6, జులై 2019, శనివారం

సమస్య - 3067 (పాపి యొక్కఁడు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె"
(లేదా...)
"నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్"

42 కామెంట్‌లు:

 1. పాపయ్య నామధేయము
  పాపియనుచు మిత్రులెల్ల పలికెడు వాడే
  దీపించఁగ కవివరుడై
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సహదేవుడు గారూ,
   తేటగీతి సమస్యకు కందపద్య పూరణ....? సవరించండి.

   తొలగించండి
  2. గురుదేవులకు ప్రణామములు. సవరించిన పూరణ :

   ప్రజలు పాపయ్య ను పిలువఁ 'బాపి' యనుచుఁ
   గవి వరుండగ జనులలో ఖ్యాతి గాంచెఁ
   బుణ్య కథనాల గూర్చంగ పొత్తమొకటి
   'పాపి' యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

   తొలగించండి
 2. శ్రీ కంది శంకరకవి ఒక్క రోజులో రచించిన శ్రీ వరదశతకము వర్ధిల్లాలని వరదుణ్ణి వేడుతూ____


  వరదుని సంస్తుతించు శతపద్యపరిష్కృతవర్ణనమ్ము శం
  కరకవి యేకమాత్రదినకార్యముగా రచియించె నట్లు, నా
  వరదుడ పాకరించి కృతపాపచయమ్ము, జయమ్మ నిచ్చి, త
  త్పరమపథమ్ము నక్షరవిభాసయశమ్ము నొసంగి, కావుతన్.

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 3. ప్రాతః కాలపు సరదా పూరణ:

  దయ లేకుండయె మోడివర్యునహహా దండించి ఖండిచుచున్
  జయమున్ కోరగ నెన్నికన్ చురుకుగా ఝాడించగా వోటరుల్
  భయమున్ వీడుచు త్యాగపత్రమిడగా బంగారు కొండన్ వలెన్
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

  రిప్లయితొలగించండి
 4. జనుల వంచించి విరివగా ధనమునొంది
  హత్యలను చేయుటే వాని నత్య కృత్య
  మైన దుర్మతి యెన్నికలందు గెలిచి
  పాపి యొక్కఁడు సన్మాన పాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గురుభ్యోన్నమ:🙏

  దుష్టు డైనపాపడు చేసె దొడ్డ పనులు
  శంక రార్యుల బడిలోన చదువు కొనగ
  పారమార్థంబరుగుచును పథము మారి
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 6. పిల్లికైనను బిచ్చము పెట్టడెపుడు
  పేరునొందగనిరతముకోరుకొనును
  సొమ్ము తనపేరు కోసము వమ్ముజేసి
  పాపియొక్కడు సన్మానపాత్రుడయ్యె

  రిప్లయితొలగించండి
 7. శ్రీగురుభ్యోనమః,🙏
  ఇయ్యది నా మొట్టమొదటి ఉత్పలమాల వృత్త ప్రయోగము. శంకరార్య పాదార్పణమస్తు🙏🌺

  ధారగ పద్యముల్ యొసగ ధారణ నార్యులు గల్గియుండటన్
  మేరు నగమ్ము రీతిగను మేధను మెర్గులు దిద్దఁ బూనగా
  చోరులు దోచలేరు గద చోద్యముఁ జూడగ పద్య పాదముల్
  పూరణ జేయగా పలుకుబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?

  రిప్లయితొలగించండి
 8. దారి దోపిడి చేయుచు ధనము కొఱకు
  బోయ తిన్నడు తపమున ముక్తి నొందె
  దైవ లీలలు తెలుపంగ నెవరి తరము
  పాపి యొక్కఁడు సన్మాన పాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 9. (పరమదుర్మార్గుడైన అంగుళిమాలుడు
  స్వామి దరహాసంతో పాదాక్రాంతుడైనాడు)
  గండ్రగొడ్డలి పైకెత్తి గౌతమార్యు
  నరకబోయిన గజదొంగ నమ్రుడగుచు
  చేరి పాదాలపై బడి శిష్యుడౌట
  పాపి యొక్కడు సన్మానపాత్రుడయ్యె.

  రిప్లయితొలగించండి
 10. భార్య బిడ్డలఁ బోషీంచ పాపచయము
  చేయు వాడు తాపసవర్యు చేత మారి
  ఆదికావ్యము వ్రాసిన యడవి దొంగ
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁడయ్యె

  రిప్లయితొలగించండి


 11. వ్రాయను వరద శతకము వ్యాఖ్యల పిద
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె
  పేరు శ్రీశంకరయ్య!నివేద్య మైన
  వార్త యిద్ది ! రా రండి సెబాసనంగ !  జిలేబి

  రిప్లయితొలగించండి
 12. నేరచరితులు పెద్దలై నెగడు నేడు
  పాపి మొక్కడు సన్మాన పాత్రుడయ్యె
  'కోర్టు'కనలేదు-వినుటయె-క్రూరులకట
  చెలువ సింహాసనంబెక్కి కులుకుఁగాదె!!

  రిప్లయితొలగించండి


 13. అయినాడాతడె బెల్టు షాపు యజమానైనాడు! ఆమత్తులో
  సయి తానాడక వ్రాసె వాసి గనెడా సాహిత్యమున్ ధారగా
  పయికమ్మేమియు రాక పోయినను ప్రాప్తంబాయె విద్వత్తు! స
  న్నయ దూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. మాన్యులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు! ఏకైకదినశతకరచనాసత్సంకల్పులరై యకుంఠితదీక్షతో "వరద శతకము"ను వెలయించిన శుభసందర్భమున మీకు మనఃపూర్వక శుభాభినందనలను తెలుపుకొనుచు...

  వరదా! నన్ గరుణించుమంచు నెడదన్ బద్మాక్షుఁ బ్రార్థించి, త
  త్పరమార్థమ్మిడుమంచు నేకదినసత్పర్యాప్తమందున్ దగన్
  స్థిరమౌ పద్య శతమ్ము వ్రాసితివయా! సిద్ధించె నీ కాంక్ష! యా
  వరదుం డిచ్చుత శంకరార్య! యశముల్; వర్షించు సత్సంపదల్!

  భవదీయ సన్నిహిత మిత్రుఁడు,
  మధురకవి గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

  రిప్లయితొలగించండి
 15. నయమా! కందికవీశ్వరా! పుడమి నే నాడుండె? నెట్లుండె? వి
  స్మయమౌ దాని స్వరూపమేదొ! కలిసమ్మాన్యమ్ము నెట్లిచ్చు?! సం
  దియమెట్లయ్యె? సమస్య కాదిదియు నెందేనిన్ సమాజమ్మున
  న్నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

  కంజర్ల రామాచార్య
  కోరుట్ల.

  రిప్లయితొలగించండి
 16. మైలవరపు వారి పూరణ

  వ్యయమున్ జేయను విత్తమున్ , పలుకులన్ వర్ణింతు తచ్ఛీలమున్ !
  దయ జూపింతును , సుంతయేని గన నౌదార్యమ్ము జూపింప , వి..
  స్మయమున్ బొందక రండటన్న కృపణుం ., డాశావిమోహమ్మునన్
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్"

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 17. నేరచరితులచరితలనెన్నువాడు
  నేరమెరుగుచుశిక్షించినిలచురేడు
  పాపచ‌రితులపాలిటపాపియగుచు
  పాపియొక్క డుసన్మానపాత్రుడయ్యె
  కొరుప్రోలు రాధాకృష్ణారావు

  రిప్లయితొలగించండి
 18. స్వార్థ పరుడౌచు దుష్టుడై వ్యర్థుడగుచు
  కలిసి వచ్చిన తరుణాన గెలిచి నంత
  వెలిగె నేతగ నయ్యెడ విధివశాన
  పాపి యొక్కడు సన్మాన పాత్రుడయ్యె

  రిప్లయితొలగించండి
 19. పాపియైననువాల్మీకివాణిదయను
  కవివరేణ్యుడైయెన్నియోకావ్యములను
  వ్రాయుకతనానగవులలోప్రముఖుడగుట
  పాపియొక్కడుసన్మానపాత్రుడయ్యె

