15, జులై 2019, సోమవారం

సమస్య - 3076 (మారణ హోమమే...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్"
(లేదా.....) 
"మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్"
(ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు)

32 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తోరము దాల్చుచున్ నగుచు తొందరగా నొక జంద్యమూనుచున్
  వారము వారమున్ జనుచు వందన లీయగ దేవళమ్ములన్
  దూరెడు నోరులన్నిటిని దుమ్మును గొట్టెడు నెన్నికందునన్
  మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్

  రిప్లయితొలగించండి
 2. కూరిమి ధర్మము నిలుపగ
  శ్రీరాముడు రాక్షసులను చెండాడెఁగదా!
  వారల దునుముట సరియే!!
  మారణ హోమంబు శాంతి మంత్రంబయ్యెన్.

  రిప్లయితొలగించండి
 3. ధారుణి జొచ్చుచుఁ బ్రజలను
  క్రూరముగా జంపునట్టి క్రూరాత్ములపై
  నేరుగ సైనికులు జరుపు
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 4. కారణము లేని కోపము
  మారణ హోమంబు , శాంతి మంత్రం బయ్యెన్
  ధారణ జేయంగ మదికి
  పారణ జేసిన తరుణము ఫలితము దక్కున్

  రిప్లయితొలగించండి
 5. (కాశ్మీరపు తీవ్రవాదులు-మన కర్తవ్యం)
  భారతమాతకే శిరము
  వంటిది కాశ్మిరరాష్ట్ర; మెంచగా
  నారని తీవ్రవేదనల
  యగ్నిని పెంచిరి ముష్కరాధముల్;
  మారని దుష్టభావనుల
  మార్కొని యేరివేయగా
  మారణహోమమే మహిత
  మంజులమంత్రము శాంతి గూర్పగన్.

  రిప్లయితొలగించండి


 6. దారుణమౌ విద్రోహమె
  మారణహోమంబు, శాంతిమంత్రం బయ్యెన్
  ప్రేరణ ప్రేమని చూపగ
  ధోరణి మారవలె వలదు దొమ్మి జిలేబీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి


 7. ధోరణి యుగ్రవాదులది దొమ్మియు దోపిడి యయ్యె వారికా
  మారణహోమమే మహిత మంజుల మంత్రము! శాంతి గూర్ప, "గన్",
  చేరిచి కాల్చివేయ తమ చేవను చూపెడు ధైర్య శాలురే
  ప్రేరణ దేశ మందిపుడు వేదమిదేను పురోగతిన్ గనన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. శ్రీగురుభ్యోన్నమః🙏

  వీరోచిత సాత్రాజితి
  నారీ లోకము బొగడగ నరకుని దునిమెన్
  భారముఁ దొలగగ ధరణిని
  మారణహోమంబు శాంతి మంత్రంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 9. ధారుణి కెట్టుల మేలగు
  మారణహోమంబు; శాంతిమంత్రం బయ్యెన్
  ప్రేరణ సత్యాహింసలె
  భారత స్వాతంత్ర్యమునకు బాటను పరచెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కారణమేమి లేక మత గ్రంధములందున మూఢ భక్తితో
   దారుణమౌ దురంతముల ధారుణి రావణ కాష్ఠమౌనుగా
   క్రూరుల నట్టి వారలను గూల్చగ భారత సైన్యమూనెడిన్
   మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్

   తొలగించండి
 10. పైరుల కంటు చీడలను పంతము బూనుచు చంపు రీతిగన్
  ధారుణిఁ ధర్మమున్ నిలుప దందడి సేయుచు దుష్టులెల్లరిన్
  పేరడగించ తప్పదిక వీరుడవైచెల రేగి చేసెడిన్
  మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్

  రిప్లయితొలగించండి
 11. దారుణ హింసకు మూలము
  మారణ హోమంబు... శాంతి మంత్రంబయ్యెన్
  నేరస్థులమన్నించుచు
  కారుణ్యము జూపి వారి కాపాడు తరిన్

  రిప్లయితొలగించండి
 12. కారణజన్ముడవయ్యా
  ప్రారబ్ధమ్మేమొగాని బతికితివీవే
  చారుడవై కలహమ్మున
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్!!

  రిప్లయితొలగించండి
 13. శ్రీరామునిబాణమునకు
  నారాక్షసుడసురప్రభువుహాహాయనుచున్
  బోరానిచెంతకేగగ
  మారణహోమంబుశాంతిమంత్రంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 14. డా.పిట్టా సత్యనారాయణ
  కారణ మెరుగము *కారల్*(కారల్ మార్క్సు)
  మారణ హోమంబుజేరి మరలిరి తమకౌ
  మారపు దశలో గురువులు
  మారణ హో్మంబు శాంతి మంత్రంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 15. డా.పిట్టా సత్యనారాయణ
  మారడు మానవుండు తన మన్గడయే మతమంచు నెంచుచున్
  ఘోర రణంబు నెన్నుకొనె క్రొత్తగ నా గుజరాతు రాష్ట్రపుం
  సార విచార శూన్యతను చంపుకు చావరె మోది సాక్షిగా
  మారణ హోమమే మహిత మంజుల మంత్రము శాంతి గూర్చగన్

  రిప్లయితొలగించండి
 16. జోరుగ మతకలహంబుల
  బారిన జనపదము నెల్ల పడవేయంగా
  కారకులగు వారందరి
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 17. పారావార పరీవృత
  భార ఖగవతీ తల ప్రభాసిత యా గా
  గార కృత పుణ్యతమ పశు
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్


  ధారుణి జన్మ మాత్రమున దారుణ పాపులు గారు లోకులే
  వారని లోభ మోహ మద వైర రు షేషణ దుర్గుణాలి నాఁ
  గారణ కార్య కాయములు గాంచుచు భూజన దౌష్ట్య చింతనా
  మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్

  రిప్లయితొలగించండి
 18. కారణమౌనుగాభువినికాసులపంపిణికారణంబుగా
  మారణహోమమే,మంజులమంత్రముశాంతిగూర్చగన్
  వారునువీరునాననకపండితులందఱునేకమైదగన్
  బారమునిచ్చుమంత్రమునుభక్తినినిత్యముబాడనొప్పగున్

  రిప్లయితొలగించండి
 19. జారగ బంధపు విలువలు
  పోరగ నేర్చిరి మనమున బొరబొచ్చములున్
  చోరపు రీతులు హెచ్చెను
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 20. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గౌరును గూడగ నిరతము
  మేరల వెంబడి నఱుచుచు మృగముల తీరున్
  తారాడెడి పెఱ మూకల
  మారణ హోమంబు శాంతి మంత్రంబయ్యెన్.

  రిప్లయితొలగించండి

 21. 1.
  విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుల తో...

  కందం
  ఏరి పడవేయఁ దాటకి,
  మారీచ సుబాహు లాది మనుజాశనులన్
  గూరెను యాగ ఫలము రా
  మా! రణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్

  2.
  సీతామాతను లంకలో చూచి వచ్చిన మారుతి మరియు శ్రీరామచంద్రుల సంభాషణ :

  ఉత్పలమాల
  ధారుణి పుత్రి నా గుఱిచి తల్చెన మారుతి! యన్న" పూర్ణమౌ
  కూరిమి మీరనంగ కుజ గ్రుప్పుచు నీ మణి నిచ్చి మాసమే
  మారుతమున్ భరింతు"ననె మాతను దెత్తుము,
  గాముఁ గూల్చ రా
  మా! రణ హోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్

  రిప్లయితొలగించండి
 22. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  చారులు పప్పులన్ విడిచి చప్పటి కూడులవన్నియంచు భల్
  కోరిక తీరగా కొనుచు గొప్పగు సంతను హైద్రబాదునన్
  కూరను వండగా మురిసి కోడుల గొంతుల మెండు కోసెడిన్
  మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్

  రిప్లయితొలగించండి
 23. క్రొవ్విడి వెంకట రాజారావు:

  గౌరగు పోకుతో సతము కారుదనమ్మున పెచ్చురేగుచున్
  మేరలతిక్రమించి జని మిక్కుటమౌ కసితోడ బేలలన్
  పేరడగించు పాక్ పెఱల పీచ మడంచుటకై మరించు నా
  మారణ హోమమే మహిత మంజుల మంత్రము శాంతి గూర్పగన్.

  రిప్లయితొలగించండి


 24. క్రూరంబుగదుష్టులణచ
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్
  భారతదేశపు సైనిక
  వీరుల ఘనకీర్తినిండె విశ్వంబెల్లన్.

  రిప్లయితొలగించండి
 25. కారణము లేక జనులను
  దారుణముగ హింస సలుపు దానవ మూకన్
  యేరేరి మరీ జరిపెడు
  మారణహోమంబు శాంతిమంత్రం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 26. మైలవరపు వారి పూరణ

  జారగనేల భ్రాంతినట? జారితి బో ! కని నవ్వనేల యా
  ధీర ? దహించుచున్నది మదిన్ చెలరేగి పరాభవాగ్ని ! చ...
  ల్లారెడి మార్గమేది? యను రాజునకాతని మామ యిట్లనున్
  మారణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్"

  మైలవరపు మురళీకృష్ణ
  వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 27. కందం
  గురువర్యా! వరదునిపై
  శరణాగతి కోరి వేడు సత్పథమున మీ
  వర శతకమును చదివితి
  న్నెరనమ్మిన మీదు నార్తి నెరవేర్చునయా!

  రిప్లయితొలగించండి
 28. కారణజన్ము లంచు శుభ కర్ము లటంచును పాండవేయులన్
  మీరి నుతించు చుండి రిట మీదగు పెద్దలు చాలు నింతతో
  నేరక యీ సుయోధనుని నేర్పును వైరుల మెత్తురే కటా
  మా రణహోమమే మహిత మంజుల మంత్రము శాంతిఁ గూర్పఁగన్.

  రిప్లయితొలగించండి