మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. రెండవ పూరణ అచ్చతెనుగు యొక్క ఆధిక్యంతో అందంగా ఉన్నది. (పూరణలోని 'బుద్ధి', సమస్యలోని 'కాలకూటము' ... ఈ పద్యాన్ని అచ్చతెనుగు పద్యం అనుకుండా అడ్డుపడ్డాయి.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. బుద్ది అని వ్రాసిన అచ్చ తెనుఁగునకు భంగము లేదు కాని సమస్యాపాదమును మార్చలేము కదండి. వృత్యనుప్రాసార్థము యాదృచ్చికముగా వచ్చిన వీ పదము లచ్చ తెనుఁగు వాడాలని యనుకోలేదు.
పెదవి పైన నవ్వు ప్రేమను కురిపించు
రిప్లయితొలగించునంత రంగ మందు కొంత కనరు
తేనె లూరు పలుకు తేరుపై విహరించు
మాట తీపి కాల కూట మెడద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించువచ్చుచు నింటికిన్ నగుచు పండుగ జేయగ మద్యమిచ్చున్
నచ్చిన రీతినిన్ కొలిచి నమ్మెడు మూర్ఖుల రాత్రి ప్రొద్దుటన్
పచ్చి హుళక్కి కోతలను పంచగ నేతలు వోట్లకోసమున్
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే
కంది సారు ఉవాచ:
తొలగించు"మీ పూరణ బాగున్నది. అభినందనలు. కాని ఇది ఏదో సరదా పూరణ మాత్రం కాదు.
అవును!
తొలగించుకఠిన మైన పలుకు కలనైన పలుకడు
రిప్లయితొలగించుస్వప్రయోజ కుండు స్వార్థ పరుడు
తేనె లొలుక నేమి వాని పలుకులందు
మాట తీపి కాలకూట మెడఁద.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుచేతి కిచ్చి పోయె చెంగల్వ మని పిల్ల
కాయ నొకడిని మరి కాన రాలె !
చేటు చేసి నాడు చెంగట తొంగొని
మాట తీపి కాలకూట మెడఁద!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించురాలె, తొంగొని.... వ్యావహారికాలు!
సచ్చరితంబు లేక సహజంబగు జంతు ప్రవృత్తి తోడుతన్
రిప్లయితొలగించుముచ్చట గొల్పు కాంతలను మోసము జేసెడి నీచబుద్ధితో
తుచ్చము లాడి నెయ్యమున దుష్టజనావళి కూడు వారికిన్
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించు
రిప్లయితొలగించుబుచ్చి! పదా! జిలేబులివె! బూరెలు సారెలు చూడవే ప్రియా!
అచ్చికబుచ్చికమ్మని సయాటల దేల్చె విలాస వంతుడా
ముచ్చిక చేతికిచ్చి కను ముందర మాయమయేను! మత్తుగా
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే!
జిలేబి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'అయేను' వ్యావహారికం.
పరుల మోసగింప పాలసు డగువాడు
రిప్లయితొలగించుమంచి వాని వోలె మసలు చుండు
నవ్వు చిందు మోము నడతలోనటనంబు
మాట తీపి కాల కూట మెడద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునీతులన్ని పరుల నిందించుకొరకేను
రిప్లయితొలగించుగోతులెన్నొ దీయు గోప్యముగను
చేతలరసి జూడ నేతలనెడి వారి
మాటతీపి కాలకూట మెడద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునేరుగ తమ పనులు నెరపు వారికెపుడు
రిప్లయితొలగించుమాట కరకు గాని మనసు వెన్న
చాటు మాటుగ పని చక్క బెట్టెడి వారి
మాట తీపి కాలకూట మెడఁద
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించుమాట తీపి కాలకూట మెడదకగు
రిప్లయితొలగించుమాట కలుపు భువిని మనిషిమనము
మాటకటుకు వలన మారణహోమము
జరుగు టనెడు మాట సత్యమార్య!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుకుంసు నాజ్ఞ మేర కదలి యా పూతన
రిప్లయితొలగించుపడతి రూపమునను బల్లెఁ జేరె
బాలకృష్ణుఁ జంపఁ బాలీయ వచ్చెనా
"మాట తీపి కాలకూట మెడఁద"
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించుధన్యవాదాలు గురువుగారూ
తొలగించు🙏🏻
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుశ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించురాగ మెల్లఁ జూపి రారాజు మన్నన
వడసి శకునిఁ జేసె వంశ నాశ
నంబు;నమ్మఁబోకు నయవంచకులనెప్డు
మాట తీపి కాల కూట మెడఁద.
...నమ్మలేము నయవంచ...
తొలగించుమీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించునోటిమాటలెంచ కోటలతలదన్ను
రిప్లయితొలగించునోట్ల మూట మార్చు ఓట్ల సరళి
ప్రజల నడ్డి విరిచి పాలించు నేతల
మాటతీపి కాలకూటమెడద.
