8, జులై 2019, సోమవారం

సమస్య - 3069 (వేయంచుల కైదువు...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్"
(లేదా...)
"వేయంచుల్ గల కైదువుం గొని మహావిష్ణుండు రేగెన్ వడిన్"

35 కామెంట్‌లు:

 1. పాయని కర్కశ హృదయులు
  మాయులు,మధు కైటభాది మదయుతు లదరన్
  వేయన్ సుదర్శనంబున
  వేయంచుల కైదువుఁగొని విష్ణువు సెలగెన్

  రిప్లయితొలగించండి
 2. రిప్లయిలు
  1. ప్రాతః కాలపు సరదా పూరణ:

   కాయంబందున శక్తి వీడగను మా కాంగ్రేసు పార్టీకి భల్
   మాయామోహము కూలి పోవగను నా మాయావతీ మమ్తలన్
   న్యాయాన్యాయములెంచ కుండ వడిగా యానంబు గావించుచున్
   వేయంచుల్ గల కైదువుం గొనిమహావిష్ణుండు రేగెన్ వడిన్

   మహావిష్ణువు = (నరేంద్ర) దామోదర (మోడి)

   (శ్రీ లక్ష్మణాచార్యుల వారి సవరణతో)

   తొలగించండి
 3. న్యాయమను మాట వీడుచు
  హేయపు పనులెన్నొ జేయు హీనాత్ములెయౌ
  రేయింద్రిమ్మరులఁ దునుమ
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  రిప్లయితొలగించండి


 4. ఆ యాగపు వేళన తా
  నై యిచ్చిన యాన నూరనగ తప్పులు తా
  చేయగ శిశుపాలుడి నా
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 5. చేయని తప్పుల కెన్నడు
  న్యాయము లేదంట నిలను నలుగురి లోనన్
  మాయా మోహము లందున
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  రిప్లయితొలగించండి
 6. మైలవరపు వారి పూరణ

  గజేంద్రుడు...

  మాయామోహమునందు చిక్కితిని , సంసారంపు కాసారమున్
  డాయన్ దుర్భరకష్టనక్రము ననున్ బాదమ్ములన్బట్టెడిన్ !
  కాయంబంతయు స్రుక్కె ! దిక్కు గనగా కంజాక్ష ! నీవే యనన్
  వేయంచుల్ గల కైదువుం గొని మహావిష్ణుండు రేగెన్ వడిన్

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
 7. పాయక దుర్మార్గంబుల
  జేయుచు చెలరేగునట్టి చెనటుల దునుమన్
  రోయక నావేశంబున
  వేయంచుల కైదువు గొని విష్ణువు సెలగెన్

  రిప్లయితొలగించండి
 8. (దక్షాధ్వరవిధ్వంససమయంలో వీరభద్రునిమీద
  సుదర్శనచక్రం ప్రయోగిస్తున్నమహావిష్ణువు)
  ఆ యాగంబున కీశ్వరుం బిలువకే
  యాగంబొనర్పన్ మహా
  మాయాదక్షుడు;వానిపుత్రి సతి యా
  త్మత్యాగగా మారగా;
  స్వీయాంశన్ హరుడంప భద్రు నటకున్;
  బీభత్సయుద్ధంబునన్
  వేయంచుల్ గల కైదువుం గొని మహా
  విష్ణుండు రేగెన్ వడిన్.
  (ఆగంబు-అల్లరి;భద్రుడు-వీరభద్రుడు)

  రిప్లయితొలగించండి
 9. వేయగ బెడిదపుటమ్ముల
  బాయని మిత్రుడుకిరీటి బడగొట్టగ గాం
  గేయుడు సమరమున జెలగి
  వేయంచుల కైదువుగొని విష్ణువు సెలగెన్

  రిప్లయితొలగించండి
 10. శ్రీ గురుభ్యోన్నమః🙏

  కాయమున బలము జావగ
  వేయేండ్లుదలపడి డస్సి వేడెన్ విష్ణున్
  కాయ కరి, నక్రిని దునుమ
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్!

  రిప్లయితొలగించండి
 11. తోయమున మకరి బట్టగ
  కాయమ్మున బలము తగ్గి గావగ వేడన్
  పాయగ కష్టము కరికిని
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్!

  రిప్లయితొలగించండి


 12. ఆయాసమ్మున రొప్పు చున్ ప్రణవమా! రావయ్య కాపాడ! నీ
  వే యావత్తగు నాకు కావు మయ ! నిర్వీర్యంబుతో బిల్వగా
  మాయన్ వీడిన గబ్బుచెంకమెకమున్ మన్నించి కావంగ నా
  వేయంచుల్ గల కైదువుం గొని మహావిష్ణుండు రేగెన్ వడిన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 13. పాయనిభక్తినియేనుగు
  కాయమునికనీరసింపకరివరదునిపై
  భారమువేయుచుగోరగ
  వేయంచులకైదువుగొనివిష్ణువవుసెలగెన్

  రిప్లయితొలగించండి
 14. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  సందర్భము: సులభము..
  గజేంద్ర మోక్షము
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పాయని కరి మొర విని, దిగి,
  కాయువుతో.. "నిది సమస్య కానే కా" దం
  చా యదనున మకరి శిరము
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  8.7.19
  -----------------------------------------------------------
  కాయువు= అనురాగము; చెలగు= ఖండించు

  రిప్లయితొలగించండి
 15. ఆయోధనమున గాంగుని
  సాయక ధాటికిని నరుడు చతికిల బడగా
  సాయము జేయగ సారథి
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్!

  రిప్లయితొలగించండి
 16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అరిషడ్వర్గముముక్తిగొల్పునిలనాత్మానందమున్ గూర్చుతన్
   ఈవారం సమస్య

   తొలగించండి


  2. పరమాత్మా! నను కావుమయ్య నిలలో ప్రారబ్ధ కర్మానుసా
   ర రసాభాసపు మాయ లోమునిగి నే రాత్రింబవళ్ళున్ ప్రభో
   చెరసాలన్ పడి నానయా! బతుకులో చీకాకులన్చేర్చెనా
   యరిషడ్వర్గము; ముక్తిగొల్పునిలనాత్మానందమున్ గూర్చుతన్!

   తొలగించండి
 17. వేయంగనొకవ్రేటున
  న్యాయంబేయిదియనెంచ నయవంచకులన్
  న్యాయంబనిమునుపొకపరి
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్!!

  రిప్లయితొలగించండి
 18. కాయంబంతయునీరసించెనిపుడున్ గావంగరారమ్ముభో
  మాయానాటకసూత్రధారివిగదేమాంధాతృసంధాయకా!
  నాయీప్రాణమురక్షజేయగదమిన్ నారాయణారాయనన్
  వేయంచుల్ గలకైదువున్ గొనిమహావిష్ణుండురేగెన్ వడిన్

  రిప్లయితొలగించండి
 19. "హా!" యని యర్థించుచు కరి
  యాయువు మూడిన దనుచును హరితో ననగా
  వాయువు వలె వెస నేగియు
  "వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్"
  ****)()(****
  (విష్ణువు చక్రాయుధానికి వేయంచులని అతిశయోక్తి)

  రిప్లయితొలగించండి
 20. సేయన్ వీర విహారము
  గాయంబై కోపమూని గాంగేయునిపై
  నో యంగను రథము దుమికి
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  రిప్లయితొలగించండి
 21. కందం
  సాయమ్మీవే శరణని
  బాయఁగఁ దా బలిమిఁ గరియె వరదా! యనగన్
  శ్రేయోమయుడై మకరిన్
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  శార్దూలవిక్రీడితము
  మాయావిన్ గొని యగ్రపూజ కనుచున్ సమ్మానమా ధర్మజా!
  దాయన్ గోపికలెల్ల పాలు, నవనీతమ్మందు చోరుండు వీ
  డాయోగ్యండని వంద మించి తెగడన్, ఠారెత్త ఛేదీశుపై
  వేయంచుల్ గల కైదువుం గొని మహావిష్ణుండు రేగెన్ వడిన్

  రిప్లయితొలగించండి
 22. చేయ శతాధిక దూఱులు
  మా యత్త కొడుక మన దరమా శిశుపాలా
  యీ యవని ననుచుఁ జక్రము,
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్

  [చక్రము = సహస్రధారము]


  మాయాజాలమయుండు వృత్రు నిఁకఁ దున్మాడంగ నున్మాదియై
  యాయాసమ్మునఁ బూర్వదిక్పతి సహస్రాక్షుండు ధాతాది గా
  నా యాదిత్యుల విష్ణు వింద్రుఁ డన విఖ్యాతుండు మున్యంగ మా
  వేయంచుల్ గల కైదువుం గొని మహా విష్ణుండు రేఁగెన్ వడిన్

  [ఆయాసము = ఉత్సాహము]

  రిప్లయితొలగించండి
 23. కాయంబంతయుశరముల
  గాయంబులరుధిరమోడు గాండీవిగనన్
  రోయుచునాభీష్మునిపై
  వేయంచుల కైదువుఁగొని విష్ణువు సెలగెన్

  రిప్లయితొలగించండి
 24. కాయము డస్సెను స్వామీ
  బాయగ రమ్మా మకరము బట్టెను కాలున్
  సాయము వేడగ కరియట
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్"*

  రిప్లయితొలగించండి
 25. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  వ్రాయన్ బూనుచు వంద పద్యములహో రైయంచు రాత్రింబవల్
  మూయించంగను వంద నోళ్ళనరెవో ముగ్ధంపు వృత్తమ్ముతో
  సాయంసంధ్యను కంది శంకరులిడెన్ శార్దూలపాదం యథా:
  వేయంచుల్ గల కైదువుం గొనిమహావిష్ణుండు రేగెన్ వడిన్

  రిప్లయితొలగించండి
 26. గాయపడిన పార్థుని గని
  వేయంచుల కైదువుఁ గొని విష్ణువు సెలఁగెన్"*
  నాయుధముపట్టి రణమున
  సాయము చేయగ దలచుచు సత్వర మనిలో

  రిప్లయితొలగించండి
 27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 28. క్రొవ్విడి వెంకట రాజారావు:

  హేయమ్మగునటు దూషణ
  జేయుచు పొగరుగ హసించు శిశుపాలుని తా
  నా యాగమ్మున కనలుచు
  వేయంచుల కైదువు గొని విష్ణువు సెలగెన్.

  రిప్లయితొలగించండి
 29. నా యుల్లమ్మున నిన్ను నిల్పితిని గా నారాయణా బ్రోవరా
  చేయన్ జాలనికన్ రణమ్ము హలలోఁ శ్రీనాథ గ్రాహమ్ము తో
  నే యుద్వేగముఁ బొందుచుంటి గద నన్నేలంగ రారమ్మనన్
  వేయంచుల్ గల కైదువుంగొని మహా విష్ణుండు రేగెన్ వడిన్.

  రిప్లయితొలగించండి
 30. డా.పిట్టా సత్యనారాయణ
  వేయను నోట్లకు బంధము
  కాయను జీ యెస్టి రుసుము, కాంగ్రెసు నెదురన్
  శాయగ మోదీ బలపడె
  వేయంచుల కైదువుగొని విష్ణువు సెలగెన్

  రిప్లయితొలగించండి
 31. డా.పిట్టా సత్యనారాయణ
  సాయంబొక్కటి చాలెనా శరములై సాగెన్గదే వేలుగా
  వేయం బాటలు కంపెనీల నెలవై విస్తారతన్ జూపవే
  మాయంబున్ గనులార జూపెడు సమామ్నాయంబె కంప్యూటరౌ
  వేయంచుల్ గల కైదువుంగొని మహా విష్ణుండు రేగెన్ వడిన్

  రిప్లయితొలగించండి