13, జులై 2019, శనివారం

సమస్య - 3074 (కవి యొక్కండును...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్"
(లేదా...)
"కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్"
(ఈరోజు బెంగుళూరులో నా 'వరద శతకము' ఆవిష్కరణ)

32 కామెంట్‌లు:

  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

    భువిలో గాంచని రీతి భాజపకు భల్ పూర్ణంబుగా నోడగా
    దివినిన్ జూచెడు కాంగ్రెసోత్తములవౌ దీర్ఘంపు భావమ్ములన్
    కవిరో! నేతలు దాగగా భయముతో కర్ణాట హోటళ్ళనున్
    కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్

    రిప్లయితొలగించండి
  2. కవులం దరుతరలి వెడల
    కవనమ్ముల వర్ష మంట కన్నుల విందౌ
    భువినిం డుగతెలుగు వెలుగు
    కవియొకఁడును గాన రాఁడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  3. గురువుగారికిశుభోదయ వందనాలతో:
    కవియనశంకరకవియే
    కవులకు ప్రాపైనడపెడుకర్తయునతడే
    కవికులతిలకునిమించిన
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  4. జవదాటక గురువాజ్ఞను
    కవిసమ్మేళణము కొరకు కదల కవుల పా
    టవముఁ బరీక్షింపంగ, కు
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  5. (విలక్షణలక్షణవిరాజితుడైన కవి నేటి కర్ణాటకలో కనపడటంలేదు)
    రవి కనుగొనని స్థలములను
    కవి కనుగొను నందురు కద!కమనీయములౌ
    చవులును ఛవులును గురిసెడి
    కవి యొకడును గానరాడు గర్ణాటమునన్.
    (చవి-రుచి;ఛవి-కాంతి)

    రిప్లయితొలగించండి
  6. కవికుల తిలకుడు శంకరు
    డవలీలగ వ్రాసినట్టి యద్భుత మైన
    ట్టి వరద శతకముఁ మెచ్చని
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి


  7. సువిశాలమ్ముగ నా తెలు
    గు విభుండా రాయలు తెరగున పద్యముల
    ల్లి వరలిన నేల! బుచికీ
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!


    బెంగళూరులో కలుద్దాం :)



    జిలేబి

    రిప్లయితొలగించండి
  8. ధ్రువముగ శ్రీనాథు గెలుచు
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్
    భవముగ డిండిమ భట్టను
    కవివరు నోడించి తనదు ఘనతను చాటెన్

    రిప్లయితొలగించండి
  9. కవిశంకరు శతకము
    ప్రవిమల మతి యగుచు చదివి ప్రస్తుతి సేయన్
    తవిలడు వాడగు నట్టి సు
    కవియొకడు కానరాడు కర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  10. చవిగొని వరదుని శతకము
    పవనసుతునిదైన జవము ప్రాకటమవగా
    సవరించిన శంకరసమ
    కవియొక్కడు గానరాడు గర్ణాటకమున్

    రిప్లయితొలగించండి
  11. కవితా వ్యవసాయమ్మున
    వివరము దెల్పగ కవులట వేల్పుగవెలుగన్
    అవధానమ్మున కేగగ
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!!

    రిప్లయితొలగించండి


  12. సువిశాలమ్ముగ పద్యముల్ తెనుగులో శోభిల్ల రాజ్యంబు నే
    లి వధాన్యుల్ సదనమ్ములోన వరలన్ లెస్సంగ పోషింప ము
    న్ను విరాజిల్లుచు కృష్ణరాయలె సుమా నొప్పారగాలేని యే
    కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి


  13. వివరములన్నియు నెరిగిన
    సువివేకముతోడ నొకడు సొగసుగ పలికెన్
    అవివేకముతోపల్కు కు
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

    మరొక పూరణ

    కవివరులందరు వడిగా
    నవకావ్యములను రచించి నగరుకు రాగా
    సవినయముగ పలికిరట కు
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    కవి బమ్మెర శాపమ్మది
    ఛవి నెంతక కృతిని గోరు ఛందము గనరే
    సువిచారము తెనుగున గను
    కవి యొకడును గానరాడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  15. డా.పిట్టా నుండి
    2వ పాదం టైపాటు సవరణ:
    ఛవి నెంచక కృతిని గోరు చందము గనరే

    రిప్లయితొలగించండి
  16. డా.పిట్టా సత్యనారాయణ
    కవి యెందుండెను,పత్రికా చయమునా?కాశీ ప్రయాగాలనా?
    రవియా మూలల చీకటుల్ నలుపగా?రాత్రిం బడెన్ పద్యమే;
    కవయన్నుద్యమ మొక్కటైన గలదా?కాంక్షించిరే గద్యమున్!
    కవి యొక్కండును గానరాడు వెదుకం గర్ణాట దేశమ్మునన్

    రిప్లయితొలగించండి
  17. కవులసభజరుగుచుండగ
    గవియొకడునుగానరాడుకర్ణాటమునన్
    గవికులతిలకులెయిటులన
    నవసరమా చెప్పుడార్య,యౌచిత్యంబే?

    రిప్లయితొలగించండి
  18. మత్తేభవిక్రీడితము
    కవిసమ్మేళనమంచు రమ్మనఁగ నాగజ్యోతి గారందరిన్
    కవనంబాదిగ పెక్కు పొత్తముల ప్రఖ్యానమ్ములన్ గూర్చగా
    నవలోకించఁగ సుబ్రమణ్య మఠ ఛాయన్జేర వేరెచ్చటన్
    కవి యొక్కండును గానరాడు వెదుకం గర్ణాటదేశమ్మునన్

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. కందిగురువులశతకముగవులుమెచ్చ
    విడుదలగుచుండుసమయాననెడదయందు
    వేడుకొందునుభవ్యునిబ్రీతితోడ
    పూర్ణమాయువునిమ్మనినార్యులకిల

    రిప్లయితొలగించండి
  21. కందం
    అవలోకించగ కవనం
    బు వరుస పొత్తపు ప్రకటనముల్ మఠమునతా
    ము వెడలిరో వేరెచ్చటఁ
    గవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్

    రిప్లయితొలగించండి
  22. శ్రవణానందము నీయఁగఁ
    జవు లూరఁగఁ బాడు చుండ సంగీతంపుం
    జవు లెఱుఁగని పూరుషుఁ డో
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్


    భువి రాజ త్కవిసార్వభౌముఁడు సుధీ పూర్ణుండు ప్రఖ్యాత స
    త్కవి యా డిండిమభట్టు ఢక్కఁ ద్రుటి వ్రక్కల్ సేయ విఖ్యాతుఁడున్
    ఛవిమత్కంకణ హస్త భాసితుఁడు శ్రీనాథుండు దక్కంగ దోః
    కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్

    [దోః కవి = చేతులకు కళ్ళెములు కలవాఁడు]

    రిప్లయితొలగించండి
  23. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    భవబంధమ్ములు వీడుచున్ కవితలన్ భద్రమ్ముగా నేర్పుచున్
    లవలేశమ్మును శ్రాంతినిన్ గొనకయే లక్ష్యమ్ముకై పోరుచున్
    భువినిన్ జిక్కిన కంది శంకరులవోల్ పుణ్యాత్మునిన్ బోలు స
    త్కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్

    రిప్లయితొలగించండి
  24. కవిగాశంకరుబెంగుళూరునకునొక్కండేప్రయాణించగా
    భవుడెవ్వాడునురాకపోతిరిగనీభవ్యాత్ముగొంపోవగన్
    గవియొక్కండునుగానరాడువెదుకంగర్ణాటదేశమ్మునన్
    నవనిన్జీకటిముంచుకారణమెయట్లైయుండునాపట్టునన్

    రిప్లయితొలగించండి
  25. దివిజులు శంకర శతకము
    నవలోకంపంగనేగె నంచును వారల్
    స్తవనీయంబుగ నేగిరి
    కవియొక్కడు కానరాడు కర్నాటమునన్

    రిప్లయితొలగించండి
  26. శ్రీగురుభ్యోనమః🙏

    భవసాగర తరణంబౌ
    తవ విరచిత వరద శతక తావిం గ్రోలన్
    కవనంబను గంగ మునుగ
    కవి యొకఁడును గానరాఁడు గర్ణాటమునన్!

    రిప్లయితొలగించండి
  27. అవధానమ్మని పండితోత్తముల నాహ్వానించె మాన్యుండు గౌ
    రవనీయుండగు కంది శంకరులు హైద్రాబాదుకున్ బ్రేమతో 
    కవయిత్రుల్ మరియున్ కవుల్ కదలిరే కర్ణాటమున్ వీడుచున్  
    గవియొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాట దేశమ్మునన్

    రిప్లయితొలగించండి
  28. కవులే ప్రేమగ కోరిరంచుగద సత్కావ్యమ్ము నే వ్రాయ గౌ
    రవనీయుండగు కందిశంకరులు ప్రారంభించిరే దీక్షతో
    నవలీలన్నొక రోజులో తానందింపగా, భేషనన్
    గవియొక్కండును గానరాడు వెదుకం గర్ణాట దేశమ్మునన్.

    రిప్లయితొలగించండి
  29. మైలవరపు వారి పూరణ

    ఒకే రోజులో వరదశతకమును రచించి.. నేడు కర్ణాటకలో ఆవిష్కరించు శుభసందర్భమున శ్రీ కంది శంకరయ్య గారికి శుభాభినందనలు 💐💐👏👏👏🙏🙏🙏

    ఈ పద్యం వారికే అంకితం..🙏🙏


    నవచైతన్యసుధీవికాసమనగన్ వార్ధక్యమందౌర మా...
    ధవ పాదార్చన కందపద్యముల గ్రంథమ్మున్ వెలార్చంగ ., కం...
    ది వరేణ్యున్ గని మెచ్చ చిత్తమున సందేహించువాడైన యే
    కవి యొక్కండును గానరాఁడు వెదుకం గర్ణాటదేశమ్మునన్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి