అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. మొదటి పాదంలో గణదోషం. "వర మిడని రాయిని గొలువ" అనండి. సమయాభావం వల్ల నిన్న మీ పూరణ కాకుండా పేరును మాత్రమే చదివాను.
ధన్యవాదాలు గురువుగారు! గత తొమ్మిదివారములు నిరంతరాయంగా ఆకాశవాణిలో నాపద్య పూరణలు ప్రసారమవుతూ వచ్చాయి. ఈ వారం మా గురువుగారి గళంనుంచి నా పద్యం జాలువారుతుందని ఆశించాను.సమయాభావంవల్ల ఆకోరిక నెరవేరనందుకు కించిత్తు నిరాశపడ్డాను.
సందర్భము: చిన్నప్పుడు మా నాన్న ఇలా చెప్పేవాడు.. "వర్కీజ్ వర్షిప్.. డ్యూటీ ఈజ్ గాడ్.. ఇవి విదేశీయుల మాటలే ఐనా తరింపజేసే మంత్రాలు. ధూప దీప నైవేద్యాలతో పూజిస్తే నారాయణుడు సంతోషిస్తాడేమో గాని తన డ్యూటీకి తాను శక్తివంచన లేకుండా న్యాయం చేకూర్చగలిగితే నరుడే కాదు నారాయణుడూ సంతోషిస్తాడు.. నరుని మరచి నారాయణుని సేవిస్తే నరుని రూపంలో వున్న నారాయణు డెలా సంతోషిస్తాడు?" ~~~~~~~~~~~~~~~~~~~~~~~ " 'వరుకీజ్ వరుషిపు' నాన్నా!
మరి 'డివిటీ యీజు గాడు' మహి ననుకొనగా
దరియింతువు.. దీని మరచి
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ 20.7.19 -----------------------------------------------------------
వచ్చే వారానికి ఆకాశవాణి వారి దత్తపది..... తట్ట - గుట్ట - చుట్ట - పుట్ట పై పదాలను ప్రయోగిస్తూ 'స్వచ్ఛ భారత్' లక్ష్యాల గురించి మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాసి గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి. padyamairhyd@gmail.com
వరమీయని రాయిని కొలువ
రిప్లయితొలగించండిసురలో కముమెచ్చ దంట శుభముల నీయన్
మరిగిన లంచపు టాశగు
పరమాత్ముని సేవ చేయ పాపము కలుగున్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "వర మిడని రాయిని గొలువ" అనండి.
సమయాభావం వల్ల నిన్న మీ పూరణ కాకుండా పేరును మాత్రమే చదివాను.
వరమిడని రాయిని గొలువ
తొలగించండిసురలో కముమెచ్చ దంట శుభముల నీయన్
మరిగిన లంచపు టాశగు
పరమాత్ముని సేవ చేయ పాపము కలుగున్
-----------------------------
పోనీ లెండి గణదోషం కుడాఉందిగా .అసలు ముందు అలాగేరాయాలనుకుని బుద్ధి వక్రించి ఇలా రాసాను
పరకాంతలమోజువిడక
రిప్లయితొలగించండిపరమాత్ముని సేవచేయ పాపమె గలుగున్
పరహిత మున్ గోరగనా
పరమాత్మే నిచ్చు పుణ్య ఫలమునుగనుమా!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పరమాత్మయె యిచ్చు...' అనండి.
సరసపు మాటల నాడుచు
రిప్లయితొలగించండిపరుల తలల చేయి బెట్ట భస్మమ్మౌటన్
వరమును కోరుచు పడిపడి
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిఅరెవో! కాంగ్రెసు నేతలందరును భల్ హైరాన గావించగన్
మురిసెన్ హాయి కుమారసామి భళిగన్ పూజించి ముక్కంటినిన్...