మీ పూరణ బాగునంది. అభినందనలు.
తొలగించుచూపు లందు మేటి చురకత్తి కినిసాటి !
రిప్లయితొలగించుమోము పద్మ దళము మొఱటు గళము !
నంద మైన వాడు నంతరంగమె పాడు
మాట తీపి కాలకూట మెడఁద !
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఅచ్చపునెయ్యమున్గలుగు నార్యులదూషణముల్బ్రియంబుగా
రిప్లయితొలగించునెచ్చెలులందఱున్మిగుల నేరముదోపక నుందురేగదా
చెచ్చెరయొండొరుల్గసిగ ఛీయనిచిందులాడినన్
మచ్చికమీఱతియ్యనగుమాటలెదంగన గాలకూటమే
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమూడవ పాదంలో గణదోషం. సవరించండి.
చిందులువేయగాదగన్
తొలగించురెండు వేరు వేరు రీతులైనటువంటి
రిప్లయితొలగించుమాట తీపి , కాలకూట మెడఁద
కలిగి యుండుటరుదె గాని గన్పడుచుండు
నీతి విడిచి నట్టి నేత లందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుడా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుభూమి బంచమన్న బురిడీలు కొట్టించు
రాజకీయ పరుని రైతు గనడు
కోతి నీతి జెల్లు కొంత నాకనబూన
మాట తీపి కాలకూట మెడద!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించుమచ్చిక దమ్ములన్ బిలుచు మాన్యత నొందని నోరు మట్టిదౌ
అచ్చపు గుంటయౌ ననగ నాయెను నాడు మరిప్పుడేమొ యా
దృచ్చిక పాలివారి పగ రివ్వున బ్రాకె నసూయ నిండగన్
మచ్చిక మీర తీయనగు మాట లెదంగన కాలకూటమౌ!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించుడా.పిట్టా నుండి
తొలగించుఆర్యా,ధన్యవాదాలు
చేతులాడ వెందు దాతయే తా నను
రిప్లయితొలగించువ్రాతల కవి ననును బూతు లుండు
మనసు వెన్న యనును మాట సాయము సున్న
మాట తీపి కాలకూట మెడఁద
పచ్చఁగ నుంటఁ గాంచి కడుపారఁగఁ దింటను జూచి కన్నులే
పుచ్చఁగ మ్రుచ్చిలం దలఁచి పొచ్చెపు బుద్ధి వహించి చెప్పఁగా
నెచ్చెలి నంచు వచ్చి తగ నిచ్చలు నచ్చపు టిచ్చకమ్ములే
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించురెండవ పూరణ అచ్చతెనుగు యొక్క ఆధిక్యంతో అందంగా ఉన్నది. (పూరణలోని 'బుద్ధి', సమస్యలోని 'కాలకూటము' ... ఈ పద్యాన్ని అచ్చతెనుగు పద్యం అనుకుండా అడ్డుపడ్డాయి.
పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించుబుద్ది అని వ్రాసిన అచ్చ తెనుఁగునకు భంగము లేదు కాని సమస్యాపాదమును మార్చలేము కదండి. వృత్యనుప్రాసార్థము యాదృచ్చికముగా వచ్చిన వీ పదము లచ్చ తెనుఁగు వాడాలని యనుకోలేదు.
మనుజులందుమసలు దనుజులు కలరిలన్
రిప్లయితొలగించుమేకవన్నెబోలుమెకమురీతి
నోరుపలుకువారినొసలెక్కిరించును
మాటతీపి కాలకూటమెడఁద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించుమీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించురెండవ పూరణ మూడవ పాదంలో గణదోషం. సవరించండి.
ఎన్నికల సమరము నేరీతి గెలువగ
రిప్లయితొలగించుహద్దు లేని వరములన్ని యిచ్చు
రాజకీయ కోత రాయుళ్ళ జూడగ
మాటతీపి కాలకూటమెడఁద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుధన్యవాదములు గురువు గారు!
తొలగించుఅచ్చికబుచ్చికన్ మసలి యందరిమన్ననలొందగోరుచున్
రిప్లయితొలగించుపచ్చియబద్ధముల్ బలికి పావనమూర్తిగ సంచరించు నా
మచ్చరికంపుమానసపు మానవులందున నెంచిచూడగా
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించుచక్కదనము తోడ చదువరియై నొప్పి
మేటిగ కనిపించి మెఱయు చుండి
కల్ల పసిడి వలెను కదలాడునా నీచు
మాట తీపి కాలకూట మెడద.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించు'చదువరియై యొప్పి' అనండి.
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించు(జిలేబి గారికి అంకితం)
భాగ్యనగరం బిల్డరు:
రచ్చగ నన్ని పేపరుల వ్రాయుచు మెండుగ వ్యాపనమ్ములన్
నచ్చిన రీతిగా పలికి నాలుగు ప్రక్కల కొండలందునన్
వచ్చిన వారికెల్లరికి వైనపు మాడలు హౌసు చూపుచున్
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమొగము మీద నవ్వు పులుముకొనుచు నుండు
రిప్లయితొలగించుకక్షమందు బాకు కలిగియుండు
నొసలు వెక్కిరించు నోరు పొగడుచుండు
మాట తీపి కాలకూట మెడఁద
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుమోసగాడు మిగుల మోదముగూర్చెడు
రిప్లయితొలగించుతీయగాను పలుకు తేనెవోలె
పైన డాంబికమున పాలమీగడవలె
మాట తీపి కాలకూట మెడఁద!!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించుపైకి మంచితనము వాసిగా చూపుచు
రిప్లయితొలగించునంతరంగమందు అంతులేని
స్వార్థ భావ ముంచి సంచరించెడు వారి
మాట తీపి కాల కూట మెడద.
మరొక పూరణ
నమ్మబోకు మెపుడు నయముగా వర్తించి
మోసపుచ్చు జనులు ముందు గాను
దుష్టజనుల నిలను దూరమిడుము వారి
మాట తీపి కాల కూట మెడద
మూడవ పూరణ
అంతరంగమందు నాప్యాయతలు లేక
తేనె పూసి నట్టు తీరు గాను
నటన చేయు జనుల నైజమెరిగు, వారి
మాట తీపి కాల కూట మెడద
మరొక పూరణ
మిత్రులట్లు చేరి మేటిగా వర్తించి
గడుపుచుందు రిలను కాలమెల్ల
నట్టి శత్రువులను నాదినెరిగు వారి
మాట తీపి కాలకూట మెడద
రఘువు తెగపుం గందూ! చాల్తేరు వాని బిడ్డఁడా!
రిప్లయితొలగించుపుడమి కాన్పు గేస్తుండా! పొద్దు తెగకు దిబ్బెమా!
నిడుద బుజ రాయండా! తమ్మాకు కంటి మేల్దొరా!
తొలి వేల్పులఁ జెండాడం నేర్పరీ! రామ! దండముల్
పాటియె లేని యా రఘువు పాపఁడ! పేర్బుజ దిట్ట! చాలుపుం
దేటికి ముద్దు బిడ్డఁడ! మితిం గన నేరని నేలచూఁలి నే
ల్పోటు మగండ! మిన్న దివె! పున్నెపు వేఁడి వెలుంగు కందువం
బోటరి గొంగ! రక్కసుల మ్రొక్కెదఁ దామర కంటి! నిచ్చలున్
[రఘువు, రామ లు నామములు కనుక యథాతథము తెనుఁగున కూడా.]
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
మొదటి రెండు ననుష్టుప్ చందపు శ్లోక వృత్తములు.
తొలగించుతుచ్ఛుడు జాతి సంపదను దోచు నెపమ్మున చెప్ఫెనిట్లుగా
రిప్లయితొలగించుకుచ్చితు లైన మిత్రులను గూడుచు, నెన్నిక లందు గెల్చినన్
నిచ్చెద వేలవేలు ప్రతి యింటికటంచు పల్కనేమి యా
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే
ఆటవెలది
రిప్లయితొలగించుమమత పంచు నట్టి మాతగా చేరువై
క్ష్వేళమీయ జూచి క్షీరమంచు
బాలకృష్ణుఁ జేతఁ గూలదే! పూతన
మాట తీపి కాలకూట మెడఁద
ఉత్పలమాల
మెచ్చెడు రూపమెత్తి ప్రణమిల్లగ నొప్పెడు మాతయే యనన్
వెచ్చగ జేర్చి తా యొడిని ప్రేమఁగఁ జన్గుడుపంగ జూచినన్
కుచ్చిత మెంచి వెన్నుడట గ్రోలెనె ప్రాణము! పూతనాఖ్యకున్
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే
చేదు కాని వేపచెట్టాకు మంచిది
రిప్లయితొలగించుతీపి పంచదార తీయు నుసురు
జనుల తీరునిట్లె కనగ లోనారసి
మాట తీపి కాలకూట మెడఁద
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించువచ్చితివీవు దీనుడవు ! బాధలనుంటివి ! నన్ను నమ్ము ! నీ..
కిచ్చెద స్వర్ణ కంకణమిదే ! కొను పాంథ ! జరాకృశాంగినై
యిచ్చట యుంటి దంతనఖహీనగనంచను వ్యాఘ్రవాక్యముల్
మచ్చిక మీఱ తియ్యనగు మాట లెదం గనఁ గాలకూటమే!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి