతోష మంచు పొంగెద రంతా
    గిట్టని వారలు కొందరు
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చి రయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పొంగెద రెల్లన్' అనండి.

      తొలగించండి
  8. బట్టలుఁ భూరిగ కట్నము
    పెట్టక తప్పదు గద నిరు పేదల మగుమా
    కెట్టుల వీలగు బంధువు
    పుట్టిన దినమంచును బొరపొరి యేడ్చిరయో.

    రిప్లయితొలగించండి
  9. తరగని పాండి తీప్రతిభ ధారగ సాగిన వెల్లువే యనన్
    విరివిగ దేశ దేశముల పేరును పొందుచు వేడ్క మీరగన్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో
    కరిగిన సంత సంబున నుగాసిలి పోవగ దారి లేకయున్

    రిప్లయితొలగించండి
  10. (దేవకీవసుదేవులు తమ మొదటిబిడ్డను కంసునికి
    అప్పగించవలసివచ్చినందుకు బాధాతప్తమనస్కులైనారు)
    "ఎట్టుల నిత్తుము తనయుని
    చెట్టను సలిపెడి దనుజుని చేతికి?జూడన్
    గిట్టెడి దినమయ్యె నితని
    పుట్టినదిన"మంచును బొరిపొరి యేడ్చి రయో!
    (చెట్ట-కీడు)

    రిప్లయితొలగించండి

  11. గ్రాంధికమేనా ?


    గిట్టని వాళ్ళక టకటా !
    దట్టించుచు ముక్కుపొడిని దండిగ నాపై
    పట్టదు వారల కయ్యా
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు🎉🎊🎂🎇🎆🎈🎊🎉

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరమ దయామయుండును ప్ర
      భాకర తేజుడామహా
      పురుషుడు లోకమున్ విడిచె,
      పుట్టినరోజునె,చిత్రమయ్యొ!సం
      బరములు చేయ నిందితులను
      బంధుగణమ్ములు కూడ, నప్పుడున్
      పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ
      బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

      తొలగించండి
    2. రాకుమార గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'నిందితులను' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
    3. ప్రభాకరతేజు..డమేయు...డామహా
      //

      కొన్ని మాటలు గూగులమ్మనే మింగి కక్కుతున్నది

      తొలగించండి
  13. ఆచార్యులకు జన్మ దిన శుభాకాంక్షలతో 🙏

    పట్టుదలగ శంకరునకు
    గట్టిగ గురు పూజ జేయ కల గాగ కవుల్
    గుట్టుగ గుర్తింపెరుగని
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సూర్య గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గట్టి సమస్యల నిచ్చుచు
      పట్టును పెంచును కవులకు పద్యములందున్
      ఇట్టి గురుడు శంకరునకు
      పుట్టిన దినమంచును విని పులకింతురహో 🙏

      తొలగించండి


  14. విరివిగ పేరు గాంచిన కవీశ్వరులన్ పని లేని వారటం
    చు రకము లేక పల్కిరి వచోగ్రహముల్ పడె తూట్లు చేసిరే
    కిరికిరి వీధి వీధిని ఫకీరులటంచును చీడపట్టులే,
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ, బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  15. ఈ వారపు ఆకాశవాణి‌సమస్య యేమిటి తెలియ చేయగలరు



    జిలేబి

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా సత్యనారాయణ
    వట్టిదె తపపు ఫలంబది
    అట్టిటు గాబోదు మృత్యు వావహనంబై
    పట్టును మార్కండేయుని
    పుట్టిన దినమంచును బొరి యేడ్చిరయో!(కంది శంకరులకు జన్మదిన శుభాకాంక్షలతో)

    రిప్లయితొలగించండి
  17. డా.పిట్టా సత్యనారాయణ
    సరిసరి హైందవంబునను సాగినదీ వచనంబు జన్మమే
    మరలుట మృత్యు సద్దిశకు మర్మమిదేయని గన్న దంపతు
    ల్నెరి విడుపున్ గనంగ నిట నెన్నిరి సర్వ విచార సారమున్
    బొరిపొరి యేడ్చిరెల్లరును బుట్టిన ప్రొద్దని లోకులయ్యయో!(కంది శంకరులకు తాత్త్విక సందేశ యుక్త దీర్ఘాయుష్య శుభాకాంక్షలతో)

    రిప్లయితొలగించండి
  18. కంది శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలతో...
    దట్టపు టాలోచనతో
    పుట్టించెడు కవితలెల్ల మురిపించగ తా
    మెట్టుల మీయభిమానులు
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో?

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు

    వేడెద వేంకట నాథుని
    కూడుచు దేవేరి తోడ కురియగ శుభముల్
    వేడుక వత్సరమంతయు
    నీడగ నిలచుచు నభయము నీయగనెపుడున్

    నేటి సమస్య కు నా పూరణ

    దేవకీ వసుదేవులు

    పుట్టిన పసికందుల నిటు
    పట్టుచు నొకరొకరిజంపు పాపిని గనుచున్
    గుట్టుగ నష్టమ గర్భుని
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

    రిప్లయితొలగించండి
  20. క్రొవ్విడి వెంకట రాజారావు:
    ముందుగా గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు.

    పట్టము గట్టిరి ధణియకు
    పుట్టినదినమంచును; బొరపొరి యేడ్చిరయో
    పట్టికి జన్మదినమ్మును
    పట్టుగ చేయంగ లేక వారాపేదల్.

    రిప్లయితొలగించండి
  21. కందం
    పట్టిగ మార్కండేయుడు
    పట్టుమని యిల పదియారు ప్రాయము నందున్
    గిట్టుననుచుఁ దలిదండ్రులు
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    రిప్లయితొలగించండి
  22. గురువులు శంకరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  23. చంపకమాల
    మరుదిన మందు పట్టమని మంధర మాటకు కైక లొంగి పం
    క్తి రధుని పోరుచున్ భరతుఁ దెమ్మని రాజుగ, రామచంద్రునిన్
    త్వరితము పంపినంత వనవాసము దిగ్గురటంచు దీనతన్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

    రిప్లయితొలగించండి
  24. కట్టా కార్యము లెల్లయు
    వట్టాయెనె యింతవట్టు పట్టెన్ గ్రహమే
    దట్టపు మంచెల్లెడలను
    బుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో


    వరదము శ్రీనివాస వర పాదము తచ్ఛరణేతరమ్ముఁ గో
    ర రిఁక హిరణ్య లోచన హిరణ్య మహౌదన జన్మ మందు సా
    గరములు భూతలమ్ము లవి కంపము సెందె స శైల సాలముల్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

    రిప్లయితొలగించండి
  25. కిట్టని మనుజులు మఱినా
    పుట్టిన దినమం చునుబొరి పొరియే డ్చిరయో
    కిట్టని వారల యేడ్పులు
    పట్టులె నాకగునునవియ పండుగవోలెన్

    రిప్లయితొలగించండి
  26. శంకరాభరణం 17/07/2019

    సమస్య

    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    నా పూరణ. కం!!
    **** **** **

    మట్టిని గలిసె నొకండును

    పుట్టిన రోజునె కువలయము దిగవిడుచుచున్!

    చుట్టము లొచ్చియు ,తలచుచు

    పుట్టిన దినమంచును, బొరిపొరి యేడ్చిరయో!


    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷


    రిప్లయితొలగించండి
  27. 🙏శ్రీగురుభ్యోన్నమః🙏
    నిష్కళంక పృచ్ఛక చక్రవర్తి!
    కావ్యాలంకార పుంభావ సరస్వతి!
    మాకు స్ఫూర్తి!కంది శంకరయ్య మూర్తి!
    జన్మదిన శుభాకాంక్షలు🌺🌺💐💐

    పుట్టించి శంకరార్యులు
    దట్టించెడి పృచ్ఛకములు దడ పుట్టించన్
    గిట్టని కుకవులు మరి మీ
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    రిప్లయితొలగించండి


  28. చట్టని చెప్పుచు జనులే
    పుట్టిన దినమంచును, బొరిపొరి యేడ్చిరయో,
    గిట్టుట మొదలయ్యెనుగా
    తట్టదిదెప్పుడు మనకిక తన్మాత్రముగా !


    జిలేబి

    జిలేబి

    రిప్లయితొలగించండి
  29. పరిపరి రీతులన్ దెలిపి పండుగ జేతుము రండనంచునున్
    విరివిగ లేఖలంపితిరి వీరిటు జూడగ జాడ లేరుగా
    సరిసరి యేమి చేతుమని చల్లగ నిట్టుల తెల్లవారగన్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో :-)

    రిప్లయితొలగించండి
  30. శంతనుడు గంగను వారించుట.

    పుట్టిన పసికందుల యీ
    నట్టేట విడచుట దగదు నళినదళాక్షీ!
    ఎట్టైనను బ్రతికించుము
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో!

    రిప్లయితొలగించండి
  31. వరమగుగార్తికంబుననవచ్చెడుశుధ్ధమినాడుపుట్టగన్
    బొరిపొరియేడ్చిరెల్లరునుబుట్టినప్రొద్దనిలోకులయ్యయో
    కరివరదుండుజల్లగనుగానగభీతినీనొందయేలకో
    సరకునుజేయరాదొకొబ్రజాళినినెన్నటికెట్టివారలున్

    రిప్లయితొలగించండి
  32. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    బ్రహ్మసమాజుల వికారం:

    పొరబడి వచ్చితీవిటకు ప్రొద్దున రాతిరి గాంచకుండహా
    త్వరపడి తల్లి గర్భమున తప్పుడు దారిని బట్టి యేడ్చుచున్
    జరపకు వేడ్కలిచ్చటను చావిక తప్పదు నీకటంచుచున్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

    రిప్లయితొలగించండి
  33. క్రొవ్విడి వెంకట రాజారావు:

    కురుసభలోన కౌరవులు కుత్సిత బుద్ధిని జూదమందునన్
    పరువును వీడి మోసమున పాండవ్లులున్నుడివుచ్చి కక్షతో
    నరుసమునొంది వారిని వనమ్ముల కంపిన రోజు నెంచుచున్
    పొరిపొరి యేడ్చి రెల్లఱును బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో!

    రిప్లయితొలగించండి
  34. కురియక వర్షముల్ గరువు కోరల యందున జిక్కి పూటకున్
    జరుగని కష్టకాలమున సారెలుఁ జీరల టంచు వచ్చి తా
    మరిమరి గోరె పుత్రికయె మారుని జన్మదినమ్మనంగనే
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

    రిప్లయితొలగించండి
  35. దేవకీ వసుదేవుల వేదన.

    పట్టీ నిను గంసునకున్
    బట్టించుట బాడి గాదుపరిమార్పనికన్
    కట్టలు తెగకన్నీరున
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో!

    రిప్లయితొలగించండి
  36. చుట్టాలింటికి వచ్చిరి
    పొట్టేలును కోసి వండి ముదమున మర్యా
    దెట్టుల సేతును గాంధీ
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో.

    రిప్లయితొలగించండి
  37. కిట్టని వారికిఁ గడుపున
    గట్టిగ మంటాయె మీదు ఘనతను జూడం
    దట్టుకొన లేక శంకర!
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో.

    ***

    గురువుగారికి జన్మదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  38. పట్టిన పట్టును వీడడు
    పుట్టెడు గిఫ్టుల నడిగెడు బోసుయెబాసూ
    పుట్టిన రోజన స్టాఫే
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో!!

    రిప్లయితొలగించండి
  39. గరువము లేదు సుంతయును, కద్దు వినమ్రత, కైత లల్లుచో
    ఝరి వలె సాగు, బ్లాగునను చక్కని యొజ్జ, విశేష కీర్తి శం
    కరునకుఁ జూడగా ననుచు గాటపు దుఃఖము పొంగ వైరులే
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో.

    రిప్లయితొలగించండి
  40. మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి మనఃపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  41. గురువుగారికి జన్మదినఋశుభా కాంక్షలు!

    కట్టెదుటశంకరార్యుఁడు
    దిట్టతనపుకవిగజనుల దీవెనలందన్
    గిట్టనివారలు కాలుఁడు
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    రిప్లయితొలగించండి
  42. చంపకమాల
    నిరతము నైదు యేళ్ళు జన నేతగ రాష్ట్రము చుట్టివచ్చియున్
    దొరవలె ముఖ్యమంత్రిగ పదోన్నతి నంది 'జగన్' నివాళిగా
    పరుగున రాజశేఖరు దివంగత నేత సమాధిఁ జేరినన్
    పొరిపొరి యేడ్చి రెల్లఱునుఁ బుట్టిన ప్రొద్దని లోకు లయ్యయో

    రిప్లయితొలగించండి
  43. కృష్ణుడు గాంధారి శాపమును శిరసావహించిన పిమ్మట అకాలముగా ముసలము పుట్టిందని యేడ్చిరెల్లరూ

    శరముల పాటి నేత్రముల శాపముబెట్టెను కృష్ణునిన్ గనన్
    వరదుడు వాసుదేవుడు నివారమెటుల్ ధృతరాష్ట్రుపత్ని భీ
    కరమగు వాక్కు జేయకనకాలముగన్ ముసలంబు బుట్టగన్
    పొరిపొరియేడ్చెనెల్లరును పుట్టిన పొద్దున లోకులయ్యయో

    Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    రిప్లయితొలగించండి
  44. ఉత్పలమాల
    చెల్లవు నాదు మాటలును చెల్లవు వంటలు నేనుఁ జేసినన్
    కుళ్లు తనంబునన్ వగచి కోడలి నోర్చదు నీదు తల్లిరా!
    కల్లలు నాయె కోరికలు! !గారము మీరన నాదు వారికిన్
    ఇల్లరికంపు టల్లుఁడుగ నేఁగుట యెట్లగు దోష మిద్ధరన్?

    రిప్లయితొలగించండి
  45. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    పుట్టిన దినమంచును బొరిపొరి యేడ్చిరయో

    సందర్భము: బర్త్ డే గిఫ్ట్ గా స్మార్ట్ ఫోన్ కొని పెడుతా నని విధి వశాత్తు పుట్టినరోజు నాడే కన్నుమూసిన తండ్రిని చూసి కొడుకు ఆ మాటలు గుర్తుకు తెచ్చుకొని దుఃఖించగా అతని మిత్రులూ ఏడ్చిరి..
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    "పెట్టెద కాన్కగ స్మార్ట్ ఫోన్
    పుట్టిన పండుగ కనుచునె బోతివి నాన్నా!
    పట్టిని గను" మన సఖు "లిదె
    పుట్టిన దిన"మంచును బొరి
    పొరి యేడ్చిరయో!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    17.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి