G P Sastry (gps1943@yahoo.com)నవంబర్ 12, 2018 12:02 PM
ఆటవిడుపు సరదా పూరణ: (జిలేబి గారికి అంకితం)
ఆ ఘన చంద్ర శేఖరుడు హాయిని సంఖ్యలు కూడుచుండగా శ్లాఘము చేయుచున్ కవిత శస్త్రము లస్త్రము లెక్కుపెట్టుచున్ లాఘవ రీతినెన్నికలు లాగగ ముందుకు ముక్కుపట్టుచున్ మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
*మేఘమనే నాటకము మేఘుడనే కవి ఇతివృత్తాన్ని అదేపేరుతో నాటకంగా మలచి కార్తిక అనే యువతి తన తండ్రి రాఘవ జ్ఞాపకార్థం నిర్వహించిన నాటకోత్సవాలలో తొలుదోల్త ప్రదర్శింపబడి ప్రశంసల నందుకొన్నదనే భావంతో .....*
రాఘవ కన్నకూతురొక రాష్ట్ర సదస్సును నిర్వహింప నె న్నో ఘన మైన నాటకము లుత్సుకతన్ గన బర్చనేమి యా మేఘుడు వ్రాసినట్టి కృతి మిన్నయటంచును కీర్తి నొందుచున్ మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికంబనన్
సందర్భము: మాహిష్మతీ పురం రాజధానిగా పాలించే చంద్రవంశ ప్రభువు సోమదత్తుడు శత్రువు లంతా కుమ్మక్కై దండెత్తిరాగా యుద్ధములో కొడుకులు మృతినొందగా ఓడిపోయి కట్టుబట్టలతో భార్యతో అడవులు పట్టినాడు. రాణి దేవిక ఎంతో ఊరడించి గర్గ మహాముని ఆశ్రమానికి చేర్చింది. ఐదు నెలలు గడువగా క్రమంగా రాజు పాక్షికంగా కుంటి మూగ చెవిటి తనముల పొందినాడు. గర్గుడు శరణాగతుడైన రాజుకు సమస్త విద్యలకు సారభూతమైన హనుమత్ పంచవక్త్ర విద్య నుపదేశించి వ్రత విధానమును కూడా చెప్పెను. రాజు భక్తి శ్రద్ధలతో నాచరించెను. హనుమదనుగ్రహంతో ఖడ్గ సిద్ధి నంది ఒక్క పూటలోనే అవలీలగా శత్రువుల నెల్ల జయించి సంపూ ర్ణారోగ్యవంతుడై మార్గశీర్షమందు తిరిగి రాజైనాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సోమవంశ భవుండు సోమదత్త విభుండు ప్రత్యర్థు లోడింప రాణిగూడి గర్గ మహాముని ఘన కుటీరము జేరె దయ నీదు పంచ వక్త్ర మను విద్య ముని యుపదేశించె, ఘన వ్రత విధి జెప్పె.. భక్తితో శ్రద్ధతో ప్రభువు చేసె.. చెలగి నీ దయ ఖడ్గ సిద్ధి నంది జయించె నలవోకగా శత్రుబలము నెల్ల హనుమ! నీదు కరుణ నతడు రా జాయెను మార్గశీర్షమందు.. మాఘ మలరె నా వీభీషణ సుతుడైన నీలుని రక్ష ణంబు నీ వొనర్ప సంబరమున
✒~డా.వెలుదండ సత్యనారాయణ 11.7.19 -----------------------------------------------------------
సందర్భము: విభీషణుడు లంకకు రాజైన తర్వాత అతని కొడుకు నీలుడు మనవద్ద చింతామణి కామధేనువు కల్పవృక్షం లేవు. స్వర్గానికి దండెత్తివెళ్ళి తెస్తా నన్నాడు. రాముని సన్నిధి నాకు చాలని విభీషణుడు ముందుగా గురువుల సేవించు మన్నాడు. నీలుడు శుక్రాచార్యుని పన్నెండేండ్లు శ్రద్ధతో సేవించినాడు. గురువు సకల విద్యలకు రాణివంటి హనుమత్ పంచవక్త్ర విద్య నుపదేశించి వ్రత విధానంకూడా వివరించినాడు. నీలుడు భక్తిమీర అనుష్ఠించగా హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. కోరికలు తీరు నన్నాడు. అంతేగాక దేవ కన్య వనసుందరి భార్య ఔతుం దన్నాడు. కోరకున్నా బ్రహ్మ దేవుడు వచ్చి వరా లిస్తా డన్నాడు. నీలుడు ఘోర యుద్ధంలో దేవేంద్రుని ఓడించి చంపబోగా బ్రహ్మ ప్రత్యక్షమై సంధి చేసి నీలుని కడిగిన విప్పించినాడు. అత్రి మహర్షి కన్నులనుండి వెలువడిన దివ్య తేజస్సు నుండి పుట్టిన వనసుందరిని చేపట్టు మన్నాడు. పురుషోత్తమ (పూరీ) క్షేత్రమున జగన్నాథ ప్రియుడవై వనసుందరీ సమేతుడవై సేవింపబడుదు వన్నాడు. ఆ క్షేత్రము నీ పేరున నీలాద్రి యని పిలువబడుతుం దన్నాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ "కనగ చింతామణి కామధేనువు కల్ప కమ్ముల దెత్తు నాకమ్ము గెలిచి" యనుచు నీలుడు తండ్రి యనుమతి శుక్రుని జేరి పన్నెండేండ్లు సేవ జేసె.. నల పంచవక్త్రాల హనుమంతు మంత్రంబు వ్రతవిధుల్ నీయవి వాని కొసగె గురుడు.. నాత డొనర్చె గురుభక్తి.. నీవు క న్పించి జయము గూర్చి మించినావు హనుమ! మాఘమందు నా విభీషణ సుతుం డిపుడు సిద్ధినందె నిటుల.. నపుడు నరుల మద మడంచె నా సోమదత్తుండు మార్గశీర్షమందు.. మాఘ మలరె..
✒~డా.వెలుదండ సత్యనారాయణ 11.7.19 -----------------------------------------------------------
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిశ్లాఘము చేసి కాంగ్రెసులు లాఘవ మొప్పుచు రాజ్యమీయగా
రాఘవ రాముడై వెలిగి రాహులు పోవగ కానలందునన్
మేఘములన్నియున్ తొలగి మీనము మేషము తల్లడిల్లగా
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
తొలగించండిపాత పూరణ:
G P Sastry (gps1943@yahoo.com)నవంబర్ 12, 2018 12:02 PM
ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
ఆ ఘన చంద్ర శేఖరుడు హాయిని సంఖ్యలు కూడుచుండగా
శ్లాఘము చేయుచున్ కవిత శస్త్రము లస్త్రము లెక్కుపెట్టుచున్
లాఘవ రీతినెన్నికలు లాగగ ముందుకు ముక్కుపట్టుచున్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
కామేశ్వర రావు పోచిరాజునవంబర్ 12, 2018 12:16 PM
తొలగించండిఅలవోకగా ముత్యాల్లా వృత్తాలు జాఱు వాఱు చున్నవి!
నిజమే కదా!
తొలగించండిమీ దయ...అభిమానము!
తొలగించండి🙏
రిప్లయితొలగించండినీటి రిక్క నెలని నీళ్లు లేవు జిలేబి
మార్గశీర్షమందు మాఘ మలరె!
చూడ చూడ బతుకు చూర్ణమగుచుపోయె
విశ్వదాభిరమణి వినవె భామ!
జిలేబి
పాత పూరణ:
తొలగించండిZilebiనవంబర్ 12, 2018 10:14 AM
ప్రకామాఘము -
ప్రకామ -అధిక
అఘ - దుఃఖము
ప్రకామాఘము - అధికమైన దుఃఖము
ఋతువులు మారి పోతే దుఃఖదాయకమే
అలాంటి అధికమైన దుఃఖము సంక్రమించినది
దు
జాఘనిరాయుడంట మన జానకి మాతను గాంచె లంకలో!
మా ఘన సార్వ భౌమ! వినుమా!అనుమానమదేల సీతయే
రాఘవ! రావణాసురుని రచ్చకుదీయుచు చంపుమీ! ప్రకా
మాఘము సంక్రమించినది మార్గ శిరంబునఁ గార్తికం బనన్!
జిలేబి
ప్రత్యుత్తరం
కంది శంకరయ్యనవంబర్ 12, 2018 11:07 AM
జిలేబీ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిజిలేబి రాసిందేనా ! వావ్! వావ్!
వృత్తానికి పొద్దిటి నుండి ఐడియా తట్టక పోతే ఏంచేసేదని ఆలోచిస్తా వుంటిని !
హమ్మయ్య !
అల్రెడీ బుర్ర చించేసుకున్నా ంంం
నన్న మాట !
చీర్స్ టు జీపీయెస్ వారు !
జిలేబి
మాఘ మాసమందు మరదలితో పెండ్లి
రిప్లయితొలగించండిసేతు మంచు వార్త చేర వేయ
మనసు పడిన మగువ మనువాడి తావచ్చె
మార్ఘ శీర్ష మందు మాఘ మలరె.
(మాఘమహాకవి శిశుపాలవధమనే సంస్కృతనాటకాన్నిఉగాదినాడు
రిప్లయితొలగించండిమొదలుపెట్టి నవరసబంధురంగా నవమాసాలలో ముగించాడు)
సిద్ధమయ్యె వ్రాయ "శిశుపాలవధము" నే
మాఘకవి యుగాది మహితదినము;
నాటకరచనమ్ము నవమాసముల కయ్యె;
మార్గశీర్ష మందు "మాఘ" మలరె!
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిమాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్ !!
కార్తీకము.. మాఘము.. హీనమాసములుగా వచ్చిన సంవత్సరం..
శ్లాఘనొనర్ప జ్యోతిషవిశారదులెల్ల గణించియున్ మహా...
మోఘముగా వచించిరి " యపూర్వము మాసయుగమ్ము హీనమై
రాఘవ ! వచ్చు గాంచుమన రాగల వర్షము" , ఫాల్గుణమ్మునన్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్ !
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
పంటలన్నికృషికు నింటి కేతెంచును
రిప్లయితొలగించండిమార్గశీర్షమందు, మాఘ మలరె
నదుల స్నానములను ముదముతో చేయుచు
దానములను చేసి తనియ ప్రజలు
చలికి వణికు చుండి చక్కని కన్నెలు
రిప్లయితొలగించండిరంగ వల్లు లందు రంగు లద్ది
కొత్త యల్లు డొచ్చె యత్తవా రింటికి
మార్గ శీర్ష మందు మాఘ మలరె
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండిపనుల నెన్ని జేయ పస్తులు నీవాయె
పథము మారు టెట్లు పరమ పురుష
మధుర కవుల కెపుడు మాడుటే మార్గమై
మార్గశీర్షమందు మాఘ మలరె!
డా. పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండిమీన,మేషములను మేల్మిని గణుతించి
జయము గొనగ వేగ జరిపె నికష
దొడ్డ గెలుపు లమర దొరయయ్యె కేసియార్
మార్గశీర్శమందు మాఘ మలరె!
డా.పిట్టా సత్యనారాయణ
రిప్లయితొలగించండియీ ఘనమైన తారలు(27నక్షత్రాలు)ను నెక్కువగా నగు మాస పంక్తులున్(అధిక మాసములు)
మేఘము కార్తులన్ గనదు మేదిని వర్షము లేవి? నోజొను
న్నాఘము చిల్లులన్ బొడిమె శీలము దప్పగ మానవాళికిన్
మాఘము సంక్రమించినది మార్గశిరంబున కార్తికంబునన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిసేద్య ఫలితమంత చెన్నుగా నమరును
మార్గశీర్షమందు; మాఘ మలరె
దైవ పూజ లెంచు దాసులతో నిల
మానికములె రెండు మాసములవి.
వలపు లతిశయింప భరియింప కష్టమ
రిప్లయితొలగించండిరెండు నెలల ముందె పెండిలయ్యె
మరులు తోడ మెలగి వరలెడు జంటకు
మార్గశీర్ష మందు మాఘ మలరె
మొదటి పాదం చివర కష్టమై అని సవరణ చేయడమైనది౮
తొలగించండివిష్ణు లోక ద్వార వీక్షణ భాగ్యమౌ
రిప్లయితొలగించండిమార్గశీర్షమందు; మాఘ మలరె
జలధి స్నాన విధుల సత్పుణ్య భాగ్యమై
విష్ణు లోక ప్రాప్తి విశదమగుచు
మార్గశీర్షమందుమాఘమలరె,కాదు
రిప్లయితొలగించండిపుష్యమాసమలరుపోడిమగను
మాఘమదియవచ్చుఫాల్గుణమునకుముం
దుగనునిదియ వరుస తోయజాక్షి!
లక్స్మీదేవి పతి విసర్జన పాపము కలి కాలమున వికసించి వేంకటనాథుని ప్రసాదించిన దన్న భావము.
రిప్లయితొలగించండికోప మూని తపసి ఘోరముగా వక్ష
మందు విష్ణుఁ దన్నె నక్కజముగ
మాత లక్ష్మి చనెను మౌని భృగువు దన్న
మార్గశీర్షమందు మాఘ మలరె
[మార్గశీర్షము = మార్గశిరము మాసముగా కలది, సంవత్సరము;
మా +అఘము =మాఘము; లక్ష్మీ దేవి పాపము]
మాఘము నందు మున్పు దమి మాటల వేడితి నేఁడు దారిలో
శ్లాఘము సేయ మిత్రవరుఁ జక్కఁగ నీయఁగ నర్థ గుంభ నా
మోఘము కావ్య రాజము నపూర్వము నా కట మాస మేమనన్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
[మాఘము = మాఘుని కావ్యము, మార్గ శిరము = దారి చివర]
12/11/2018 నాటి పూరణములు:
తొలగించండిఓఘద సత్కథ మఱి యవ
దాఘము తీర్పంగ సముచితము నాకు మహా
మోఘమ్ము కావ్య రత్నము
మాఘము సంక్రమణ మయ్యె మార్గశిరమునన్
[ఓఘదము = ఉపదేశము నిచ్చునది, మాఘము = మాఘ విరచిత కావ్యము]
దాఘము ప్రేమకై వర వితానమునం దొనరంగ నగ్నికిన్
మోఘము కాక యుండగను మూరి ధరించఁగ భార్య సప్త ఋ
ష్యౌఘ సతీ మతల్లు లట శ్యామ యరుంధతి దక్కఁ దోఁచ భీ
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
[భీమ = అఘము = భీమాఘము: మహాపాపము; మార్గ శిరము = (బ్రతుకు) మార్గము యొక్క చివర; కార్తికము = షట్కృత్తికలకు (సప్తర్షుల భార్యలు) సంబంధించినది]
ఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
విరాట రాజు & Co:
దాఘము మీరగా ఘనులు దంభము తోడను సక్థి కొట్టగా
మేఘము లెన్నియో కురిసి మింటిని నేలను గబ్బుజేయగా
జాఘును లన్నియున్ ముడిచి జంబము తీరగ నిల్లుచేరగా
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికం బనన్
దాఘము = పిపాస
సక్థి = తొడ
జాఘుని = తోక
మాఘముసంక్రమించినదిమార్గశిరంబునగార్తికంబనన్
రిప్లయితొలగించండిమాఘముసంక్రమించునిలమాసముపుష్యముపూర్తియైనచో
మేఘములెన్నియోదిరిగిమిన్నునకార్తికమాసమందునన్
దాఘముదీర్చుగాబ్రజకుతద్దయువర్షమునిచ్చుచున్భువిన్
అత్యుక్తచ్ఛందము.
