4, జులై 2019, గురువారం

న్యస్తాక్షరి - 64

కవిమిత్రులారా,
గ్రంథపఠనం వల్ల ప్రయోజనాలను తెలుపుతూ 
ఉత్పలమాల వ్రాయండి.
న్యస్తాక్షరాలు.......
మొదటి పాదం 5వ అక్షరం 'పు'
రెండవ పాదం 11వ అక్షరం 'స్త'
మూడవ పాదం 14వ అక్షరం 'క'
నాల్గవ పాదం 17వ అక్షరం 'ము'
(లేదా...)

నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా "పు - స్త - క - ము" ఉండే విధంగా ఆటవెలది వ్రాయండి

72 కామెంట్‌లు:

 1. ప్రాతః కాలపు సరదా పూరణ:

  "రోటీ కప్డా మకాన్" చదువు:

  ఆకలి మాపుటందునను హాయిని గూర్చెడి జాబునిచ్చురా!
  మైకము ద్రోలుచున్ భళిగ మస్తక మందున శాంతినిచ్చురా!
  కూకట పల్లిలో నిరుకు కొంపను వాకబు చేయనిచ్చురా!
  శోకము మాపుటందునను షోకగు భామను గోముగానిడున్ :)

  రిప్లయితొలగించండి
 2. ప్రభాకర శాస్త్రి గారూ,
  ఈరోజు న్యస్తాక్షరిని చూచి ఓ దండం పెట్టి తప్పుకుంటారనుకున్నాను. కాని చక్కని పూరణ చెప్పారు. సంతోషం! అభినందనలు.

  రిప్లయితొలగించండి


 3. పుస్తక ముల్ సహాయముగ భూర్ణియె నీదగు వెన్నముద్దలా
  మస్తుగ చేతి కందు నిక మస్తక మయ్యది వృద్ధి నొందగా
  హస్తము వ్రాయ మేలగు ప్రహాదపు రేకల జాగృతమ్మగున్
  వస్తము దేశమున్ సఖియ వాగఱ గైకొని పాముకోఱవే


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మొదటి పాదం న్యతాక్షరము "పు" 5 వది కదా ?

   తొలగించండి
  2. జిలేబి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   కాని శాస్త్రి గారు చెప్పినట్లు మొదటి పాదంలో న్యస్తాక్షరం స్థానభ్రంశం చెందింది. సవరించండి.

   తొలగించండి


  3. పుస్తక ముల్ పునాదియగు భూర్ణి ద్రవింపగ వెన్నముద్దలా
   మస్తుగ చేతి కందు నిక మస్తక మయ్యది వృద్ధి నొందగా
   హస్తము వ్రాయ మేలగు ప్రహాదపు రేకల జాగృతమ్మగున్
   వస్తము దేశమున్ సఖియ వాగఱ గైకొను పాముకోఱవే


   జిలేబి

   తొలగించండి

  4. పూరణ చేయ తెల్గు పద పోడిమి చాలదె పూవుబోడియా :)


   జిలేబి

   తొలగించండి


  5. పూరణ చేయ గా పలుకు పోడిమి చాలదె పూవుబోడియా :)

   తొలగించండి
  6. క్రొత్త సమస్య దొరికింది.... ధన్యవాదాలు!
   "పూరణఁ జేయంగ వాణి బ్రహ్మల తరమే"
   (లేదా...)
   "పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే"

   తొలగించండి
  7. ఇప్పుడే పూరణ పెట్టకండి. దీనిని రేపు ఇస్తున్నాను.

   తొలగించండి

  8. మాకందానికి ( మా కందానికి :))
   యతి మార్చవలెనా ?


   జిలేబి

   తొలగించండి


  9. సారంబొప్ప మధురమగు
   పూరణఁ జేయంగ వాణి! బొమ్మల తరమే
   మీ రసగుల్లా మయముగ
   భారతి దయవల్ల యౌను పడతులకున్ పో!


   జిలేబి

   తొలగించండి


  10. చేరక కంది శంకరుల శ్రేష్టతరమ్మగు కైపదమ్ములన్
   ప్రేరణ తోడుగా మడత పెట్టు సమస్యల చూడగానటన్
   కోరిక యున్న నేమయ వికోనయు వైవియు భీతినొందిరే
   "పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?"


