19, జులై 2019, శుక్రవారం

సమస్య - 3080 (చెలివో తల్లివొ...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో"
(లేదా...)
"చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో"

61 కామెంట్‌లు:

 1. గు రు మూ ర్తి ఆ చా రి
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,,


  గురుభ్యోన్నమః [ నిన్నటి పూరణ స్వీకరించ మ న వి ]


  { తన తల్లిదండ్రులను , చక్కగా పరిపోషించే అన్న యింటనో

  లేదా తమ్ముని యింటనో డించిన వ్యక్తి మాత్రమే యిల్లటము

  వెళ్ళడానికి అర్హుడు }  తల్లిని తండ్రినిన్ గనక , తద్దయు నాశ వహించి యాస్తిపై

  యిల్లట మంది భోగిలు టొకింతయు మంచిది కాదు | వారలం

  జల్లగజూచు నట్టి సహజన్ముని గేహము నందు డించు వా

  డిల్లరికంపుటల్లుడుగ నేగుట యెట్లగు దోష మిధ్ధరన్ ?


  ------------------------------------------------------------------------------------


  భార్యాభర్తలకు సలహాలు
  ::::::::::::::::::::::::::::::::::::::


  కొల్లగ సంచరించి మది గోరిన రీతి , వ్యయింపవద్దురా |

  యెల్లరు మెచ్చ , కష్టపడి హెచ్చొనరింపర యాస్తిపాస్తులన్ |
  ........................................................................................

  వల్లభ వైన నీ వెపుడు భర్తను చక్కగ గౌరవింపుమా !

  యిల్లరికంపుటల్లు డని యీరసమాడకు చిన్నచూపుతో !


  ( వల్లభ = ఇల్లాలు ; ఈరసమాడు = కోపగించుకొను ,

  ఈసడించుకొను ; )


  ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 2. ప్రాతః కాలపు సరదా పూరణ:

  తలలన్ ద్రుంచుచు వైరులన్ నమలుచున్ తండోప తండాలుగా
  తలనున్ వంచని రీతినిన్ మమతరో దండంబులన్ బొందితో
  కలనున్ గానని తీరునన్ మురియుచున్ కంగారు బంగాలునన్
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో

  రిప్లయితొలగించండి


 3. అలిమేలుమంగవకొ! నా
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో
  ములుగువకొ! జిలేబివకో
  యిలలో సర్వస్వమున్ పయిదలి చలువయే!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 4. లలనా నీవే కద మా
  కిలలో ముఖ్యమ్మిది నిజమెప్పటి కైనన్
  తలపుల లో నిలిచిన నా
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!

  రిప్లయితొలగించండి
 5. కొలువన్ భక్తిని నిరతము
  మలినపు బుద్ధిని వీడి మాన్యుడ వౌగా
  ఫలితము నీయగ మమతల
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   రెండవ పాదంలో గణదోషం. 'వీడి' అన్నచోట 'త్యజించి' అంటే సరి!

   తొలగించండి
  2. కొలువన్ భక్తిని నిరతము
   మలినపు బుద్ధిని త్యజించి మాన్యుడ వౌగా
   ఫలితము నీయగ మమతల
   చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో

   తొలగించండి


 6. అలిమేలమ్మవొ!ఆమ్రపాలివకొ! నీవార్యాంబవో! శారదా!
  లలితాంగీ! సబలా! జిలేబి!కలికీ!లావణ్యమూర్తీ! నమో!
  కలకాలమ్మిల లోన నాయునికికై కైమోడ్చి కాల్మొక్కెదన్!
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 7. (అభినేత్రి అంజలీదేవితో ఆమె భర్త ఆదినారాయణరావు)
  అలినీలాలక!అంజలీ!కనగ నీ
  వందాల సర్వస్వమే!
  కలలన్ వెల్గెడి రాణివై నటనలో
  గౌశల్యమున్ జూపితే!
  తెలుగుల్ మెచ్చిరి నీదు పాత్రములనే;
  దీవించిరే!వారికిన్
  చెలివో?చెల్లివొ?తల్లివో?వదినవో?
  జేజమ్మవో?యత్తవో?

  రిప్లయితొలగించండి
 8. మైలవరపు వారి పూరణ

  నలిననిభాస్య ! నవ్యనటనప్రతిభాపరిపూర్ణ ! నీకు నం...
  జలి యిదె యంజలీ ! మధురసమ్ములు నింపి విభిన్నపాత్రలన్
  తెలుగుజనాళి గుండియల తేనెలు నింపితి ! నిన్ను నెంచ మా
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో !!

  మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మైలవరపు వారు పొరపాటున మత్తేభ సమస్యకు చంపకమాల వ్రాసారు. నేను పొరపాటును తెలియజేయగానే వాట్సప్ సమూహం నుండి పూరణను తొలగించారు.

   తొలగించండి

  2. మైలవరపు వారు యేమి వ్రాసినా సొబగే !

   చాలా బావుంది


   జిలేబి

   తొలగించండి
  3. శంకరాభరణం.. సమస్యాపూరణం..

   చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో !!

   వలపున్ నింపితి , ప్రేమ బంచితి ,సదా వాత్సల్యమున్ జూపితీ
   వలుపుంజెందక యింటి దిద్దితివి , నాన్నమ్మా యనన్ గోరుము...
   ద్దల లాలించితి , సుద్దులన్ గఱిపితో ధన్యా ! నటీ ! అంజలీ !
   చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో !!

   మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

   తొలగించండి
  4. పొరపాటునకు మన్నింతురుగాక🙏
   మంచి పద్యము.. అందుకే చివరిపాదం ఇలా మార్చుకొన్నాను. ఇది పూరణ కాదని మనవి 🙏

   నలిననిభాస్య ! నవ్యనటనప్రతిభాపరిపూర్ణ ! నీకు నం...
   జలి యిదె యంజలీ ! మధురసమ్ములు నింపి విభిన్నపాత్రలన్
   తెలుగుజనాళి గుండియల తేనెలు నింపితి ! నిన్ను నెంచ మా
   చెలియవొ భ్రాతృపత్నివొకొ చెల్లివొ తల్లివొ నాయనమ్మవో !!

   తొలగించండి
 9. మిత్రులందఱకు నమస్సులు!

  [వాణీ దేవిని స్తుతిస్తూ నేను ఆ తల్లిని నా కలలో కోరిన విధము]

  "తొలుత న్నే నిఁక దేహ బంధనములే తొల్గంగ నీ చెంతకున్
  వెలుఁగుల్వొందఁగ వత్తునమ్మ జననీ! వేదాగ్రణీ! వాఙ్మణీ!
  యిల బంధుత్వము లేని నాకు నగుదో హే వాణి! యమ్మమ్మవో

  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో?"

  రిప్లయితొలగించండి
 10. ఇలలో ప్రేమను చూపెడు
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మ వొకో
  లలనా యేమని పొగుడుదు
  పలువిధములుగా మమతలు పంచెద వెపుడున్

  మరొక పూరణ

  అలగక విసుగును చూపుచు
  తలలో నాలుక యురీతి తమితో నెపుడున్
  తెలియక సేవలు చేయగ
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మ వొకో

  రిప్లయితొలగించండి
 11. నెలతయె వంటలు సేయగ
  నలవోకగ దిద్దునిల్లు నడుపును దేశం
  లలనల నేమని బొగడుదు
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో

  రిప్లయితొలగించండి
 12. అలరించు టాదరంబున
  పలువిధముల మేలు గోరు పడతివి యగుచున్
  వెలసిన దేవతవమ్మా
  చెలవో తల్లివొ వదినవొ జేజమ్మ వొకో

  రిప్లయితొలగించండి
 13. నెలతయె నింటిని దిద్దగ
  నలవోకగ సైచుబాధ నగవుల గనుచున్
  లలనల నేమని బొగడుదు
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో

  రిప్లయితొలగించండి


 14. మా జగనుడి రాజ్యములో అమ్మ ఒడి :)


  పలకా బలపము చేర్చుచు
  పిలకాయల బడిని వేయ ప్రేరణ యిదిగో
  నెలకింతని దస్కమికన్
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మ వొకో!


  జిలేబి

  రిప్లయితొలగించండి
 15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ గురుభ్యోన్నమః🙏

  అమృతం కొరకు పోట్లాడు దేవదానవుల తగవు దీర్చుటకై మోహినీ రూపంబున హరి ప్రత్యక్ష మగుట!

  బులిపించుచు హరి మోహిని,
  కలకంఠిగ మారెఁ దాను కలహము మాన్పన్
  మలకమెరుపుఁ* గనిఁ దలచిరి
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!

  *ధనుస్సు వంటి మెరుపు

  రిప్లయితొలగించండి
 17. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఇల నోర్మితోడ నింటిని
  నిలుపుచు కాపురము నంత నెట్టుచు సతము
  న్నలరించు సతీ!నీవిట
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!

  చలిమలచూలీ! ప్రోచుము
  పలురూపమ్ముల పొసగుచు పరగెడి నీవున్
  యిల నెట్టుల నీవుంటివి
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!

  రిప్లయితొలగించండి
 18. ఒక్క సారిగ దివినుండి యొక్కుదుటన
  నూడిపడినట్లు గలగంటి నోకుమారి!
  చెలివొ తల్లివొ వదినవో జేజెమ్మవొకొ
  చెప్పుమమ్మరొ లేకున్న నొప్పుకోను

  రిప్లయితొలగించండి
 19. పలుకుల రాణివి శక్తివి
  యలరుచు నమ్మలకు నమ్మ వంబవు నీవే
  తెలియగ వశమే బ్రహ్మకు
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో

  రిప్లయితొలగించండి
 20. కందం
  పులకించఁగ నీ వంశము
  వలపుల మమతల గురియుము వాత్సల్యములన్
  లలనా! యే మూర్తికగుదొ
  చెలివో? తల్లివొ? వదినవొ? జేజమ్మవొకో?

  రిప్లయితొలగించండి
 21. కలలోనన్ కనుపించినావు మగువా!కళ్యాణ రాగోద్ధతిన్
  తెలవారెన్,నిను నేను పోల్చుకొన నెంతే జాగు జాగయ్యె,నా
  తెలివిన్జూచి యసహ్యమయ్యె,చెపుమా దేవీ!నిజంబేదియో
  చెలివో?చెల్లివొ?తల్లివో?వదనవో?జేజమ్మవో?యత్తవో?

  రిప్లయితొలగించండి
 22. తెలుపుమ భామామణి నీ
  కలవడఁ జుట్టరిక మెట్లు కాంతలు నిలువన్
  వలపట దాపట నటు నిటు
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో


  కలరే యిట్టి దయార్ద్ర చిత్తులు భువిం గాంతామణుల్ పూర్ణ కా
  మలు పుణ్యౌఘ కృతార్థ జన్మలు సుసన్మానార్హ లెందైననుం
  దెలియన్నేరము నీదు సేవలు గనన్ దేదీప్యమానంబుగాఁ
  జెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో

  రిప్లయితొలగించండి
 23. ..............🌻శంకరాభరణం🌻...............
  ..................🤷🏻‍♂సమస్య 🤷‍♀....................
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో
  యత్తవో

  సందర్భము: దేవీ స్తుతి
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~
  చెలువా! నీ వెవరో కదా! ఎఱుగమే!
  శ్రీ మన్మహాలక్ష్మివో!
  అలరింపన్ దిగి వచ్చినావు జననీ!
  ఆర్యా మహాదేవివో!
  పలుకు న్దేనెల తల్లివో! సకలమున్
  భావింపగా నీవెగా!
  చెలివో! చెల్లివొ! తల్లివో! వదినవో!
  జేజమ్మవో! యత్తవో!

  ✒~డా.వెలుదండ సత్యనారాయణ
  19.7.19
  -----------------------------------------------------------

  రిప్లయితొలగించండి


 24. లలితా యటంచు పిలువన్ ?
  లలితమ్మాయని పిలువ? కలకలయనగ ను
  జ్వల గృహమున? పలుకుపడతి?
  చెలివో? తల్లివొ? వదినవొ? జేజమ్మవొకో?


  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీయ మత్తేభమాలిక:

   వలపున్ జూడగ నన్ను నీవిచటభల్ బంగారునే కోరెడిన్...
   బలుపౌ రాఖిని కట్టి తీసెడిని నా ప్రాణమ్మునున్ కాన్కకై...
   చెలిమిన్ కాకర కూరనున్ వడివడిన్ చేకూర్చి మ్రింగించెడిన్...
   తలుపున్ చాటున బీడికిన్ కొసరగా ద్రవ్యమ్ము చేకూర్చెడిన్...
   కలనున్ గాంచగ ప్రీతినిన్ తరిమెడిన్ కంగారు తాతయ్యనున్...
   విలనున్ బోలుచు భీతిగొల్పుచును నన్ పీడించి వెంటాడెడిన్...
   చెలివో?...చెల్లివొ?...తల్లివో?... వదినవో?...జేజమ్మవో?...యత్తవో???

   తొలగించండి


  2. వామ్మో మరీ జిలేబీయమే :)   జిలేబి

   తొలగించండి
  3. "అహో..ఏమాపదగుంఫన... ప్రతిపదమునకూ అప్రతిహతంగా పాదముల్చేకూర్చి మాలికలతోమత్తేభమునకే మత్తెక్కించేసితిరి మహానుభావా వందనములు.🌹🙏💐🤝👌🌹"

   ...డాక్టర్ మునిగోటి సుందరరామ శర్మ

   తొలగించండి
 25. కలనైన న్నిను నెంచకం దిరుగుచుం గాటంపు తాపత్రయం
  బులకుంజిక్కి చరించి మూఢమతులై పోగాలముంబొందు జీ
  వులనైనం దుది నిన్నునెన్న గను తల్లీ యోపరా శంభునె
  చ్చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో.

  రిప్లయితొలగించండి
 26. కలలోజూచితి నిన్నునే నకట మాకాలమ్ముబాగుండెగా
  జెలివోచెల్లివొ తల్లివోవదినెవో జేజెమ్మవో యత్తవో
  వొలకంబోయక సిగ్గునెచ్చటనునీయొయ్యారపుంజేష్టతో
  నకలంకంబుగ నీదుసంగతినినాహారీతివాక్రువ్వుమా

  రిప్లయితొలగించండి
 27. ఆటవిడుపు సరదా పూరణ:
  (జిలేబి గారికి అంకితం)

  హా! స్మృతీ!

  తొలుతన్ టీవిని కోడలై కులుకుచున్ తోషమ్ము శోకమ్ముతో
  వలపున్ జేయుచు భాజపా నమరుచున్ భండమ్మునన్ గెల్వగా
  కలనున్ గాంచుచు భీతినిన్ వణకెడిన్ కాంగ్రేసు జంభారికిన్
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో?

  రిప్లయితొలగించండి
 28. ఇలలో నీయనురాగము
  కలలాస్ఫురియించు నాకు కాంతామణిరో
  సలలితరాగసుధామయి
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!

  రిప్లయితొలగించండి
 29. కందం
  తొలి పౌత్రియె తన యింటను
  వెలయించుచు పెత్తనములు వేడుక గొలుపన్
  తలచెను తాతయె ప్రియముగ
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో

  రిప్లయితొలగించండి
 30. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 31. క్రొవ్విడి వెంకట రాజారావు:

  ఇలలో నింటిని నేర్పుతో నడపి నీవెత్తై ప్రవర్తించుచున్
  కులమర్యాదకు నెట్టిదౌ చెఱపు రాకుండంగ సంతున్ పతిన్
  యలుపే జూపక పెద్దలన్ కొలుచు యో యిల్లాల! యిటన్
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో

  రిప్లయితొలగించండి
 32. కలికీ! కోమల రూపమందున జగత్కళ్యాణమున్ గోరుచున్
  నిలలో బుట్టిన శక్తిరూపిణివి నీవేకాదుటే కాంచగన్
  బలురీతుల్ బురుషాళికిన్ సమముగా భారమ్మునే మోసెడిన్
  చెలివో చెల్లెవొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో

  రిప్లయితొలగించండి
 33. కలికాలమున కలిగితివి
  సలుపగ సేవఁ బురుషులకు సహనము తోడన్
  వలపును కురిపించు నపుడు
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో?

  రిప్లయితొలగించండి
 34. ఆకాశవాణి సమస్యాపూరణ రికార్డింగు ఆలస్యంగా జరిగింది. ఇప్పుడే నెలవు చేరుకున్నాను. బాగా అలసిపోయాను. మీ పూరణలను సమీక్షించలేను. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 35. కలిమి మరియు లేమి సమము
  బలిమియు నీవుగ జగతిని బహుమతియు నీవు
  చెలిమిన గెలువగ నీవే
  చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో"

  రిప్లయితొలగించండి
 36. లలనగు ద్రోవది జూపిన
  వెలలేని సమాదరణమె వేడుక జేయన్
  పలికను నకులుడు ముదమున
  "చెలివో తల్లివొ వదినవొ జేజమ్మవొకో!"

  రిప్లయితొలగించండి
 37. ఇలలో పుట్టితి వీవు నన్నెపుడు రక్షింపన్ నిరూఢమ్ముగా
  వెలకట్టన్ తరమౌన నీనెనరు దేవీ! నీకివే జోతముల్
  పలురీతుల్ కద నీదు సేవనము లోప్రాణేశ్వరీ! పృథ్విపై
  చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో

  రిప్లయితొలగించండి
 38. మత్తేభవిక్రీడితము
  లలనా! పబ్బుల వెంట నీవు పడగన్ రాదమ్మ
  వ్యామోహివై
  కలతల్ గూర్చును సాంప్రదాయమదియే కాదమ్మ ముమ్మాటికిన్
  పులకల్ రేపుచు వంశమందు మమతల్ పూయించు! నీవౌదువే
  చెలివో! చెల్లివొ! తల్లివో! వదినవో! జేజమ్మవో! యత్తవో!

  రిప్లయితొలగించండి