గలగలమని దినము నంత గడపి నాము| అత్రి వరదుని దర్శన మందినాము| కనుల ముందు నేల కొరగి కరగి నావు| "శవమ లేచి రమ్ము సంతసమున" (ప్రముఖ రచయిత్రి k.b. Lakshmi గారు, నిన్న రాత్రి దివ్యలోకాల కెళ్లి పోయారు. అందరం, కలిసి అత్రి వరద రాజ స్వామి దర్శనం చేసుకున్నాం. తిరిగి వస్తుంటే, ట్రైన్ లో మా కళ్ళముందే )
కుసుమ గారూ, ఈ విషాదవార్త నాకు ఇంతకుముందే తెలిసింది. ఆమెకు పుణ్యలోకప్రాప్తికై భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ పద్యం బాగుంది. మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. రెండవ, మూడవ పాదాలలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ.....
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... శవమ లేచి రమ్ము సంతసమున
సందర్భము: లోకంలో తమకే యౌవనం రాబోతున్నట్టు తెగ సంబర పడిపోతూ వుంటారు యువతీ యువకులు. అంతకు మించిన సుఖం లేనట్టు భ్రాంతి జెందుతుంటారు. కాని తమకు తెలియకుండానే శైశవాన్ని కబళించిన కాలం యౌవనాన్ని కూడా కబళించివేయలేదా! ఆ తరువాత ముసలితనం రాదా! చిట్టచివరకు మృత్యువూ రాదా! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ సుఖముమీది భ్రాంతి సుడివడ "పొమ్ము..శై
శవమ!.. లేచి రమ్ము సంతసమున
యౌవనమ్మ!" యనెడు న ట్లాతురులయినన్
ముదిమి.. పిదప రాదె! ముప్పు రాదె!
✒~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 30.7.19 -----------------------------------------------------------
ప్రాతః కాలపు సరదా పూరణ:
రిప్లయితొలగించండిలవలేశమ్మును శాంతిలేదు కదరా లాభమ్ము రవ్వంతయున్
భవబంధమ్ములు త్రెంచలేనిది గదా
ప్రారబ్ధ కర్మంబునున్
కవిగా మారుచు తాపమొందితినహో కంగారు పుట్టంగ శై
శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై!
ప్రభాకర శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
🙏
తొలగించండిదినము లెన్నొ గడిచె దీనత్వ మందున
రిప్లయితొలగించండికనులు మోడ్చి నిదుర కదలి రాక
దార సుతులు తలచి తల్లడిల్లు చుండ
శవమ లేచి రమ్ము సంత సమున
అక్కయ్యా,
తొలగించండిపద్యం బాగుంది. కాని కొద్దిగా అన్వయలోపం ఉన్నట్టుంది. శవాన్నే రమ్మని పిలుస్తున్నారా?
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిఅర్జునుని అభ్యర్థన..
శివమౌ స్యందనమందు నీవు నిలువన్ , చెండాడెదన్ వైరులన్.,
స్తవమున్ జేయుచు కోరుచుంటి నిగమజ్ఞానస్వరూపా ! హరీ.!
నవనీలాంబుదదేహకాంతివిలసన్నారాయణా.! శౌరి.! కే....
శవ.! మా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై.!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది.
తొలగించండిగలగలమని దినము నంత గడపి నాము|
రిప్లయితొలగించండిఅత్రి వరదుని దర్శన మందినాము|
కనుల ముందు నేల కొరగి కరగి నావు|
"శవమ లేచి రమ్ము సంతసమున"
(ప్రముఖ రచయిత్రి k.b. Lakshmi గారు, నిన్న రాత్రి దివ్యలోకాల కెళ్లి పోయారు. అందరం, కలిసి అత్రి వరద రాజ స్వామి దర్శనం చేసుకున్నాం. తిరిగి వస్తుంటే, ట్రైన్ లో మా కళ్ళముందే )
కుసుమ గారూ,
తొలగించండిఈ విషాదవార్త నాకు ఇంతకుముందే తెలిసింది. ఆమెకు పుణ్యలోకప్రాప్తికై భగవంతుని ప్రార్థిస్తున్నాను.
మీ పద్యం బాగుంది. మొదటి, మూడవ పాదాలలో యతి తప్పింది. రెండవ, మూడవ పాదాలలో గణదోషం. మీ పద్యానికి నా సవరణ.....
గలగలమని దినము గడిపినామంతట
అత్రి వరదుని కృప నందినాము
కనుల ముందె యొరిగి కరిగినా వయ్యయో
శవమ! లేచి రమ్ము సంతసమున.
ఐంద్రజాలికుడట ననుచరుని వధించి
రిప్లయితొలగించండిపైన గుడ్డ కప్పె ప్రజల ముందె
శవమ లేచి రమ్ము సంత సమున యంచు
వాసిగాను పిలవ వాడు లేచె.
విరించి గారూ,
తొలగించండిమీ ఐంద్రజాలిక పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅవనిన్ దుర్జనదుష్కృతప్రకటదుర్వ్యాపార మేపార నే
రిప్లయితొలగించండినవతారమ్ము ధరింతు నంచు భగవన్! వ్యాక్రుచ్చి రావేలనో?
వ్యవధానంబిక చేయబోకు ఖలనిర్యాణమ్ముఁ జేకూర్చ, కే
శవ! మా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై.
రామాచార్య గారూ,
తొలగించండిమీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
'శివము' వాని మిత్రు డవతలి గదిలోన
రిప్లయితొలగించండిచేరి నిద్రనుండ జీరదలచి
పలికె నిట్టు లొకడు పలుకులు తడబడ
'శవమ' లేచి రమ్ము సంతసమున.
సత్యనారాయణ మూర్తి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండితెలుగు పద్యమందు తీయదనమదేమొ
తెలుగు వెలుగు నందు దెలిసె నాకు
కంది వారి ప్రశ్న ఘనముగా మెరవఁ నా
శవమ లేచి రమ్ము సంతసమున!
యజ్ఞేశ్ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'మెరవ' తరువాత ఖండబిందువు అవసరం లేదు.
జననమరణమనెడుచక్రములోఁజిక్కి
రిప్లయితొలగించండిమరలమరలజననమందినావు
నేడుకలిగెముక్తి నీకిక, కాటికి
శవమ లేచి రమ్ము సంతసమున
ఫణీంద్ర గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవని యేను మేలు! హర్మ్యములు గలవు!
వల్లకాడు చూడ వసతి లేని
తలము! పోవ నేల? తట్టని చట్టని
శవమ లేచి రమ్ము సంతసమున!
జిలేబి
జిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
నదులు యెండి పోయె నాలుకలారిపోయె
రిప్లయితొలగించండిశవమ లేచి రమ్ము సంతసమున"
నీవె జనుల యుసురు నిలుపగలవు గాన
భూమి నుండి పైకి బొర్లు మమ్మ
సీతారామయ్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'నదులు + ఎండి' అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. మొదటి పాదం చివర గణదోషం. "నదులె యెండిపోయె నాలుక లారెను" అనండి.
🙏🏽 ధన్యవాదములు
తొలగించండిఅవమా నంబుల నెన్నిదా టితివొ నాకంబం దునన్ హాయిగా
రిప్లయితొలగించండిస్తవనీ యంబగు జీవనం బునను ప్రాశస్త్యం బుగాతోచినన్
కవనం బల్లుచు కీర్తికా ముకుడ వైకావ్యం బులేవ్రా యగన్
శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్య శశ్శాలివై
అక్కయ్యా,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
dhanya vaadamulu
తొలగించండి(ఉందో లేదోస్వర్గం నాపుణ్యం నాకిచ్చెయ్!
రిప్లయితొలగించండిసర్వస్ అర్పిస్తా నా బాల్యం నాకిచ్చెయ్!!... అన్న గజల్ మత్లాకు పద్యానువాదం..)
భవుడా! స్వర్గము యున్నదెంత నిజమో?భస్మాంగ!విశ్వేశ్వరా!
శివ! నాపుణ్యము నాకునిమ్ము యభవా!శ్రీకంఠ!నాసర్వమున్
లవమంతైనను లేక చేకొనుచు బాల్యమ్మిమ్మ, చిన్నారి శై
శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'స్వర్గము + ఉన్న, ఇమ్ము + అభవా' అన్నపుడు సంధి నిత్యం. "స్వర్గము గల్గుటెంత... నా కొసంగు మభవా..." అనండి.
🙏
తొలగించండిబ్రతికినన్ని నాళ్లు భారమంచు దలచి
రిప్లయితొలగించండితల్లి దండ్రి యెడల దయయు లేక
కర్మ కాండ లెంతొ ఘనముగా జేయునో
శవమ లేచి రమ్ము సంతసమున
సూర్య గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
శవమ లేచి రమ్ము సంతసమున
సందర్భము: లోకంలో తమకే యౌవనం రాబోతున్నట్టు తెగ సంబర పడిపోతూ వుంటారు యువతీ యువకులు. అంతకు మించిన సుఖం లేనట్టు భ్రాంతి జెందుతుంటారు.
కాని తమకు తెలియకుండానే శైశవాన్ని కబళించిన కాలం యౌవనాన్ని కూడా కబళించివేయలేదా! ఆ తరువాత ముసలితనం రాదా! చిట్టచివరకు మృత్యువూ రాదా!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
సుఖముమీది భ్రాంతి సుడివడ "పొమ్ము..శై
శవమ!.. లేచి రమ్ము సంతసమున
యౌవనమ్మ!" యనెడు న ట్లాతురులయినన్
ముదిమి.. పిదప రాదె! ముప్పు రాదె!
✒~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
30.7.19
-----------------------------------------------------------
డా. వెలుదండ వారూ,
తొలగించండిఅద్భుతమైన పూరణ. అభినందనలు.
రిప్లయితొలగించండిఆ వల్ల కాటి లో యేం చేస్తావు గానీ మా సభలో కొచ్చేయ్ :)
అవనిన్ చూడగ కైపులెన్ని కలవో! అబ్బబ్బొ వేగమ్ము గా
కవనమ్ముల్ భళి వ్రాయ వచ్చు ధృతితో కాఫీ జిలేబీలతో
శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
భువిలో పేరును గాంచ వచ్చునిక సంపూర్ణంబుగా రావె ! రా!
జిలేబి
😊
తొలగించండిజిలేబి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
పింఛ నిత్తురంచు విసుగు లేక విధిగ
రిప్లయితొలగించండితిరిగి నన్ని నాళ్ళు తిప్పి తిప్పి
సిద్ధమంటు నేడు చీటి పంపిరి నీకు
శవమ లేచి రమ్ము సంతసమున
👏
తొలగించండిసూర్య గారూ,
తొలగించండిచక్కని పూరణ. అభినందనలు.
🙏🙏
తొలగించండిదత్త పదులు, పద్య ధారలు వర్ణనల్,
రిప్లయితొలగించండిమంచి పూరణల సమస్య లందు,
అక్షరంపు సొబగులవధానగరిమనా
శవమ లేచి రమ్ము సంతసమున..
ఆశవము = ఆశుత్వము, వడి
రామ్ గారూ,
తొలగించండిమీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.
కఠినమౌ సమస్య కమ్మదనమ్మును
రిప్లయితొలగించండిచింద పూరణమ్ము సేయు పటిమ
శంకరాభరణపు సాధనమ్మొసగ నా
శవమ లేచి రమ్ము సంతసమున
(*ఆశవము= ఆశుత్వము)
రాకుమార గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపాటవమ్ము తోడ పాశిని మెప్పించి
వరము నొంది తాను వచ్చె నిపుడు
జనులు హర్ష మొంద సావిత్రి ప్రియునిదౌ
శవమ! లేచి రమ్ము సంతసమున.
రాజారావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చంద్రమతి సుతుండు చచ్చె పాముకఱచి
రిప్లయితొలగించండిగాధి సుతుడు వచ్చి కరుణ జూపి
తనదు మాయ తెలిపి తాను పిలిచె నిట్లు
శవమ లేచి రమ్ము సంతసమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబాల్య దశను నుండిబంధువర్గమునకు
రిప్లయితొలగించండిసేవజేయుకతన శీఘ్రముగను
బడుగు బ్రజల సేమ మడుగవ లయునుశై
శవమ! లేచిరమ్ముసంతసమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపరమ పురుషు గూర్చి పద్యమొక్కటి జెప్ప
రిప్లయితొలగించండినెంచి నాను నేను నియమ ముగను
ప్రాస గణ యతులను ప్రావీణ్య మొప్ప నా
శవమ లేచి రమ్ము సంతసమున.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ప్రావీణ్య మొప్ప నాశవము'.... పద విభాగం?
పరమ ముదకరములు బాల్యస్మృతులు కాల
రిప్లయితొలగించండిమహిమ మేరి కెఱుక మరలి రా ద
యినను నేడు నిన్న యేఁ గోరుచుందు శై
శవమ! లేచి రమ్ము సంతసమున
హవనీయమ్ముల నీయఁ జాల నకటా యాచింపకే కాచితే
యవనీశుండగు నంబరీషు నల నే నర్చింతు నోరారఁగా
నవనార్థంబు సహస్రధార! స రణోద్యత్పాంచజన్యంబ! కే
శవమా! సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
[కేశవము = విష్ణువునకు సంబంధించినది]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
తొలగించండిభువిలో వెళ్ళిన బాణమున్ వచనమున్ మోఘంపు కాలంబు శై
రిప్లయితొలగించండిశవమున్ ప్రాణము లేచివచ్చునొకో చార్వాకులేరీతి యా
భవనాశావ్యయు గాంచనేర్తురు హరీ బ్రారబ్ధముంద్రుంప గే
*శవ!మా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
రిప్లయితొలగించండి(జిలేబి గారికి అంకితం)
"Marriage is the funeral of bachelorhood"
అవురా! ఎంతటి తప్పు చేసితినిరా! అత్తయ్యనున్ దెచ్చుచున్
పవలున్ రాతిరి కోరునే వసతినిన్ బంజార హిల్సందునన్...
నవరత్నమ్ముల మించెడిన్ సఖులతో నా బ్రహ్మచర్యమ్మునౌ
శవమా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై!
మీ ఆటవిడుపు పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండిజవసత్వమ్ములు నంతరించె నిలలో సంబంధముల్ వీడగన్
పవలున్ గట్టిన మేడలన్ యిసుకలో బాయంగ సాయంత్రమున్
లవలేశమ్మును గుందకన్ మరల మేడల్ గట్టి రంజిల్లు శై
శవమా! సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మేడలన్ + ఇసుకలో' అన్నపుడు యడాగమం రాదు. "మేడలం దిసుకలో..." అందామా?
గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను.
తొలగించండిమత్తేభవిక్రీడితము
జవసత్వమ్ములు నంతరించె నిలలో సంబంధముల్ వీడగన్
పవలున్ గట్టిన మేడలందిసుకలో బాయంగ సాయంత్రమున్
లవలేశమ్మును గుందకన్ మరల మేడల్ గట్టి రంజిల్లు శై
శవమా! సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
ఆ: వరము నిచ్చె నాకు పాతాళ భైరవి
రిప్లయితొలగించండిపడిన ప్రాణి కిపుడు ప్రాణ మిడెద
పాడెనున్న శిశువు బ్రతికివచ్చుకనుడు
శవమ! లేచి రమ్ము సంతసమున
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఎవరీ గోపిక లన్న యెల్లిదమొ? యింకేమౌనులే వెఱ్ఱులీ
రిప్లయితొలగించండిజవరాండ్ర న్విడనాడ నన్న తలపో? జాలమ్మె నీ నైజమో?
యెవరో చెప్పిన మాటల న్వినకురా హే! వేణుగోపాల! కే
శవ!మా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై.
రిప్లయితొలగించండిరాయంగవచ్చు కందము
ప్రాయమ వసరమ్ము లేదు బాలకుమారీ !
సాయంబివ్వంగను కల
దోయీ శంకరుని కొల్వు ద్యుతియున్ చేరన్!
జిలేబి
అవనిన్ లేదుగనీకుమించినది యీయాంధ్రంబునందున్సు శై
రిప్లయితొలగించండిశవమా! సంతసమొప్ప రమ్మువడిగన్ శశ్వద్యశశ్శాలివై
భువనంబంతకుమేలుసేయగను సంపూర్ణంబ నీయున్కియే
శవమేయీశ్వరరూపమౌననుచునాశాజీవులెంచన్ శుభమ్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఅవిరామమ్ముగ మోసపూరితపు చెయ్దమ్ముల్నిటన్ గూర్చుచున్
పవిదిన్ గూడని దుష్ట పోకడల చాపల్యంబుతో దోరుచు
న్నవనిన్ పెంపగు వారినెల్ల నిల మాపున్ జేయగా తండ్రి కే
శవ! మా సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశ్శాలివై.
ఆటవెలది
రిప్లయితొలగించండిమమ్ము వీడి నీవు మరణించి నంతట
మార్చురీకిఁ జేరె మరణశయ్య
కాసులివ్వలేము కావలికాండ్లకు
శవమ! లేచి రమ్మ సంతసమున
మత్తేభవిక్రీడితము
రిప్లయితొలగించండినవమాసమ్ములు నిండినట్టి మగువే నాణెమ్ము లేదన్ననే
యవరోధమ్ముల కన్నుమూసె నట కాయంబీయ పైకమ్మెగా!
నవినీతన్నది పెచ్చురేగెను ప్రభుత్వాస్పత్రులన్ సైతమున్
శవమా! సంతస మొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపవిదిన్ గూడిన వాదమాడి తను నా పాతంగినే వేడగా
వ్యవధిన్ జూపక నామె కోర్కెలను సంభావించి కీనాశుడున్
వివశత్వంబున నిన్నెడె న్నెఱిని సావిత్రీ సతీ భర్తదౌ
శవమా! సంతసమొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై.
అవనిన్ ధర్మము నిల్ప రక్కసుల సంహారమ్ము నేజేయగా
రిప్లయితొలగించండినవతారమ్ముల దాల్చినావుగదరా యక్షోభ్య మమ్మేలగా
నవిరామమ్ముగ నిన్ను గొల్చెదను నాయభ్యర్థనన్ గాంచి కే
శవ మా సంతసమొప్ప రమ్ము వడిగన్ శశ్వద్యశశ్శాలివై.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరవశమున పలికె పాటగాడొక్కడు
రిప్లయితొలగించండిపండ్లు సరిగలేక పాడుచుండె
పరవశ మనబోయి పల్కెపాట పరవ
శవమ లేచి రమ్ము సంతసమున!!