   జిలేబి

   తొలగించండి
  11. కందపాద సమస్యలో యతి తప్పింది. సవరించాలి.

   తొలగించండి
 4. చక్కని గోపురమ్మిదియె;
  సౌరభశీతలగంధమిద్దియే;
  యక్కరొ!యన్నరో!వినుడు;
  హస్తమునందున గ్రంథముంపుడీ!
  మిక్కుటమైన జ్ఞానమును
  మేలగు పోకడలన్ని పొందుడీ!
  యక్కజమైన కీర్తులవి
  యాభరణమ్ములు;మోములెత్తుడీ!!

  రిప్లయితొలగించండి
 5. కోరికతో పురాణపు నిగూఢములన్ గ్రహియింప నెల్లరున్
  పేరిమి శ్రద్ధతో చదువ విస్తరమౌగద జ్ఞానసంపదల్
  తీరిక వేళలో జనులు దివ్య వివేకపు టార్జనంబుకై
  కారణ మైన పొత్తముల కమ్రపు రీతిగతాము పొందరే

  రిప్లయితొలగించండి
 6. మిత్రులందఱకు నమస్సులు!

  గ్రంథము లిం[పు]గాఁ జదువ రమ్యతరమ్మగు జ్ఞాన మిచ్చురా
  మంథజ భాతి వర్తనము మ[స్త]కమందునఁ గల్గఁజేయురా
  కంథను డుల్పఁజేసియును గాటపుఁ గో[క]లఁ దాల్పఁజేయురా
  పాంథుఁడవైనఁ దజ్జనుల బంధులఁ జేసియుఁ బ్రే[ము]డిచ్చురా!

  రిప్లయితొలగించండి
 7. మైలవరపు వారి పూరణ

  భారతి ప్రాపు దక్కు , రసవత్తరపద్యనిబంధశబ్దసం...
  భారము దక్కు , జాడ్యము సమస్తము దగ్ధము గాన్ , విదగ్ధధీ...
  సారము దక్కు , సత్సభ యశస్సుపతాకము సొంతమౌను , శ్రీ...
  కారమువంటి పుస్తకము కల్పకభూరుహమై ముదంబిడున్ !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 8. పుస్తకమ్ములం దాసక్తి పూర్తిగా మ
  స్తకము వికసించు మార్గంబు సరిగ; పుస్త
  కములు చదువు వారి కెపుడు కలుగు, లాభ
  ముగ బ్రతుకు పయనము నందు ముందు చూపు

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సూర్య గారూ,
   ఆటవెలది వ్రాయమంటే తేటగీతి వ్రాసారు. అలాగైనా మొదటి పాదం చివరి అక్షరం గురువై గణదోషం.

   తొలగించండి
  2. పరాకును మన్నించండి _/\_

   పుస్తకములు గూర్చు పూర్ణ ప్రజ్ఞ మనకు
   స్తబ్ధునైన మార్చు శక్తి నొసగు
   కలుగు నెంతొ మేలు గ్రంధ పఠనమందు
   ముప్పు గాచి నడుపు ముందుకెపుడు

   తొలగించండి
 9. డా.పిట్టా సత్యనారాయణ
  పనిగొని *పు*స్తకమ్ము గొని భద్రుడ నేననుకోగ ,,తప్పు, నా
  చనువున మెల్గి విస్తరిత *స్తం*భముగా గడగంగ;మోసమే
  జననగు విద్దెలన్ననెడి జాగృతి* క*ల్లయె నీతి నింగినిన్
  మొనయగ పాఠకుండనను ముచ్చట ముద్దవ ముర్వ నేర్వకే
  పెనగిన రెండు మాత్రలగు:ప్రేమ:ను నేర్వరె పండితాళియై

  రిప్లయితొలగించండి
 10. పుస్తక గోపుర మ్మొసఁగు భూరి మనోభ్యుదయమ్ము గాంచగం
  బుస్తక మిచ్చు నమ్రతను బుస్తక మంద చరిత్రఁ గాంతుమే
  పుస్తక గుప్తముల్ శ్రుతులు పుస్తక మాకర మయ్య విద్యకుం
  బుస్తక మౌ సరస్వతియ పుస్తక మల్పమె నోము పంటయే  పుస్తకము లొసంగు భూరి విజ్ఞాన మా
  స్తరము కవి వరులకు వర మకుటము
  కలుగఁ జేయు వృద్ధి బలము సంఘము నందు
  ముఱిపెముగ జనులకుఁ బుస్తకమ్ము


  పు స్తకము ...
  స్త....క ........ము
  క .......ము ......
  ము .......బుస్తకమ్ము

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
   ముఖ్యంగా ఆటవెలదిలోని అక్షరవిన్యాసం అభినందనీయం.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 11. పుణ్యఫలమున గురుబోధతోడను పద్య స్తబకమునులిఖించి సత్వరముగ కరము తృప్తి గొంటి కవినని పొగడగా ముఖ్యమైన హితులు ముదముతోడ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పుణ్యఫలమున గురుబోధతోడను పద్య
   స్తబకమునులిఖించి సత్వరముగ
   కరము తృప్తి గొంటి కవినని పొగడగా
   ముఖ్యమైన హితులు ముదముతోడ

   తొలగించండి
  2. అన్నపరెడ్డి వారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'ముఖ్యులైన హితులు...' అని ఉండాలనుకుంటాను.

   తొలగించండి
 12. పుస్తకమ్ముజదువపుష్టియగుగదమ
  స్తకము,గలుగుప్రేమ సర్వులకును
  కధలుమనలబెట్టిగాడియందుననిల
  ముదము దృప్తినిచ్చుముఖ్యముగను

  రిప్లయితొలగించండి
 13. లోకము చూపు పుస్తకము రూఢిగ శ్రద్ధగ నభ్యసించినన్
  ఆకలి దప్పులుండవుగ హస్తమునందున నున్న పొత్తమే
  వేకువ జాములో చదువ వెంటనె జోకగ నాటు నెమ్మదిన్
  చేకొన మంచి గ్రంధమును చింతను దీర్చును నోము పంటగా !!!

  రిప్లయితొలగించండి
 14. పుస్తకములు జదువ పోడిమి కల్గు మ
  స్తకము నందు మంచి సవురు బెంచు
  కలిమి బలిమి తెలివి గరిమను జేకూర్చు
  ముదము నందజేయు పొందు పుస్తి!!!  రిప్లయితొలగించండి
 15. కోరికపెంపుమీరగనుగూరిమితోడనుగ్రంధముల్సదా
  పేరిమి గల్గగాజదువవిస్తరమౌనుగదెల్వితేటలు
  న్గూరిమిగల్గునొండొరులకూర్పునునేకముజేయునెప్పుడు
  న్వేరుగనుండువారలకుప్రేమనుగూర్చుచుగోమునింపుగా

  రిప్లయితొలగించండి
 16. జ్ఞానము పెంపుజేయునది, సంస్కృతి గొప్పదనమ్ము చెప్పుచున్
  మానవ జాతి వైభవము మస్తక మందున నిల్పియుంచి వి
  జ్ఞానిగ దిద్దితీర్చునది, చక్కగ లోకపు రీతితెల్పెడిన్
  వాణి పఠించినన్ కలుగు వాసిగ లాభములే ముదమ్మునన్.

  వాణి = పుస్తకము

  రిప్లయితొలగించండి
 17. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  (ఇల్లరికం అల్లుని కొమ్మూరి సాంబశివ రావు గ్రంథ పఠనము):

  కోపము నాపుటందునను కొట్టగ నత్తయ టీవిజూడగా
  వీపును తట్ట చీపురున విస్తరి నెత్తక పారిపోవగా
  ధూపము పీల్చగా విసిగి తోరపు కేకలు పెట్టునప్పుడున్
  రేపును మాపునున్ చదివి ప్రీతిని పొందర జాము జామునన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
   'కొమ్మూరి సాంబశివరావు' నవలలను గుర్తు చేసి నన్ను నా బాల్యానికి తీసుకువెళ్ళారు.