రిప్లయితొలగించండినాలుగు వృత్తము లుండును.
1. స్త్రీ. / శ్రీపెంపు.(గగ)వృత్తము.
రారే
లేరే
వీరుల్
వోరన్
2. రమా. (లగ) వృత్తము.
రమా
శ్రమా
ఘ మా
పుమా
3. స్వీయ కృత నూత్న వృత్తము.
రామ. (గల)
రామ
యేమి
మేము
లేమ
4. స్వీయకృత నూత్న వృత్తము.
రణము. (లల)
అని
నిను
మనఁ
గన
మార్గమందుభక్తిమార్గముశీర్షము
రిప్లయితొలగించండిమాఘమనగగూల్చునఘములెల్ల
భక్తిముక్తియోగశక్తిప్రదమ్ములు
మార్గశీర్షమందు మాఘమలరె
పెళ్లిచూపులయ్యె పెద్దల నుమతితో
రిప్లయితొలగించండిమార్గశీర్ష మందు ; మాఘ మలరె
శుభ ముహూర్త మంది శుభ పరిణయముకు
బంధుమిత్రులెల్ల పరవశింప
చక్రి పూజలంద చక్కగా సతితోడ
మార్గశీర్ష మందు మాఘ మలరె
కొత్త దంపతులట కూర్మిని పంచంగ
సంతసించి రెల్ల సంబరాన
మాధవుండు మెచ్చు మాసము లందున
మార్గశీర్ష మందు :మాఘ మలరె
శివము కూర్చు నట్టి శివరాత్రి తోడను
హరిహరులను గొలువ హర్ష మొదవు
*మాఘుడు అనే కవి వ్రాసిన మాఘము అనే కావ్యమును నాటకముగా వేయగా అదే ఉత్తమ నాటకంగా ప్రశంసింప బడినదనే భావంతో*
రిప్లయితొలగించండినాటకోత్సవాలు మేటిగా జరిగెను
కార్తికమ్ము వెడల ఖమ్మమందు
వాటి లోన గొప్ప నాటకమ్మొక్కట్టి
మార్ఘ శీర్షమందు మాఘమలరె.
*మేఘమనే నాటకము మేఘుడనే కవి ఇతివృత్తాన్ని అదేపేరుతో నాటకంగా మలచి కార్తిక అనే యువతి తన తండ్రి రాఘవ జ్ఞాపకార్థం నిర్వహించిన నాటకోత్సవాలలో తొలుదోల్త ప్రదర్శింపబడి ప్రశంసల నందుకొన్నదనే భావంతో .....*
రిప్లయితొలగించండిరాఘవ కన్నకూతురొక రాష్ట్ర సదస్సును నిర్వహింప నె
న్నో ఘన మైన నాటకము లుత్సుకతన్ గన బర్చనేమి యా
మేఘుడు వ్రాసినట్టి కృతి మిన్నయటంచును కీర్తి నొందుచున్
మాఘము సంక్రమించినది మార్గశిరంబునఁ గార్తికంబనన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
మార్గశీర్షమందు మాఘ మలరె
సందర్భము: మాహిష్మతీ పురం రాజధానిగా పాలించే చంద్రవంశ ప్రభువు సోమదత్తుడు శత్రువు లంతా కుమ్మక్కై దండెత్తిరాగా యుద్ధములో కొడుకులు మృతినొందగా ఓడిపోయి కట్టుబట్టలతో భార్యతో అడవులు పట్టినాడు. రాణి దేవిక ఎంతో ఊరడించి గర్గ మహాముని ఆశ్రమానికి చేర్చింది. ఐదు నెలలు గడువగా క్రమంగా రాజు పాక్షికంగా కుంటి మూగ చెవిటి తనముల పొందినాడు.
గర్గుడు శరణాగతుడైన రాజుకు సమస్త విద్యలకు సారభూతమైన హనుమత్ పంచవక్త్ర విద్య నుపదేశించి వ్రత విధానమును కూడా చెప్పెను. రాజు భక్తి శ్రద్ధలతో నాచరించెను. హనుమదనుగ్రహంతో ఖడ్గ సిద్ధి నంది ఒక్క పూటలోనే అవలీలగా శత్రువుల నెల్ల జయించి సంపూ ర్ణారోగ్యవంతుడై మార్గశీర్షమందు తిరిగి రాజైనాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సోమవంశ భవుండు సోమదత్త విభుండు
ప్రత్యర్థు లోడింప రాణిగూడి
గర్గ మహాముని ఘన కుటీరము జేరె
దయ నీదు పంచ వక్త్ర మను విద్య
ముని యుపదేశించె, ఘన వ్రత విధి జెప్పె..
భక్తితో శ్రద్ధతో ప్రభువు చేసె..
చెలగి నీ దయ ఖడ్గ సిద్ధి నంది జయించె
నలవోకగా శత్రుబలము నెల్ల
హనుమ! నీదు కరుణ నతడు రా జాయెను
మార్గశీర్షమందు.. మాఘ మలరె
నా వీభీషణ సుతుడైన నీలుని రక్ష
ణంబు నీ వొనర్ప సంబరమున
✒~డా.వెలుదండ సత్యనారాయణ
11.7.19
-----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
మార్గశీర్షమందు మాఘ మలరె
సందర్భము: విభీషణుడు లంకకు రాజైన తర్వాత అతని కొడుకు నీలుడు మనవద్ద చింతామణి కామధేనువు కల్పవృక్షం లేవు. స్వర్గానికి దండెత్తివెళ్ళి తెస్తా నన్నాడు. రాముని సన్నిధి నాకు చాలని విభీషణుడు ముందుగా గురువుల సేవించు మన్నాడు. నీలుడు శుక్రాచార్యుని పన్నెండేండ్లు శ్రద్ధతో సేవించినాడు. గురువు సకల విద్యలకు రాణివంటి హనుమత్ పంచవక్త్ర విద్య నుపదేశించి వ్రత విధానంకూడా వివరించినాడు. నీలుడు భక్తిమీర అనుష్ఠించగా హనుమంతుడు ప్రత్యక్షమైనాడు. కోరికలు తీరు నన్నాడు. అంతేగాక దేవ కన్య వనసుందరి భార్య ఔతుం దన్నాడు. కోరకున్నా బ్రహ్మ దేవుడు వచ్చి వరా లిస్తా డన్నాడు.
నీలుడు ఘోర యుద్ధంలో దేవేంద్రుని ఓడించి చంపబోగా బ్రహ్మ ప్రత్యక్షమై సంధి చేసి నీలుని కడిగిన విప్పించినాడు. అత్రి మహర్షి కన్నులనుండి వెలువడిన దివ్య తేజస్సు నుండి పుట్టిన వనసుందరిని చేపట్టు మన్నాడు. పురుషోత్తమ (పూరీ) క్షేత్రమున జగన్నాథ ప్రియుడవై వనసుందరీ సమేతుడవై సేవింపబడుదు వన్నాడు. ఆ క్షేత్రము నీ పేరున నీలాద్రి యని పిలువబడుతుం దన్నాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
"కనగ చింతామణి కామధేనువు కల్ప
కమ్ముల దెత్తు నాకమ్ము గెలిచి"
యనుచు నీలుడు తండ్రి యనుమతి శుక్రుని
జేరి పన్నెండేండ్లు సేవ జేసె..
నల పంచవక్త్రాల హనుమంతు మంత్రంబు
వ్రతవిధుల్ నీయవి వాని కొసగె
గురుడు.. నాత డొనర్చె గురుభక్తి.. నీవు క
న్పించి జయము గూర్చి మించినావు
హనుమ! మాఘమందు నా విభీషణ సుతుం
డిపుడు సిద్ధినందె నిటుల.. నపుడు
నరుల మద మడంచె నా సోమదత్తుండు
మార్గశీర్షమందు.. మాఘ మలరె..
✒~డా.వెలుదండ సత్యనారాయణ
11.7.19
-----------------------------------------------------------