24, జులై 2019, బుధవారం

సమస్య - 3085 (పరమతమ్ముల...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పరమతమ్ముల దూషింపవలెను సతము"
(లేదా...)
"పరమతదూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్"

44 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  పాకిస్తాన్ ఉగ్రవాదము: 👇

  మురియుచు మూల మంత్రముల ముచ్చట మీరగ రచ్చ జేయుచున్
  సరియగు తీవ్రవాదమును చక్కగ నేర్పుచు పాఠశాలలన్
  కరచుచు తిట్టి కొట్టుచును కమ్మని బాంబులు పారవేయుచున్
  పరమతదూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   ఒక పాకిస్తానీ దృష్టిలో ఇవి చేసినవాడే సద్గుణోత్తముడు. అతని మాటగా మీ పూరణ బాగున్నది. ఇది సరదా పూరణ కాదు, సీరియస్ పూరణమే. అభినందనలు.

   తొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 2. మనుజు లెల్ల రొక్కటనుచుఁ మమత జూపి
  యాదరించుట మేలురా యవని యందు
  పరమతమ్ముల, దుషింప వలెను సతము
  మతసహనమె లేనట్టి యా మనుజులనిల.

  రిప్లయితొలగించండి
 3. సిరిపతియైన విష్ణువును చెట్టగు రావిగ జూచునెల్లరున్
  విరులటు నీడనిచ్చు పురవీధిన బోయెడు వారికిన్ మరీ
  సురతరువెక్కడున్ననట చూపుచు భక్తిని పూలజెల్లయున్
  పరమత దూషణమ్ము సలుపన్ వలెనెప్పుడు సద్గుణోత్తముల్
  Adipudi Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  *పరమ తద్ ఊషణము* - పరమమగు ఆ రావిచెట్టును

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రోహిత్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   '...జూతు రెల్లరున్...బోయెడు నెల్లవారికిన్...' అనండి. 'పూలజెల్లయున్'? 'ఊషణము' అంటే రావిచెట్టు అనే అర్థం ఉన్నట్టు లేదు.

   తొలగించండి
 4. సమస్య :-
  "పరమతమ్ముల దూషింపవలెను సతము"

  *తే.గీ**

  మతములన్నవి ప్రజలకు మార్గదర్శి
  మంచినేర్పు గనుక నాదరించ వలెను
  పరమతమ్ముల, దూషింపవలెను సతము
  మత సహనము పాటించని మానవులను
  .....................✍చక్రి

  రిప్లయితొలగించండి
 5. ధరను ప్రాణులు తరియించు దైవ మొకడె
  ద్వైత మన్నది లేదిల భేద మనుచు
  పరమ తమ్ముల , దూషింప వలెను సతము
  వేరు వేరని వాదించు వెఱ్ఱి జనుల

  రిప్లయితొలగించండి


 6. తమదగు మతము పాటింప తగును చూప
  వలె సహిష్ణుత నెల్లరి పట్ల మరియు
  పరమతమ్ముల దూషింప, వలెను సతము
  ఖండన మపుడె మేలు సకల జనులకు!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. స్తిరమతియైనశంకరుడు దేశమునంతటసంచరించుచున్
  కరమరుదైనవాదములగర్జనసేయుచు షణ్మతమ్ములన్
  స్తిరముగనిల్పెగాన, గుణహీనములైన యవైదికమ్ములౌ
  పరమతదూషణమ్ము సలుపన్వలెనెప్పుడు సద్గుణోత్తముల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోటేశ్వర శాస్త్రి గారూ,
   ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
   'స్థితమతి' టైపాటు...

   తొలగించండి
 8. సహనమున జూడ వలయును సఖ్యముగను
  పరమతమ్ముల...దూషింప వలెను సతము
  మతకలహముల సృష్టింప జతనమున
  దుస్ట శక్తులను నిరసించి దోషులనుచు

  రిప్లయితొలగించండి
 9. *ఒకానొక మతోన్మాది తన అనుయాయులకు ప్రబోధించుచున్నట్లుగా నూహించిన పద్యం*

  విరివిగ డబ్బు బంచుచు పవిత్ర మతమ్మది మాదెయంచు నీ
  ధరణిని జూడనన్య మత ధర్మము లుండగ రాని రీతిగన్
  భరత ధరిత్రిలోని జన వాసములందు ప్రభావ మొప్పగన్
  పరమత దూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్.

  రిప్లయితొలగించండి
 10. నిరతము తీవ్ర వాదమను
  నిప్పును రాజగ జూచుచున్ సదా
  దురితపుఁ గార్యముల్ జరుప
  దుష్టపు బుద్ధినఁ జింతఁజేయుచున్
  మరిమరి హెచ్చ ద్వేషములు,
  మానవ బాంబుల పెంచునా పరం
  పర మతదూషణమ్ము సలు
  పన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్

  రిప్లయితొలగించండి
 11. క్రొవ్విడి వెంకట రాజారావు:

  స్వేచ్ఛ నణగించి గదుముచు జీవితాన
  కట్టుబాట్ల తోడ జనుల క్షమ నద్ది
  తనుకు గూర్చు నాల్ ఖైదా వలెను చరించు
  పరమతమ్ముల దూషింప వలెను సతము.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ గురుభ్యోన్నమః🙏

  హరి భక్తి మానుమని, హరిభక్తుల శిక్షింప వలెననియు, దండ్రి యైన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి రాక్షసనీతి దెలుపుట:

  సురల దర్పమడచుమిక శూలములను
  నాగపతుల బీడించుము నాటలందు
  సిద్ధుల బరిమార్పు బెదరి సిగ్గుబడగ
  పరమతమ్ముల దూషింపవలెను సతము

  రిప్లయితొలగించండి
 13. జగము కాచు వాడెవ్వరో,సంయమనము

  చూపమనె సభలో ధర్మ జుండెవరిని,

  పంక్తి గళుడు,నారాయణ భజనమాని

  మునుల నేమి చేయ మనెను ముదముతోడ,

  పరమ,తమ్ముల,దూషింప వలెను సతము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పరమpermalink
   పరమ : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report an error about this Word-Meaning
   వి.
   ఉత్కృష్టము; ప్రధానము; ఆద్యము.
   పు.
   పరమాత్మ.

   తొలగించండి
 14. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సరిగ నాదరించ వలయు సహనమెంచి
  పర మతమ్ముల; దూషింప వలెను సతము
  కట్టుబాట్ల తోడ జనుల క్షమ నద్ది
  ప్రాకు మతముల తీవ్రంపు భావములను.

  రిప్లయితొలగించండి
 15. (ఔరంగజేబు తన సైనికులతో)
  అరమరలేక యెల్లరును
  నద్భుతమార్గము బట్టుడిప్పుడే;
  సరగున గూల్చివేయుడిక
  సాధుల;బొమ్మల;మందిరమ్ములన్;
  బరమతదూషణమ్ముసలు
  పన్ వలె నెప్పుడు;సద్గుణోత్తముల్!
  వరలుడు మీరలందరును
  భక్తిగ మహ్మదుసేవ జేయుచున్.

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  దురితములాచరించి , పరితోషము పొంది పవిత్రకార్యసం...
  భరితవిధానమంచునిల మారణహోమము జేయు ధూర్తులన్
  కరుణయె లేక పంపవలె కాలుని ప్రోలునకుగ్రవాద త...
  త్పరమతదూషణమ్ము సలుపన్ వలెనెప్పుడు సద్గుణోత్తముల్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  సరియగు కూర్పు లేనివగు శౌంఠ్యపు సూత్రము లెంచి సాగుచున్
  విరివిగ తోడివారి నిట వెంపర లాడగ జేయు రీతిలో
  నిరతము ద్రోహ చింతనము నేర్పుచు నుగ్రత పెంచు నట్టిదౌ
  పరమత దూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్.

  రిప్లయితొలగించండి
 18. పరమతమ్ములదూషింపవలెనుసతము
  దప్పు దూషింపరాదార్య!యెప్పటికిని
  నెఱుగు డన్నిమ తంబుల సారమొకటె
  చూడ మనవిధి సమదృష్టి తోడ భువిని

  రిప్లయితొలగించండి
 19. మతములన్నిటి సారము మంచి యనక
  నితర మతముల నెన్నడు హేయమనుచు
  నిరత మారని మంటల నెగయ జేయు
  పరమతమ్ముల దూషింపవలెను సతము

  రిప్లయితొలగించండి
 20. తేటగీతి
  దైవమొక్కటె యనిజెప్పు ధర్మము విడి
  భువిని పరమత సహనమ్ము బుగ్గిఁ జేయ
  సద్గుణోత్తము లెల్లరు సైచకయె స్వ,
  పరమతమ్ముల దూషింపవలెను సతము

  చంపకమాల
  అరయక దైవమొక్కటను యన్ని మతమ్ముల సారమంతటిన్
  పరమత మన్న తాల్మి విడి వైరపు భావన రేగి నంతటన్
  ధరణిని శాంతి భద్రతల దారినిడన్ స్వమతమ్ము తోడుతన్
  పరమత దూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్

  రిప్లయితొలగించండి
 21. ధరణికి భారమౌను గద దారుణ మారణ హోమ మార్గమౌ
  పరమతదూషణమ్ము; సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్
  కరుణయు శాంతి సౌఖ్యములె గారవమౌనను నీతి బోధలన్
  పరులకు మేలు జేయుటయె పాడి యటంచు ప్రపంచమంతటన్

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. పరమత దూషణమ్ముసలుపన్ వలెనెప్పుడుసద్గుణోత్తముల్
  పరమతదూషణమ్ములెయెవారికిమంచిదికాదుభూతలి
  న్నరయబ్రజాళి చక్కగనునైక్యముతోడననుండుచోదగన్
  ధరణికిమేలుగల్గుటనధార్మిక లోకముమెచ్చునెప్పుడున్

  రిప్లయితొలగించండి
 24. మార్గములు వేఱయిన నేమి మతము లన్ని
  యు నుడివెడు గమ్య మొక్కటె కనఁగ వసుధ
  నే నెఱుఁగ కుంటి నీ మాట లెవ్వ రేల
  పరమతమ్ముల దూషింపవలెను సతము


  కర మరుదే కదా సురలఁ గాంచుట కాయము తోడ నేరికిన్
  వరములఁ బొందఁ గోర నిల భక్తి విధేయత లుండగా వలెన్
  గురు వగు నమ్మకమ్ము మదిఁ గూర్చును భక్తిని దైవ చింత నా
  పర మత దూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్

  [చింతనా + అపర = చింత నాపర; మతము =అభిప్రాయము]

  రిప్లయితొలగించండి
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  రోమాయణం:

  బరువగు బీరు కొట్టుచును బైబులు గాథలు మైకులందునన్
  దరువుల తోడ పాడుచును దండిగ డబ్బులు పంచిపెట్టుచున్
  గరువము మీర దెప్పుచును కమ్మని కృష్ణుని లీలలన్నియున్
  పరమతదూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్

  రిప్లయితొలగించండి
 26. శుభమును గ్రహించి సహనము చూపుమెపుడు
  పరమతమ్ముల , దూషింపవలెను సతము
  వక్రభాష్యము లిచ్చెడివారినింక
  సర్వమత సామరస్యమె శాంతి గూర్చు

  రిప్లయితొలగించండి
 27. తరతమ భేదము ల్గనరు దైవవిభూతులె దోచు నన్నిటన్ ధరణిని వారికి న్నదులు దారిని గట్టెడు రీతి నబ్ధికై
  తెరవులు సర్వమున్ జగదధీశుని జేరెడునంచు నెంతురే
  పరమతదూషణమ్ము సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్?

  రిప్లయితొలగించండి
 28. అరయగ దారులెన్నొ పరమాత్మను జేరగ నిశ్చయంబుగన్
  విరియగ నాదరింపవలె భిన్నమతమ్ముల శాంతి,వీడుచున్
  పరమత దూషణమ్ము,సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్
  కరుణను సామరస్యమగు కార్యములన్ పరమాత్మప్రీతిగా

  రిప్లయితొలగించండి
 29. మతమనగ నేమి నిల జెడుఁ మంచి దక్క
  కోరి నేర్పరచ మతంబు గీడు గాదె
  ప్రాణశక్తి నొకటె మత ప్రాకులాట
  పరమతమ్ముల దూషింపవలెను సతము

  రిప్లయితొలగించండి
 30. మరువకు మంటి నెప్పుడును మానవ జాతికి మార్గదర్శియౌ
  వరమది జాతి సంస్కృతికి, పాపము జేయుట గాదె యింక యా
  పర మతదూషణమ్ము, సలుపన్ వలె నెప్పుడు సద్గుణోత్తముల్
  విరివిగ ధర్మబోధనలు విశ్వపు నాల్గుచెరంగులందునన్.

  రిప్లయితొలగించండి
 31. అతిశయించిన పాపమ్ము నరయుటకును
  నరకబాధల యమపురి వరలుటకును
  జన్మజన్మల హింసముల్ సలుపుటకును
  పరమతమ్ముల దూషింపవలెను సతము

  రిప్లయితొలగించండి