26, జులై 2019, శుక్రవారం

సమస్య - 3087 (తొమ్మిదిలో...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ"
(లేదా...)
"తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే"

62 కామెంట్‌లు:

 1. అమ్మడు దాచుటకై నీ
  కిమ్మని రెండంపితి మరి యిప్పుడు గద నీ
  తమ్ముని తోఁ బంపిన యా
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ.

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  రోమాయణము:

  అమ్మడు! రోమనంకెలను హాయిగ నేర్పెద నేడు నీకిటన్
  తెమ్ముర! పల్క బల్పమును తియ్యగ వ్రాయుము తొమ్మిదిన్ భళా!
  కమ్మగ రద్దుజేయగను ఘాటుగ నొక్కటి చేతితోడహా!
  తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ప్రభాకర శాస్త్రి గారూ,
   తొమ్మిది(IX)లో ఒకటి(I) తీస్తే పది(X) అయిందన్న లెక్కతో మీ పూరణ అద్భుతంగా ఉన్నది. ఇది ఏదో సరదాగా వ్రాసిన అల్లాటప్పా పూరణ మాత్రం కాదు. అభినందనలు.

   తొలగించండి

  2. May be a few typo errors they could correct in the intro ?   Cheers
   జిలేబి

   తొలగించండి

  3. professor that has :)

   This past year :)

   "Chadra" (?) lekha Singh


   via the below button: :)


   జిలేబి

   తొలగించండి
  4. "ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు"

   😊

   తొలగించండి
  5. Its author, Vinod Gupta, is a multi-multi- millionnaire alumnus of IIT KGP, with the Vinod Gupta School of Management (VGSOM) in his honor at his alma mater.

   Money talks...😊

   తొలగించండి
 3. శ్రీ గురుభ్యోన్నమః🙏

  ఇమ్మన దేశము నందున
  కమ్మని బడ్జెట్ కనగను కళ్ళే తిరుగున్!
  అమ్మో! వేతన జీవికి
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. యజ్ఞేశ్ గారూ,
   నిజమే... వేతన జీవి తొమ్మిదిలో ఒకటి అప్పు తీర్చితే ఆ వెంటనే రెండు అప్పు తెచ్చుకొనే పరిస్థితి! అది పది అవుతుంది. చక్కని పూరణ. అభినందనలు.

   తొలగించండి
 4. అమ్మను కొలువగ భక్తిని
  నెమ్మిని వరమీయ నెంచి నీకో రికలన్
  కమ్మగ దీవెన లిచ్చుచు
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

  రిప్లయితొలగించండి


 5. అమ్మణ్ణీ యెనిమిదగును
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ, దొయ్యలి! పదియౌ,
  నెమ్మది గ మన మిరువురము
  జుమ్మంచును గూడ రావె సుమనోన్మణియై!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 6. అమ్ముల వేయుచు శిరముల
  గమ్మున నొకటొకటిగ దశకంఠువి గూల్చన్
  నెమ్మది మరలా మొలిచెను
  తొమ్మిదిలో నొకటిదీయ తొయ్యలి పదియౌ

  యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

  రిప్లయితొలగించండి


 7. అమ్మి! జిలేబి లెక్కలవి క్లాసుని చెప్పుట యేను మేలగున్!
  తెమ్మర వీచుచుండె మది తీయని వూహల తేలుచుండెనే
  కమ్మని వేళ నీవు పలుకంగను తప్పగునా మనోన్మణీ !
  తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 8. ఇమ్ముగ లెక్కలన్ దెలుప నేర్పును మెచ్చెను పండితో త్తముల్
  కమ్మగ విందు జేయగను కాలపు రీతుల సౌకుమా ర్యమున్
  నెమ్మిని పారవశ్య మున నీరజ లోచన నీదుమో దమున్
  తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే

  రిప్లయితొలగించండి
 9. (ప్రభాకర శాస్త్రి గారి ప్రేరణతో)

  అమ్మయె రోమను సంఖ్యల
  నెమ్మది నేర్పింప నాకు నేర్చితి సులువున్
  నుమ్మిచె నొకటిని దుడుచుచు
  తొమ్మిదిలో నొకటిదీయ తొయ్యలి పదియౌ

  యజ్ఞమూర్తి ద్వారకా నాథ్

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి

 11. శంకరాభరణం
  26, జులై 2019, గురువారం

  సమస్య -

  "తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే"

  నా పూరణ. ... ఉ.మా.
  **** **** ***

  ఇమ్మహి భారతావనిని నెట్లు కుటుంబపు వార్ధి నీదెదన్?

  అమ్మొ!సమస్య లెన్నొ నను యాతన బెట్టుచు నుండె మెండుగన్

  నెమ్మది బాప నొక్కటిని నేను;నదేమిటొ!రెండు జేరవే?

  తొమ్మిదిలో నొకం డుడుగ దొయ్యలిరో పదియౌను సత్యమే  🌱 ఆకుల శాంతి భూషణ 🌱
  🌷 వనపర్తి🌷

  రిప్లయితొలగించండి
 12. కమ్మగ మద్యపు పానము
  యిమ్ముగఁ జేసి యజమాని యిచ్చిన తన జీ
  తమ్మున నోట్లను లెక్కిడ
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

  చక్కగా మద్యం సేవించి వచ్చిన నౌకరు యజమాని ఇచ్చిన జీతము తీసుకుని ఆ నోట్లు లెక్కపెడుతూ తొమ్మిది నోట్లలో ఒకటి పక్కన పెట్టి లెక్క పెడితే అవి పదిగా అనిపించాయి వాడికా ఆ మైకంలో!!

  రిప్లయితొలగించండి
 13. *హడావుడి పూరణము*

  ఒకటో క్లాసు పిల్లవాడు పాపం. కొత్తగా లెక్క నేర్చాడు. అమ్మ దగ్గరకు వెళ్ళాడు... ఆ తరువాత

  అమ్మా! యని సుతుడుఁ బిలిచె
  (న్)ఏమ్మా! యని తల్లి యడుగ నిట్టులఁ జెప్పెన్
  సమ్మానమ్మిమ్మా గని
  "తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ"

  రిప్లయితొలగించండి
 14. తొమ్మిది నాకడ నున్నవి
  తొమ్మిది నీకడను గలవు తోడగు మరి నా
  తొమ్మిది కిటు నీకడ గల
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

  రిప్లయితొలగించండి
 15. నెమ్మదిగానాడి క్రికెటు
  ఉమ్మడి సహకారమొప్ప నుద్దృతముగనే
  తొమ్మిది వికెట్లు దీసితి
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ"!!

  రిప్లయితొలగించండి
 16. అమ్మలఁ గన్నయమ్మ నిల నమ్మగ సర్వముఁ దానె జూచుగా
  సమ్మెట బోటులన్ బడకు,సైయన గాముని గెల్వలేముగా
  గమ్మగఁ దోగానినిల గ్రామ్యసుఖంబులు తగ్గునే సఖీ
  తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే

  రిప్లయితొలగించండి
 17. అమ్మను నమ్ముము సతతము
  తమ్మీ! గ్రామ్యపు సుఖములుఁ దరగవు యెపుడున్
  ద్రిమ్మరివైఁ దిరగకుమీ!
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ!

  రిప్లయితొలగించండి

 18. కమ్మని యిరువది పండ్లవి
  అమ్మాయీ నీకునిత్తు నందున సగమున్
  ఇమ్ముగ జేతను బట్టితి
  తొమ్మిది, లోనొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ!


  రిప్లయితొలగించండి
 19. మైలవరపు వారి పూరణ

  తిమ్మిని బమ్మి జేయగల దిట్టలు లెక్కలవారు! భార్యలన్
  సొమ్ములు గోరగా నదనుజూచి , పరాకున ముంచి మాయలో
  నెమ్మది దించువారనగ నిక్క , మొకండిటు చెప్పుచుండెనీ
  తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 20. అమ్మా!యెనిమిది యేకద
  తొమ్మిదిలోనొకటిదీయ,దొయ్యలిపదియౌ
  దొమ్మిదికినొకటిగలిపిన
  నిమ్ముగ నికదెలిసికొందు నిట్లనెలెక్కల్

  రిప్లయితొలగించండి
 21. కొమ్మ నడిగె మగడొకపరి
  రమ్మా వివరింపు మీవు రయమున లెక్కన్
  ఎమ్మెయి సాధ్యం బగునో
  తొమ్మిదిలో నొకటి తీయ తొయ్యలి పదియౌ

  రిప్లయితొలగించండి
 22. అమ్మకు పుత్రులెందరని యడ్గితి వీవు గదా గణింప నా
  తమ్మునితోడ కూడగముదమ్మున నా గృహ మందు గాంచినన్
  తొమ్మిది మంది బాలిశులతో పదకొండని చెప్పి పిల్లలా
  తొమ్మిది లో నొకండుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే.

  రిప్లయితొలగించండి
 23. కమ్మని గారెలు తొమ్మిది
  నిమ్ముగ రెండరటిపండ్లనీవీయగ నా
  తమ్ముడు కోరెను గారెను
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ ,దొయ్యలి పదియౌ.

  రిప్లయితొలగించండి
 24. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఒమ్మికగ జూడ నెనిమిదె
  తొమ్మిదిలో నొకటి దీయ; దొయ్యలి పదియౌ
  నెమ్మిని నీవో రెంటిని
  పెమ్మెగ గలుపుచు ఫలములు పెట్టిన యపుడున్.

  రిప్లయితొలగించండి
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  ఆశ్వ వాణిజ్యము (Horse-trading):👇

  తొమ్మిది కాంగ్రెసోత్తములు తొమ్మిది నేతలు భాజపానటన్
  కమ్మగ నుండగా మొదట, కాంగ్రెసు వీడుచు దుడ్డుకోసమై
  తొమ్మిదిలో నొకం డుడుగఁ;...దొయ్యలిరో పదియౌను సత్యమే
  కమ్మగ భాజపాగ్రణులు, గండరగండులు మోడిభక్తులై!

  రిప్లయితొలగించండి
 26. ఇమ్మున నుండిన మువ్వలు
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ
  ముమ్మరమగు శబ్దమొసగి
  యమ్ముల పొదినుండి కురియునట్టి విధముగన్

  పది=పాదము

  రిప్లయితొలగించండి
 27. అమ్మే నాకోరికపై
  కమ్మని గారెలను పంపె, కనుగొని నేనే
  యిమ్ముగ తిన నెనిమిది పం
  దొమ్మిదిలో, నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

  రిప్లయితొలగించండి
 28. నమ్మకు రంగని మాటలు
  బమ్మిని తిమ్మినిగ జేయు బదపడి వడ్డీ
  సొమ్ముల గాజేయు నెటులు
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ?

  రిప్లయితొలగించండి
 29. తమ్ముడు చెప్పు లెక్కలను తప్పనబోకుము, పైకి తీయుమా
  సొమ్ముల ముందు, జాగ్రతగ చూడుము, నీ కిడువాడ నే పదిన్
  పొమ్మన వద్దు కాగితపు పొట్లములోగల రెండు కల్పినన్
  తొమ్మిదిలో నొకండుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే.

