కవిమిత్రులకు నమస్కృతులు. జ్వరం వస్తూ పోతూ ఉన్నది. నిన్న డాక్టర్ గారి దగ్గరకు వెళ్తే మరో 5 రోజులకు మందులు రాసారు. రక్త పరీక్ష అవసరమా అంటే రేపటి వరకు చూసి తగ్గకుంటే చేయిద్దాం అన్నారు. టెంపరేచర్ లేదు కాని నీరసంగా ఉన్నది. విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈరోజు కూడా మీ పూరణలను సమీక్షించే స్థితిలో లేను. మన్నించండి.
..............🌻శంకరాభరణం🌻............... ..................🤷🏻♂సమస్య 🤷♀.................... కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ
సందర్భము: పైపైవి... గుణాలు.. జీవుడు లోలోనిది...ఆత్మ.. దేవుడు కేవలం పైపై గుణాలనే పట్టించుకునే వారికి లోనున్న ఆత్మలో వెలుగొందే దేవుడు కనిపించడు. కనిపించా లంటే దృష్టి కోణం మార్చుకోవాలి. అంటే ఆత్మను దర్శించటం అలవరచుకోవాలి. ప్రపంచంలో పైకి కనిపించే దొకటి. లోపల వున్న దొకటి. లోపల వున్న పరబ్రహ్మమును తెలుసుకున్నప్పుడు మాత్రమే బయట వున్న అనేక వైరుధ్యాలతో చీకాకుగా కనిపించే ప్రపంచం కూడా పరబ్రహ్మముగా భాసించటం ఆరంభ మౌతుంది. అర్థమౌతుంది. కాని కేవలం బయటి ప్రపంచాన్నే చూస్తూపోతే గందరగోళం తప్పదు. ఇది రూఢి అయితేనే లోకమంతా దేవుడే అని, లోకు లందరూ దైవ స్వరూపులే అని ఎవడైనా నమ్మగలుగుతాడు. అప్పుడే.. విశ్వం విష్ణు ర్వషట్కారః.. అనేది అర్థ మౌతుంది. ప్రపంచపు టాకార మిట్టిది. యతిజీవులు.. అనగా యతులైన జీవులు. వారిలో ఇటువంటి ప్రపంచాన్ని ఎవడైతే చూస్తాడో నమ్ముతాడో అది చిత్రం ఎ ట్లవుతుంది? కా దని భావం. ~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఆరసి పైపయిన్ మెరయు నట్టి గుణాళి.. "ని దేమి ఛీ!ఛి!"యం చేరికినైనఁ దోచినను.. నీశ్వరు డెల్లపు డంతరాత్మలో జేరి వెలుంగు నంచు యతి జీవులలోన ప్రపంచకంబు టా కారముఁ జూచి దేవుఁ డని గట్టిగ నమ్మెను(మ్మిన) చిత్ర మెట్టులౌ
✍️~డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి 6.9.19 -----------------------------------------------------------
రిప్లయితొలగించండిప్రాతః కాలపు సరదా పూరణ:
చేరుచు భాజపా నతడు చెన్నుగ చూచుచు నేతనచ్చటన్
వీరుడు వీడెపో యనుచు వెంటనె వంగి నమస్కరించుచున్
కోరిక తీర భక్తుడట గొప్పగ దిద్దిన దాడితోడ నా
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ
రిప్లయితొలగించండిమారుము మామత మోయీ
చేరుము మా ప్రభువు నిపుడె సీతారామా
రారమ్మయనంగా మమ
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
జిలేబి
రిప్లయితొలగించండికోరికల తోడు ధ్యానము
పేరాశని నాపుకొనక బెట్టుగ చేయన్
హోరు నెగడి సాక్షాత్కా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
జిలేబి
ఘోర విపత్తు లు గలిగిన
రిప్లయితొలగించండితోరపు గా సాయ పడుచు దోహద మిడుచు న్
పేరిమి నందిం చెడు సహ
కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్
మైలవరపు వారి పూరణ
రిప్లయితొలగించండినేరిచి గోగణమ్ములననేకవిధమ్ములనాదరించు , స...
త్కారము జేయు పెద్దలకు, దానమొసంగును దీనకోటికిన్.,
శ్రీరఘురాము గొల్చునతనిన్ గని లోకము సాధుచిత్తసం...
స్కారముఁ జూచి దేవుఁడని గట్టిగ నమ్మెను చిత్ర మెట్టులౌ !?
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
మరొక పూరణ..
తొలగించండిమార్కండేయుడు...
సారగుణా ! హరా ! నిగమసారవనాంతరచార ! వాయుభు...
గ్ఘార.! ధరాధరేంద్రతనయాహృదయాంబుజభాస్కరా ! విషా...
హార ! యటంచు మ్రొక్క., శివుడల్లదె నిల్వగ ముందు, తచ్ఛుభా...
కారముఁ జూచి దేవుఁడని గట్టిగ నమ్మెను చిత్ర మెట్టులౌ ?
జోరుగ జయజయ పలుకుచు
రిప్లయితొలగించండిబోరలు నేలకును తాక పొరలుచును నమ
స్కారము లిడు భక్త ప్రా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్.
రిప్లయితొలగించండిజోరుగ కోరికల్ తనర జోతల ధ్యానము చేయ వచ్చె పో
హోరు పిశాచమొక్కటి మహోక్షపు రూపము తోడు దానియా
కారముఁ జూచి దేవుఁడని గట్టిగ నమ్మెను చిత్ర మెట్టులౌ
తీరని కాంక్షలే సుదతి తిప్పలు బెట్టుచు రూపుదాల్చుగా!
జిలేబి
ఏ రూపము లేని నిరా
రిప్లయితొలగించండికారుండని నమ్మికాదె కల్పము నందున్
భారూపమ్ముఁ వెదకి యోం
కారముఁ గని దేవుడనుచు గట్ఠిగ నమ్మన్
కోరిన విద్యలన్నియును గూరిమి మీరగ నేర్పుచుండి నా
రిప్లయితొలగించండివారసు డీతడంచు బహుభంగుల ప్రేమను జూపి జ్ఞాన సం
స్కారము లందజేయు హితకారి గురూత్తము డౌట నాశుభా
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ"
పోరును బెట్టు సొమ్ములని, బూదిని పంచును మందు లంచు, ప
రిప్లయితొలగించండిల్మారులు చేయు సంగములు, మౌనము నూను సమస్య లన్న, నీ
చోర గురుండు వంచకుడు, చుట్టును జేరిన భక్తకోటి ప్రా
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ?
రిప్లయితొలగించండిఅగ్ని మీళే ...
తీరుగ రాళ్ళను సైసై
గీరంగన్ వెల్గు గాంచి గీతము తోడై
పారిన సత్తువకు నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
జిలేబి
రిప్లయితొలగించండితీరము కానని నభమని,
తీరుగ వెల్గెడు చమకుల తిరముగ నివ్వన్
తారలకు, మ్రొక్కుచు నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
జిలేబి
రిప్లయితొలగించండిజోరుగ వీచెడు వాయువు
హోరనుచు చెవులను చేరి హొనరన్ భళి! తా
పారిన బిసాతుకు నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
జిలేబి
రిప్లయితొలగించండిఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
"I am only worried about economy"
దారిని పోవుచున్ గనుచు దండిగ సందడి జేయు వ్యానునున్
మీరిన కోర్కెతో జనుడు మిక్కిలి జోరున వెంబడించుచున్
చేరి తిహారు జైలునను చెన్నుగ పల్కెడి పాత మంత్రి ధి
క్కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ
https://www.google.co.in/amp/s/m.timesofindia.com/india/i-am-only-worried-about-economy-says-chidambaram-as-court-sends-him-to-jail-in-inx-media-case/amp_articleshow/70996181.cms
రిప్లయితొలగించండిపారంగనుధృతమై యిర,
ధారాపాతముగ నభము దారిని చూపన్
ప్రేరణ తో మనిషి నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
జిలేబి
రిప్లయితొలగించండికారువు డాతడి జాలము
పోరుల నేర్పె మనుజునికి! భువిని సదా జం
భారికి కృతజ్ఞత! నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
జిలేబి
రిప్లయితొలగించండిపోరడు పోరియు చేరగ
ప్రేరేపణయే పునాది రేతస్సదియే
మారన్ ప్రాణముగ నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
జిలేబి
రిప్లయితొలగించండివేరూనించెను భావపు
తీరుల పితరుడగుచు పని తీరుల నేర్పెన్
ప్రారూఢియటంచు నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
జిలేబి
రిప్లయితొలగించండినేరుగ బలపము బట్టుట
తీరిచి చదువులను నేర్ప తిరముగ భువిపై
ప్రేరణ గురువనుచు నమ
స్కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
జిలేబి
తీరుగ కలలో వచ్చెను
రిప్లయితొలగించండిమేరు సమానుండు చకిత మేఘావృతుడిం
పారగ చూడగనె శుభా
కారముఁగని దేవుఁడనుచు గట్టిగ నమ్మెన్
రిప్లయితొలగించండివేరుగ నిలిచెన్ వృక్షము
గా రవళింపంగ జేయ కన్నకొమరుడిన్
తీరుగ; దేవత! యా ఓం
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
జిలేబి
చేరడు కుజనుల సంగతి
రిప్లయితొలగించండిదూరడుయెగ్గొనుసలిపిన దుష్టులనైనన్
కూరిమి జనులా నిరహం
కారముఁగని దేవుడనుచు గట్టిగ నమ్మెన్
శ్రీ గురుభ్యోన్నమః🙏
రిప్లయితొలగించండికోరక ధనమిసుమంతయు
కోరిన చదువెల్ల జెప్పు గురులకు జేజేల్!
తీరా యజ్ఞేశ్, గురు నా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్.
రిప్లయితొలగించండిరారా యటంచు టీవీ
వారధి ప్రకటనల బిల్వ వడివడి వెడలెన్
భారీగెడ్డమ్ముల నా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
ఆ తర్వాత ? గోవిందా గోవిందా :)
జిలేబి
కూరిమి తలిదండ్రుల కిటు
రిప్లయితొలగించండిపేరిమి దోడై యెపుడును విడువక వారిన్
భారముగా దలపని మమ
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
అహం బ్రహ్మాస్మి
రిప్లయితొలగించండినారాయణుడే నేనౌ
వేరుగ దలపంగ వలదు; వేదమ్ములలో
సారమది తెలియగ, నహం
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
తొలగించండిసరదా గా అహం బ్రహ్మాస్మి విలేకరి :)
చేరంగ నెక్స్ప్రెసు నతడు
స్టోరీ లన్ పేపరుని చటుక్కుమను బటా
బూరము గా వేయగ నధి
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్ :)
జిలేబి
విభీషణుని నిందలతో విమర్శించే రావణునితో మండోదరి పలికిన పలుకులుగా భావన చేసి....
రిప్లయితొలగించండిఉత్పలమాల
నేరముఁ జేసి మీరు సుమ నేత్ర నయోనిజ సీతఁ దెచ్చినన్
శ్రీరఘు వీరునిన్ దెలియ సేమమటంచు విభీషణుండనన్
మారరె? నింద లేటికి? విమర్శల మానుడు రాము మోహ నా
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ?
కవిమిత్రులకు నమస్కృతులు. జ్వరం వస్తూ పోతూ ఉన్నది. నిన్న డాక్టర్ గారి దగ్గరకు వెళ్తే మరో 5 రోజులకు మందులు రాసారు. రక్త పరీక్ష అవసరమా అంటే రేపటి వరకు చూసి తగ్గకుంటే చేయిద్దాం అన్నారు. టెంపరేచర్ లేదు కాని నీరసంగా ఉన్నది. విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈరోజు కూడా మీ పూరణలను సమీక్షించే స్థితిలో లేను. మన్నించండి.
రిప్లయితొలగించండి🙏
తొలగించండిమంచిది. విశ్రాతి తీసికోండి...
ఈ రోజు జిలేబి గారు స్వైరవిహారంలో ఉన్నారు...
ఆర్య! త్వరగా కోలుకోగలరని ప్రార్థిస్తూ🙏🙏
తొలగించండి
తొలగించండి:)
వస్తే జ్వరం ఛూ మంత్రకాళి పోయి బిసాతు పుంజుకుంటుంది :) వచ్చేయండీ :)
జ్వరతీవ్రత పోవుటకు కందము కట్టుటయే సరియైన ఔషధము :) భలే మంచి చౌక బేరము :)
చంద్రయానానికి తయార్ :)
జిలేబి
ఆరాయుడుదా నొకపరి
రిప్లయితొలగించండియారామము జూడగోరి యాత్రుతతోడన్
దారినిబోవుచు వలయా
కారముగని దేవుడనుచు గట్టిగనమ్మెన్
కోరిన కోర్కెలు దీర్చెడి/
రిప్లయితొలగించండివారధి, పుట్టించువాడు పరమాత్ముడి నే/
మారక, ప్రకృతిని ప్రతి యా/
*కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్*//
కందం
రిప్లయితొలగించండిచీరుచు లేలెమ్మని తాఁ
దీరుచు గద్దెను తదుపరి దీర్చుచు 'నానా'
బోరున బాబా నిరహం
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
కందము:
రిప్లయితొలగించండిసారములెల్ల నరయగును
నీరజ పతి హరిని మదిని నిలిపిన జాలున్
నీరధి వసియించు నిరా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్"
ధారుణి రక్షింపఁగ ను
రిప్లయితొలగించండిన్నారా యెవరైన యని యన మహాపదలం
దోరము సేయం గృప నుప
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
భీరువు వోలె నర్జునుఁడు భీతిలి బంధులఁ జంప నోప నీ
నేరము సేయ లే ననుచు నిస్పృహ నుండఁగ నెమ్మిఁ జూపఁగా
భారత చూడు మంచు నట భాహు సహస్ర విరాట్ప్రభాంగ కా
కారముఁ జూచి దేవుఁడని గట్టిగ నమ్మెను చిత్ర మెట్టులౌ
చారెడు గింజల కోసము/
రిప్లయితొలగించండివారపు దినకూలి చేయు బాలుడు తన నిం/
పారుగ తినుమనెడి బలా/
త్కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్
..............🌻శంకరాభరణం🌻...............
రిప్లయితొలగించండి..................🤷🏻♂సమస్య 🤷♀....................
కారముఁ జూచి దేవుఁడని
గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ
సందర్భము:
పైపైవి... గుణాలు.. జీవుడు
లోలోనిది...ఆత్మ.. దేవుడు
కేవలం పైపై గుణాలనే పట్టించుకునే వారికి లోనున్న ఆత్మలో వెలుగొందే దేవుడు కనిపించడు. కనిపించా లంటే దృష్టి కోణం మార్చుకోవాలి. అంటే ఆత్మను దర్శించటం అలవరచుకోవాలి.
ప్రపంచంలో పైకి కనిపించే దొకటి. లోపల వున్న దొకటి. లోపల వున్న పరబ్రహ్మమును తెలుసుకున్నప్పుడు మాత్రమే బయట వున్న అనేక వైరుధ్యాలతో చీకాకుగా కనిపించే ప్రపంచం కూడా పరబ్రహ్మముగా భాసించటం ఆరంభ మౌతుంది. అర్థమౌతుంది.
కాని కేవలం బయటి ప్రపంచాన్నే చూస్తూపోతే గందరగోళం తప్పదు.
ఇది రూఢి అయితేనే లోకమంతా దేవుడే అని, లోకు లందరూ దైవ స్వరూపులే అని ఎవడైనా నమ్మగలుగుతాడు.
అప్పుడే.. విశ్వం విష్ణు ర్వషట్కారః.. అనేది అర్థ మౌతుంది.
ప్రపంచపు టాకార మిట్టిది. యతిజీవులు.. అనగా యతులైన జీవులు. వారిలో ఇటువంటి ప్రపంచాన్ని ఎవడైతే చూస్తాడో నమ్ముతాడో అది చిత్రం ఎ ట్లవుతుంది? కా దని భావం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఆరసి పైపయిన్ మెరయు
నట్టి గుణాళి.. "ని దేమి ఛీ!ఛి!"యం
చేరికినైనఁ దోచినను..
నీశ్వరు డెల్లపు డంతరాత్మలో
జేరి వెలుంగు నంచు యతి
జీవులలోన ప్రపంచకంబు టా
కారముఁ జూచి దేవుఁ డని
గట్టిగ నమ్మెను(మ్మిన) చిత్ర మెట్టులౌ
✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
6.9.19
-----------------------------------------------------------
రారమ్మని హితుని పిలచి
రిప్లయితొలగించండితీరమువెంబడి నడువగ తేల్చెనతండున్
చేరువ శిలపయిగల యా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
బారులు దీరినట్టి జన వాహిని యాతని తోడు నిల్చుచున్
రిప్లయితొలగించండిమేరు సమాన ధీరుడని మేలిమి నాయకుడంచు మెచ్చుచున్
తీరుగ భక్తి చిత్రముల దేవునికిన్ ప్రతిరూపమైన యా
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ
తపాలా డబ్బా ను చూసి ఆంజనేయినిగా భావించుట:
రిప్లయితొలగించండికం.
గారము పెరిగిన బిడ్డడు
దారిన కనుగొన తపాలు తామ్రపు పేటిన్
నేరుగ జని మ్రొక్కగ నా
కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్
వై. చంద్రశేఖర్
సారము పోయిన నాడున
రిప్లయితొలగించండినేరము లెంచక, మరిమరి నే నున్న నంచు
భారము నోడిన యా సహ
కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిదారినిబోవుచున్ సరళదైవమువోలెనునుండునట్టియా
కారముజూచిదేవుడనిగట్టిన నమ్మెనుచిత్రమెట్టులౌ
యేరకమైన భావనలునీశునీబట్లను గల్గునోదగన్
నారకమైన బోలికలెయచ్చువడంగనుగానిపించుగా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికూరిమి సడలిన నాడును
రిప్లయితొలగించండిపేరిమి విడి, పాకము లిక వేర్వేరు యనక
చేరువ చేకొన, యా మమ
కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్
కం. సారము లేనిపొలముగని
రిప్లయితొలగించండినైరాశ్యముచెందిరైతునమ్మిన ప్రభుతను
కోరగ వచ్చిన తగుసహ
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
దారిద్ర్య మనుభవించెడు
వారల క్షుద్బాధ దీర్చ ప్రతి దినమందున్
కూరిమితో నాతని యుప
కారముఁ గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
దారిద్ర్య మనుభవించెడు
వారల క్షుద్బాధ దీర్చ ప్రతిదిన మొకడున్
కూరిమితో నాతని యుప
కారముఁ గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్.
కందం
రిప్లయితొలగించండిచేరెడు బాబా విమలా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్
గోరి మహల్సా పతి తా
హారతులిడి యిటులఁ బిల్చె నావో! సాయీ!!
ధారుణి నెల్లవేళలను ధర్మము నిల్పగ నెంచుచు న్నిరా
రిప్లయితొలగించండికారుడు భూమిపైన పలు కాలము లందుజనించి నట్టి యా
కారణ జన్ముడాతనిని గానగ లేమని వానిరూప మోం
కారముఁ జూచి దేవుఁడని గట్టిన నమ్మెను చిత్ర మెట్టులౌ
ఏరూపమునను గానక
రిప్లయితొలగించండినారూఢిగనమ్మకుండె నరయక జెప్పెన్
సారము దెలియగను నిరా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్!
వీరావేశముతోడను
రిప్లయితొలగించండిక్రూరపు దృక్కులు పరచుచు కోరలపైనన్
ధారుణి నెత్తు వరాహా
కారము గని దేవుడనుచు గట్టిగ నమ్మెన్.
సమస్యాపూరణము
రిప్లయితొలగించండి*కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్*
లేరని దేవుడు, జెప్పగ
మారని యాతని మెదడుయె మర్మమెరుగకన్
నా రాతిరి కలనొక నా
కారముఁ గని దేవుఁ డనుచు గట్టిగ నమ్మెన్