  రిప్లయితొలగించండి
 20. మత్తేభవిక్రీడితము
  దయ యేమాత్రము లేని వాడడవినన్ దైత్యుండుగా పక్షినే
  భయమందంగను వైచి బాణమును చంపంగన్ విరాగంబుతో
  కుయిపెట్టంగను జంటపక్షిఁగనుచున్ కూర్చంగ కావ్యంబునే
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

  రిప్లయితొలగించండి
 21. శాప వశమున మానవ జన్మ మెత్తి
  బోయడయ్యును మారెను బుద్ధి నొంది
  రామ కావ్యము రచియించి రమ్యముగను
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 22. దయయొక్కింతయుమానసంబుననిడండన్యాయమార్గంబునన్
  పయనంబాతడుజేయుసంతతమునోపండెవ్వరభ్యున్నతిన్
  నయగారంబులుబల్కుచున్ నటనవిన్నాణంబుగా సల్పుచున్
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్.

  రిప్లయితొలగించండి
 23. మిత్రులందఱకు నమస్సులు!

  [కౌశికుఁడను బ్రాహ్మణుఁడు దుర్వ్యసనుఁడై, పాపియై, వేశ్యాలోలతచేఁ బొందిన గుష్ఠురోగముచేఁ గుములుచుండియు, మఱొక వేశ్యాగృహమునకుం గొంపొమ్మని యాజ్ఞనిడి, పతివ్రతా మతల్లియైన యాతని భార్యచే నటులనే కొనిపోఁబడుచు, నటవీమార్గమునఁ గల యొక చెట్టుపైఁ దలక్రిందులుగాఁ దపస్సుచేసికొనుచున్న మాండవ్యునకుఁ గాలు తగిలి, సూర్యోదయకాంతి సోఁకి మరణించునటుల శాపముం బొందెను. అపు డా పతివ్రతా శిరోమణి పతిప్రాణములు పోకుండుతకై సూర్యోదయము నాఁపఁగా, తల్లడిల్లిన దేవతలు నలువ సూచనచే ననసూయాదేవిని శరణువేడఁగా, నామె కౌశికునిఁ బునర్జీవితునిఁ జేయునట్లు వరము నిడఁగా, నా పతివ్రత సూర్యోదయముం గావించెను. సూర్యకిరణములు సోఁకి కౌశికుఁడు మరణింపఁగా, ననసూయాదేవి తన పాతివ్రత్య మహిమచే నాతనిం బునర్జీవితుఁ జేయఁగా, నతఁడు భార్యాయుతుఁడై చని, సద్వ్రతుఁడై సర్వుల మెప్పులను వడసిన కథ నిట ననుసంధానించుకొనునది]

  భయమున్ భక్తియు లేని కౌశికుఁడు స్త్రీ వ్యామోహియై, కుష్ఠురో
  గియునయ్యున్, ఘనమౌనిశాపతపుఁడై, ఖేదార్తుఁడైయుండ; భా
  ర్యయె భర్తృవ్రతదీక్షఁ గొన్న మహిమన్ రక్షించియుం దేల్చ; నా

  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్!

  రిప్లయితొలగించండి
 24. విత్తములు భూము లేలయ విద్య యున్నఁ
  జాలు విశ్వ మందు వెలుంగ మేలు గల్గుఁ
  జేతలఁ దలఁపు ల నుడులఁ బ్రీతిగఁ జెఱు
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

  [చెఱుపు + ఆపి = చెఱుపాపి]


  నయగారంపు మునీంద్ర వాక్కులను సన్మానించి యింకెట్టి బూ
  మియలం జేయక కాఁగఁ దా జనని వల్మీకంబు సత్కావ్య సం
  చయ కర్తృత్వ నిమిత్తతన్ హృదయ సంసద్దేవ సచ్చింత నా
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

  [చింతనా + అనయదూరుండు = చింత నానయదూరుండు]

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ముందు “యెవ్వారిఁ/ గాఱియలం బెట్టక” అని వ్రాసి ఱ- ల ల యతి శంకించి

   “యింకెట్టి/ బూమియలం జేయక” గా మార్చితిని.

   తొలగించండి
 25. శివుని యుదరంబు ననునిల్పి చిక్కుబెట్టి
  అంబ శోకమునకు హేతువగుచు నిల్చి
  యసురుడయ్యె శివకుమారు నాననముగ
  పాపి యొక్కడు సన్మాన పాత్రుడయ్యె!

  రిప్లయితొలగించండి
 26. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  స్వీయ చరిత్ర:

  వయసున్ మీరగ నాంధ్రమున్ వడివడిన్ వ్యర్థంపు గగ్గోలనున్
  భయమున్ వీడుచు దండిగా గెలుకుచున్ భావంపు శూన్యమ్మునన్
  రయమున్ వ్రాయగ శంకరాభరణమున్ రంజిల్లు మత్తేభముల్
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. వయసే మీరని బెంగా
   లు యువకుడాతండు! భళి తెలుగు పద్యంబే
   నయ! దూరుండగు పారుం
   డయె! కడు సన్మానపాత్రు డయ్యె భళారే :)

   జిలేబి

   తొలగించండి
 27. తే: మీకు నాంగ్లము నేర్పిన మేటి నంచు
  శాస్త్ర విద్యల నిచ్చితి జనులకంచు
  స్వార్థ చిత్తము గల్గు వాచాలు డైన
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 28. ఏపుగను బెంచనొక్కడు చెట్లనెన్నొ
  దాపుగనుజేరి జనులంత దరికి జేర్చ
  పాపకార్యముల్ జేసిన వాడయినను
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె!!

  రిప్లయితొలగించండి
 29. దయనుంజూపకక్రౌర్యమున్గలిగియాదారిన్జరించెల్లరని
  ర్దయనున్జూపుచుమాంసమున్దినుచునారాకాసురుడొయ్యనన్
  నయగారంబులవిద్యలన్గఱపివిన్నాణంబుతోనుండగాన్
  నయదూరుండగుపాపియొక్కరుడుసన్మానంబుబొందెన్సభన్

  రిప్లయితొలగించండి
 30. రామశర ఘాతమున మతి రాణ కెక్కి
  రాము డన రూపుగొన్న ధర్మమని చెప్పి
  ప్రాప్త కాలజ్ఞతను పొంది రామపదము
  పాపి యొక్కఁడు సన్మానపాత్రుఁ డయ్యె

  రిప్లయితొలగించండి
 31. *శిశుపాలుడు పాండవులతో పలికిన పలుకులుగా నూహించిన పద్యము*

  నియమోల్లంఘన సేసినారు గదరా నేరమ్ము కాదందురా
  దయయే లేకను స్తన్యమిచ్చిన సతిన్ దాఁజంపె కృష్ణుండె ని
  ర్దయతో మామను గూల్చె, దుష్టునకునగ్రస్థాన మెట్లిత్తురో
  నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్.

  రిప్లయితొలగించండి
 32. డా.పిట్టా సత్యనారాయణ
  అర్ధ గంటలో శతక విహారి ననుచు
  శంకరార్యుని పోటీకి సాటి యయ్యె
  పరుల నీర్ష్యగా జూచిన ఫలమదెట్లు
  పాపి యొక్కడు సన్మాన పాత్రుడయ్యె
  *ఏకదిన శతక రచనా పాటవమునకై శంకరార్యులకు అభినందనలతో*

  రిప్లయితొలగించండి
 33. డా.పిట్టా సత్యనారాయణ
  అయయో పండుగ పల్లెపల్లె వెలయన్ హ్లాదంపు క్యాలెండరా
  న్వయమౌ కావ్యమె పట్టుబట్టి గిలుకన్ వాయించిరే పండితుల్
  స్వయమీ గొప్పల జెప్పు వ్రాతలకునౌ వాసిన్ గనన్ ,ధూర్తుడే
  నయదూరుండగు పాపి యొక్కరుడు సన్మానంబు బొందెన్ సభన్

  రిప్లయితొలగించండి