29, జులై 2019, సోమవారం

సమస్య - 3089 (దివ్వె వెలుఁగెడి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె"
(లేదా...)
"దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్"

39 కామెంట్‌లు:

  1. ప్రాతః కాపు సరదా పూరణ:

    అవ్వల చంద్రయానమును హాయిగ పంపగ శాస్త్రవేత్తలే
    బువ్వల నీయకే ప్రజకు బూతులు తిట్టుచు నేతలిచ్చటన్
    త్రవ్వుచు గోతులన్ కడకు తన్నులు పంచగ రాజనీతినిన్
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు


    1. RGVK Prasad:👇

      "సమస్య ఇయ్యడం ఆలస్యం. వెంటనే మీకీ సరదా పూరణ ఎట్లా వస్తుందండి బాబు. లేకపోతే , మనలో మాట, పేపర్ ముందే మీకు లీక్ అయిపోతోందా. మీ పూరణలు చాలా బాగుంటాయి."

      *******************************

      gps:👇

      🙏😊

      సమస్య లీకవడం లేదండీ. సరదా పూరణలు చాలా ఈజీ...నాకున్న ఒక వంద మాత్రపు "పదసంపద"ను అటూ ఇటూ త్రిప్పుతుంటాను. అంతే: 👇

      ******************************

      ఆటవిడుపు సరదా పూరణ:
      (జిలేబి గారికి అంకితం)

      నవ్వుచు దోమ కుట్టగను నందము నొందుచు వంటయింటిలో
      కవ్వము చేత బూనుచును కమ్మగ గోకగ వీపునంతటన్
      సవ్వడి లేక నా కనులు చల్లగ మూయగ నాదు రాణియే
      దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

      తొలగించండి
    2. --- పదసంపద"ను అటూ ఇటూ త్రిప్పుతుంటాను :)

      IITK experience speaks :)

      National politics కరతలామలకము !


      జిలేబి

      తొలగించండి
  2. మైలవరపు వారి పూరణ

    మువ్వలసవ్వడిన్ విని ప్రమోదమునందితినంతలోనె తా..
    నెవ్వరినో వరించి యొక యింటికి జేరెను., శౌరి మోమునన్
    నవ్వులె నాకు తేజము , మనమ్మున హెచ్చెను చింత., సెమ్మెపై
    దివ్వె వెలుంగు చున్నను గదిన్., నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్ !!

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  3. ఆత డజ్ఞాని మూర్ఖుడై యచట జేరి
    ప్రముఖ దీపావళీశుభపర్వమందు
    వ్యర్థమౌ తైల మీకాంతి వలదనె, కట!
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె.

    రిప్లయితొలగించండి
  4. సూర్య కిరణాలు సోకని చోటు లోన
    నేల నిర్మించి నారయో యిపుడు జూడు
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె
    మునుపు, ముందు చూపది లేక మూర్ఖముగను

    రిప్లయితొలగించండి
  5. మదిని దొలిచెడి బాధలు మండు చుండ
    దారి తెన్నులు దొరకని తరుణ మందు
    కనిక రించక కదలని కాల మకట
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె

    రిప్లయితొలగించండి
  6. గద్దె నెక్కగ సాధ్యము కాని గతిని
    చేసి బాసల నిధుల సంక్షేమ మనుచు
    వ్యయ మొనర్చిరి వృద్ధిని విడిచి పెట్టి
    దివ్వె వెలిగెడి గదిలోనే తిమిరమాయె.

    రిప్లయితొలగించండి
  7. ఎంత నేర్చిన వాడైన నెవ్వడైన,
    తన్ను తెలియక తనలోని నిన్ను గనక,
    మాయలోబడి విడలేడు మగత నిద్ర,
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిరముండె..

    రిప్లయితొలగించండి
  8. ఎవ్వరి నెన్నడు న్నిధుల నీయగ దేహి యటంచు గోరమే!
    హవ్వ! ధనమ్ము నంతటిని హాయిగబంచిరి, వృద్ది కోస మే
    మివ్వక, నేత లోట్ల కయి, యేదిక రాబడి? యన్నపూర్ణకే
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్.

    రిప్లయితొలగించండి


  9. కాంతి నిండియుండె జిలేబి కవడువాయ
    దివ్వె వెలుఁగెడి గదిలోన, తిమిర ముండె
    జనుల మదిలోన! తొలగెను చక్కగాను
    ధ్యానమును చేయ వారలు ధగధగమన!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  10. పరమ నైష్ఠికుఁడాతఁడు పండితుండు
    పాపములపుట్టపుత్రుడు పరమశుంఠ
    దివ్వె వెలుగెఁడు గదిలోన తిమిరముండె
    విధిబలీయంబననిదియె వింతగాదు.

    రిప్లయితొలగించండి


  11. అవ్వ జిలేబి కాలమయె నగ్నిశిఖమ్మది చేరె గాలిలో
    మవ్వపు మోము తీరుగడ మానస వీధిని గాంచిరెల్లరున్
    నివ్వెరపాటు నొందదు తనెవ్వరి తప్పుల నెంచి చూడదే
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  12. పువ్వుల బోలు పిల్లలకు పుస్తకమే పెనుభారమయ్యెగా!
    నవ్వులు మాయమై కడువినాశముఁజెందెను బాల్యమన్నదే!
    యివ్విధి విద్యయన్నదిపు డేబడిఁ జూడను బేరమై కనన్
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. తనువు యొకగది దానిన మనసు గూడు
      అందులోఁ నరిషడ్వర్గ మనునదున్నఁ
      గాన మేఫలమది పోక జ్ఞాన మనెడు
      దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె

      తొలగించండి
  13. మనుషు లంతయు నొక్కటే మాట వేరు
    విషయ మారసి జూడగా విషము నుండ
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె
    తిమిర దూరుడవీవ నదితి సుపుత్ర

    రిప్లయితొలగించండి
  14. నిండు నూరేళ్ళు జీవించి నేడె యకట !
    యింటి యజమాని మరణించి వెడలి పోవ
    గదిని శోకాంధకారమ్ము క్రమ్ము కొనియె
    "దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె"

    రిప్లయితొలగించండి
  15. విద్య గలవాని కించుక బింక ముండె
    భక్తి జెలగెడి మదిలోన వాంఛ యుండె
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె
    వంక లేనట్టి దేదైన వసుధ గలదె

    రిప్లయితొలగించండి
  16. స్వామి పడకగ గొడుగుగ సర్పమొకటి
    స్వామి కనువైన జలలిగ శకునియొకటి
    తామె మోయగ ద్రిప్పగ దగుదుమనగ
    దివ్వె వెలిగెడు గదిలోన తిమిరముండె

    జలలి =వాహనము శకుని=పక్షి
    పరమాత్ముని నిత్యం సేవిస్తూకూడ గర్వాన్ని కలిగియుండుట దీపం ఉన్నా చీకటిలో ఉన్నట్లేయని భావన

    రిప్లయితొలగించండి
  17. విద్యనొందియు మౌఢ్యము వీడకుండె
    పూజ జేయుచున్నను పాపముడుగ కుండె
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె
    యెటుల లబ్దికలుగు రాత యిటులనుండ !

    రిప్లయితొలగించండి
  18. విద్యు దంతరాయము గల్గువేళ యందు
    వెలుగు నింపగ దీపము పెట్టి నపుడు
    గాలి తీవ్రత కారగ కనగ తోచె
    దివ్వె వెలుగెడు గదిలోన తిమిర ముండె

    రిప్లయితొలగించండి
  19. పువ్వుల పాన్పుపైన తన ముగ్దమనోహర సుందరాంగియౌ
    జవ్వని వేచియుండునని జాణ దలంచిన నేమి లయ్య తా
    నవ్వక కోపమందున వదనమ్మును దాచిన వేళను కోడెకానికిన్
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

    లయ్య= వేశ్య
    జాణ= విటుడు

    రిప్లయితొలగించండి
  20. దివ్వెచిన్నదిమూలాన దీప్తిలేమి
    దివ్వెవెలుగెడిగదిలోన తిమిరముండె
    దిమిర ముండెడిచోటనే భ్రమలుదొలగి
    చిత్తమేకాగ్రమయిదైవ చింతజేయు

    రిప్లయితొలగించండి
  21. తేటగీతి
    అన్యుల 'శశి' దలఁచదభిమన్యుఁదప్ప
    లక్ష్మణ కుమారునిన్ దెచ్చి లంకెవేయ
    తగదు తగదన్న వినరైరి తరుణి వగచ
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె!

    ఉత్పలమాల
    కవ్వడి లేని వేళఁ గని కౌరవులెంచగ తమ్మిమొగ్గర
    మ్మవ్వల నుగ్రుడై చెలఁగి యయ్యభి మన్యుడు కన్నుమూయఁగన్
    జవ్వని నిండుగర్భమున సైచునె? యుత్తర కంటిధారలన్
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    దీప్తులన్నింట ప్రసరించు దివ్యమౌచు
    దివ్వె వెలిగెడి గదిలోన; తిమిర ముండె
    సరువు జొరబడనట్టిదౌ స్థలములోన
    కల్ల కాని నిజమిదియె కనుల ముందు.

    దేహమందలి పరమాత్మ దిశను గనుచు
    నాస్వదించక నాత్మలో నరుస మెల్ల,
    చిత్త మచరమౌ మనుజుని చింత జేయ
    దివ్వె వెలిగెడి గదిలోన తిమిరముండె.

    రిప్లయితొలగించండి
  23. "దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె"
    ద్వైత ములతోడ నడచెడి ధరణి మనది|
    కష్ట సుఖము, కలిమి-లేమి కలసి వుండు|
    మంచి-చెడు, చావు-పుటక మనకు కద్దు|

    రిప్లయితొలగించండి
  24. గురువు గారు బిజీగా ఉంటే మిగిలిన కవిశేఖరులు ఎవరైనా నా పద్యం గురించి మీ అభిప్రాయం తెలుప ప్రార్థన.

    హవ్వ!ఇదేమి చోద్యమగునంతయు వింతగ గానుపించెనీ
    మువ్వలు చేతనుండినవి ముట్టిన యంతనె మాయమయ్యెనా
    దవ్వున ఇంద్రజాలికుడు దండము నచ్చట యూపినంతనే
    దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువైపుల గ్రమ్మె చీకటిన్.

    ఈ సమస్య 1980 సంవత్సరం లో ఆకాశవాణిలో సమస్యాపూరణంగా ఇవ్వబడింది.
    నాకందుకు గుర్తంటే, నా జీవితంలో అదే నేను పద్యం వ్రాయటానికి చేసిన మొదటి ప్రయత్నం ఆ రోజే.

    రిప్లయితొలగించండి
  25. సూర్య చంద్రులు నిత్యము సొంపు మీఱ
    వెల్గుచున్న నేమి ఫలము వెక్కసముగ
    మునుపు వ్యాపించి యెల్లెడఁ, గనఁగ నిపుడు
    దివ్వె వెలిఁగెడి గదిలోన, తిమిర ముండె


    ఎవ్వరి కైన జ్ఞాన మను నింపగు దీపము చిత్త మందునన్
    నివ్వటిలంగ సంతతము నిండుగ వెల్గును మోము వానికిన్
    సవ్వడి సేయుచున్ జనులు సందునఁ జాగఁగఁ గాగడా యనన్
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

    [పాఠాంతరముగ నిక్కడ గది యన్న చిత్తమన్న యర్థము గ్రాహ్యము.]

    రిప్లయితొలగించండి
  26. నవ్వుల జిందెడిన్ ముఖము నల్లగమారగ సత్యభామ దా
    చివ్వున వ్రేటువడ్డ యహి జిమ్మెడు ఫూత్కృతి వేడియూర్పులన్
    దవ్వుల నాథునిన్ నిలుప దక్షిణనాయకుడైన శౌరికిన్
    దివ్వె వెలుంగుచున్నను గదిన్ నలువంకల గ్రమ్మెజీకటుల్

    రిప్లయితొలగించండి
  27. దివ్వెనుజూడగానసలుదీప్తులుగాననిగారణంబుగా
    దివ్వెవెలుంగుచున్ననుగదిన్ నలువంకలగ్రమ్మెజీకటుల్
    దివ్వెలకాంతులెక్కువగుతేజముతోడనువెల్గుచుండుచో
    దవ్వులబోయిచీకటులుతళ్కులుసిమ్మునులోననంతటన్

    రిప్లయితొలగించండి
  28. క్రొవ్వి మదంబు మీఱ కడు రోషిలి కైకయె దుష్టచిత్తయై
    దవ్వున నున్న బుత్రునికి తానుగ పట్టము గట్టనెంచియున్
    పువ్వుల ద్రుంచి రత్న మణి భూషణముల్ విడనాడినంతనే
    దివ్వె వెలుంగు చున్నను గదిన్ నలువంకలఁ గ్రమ్మెఁ జీఁకటుల్

    రిప్లయితొలగించండి
  29. ..............🌻శంకరాభరణం🌻...............
    ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
    దివ్వె వెలుఁగెడి గదిలోన తిమిర ముండె

    సందర్భము:
    లోకంబులు లోకేశులు
    లోకస్థులు తెగిన తుది నలోకం బగు పెం
    జీకటి కావల నెవ్వం
    డే కాకృతి వెలుగు నతని నే సేవింతున్..
    ~~ భాగవతం
    లోకాలు.. లోకాలలో వుండే వారు. వీరంతా అనే కాకృతులు గలవారు. అంటే ప్రధానంగా నామ రూపాత్మకమైనది జగత్తు. ఇదంతా చీకటే!
    ఇదంతా దాటిన తరువాత లోకాలు లోకస్థులు లేని చోట కేవలం ఏకాకృతితో వెలిగే పరబ్రహ్మం వుంటుంది. ఆ వెలుగే పరబ్రహ్మం లేక పరమాత్మ. అదంతా వెలుగే!
    అదే ఆనందధామం.
    జన్మ వుంటే కర్మ.. కర్మ వుంటే జన్మ.. ఇలా పునరపి జననం పునరపి మరణం.. అనే విధంగా కొట్టుమిట్టాడే పరిస్థితి ఆ ఆనంద ధామంలో లేదు.
    అటువంటి చోటికి ఎవరు చేరగలుగుతారు? యోగులు.. వా రెలాంటి జాగ్రత్త తీసుకోవాలి?.. అంటే.. నారదుడు తన భక్తి సూత్రాలలో ఒక్కటే మాట చెప్పాడు.. ఏమని..
    "స్త్రీ ధన నాస్తిక చరితం న శ్రవణీయమ్..." అని.
    (సాధకులు స్త్రీలయొక్క ధనంయొక్క నాస్తికులయొక్క చరిత్రలు ముచ్చట్లు వినరాదు.. అని.)
    వింటే మనసులు చలించి మార్గం తప్పుతారు. ధ్యేయాన్ని మరచి మాయలో చిక్కుకునే ప్రమాదం వుంది.
    దీ న్నొక చిన్న యింటితో పోలిస్తే బయట చీకటిగా వుండే గది.. లోన మాత్రం దీపం వెలిగే గది వున్నట్టు కనిపిస్తుంది. బైటి గదిలోని చీకట్లోనే గోడలవెంబడి తారట్లాడుతూ వెదుక్కుంటూ వెళ్లి తలుపును తడిమిచూసి తెరుచుకొని అవతలి గదిలోకి చేరుకోవాలి.
    అక్కడంతా వెలుగే!
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~
    లోకాలు, లోకులు, లోకేశు లొక కొంత
    సే పుందు.. రొక కొంత సేపు వోదు..
    రెంతైనఁ బెంజీకటే నిండు నంతట..
    నా చోటు దాటగా నతులిత మగు,
    దివ్యమౌ నేకాకృతిగ దిక్కులను నిండు
    వెలుగుగా పరమాత్మ యలరు సతముఁ..
    గనగ స్త్రీ ధన నాస్తిక చరిత్రలకు చెవి
    యొగ్గని యోగుల యోగ్య సీమ..
    సాధకులు చేరుకొను కర్మ , జన్మ లేని
    ధామ మది.. యొక యింటితో దాని బోల్ప
    దివ్వె వెలుఁగెడి గది.. లోన.. తిమిర ముండె
    డి గది.. బైట నున్నట్టుఁ దోచు గద సఖుడ!

    ✒~డా.వెలుదండ సత్యనారాయణ
    పరమార్థ కవి
    29.7.19
    -----------------------------------------------------------

    రిప్లయితొలగించండి
  30. సవ్వడి చేయకుండ కను సన్నలలో దిరుగాడు శత్రువుల్
    రువ్వుచు నస్త్రశస్త్రములు రూపడగించగ శత్రుమూకతో
    నివ్వెరపోక పోరుచును నేలకురాలిన వాని యింటిలో
    దివ్వె వెలుంగుచున్నను గదిన్ నలువంకలు గ్రమ్మెచీకటుల్!

    రిప్లయితొలగించండి