   తొలగించండి


 18. పుస్తకములు చదువ బుద్ధిగా సతము మ
  స్తకమునకిల చురుకు దనము ,తెలివి
  కలుగ చేసి నరుని ఘనమైన వ్యక్తి గా
  ముక్తి బాట చూపు ముందుగాను

  మరొక పూరణ

  పుడమి యందు జనుల మూర్ఖతన్ బాపి య
  స్తమయమవని వెలుగు జనులు కిచ్చి
  కలిమి నిలను కూర్చి కడలేని తృప్తిని
  ముదము తోడ నొసగు పుస్తకములు

  రిప్లయితొలగించండి

 19. చక్కగ జూపువెల్గులను సాగగనుత్తమ మార్గమందునన్
  మక్కువమీరగా జదువ మస్తకమెంతొ వికాసమందు నే
  చిక్కులనైన దీర్చునది శ్రీకర మాకరమెట్టి సంఙ్ఞకున్
  దిక్కగు నెల్లవారికిని తీరగు పొత్తపుసొమ్ములున్నచో

  రిప్లయితొలగించండి
 20. 4, జులై 2019, గురువారం

  న్యస్తాక్షరి - 64

  గ్రంథపఠనం వల్ల ప్రయోజనాలను తెలుపుతూ 
  ఉత్పలమాల వ్రాయండి.

  న్యస్తాక్షరాలు......
  .
  మొదటి పాదం 5వ అక్షరం 'పు'
  రెండవ పాదం 11వ అక్షరం 'స్త'
  మూడవ పాదం 14వ అక్షరం 'క'
  నాల్గవ పాదం 17వ అక్షరం 'ము'

  నా పూరణ ఉ.మా.
  *** *** **

  జ్ఞానము బెం"పు" పుస్తకము; న్యాయము దెల్పు పఠింప గ్రంథమే!

  మానము బెంచు సంఘమున ,మ"స్త"క మెంతయొ వృద్ధి జెందురా!

  హీనపు జీవితమ్ములకు నిమ్మహినన్ "క"డు వెల్గు నీయదే?

  కానను పుస్తకమ్ములను కాదనకన్ పఠన"మ్ము" జేయుమా!


  ఆకుల శాంతి భూషణ్
  ....వనపర్తి....

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. శాంతిభూషణ్ గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'జ్ఞానము నింపు' అనండి.

   తొలగించండి
 21. పాపముఁబా*పు*చున్ సుజనపాళికి భావ సమృద్ధి నిచ్చుచున్
  మాపుచు దుష్ట బుద్ధిని, సమ*స్త*ప్రశస్త గుణప్రభావముల్
  రాపిడిసేయ,విజ్ఞత వరంబగు రా*క*,మనోజ్ఞ సంగతుల్
  మోపులు,రాశులై చన,తమోగణ వర్జితమౌ*ము*దంబునన్..

  రిప్లయితొలగించండి
 22. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂న్యస్తాక్షరి🤷‍♀....................
  గ్రంథపఠన ప్రయోజనాలతో ఉత్పలమాల

  మొదటి పాదం 5వ అక్షరం 'పు'
  రెండవ పాదం 11వ అక్షరం 'స్త'
  మూడవ పాదం 14వ అక్షరం 'క'
  నాల్గవ పాదం 17వ అక్షరం 'ము'

  సందర్భము: సులభము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పొత్తము రేపు మా పనక
  మోదముఁ గూర్చుచు బాధ జార్చు న
  త్యుత్తముడై ధరన్ బరగు
  దో స్తనవచ్చును.. విత్త మిచ్చు.. నా
  విత్తముకన్న మిన్న యగు
  విజ్ఞత యే కడ నున్న దక్కుగా..
  మొత్తముమీద పుస్తకము
  మొద్దుల బుఱ్ఱలఁ దోము చక్కగా..

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  4.7.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి
 23. పుస్తకమే*పు*నాది పరిపుష్టిగ విద్యలనభ్యసించగా
  మస్తకమందుఁజేరునుసమ*స్త*ము పుస్తక వీక్షణమ్ముచే
  ఆస్తికులైనవారలకుయాస్తియవే *క*ద, వేద గ్రంధముల్
  నాస్తికవాదియైన కఠినాత్మునిజేయునుగా*ము*నీశ్వరున్

  రిప్లయితొలగించండి
 24. ఉ: దిక్కును చూ *పు* పుస్తకమె తీరుగ ధారణ చేయుచున్ సదా
  మక్కువ తోడ నిల్పినను మ *స్త* కమందున పద్యరత్నముల్
  చక్కని జీవితమ్మిల వశమ్మగు శ్రీ *క* రమౌను పృథ్విపై
  చిక్కు ప్రశాంతి సంతతము శీఘ్రముగా మదికిన్ *ము* దమ్మగున్

  రిప్లయితొలగించండి