సందర్భము: పడమటి వంగ దేశము= పశ్చిమ బెంగాల్ రామకృష్ణ = శ్రీ రామకృష్ణ పరమహంస
పశ్చిమ బెంగాల్ లోని కామార్పుకూర్ లో ఫిబ్రవరి 1836 న జన్మించాడు. 19 వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఆయన ప్రభావం చాలా వుంది. ఒక్క తూర్పున కేమి? ఆ మహానుభావుని తాత్విక బోధల కిరణము లన్ని దిక్కులకూ విస్తరించినవి.. ఒక్క ప్రాగ్దిశకే అని యనరాదు. అన్ని మతాలలోను, అన్ని రకాల సాధనలలోను చివరకు చేరుకోగలిగేది ఒకే దేవుణ్ణి.. అని ఆయన స్వయంగా వివిధ మతాల సాధనలు చేసి అనుభవ పూర్వకంగా నిరూపించాడు. ఆవిధంగా వేరే మతాల వా ళ్ళెవరూ నిరూపించటానికి పూనుకోలేదు. నిరూపించనూ లేదు. అదీ విశేషం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ పడమటి వంగ దేశ మది పావన మాయెను.. రామకృష్ణ సూ ర్యు డుదయ మందఁ దాత్త్విక మ యూఖము దిక్కుల కెల్లఁ బ్రాకె.. "దే వు డొకడె" యన్న సత్య మది బుద్ధికిఁ దోచె.. ననంగ రా దిటుల్.. "పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 31.7.19 -----------------------------------------------------------
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిదడదడ బుట్టి లేటుగను దబ్బున లేవగ క్షౌరకర్మకున్
విడిచిన నద్దమంతటను విందుగ కూర్పుచు తూర్పుదిక్కునన్
తడబడి గీకి గడ్డమును తన్మయ మొందుచు చూచుచుండగా
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిఅద్దంలో ప్రభాకరుడు.... చక్కని పూరణతో శుభారంభం చేసారు. అభినందనలు.
🙏
తొలగించండి* తూర్పు దిక్కుకున్
తొలగించండిపుడమే దిశ తిరుగు ననుచు
రిప్లయితొలగించండినడగగ భయపడుచు చెప్పె నతడీ విధిగా
తడబడుచును పొరబడుచును
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్.
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పుడమి + ఏ' అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ "పుడమియె దిశ..." అనండి.
తొలగించండిగడగడ వణికెడు దేశము
రిప్లయితొలగించండినడయాడి తుదకు జేరె యాతన బడుచున్
కడకిక నోర్వక విరహము
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం, యతిదోషం. సవరించండి.
రిప్లయితొలగించండిగడగడ సాగెను చంద్రుడు
పడమట, నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
విడువక వెనువెంట సుమా
చెడుగుడు లాట యిది మదియు చింతన చేయన్ !
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వడయారొకండు వదరెను
రిప్లయితొలగించండిపడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
పడమటి దేశంబుననిది,
పడమట బోవంగనెంచి భారతమందున్!!
గంగాప్రసాద్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
అడుగిడితిఁనమెరికాలో
రిప్లయితొలగించండికడు వేసటజెంది కొమరు కాపురముఁగనన్
గడచెనురేయి మరుదినము
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పడమట దేశమందుతన బాలకు గాంచగఁ నేగివేకువన్
రిప్లయితొలగించండితడబడి నిద్ర లేవగనె తక్కుతు తారుతు జేరె బాల్కనీ
విడివడె బద్ధకమ్మతడు వింతగ జూడఁగఁనాకసమ్ముపై
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్.
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
బుడు గొక్కడు చదువుటకై
రిప్లయితొలగించండిబడి జేరగ దిశలపేర్లు పంతులు నేర్పెన్
తడబడి వాడనె చూడుడు
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుడియెడమగు మంత్రమునే
రిప్లయితొలగించండిగడగడఁ మాంత్రికుడు చదువ గడబిడ జరిగెన్
నడచిరి మనుజులు వెనుకకు
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
వడివడి తిరుగును శుక్రుడు
రిప్లయితొలగించండిపుడమికి పెడదెశనుదాను బోల్చుచు జూడన్
నడుగుడి జూడగ దోచెను
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేగెన్
(నవగ్రహాలలో ఒక్క శుక్రుని భ్రమణం మటుకు ఇతర గ్రహాలకు భిన్నంగా తూర్పు నుండి పడమటకు వుంటుంది)
ద్వారకానాథ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండివడివడి పైకి సాగుచు ప్రభాకరు డేతను క్రుంగె నీదెసన్
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
వడివడి యా దెసన్! సరసి! వాస్తవ మేది? దెసల్ జనాళికై
గడబిడ లేక యుండుటకు గట్టిగ కూర్చిన దిక్కులే గదా
పడమట యన్న నేమి ? మరి ప్రాగ్దిశ యన్నయదేమి?భ్రాంతి యే! :)
జిలేబి
జిలేబి
రిప్లయితొలగించండిఅడడా! జిలేబి మగడా!
గుడుంబ త్రాగితివకో? మగోడా! యెట్టె
ట్ట!డబడబయే యెచటరా
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్?
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పడమటి దేశపు సూర్యుడు
రిప్లయితొలగించండిమడమను త్రిప్పుటనెఱఁగని మార్టిన్ లూథర్
కడతేర;విబుధులిట్లనె
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
కృష్ణ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విబుధు లని రిటు' అనండి.
పడమటి దేశము నందున
రిప్లయితొలగించండియొడలొప్పని కారణమున నుద్యో గంబున్
విడిచి తిరుగు పయనమవగ
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
తరణి=ఓడ. ; ఉదయించు= ఆరంభించు
సవరించిన పూరణ
రిప్లయితొలగించండి--------------
గడగడ వణికెడు దేశము
నడయాడి తుదకు జేరె నవలో కమటన్
కడకిక నోర్వక విరహము
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
High School Exhibition:
పడమట నుండి తూర్పునకు వాసిగ దొర్లగ భూమి గోళమే
పడమట నస్తమించి రవి భళ్ళున లేచును తూర్పు దిక్కునన్;...
రెడి! యని చెప్పి బాలుడట త్రిప్పగ గ్లోబును వక్ర రీతినిన్
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
భూగోళములో:
తొలగించండిపడమట = So-called Western Hemisphere
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెడసర మునకవి ,కవితన |
రిప్లయితొలగించండిబిడియము లేకను వదరెను, బెదరగ ప్రాజ్ఞుల్ |
తడకల, తప్పుడు వ్యాఖ్యల |
"పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్"
మరొక ప్రయత్నం
రిప్లయితొలగించండిఅడుగిడి జాబిలి గెలిచిరి
విడువరు దననైనయనుచు బిత్తరపడుచున్
తడబడి దిశలను మరచుచు
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేగెన్
శ్రీ గురుభ్యోన్నమః🙏 శుభోదయం🙏
రిప్లయితొలగించండిఅడుగున బడ మన విభవము
తడబడ మన నాగరికత, తట్టి నిలుపగన్
వడివడి నడుగుల మోడీ
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేగెన్.
మైలవరపు వారి పూరణలు
రిప్లయితొలగించండిసడి జేయని విటులకు., స...
వ్వడి వలదను వేశ్యలకును బాసట యయి తా
వడి దోషాకరుడుడుగగ
పడమట.., నుదయించి తరణి ప్రాగ్దిశకేగెన్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
*******
కడప ను వీడి., వారమెరికా జనిరా నవదంపతుల్., ముదం..
బిడ గని పుత్రునొక్కని., రవీ.! యని బిల్చిరి., ,వాడు మెచ్చుచున్
వడి మన ధర్మపద్ధతిని భారతభూమికి జేరనెంచగా
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్.!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిడిచి భరతావని యొకఁడు
రిప్లయితొలగించండివెడలెను సింహపురమునకు, వేయేల, భళీ
తడబడని వాని కథ యిది
"పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్"
పొడమిన సూర్యుడు మునిగెను
రిప్లయితొలగించండిపడమర.....నుదయించితరణి ప్రాగ్దిశ కేగెన్
జడముల చైతన్య పరచి
పడమిని కాంతులను నింపి ముదమును గూర్పన్
నాలుగో పాదం మొధట పుడమి అని సవరణ చేయడమైనది
తొలగించండిగడబిడ జేయక పాఠము
రిప్లయితొలగించండివడివడిగా జెప్పుమనగ పండిత సుతునిన్
తడబాటుగ నిటుల బలికె
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
*ముంబై లో పుట్టి పెరిగిన రవికి అక్కడ జరుగుబాటు లేక వైజాగుకు వలస వెళ్ళినాడని యూహించిన పద్యము*
రిప్లయితొలగించండివెడలక తప్పదయ్యె నిక వేతన మందని కొల్వుతో యిటన్
గడుచుట కష్టమయ్యె నని గాదిలి పిల్లల తోడ బాధతో
పిడికెడు కూటికై వలస వెళ్ళెడు వానిని గాంచి పల్కిరే
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
గాదిలి= భార్య
కందం
రిప్లయితొలగించండిపొడముచు శంకర 'రవి' కా
లడిఁ గంచికిఁ జేరె మతము రక్షించుటకై
వడిగన్, దక్షిణ ప్రాంతపు
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
చంపకమాల
పొడముచు శంకరార్యులిల పూషుడు నౌచు మతమ్ము నిల్ప కా
లడి పురమందునన్ మెరసి రంజిల జేయుచు వాజ్ఞ్మయమ్మునే
వడి వడి దేశమున్ దిరిగి వచ్చెను కంచికి, దక్షిణమ్ముదౌ
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ
సాగె ముందుకున్
సందర్భము:
పడమటి వంగ దేశము= పశ్చిమ బెంగాల్
రామకృష్ణ = శ్రీ రామకృష్ణ పరమహంస
పశ్చిమ బెంగాల్ లోని కామార్పుకూర్ లో ఫిబ్రవరి 1836 న జన్మించాడు. 19 వ శతాబ్దపు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఆయన ప్రభావం చాలా వుంది.
ఒక్క తూర్పున కేమి? ఆ మహానుభావుని తాత్విక బోధల కిరణము లన్ని దిక్కులకూ విస్తరించినవి.. ఒక్క ప్రాగ్దిశకే అని యనరాదు.
అన్ని మతాలలోను, అన్ని రకాల సాధనలలోను చివరకు చేరుకోగలిగేది ఒకే దేవుణ్ణి.. అని ఆయన స్వయంగా వివిధ మతాల సాధనలు చేసి అనుభవ పూర్వకంగా
నిరూపించాడు.
ఆవిధంగా వేరే మతాల వా ళ్ళెవరూ నిరూపించటానికి పూనుకోలేదు. నిరూపించనూ లేదు. అదీ విశేషం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
పడమటి వంగ దేశ మది
పావన మాయెను.. రామకృష్ణ సూ
ర్యు డుదయ మందఁ దాత్త్విక మ
యూఖము దిక్కుల కెల్లఁ బ్రాకె.. "దే
వు డొకడె" యన్న సత్య మది
బుద్ధికిఁ దోచె.. ననంగ రా దిటుల్..
"పడమట నుద్భవించి రవి
ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్"
✒~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
31.7.19
-----------------------------------------------------------
పడమట రవియుదయించడు
రిప్లయితొలగించండికుడియెడమగనిడితిరిచట కుశలత లేమిన్
గడబిడ జేసెనునీయది
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశకేగెన్
వడివడి జన సందోహము
రిప్లయితొలగించండివిడివిడిగా నుత్సహించి వేగమ యెక్కన్
సుడు లడరు కడలిని నడరి
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
[తరణి = ఓడ]
గడగడ లాడు లోకములు గాఁకవెలుంగు సరోష చిత్తుఁడై
విడిచిన నిత్య కృత్య మగు విన్ను ప్రయాణము కేళి కేనియుం
దడఁబడ కుండ నెప్పటి విధమ్మున సప్త రథుండు వెల్గుచుం
బడమట, నుద్భవించి రవి ప్రాగ్దిశఁ, జేరఁగ సాగె ముందుకున్
అద్భుతమైన విరుపు!!!
తొలగించండి🙏
ధన్యవాదములండి. సమస్యాపాదమే పరిష్కార సూచక మైనది.
తొలగించండికించిద్విరామ సంజ్ఞా ద్వయ పరిష్కృతంబ.
వెడలెను జీవితంబున నవే ధనరాసులు వచ్చునంచు నా
రిప్లయితొలగించండిపడమటి దేశమున్ మరచె భాషను; రాశులకన్న మిన్న నా
పుడమిగదా మహోన్నతమె పుత్రుడు పల్కె హితమ్మునింక నా
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
పడమట నస్తమించు రవి బంగరు సంజెల వన్నె జూపగన్
రిప్లయితొలగించండివడివడిగానె యంత్రమును వారలు దెచ్చిరి గాని జూడగా
తడబడి వెన్క ముందుగ ప్రదర్శితమై లఘు చిత్రమందునన్
పడమట నుద్భవించి రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
పడమరదేశమందుననుభానుసమానుడు రామకృష్ణుడున్
రిప్లయితొలగించండిబుడమిని జన్మనొందిదగుబోడిమితోడను హైందవాళికిన్
దడబడకుండబోధనలుదానుగజేయునిమిత్తమైదగన్
బడమట నుద్భవించిరవిప్రాగ్దిశజేరగసాగెముందుకున్
వడిఁగల చంద్రయానమును బంపిన భీతిలి చంద్రుడయ్యెడన్
రిప్లయితొలగించండిదడబడి శత్రుశంకఁ గొని దాగెను తూరుపుకొండమాటు ,నా
తడవునఁ, దావులేమిఁ గని, తా దిశ మార్చియు, పశ్చిమాద్రిపై
పడమట నుద్భవించి రవి, ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
వెడలగ పరదేశము కన
పడినవి దిశలన్ని నాకు వ్యతిరేకముగా
తడబడి పరికించంగన్
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశకేగెన్.
పిన్నక నాగేశ్వరరావు.
రిప్లయితొలగించండివెడలగ పరదేశము కన
పడినవి దిశలన్ని నాకు వ్యతిరేకముగా
తడబడి పరికించంగన్
పడమట నుదయించి తరణి ప్రాగ్దిశకేగెన్.
వడివడి నేగుచుంటి తెలవారక మున్నె గృహమ్ము జేరగం
రిప్లయితొలగించండిదడయక స్నానమాడి పొరి దవ్వుననున్న తటాకమందునన్
దడదడ వానజల్లు పడె దాపున నాగితి పోసె మేఘముల్
పడమట నుద్భవించి, రవి ప్రాగ్దిశఁ జేరఁగ సాగె ముందుకున్.
రిప్లయితొలగించండివడిగా శరధిని దాటుచు
పడమట, నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
పడమటి దేశములందు న
పుడమియు దీనిని గనుచును పులకించనెదన్.
మరొక పూరణ
వెడలెను గనుమా సంజను
పడమట, నుదయించి తరణి ప్రాగ్దిశ కేఁగెన్
తడయక మరు రోజుదయము
జడివానైననరు దెంచు జవమును తానున్.