16, జులై 2019, మంగళవారం

సమస్య - 3077 (మేఘము లేక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె" 
(లేదా...)  
"మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే"
(ఈ సమస్యను పంపిన బొగ్గరం ప్రసాద రావు గారికి ధన్యవాదాలు)

87 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    ఆ ఘన యెద్దియూరపుడు హాయిని పొందుచు చూచుచుండగా
    లాఘవ మొప్పు నేతలట లంఘన చేయుచు బెంగుళూరునన్
    శ్లాఘము చేసి భాజపను సంపద లిమ్మని మ్రొక్కుచుండగా
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రభాకర శాస్త్రి గారూ,
      మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "లేని దున్నట్టు లున్నది..." అనండి. 'చూడామణులు' అన్నచోట గణదోషం. సవరించండి.

      తొలగించండి
  3. కనగ నధికార పక్షాన కలత ముదిరి
    బలములేదంచు పదవులన్ వదులు కున్న
    వారి చేతికి పగ్గాలు చేరు టదియె
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె.

    రిప్లయితొలగించండి
  4. కవుల పేరోలగము గాంచ కనుల విందు
    శతక కర్తలు భర్తలు సంత సమున
    వీను లకువిందు కవనపు వేడు కంట
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె

    రిప్లయితొలగించండి
  5. మైలవరపు వారి పూరణ

    మోఘమనోవికారముల మున్గిన క్రీడికి యుద్ధభూమిలో
    శ్రీ ఘననీలవర్ణుని విశిష్టసుబోధసుధల్ లభింపగా .,
    నా ఘనగర్జ దోపగ శరాసన టంకృతి బాణవృష్టిగాన్ !
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే!!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి


  6. పదము లేలేక పద్యము పారె వేగ
    ముగ జిలేబి వ్రాయ వరుస ముత్య మల్లె
    తలపు మంచిదైన హరిమ, తరము గాను
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వలె'ను 'అల్లె' అనడం గ్రామ్యం. "ముత్యము వలె" అనండి.
      "బెంగుళూరులో కలుదాం" అన్నారు. ఆవిష్కరణ సభకు వచ్చి వెళ్ళారా?

      తొలగించండి

    2. కలిసితిమి. మాట్లాడితిమి. ఫోటో తీసుకొంటిమి
      కనుక్కుంటారను కున్నా ప్చ్ :)



      జిలేబి

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
  7. (అలకాపురిలోని వియోగిని యక్షపత్నికి పతి పంపిన
    మేఘసందేశం శోకబాష్పాలను సంతోషబాష్పాలుగా మార్చింది)
    రామగిరి నుండి రమణుడు రమణి దలచి
    మేఘమును గాంచి సందేశమేఘ మంపె;
    సంతసించిన కాంతకు చక్షువులను
    మేఘమే లేక వర్షము మిగుల గురిసె.

    రిప్లయితొలగించండి
  8. 🙏శ్రీ గురుభ్యోన్నమః🙏

    బెంగళూరు నందు ప్రజల బెంగఁ దీర్చ
    వరద శతకమ్ము తా కవి వర్యుఁ బాడ
    ముక్తి కాంక్షులు భక్తిని మునిగి తేల
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునవును... చప్పట్ల వర్షం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      కాని అక్కడ వరద శతక పద్యాలను చదవలేదు. ఎప్పుడో వ్రాసిన 'శ్రీకృష్ణదేవరాయా!" అన్న ఖండిక.

      తొలగించండి
  9. కవి వరేణ్యులు మెండుగా కలిసి నట్టి
    నిండు సభయంత వెలసెను నిగ్గు లొలుక
    ధారగా కవితలు జాలు వార తోచె
    మేఘమే లేక వర్షము మిగుల కురిసె

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    వేసవిని తాపనము హెచ్చె వెగ్గలముగ
    మేఘమే లేక; వర్షము మిగుల గురిసె
    పదనగు ఋతుపవనముల వలన భువిని
    విస్తృతపు నెండ వానలు పీడ నిలుపు.

    రిప్లయితొలగించండి
  11. మండు టెండల మలమల మాడ్చి జగతి
    దొరలి పోయెను కాలము దొరువు లెండె
    మేఘమే లేక; వర్షము మిగులఁ గురిసె
    కాలమే మారి రైతుల కలలు పండె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మండు టెండల మలమల మాడ్చి జగతి
      దొరలి పోయెను కాలము దొరువు లెండె
      రగిలె నాకలి మంటలు రైతు కంట
      మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె

      తొలగించండి

  12. శంకరాభరణం 16/07/2019

    సమస్య

    "మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే"


    నా పూరణ. ఉ.మా.
    *** *** ***

    ఆ ఘన వల్డు కప్పునను నాఖరి పోరున న్యూజిలాండుయే

    శ్లాఘము జేయురీతిగను చక్కగ నాడిన నోడె నయ్యహో!

    ఈ ఘటనన్ గనంగ కడు యేడ్చిరి యక్కడి దేశవాసులే

    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వర్ల్డు... న్యూజిలాండు తా... కడు నేడ్చిరి...' అనండి.

      తొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    ఆఘమేఘాల నమెరికా నంటి నేటి
    డాలరుల బ్రోవు జేయగా డాసి సాధు
    పుంగవులు గుళ్ళ గట్టంగ బొంచి యుండ
    మేఘమే లేక వర్షము మిగుల గురిసె

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    బీఘము(ఎకరా,హిందీ)లాది భూములను బెట్టిరి రైతులమంచు బీడులన్
    యీ ఘన రాచకార్యమున నెత్తిరి డబ్బుల వేన వేలుగా
    మా ఘనపూరు భూదొరల మన్నన నందిరి కే.సి.యా.రదో
    మేఘము లేకవర్షము లమేయముగాగురిసెన్ విచిత్రమే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'బీడులన్ + ఈ' అన్నపుడు యడాగమం రాదు. 'భూదొరల' దుష్ట సమాసం.

      తొలగించండి
  15. మాఘపు మాసవేళ చలి మచ్చుకు నైనను లేకపోయె,నై
    దాఘపు పేరు చెల్లకను దారుణ శీతము క్రమ్మివేయుచున్
    మోఘపు నామ్ల వృష్టులవి ముంచెను,కల్మష సృష్టి లీలకున్
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
  16. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    "మేఘము లేక వర్షము లమేయముగాఁ
    గురిసెన్ విచిత్రమే"

    సందర్భము: కుచేలుడు భార్య పంపగా ద్వారకకు వెళ్లి కృష్ణుని దర్శించినాడు. కబురులతోనే కాలక్షేపం జరిగింది. భార్య కుచేలుని కొంగున కట్టిన అటుకులను కృష్ణుడు బలవంతంగా లాక్కుని తిన్నాడు. కుచేలుడు మొహమాటంతో తన దురవస్థ నేమీ వివరించలేకపోయినాడు. తన వూరికి తిరిగి వచ్చినాడు.
    పోవటం రావటం అంతా వ్యర్థ మనుకున్నాడు. తన పూరిల్లు వుండవలసిన చోట పెద్ద భవనం వుంది. ఎవరిదో అనుకున్నాడు. దాసదాసీజనం వుంది.
    చీని చీనాంబరాలతో ఆభరణ భూషితయై అతని భార్య అటకు (ఎదురు) వచ్చి యిది మన భవనమే! అంటూ చూపించి సకల సంపదలూ అనుగ్రహించిన అవ్యాజ కరుణా మూర్తియైన కృష్ణుని మహిమను కొనియాడి మేఘం లేకనే వర్షం కురిసిం దని పలికింది.
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    మేఘ వినీల వర్ణునికి
    మేలుగ నా విషయంబు జెప్పనే!
    ప్రాఘ వినాశకుండు తగు
    పల్కులతో సరిపుచ్చె.. సర్వమున్
    మోఘ మటంచు నెంచ.. నటఁ
    బోయి కుచేలుని పత్ని యి ట్లనెన్..
    "మేఘము లేక వర్షము
    లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే!"

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    16.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. క్రొవ్విడి వెంకట రాజారావు:

    లాఘవ మెంతయున్ పొసగ లంఘన మెంచుచు యుధ్ధభూమిలో
    శ్లాఘము జేయు పోడిమిని చాతురితో నభిమన్య వీరుడే
    తా ఘన చాపమెత్తి కురు తంత్రముపై గురిపించె బాణముల్
    మేఘములేక వర్షము లమేయముగా గురిసెన్ విచిత్రమే!

    రిప్లయితొలగించండి
  19. నిర్మలముతోడ గనిపించెనింగియంత
    యెక్కసారిగ పుడమిని మిక్కుటముగ
    మేఘమే లేకవర్షముమిగుల కురిసె
    నేమి చిత్రమో యూహించలేముమేము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నిర్మలమ్ముగ గనిపించె..' అనండి.

      తొలగించండి
  20. ఎండి పోయె నచట నేల మండె వాన
    మేఘమే లేక, వర్షము మిగులఁ గురిసె
    నిచట వరదలై ముంచెత్త నేమి మిగిలె?
    ప్రకృతి దాల్చె నెల్లెడల నీ వికృత రూపు ౹౹

    రిప్లయితొలగించండి
  21. మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె
    నేల?యనగరా దిటులనెన్నింటి చూడ
    లేదు చలనచి త్రాలలో లేని వింత
    గలదె ఆటలో ఓడినా గెలిచినట్లు!!

    రిప్లయితొలగించండి
  22. కృష్ణుడు కాళీయుని మర్దనము🙏

    ఆల మంద లాబాల గోపాలమంత
    గనిరి కాళీయు పడగల గర్వ మణచ
    సర్వు లోలగ నానంద సాగరాన
    మేఘమే లేకవర్షము మిగులఁ గురిసె

    రిప్లయితొలగించండి
  23. రమ్య బీజాక్షరంబులు రసనపైన
    వ్రాసె సన్న్యాసి-బాలుని ప్రతిభ వెలిగె
    విద్య లందున రాణించె విస్మయముగ
    మేఘమేలేక వర్షము మిగుల కురిసె

    రిప్లయితొలగించండి
  24. మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె
    సాంఖ్యము నెరుగకుండనె సన్య సించె
    ఎన్ను కొనకుండగనె మనకేలికయ్యె
    కారణంబేల యీ కలికాలమందు

    రిప్లయితొలగించండి
  25. లేనిదున్నట్టు లున్నది లేనటులను
    సృజియించెడు సినిమాల సృష్టి కర్త
    తీయు నొక వాన పాట షూటింగు నందు
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురువు గారూ, ఇందులో రెండవ పాదంలో తప్పులేమైనా ఉన్నాయా?

      తొలగించండి
    2. అవును. గణదోషం. 'సృజన చేసెడు సినిమాల...' అనండి.

      తొలగించండి
  26. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. మేఘములుండుచో గురియుమిన్నును మన్నునునేకధారగా
    మేఘములేక వర్షములమేయముగా గురిసెన్విచిత్రమే
    మేఘవినీలదేహునినమేయ కృపారసవీక్షణంబుచే
    మేఘముదానుగాగురియమెండుగపండునుబంటలెన్నియో

    రిప్లయితొలగించండి
  29. ఉఱుములు మెఱపులు సెలంగ నూఁగఁ తరులు
    భేకము లఱవఁ ద్రుటి నేల వేఁడి తొలఁగ
    నెమ్మి నొసఁగుచు జనులకు నిష్పలంపు
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె


    మోఘము లెట్లగున్ దివిని మూగిన మబ్బుల విక్రమమ్ములే
    యా ఘన రాశి తోఁచ దట నక్కజ మౌచు నమాంత మంత నై
    దాఘము నందు భాస్వరము దారుణ రీతిఁ జెలంగు చుండగన్
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
  30. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    ఆ ఘన కంది శంకరులు హాయిగ నీయగ కైపదమ్ములన్
    మోఘపు పూరణమ్ములను ప్రొద్దునె జేయగ రోజురోజిటన్
    శ్లాఘము చేయగా గురువు శాస్త్రుల హృత్తున గోలగోలగా
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
  31. మాఘపు రాత్రి శీతకరు మాయను మత్తిలి సోలిపోవుచున్
    లాఘవమై తనూ లతిక రంజిలి శయ్యను వాలి పోవగా
    ఆ ఘనతాపహారి కుసుమాస్త్రుని శస్త్ర విలాస వృష్టియై
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
  32. కరువు రక్కసి కోరల కాటుఁవడగ
    పంటచేలన్ని పచ్చిక బయలుకాగ
    కర్షకులకళ్ళు కన్నీటికాల్వలాయె,
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చక్కని పూరణ. అభినందనలు.
      'కాటు వడగ' అన్నపుడు అరసున్న రాదు. 'కాటుఁ బడఁగ' అన్నపుడు ఉంటుంది.

      తొలగించండి
  33. ఎండవేడిమి హెచ్చెను యిలను చూడ
    మేఘమే లేక ;వర్షము మిగుల కురిసె
    శ్రావణమ్మున జగతిలో, ,జనుల కెల్ల
    నంతు లేనట్టి సంతోష మావరించె

    మరొక పూరణ

    చలనచిత్రము లందున తలచినంత
    మేఘమేలేక వర్షము మిగుల కురిసె
    ననుట వాస్తవ మనుచుందు రవనియందు
    దర్శకేంద్రుని ప్రతిభయౌ తరచి చూడ


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'హెచ్చెను + ఇలను = హెచ్చె నిలను' అవుతుంది. యడాగమం రాదు. "హెచ్చిన దిలను" అనండి.

      తొలగించండి
  34. ఉత్పలమాల
    ఆ ఘన శంకరార్యులకు నామలకమ్మును బిక్షమీయగన్
    శ్లాఘము జేయ మోదమున రంజిలి మాధవి పేదరాళికిన్
    మోఘము నెంచి ముంగిటనె పుత్తడి శ్రీఫలి ధారలే యనన్
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
  35. రాఘవుడేగుదెంచెపుడు రావణసంహరణంబొనర్చగన్
    వేగమె తీరిపోగ తన వేదనలన్నియురాముసన్నిధిన్
    జాగునకోర్వలేననుచుజానకి దుఃఖమునొందకన్నులన్
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి


  36. ఈ ఘను లైన మానవుల యీర్ష్య దురాశల కారణమ్ముగా
    మేఘము లన్ని యున్ పుడమి మీదు నిదానము లేక బోవగా
    శ్రీఘను డాతడే కరుణ చేర్చి తపస్సుని ధారవోయగా
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  37. శ్లాఘము జేయదగ్గదని శాస్త్ర మెఱంగిన పండితోత్తముల్
    మాఘుడు వ్రాసినట్టి కృతిఁ మన్నన జేయుటఁ గాంచి లోకులే
    మాఘుని మెచ్చుచున్ బోగుడు మాటల వర్షపు జల్లులన్ గనన్
    మేఘము లేక వర్షము లమేయముగాఁ గురిసెన్ విచిత్రమే

    రిప్లయితొలగించండి
  38. తేటగీతి
    కరువు తాండవ మాడఁగ కలతచెంది
    వేద పండితులన్ గూర్చి వేల్మిఁ జేయ
    ముసురు కొని నింగిఁ దెల్లని పొడఁ గలుంగు
    మేఘమే లేక వర్షము మిగులఁ గురిసె

    రిప్లయితొలగించండి