  రిప్లయితొలగించండి
 30. తొమ్మిది గంటలాయెనను తొందరలో పని వేళ తత్తరన్
  తొమ్మిది మంది వీరులని తొల్లి వచించితి నౌను గాని నా
  తొమ్మిది కిద్దరున్ గలిసి తోడవగా పదునొక్కటౌ గదా
  తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే

  రిప్లయితొలగించండి
 31. కొమ్మా! వినుమీ లెక్కను
  నిమ్ముగ మరి నేర్చుకొనిన నింపగు నీకున్
  నమ్ముము, రోమను యంకెల
  తొమ్మిదిలో నొకటి దీయ దొయ్యలి పదియౌ

  రిప్లయితొలగించండి
 32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 34. అమ్మరొయెన్మిదేయగునునార్యులుజూడుడులెక్కమీరునున్
  దొమ్మిదిలోనొకండుడుగ,దొయ్యలిరోపదియౌనుసత్యమే
  తొమ్మిదికొక్కటిన్గలుప తోరపుసంఖ్యయెయద్దియేగదా
  యిమ్ముగనేర్వగావలెనునిట్లుగలెక్కలు సర్వమున్సుమా

  రిప్లయితొలగించండి
 35. తెమ్మనఁ దెచ్చిన పండిన
  నిమ్మలు పుల్లనివి యేరి నేర్పున నేనే
  సమ్మతి వేసితి రెంటిం
  దొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ


  కమ్మఁగ రెండు శబ్దములు గల్పఁగ సంధి యనం జెలంగులే
  కమ్మని తెల్గు బాస నిల గారవ మొప్పఁగఁ జిత్ర రీతిలో
  నమ్మరొ కల్ప నిప్పదికి నన్యము తొమ్మిది యట్టి సంధి పం
  దొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే

  [పది +తొమ్మిది = పందొమ్మిది; ఒకఁడు: ఇక్కడ తొమ్మిది యన్న పద మొకటి]

  రిప్లయితొలగించండి
 36. చెల్లును మీకే పెద్దల
  కల్లగ నిటువంటి భవ్యమగు పద్యముల
  న్నెల్లలు లేనిదను నిజము
  తెల్లము మీ ప్రతిభ కిట సుధీ!కామేశా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ధన్యవాదములండి. ఈ సంధి పందొమ్మిది విచిత్రాన్ని పెద్దలెలా గ్రహించెదరో యని భయపడ్డాను. మీకు నచ్చినది. చాలా సంతోషము కలిగింది నాకు.

   తొలగించండి
  2. నమస్సులు కామేశ్వరరావు గారు. పందొమ్మిది అన్న మాట వ్యావహారిక మంటారా?

   తొలగించండి
  3. అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొక చోఁ గానంబడియెడి.
   పది+తొమ్మిది =పందొమ్మిది.

   తొలగించండి
 37. కందం
  సొమ్ములన వంద నోట్లను
  తొమ్మిది ఐంద్రజలికునకు దోసిట నిడ చి
  త్రమ్ముగ నాకిడ నోటది
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి 'పది' యౌ!

  రిప్లయితొలగించండి
 38. కొమ్మా ! చక్కని ముద్దుల
  గుమ్మా ! నీదు విరహము ప్రకోపించినదా?
  యిమ్మహి యెటులౌ తెలుపుము !
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ !

  రిప్లయితొలగించండి
 39. తొమ్మండ్రుండిరి యన్నలు
  దమ్ములు నొక నింట నొకడు తగిలెను యమపా
  శమ్మున పరివారమ్మున
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

  రిప్లయితొలగించండి
 40. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ"

  సందర్భము: "అందరికీ సమ్మత మయింది కలుపడమే కాబట్టి తొమ్మిది కొకటి కలుపుతాను నేను.
  తొమ్మిది నుంచి ఒకటి తీయను..
  అప్పుడు పది అవుతాయి క దమ్మా!" అంటున్నా డొకడు.
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  "సమ్మతము సకల జనులకు
  నిమ్మహిలో కలుపు టదియె..
  యింపుగ నేనున్
  దొమ్మిది కొక్కటి కలిపెద..
  తొమ్మిదిలో నొకటిఁ దీయఁ...
  దొయ్యలి!.. పదియౌ "

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  26.7.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి