కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే"
(లేదా...)
"పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే"
(జిలేబీ గారికి ధన్యవాదాలతో....)
(లేదా...)
"పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే"
(జిలేబీ గారికి ధన్యవాదాలతో....)
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిబోరును కొట్టగా తినుచు ప్రొద్దున రాతిరి రాజభోగులన్
కోరిక తీరగా కలిపి కొబ్బరి కోరును పంచదారతో
తీరుగ వంగదేశమున త్రిప్పలు పెట్టెడి కజ్జికాయలన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే!
(రాజ్ భోగ్ = కేసరి రసగుల్లా)
పేపర్ లీక్!
తొలగించండిప్రభాకర శాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
"తిప్పలు పెట్టగ స్వీయకుక్షినిన్ । పూరణఁ జేయగా..." అంటే బాగుంటుందేమో?
🙏
తొలగించండిసారము తెలిసిన చాలును
రిప్లయితొలగించండిభారము గాదనుచు మిగుల భాషా మృతమున్
మీరిన సంతస మందున
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁ డికిఁ దరమే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వారింటను చేరినదట
రిప్లయితొలగించండిదారిద్ర్యమ్మొసగు తల్లి తాండవ మాడన్
కోరిన ఫలమేమి యచట
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిపారె కురీతులు సరిపడ
పోరెదరే పాలసీల(policies) పుణ్యము చేతన్
మారునె కవితల వలనన్
బూరణ జేయంగ బలుకు బోడికి దరమే!?
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారణ జేయువా రలకు ధాత్రిని ఖ్యాతిని తెచ్చిపెట్టునే
రిప్లయితొలగించండిపారణ జేసిజేసి పలు భాషల రీతుల కావ్యమల్లగన్
నేరము లెంచకుం డగను నీమము తోడుత పద్యసౌ రులున్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రమ్మకునైన సాధ్యమే
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండితీరని కోర్కెలన్ గలగి తిమ్మని రీతిని కొమ్మకొమ్మకున్
పారగ లాభమే? నిహిత భైరవ రూపము వీడకుండియున్
చారెడు యోగ సిద్ధి గను చాడ్పున మెల్గకె యాత్మ బోధనన్
బూరణ జేయగా బలుకు బోడికి బ్రహ్మకునైన సాధ్యమే?!
డా. పిట్టా వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చారుతరార్థసుందరవచస్సముదీరితమాధురీలస
రిప్లయితొలగించండిత్సారనిరస్తదోషకవిసన్నుతరీతుల శంకరార్యుచే
వారక శంకరాభరణవర్గమునందిడు నాసమస్యలన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న రాత్రి కందపద్యాలతో విష్ణుపరంగా 'వరద శతకం' వ్రాయలని సంకల్పం కలిగింది. దానిని ఒక్కరోజులో పూర్తి చేసి రేపు ముద్రణకు ఇచ్చి ఈనెల 13న బెంగుళూరులో జరిగే 'ప్రజ - పద్యం' సమూహం ఆత్మీయ సమావేశంలో ఆవిష్కరిస్తున్నాను. మీ శుభాశీస్సులు కోరుతున్నాను.
రిప్లయితొలగించండి👏
తొలగించండిశుభాభినందనలు 🙏
తొలగించండిఅధ్భుతము గురువర్యా!మీ సంకల్పబల మమోఘము!! మీకు "సద్యః శతకకర్త" బిరుదు తగియున్నది!!
తొలగించండివందన శతములు!!
ఒక్క దినము లోనె యక్కరుణాళుని
తొలగించండివరద శతక మల్ల గురువు గారు
తగును మీకె వినుడు తదుపరి యొక గంట
ధ్యేయ మగును చేయ దివ్య కృతిని.
👏🏽 కృతకృత్యులౌదురుగాక
తొలగించండిపూజ్యులు శంకరయ్య గారు వందనములు. మీ యేక దిన శతక పూరణాభిలాష నిర్విఘ్నముగా జయప్రద మైనందులకు సంతోషాంతరం గాభినందన సంయు క్తాశీర్వచనములు (వయోవృద్ధుని గనుక).
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి" విజయోస్తు " దీవించి అక్క
రిప్లయితొలగించండితీరును దెన్నును గానని
రిప్లయితొలగించండిసారము లేనట్టి దగుచు జటిల పదములన్
పేరుకు సమస్యయనగా
పూరణ జేయంగ బలుకు బోడికి దరమే
ధారణఁజేసి పద్దెముల ధన్యత కోమలులందెవేసి యిం
రిప్లయితొలగించండిపారగ సర్వ శక్తుల నహర్నిశలున్ తళుకొత్త నేర్వగా
వారల కెందు లేదెదురు-వాస్తవమియ్యది యంచుఁబల్కగా
పూరణఁజేయగా బలుకుఁబోడికి బ్రహ్మకు నైనసాధ్యమే.
(బ్రహ్మదేవుని మునిమనుమడు మంకుపట్టువీడని లంకేశుని మార్చటం అసాధ్యం)
రిప్లయితొలగించండిఆరయ బద్మసంభవున
కందరు మెచ్చిన ముద్దుమన్మడే!
ప్రేరణ మీరగా కడుపు
ప్రేగుల రుద్రునివీణ జేసెనే!
నేరపు రావణున్;దనుజ
నేతను;శీర్షము బట్టి సన్మతిన్
బూరణ జేయగా బలుకు
బోడికి,బ్రహ్మకు నైన సాధ్యమే?
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[రంధ్రయుక్తమైన ఘటమున నీర పూరణము సేయుట వాణీ బ్రహ్మలకుఁ గూడ నసాధ్యమే యనుట]
చేరఁగఁబోయి చక్కనగు చిన్నఘటమ్ములయందు రమ్యమై
తీరుగ నున్న భాండమునుఁ దెచ్చి తధోముఖరంధ్రయుక్త; నే
నీరము నింపఁ జూడఁగను, నిల్వక కాఱుచునుండె! నందులోఁ
బూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే?
ప్రేరణ రాముని దైనను
రిప్లయితొలగించండితీరుగ కృష్ణుని కథలను తెనిగించెనుగా
మీరుచు పోతన శైలిని
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
వారలు వీరలంచు సహపాఠుల నందర బోల్చి చూచినన్
తొలగించండిసారఘ ధారలౌననగ జాలెడి పద్యములల్లుటన్నచో
కారణ జన్ముడైన కవి గాక మరెవ్వరికైన నివ్విధిన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిధీరతరాంతరంగుడయి దీటుగ దత్తసమస్య గాంచి , స...
త్పూరణ జేయనెంచ పరిపూర్ణత గూర్చును వాణి ., కాని నే
నేరనటంచు గద్దె దిగు నిర్ణయమున్ గొనువాని పల్కులన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే !?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పేరుకు రామకృష్ణుడట పెద్దగు హాస్యపు చేష్టితమ్ములన్
రిప్లయితొలగించండిగేరుచు పండితాళినట కేళిగ వాదములన్ని దీర్చుచున్
మారిన మేకతోకలను మాటలగారడి జేయుపద్యపుం
బూరణసేయగా బలుకుబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
సందర్భము: సులభము
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ధారుణి మరి మరి జన్మల
కారణమయి నరుని మదిని
కడ లెత్తుచు పెన్
భారం బగు కామ వితతిఁ
బూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
✒~డా.వెలుదండ సత్యనారాయణ
5.7.19
-----------------------------------------------------------
రిప్లయితొలగించండిసారూ! కందివరార్యా
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
మీరీరీతి యనుదినం
బేరాలము కైపదముల వేయగ సభలోన్ !
జిలేబి
రిప్లయితొలగించండిసోరణి దివ్వె వెల్గులు రజోరసమున్ భళి పార ద్రోలగా
ధారణ తోడు యత్నమిక తత్వము బుద్ధిని చేర్చుకొంచునా
పూరణఁ జేయఁగాఁ, బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
ప్రేరణ గూర్చి దీవనల భేషుగ నీకొసగన్ జిలేబియా !
జిలేబి
ఒక్కరోజునశతకముజక్కగాను
రిప్లయితొలగించండివ్రాయుమీచతురతకునావందనములు
శతసహస్రములనిడుదుశంకరార్య!
యందుకొనుమయ్యదయతోడహర్షమొదవ
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండిఘోర రణంబైనను సం
హారము*న జయింప వచ్చు హరిమది దలపన్
మీఁరొసగు మారుపాటగు^
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే!
*నేర్పు,అభ్యాసం
^తారుమారు, తికమక
ధారుణి తిరుగుటకే యా
రిప్లయితొలగించండిధారము దొరకొనెనటంచు తనయుండడుగన్
పోరని. యా సందేహపు
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే
(కుచేలుని భార్య వామాక్షి తన భర్తతో)
రిప్లయితొలగించండిశారద కొలువగ నిచ్చెను
కోరిన ఘనవిద్యలెల్ల కూరిమితోడన్
మూరెడు నుదరపు నాకలి
పూరణజేయంగ బలుకుబోడికి దరమే!
- యజ్ఞమూర్తి ద్వారకా నాథ్
ధారుణి కవిత్ర యాదిగ
రిప్లయితొలగించండిభారత రామాయణాది భాగవత కథా
కారుల నిజమగు వెలితిని
బూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూరణయనునదియొకకళ
రిప్లయితొలగించండిపూరణదాజేయువారుబుధవరులగుచున్
మీరకఛందమునెపుడును
బూరణజేయంగబలుకుబోడికితరమే.
సరదాగా
రిప్లయితొలగించండిచీరలు సారెలున్ కొనగ చేడియతోడను నేగసంతకున్
సారెకు సారెకున్ దనదు శ్రద్ధనుమార్చుచు పెక్కుకొట్టులన్
బేరములాడుచున్ దిరిగి వేసటబెట్టెడి నూత్నవాంఛలన్
బూరణసేయగా బలుకుబోడికి, బ్రహ్మకునైన సాధ్యమే?
self goal
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికారణము లెన్ని చెప్పిన
రిప్లయితొలగించండిగారవ మతిశయిలఁ బద నికాయము తోడం
బూరుష వరేణ్యునకునుం
బూరణఁ జేయంగఁ బలుకుఁ, బోఁడికిఁ దరమే
సార ధరా సతీపతి విశాల చతుర్భువ నాధినేతృ మా
యా రమణీ సురూప ధరణైక విలోల వినీల దేహ స
త్సారస లోచ నాక్షధర శార్ఙ్గధ రాంచిత వర్ణనీయ స
త్పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
పూరణజేయగానగునుపూర్ణమనస్కులునైనవారికిన్
రిప్లయితొలగించండివారలుజాగరూకతనభావనజేసియువ్రాయుచోదగన్
నేరికినైనసాధ్యమదియీపుడమిన్ మఱియీవిధంబుగా
బూరణజేయగాబలుకుబోడికిబ్రహ్మకునైనసాధ్యమే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
తీరుగ కంది శంకరులు త్రిప్పలు పెట్టెడి కైపదమ్మునున్
కోరిక తీరగా నిడుచు కోరగ ఘాటగు పూరణమ్ములన్
మీరిన రాజకీయముల మెండుగ దోపెడి శాస్త్రిదౌ యథా
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోడికి బ్రహ్మకునైన సాధ్యమే!
సారవిహీన పదముల న
రిప్లయితొలగించండిపారముగా చేర్చుచు నిక పద్యము లెల్లన్
తీరుగ త్వరితగతిన నిట
పూరణ చేయంగ బలుకుబోడికి తరమే
కోరిన చాలు తక్షణమె కోమలమౌ స్వర మందు పద్యముల్
రిప్లయితొలగించండిభూరిగ చెప్పు పండితుడు, పొంతన లేని పదాలు ఛందమొ
ప్పారగ లేని వాక్యమును పద్యపు పాదము నివ్వగా యనెన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబొఁడికి బ్రహ్మకు నైన హాధ్యమే.
మీరిన ప్రేమన్ఁ దల్లౌ
రిప్లయితొలగించండిభారతి వొడిలో సతతము బాలుని భంగిన్
ప్రేరణ నొందుచు మీరిడు
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే!
రిప్లయితొలగించండిప్రేరణ గూడి పద్యముల భేషుగ వ్రాయన కోరగా జిలే
బీ, రస రమ్య మాధురి సువిస్తృత మయ్యెడురీతి దక్కునే
బూరె జిలేబి గారెలని బువ్వల నివ్వ మటంచు కోరగా
బూరణ సేయగా బలుకుబోడికి, బ్రహ్మకునైన సాధ్యమే?
జిలేబి
ధారణచేసి సత్కవులధార్మిక కావ్యవిశేషముల్ మదిన్
రిప్లయితొలగించండిపూరణకుద్యమించపరిపూర్ణతఁజేకురు, యల్పబుద్ధితో
దారుణమైననర్ధరహితంబగుపద్యపుపాదమిచ్చినన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
శ్రీగురుభ్యోనమః,🙏
రిప్లయితొలగించండిఇయ్యది నా మొట్టమొదటి ఉత్పలమాల వృత్త ప్రయోగము. శంకరార్య పాదార్పణమస్తు🙏🌺
ధారగ పద్యముల్ యొసగ ధారణ నార్యులు గల్గియుండటన్
మేరు నగమ్ము రీతిగను మేధను మెర్గులు దిద్దఁ బూనగా
చోరులు దోచలేరు గద చోద్యముఁ జూడగ పద్య పాదముల్
పూరణ జేయగా పలుకుబోడికి బ్రహ్మకునైన సాధ్యమే?
వరద శతకము పరమోత్కృష్టమై వరలుగాక!వాస్తు!!
రిప్లయితొలగించండితథాస్తు
రిప్లయితొలగించండికారణ మిద్దియంచు గన కష్టతరమ్ము సుమా!జగమ్మునం
రిప్లయితొలగించండిదేరికి గాని సాధ్యపడ దెప్పటికయ్యది చూడ చిత్రమౌ
కోరికలెన్ని తీరినను గుట్టగ కూడెడు లోభి వాంఛలన్
పూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే
ప్రారబ్ధమేమొ నాకిది
రిప్లయితొలగించండిప్రేరణ గలిగెన్ పదములు వీడక నన్నీ
తీరున తికమక పెట్టగ
పూరణఁ జేయంగఁ బలుకుఁబోఁడికిఁ దరమే!!
హమ్మయ్య! దేవుని దయతో మీ అందరి అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులతో శతక రచన పూర్తి అయింది. అందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఏకదిన శతక లేఖన
మీ కరణిం బూర్తి చేసి తిది యెల్ల కృపా
సాకల్యమూర్తి శ్రీహరి
ప్రాకటముగ నాకు దోడుపడుటం గాదే!
అభినందన మందారమాల గురువర్యా!"ఏకదిన శతకశేఖర" బిరుదు అందుకోండి!నమస్సులు!!
తొలగించండివర దాయకుడా హరి కరి
తొలగించండివరదుని వరముగ వరలును వరదా శతకమ్
సరగున నొక్క దినమ్మున
పరుగిడె శంకరుల కలము ప్రతిభా ప్రభలన్
శుభాభివందనములు 🙏
తొలగించండివ్రాసితి నా శ్రీ హరియే
రాసిగ తోడ్పడ పదముల రాశుల తో వా
రాశిగ శతకము నొక్కటి
వాసిగ సిగకొప్పునమర ప్రజ-పద్యమునన్
సెబాసో
శుభాకాంక్షలతో
జిలేబి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిరంగని శతకము వ్రాయఁగ
తొలగించండిలింగడు తలపెట్టినంత ప్రేరణ కొదువే?
భృంగము తేనియ నిడు సా
రంగమును నుతిoచ నెంచ రాగము కొదువే?
నా ప్రయత్నం : ( స్వానుభవం)
రిప్లయితొలగించండికందం
నూరు దినాల వయస్సున
మారాముగ పలకరించు మామనుమనివౌ
కేరింతల కర్థమ్మునుఁ
బూరణ జేయంగ పలుకు బోడికిఁ దరమే?
ఉత్పలమాల
నూరు దినాల ప్రాయమున నున్నటి బుగ్గల పట్టిపట్టికై
దారిక రామ కీర్తననుఁ దన్మయమొందుచు పాడుచుండ సిం
గారము మీర రాగముల కైవడి కేకల నవ్వుకర్థమున్
బూరణఁ జేయఁగాఁ బలుకుఁబోఁడికి బ్రహ్మకునైన సాధ్యమే?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి