..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂దత్తపది 🤷♀.................... *'లంగా - చీర - రవిక - పయట'* పై పదాలను అన్యార్థంలో భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
సందర్భము: అజ్ఞాత వాసంలో విరాటరాజు కొలువులో మారు వేషాలతో పాండవులు కాలం గడుపుతుండగా కౌరవు లా రాజు గోవుల నపహరించారు. రాజ కుమారుడైన ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసుకొని బయలుదేరాడు. చివరకు యుద్ధంలో బృహన్నల రూపంలో వున్న అర్జునుడే జయించాడు. పశువుల మందలను మరల్చాడు. నగరానికి రాగా కంకుభట్టుగా వున్న ధర్మరాజు (సూర్య కళతో) విరాటునితో "మన గోవుల గాచిన వీరు డని బృహన్నలను పిలువవలె" నన్నాడు. అప్పుడే వచ్చిన విరాటుని పట్టి (కొడుకు) "భూపాలా! అట అంటే యుద్ధంలో విజయుడు అంటే విజయం పొందిన వాడు లేదా అర్జునుడు ఇతడే సుమా! (నేను కాదు.)" అని నరుని (అర్జునుని) వైపు చూపించినాడు. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ *"వినవె! పశువులం గాచిన వీరు డనుచుఁ*
*జీరవలె బృహన్నల.." ననెఁ జేరి కంకు*
*భట్టు రవి కళను విరాటుఁ.. పట్టి "యితడె*
*భూప! యట విజయుం" డని* *చూపె నరుని..*
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 4.9.19 -----------------------------------------------------------
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂దత్తపది 🤷♀.................... *'లంగా - చీర - రవిక - పయట'* పై పదాలను అన్యార్థంలో భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
సందర్భము: వస్త్రాపహరణమున కృష్ణ మహిమను గాంచి ఆత్మ విశ్వాసం ఆకాశమంత పెరిగిన ద్రౌపది నిశ్చింతగా ధర్మరాజుతో.. ఇలా అంటున్నది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఆర్తులం గాచు మాధవుం డండ నుండ ధూర్తులా చీరగలవారు తొడరి నన్ను!.. చేర విక యశుభాల్ మన చెంతకు మరి.. విజిత కోప! యటమటమున్ విడువుము..సరి!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 4.9.19 ----------------------------------------------------------- అటమట(ము)= దుఃఖము
(కృష్ణుఁడు దుర్యోధనునితో....)
రిప్లయితొలగించండిఅపుడు పాండవు'లం గా'న కంపినావు
హితవరియె యటం'చీ ర'విసుతుని నెంతు
వౌ'ర! విక'ల మనస్కుడవై నయమ్ముఁ
గనవు, కురుభూ'ప! యట' నరుఁడును ఘనుండె.
(సుదర్శనాన్ని ఉపసంహరించి సూర్యాస్తమయ
తొలగించండిభ్రాంతిని తొలగించిన శ్రీకృష్ణుడు అర్జునునితో )
కన్నులం గాంచు సైంధవు ; కఠినచిత్తు ;
చీరవలయును ; నీ పగ తీరవలయు ;
జారవిడుము శిరమతని జనకు నొడిని ;
భూప ! యట ద్రౌపదీశోక మాపవలయు .
జంధ్యాల వారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని 'రవిక' కనిపించలేదు.
తొలగించండిసరిగ్గా వెతికారా :)
జిలేబి
నిజమేనండీ ! " క " జారిపోయింది .
తొలగించండి" రవి కన ఖలుతండ్రి యొడిని రాల్చు శిరము "
అని మార్చానండీ ! ధన్యవాదాలు .
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండిద్రౌపది....
రారా ! దీనజనాలవాల ! నను లీలం గావరా! ధూర్తుడౌ
రారాజున్ గని చీరరా మదమధర్మమ్మున్ నివారింపురా !
ఔరా ! మానము గావరార ! వికలంబయ్యెన్ మనంబిట్టు , లె
వ్వారిన్ జేరునొ నీదు సత్కృప యటన్ భద్రమ్ములౌ వారికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ద్రౌపది....
తొలగించండిరారా ! దీనజనాలవాల ! నను లీలం గావరా! ధూర్తుడౌ
రారాజున్ గని చీర రా మదమధర్మమ్మున్ నివారింపురా !
ఔరా ! మానము గావరార ! వికలంబయ్యెన్ మనంబిట్టు , లె
వ్వారిన్ జేరునొ నీదు సత్కృప యటన్ భద్రమ్ములౌ వారికిన్ !!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిపదిలం గాదని చెప్పెను
రిప్లయితొలగించండికదనము శాంతినెరప యిటకై వచ్చిన యా
మధు సూదనుడే, చీ రణ
మది మానుముర వికలమ్మె యని భీష్ముడనెన్
విరించి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పదిలముగా' అనడం సాధువు. 'పదిలంగా' అనడం వ్యావహారికం. అలాగే 'నెరప నిట' అని ఉంటుంది.
రిప్లయితొలగించండిరాయబారానికి నీవే కృష్ణా వెళ్ళాలి. టపా- అంచెలమీదుగ యెడ - దౌత్యము సలుపుమయా!
పదిలంగా కావుమయా
హృదయకుహుర వికసిత సిత హృదయేశ్వరుడా
సదనములో చీరుచు నా
పదనెడబాయ కతిపయ టపాల యెడ గనన్!
పది లంగా అంటూ మొదలెట్టేసి పడ్డ అవస్థ యింతింత గాదయా :)
హమ్మయ్య!
జిలేబి
పదిలంగా కావుమయా
హృదయకుహుర వికసిత సిత హృదయేశ్వరుడా
సదనములో చీరకు! ఆ
పదనెడబాయ కతిపయ టపాల యెడ గనన్!
వికటకవి జిలేబీజీ!
తొలగించండిసకల పదమ్ముల నటుయిటు సరదా గొల్పన్,
యికఁ నీసంఘము నుండగ
యొకయించుక భాగ్యమేగఁనోయి జిలేబీ!
అన్యథా భావించక AIR సమస్య తెలపండి.🙏
జిలేబీ గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పదిలంగా' అనడం వ్యావహారికం.
ఆకాశవాణి వారి సమస్య....
తొలగించండి"అజ్ఞానమ్ము వికాసదాయక మహో హ్లాదమ్ము పండించెడిన్"
రాయబారమునకు వెళ్ళునపుడు శ్రీకృష్ణునితో ధర్మజుడు కౌరవులను మారమని చెప్పు సందర్భం
రిప్లయితొలగించండినేల*లంగా*రె ధర్మంబు నీరజాక్ష!
*చీర*చింపుల భాగ్యమ్ము చేరదయ్యె
చే*ర విక*విక,పకపక,కౌరవులును
మారి కతి*పయ ట* క్కరి మతము మాని.
చీరచింపు=మత్స్య విశేషము
ప్రసాద రావు గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధన్యవాదములు
తొలగించండి
రిప్లయితొలగించండిపదిలంగా కావుమయా
హృదయకుహుర వికసిత సిత హృదయేశ్వరుడా
సదనములో చీరకు! ఆ
పదనెడబాయ కతిపయ టపాల యెడ గనన్!
హృదయ కుహరమా? కుహురమా?
తొలగించండిశ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండిశ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుని వధించు మార్గము భీమునకు తెలుపుట- నా ప్రయత్నం:
నిలువు నతి బలంగా బట్టి, నిట్టులట్టు
చీరవలె భీమ! యెటులైన జేరి యతుక
రాని విధము జీరర! వికలంబు లవగ
తన్ను వధియింప, యట సుయోధనుడు బెదర.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'బలంగా' అనడం వ్యావహారికం. 'వధియింప నట' అవుతుంది.
కురు సభలో ద్రౌపది ఆక్రందన!
రిప్లయితొలగించండిఅన్నిటఁ బదిలంగా గాచినట్టి కృష్ణ
నిన్ను జీరగా గావగ నేరమౌనె
ఘోర వికటాట్ట హాసంబు, గుడ్డి రాజు
గొడవ నేనోప! యటనీవు కుల్కు దేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పదిలంగా' అనడం వ్యావహారికం. 'నేనోప నట నీవు..' అని ఉంటుంది.
కన్న!నినుజీర దీనులం గాతువనుచు
రిప్లయితొలగించండిపెక్కు వింటిర!మానము భిన్నమయ్యె
నీ యకృత్యమాప యిట వేరెవ్వరి గన
నిన్ను దలప చేరవిక యే నెగుడు లెపుడు!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అకృత్యమాప నిట' అనడం సాధువు.
మన్నించండి గురువుగారూ,తెలిసి చేసిన తప్పు!
తొలగించండివిజయుం డాలo గావగ
రిప్లయితొలగించండినిజ శక్తిన్ జీ రె రిపులు నివ్వెర పడఁగన్
విజయ క ర వికసి తుండై
గజ బలుల పయి టక టక గెలిచె దాన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచివరి పాదంలో గణదోషం. సవరించండి.
చివరి పాదo గజ బలుల పయి టక టక గ కయ్య ము గెలిచెన్ అని సవర ణ చేయడ మైంది
తొలగించండిఆలన్ గాచెడి వాడను
రిప్లయితొలగించండిగూళన్ కుత్తుకను జీర గూలెను భువిపై
మేలగు దెరవిక యాగము
వీలొనరించి రధిప యట పెద్దలు మెచ్చన్
(శిశుపాల వధ రాజసూయ యాగ నిర్వహణ గూర్చి దృతరాష్ట్రునికి వివరిస్తూ)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'ఆలం గాచెడి' అనండి.
కర్ణుని తో కుంతి
రిప్లయితొలగించండిరవి కరుణన బుట్టితివిర
భువిలో నీకీర్తి నిలుచు బుత్రా నాపాం
డవులంగాయవలెను చీ
రవలదు గోప యట గాచి రక్షగ నుండెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'కరుణను' అనండి.
రిప్లయితొలగించండిఇంద్రలోకంలో అర్జునునితో ఊర్వశి :
కందం
కనులం గానవె మోహము
నను శిల్పము జేయు చీరణము నీవని నా
తనువది కోర వికలతన్
గొను తలప? యటవికతయగుఁ గురువర! వీరా!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆలం గాచెడి వాడ నేనొకడ, నే యస్త్రంబు జే బట్టగా
రిప్లయితొలగించండిజాలం, దేరును ద్రోలువాడను జుమీ! సత్యంబిదే, చీర న
న్నాలం బందున దూకి పోర, వికలమ్మౌనేమొ నీ గుండె బా
వా! లక్షింపుము పోర నోప యట, గోపం బూన కా పిమ్మటన్.
అద్భుతమైన పూరణ మిస్సన్న గారూ, అభినందనలు.
తొలగించండిఅద్భుతమైన పూరణ మిస్సన్నగారూ! అభినందనలు!
తొలగించండిధన్యవాదములు గురువు గారూ.
తొలగించండిధన్యవాదాలు సీతాదేవి గారూ.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉత్తరకుమారుని ప్రార్థన:
తొలగించండిఅల రవి కడవని కౌరవ
బలగము చీరకయ దండు బవరమున బృహ
న్నల యేలం గాఁగఁగ నీ
కలయ విరూప యట కేఁగఁ గలుగు మరణమే
కురువర!వికలముగ జేయకు మనమిపుడు
రిప్లయితొలగించండిశాంతినెరపయిట కుజేరిచర్చజేసి
చీరవలయును దుష్టులక్రూరములను
గాచుకొనగనిక బదిలం గాహృ దినిట
నరునిఁ గని పశు *లంగా* చిన దనుజారి
రిప్లయితొలగించండి*చీర* ప్రీతితోఁ, జెంతకు జేరి విజయు
డనియె ధరణీధ *ర! విక* ల మయ్యె మనసు
విశ్వరూ *ప! యట* శరముల్ విడువ నోప
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂దత్తపది 🤷♀....................
*'లంగా - చీర - రవిక - పయట'*
పై పదాలను అన్యార్థంలో
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
సందర్భము: అజ్ఞాత వాసంలో విరాటరాజు కొలువులో మారు వేషాలతో పాండవులు కాలం గడుపుతుండగా కౌరవు లా రాజు గోవుల నపహరించారు. రాజ కుమారుడైన ఉత్తరుడు బృహన్నలను సారథిగా చేసుకొని బయలుదేరాడు. చివరకు యుద్ధంలో బృహన్నల రూపంలో వున్న అర్జునుడే జయించాడు. పశువుల మందలను మరల్చాడు.
నగరానికి రాగా కంకుభట్టుగా వున్న ధర్మరాజు (సూర్య కళతో) విరాటునితో "మన గోవుల గాచిన వీరు డని బృహన్నలను పిలువవలె" నన్నాడు.
అప్పుడే వచ్చిన విరాటుని పట్టి (కొడుకు) "భూపాలా! అట అంటే యుద్ధంలో విజయుడు అంటే విజయం పొందిన వాడు లేదా అర్జునుడు ఇతడే సుమా! (నేను కాదు.)" అని నరుని (అర్జునుని) వైపు చూపించినాడు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
*"వినవె! పశువులం గాచిన వీరు డనుచుఁ*
*జీరవలె బృహన్నల.." ననెఁ జేరి కంకు*
*భట్టు రవి కళను విరాటుఁ.. పట్టి "యితడె*
*భూప! యట విజయుం" డని*
*చూపె నరుని..*
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
4.9.19
-----------------------------------------------------------
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసైరంధ్రి వలలుని తో---
రిప్లయితొలగించండితే॥గీ॥
వినుడు ! నా'పయి ట'క్కరి విధపు పనులు
మా'రవిక'పయి , కీచక మాటు విడిచి
నేనిక చవి'లం గా'యుచు నెక్కొనంగ
జేయ వాని'జీర'మనుచు జెప్పుచుంటి
*రాయబారిగా వచ్చిన కృష్ణునితో దుర్యోధనుని పరుష వాక్యాలుగాః-*
రిప్లయితొలగించండిఆలంగాచితి వీవు మారవిక నీవాబుద్ధినే గొల్లడా!
పాలన్ గ్రోలు నెపమ్ముతో పడతినే పాలార్చి నావందురే
స్త్రీలోలుండవు, చీ రహస్యమున నాసీమంతితో పారు నీ
వేలన్ మాపయి టక్కులాడనిట కై యేతెంతువో చెప్పుమా!
ఆలంగాచిన స్వామియర్జునునికిన్
రిప్లయితొలగించండిసారథ్యమున్బూని ఘో
రాలంబున్సలుపంగజీరనతడున్
రాగాత్ముడై దుఃఖిలన్
లీలంజింతలనెల్లబాప యట కే
ళీమాత్ర రూపాద్భుత
జ్వాలంజూపె ప్రశాంతి జేర వికలం
బైయున్న చిత్తమ్ముకున్
*కీచకుని దుష్కృతమెరగిన భీముడు తన కోపాన్ని అక్కడ వున్న తరువుపై చూపుచు పెకిలించ బోవగ ధర్మజుడు వారించుచూ చెప్పిన మాటలుగా నూహించిన పద్యం*
రిప్లయితొలగించండిబుధుడా కాలం గాదిది
యధికరణము చీరబోకు మనుజా వినుమా!
వదలర వికటమ్మగునిది
వధింప యటమట మగుగద వలదందునునే
ఆలంగాచెడు కృష్ణుం
రిప్లయితొలగించండిడాలలనయు చీర వేగ మపరిమితముగా
వేలుపయిటనొసగెను తా
చేలములామానినికట శీఘ్రముగానే
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂దత్తపది 🤷♀....................
*'లంగా - చీర - రవిక - పయట'*
పై పదాలను అన్యార్థంలో
భారతార్థంలో స్వేచ్ఛాఛందంలో
సందర్భము: వస్త్రాపహరణమున కృష్ణ మహిమను గాంచి ఆత్మ విశ్వాసం ఆకాశమంత పెరిగిన ద్రౌపది నిశ్చింతగా ధర్మరాజుతో.. ఇలా అంటున్నది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆర్తులం గాచు మాధవుం డండ నుండ
ధూర్తులా చీరగలవారు తొడరి నన్ను!..
చేర విక యశుభాల్ మన చెంతకు మరి..
విజిత కోప! యటమటమున్
విడువుము..సరి!
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
4.9.19
-----------------------------------------------------------
అటమట(ము)= దుఃఖము