3, జులై 2019, బుధవారం

సమస్య - 3065 (గుట్టలు మున్నీటిలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్"
(లేదా...)
"నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్"
(ఈ సమస్యను పంపిన కె. బాలస్వామి గారికి ధన్యవాదాలు)

53 కామెంట్‌లు:

  1. గట్టున విశ్రాంతి నొందుచు
    చుట్టుచు మెలికలు తిరిగెడి చోద్యము గాంచన్
    నట్టనడి కొలను సొగసులు
    గుట్టలు మున్నీటి లోన గునగున నడిచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. "గట్టున విశ్రాంతి గనుచు" అనండి.

      తొలగించండి
    2. గట్టున విశ్రాంతి ganuchu
      చుట్టుచు మెలికలు తిరిగెడి చోద్యము గాంచన్
      నట్టనడి కొలను సొగసులు
      గుట్టలు మున్నీటి లోన గునగున నడిచెన్

      తొలగించండి
  2. ప్రాతః కాలపు సరదా పూరణ:

    Cyclone Hudhud:

    నగరపు పాకలన్నియును నాట్యము చేయుచు నూగిపోవగా
    దిగులుగ బీదలెల్లరును దిక్కులు తోచక కుందుచుండగా
    ఖగములు రాలిపోవగను గందర గోళపు గాలివానలో
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

    నగము = చెట్టు

    రిప్లయితొలగించండి

  3. ఓ యబ్బో మా మైనింగు క్వారీ కింగుల మహిమ :)


    ఎట్టెట్టా ? అబ్బోడా!
    చుట్టా లింటికని దారి చూపింప భళా
    చట్టపు చేతిని చిక్కక
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. (రామేశ్వర తీర్థంలో భక్తుల స్నానాలు)
    చెట్టాపట్టగ జేతుల
    బట్టుచు రామేశ్వరమున భక్తులు జలకం
    బట్టుల జేయగ,బాపపు
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జంధ్యాల వారూ,
      పాపపు గుట్టలతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  5. నెట్టన పర్వతరూపులు
    జట్టుగ వానరులు కదల జలధిని నీడల్
    కట్టుగ దోచెను రామా
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్.

    రిప్లయితొలగించండి
  6. ధన్యవాదాలు గురువు గారూ. చిన్న మార్పు చేశానంతే.

    రిప్లయితొలగించండి
  7. అగణిత సంఖ్యులై తగ సురాసురు లంబుధిఁ ద్రచ్చువేళ మి
    న్నగ చెలరేగు సందడి యనర్థముఁ దెచ్చు నటంచు భీతిచే
    నెగడుచు నాగలోకమును నేర్పున జేరఁగఁ బోవుచున్న ప
    న్నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  8. మైలవరపు వారి పూరణ

    ఖగపతివోలె స్వర్ణమయకాంతుల మారుతి నింగినేగుచో
    ధగధగలాడుచున్ ఘన నిదాఘరవిప్రతిమాసమానుడై ,
    యగుపడుచుండ నీడలవె యక్కడ యక్కడ కొండలట్లుగా
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్"

    మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందఱకు నమస్సులు!

    [పూర్వము పర్వతములకు ఱెక్కలుండెడివి. అవి స్వపక్షగర్వమునఁ జెలరేఁగి యాకాశగమనము చేయుచుండఁగాఁ గనిన యింద్రుఁ డవి తమ యున్నతిని నపహసించుచున్నవని తలఁచి, వాని ఱెక్కలన్నింటిని తన వజ్రాయుధమున ఖండించెను. ఖండితపక్షములైన నగములు సముద్రమునఁ బడి కొట్టుకొనిపోవుచుండుట ప్రస్తుత సందర్భము]

    నెగసిన పక్ష గర్వమున నింగిని రేఁగుచు నేలతాల్పులే
    యెగురుచు నుండ, వజ్రి గని, హేయ విహారనగప్రశస్త ప
    క్షగణ విఖండితోగ్రకులిశవ్రతుఁడయ్యెను! వేగ గూలి యా

    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్!

    (నేలతాల్పు=పర్వతము; వజ్రి=ఇంద్రుఁడు; కులిశము=వజ్రాయుధము;)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వివరణమునఁ జిన్న సవరణముతో...

      [పూర్వము పర్వతములకు ఱెక్కలుండెడివి. అవి స్వపక్షగర్వమునఁ జెలరేఁగి యాకాశగమనము చేయుచుండఁగాఁ, బ్రాణులకు మిక్కిలి భయము గలుగుచుండఁగా, నది కనిన యింద్రుఁడు, వాని గర్వము ఖర్వము జేయఁదలఁచి, వాని ఱెక్కలన్నింటిని తన వజ్రాయుధమున ఖండించెను. ఖండితపక్షములైన నగములు సముద్రమునఁ బడి కొట్టుకొనిపోవుచుండుట ప్రస్తుత సందర్భము]

      నెగసిన పక్ష గర్వమున నింగిని రేఁగుచు నేలతాల్పులే
      యెగురుచు నుండ, వజ్రి గని, హేయ విహారనగప్రశస్త ప
      క్షగణ విఖండితోగ్రకులిశవ్రతుఁడయ్యెను! వేగ గూలి యా
      నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్!

      (నేలతాల్పు=పర్వతము; వజ్రి=ఇంద్రుఁడు; కులిశము=వజ్రాయుధము;)

      తొలగించండి
  10. పుట్టెను నింగిని పలురక
    దట్టపుమేఘాలు రూపు దాల్చియు గదలన్
    తట్టెను చూచెడు వారికి
    గుట్టలు మున్నీటి లోన గునగున నడిచెన్

    రిప్లయితొలగించండి
  11. బిట్టుగ కురిసెడి వానలు
    చుట్టగ గోవిందుడంత జూపుచు లీలన్
    పట్టగ వేలిన గిరులను
    గుట్టలు మున్నీటిలోన గునగున నడిచెన్

    రిప్లయితొలగించండి
  12. పిట్టలు పకపక నవ్వెను
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్
    గట్టిగ నవ్వకు మిది విని
    కట్టితి నొక కట్టు కథను కల నందిటులన్ 🙂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్
      మృగములు గాలిలో నెగిరె మృణ్మయ భాండము జేసె నాట్యమున్
      ఖగములు నేలపై నడిచె గాలుల తేలెను మీన రాజముల్
      నగవుల కేమి గాని విను నా కల నందలి వింతలీ గతిన్

      తొలగించండి
  13. డా.పిట్టా సత్యనారాయణ
    పట్టణ చుట్టము తాళ్ళన్(out door shooting of taddy trees)
    బుట్టగ నాకొకటి మడిచి బొటబొట ద్రాగెన్
    బిట్టుగ గలు(కల్లు)కుండదరన్
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్!

    రిప్లయితొలగించండి
  14. డా.పిట్టా సత్యనారాయణ
    పగలుల రాత్రులన్ బ్రజల ప్రాపు వహించని తిష్ట వేసినన్
    జగములె త్రుళ్ళె వాహినిని జారినవీ చిరు కొండలా యనన్
    ధగ ధగ మన్న భా.జ.ప ను దట్ట నెలక్షను లందు దేలరే
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్?!

    రిప్లయితొలగించండి
  15. శంకరాభరణం 03/07/2019

    సమస్య

    "నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్"

    నా పూరణ. చం.మా.
    ***** **** ***

    జగమున గాంచగన్ జరుగు చక్కని సుందర దృశ్యముల్ సదా

    ఖగములు గాలిలో నెగుర కన్నుల విందులె వీక్షజేయగన్

    మృగములు గెంతులేయగను మిక్కిలి తోషము గల్గు;జూడ ప

    న్నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

    🌱 ఆకుల శాంతి భూషణ 🌱
    🌷 వనపర్తి🌷

    రిప్లయితొలగించండి
  16. కట్టగ వారధి కడలిని
    జట్టుగ కపులంతజేరి జార్చుచు శిలలన్
    గట్టిగ రాముని దలువగ
    గుట్టలు మున్నీటిలోన గునగున నడిచెన్

    యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

    రిప్లయితొలగించండి
  17. చిట్టీ! బతుకమ్మాడుచు
    తుట్టతుదకు గంగ లోన దుండులు కలపన్
    బుట్టెడు పూరాశిఁ గనగ
    గుట్టులు మున్నీటి లోన గునగున నడిచెన్

    రిప్లయితొలగించండి


  18. భుగభుగ మండుచుండె నట భూర్ణియు లేదకటా! స్థిరమ్ముగా
    జగతియు లేదు! పూర్ణమున సందడి కల్గెను! కాంక్షకల్గగా
    జగముల చేయ నాదికవి శాసన మాయె! విమాన మెక్కి యా
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి

  20. ఏటి కావల బోడికొండ యెక్కాలంటే ఏట్లో దిగక తప్పదోయ్ :)

    చట్టని చూడగ నదిగో
    గుట్టలు! మున్నీటిలోన గునగున నడచెన్
    పట్టమ్మాళు జిలేబియె
    తట్టా బుట్టా నిడుకొని తక్షణమెక్కన్ !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  21. మగువలు భక్తితోడ కడు మంగళ దాయక మంచునెంచి తా
    ము గునుగు తంగెడాదిపలు పుష్పము లెన్నియొ కూర్చి మోదమున్
    గగనము దాకు రీతి బతుకమ్మలఁ బేర్చుచు నీట నిడ్వగన్
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  22. అట్టట్టహాసముగ ము
    న్నట్టడవిని రెక్క లుండ నభమున మఱియున్
    బెట్టిదముగ నేల పయిన
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్


    ఖగములు బారులై యెగురు గాడుపుతండ్రి పథమ్ము నందు నీ
    మృగములు సంచరించుఁ దమి మేదిని మీద విలాస మొప్పఁగన్
    నగములఁ గంటిరే నడువ నా నన నవ్వ తరీష యుగ్మ మ
    న్నగములు వార్ధిలో గునగునా నడచెన్ గడు సుందరమ్ముగన్

    [ప్లుతోచ్చారణముతో గునగునా]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
      “గున గునన్” ప్రయోగము తర్కనీయముగాఁ దోచుచున్నది నాకు.
      గునగున ధ్వన్యనుకరణ శబ్దము. క్రియా విశేషణము.
      గునగున అని అను నర్థములో అని అన్ గా మారదు, అని క్త్వార్థకము.
      కని ని కన్ అనలేము కదా.
      అదియును గాక గునగున మని నడచెన్ అని వ్రాయఁ దగును.

      గున గునన్, అన్ = అనగా నను నర్థము క్రియతో నన్వయము కుదరదు కదా.
      సంశయ నివార ణార్థము ప్లుతోచ్చారణముగా గునగునా యని నేను ప్రయోగించితిని.
      ఇందలి సాధ్వసాధువులఁ దెలియఁ జేయఁ గోరెదను.

      ధ్వన్యనుకరణ శబ్దముల కను ధాతువు పరంబగుచోఁ గొన్ని యెడల ముగాగమం బగు. ప్రౌఢ. సంధి. 19.

      తొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. గురుభ్యోన్నమః🙏
    భగీరథుడు గంగకై తపమొనరించి,పాతాళమున భస్మరాశులుగా పడియున్న సగరులను పుణ్యలోకాలకు పంపుట నుద్దేశించి:
    నా యీ పూరణము.

    పట్టున భగీరథుడు హరి
    పట్టిని తాతల తరింపఁ బరిపరి వేడన్
    పుట్టెడు తుష్టినఁ నఘముల
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్!

    హరిపట్టి- గంగ (విష్ణు పాదోద్భవేద్గంగాః)

    రిప్లయితొలగించండి
  25. చట్టము చుట్టమనిదలచి
    పట్టుకు గొట్టగ పదుగురు భామనొకతినే
    కట్టెలతో కన్నీరయె
    గుట్టలు మున్నీటిలోన గునగున నడిచెన్!!

    రిప్లయితొలగించండి
  26. బిట్టుగ వరదలురాకను
    గట్టునగలపేడగుట్టగడగడయనిము
    న్నీటన్దేలుచుజనగా
    గుట్టలుమున్నీటిలోనగునగుననడచెన్

    రిప్లయితొలగించండి
  27. కట్టలు దెగిన యుపేక్షను
    బిట్టుగ కృత్రిమ యురువుల బేర్మినివాడన్
    తెట్టులుగ చేర ప్లాస్టిక్
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్

    రిప్లయితొలగించండి
  28. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)


    Modi Tsunami:

    జగముల సంభ్రమించుచును జందెము నూనుచు దేవళమ్ములన్
    వెగటుగ తూలనాడగను వెర్రిగ మొర్రిగ మోడివర్యునిన్...
    పగిలెను రాహులయ్య హృది;... బావురు మంచును ప్రాతికూల్యపున్
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  29. నగరములెన్నియోమునుగనాట్యముజేయుచుగాలి,వానయున్
    గనగనుబాధగల్గెనికగాగలవారలందరుదూరమై
    గునగునబోవదలతునుగూర్మినిసాకినవృక్షసంపదల్
    నగములువార్ధిలోగునగున్ నడచెను గడుసుందరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  30. చట్టముజేర్చి భవిష్యము
    కట్టడి సలుపుదురని యధికారపు తలుపుల్
    దట్టి చను నేతలను గన
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్

    రిప్లయితొలగించండి
  31. (పన్నుఎగవేతదారుడు ఆదాయపన్నుశాఖ సోదాల్లో దొరికిపోతాననే భయంతో చేసిన నిర్వాకం)
    గుట్టలుపేరుకుపోయెను
    పట్టుకుతిరుగంగలేక పాపపుసొమ్మున్
    పెట్టెలలోనీటవిడువ
    గుట్టలు మున్నీటిలోన గునగున నడిచెన్

    రిప్లయితొలగించండి

  32. పట్టుచు కపులట వేయగ
    గుట్టలుమున్నీటిలోన గునగుననడిచెన్
    గట్టుగ యిసుకను నుడతయు
    పట్టుచు సాయమును చేయ వడిగా వచ్చెన్..



    మరొక పూరణ

    పట్టగ వర్షమెడతెగక
    గట్టులు తెగినీరు పారె గ్రామము నందున్
    కొట్టుకు సాగుచు వడిగా
    గుట్టలు మున్నీటిలోన గునగున నడచెన్

    రిప్లయితొలగించండి
  33. కందం
    కొట్టఁగ నుసురుల్ ద్రోయఁగఁ
    బట్టి గపీశ్వరులు ధాటిఁ బైబడ విసరన్
    మట్టకరిపించి దనుజుల
    గుట్టలు మున్నీటిలోన గునగున నడిచెన్

    చంపకమాల
    పగఁగొని రక్కసుల్ గిరుల బద్దలు గొట్టుచుఁ ద్రోసి నంతటన్
    బెగడక వానరుల్ నిలిచి పెట్టగ రొమ్ముల వాటికడ్డుగన్
    దగులుచుఁ గక్కిరక్తమును దానవులీలుగ క్షాళనమ్ముకై
    నగములు వార్ధిలో గునగునన్ నడచెన్ గడు సుందరమ్ముగన్

    రిప్లయితొలగించండి
  34. నగుచును సంబరంబున వనంబునకేగిన బాలబాలికల్
    దిగెనొక కాల్వలో;వదిలె తేకువ 'పేపరు'బొమ్మ లెన్నియో-
    నగములు,నశ్వ,దంతి,రథ,నాట్యమయూర,విచిత్రవస్తువుల్
    నగములు వార్ధిలో గునగునన్ నడిచెన్ గడు సుందరమ్ముగన్.

    రిప్లయితొలగించండి