త్వరగా స్పీకరు త్రోసివేయగనటన్ దండంబులన్ బెట్టుచున్
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి🙏
తొలగించండి"This is God’s govt and you will face Judgment Day, Kumaraswamy tells BJP"
తొలగించండి...https://www.google.co.in/amp/s/m.timesofindia.com/city/bengaluru/this-is-gods-govt-cm-tells-bjp-and-you-will-face-judgment-day/amp_articleshow/70299627.cms
నిరతము స్వార్థము తో కడు
రిప్లయితొలగించండిదురితము లే చేయునట్టి దుష్టుడు వాడే
పరులను వంచింపదలచి
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈవారం మీరు ఆకాశవాణికి పూరణను పంపనట్టుంది.
ఔనండి గురువుగారు పంపలేదు, ఈ వారం పంపగలను వచ్చే వారానికి సమస్యని సమూహంలో ప్రకటించ మనవి._/|\_
తొలగించండివచ్చే వారానికి ఆకాశవాణి వారి కోరికపై దత్తపది ఇచ్చాను.
తొలగించండి😢
తొలగించండిఅరయన్ స్వార్థము పెచ్చుమీరగ ననాయాసమ్ముగా సంపదల్
రిప్లయితొలగించండివిరివిన్ బొందగ నెంచుచున్ జనులనే పీడించు పాపాత్ములే
హరమౌ పాపమటంచు లోకులన గన్నార్భాటమున్ జూపుచున్
బరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరులను మోసము జేయుచు
రిప్లయితొలగించండిపరధనముల దోచు కొంచు బాలసు డగుచున్
వరలెడు దుష్టుం డిలలో
పరమాత్ముని సేవ జేయ బాపమెె కలుగున్
రాజేశ్వర రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిపరవిత్తమ్ము హరించి పున్నెముగొనన్ వారాణసిన్ జేరినన్
పరులన్ దూరుచు సత్పురాణపఠనవ్యాసంగమున్ జేసినన్
పరదారారతులౌచు శ్రీహరిని సంభావించినన్ దుష్టులై
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్"
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
రిప్లయితొలగించండిపరిపరి విధముల జనుల క
సురుచు పదండిక పదండి చూచిరి చాలం
చు రుసరుల తిరుమలలలో
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిన్న ఆకాశవాణిలో చదివిన పూరణ ఇది కాదు. మొట్టమొదట చదివిన మీ పూరణ చివరిపాదం కొంత ఇబ్బంది పెట్టింది.
గురువరేణ్యులకు బంధుప్రీతి సంజనం బెవ్విధి సమంజసమో!!!
తొలగించండిసమస్య :-
రిప్లయితొలగించండి"పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్"
*కందం**
నిరతము తల్లికి దండ్రికి
నరకము జూపుచు నిశాంతనారి పలుకులన్
వరుసగ సమాచరించుచు
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
....................✍చక్రి
నిశాంతనారి : భార్య
చక్రపాణి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
దురితపుయోచనమదినిడి
రిప్లయితొలగించండిపరమాత్మునిసేవచేయ పాపమె కలుగున్
చరణమ్ములెశరణమ్మని
పరమేశునిభక్తితోడభజియింపదగున్.
పరమునుభవహరముగలుగు
రిప్లయితొలగించండిపరమాత్మునిసేవచేయ, పాపమె కలుగున్
పరమాత్ముని దూఱినచో;
శరణాగతి కరివరదుని చరణయుగమ్ముల్!
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురువుగారు! గత తొమ్మిదివారములు నిరంతరాయంగా ఆకాశవాణిలో నాపద్య పూరణలు ప్రసారమవుతూ వచ్చాయి. ఈ వారం మా గురువుగారి గళంనుంచి నా పద్యం జాలువారుతుందని ఆశించాను.సమయాభావంవల్ల ఆకోరిక నెరవేరనందుకు కించిత్తు నిరాశపడ్డాను.
తొలగించండినిన్నటి సమస్యా పూరణ:
రిప్లయితొలగించండితులువా! జూదమునాడి నీవు తుదకున్
దుర్మార్గ సంచారివై
ఖలుడై పోతివి, యింట నాభరణముల్
కాజేయుటన్ న్యాయమే?
కొలువున్ జేయుచు బెట్టు బాంధవుడివై,
ఘోరమ్ము;నీ సొమ్ములున్
జెలివో చెల్లివొ తల్లివో వదినవో
జేజమ్మవో యత్తవో?
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నిరతము బుణ్యముగలుగును
రిప్లయితొలగించండిపరమాత్మునిసేవజేయ,పాపమెగలుగున్
బరమాత్ముని దూషించిన
భరణినిగలమనుజులెల్లపరమాత్ములులే
సుబ్బారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
విరులన్ బూయగజేసి గుండియలలో
రిప్లయితొలగించండివేదాంతవేద్యుండు శ్రీ
హరినే విశ్వముగా దలంచి సకలం
బర్పింప మోక్షంబెకా
పరమాత్మార్చన సేయు మానవులకుం ;
బాపంబులే జేకురున్
సిరులన్ గోరుచు ఘోరకృత్యముల జే
జేతన్ నొనర్పం భువిన్.
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
పరహితము నెఱుంగక నా
రిప్లయితొలగించండియరిషడ్వర్గము గెలువక నతుల దురాశా
పరులై మెలగెడు వారే
పరమాత్ముని సేవ జేయ బాపమె కలుగున్
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
సందర్భము: చిన్నప్పుడు మా నాన్న ఇలా చెప్పేవాడు..
"వర్కీజ్ వర్షిప్.. డ్యూటీ ఈజ్ గాడ్.. ఇవి విదేశీయుల మాటలే ఐనా తరింపజేసే మంత్రాలు.
ధూప దీప నైవేద్యాలతో పూజిస్తే నారాయణుడు సంతోషిస్తాడేమో గాని తన డ్యూటీకి తాను శక్తివంచన లేకుండా న్యాయం చేకూర్చగలిగితే నరుడే కాదు నారాయణుడూ సంతోషిస్తాడు..
నరుని మరచి నారాయణుని సేవిస్తే నరుని రూపంలో వున్న నారాయణు డెలా సంతోషిస్తాడు?"
~~~~~~~~~~~~~~~~~~~~~~~
" 'వరుకీజ్ వరుషిపు' నాన్నా!
మరి 'డివిటీ యీజు గాడు' మహి ననుకొనగా
దరియింతువు.. దీని మరచి
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
20.7.19
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఎస్వీ బీ సీ చేర్మన్ పదవి దక్కించు కున్న మా పృథ్వీ గారికి శుభాకాంక్షలతో
పరులన్ త్రోసి పదండి ముందు కనుచున్ ప్రార్థింప చూడంగ తి
ట్టి రసాభాసుగ పిన్న పెద్దలనకన్ టింగోడ! పెద్దోడ యం
చు, రహిన్ చూపక వెంకటేశు కొలువంచున్ మూర్ఖులై డంబుతో
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మా పృథ్వి' అన్నారు... మీ బంధువా?
రిప్లయితొలగించండిఆకాశవాణి కి పంపించినది :)
పరలోకములో వున్న ప్రభువా పాహిమాం :)
అరయన్ పుణ్యము కలుగును
పరమాత్ముని సేవఁ జేయఁ ,బాపమె కల్గున్
సరసీ జనులను హింసిం
ప! రహివలయు జనుల యెడల ప్రభువుని గానన్!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఇంతకూ ఈ 'బొంగులూరు' ఎక్కడిది? హైదరాబాదు సమీపంలో ఒకటి ఉందని గూగుల్ మ్యాపు చెప్పింది.
తొలగించండిఅప్పుతచ్చు !
మీ వరద శతకపు సమావేశము లో కలిసిన వూరు
జిలేబి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపరమపదమ్మె లభించును
పరమాత్ముని సేవజేయ; బాపమె గల్గున్
మురువున ఘనునిగ నెగడుచు
నిరతము దేవుని పదరుచు నేగెడు నపుడున్.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరమ శివునిఁ గొల్చిన నిక
రిప్లయితొలగించండిహరమౌ పాపము లటంచు నను నిత్యము తా
దురితముల నొనర్చుచు నా
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పరులటు బాధల నుండగ
రిప్లయితొలగించండిత్వరపడి తగు సాయమిడుట దలపక నెపుడున్
పరమున కక్కర యనుచును
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'...దలపక యెపుడున్' అనండి.
వరములు గలిగిన రాక్షస
రిప్లయితొలగించండిపరివారము వంటిబుద్ది బహు మతియనుచున్
తరచుగ మనసునలేకే
పరమాత్మునిసేవజేయ బాపముకల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికరముననొక సంచీతో
రిప్లయితొలగించండితిరిగి పరుల పూలు కోసి తెచ్చి మనుజులా
విరులను పూజకు వాడుచు
*"పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరులను కడు పీడించుచు
రిప్లయితొలగించండిసిరులను ఖలులంతదెచ్చి చింతలె దొలుగన్
హరికే వాటాల నొసగి
పరమాత్ముని సేవ జేయ పాపమె కల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండితిరుగుచు నప మార్గంబున
పరమాత్ముని సేవ చేయ పాపము గలుగున్
అరమరికలు లేక కొలువ
హరియే యొసగును వరములు హర్షము తోడన్."
:
మరొక పూరణ
పరులను పీడించుచనన
వరతము దురితములు చేయు వారల కిలలో
పరగతి దొరకక తుదకా
పరమాత్ముని సేవసేయ పాపమె కలుగున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'పీడించుచు ననవరతము...' టైపాటు అనుకుంటాను.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఒరవున్ జూపని తీరుతో నడరి తానొక్కండుగా చాగుచున్
వెరపే లేని ప్రవృత్తినిన్ మధురమౌ బెల్లింపు వావాదులన్
వరుసం జేయుచు తోడివారికిట కీడ్పాటాచరించేటిదౌ
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకురున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసెల్ఫ్ సెటైర్:
రిప్లయితొలగించండిఅరకొఱ నెఱిగియు నెఱుఁగక
బరబర పద్యముల వ్రాసి బాధించుచు నే
ర్పరులను తగునని విట్ఠూ!
*"పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్"*
😃🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరులన్ బాధలు పెట్టుచున్ మిగుల గర్వంబూని దుర్భావులై
రిప్లయితొలగించండిపర లోకమ్మున దివ్య భోగముల సంప్రాప్తించు నానందముల్
పరమార్ధమ్మని నమ్మి కీర్తనల సంభావించుచున్ స్వార్ధమౌ
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'సార్థులై పరమాత్మార్చన...' అంటే బాగుంటుందేమో?
కరముల నుజోడ గించుచు
రిప్లయితొలగించండిపరమును కాంక్షించి దేవభాష పదములన్
పొరపాట్లతోడ చదువుచు
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅధర్మకర్మ జేసి ధర్మకర్మకాండ జేస్తే పాపమే వస్తుంది గా...
రిప్లయితొలగించండిమ||
పరులన్ దూషణజేయుచుండి విషసర్పాలోచనల్ జేయుచున్
పరకాంతాగతరక్తియన్ మనసునవ్యక్తంబుగన్ నిల్పుచున్
నరరూపంబులు దాల్చి మస్తకమునన్యాయాప్తులౌ జీవులై
పరమాత్మార్చన జేయు మానవులకుం బాపంబులే చేకురున్
Rohit 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅరుదె సుర సంచయమ్ములు
రిప్లయితొలగించండిధర న్దురవగాహము సుర తత్వ గ్రాహం
బరయ వచించెద వీ వే
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
నర లోకమ్మునఁ బుట్ట రక్షకుఁ డగున్ నారాయణుండే చుమీ
పరమేష్ఠ్యన్వయ భూత రావణుని దుర్వాజ్యాత్ము వీక్షించమే
సుర విద్వేషి హిరణ్య భుక్తిఁ గనమే చోద్యంబె దూరంబగుం
బర మాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్
[పరము + ఆత్మార్చన = పరమాత్మార్చన; ఆత్మార్చన = ఆత్మస్తుతి]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
సరియౌ రీతిని పాట పాడుచునుభల్ శ్లాఘమ్ములన్ జేయుచున్
దరువుల్ గొట్టుచు నాట్యమాడగనువే దానంబులన్ జేసెడిన్
బరువౌ నేతల కోరకే వరములన్ బ్రహ్మాండమౌ తీరునన్
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపొరిగింటివారు విరివిగ
రిప్లయితొలగించండిపురహరిఁ గొల్తురని తాము పోటీ పడుచున్
బరనాశమ్మును గోరుచు
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
వచ్చేవారమునకు ఆకాశవాణి వారి సమస్య యేమిటి ? తెలియ చేయగలరు
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికర మానందముగూర్చ గన్నులకు,గైంకర్యమ్ముగా నీయ నా
రిప్లయితొలగించండిపరమాత్మాంఘ్రుల కింట బెంచుకొన పుష్పాలిచ్చు పల్మొక్కలం
బరమార్థమ్మని దొంగిలించి విరులం బాపంబుగా నెంచకం
బరమాత్మార్చనసేయ మానవులకుం బాపంబులే చేకుఱున్.
మీ పూరణ ప్రశస్తంగా, మనోహరంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు.
తొలగించండివరగర్వితులైనయసుర
రిప్లయితొలగించండివరులును ప్రతియుగమునందు వ్రాలిరి తుదకున్
నిరంతరము పాపపు చింతన
పరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కల్గున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడవ పాదం మొదటి గణం జగణమయింది. "నిరతమ్ము పాప చింతన" అనండి.
నిరంతరము×
రిప్లయితొలగించండినిరతము√
మరో మూడు పూరణలు
రిప్లయితొలగించండినర జన్మకు ఫలమొదవును
పరమాత్ముని సేవసేయ, పాపమె కలుగున్
పరవనితల కాంక్షించుచు
దురిత ము లొనరించ తుదకు దుఃఖమె మిగులున్.
నిరతము చెడు భావనతో
పరదారల వాంఛ చేయు పాతకునకిలన్
దొరకదు శాంతియు పైగా
పరమాత్ముని సేవసేయ, పాపమె కలుగున్.
హరితా మెచ్చును సతతము
పరమాత్ముని సేవసేయ, పాపమె కలుగున్.
పరపతిని నుపయోగించుచు
పరులను హింసించుచుండ వసుమతి యందున్
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండి'పైగా' అన్నది వ్యావహారికం.
వచ్చే వారానికి ఆకాశవాణి వారి దత్తపది.....
రిప్లయితొలగించండితట్ట - గుట్ట - చుట్ట - పుట్ట
పై పదాలను ప్రయోగిస్తూ 'స్వచ్ఛ భారత్' లక్ష్యాల గురించి
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాసి
గురువారం సాయంత్రం లోగా క్రింది చిరునామాకు మెయిల్ చేయండి.
padyamairhyd@gmail.com
తొలగించండినెనరుల్స్ ! పంపించితిమి :)
జిలేబి
కొందరికి 'గుట్ట'... 'బుట్ట'లా వినిపించిందట!
తొలగించండిఈవారం మొట్టమొదట మీ పూరణ చదువుతానన్న మాటను నిలుపుకున్నాను.
తొలగించండి
తొలగించండిబుట్ట అంటేనే ఇంకొంత సొబగేమో నండి ! తట్టా బుట్టా తబేలాలతో దేశాన్ని ఓ ఝాడూ లాగించేయొచ్చు :) గుట్ట తోబాటు బుట్టకూడా రాసేసుకుంటే ఛందం ఒప్పదా యేమిటి ;)
జిలేబి
తొలగించండిధన్యవాదములు ! ంంంం రె
మీ అభిమానమే మాకు శ్రీరామ రక్ష !
జిలేబి
నేడు ప్రసారమైన కందం
రిప్లయితొలగించండివరమనఁగ జయవిజయులున్
పరులై ముజ్జన్మలందుఁ బ్రభువును చేరన్
భరపడి నంతట నొగి హరిఁ
బరమాత్ముని సేవఁ జేయఁ బాపమె కలుగున్
మత్తేభవిక్రీడితము
వరమే మీకని శ్రీనివాసుడు వినన్ ప్రత్యేక హోదాయనె
న్నెరనమ్మంగఁ బ్రధానిగా వెలసి మన్నించంగ వెన్కాడుచున్
కరసేవన్ రఘు రామ మందిరమునే గట్టింతునన్బల్కుచున్
పరమాత్మార్చన సేయు మానవులకుం బాపంబులే చేకుఱున్